20, జనవరి 2018, శనివారం

దత్తపది - 132 (కన్ను-చెన్ను-పన్ను-దన్ను)

కన్ను - చెన్ను - పన్ను - దన్ను
పై పదాలను ఉపయోగిస్తూ
హనుమంతుని వర్ణిస్తూ / స్తుతిస్తూ
నచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో గిరిజారమణ శర్మ గారు ఇచ్చిన దత్తపది)

118 కామెంట్‌లు:

  1. "తత్ర తత్ర కృత మస్తకాంజలిం"

    కన్నుల నీరును నింపుచు
    పన్నుగ రాముని స్తుతింప పరవశముంగన్
    నన్నిక ప్రోవుము చెన్నుగ
    దన్నుగ నాచెంత నిలిచి దయతో హనుమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి సవరణ:

      "తత్ర తత్ర కృత మస్తకాంజలిం"

      కన్నుల నీరును నింపుచు
      పన్నుగ రాముని స్తుతించు వాయుకుమారా !
      నన్నిక బ్రోవుము చెన్నుగ
      దన్నుగ నాచెంత నిలిచి దయతో హనుమా!

      చెన్ను = అందము
      దన్ను = ఆసరా

      🙏🙏🙏

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. మున్నుగ మీదగు పూరణ
    చెన్నుగ కనువిం దుచేసె చెలువము తోడన్

    రిప్లయితొలగించండి
  3. (హనుమంతుడితో ఇంద్రజిత్తు)
    కన్నులు మూసికొంచు నెటు కాలిని బెట్టితివోరి లంకలో?
    చెన్నులు మాసిపోవగను చింతలబాటయె నీకు దధ్యమౌ;
    పన్నుగ వానరాధముడ!ప్రాణముదీసెద గాచుకొమ్మురా!
    దన్నులు,దోకకాల్పులును దప్పవు నీకిక పాదమంటరా!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కన్నుపండుగ చేసెడి కరుణమూర్తి!
      వెన్నుదన్నుగ నిలిచెడి వీరమూర్తి!
      చెన్నులొలికెడి అపరంజి శీలమూర్తి!
      పన్నుగడపన్ను రణమున పవనమూర్తి!

      తొలగించండి
    2. బాపూజీ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  4. విపన్ను లన్ననుమడ! వీక్షచేయుచు
    న్నపారమౌ కరుణల నాదరించి క
    న్నుపొందు వారలకట నొప్పు రీతి ద
    న్నుపాటి గన్నిదురను నూకు చెన్నుగా!


    కలావతీ
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. కన్నుల విందుగ జానకి
    చెన్నుగ యాలంక లోన చెలువము మీరన్
    పన్నుగ రాముని కొలువగ
    దన్నుగ సంతస మందు తనరెను హనుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెన్నుగ నా లంకలోన..' అనండి.
      నాల్గవ పాదంలో గణదోషం. "దన్నుగ సంతసము నంది తనరెదు హనుమా" ఆనండి.

      తొలగించండి
    2. కన్నుల విందుగ జానకి
      చెన్నుగ నాలంక లోన చెలువము మీరన్
      పన్నుగ రాముని కొలువగ
      దన్నుగ సంతసము నంది తనరెదు హనుమా

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ


    కన్నులకు వెలుగు నీవం..
    చెన్నుదు , భక్తాగ్రగణ్య ! హే హనుమా ! ఆ...
    పన్నుల మము బ్రోవు మనుచు
    నిన్నడిగెద ! వెన్ను దన్ను నీవేనయ్యా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మందాక్రాంత వృత్తం....


      కన్నుల్ దృప్తింగొనును కపిరాట్కమ్రరూపంబు జూడన్
      నన్నున్ బ్రోవన్ దొర యెవరనన్ వానరేంద్రుండె దిక్కౌ ,
      చెన్నున్ గాంచన్ మురిసి మది నిశ్చింతయౌ ! వాని దీనా...
      పన్నుల్ భక్తిన్ శరణమనగా భద్రతన్ దన్ను నిచ్చున్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారూ,
      మీ మందాక్రాంత పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. శ్రీ వెలుదండ వారూ.. 🙏🙏

      హనుమద్దర్శనభాగ్యమిచ్చె వెలుదండా! పద్యరత్నద్వయం..
      బని నే బల్కెద! మీకు వందనములయ్యా ! సత్యనారాయణా !
      వినుతిన్ చెన్నును పన్ను కన్నులను సంవీక్షింపగా జేయ మా
      మనముల్ ప్రీతములయ్యె దన్ను లభియింపన్ ! మీకు జేజేలివే !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  7. కన్నుల భక్తియె నిండగ
    చెన్నుగ నాపన్నులకిల చేరువదానై
    దన్నుగనిలిచెడి యందరి
    అన్నుల మిన్నగు హనుమయె అభయంబిచ్చున్

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  9. విపన్నులను చెన్నుగ సయి వీక్ష చేయుమ
    య్య పావనివి! కన్నులనిడి యాదరించుమ
    య్య పాటిగను, దన్నుగ హృదయంబునందు ని
    న్ను పేర్మిగ సదా కొలుతుము నోర్మినివ్వుమా !

    డిండిమ
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండవ పూరణ రుచిరంగా ఉన్నది. అభినందనలు.
      "కొలిచెద మోర్వి నివ్వుమా" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  10. కన్నుల విందగు రూపము
    పన్నుగ నినుగొలిచి నంత పాప హరంబౌ
    దన్నుగ దయగొని మమ్ముల
    చెన్నుగ కాపాడు మయ్య చెలువము మీరన్

    రిప్లయితొలగించండి
  11. చెన్నొందు వీర హనుమా!

    కన్నుల పండుగె కద మరి కన నీ రూపున్!

    దన్నుగ నిలువ వదేమియొ?

    పన్నుగ నను గైకొని పరిపాలింపుమయా!


    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి


  12. అన్నుల మించి విపన్నుల
    దన్నుగ గాచుము అనుమడ !దయతో మమ్మున్ !
    చెన్నుగ కన్నుల మిన్నగ
    సన్నుతి మన్నికగ చేతు సావేరి! ప్రభో !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. కన్నుల రాముని రూపము
    చెన్ను గ దర్శించి హనుమ చిందులు వేయు న్
    దన్ను గ నిల్చి యు తానా
    పన్నుల క భ య ము నోస oగి వంత లు బాపు న్

    రిప్లయితొలగించండి
  14. చెన్ను మీరగ గన్గొని సీత జాడ
    కన్ను గానని దైత్యుని గర్వ మడచి
    అడిగి నంత యాపన్నుల నాదుకొనెడు
    హనుమ బొగిడెదన్నుతియింప నలవి యౌనె?

    రిప్లయితొలగించండి

  15. ఆకాశ వాణి వారి వచ్చే వారపు సమస్యా పూరణ :

    సమరము శాంతి గూర్చు ఘన సంపద లిచ్చును నిశ్చయమ్ముగన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. నోట్:


      నిశ్చయంబుగా ? లేక నిశ్చయమ్ముగా లేక నిశ్చయమ్ముగన్ ?

      ఈ మూడిట్లో ఏమన్నారో సరిగా వినబడలే :) (మరో జీపీయెస్ :)) ;

      కాబట్టి తెలిసిన వారు చెప్ప గలరు

      జిలేబి
      --

      తొలగించండి
    2. శుభోదయం జిలేబిగారూ! ఈవారం నాపేరేమైనా వినబడిందా?

      తొలగించండి


    3. ఇక్కడ మరో జీపీయెస్సండి ఆ పై మా బుడతడు మనవడు ఓహో హూ హూ అంటూ అరుపులు కూడన్ను :)

      విన్నట్టు లేదు ; (సరిగా వినబడలే !)

      మొదటి పేరు మాత్రం గుండా సహదేవుడు గారు వినబడింది

      రికార్డింగ్ చేసిన వారు తెలుప గలరు

      జిలేబి

      తొలగించండి


    4. కమఠపు రీతి యైన భళి, కాంక్షిత మున్బడ యన్ సదా నరుల్
      ఖమణివలెన్నహర్దినము కార్యము లెల్లను చక్క బెట్టుచున్
      సమకలనమ్ము జేయ తమ శక్తిని జీవన యానమందు నా
      సమరము శాంతి గూర్చు ఘన సంపద లిచ్చును నిశ్చయమ్ముగన్ !

      జిలేబి

      తొలగించండి
    5. యాండ్రాయిడ్ చరవాణిలోన భళిగా యాపున్ గ్రహించన్ "ఛిఛీ!
      సౌండ్రా దేమిటి దేమికర్మ" యనుచున్ శౌర్యంబుగా వల్కి తో! ...

      తొలగించండి
    6. జిలేబీ గారూ,
      అది "....నిశ్చయంబుగా".
      మీ పూరణ బాగున్నది. "ఖమణిని బోలి రేవగలు కార్యము..." అంటే బాగుంటుందేమో? మీరు 'అహర్దినము' అన్నారు. అహమన్నా దినమన్నా ఒక్కటే. లేదా "ఖమణివనె న్నహర్నిశలు కార్యము..." అనండి.
      *****
      సీతాదేవి గారూ,
      ఈరోజు మీ పేరు విన్పించలేదు.
      *****
      ప్రభాకర శాస్త్రి గారూ,
      గుండ్రా యొక్కటి చేతఁ బట్టుకొని సంకోచంబు లేకుండగా
      తీండ్రంబొప్పగ ఫోనుఁ గొట్టి కనుమా తీరున్ సమస్యల్ వడిన్.

      తొలగించండి


    7. అనుదినము - అహర్దినము అని ఆంధ్రభారతి
      అంటే బావుందే అనుకుని వాడానండి కందివారు !


      జిలేబి

      తొలగించండి
    8. చమత్కార భరితమైన మీపూరణలద్భుతంగా యున్నవి గురుదేవా!! అభినదదనలు,నమస్సులు!

      తొలగించండి


    9. యాండ్రాయిడ్ చరవాణిలోన భళిగా యాపున్ గ్రహించన్ "ఛిఛీ!
      సౌండ్రా దేమిటి దేమికర్మ" యనుచున్ శౌర్యంబుగా వల్కి తో
      మండ్రా యాపును జేసినట్టి ఘనులన్ మట్టంబు గా గూర్చిరే
      తెండ్రా కర్రను గొట్టెదన్ ప్రొఫెషనల్ తెక్నీకులన్ గూర్చరే :)


      జిలేబి

      తొలగించండి
  16. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతా అజాడ్యం వాక్పటుత్వంచ
    హనుమత్స్మరణాద్భవేత్

    కన్నుల వేడగ హనుమను
    పన్నుగ బద్ధిని బలమును వాసిని చెన్నున్
    దన్నుగ నిర్భీతినరుజ
    విన్నాణము వాక్పటుత్వ పేర్పునుగూర్చున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాక్పటుత్వ పేర్పు' దుష్ట సమాసం. "వాక్పటుత్వ వృద్ధిని గూర్చున్" అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారూ!పై వాటినన్నింటిని పేర్పున నిచ్చుననే భావనతో వ్రాసితిని. సవరించెదను!నమస్సులు!

      తొలగించండి
  17. కన్నుల భక్తిని జూపుచు
    చెన్నుగ శ్రీరాముగొల్చు శ్రీకపి వీరా
    దన్నుగ నిలబడుమయ ఆ
    పన్నుల మముగావుమయ్య పవనజ హనుమా!

    రిప్లయితొలగించండి
  18. కన్నుల కాంతులు నిండగ
    పన్నుగ కేసరి తనయుని ప్రార్ధన జేయన్
    చెన్నున గాచును యిడుముల
    దన్నుగ తానే నిలుచును దయతో జూచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..గాచును+ఇడుముల = ...గాచు నిడుముల' అవుతుంది. యడాగమం రాదు. "చెన్నుగను గాచు నిడుముల" అనండి.

      తొలగించండి
  19. సమరము శాంతిగూర్చు ఘన సంపదలిచ్చును నిశ్చయంబుగన్

    రిప్లయితొలగించండి
  20. ఆకాశవాణి, హైదరాబాదు వారి ఈనాటి 'సమస్యాపూరణం' కార్యక్రమంలో వినిపించిన మన 'శంకరాభరణం' సభ్యుల పేర్లు.....
    1) గుండా వేంకట సుబ్బ సహదేవుడు
    2) పోచిరాజు సుబ్బారావు
    3) డా. బల్లూరి ఉమాదేవి
    4) కె. ఈశ్వరప్ప
    5) VVVHB ప్రసాద రావు
    6) అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి
    7) చంద్రమౌళి సూర్యనారాయణ
    8) కొనకళ్ళ ఫణీంద్ర రావు
    9) *వీటూరి భాస్కరమ్మ
    10) *మాచవోలు శ్రీధర రావు
    11) *మంద పీతాంబర్
    12) *గండూరి లక్ష్మినారాయణ
    13) *బండకాడి అంజయ్య గౌడ్
    14) *విరించి
    15) *ఆకుల శాంతిభూషణ్
    16) *కె. రాజేశ్వర రావు
    17) *చంద్రమౌళి రామారావు
    18) *బొగ్గరం ఉమాకాంత ప్రసాద్
    19) *జిలేబీ
    20) *గుఱ్ఱం జనార్దన రావు
    (*ఈ చిహ్నం ఉన్నవారి పూరణ పద్యాలను కాకుండా కేవలం పేర్లను చదివారు)

    వచ్చే వారానికి సమస్య.....
    *సమరము శాంతిఁ గూర్చు ఘనసంపద లిచ్చును నిశ్చయంబుగా*
    మీ పూరణలను గురువారం లోగా క్రిందికి మెయిల్‍కు పంపండి...
    padyamairhyd@gmail.com

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదములు గురుదేవా! బహుశః నా పూరణ ఆలస్యముగ చేరినదేమో!

      శంకరు చాపఖండనము సాధ్యముజేసిన రామచంద్రుకున్
      శంకలులేకయే సుమతి జానకి పూవుల మాలచే తగన్
      సంకెల వేయగా వరుని చక్కని దృష్టికి సీతమోమనున్
      పంకజమందు చంపకము గోచరమాయెను ; సుందరాంగికిన్
      మంకెన పూవులే యవగ
      మైమరపొందిన కన్నులవ్వియే!

      చంపకము= నాసిక(సంపెంగ వంటి )

      తప్పులున్న దిద్దగలరు! వృత్తపూరణలు కొత్తగదా!🙏🙏🙏🙏

      తొలగించండి
  21. అనిశ మాపన్నులనరయు నాంజనేయ
    నీయభినుతి నాకన్నువ నిత్యమొసగు
    బాధలను విడ దన్నుము పవన తనయ
    జీవితము చెన్నుపడు నట్లు చేయుమయ్య

    రిప్లయితొలగించండి
  22. పన్నుగసీతజాడగనబాగుగలంకకునేగియచ్చటన్
    కన్నులవిందుగాగజనకాత్మజగాంచిముదమ్ముమీరగన్
    చెన్నుగరామచంద్రునికిచెప్పితివాశుభవార్తపావనీ!
    దన్నుగనిల్వుమాకువిశిదమ్ముగనీకిదెయంజలింపుదున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పదాల మధ్య వ్యవధానం ఉంచండి. 'విశదమ్ముగ'

      తొలగించండి
  23. కన్నులనిండుగజూతును
    చెన్నగునీరూపునెపుడుసీతాన్వేషీ!
    దన్నుగనినునేదలతును
    బన్నుగనిలనుండుమాకుపవనకుమారా!

    రిప్లయితొలగించండి
  24. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: దత్తపది
    ఇచ్చిన పదాలు :: *కన్ను* *పన్ను* *చెన్ను* *దన్ను*
    విషయము :: హనుమంతుని స్తుతి
    ఛందస్సు :: ఏ ఛందస్సు ఐనా సరే
    సందర్భము :: ఓ మారుతీ ! మా కన్నులతో నిన్ను చూడగలిగితే నిజంగా మేము ధన్యుల మైనట్లే. శ్రీరామునికి జానకీదేవి జాడను తెలియజేసిన ఓ కేసరినందనా! రామ నామమే జీవనము అని భావించిన ఓ స్వామీ ! నీవు సదా వెన్నుదన్నుగా ఉంటే చాలు మాకు ఇహలోక సుఖము పరలోక సుఖము అనే రెండు సుఖాలూ సిద్ధిస్తాయి. అని హనుమంతుని ప్రస్తుతించే సందర్భం.
    వృత్తం :: మత్తకోకిల వృత్తం

    *కన్ను* లన్ నిను జూడ మారుతి ! కల్గు ధన్యత సత్య మా
    *పన్న* జానకి జాడ దెల్పిన వాడ ! కేసరి నందనా !
    *చెన్ను* మీరగ రామనామమె జీవన మ్మను స్వామి నీ
    వున్న జాలును వెన్ను *దన్ను* గ నుండు రెండు సుఖమ్ములున్.
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (20.01.2018)

    రిప్లయితొలగించండి
  25. చూచెన్నుత కపి సత్త్వుఁడు
    వీచియుతార్ణవము దాటి వింతగ లంకన్
    దాచిన నవనిజ కన్నున్
    వేచి యరసి పన్నుగఁ దెలిపెను దన్ను వడిన్

    [కన్ను = జాడ]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. కన్నుల దయ జిందుచు నా
    పన్నుల కభయమ్మునిడెడు వాయుకుమారా!
    దన్ను గ మము గాచు హనుమ
    చెన్నుడ శ్రీరామ దూత చేమోడ్పులివే!!!

    కన్నుల నిండగు సామిని
    దన్నుగ నభయమ్ము నిడెడు దయగల మూర్తిన్
    చెన్నగు సామీరిని యా
    పన్నుల పాలించు వాని ప్రణుతింతు మదిన్!!!

    రిప్లయితొలగించండి
  27. క్రొవ్విడి వెంకట రాజారావు:
    తే.గీ.
    దన్నుగ నమరు హనుమను కన్నులందు
    పన్నుగ మతించి చెన్నగు భక్తిమీర
    నిరతము భజించు చుండుచో నీకు నబ్బు
    నిబ్బరంబగు తత్త్వమ్ము నిండుగాను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పన్నుగ మతించి/నుతించి'?

      తొలగించండి
  28. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నాకు రేడియో లేకుండుటచే సమస్యాపూరణలను పంపలేకున్నాను. ఫోనులో డౌన్లోడ్ చేసుకొనవచ్చునా? అయితే ఏతీరునో పెద్దలు వివరించగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంది వారు ఉవాచ:

      "మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే ప్లేస్టోర్ నుండి ALL INDIA RADIO ONLINE అన్న ఆప్ ను డౌన్ లోడ్ చేసికొని ఇన్ స్టాల్ చేసుకోండి. అందులో లిస్టులో ఉన్న పెక్కు స్టేషన్లలో Air Telugu ఎన్నుకోండి. మీరు హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు వినవచ్చు. సమస్యాపూరణల కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7-30 నుండి 7-45 వరకు వస్తుంది."

      తొలగించండి


    2. శ్రీ శాస్త్రిగారికి మన:పూర్వక నమస్కారములు. ధన్యవాదములు. మీ సూచనను పాటిస్తాను.

      తొలగించండి


    3. రాజారావు గారికి

      సమస్యా పూరణ మెయిలు ద్వారా పంపవలెను
      వినుటకు రేడియో యాప్ వుపయోగకారి

      జిలేబి

      తొలగించండి
  29. కన్ను లార్పని సీతను గనిన హనుమ
    పన్నుగడ యందు లంకనే పాడు జేసె !
    చెన్ను పరచచు మనసుకు విన్న వించె
    దన్ను గున్నాడు రాముడు వెన్ను లాగ
    వెఱువ కోయమ్మ సీతమ్మ !వేల్పు గలడు !

    రిప్లయితొలగించండి
  30. కన్నులందు నీరు కాల్వగ పార నా
    పన్నులెపుడు నిన్ను భజన జేయ
    దన్నుగాగ నిలిచి ధైర్యమ్ము నొన గూర్చి
    సేమ మొసగు దీవు చెన్ను గాను

    రిప్లయితొలగించండి
  31. క్రొవ్విడి వెంకట రాజారావు:
    గురువుగారూ! నిన్నటి పూరణను పరిశీలించండి.

    అవనీపతి తన మదిలో
    నవహిల్లిన విషయమిచ్చి యల్లుము ఘనమౌ
    కవితలనగ నివ్వెఱపడు
    కవి తలలో లేని కైపు కైతల కెక్కెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవహిల్లిన'...? అక్కడ "...అవహితమౌ" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  32. కన్నులతోడ జూడమనకన్నుకలుంగును దేహమట్టిదౌ,
    చెన్నగురూపమంచు తరచెన్నుకొనున్ భయమొందువేళ నా
    పన్నులు లోతలంచ, వలపన్నుడులొంగును భక్తికిన్, సదా
    దన్నుగ నిల్చు, భూతములఁ దన్నును వాయుపుత్రుడే
    (చిన్న ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
  33. నీరూపంబును కన్నులందు నిలిపిన్నీనామ ధ్యానంబునన్
    సారూప్యంబుగ శక్తినివ్వమని నీ సంపూర్ణచెన్నుద్యుతిన్
    ప్రేరేపించగ బ్రోవరా కపివరా సంప్రీతి నాపన్నులన్
    కోరేకోర్కెల వెన్నుదన్నుగ మదిన్ గుప్పించరావాయిటన్

    రిప్లయితొలగించండి
  34. నీరూపంబును కన్నులందు నిలిపిన్నీనామ ధ్యానంబునన్
    సారూప్యంబుగ శక్తినివ్వమని నీ సంపూర్ణచెన్నుద్యుతిన్
    ప్రేరేపించగ బ్రోవరా కపివరా సంప్రీతి నాపన్నులన్
    కోరేకోర్కెల వెన్నుదన్నుగ మదిన్ గుప్పించరావాయిటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిలిపి+నీ' అన్నది 'నిలిపిన్నీ' ఎలా అవుతుంది? "కన్నులన్ నిలిపితిన్ నీ నామ.." అనండి. 'సంపూర్ణ చెన్ను' దుష్టసమాసం. 'కోరే' అన్నది వ్యావహారికం. సవరించండి.

      తొలగించండి
  35. కన్నుల జానకీ సతిని గాంచిన సంతసమందునన్ భళా
    దన్నుగ రామనామమును దాల్చుచు ధ్వంసమొనర్చుచున్ వనీ
    పన్నుగ రాక్షసాధముల పాలిట కాలునివైన పావనీ!
    చెన్నుగ నన్నుబ్రోవుమయ చెంతను జేరుచు నాకడన్ సదా..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. భళి వృత్తమాయెను ప్రభాకర శాస్త్రులకంది వచ్చుచున్
      కళయయ్యెగాద మజగాంచెడు ఉత్పలమాలయైయిటన్ :)


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వనీ' అన్నదాన్ని 'వనిన్' అనండి.

      తొలగించండి
  36. కన్ను - చెన్ను - పన్ను - దన్ను
    పై పదాలను ఉపయోగిస్తూ
    హనుమంతుని వర్ణిస్తూ / స్తుతిస్తూ

    వీకన్నుతించుచు ప్రియరామ నామమ్ము
    .......... నరిగి బ్రహ్మానంద మనుభవించెఁ
    వాయువేగముతోడ వారధిఁ లంఘించి
    .......... సీత జాడను గాంచె చెన్ను మీఱ
    బల ధైర్య గర్వ సంపన్నులౌ యసురులఁ
    .......... నిర్మూలనము జేయు నియతిఁ బరగె
    సంజీవిఁ దెచ్చి లక్ష్మణ దన్నుగా నిల్చె
    .......... తన భవిష్యద్బ్రహ్మ తత్త్వమెరిగి

    నిరతమును రామ నామ సన్నిధినిఁ బొంది
    రామముద్రిక హృదయాంతరమున దాల్చి
    దాస్యభక్తి ప్రతీకయై దనరు మూర్తి
    నాంజనేయుని వినుతింతు నమిత భక్తిఁ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
      'లక్ష్మణు దన్నుగా' అనండి. లేకుంటే దుష్టసమాసం అవుతుంది.

      తొలగించండి
    2. ధన్యోస్మి గురువర్యా. సవరించుకొంటాను.

      తొలగించండి
  37. సన్నుతిసేయగా తగును సాహసవీరుని మారుతిన్ సదా
    పన్నుల బ్రోచువా డసురభంజను చెన్నుని కన్నులారగా
    మిన్నున నేగెడిన్ విధము మీరగ మోదము జూడగా మరే
    ఖిన్నత లేదుగా మనకు కీడదిరాదుగ
    దన్నుతోమనన్!

    సత్+ ఆపన్నుల = సదాపన్నుల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సత్+ఆపన్నుల' కంటే 'సదా+ఆపన్నుల' అన్న పదవిభజన అర్థవంతంగా ఉంటుంది.

      తొలగించండి
  38. సవరణతో
    గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: దత్తపది
    ఇచ్చిన పదాలు :: *కన్ను* *పన్ను* *చెన్ను* *దన్ను*
    విషయము :: హనుమంతుని స్తుతి
    ఛందస్సు :: ఏ ఛందస్సు ఐనా సరే
    సందర్భము :: ఓ మారుతీ ! మా కన్నులతో నిన్ను చూడగలిగితే నిజంగా మేము ధన్యుల మైనట్లే. ఓ పావనీ ! ఓ అనిలాత్మజా ! ఆపన్నులమైన మమ్ము కాపాడవలసినదిగా నిన్ను వేడుకొంటున్నాను. రామ నామమే జీవనము అని భావించిన ఓ స్వామీ ! నీవు సదా వెన్నుదన్నుగా ఉంటే చాలు మాకు ఇహలోక సుఖము పరలోక సుఖము అనే రెండు సుఖాలూ సిద్ధిస్తాయి. అని హనుమంతుని ప్రస్తుతించే సందర్భం.
    వృత్తం :: మత్తకోకిల వృత్తం

    *కన్ను* లన్ నిను జూడ మారుతి ! కల్గు ధన్యత , నిత్యమా
    *పన్ను* లన్ మము బ్రోవ వేడెద , పావనీ !యనిలాత్మజా !
    *చెన్ను* మీరగ రామనామమె జీవన మ్మను స్వామి నీ
    వున్న జాలును వెన్ను *దన్ను* గ నుండు రెండు సుఖమ్ములున్.
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (20.01.2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      మీ మత్తకోకిలా పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  39. దశ శతి శిశునాగమ్ముల దన్నుగల్గి
    నట్టివాడు,జగము గన్ను బట్ట తలచి
    దివికి బాల్య మందెగిరిన ధీరుడతడు,
    జెన్నుకాయము గల్గిన జెట్టు నట్టు
    యతడు ,ఆపన్ను లను గాచు నాoజ నేయు
    డతడు, దండముల్ బెట్టెద సతము నేను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జెట్టు నట్టు'...? '...నట్టు+అతడు+ఆపన్నులను' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  40. కన్ను గానని రావణాసురు కావరంబడచంగ రా
    మన్న దన్నుగ చేరినాడవె! మారుతీ మది నిన్నె గాం
    చెన్నుతింతును నీదు నామమె చేరి యాదుకొనంగ నా
    పన్నులం దయ జూపు దైవమ వందనమ్మిదె పావనీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ మత్తకోకిలా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి



  41. కన్నుల విందగు రూపము

    పన్నుగ భక్తులనుబ్రోవ వాయుసుతుండున్

    చెన్నుగ సిద్ధుడగుచుతా

    దన్నుగ నుండును సతతము ధారుణి యందున్.


    వెన్ను దన్నుగమము వీడక కావుమా

    పన్నులనిల సతము వాయుపుత్ర

    చెన్నుగ నిను గొలుతు శీఘ్రమె నీరూపు

    కన్నుల గనరార కపివరేణ్య.


    అన్నులమిన్నగు సీతను

    కన్నుల నిండుగ ముదమున గనుచును పలికెన్

    పన్నుగ శ్రీరాముండిట

    చెన్నుగ నేతెంచినిన్ను చేకొను ననుచున్.


    చెన్నొందు రూపు గనగా

    కన్నులకును పండుగయ్యె గదరా హనుమా

    దన్నుగ నీవుండగ నా

    పన్నుల కేచింతలేదు వసుమతి యందున్.


    కన్నులార రాము కాంచుచుండు సతము

    దన్ను యయ్యె నితడు తరణి సుతుకు

    చెన్నుగ పలుకుచును చింతలుబాపి యా

    పన్నుల వెతలు దీర్చు వాయు సుతుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
      చివరి పూరణలో 'దన్ను+అయ్యె = దన్నయ్యె' అవుతుంది. యడాగమం రాదు. "తరణిజునకు" అనండి. చివరి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  42. మత్తకోకిల
    కన్నులందున నిల్పి భక్తిని కార్యమందున దూకుచున్
    చెన్నుగన్ కరసేవజేయుచు చేరి లంకను సీతకై
    దన్నుగన్ రఘు రాము సేవకు దందడందున వీర సం
    పన్నుడౌచును నెగ్గి కౌగిట వాలు పావని గాచుమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దండడి+అందున' అన్నపుడు యడాగమం వస్తుంది.

      తొలగించండి
  43. ఆచార్య రాణి సదాశివ మూర్తి గారి పూరణ.....

    कन्नु-चेन्नु-पन्नु-दन्नु इति पदै: संस्कृते हनुमद्वर्णनम्।

    मम पूरणम्।

    अस्ति चेन्नु न भीतोसौ महाविघ्नपरम्परा।
    समुद्रलङ्घने धीर: रामभक्तपरायण:।।

    रामनाम वदन्नुत्तो विधिना वायुनन्दन:।
    अशकन्नुडितुं दुष्टान् आपन्नुदितधीमति:।।

    आचार्य राणि सदाशिव मूर्ति:।

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సదాశివ మూర్తి గారూ,
      మీ సంస్కృత పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు, ధన్యవాదాలు.

      తొలగించండి

  44. ..............దత్తపది
    కన్ను.. చెన్ను.. పన్ను.. దన్ను..
    పదాలతో హనుమద్వర్ణన లేదా స్తుతి


    కన్ను లారగ నీదు రూపము
    గాంచు టెన్నడొ! పావనీ!
    చెన్ను మీరగ నిన్ను సన్నుతి
    జేయు టెన్నడొ! మారుతీ!
    పన్నుగా నిను గూర్చి పద్యము
    వ్రాయు టెన్నడొ! ఆనిలీ!
    దన్నుగా నిను నమ్మి జన్మలు
    దాటు టెన్నడొ! హే ప్రభూ!

    ~వెలుదండ సత్యనారాయణ

    ఆనిలి= ఆంజనేయుడు

    రిప్లయితొలగించండి

  45. .............దత్తపది
    కన్ను.. చెన్ను.. పన్ను.. దన్ను..
    పదాలతో హనుమద్వర్ణన లేదా స్తుతి

    సందర్భం: సామాన్యంగా ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క రూప ముంటుంది. ఆ విధంగా మంత్ర శాస్త్ర ప్రకారం హనుమ న్మూర్తి భేదా లెన్నో!
    సహస్ర వాజి రథినం సహస్ర భుజ ధారిణం. అంటే వేయి గుఱ్ఱాల రథంమీద ఆ స్వామి వస్తాడట! ఆయనకు వేయి భుజా లట!
    త్రయోదశాక్షరీ మంత్ర ధ్యాన శ్లోకం లోని హనుమన్మూర్తి ఇలా వుంటుం దని ఋషులు దర్శించి చెప్పారు. (పరాశర సంహిత 16,17 వ భాగం)
    రత్నపీఠ సుఖాసీనం సహస్ర వనితావృతం..
    రాజ రాజేశ్వర నామంతో విరాజిల్లే మారుతి రూపం యిది. (పరాశర సంహిత 99 వ పటలం)

    పన్నుగాను సహస్ర బాహు శు
    భప్ర దాకృతితోడుతన్

    చెన్ను మీర సహస్ర ఘోటక
    చిత్ర కూబర మెక్కుచున్

    కన్నులార సహస్ర కాంతలు
    కాంచి సేవ లొనర్పగా

    దన్నువై మము నెల్ల వేళల
    తండ్రి! కావవె పావనీ!

    ~ వెలుదండ సత్యనారాయణ
    కూబరము= రథం

    రిప్లయితొలగించండి

  46. .............దత్తపది
    కన్ను.. చెన్ను.. పన్ను.. దన్ను..
    పదాలతో హనుమద్వర్ణన లేదా స్తుతి

    సందర్భం: మద్ది మడుగు ప్రధానంగా ఆటవికుల.. గిరిజనుల హనుమత్ క్షేత్రం. వారిది నిర్మలమైన నిశ్చలమైన భక్తి.
    పాటేరీ ధోతీ.. అంటే పట్టు ధోతి (కట్టి)అని.. హాతేమ సోటా.. అంటే చేతిలో దుడ్డు కఱ్ఱ (పట్టి) అని..
    టాంగేన తోడా.. అంటే కాలికి కడియం (పెట్టి) అని.. వారి భాషలో అర్థాలు.(స్వామికి ఒక కాలికి మాత్రం కడియం వుంటుం దట!)
    వారి భాషలో భావంలో ఇంకా ఎన్నో విశేషా లున్నాయి. మచ్చుకు యివి కొన్ని.

    ధరణి "పాటేరి ధోతి" యం
    చురవడిగను
    కనగ "హాతేమ సోట" యం
    చును మరి మరి
    పాట "టాంగేన తోడ" యం
    చాటవికులు
    చెన్నుగా పాడుదురు వెన్ను
    దన్ను వనుచు
    పన్నుగా కన్నులందు బా
    ష్పాల.. హనుమ!

    ~వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి