25, జనవరి 2018, గురువారం

సమస్య - 2579 (అనుమా వినుమా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్" (ఛందోగోపనము)
(లేదా...)
"అనుమా వినుమా స్తవనీయ సత్కథల్" (ఛందోగోపనము)
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో గౌరీభట్ల బాలముకుంద శర్మ గారు ఇచ్చిన సమస్య)

173 కామెంట్‌లు:

  1. మాతను ప్రార్ధన జేయుచు
    ప్రీతిగ వినుమ స్తవనీయ సత్కధ లెల్లన్
    ఖ్యాతగు జీవన మందున
    నీతిని నెలకొన్న చాలు నెమ్మిని బ్రతుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో యతి తప్పింది. 'ఖ్యాతి+అగు' అన్నపుడు యడాగమం వస్తుంది. అక్కడ "ఖ్యాతియగు జీవనమ్మున" అనవచ్చు.

      తొలగించండి

  2. ఆవల గల డొక్కండట!
    తా విశ్వముగా వెలిగెను తరుణి జిలేబీ ,
    తావతనిది మన హృది! యో
    షా! విను వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. మైలవరపు వారి స్పందన చూసాక డౌట్ వస్తోంది :)


      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తావతనిది'...?
      మైలవరపు వారి స్పందన వల్ల మీకు వచ్చిన సందేహం?

      తొలగించండి
  3. కలిమిని బలిమిని యిచ్చుచు
    కలిబాధల దీర్చువాడు కమలాక్షుండే
    కలుగగ నపవర్గము తుది
    చెలియా! వినుమ స్తవనీయ సత్కథలెల్లన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివరి పాదముస
      జలజా! వినుమ గా చదవ ప్రార్ధన!

      తొలగించండి
    2. బహుశః స్త బరువు మ పై పడక లఘువని భావించి కందపద్య పూరణ! 🙏🙏🙏

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బలిమిని+ఇచ్చుచు = బలిమి నిచ్చుచు' అవుతుంది. యడాగమం రాదు. యతి దోషాన్ని మీరే సవరించారు.
      'వినుమ స్తవనీయ' అన్నపుడు 'మ' లఘువే.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా! సవరించిన పూరణ:
      కలిమిని బలిమిని గూర్చుచు
      కలిబాధల దీర్చువాడు కమలాక్షుండే
      కలుగగ నపవర్గము తుది
      జలజా! వినుమ స్తవనీయ సత్కథలెల్లన్!
      నమస్సులు!

      తొలగించండి
    5. సీతాదేవి గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. మాతను ప్రార్ధన జేయుచు
    చాతక వినుమ స్తవనీయ సత్కధ లెల్లన్
    ఖ్యాతగు జీవన మందున
    నీతిని నెలకొన్న చాలు నెమ్మిని బ్రతుకన్

    రిప్లయితొలగించండి
  5. "వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్"

    ఈ సమస్య పాదమునకు ముందు లఘువు చేర్చినచో:

    "xవినుమ స్తవనీయ సత్కథ లెల్లన్"

    కంద పాదమున గణ భంగము.

    గురువు చేర్చినచో:

    "Xవినుమ స్తవనీయ సత్కథ లెల్లన్"

    గణ భంగము.

    ఇవి రెండునూ ఆట వెలది, తేటగీతి కానేరవు.

    పాదం చివర లఘు గురువులకు చోటు లేదు.

    క్షంతవ్యుడను. చేత కావడం లేదు.

    పెద్దలు నాకు సహాయం చేయగలరు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      కందపద్య రచనలో దాదాపుగా డాక్టరేట్ చేసిన మీకు ఇటువంటి సందేహం కలగడం ఆశ్చర్యమే!
      అది కంద పాదమే. ఒక అక్షరం కాదు, గణమే తగ్గింది. చతుర్మాత్రాగణాలలో దేనినైనా వేసుకొనవచ్చు.
      శాస్త్రీ! వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్ ('వినుమ స్తవనీయ'లోని 'మ' లఘువే)
      శారద!వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్
      జరీన! వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్
      సరితా! వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్
      సరగున వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్

      తొలగించండి
    2. సార్!

      నా పిచ్చి డాక్టరేటు ఫిజిక్సులో!

      😂😂😂

      తొలగించండి
    3. నేను గణితమో ఫిజిక్సో అనుకొన్నానండి

      తొలగించండి
    4. సార్! మీ రెండు ఊహలూ సరియే!

      Theoretical Physics
      (Maths + Physics)

      తొలగించండి
  6. మైలవరపు వారి వృత్త పూరణ

    ప్రహ్లాదుడు...

    హరి యట మత్స్యమై యసురు నంతము జేసెను వేదరక్షకై !
    హరియట కూర్మమై నిలిచి యద్రిని మోసెను మూపురమ్ముపై !
    హరియె వరాహమై ధరణికార్తిని బాపెను ! తండ్రి ! వీడుమా
    హరిపయి వైరభావమనుమా ! వినుమా ! స్తవనీయ సత్కథల్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరిరాడ్వరదుని కరుణా...
      కరుని , హరిని దెలుపునట్టి కమనీయములౌ
      వర రక్షణ నిడు శుభకర
      చరితలు వినుమ స్తవనీయ సత్కథలెల్లన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి


    2. ఓ ఇలా కూడా చేయొచ్చన్న మాట !

      వినుమ స్తవనీయ లో "మ" గురువవు తుందన్న మాట ?

      జిలేబి

      తొలగించండి


    3. వామ్మో ! మైలవరపు వారు చంపక మాల చేసేరు ; నేనేమో ఉత్పల మాల !
      రెండు విధాల చేయొచ్చన్న మాట !

      ఇవ్వాళ కంది వారు మరీ తికమక మకతిక పెట్టే సమస్య యిచ్చారన్న మాట !

      హరి ఓం తత్సత్ !


      జిలేబి

      తొలగించండి
    4. చరితలు/ వినుమ/ స్తవనీ/య సత్క/థలెల్లన్ !

      సార్! ఇది కందమా? గణములు కుదురినవా?

      తొలగించండి
    5. మైలవరపు వారి స్పందన

      ఈ గణవిభాగం లో... తెలుగు పదం ప్రక్కన సంయుక్తాక్షరం వలన పూర్వాక్షరం గురవు కాదు. 🙏

      తొలగించండి
    6. మైలవరపు వారి రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. వారికి అభినందనలు.
      *****
      జిలేబీ గారూ,
      'వినుమ స్తవనీయ'లో 'మ' లఘువే.
      *****
      ప్రభాకర శాస్త్రి గారూ,
      చరితలు/ వినుమ స్త/వనీయ/ సత్కథ/ లెల్లన్ (గగ/నల/జ/భ/గగ)

      తొలగించండి
    7. కువలయనేత్రి జిలేబీ!
      చవటగ నీనాడు నేను చతికిల పడితిన్!
      కవివర శంకర వ్యాఖ్యల
      సవరణ వినుమ! స్తవనీయ సత్కథ లెల్లన్!

      తొలగించండి


    8. అస్త్రంబిదియెనయ! ఇషీ
      కాస్త్రంబుగ నెక్కిడగను కందంబగునౌ!
      శాస్త్రంబిది గణితమయా
      శాస్త్రీ వినుమ స్తవనీయ సత్కథలెల్లన్ :)

      జిలేబి

      తొలగించండి
    9. ఒకరోజు ముందే...

      *గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు*..

      దారుణ దాస్యమున్ దునుమ ధైర్యము జూపియు తెల్లవారిపై
      పోరును సల్పినట్టి మన పూర్వజులుండిరి యెందరెందరో !
      భారతదేశ వీరులగు వారలకున్ గణతంత్రవేళ జో..
      హారులటంచు భక్తిననుమా ! వినుమా ! స్తవనీయ సత్కథల్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    10. ప్రభాకర శాస్త్రి గారూ,
      చతికిల బడ్డ మళ్ళి విజృంభించారు కదా! ఆత్మాశ్రయమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      జిలేబీ గారూ,
      శాస్త్రి గారిని సంబోధించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      మైలవరపు వారి గణతంత్ర దినోత్సవ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. వారికి అభినందనలు.

      తొలగించండి
    11. జిలేబీ గారి పద్యముపై స్పందన

      👌👌👌

      ఆచార్య రాణి సదాశివ మూర్తి

      తొలగించండి


    12. ఆచార్యులవారికి నెనరులు !


      జిలేబి

      తొలగించండి
    13. అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ! జానకీ
      కువలయనేత్రి గబ్బిచనుగొండల నుండు ఘనంబ! మైథిలీ
      నవనవ యౌవనంబను వనంబునకున్ మదదంతి నీవె కాఁ
      దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ! కరుణాపయోనిధీ!

      తొలగించండి
    14. మీరు చూచిన దానిలో నిర్ద్వందముగ ముద్రణ దోషమే. నా దగ్గరున్న దాశరథీ శతకములో “కువలయ నేత్ర” యనియే యున్నది.

      తొలగించండి
    15. అవునా! నాది అంతర్జాల వ్యవహారములెండి... నమ్మదగ్గది కాదు.

      🙏🙏🙏

      తొలగించండి


    16. నేత్రియన "నది" యగునయా
      నేత్రమనగ కన్నులగును నీమము గానన్
      నేత్రయనుట సరియగునయ
      ఛాత్ర! ప్రభాకర! తెలుంగు చాల జిలేబీ :)

      జిలేబి

      తొలగించండి
    17. శ్రీ శనీశ్వర శతకం- 11

      - రచన : అక్కిరాజు సుందర రామకృష్ణ

      99.

      వివరణ గాదుగాని కడు ప్రేమను నాడదె కణ్వపుత్రి, ఆ
      కువలయ నేత్ర సుందరి శకుంతల సర్వ మొసంగ వాని కా
      సువిదితుడైన భూపునకు చోద్యమదెట్టు సమాప్తమాయెనో
      అవని నెరుంగవా మరి మహాశయ నీవును శ్రీ శనీశ్వరా!

      తొలగించండి
    18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    19. చిరు సవరణలకు మన్నించండి..సూచించిన
      అవధాని వరేణ్యులు శ్రీ నరాల రామారెడ్డి గారికి ధన్యవాదాలతో... 🙏

      ప్రహ్లాదుడు...

      హరి యట మత్స్యమై యసురు నంతము జేసెను వేదరక్షకై !
      హరియట కూర్మమై నిలిచి యద్రిని మోసెను పృష్ఠపీఠిపై !
      హరియె వరాహమై ధరణికార్తిని బాపెను ! తండ్రి ! వీడుమా
      హరిపయి వైరభావమనుమా ! వినుమా ! స్తవనీయ సత్కథల్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    20. నేతృ: నేతా, నేత్రీ, నేత్రమ్:
      నేత్రీ: నాయకురాలు, నది, లక్ష్మి అన్న అర్థములలో ఈ కారాంత పదము.
      నేత్రమ్ కన్ను. స్త్రీ లింగములో నేత్రా అవుతుంది.

      తొలగించండి


  7. చాల మహేంద్ర జాలమిల ! చాతురి తో మెలుగన్దగున్ సుమీ !
    కాలము గడ్డు కాలమిది ! కర్తృత యెల్ల నొనర్చు మమ్మ ! ఓ
    మాలిని! యన్వహమ్ము లనుమా వినుమా స్తవ నీయ సత్కథల్,
    మాలిక యై మదిన్నదియె మాన్యము గా నిను గాచు సర్వదా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. శుకమహర్షి పరీక్షిన్మహరాజుతో:
    కందం
    ఎంతలు వెన్నుని లీలలు
    సంతసమును గూర్చ నీకు సాధనమగుగా
    చింతలు నిను వీడ మన
    శ్శాంతికి వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్

    రిప్లయితొలగించండి


  9. తావు + అతనిది - తావతనిది ?


    ఆవల గల డొక్కండట!
    తా విశ్వముగా వెలిగెను తరుణి జిలేబీ ,
    స్థావరమతనిది హృది! యో
    షా! విను వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      'తావు+అతనిది'... ఇంత చిన్న విషయాన్ని నేను అవగాహన చేసుకోకపోవడం... విచిత్రం! నా తొందరపాటుకు మన్నించండి!
      సవరణించిన పూరణ కూడా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  10. ఒక భర్త తన భార్యతో కానీ, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కానీ ఇట్లు చెప్పుచున్నాడు.
    ****)()(****
    ముని యొకరుండే తెంచెను
    మన యూరికి ప్రవచనముల మణులంబంచన్
    మనము మురియ నతని దరికి
    చనియును "వినుమ ! స్తవనీయ సత్కథ లెల్లన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ లో ఏదో సవరణ సూచించినట్టున్నాను!

      తొలగించండి
    2. కందిశంకరయ్య గారు!ధన్యవాదాలు!మీ సూచన సముచితము.'మనము'అంటే మనస్సు (చిత్తము) కదా! కాదా?)

      తొలగించండి
    3. మీ 'మనము మురియ' పాఠమే బాగుంది. నేనే తొందర పడ్డాను. మన్నించండి.

      తొలగించండి
  11. చక్కని నీతులు తెలిపె డు
    మక్కువ తో ధర్మ పథ పు మానిత చరిత ల్
    చొక్కపు మహాను భావుల
    చక్కగ వినుమ స్తవనీ య స త్కథ లె ల్లన్

    రిప్లయితొలగించండి
  12. నేటి సమస్య ఆసక్తి కరమైన, సవాలుతో కూడిన సమస్య!రూపొందించిన వారికి అభినందనలు +ధన్యవాదాలు!
    {Really a challenging problem indeed !!!

    రిప్లయితొలగించండి
  13. భవ్య భారత సంస్కార భావములను
    తేట తెల్లమ్ముగా విశదీకరించు
    కథలు చెప్పెద సుత! చక్కగ “వినుమ స్తవ
    నీయ సత్కథ లెల్లన్” వినీత మతిని

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయకుమార్ గారూ,
      తేటగీతిలో పూరణ చెప్పిన మీ ప్రతిభ ప్రశంసనీయం. ఔత్సాహిక కవులకు మార్గదర్శాకం. అభినందనలు.

      తొలగించండి
  14. హనుమా!మరకతగాత్రా!
    ఘనమగు గగనాంగణమున ఖరకరు కరుణన్
    నగముల వ్యాకృతి నేర్చిన
    జననుత!వినుమ!స్తవనీయ!సత్కథలెల్లన్.

    రిప్లయితొలగించండి
  15. పటుతరరీతిసాగుచు విపత్తుల దాటగయత్నమందునన్
    జటిలసమస్యలన్నిటికి సాధన శ్రీహరినామ ధ్యానమై
    ఎటుల విముక్తినొందిరిలనీప్సిత తృష్ణల మోక్షగాములై
    కటువులదాటిరోతెలివిగన్ వినుమా స్తవనీయ సత్కధల్

    రిప్లయితొలగించండి
  16. నాలుగవ పాదం టైపాటు
    వినుమస్తవనీయ

    రిప్లయితొలగించండి
  17. ఛందోగోపనం అన్నప్పుడు ఒక సమస్య సరిపోతుంది కదా. నేను మొదటి దానినే చంపకమాలలో పూరించాను.పూరణ తొందరగా చేయాలన్న కుతూహలంలో చాలా విషయాలు గమనించడంలేదు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మొదటి సమస్య వృత్తపూరణకు సహకరించదు. రెండవ సమస్యతోనే వృత్తరచన సాధ్యం. మీరు మొదటి సమస్యతో పూరణ చెప్పానన్నారు. మరి 'ఎల్లన్' అన్నపదం తప్పిపోయింది. సవరించి మరో పూరణ పెట్టండి.

      తొలగించండి
  18. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    నారదుడు ధర్మరాజుతో :

    01)
    ____________________________

    బాధలు చుట్టుముట్ట పెను - పాముల వోలె నిరంతరమ్మదే,
    శోధన యేల నా కిటుల - చూపుము దారి యటంచుచున్, సదా,
    క్రోధము జెందకుండ, పలు - కోర్కెల దీర్చెడు దేవదేవుడౌ
    మాధవునే స్తుతించి, యను - మా వినుమా స్తవనీయ సత్కథల్
    ____________________________

    రిప్లయితొలగించండి
  19. గతజన్మలో నారదునికి విష్ణుమూర్తి బోధ:

    చంపకమాల
    నిరతము పుణ్యకార్యముల నేర్పున జేసెడు సజ్జనంబుతో
    తిరిగితి వంచు నాదు నిజ తేజము లీలగ జూపతిన్ సదా
    మఱువక నీదు భక్తి ననుమా! వినుమా! స్తవనీయ సత్కథల్
    స్వరనిథి కానుకౌ మహతి! బ్రహ్మ కుమారుని జన్మమిచ్చెదన్!

    రిప్లయితొలగించండి
  20. ఏ ధనమెందుకు చూడగ
    ఈ ధరపై సంతసముకు యింధన మదియే!
    బోధలఁ, శాంతిని చేయగ
    సాధన "వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్!!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సంతసమున కింధన మదియే" అనండి.

      తొలగించండి

  21. కం.

    భక్తిరసకథసమూహము

    రక్తిని కట్టించె పోతరాజు రచననా

    శక్తిగ, భాగవతమునా

    సక్తిగ వినుము స్తవనీయ సత్కథలెల్లన్

    రిప్లయితొలగించండి

  22. పారాయణమ్ము జేయగ

    గౌరీపతి ఘన మహిమలు కైవల్యమిడు

    న్నారాధించుచు మరి మన

    సారగ వినుమ! స్తవనీయ సత్కథ లెల్లన్!


    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  23. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2579
    సమస్య :: *....... అనుమా వినుమా స్తవనీయ సత్కథల్.*
    *ఛందో గోపనము* అనే పద్ధతిలో పాదంలోని కొన్ని అక్షరాలను దాచియుంచి పై సమస్య ఇవ్వబడింది.
    దాచిన అక్షరాలను ఊహించుకొని కలుపుకొని సమస్యాపూరణ చేయడం ఇందులోని విశేషం.
    సందర్భం :: శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు భాగవతాన్ని చెబుతూ , క్రమంగా ధ్రువోపాఖ్యానము, ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షణము, వామన చరిత్ర, అంబరీషోపాఖ్యానము, రంతిదేవుని చరిత్రము, శ్రీకృష్ణ లీలలు, కుచేలోపాఖ్యానము మొదలైన కథలను విశదీకరించారు. ఓ శిష్యుడా ! నీవు ఒక మహాత్ముని ఆశ్రయించి , శుక యోగివలె భక్తుని కథలను భగవంతుని కథలను చెప్పవయ్యా అని వేడుకొంటూ , ఆ సత్కథలను విని , తరించు అని గురువు శిష్యునికి ఉపదేశం చేసే సందర్భం.

    కాదనకుండ నా ధ్రువుని గాథ , గజేంద్రుని గాథ , భక్త ప్ర
    హ్లాదుని గాథ , వామనుని రమ్య చరిత్రము , నంబరీషు గా
    థాదుల , రంతిదేవు చరితమ్ము , కుచేలుని గాథ , కృష్ణ లీ
    లాదుల జెప్పె , నా శుక మహర్షి యె భాగవతమ్ము నందు నా
    *మాదిరి జెప్పు మంచు ,ననుమా వినుమా స్తవనీయ సత్కథల్.*
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (25.01.2018)

    రిప్లయితొలగించండి
  24. పంచ చామరమనే ఛందస్సు ఉన్నదా? వివరములు తెలుపగలరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. ఉందండి


      శ్యామలీయం వారి యీ టపా చూడుడు


      http://syamaliyam.blogspot.com/2015/12/blog-post_19.html

      తొలగించండి
    2. 16వ ఛందమైన అష్టిలో 21846వ వృత్తం 'పంచచామరము'
      దీని గణాలు జ-ర-జ-ర-జ-గ. లేదా 8 లగ(IU)ములు.
      10వ అక్షరం యతి చెల్లుతుంది. ప్రాసనియమం ఉన్నది.

      తొలగించండి


    3. మలాయి కుల్ఫియే గదా దమాకు మేలు జేర్చురా
      సలాము చేయుమయ్యరో మసాల దోశ కున్ భళా
      విలాసమైన జీవితమ్ము వేగమై వెలుంగగన్,
      జిలేబులే గదా సదా భుజింప మేలు మేలగున్ !


      జిలేబి

      తొలగించండి

    4. I think some thing like below garikapati did in some avadhana :)


      బిరాన నోట్లు రద్దు సేసి భీతి గొల్పె మోడియే


      జిలేబి

      తొలగించండి
    5. ధన్యవాదాలు. మంచి రెఫరెన్సు ఇచ్చారు...

      తొలగించండి

  25. కం.

    భక్తిరసకథసమూహము

    రక్తిని కట్టించె పోతరాజు రచననా

    శక్తిగ, భాగవతమునా

    సక్తిగ వినుమ! స్తవనీయ సత్కథలెల్లన్

    రిప్లయితొలగించండి
  26. కర మగు భక్తి తత్పర త కారక మౌసుర వంద్యుడైనశ్రీ
    కరుని మహ త్వలీల లను కమ్మగ చెప్పు చు నుండ ప్రీతి తో
    సరగున వెళ్ళి శ్రద్ద యు త సంభ్రమ చిత్త త తోడ భక్తి తో
    మరులు గ దేవ దేవ య ను మా విను మా స్తవనీ య స త్కథ ల్ ॥

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శ్రద్ధాయుత' అనడం సాధువు. అక్కడను "శ్రద్ధగను..." అనండి.

      తొలగించండి
  27. పటుతరరీతిసాగుచు విపత్తుల దాటగయత్నమందునన్
    జటిలసమస్యలన్నిటికి సాధన శ్రీహరినామ ధ్యానమై
    ఎటుల విముక్తినొందిరిలనీప్సిత తృష్ణల మోక్షగాములై
    కటువులదాటిరోతెలివిగన్ వినుమా స్తవనీయ సత్కధల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      రెండు సమస్యలలో దేనికీ ఇది పూరణ కాదు. సవరించండి.

      తొలగించండి
  28. మురిపెము గల్గ జేయుచును మోక్షము నిచ్చును రామనామమే
    వరముల గుప్పు చుండు గద వందన మొక్కటి జేసినంతనే
    పరిపరి చింతయేల తన పాదము దాకిన జన్మ ధన్యమౌ
    మరి మరి ' రామ రామ ' యనుమా వినుమా స్తవనీయ సత్కథల్"

    రిప్లయితొలగించండి
  29. వితరణ చేయుచు పేదకు
    మతిలోననయము తలచుచు మారరిపుఁ గడున్
    ధృతితో, బడయగ మోక్షము
    సతతము వినుమ స్తవనీయ సత్కథలెల్లన్

    రిప్లయితొలగించండి
  30. మితముగ మాటలు బలుకుచు
    రతనము బోలెడి నడతల రమణీయముగా
    పతనము చెందక నడువుము
    సతతము వినుమ! స్తవనీయ సత్కథ లెల్లన్.

    రిప్లయితొలగించండి
  31. అతుల బృహత్కథలవి భా
    రత దేశమునన్ గలవుని రంతరమవి భా
    రత భాగవతములందున ;
    సతతము వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    పూరణ జేయగ నేరడు
    ధారణ లేని కవియె; యవధానిగ నెగడున్
    సారము గల కవిత సలిపి
    వేరొక పృచ్ఛకుని ప్రశ్న విను వాడొకడే!

    రిప్లయితొలగించండి
  32. ఈధరపై జనించె హరి యింపును గూర్చగ మానవలికిన్
    క్రోధము కామమున్ విడిచి, కూర్మిని జూపుచు పేదవారిపై ,
    గోధనమున్ భజించుచును, కూరగ మోక్షము పద్మనాభునిన్
    మాధవు గూర్చి నిత్యమనుమా వినుమా స్తవనీయ సత్కథల్

    రిప్లయితొలగించండి
  33. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    శ్రీ రఘురాముడాతడు వశీకరుడాశ్రిత పారిజాతమా
    శ్రీరమ సీత భర్త దనుజేంద్రుల జంపిన వీర మూర్తియై
    ధారుణి యందునన్ తనదు ధర్మము సత్యము పెంపు జేసెనో
    మారుతి!రామ నామ మనుమా వినుమా స్తవనీయ సత్కథల్

    రిప్లయితొలగించండి
  34. అనుదినము నిన్ను గూర్చియు
    వినసొంపుగజదువుచుందువీనుల విందౌ
    యినకులనాధునిలెంకా
    సదయను!వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్"

    రిప్లయితొలగించండి
  35. కనుమా పూర్వపు వారల
    జనహితమగు నితిహాసపు చాతుర్యములన్
    నెనరుగనొప్పుచు వ్రాసెద
    ననుమా వినుమా స్తవనీయ సత్కథల్.*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. (మూడవ గణంగా భగణం వేశారు). సవరించండి.

      తొలగించండి
  36. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,,


    { లవ కుశులు అయోధ్యలో రామాయణ కథా గానము చేయుట. }


    సారవిహీన భావ భవసాగర మందున మున్గ నేటికిన్ ?

    స్ఫార దనిష్టచింతనల బ్రల్లదనమ్మున బ్రేల నేటికిన్ ?

    ఘోర ‌నిపాతకమ్ము లొనగూర్చగ నేటికి ? నో యయోధ్యపుం

    బౌర వరేణ్యులార ! యఘమర్షణ మైనటువంటి , పావనం

    బౌ , రఘురామ నామ మనుమా - వినుమా స్తవనీయ సత్కథల్ ! !


    { స్ఫారత్ + అనిష్ట చింతనలు = అత్యధిక పాప చింతనలు ;

    నిపాతకము = పాపము ; అఘమర్షణము = పాప పరిహార మంత్రము }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  37. విదిత జన గణ యుతము భగ
    వదుక్త గీత ప్రభృతులు భాగవ తాదుల్
    సదమల మతి సద్భక్తినిఁ
    జదువుమ వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్


    కనివిని నేర నట్టుల జగద్గురు విచ్చెను విశ్వ మందునన్
    జనగణ వర్తనోచిత విచార వితానము దేవ గీతముం
    గనదరమే భువిన్ జన నికాయ మనంబుల నన్య మింక మా
    కనయము పూజనీయ మనుమా వినుమా స్తవనీయ సత్కథల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు మనోహరంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  38. కం:-
    కాంతా కాంతుల వశమై
    స్వాంతమ్మున షడ్రిపువులు శాఖలువాఱన్
    శాంతమలరు తత్త్వంబులు
    సాంతము వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్ !!!

    @ మీ పాండురంగడు*
    ౨౫/౦౧/౨౦౧౮

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాండురంగా రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "షడ్రిపు లవి శాఖలు..." అనండి.

      తొలగించండి
    2. 🙏🙏🙏
      కం:-
      కాంతా కాంతుల వశమై
      స్వాంతమ్మున షడ్రిపు లవి శాఖలువాఱన్
      శాంతమలరు తత్త్వంబులు
      సాంతము వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్ !!!

      @ మీ పాండురంగడు*
      ౨౫/౦౧/౨౦౧౮

      తొలగించండి
  39. నర జన్మము దుర్లభమగు
    చరితార్ధముఁజేయవలయు సద్గుణమణిగా!
    మరి వేడుము శ్రీహరి వర
    శరణము!వినుమ స్తవనీయ సత్కథలెల్లన్

    రిప్లయితొలగించండి
  40. దివిఁజేరగ యోనరుడా
    యవనిని నీవు సతతమ్ము "ననుమా వినుమా
    స్తవనీయ సత్కథల్"  పా
    రవశ్యముగ - ముక్తికలుగు రయమున నీకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      అద్భుతం! వృత్తంగా పూరించవలసిన దానిని కందంలో అందంగా ఇమిడ్చారు. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  41. సాధనజేయుచున్ సతతసంతసమందగ జీవితమ్మునన్
    వేదనతీరగా విమల విందును గూర్చెడి రామనామమున్
    మోదమునాలపించుచు సముద్దత దీప్తినిబొందెనెందరో
    మాధురులుల్లసిల్ల అనుమావినుమా స్తవనీయసత్కధల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      ఇప్పుడు మీ పూరణ అన్నివిధాల చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  42. రవీందర్ గారూ,
    బహుకాల దర్శనం... సంతోషం!
    అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  43. తెలియక శంకరాభరణ తెల్గు సమస్యల మున్గితేలితిన్
    పలికితి కందపద్యములు వందలు వందలు వ్రాసి పిచ్చిగన్
    అలిగితి కంది శంకరులు హాయిగ నవ్వగ తప్పు జూపుచున్...
    మలిచిరి ముద్దు జేసిరనుమా!వినుమా స్తవనీయ సత్కథల్!

    సార్! దీనికెన్ని మార్కులు వేసెదరు... 🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      స్వాశ్రయమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పిచ్చిగా। నలిగితి..." అనండి. 'మలిచిరి'...?
      ఇక మార్కులంటారా? 7/10.

      తొలగించండి


    2. ఆరున్నొక్క సరాగపు
      పూరణలకు భళిర యేడు పొందిరి శాస్త్రీ :)


      జిలేబి

      తొలగించండి


    3. జీపీయెస్ వారికి పంచచామరం :)


      పదమ్ము లెల్ల గూర్చ గాను పద్య మయ్యె మేలుగా


      జిలేబి

      తొలగించండి
    4. తెలియక శంకరాభరణ దివ్య సమస్యల;
      తిం / బలికితిఁ గంద పద్యములు;
      గా/నలిగితిఁ గంది;
      నవ్వఁగఁ దప్పుఁ జూపుచున్ (దప్పు సూపుచున్);
      మలచిరి
      అనిన 10/10 వేయు వారనుకుంటాను.

      తొలగించండి
    5. మీ పద్యము చదువ నానంద లహరులలో తేలు చున్న ట్లనిపించింది.

      తొలగించండి

    6. అయ్యా ! కామేశ్వర రావు గారూ:

      నేనీ శంకరాభరణంలో తెలియక జేరిన క్రొత్తలలో శ్రీమాన్ శంకరయ్య గారు మూడు వారాలు లీవు తీసుకొనియుండిరి. ఆ రోజులలో మీరు మా అందరి పూరణలూ సమీక్షించితిరి. అప్పటి మీ తరిఫీదులో ఎన్నో విషయములు తెలుసుకొంటిని. మీకు నేనెంతయో ఋణపడి ఉన్నాను. ఇక చేతకాదు క్రొత్త విషయములు నేర్చుట.

      శతాధిక వందనములు.

      మైలవరపు వారు నాలాగే మార్కులు క్రుమ్మరిస్తుంటారు:

      *************

      "100/100

      త్వరలో.. పలికితి వృత్తపద్యములు వందలు వందలు వ్రాసి... అని అనాలని కోరుతూ... 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ"



      తొలగించండి


    7. తెలియక చేరితిన్ కొలువు తేగడ గాంచితి నేర్వ గానిటన్
      మలిచిరి కంది వర్యులయ మాన్యపు కందము లెల్ల గూర్చగన్
      పలికెద వృత్త పద్యముల పల్కుల తేనియలూరగానిటన్
      వలచెద కావ్య కన్నియను వాక్కున మాధురి జాలువారగన్ !


      జీపీయెస్ వారికి
      జిలేబి

      తొలగించండి
    8. శంకరాభరణం వ్హాట్సప్ సమూహ కబుర్లు:

      *******************

      కువలయనేత్రి జిలేబీ!
      చవటగ నీనాడు నేను చతికిల పడితిన్!
      కవివర శంకర వ్యాఖ్యల
      సవరణ వినుమ! స్తవనీయ సత్కథ లెల్లన్!

      ********************

      ఇలా కూడా రాయొచ్చా
      😄👏👏🙏

      ..రుక్మిణి

      *********************
      gps ఉవాచ:

      🙏🙏🙏

      జిలేబీ గారు సహృదయులు... గొప్ప కవయిత్రి...

      https://www.blogger.com/profile/08044281042024597349

      తొలగించండి


    9. గొప్ప కవయిత్రహొ జిలే
      బప్ప వినుమ రుక్మిణి! మన బాపతు వారున్
      చెప్పరు యేమి సహృదయులు
      మబ్బుల మాటున నివాస మమ్మ నెలతుకై :)

      జిలేబి

      తొలగించండి
    10. జిలేబిగారి మహత్వ పటుత్వ కవిత్వ సంపదలకు జేజేలు!! 👌👌👌🙏🙏🙏

      తొలగించండి
    11. పదమ్ము లెల్ల గూర్చ గాను పద్య మయ్యె మేలుగా
      మదమ్ము లెల్ల గూర్చ గాను మద్యమయ్యె మేలుగా
      ముదమ్ము లెల్ల గూర్చగాను ముప్పులయ్యె మేలుగా
      కదమ్ము లెల్ల గూర్చగాను కయ్యెమయ్యె మేలుగా


      కదము = అశ్వగతివిశేషము

      తొలగించండి
  44. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అనువగు రీతిని మనికిని
    పొనరారగ జేయనెంచి భూరివి లీల
    ల్ననుపండితు దరి జేరుచు
    చనువుగ వినుమ! స్తవనీయ సత్కథ లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భూరివి లీలల్నను' ఇక్కడ అర్థం కాలేదు.

      తొలగించండి
  45. ముదమును నింపును|మూర్ఖత
    వదలించెడి శక్తి,యుక్తిభాగవతంబే
    మదిలో జేర్చును|భక్తిగ
    జదివిన?వినుమ.స్తవనీయ సత్కథలెల్లన్|
    2.మనుగడ యందుమంచియనుమా,వినుమా, స్తవనీయసత్కత్కథల్
    ధనమున కూడియుండు తగు దర్పము|నమ్మిన శాంతియన్నదే
    తనకడ నుండదెప్పుడును తత్వమెరింగియు జీవ నంబునన్
    గనబడ?మానవత్వమగు|కాంక్షలు దీరునుసౌఖ్య మబ్బులే|


    రిప్లయితొలగించండి

  46. 1.వింతగు కృష్ణుని చరితము
    శాంతిగ వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్
    చింతలు తొలగును మనసుకు
    శాంతియు దొరకు ననుమాట సత్యము సుమ్మీ.
    2.నరపతికి దెల్ప శుకుడట
    సురాధిపు చరితము భువిని సొంపగు రీతిన్
    మురమర్ధనుఘన చరితము
    సరిగా వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్.
    3.కరిరాజుమొర లిడగా
    హరియునుకావగ జవమున నాత్రుత తోడన్
    సిరికిని చెప్పక వచ్చెను
    సరిగా వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్
    4.అనయము దెలిపెద నిచ్చో
    ఘనుడగు శౌరిచరిత్రము కమనీయముగా
    తనయా యల్లరి చేయక
    సరిగా వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్
    5.ఇష్టసఖియు దెల్పమదికి
    యిష్టము లేకున్నను చనె నిలలో ద్విజుడున్
    యిష్టముతో దెలిపెద నిట
    నిష్టముతో వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్.
    6.ఇనజుని కావగ రాముడు
    దునుమగ వాలిని ,గనియెను దురమున త్రేతన్
    జనకజను వెదుక సాగెను
    హనుమయు వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్
    7.నరకుని చంపుట కొరకై
    తరుణీమణి సత్యయు చనె తనపతి తోడన్
    పరవశమగునుమనమునకు
    సరిగా వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్
    8.తరుణీమణినట దుష్టుడు
    కరములతో జుట్టుపట్టి గరువముతోడన్
    దురుసుగ యవమానించిన
    సరణిని వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ ఎనిమిది పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మూడవ పూరణ మొదటి పాదంలో గణదోషం. "కరిరాజు మొరను పెట్టగ" ఆనండి.
      ఐదవ పూరణలో "మదికి। నిష్టము..." అనండి. 'ద్విజుడున్+ఇష్టము' అన్నపుడు యడాగమం రాదు. "ద్విజుడు। న్నిష్టము" అనండి.

      తొలగించండి
  47. శంకరాభరణం::25/01/18 ..గురువారం
    సమస్య::వినుమ స్తవనీయ సత్కథ లెల్లన్
    ********** కం.
    ముక్తి నొసగు లక్ష్మీపతి

    భక్తిగ హరికథలు జేయ పారాయణమున్

    భక్తినిలిపి మనమున నా

    సక్తిగ వినుమ స్తవనీయ సత్కథ లెల్లన


    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి

  48. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అనువగు రీతిని మనికిని
    పొనరారగ జేయనెంచి భూరివి లీలల్
    వినిపించు విదుని జేరుచు
    చనువుగ వినుమ! స్తవనీయ సత్కథ లెల్లన్

    రిప్లయితొలగించండి
  49. అనుపమమైనరీతి వినయమ్ముగ ధర్మజుడాక్రమమ్మునన్
    మునులనడుంగ వారలును మోదమునొందుచు బల్కిరీవిధిన్
    వినుము నృపాలయోధులు వివేకము తోడ చరింపగావలెన్
    మనమున నాచరింతు ననుమా వినుమా స్తవనీయ సత్కథల్

    రిప్లయితొలగించండి
  50. అరయగ నాదికావ్యము సదార్షపథమ్మున కాశ్రయమ్ముగా
    తరగని ధర్మసూక్ష్మముల తత్వవిచారణ భారతమ్ముగా
    నెరుకను నాత్మసంభవుని నిర్మలగాథలు ముక్తిబొందగన్
    మరువక నార్యవాక్కులనుమా వినుమా స్తవనీయగాథలన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! చాలారోజులకు చిన్న ప్రశంస లభించింది! సంతోషము!
      నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  51. అమరిన దోషమెల్ల పరిహారమొనర్చెడి నామమెద్ది దు
    ష్టములగు కార్య భార భవ సంచిత పాప విముక్తి యెద్ది వే
    దములును సర్వ దేవ సముదాయము బల్కెడి నామమెద్ది ర
    మ్యమునగు రామనామ మనుమా వినుమా స్తవనీయ సత్కథల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  52. బోధన జేసెనచ్చటను పోరును జేయగ మానసమ్మునన్
    శోధన జేసిరెందరని జూడుము గీతను ప్రేరణమ్ముగా
    సాధన జేయగన్ తుదకు శాంతిని పొందగ మూలమ య్యె! హే
    మాధవ నీరజాక్ష "యనుమా వినుమా స్తవనీయ సత్కథల్"

    రిప్లయితొలగించండి

  53. ..........సమస్య
    అనుమా! వినుమా! స్తవనీయ సత్కథల్
    ~~~~~~~~
    సందర్భం: "భాగవతం", "భాగవతం" అంటూ వుంటే క్రమంగా "బా గవుతాం" అని మా గురువుగారు మాన్య శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు చెబుతూవుండే వారు.
    వా రనేక ప్రవచనాలు భాగవతంమీద చేసేవారు. మేము వినే వాళ్ళం. (వారు మాస్టర్ సివివి యోగ మార్గాన్ని విస్తరింప చేశారు.)
    అటువంటి పవిత్రమైన విష్ణు కథలను చెప్పు మనండి. వినండి అంటూ ఒక గురువుగారు శిష్యులతో అంటున్నారు.
    ~~~~~~~
    "భాగవత" మ్మటంచు మరి
    "భాగవత" మ్మని పల్కుచుండగా
    "బాగవుతాము లెమ్ము క్రమ
    పద్ధతి" నంచును "నెక్కిరాల వా"
    రాగమ వేది భాగవత
    మప్పుడు నప్పుడు చెప్ప వింటిమే!
    ఆ గది గాథ చెప్పు మను
    మా!వినుమా!స్తవనీయ సత్కథల్..

    ~ డా.వెలుదండ సత్యనారాయణ
    గది= గదాధరుడు..విష్ణువు

    రిప్లయితొలగించండి

  54. .......సమస్య
    అనుమా! వినుమా! స్తవనీయ సత్కథల్
    ~~~~~~~
    సందర్భం: పురారి గిరి సంభూతా
    శ్రీ రామార్ణవ సంగతా
    అధ్యాత్మ రామ గంగేయం
    పునాతి భువన త్రయమ్
    అని అధ్యాత్మ రామాయణం. పరమేశ్వరు డనే హిమ గిరినుండి అధ్యాత్మ రామాయణ మనే గంగానది జనించి ప్రవహిస్తున్నది. మూడు లోకాలనూ పవిత్రీకరిస్తూ రామచంద్రు డనే సముద్రంలో సంగమిస్తున్నది అని భావం.
    వేదవ్యాసుడు విరచించిన బ్రహ్మాండ పురాణంలో "అధ్యాత్మ రామాయణ" మున్నది. రాముడు నరమాత్రు డని కాకుండా పరబ్రహ్మ తత్వానికి ప్రతీకగా యిందు నిరూపించ బడింది. పరమేశ్వరుడు పార్వతికి రామగాథను చెబుతాడు.
    అధ్యాత్మ రామాయణ కీర్తనలు మన ముందు తరంవరకు ప్రసిద్ధములే! పెళ్ళిళ్ళలో పేరంటాలలో పాడుతూ వుండేవాళ్ళు.
    వినవే! గౌరి!సుకుమారి! గిరివర కుమారి!.. అని కొన్ని మొదలౌతూ వుండేవి.
    ~~~~~~
    ఆ నగ రాజు శూలి యగు,
    నా సుర గంగయె వ్యాస కావ్యమౌ,
    పూని , త్రిలోకముల్ పరమ
    పూజ్యములౌ నది పారుచుండ, పా
    థోనిధి రామ చంద్రు డగు-
    దూకుచు నా నది సంగమించెడిన్;
    గానము చేసి రామ కథ
    గాంగధరుం, డపు డిట్లు తా ననెన్--
    "మానిని! గౌరి! చెప్పు మను
    మా! వినుమా!స్తవనీయ సత్ కథల్"

    ~ డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి

  55. .........సమస్య
    అనుమా! వినుమా! స్తవనీయ సత్కథల్
    ~~~~~~
    సందర్భం: ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించి లంకాపట్టణం చేరుకున్నాడు. అశోక వనంలోని సీతను దర్శించాడు. చెట్టుమీదనుండియే రామ చరితను గానం చేశాడు.
    దిగివచ్చి యీ విధంగా అంటున్నాడు..
    ~~~~~
    చింతిలబోకు తల్లి! మది..
    చెంతకు వచ్చును రామచంద్రు డా
    వంతయు శంక బూనకుమ!
    ఆ ప్రభు వాతని, రావణాధమున్
    పంతము మీర యుద్ధమున
    ప్రాణము దీయుట తప్ప దమ్మ! హ
    న్మంతుని నమ్మి యుందు నను
    మా! వినుమా!స్తవనీయ సత్ కథల్

    ~ డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి

  56. .........సమస్య
    అనుమా! వినుమా! స్తవనీయ సత్కథల్
    ~~~~
    సందర్భం: శ్రీ కోట రాజశేఖర్ గారు పేర్కొన్నవి గాక భాగవతంలోని మరికొన్ని కథలు ఇక్కడ పేర్కొనబడినవి. వారి పద్యానికి ఇది పొడగింపే గాని పూరణం కాదు.
    ఎందుకంటే ఇంకా ఎన్నో కథలు భాగవ తంలో వున్నాయి.మొత్తంమీద ఈ రెండు పద్యాలూ దగ్గ రుంచుకుంటే భాగవతంలోని కొన్ని ప్రధాన కథలనైనా గుర్తుంచుకోవచ్చు.
    ~~~~~
    మోదము మీర కూర్మ కథ,
    మోహిని గాథ, వరాహ గాథ, యా
    మీదను దక్ష యజ్ఞ కథ,
    మీనము గాథయు, రామ గాథయున్..
    కాదనబోక నారదుని
    గాథయు, భీష్ముని గాథ, దత్త లీ
    లాదుల జెప్పె నా శుకుడు
    హాయిగ భాగవతమ్మునందు నా
    మాదిరి మమ్ము చెప్పు మను
    మా! వినుమా!స్తవనీయ సత్ కథల్

    ~ డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి

  57. ......సమస్య
    వినుమ! స్తవనీయ సత్కథ లెల్లన్
    ~~~~~
    సందర్భం: భాగవతంలోని మరికొన్ని కథలను మహారాజా విను మని పరీక్షిన్నరేంద్రునకు శుకమహర్షి చెబుతూ వున్నాడు.

    హాయిగ పృథుకథ, నర నా
    రాయణ కథయును, సనంద
    నాదుల కథయున్,
    పాయక కపిలుని కథ రా
    జా! యిక వినుము!స్తవనీయ
    సత్ కథ లెల్లన్

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి