నా రాజమండ్రి ప్రయాణం.... ఈరోజు రాజమండ్రికి బయలుదేరుతున్నాను. రేపు కీ.శే. శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారి ద్వాదశదిన కర్మలో పాల్గొంటాను. ఎల్లుండి ద్రాక్షారామం, పిఠాపురం దేవాలయాలను దర్శించుకొని ఆరాత్రి రాజమండ్రిలో రైలెక్కి తిరుగుప్రయాణం. కవిమిత్రు లెవరినైనా కలిసే అవకాశం ఉందా?
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం నేటి అంశము :: దత్తపది (131) ఇచ్చిన పదాలు :: *నిండుగ* *పండుగ* *మెండుగ* *దండిగ* విషయము :: అవధాన వైభవం ఛందస్సు :: ఏ ఛందస్సులోనైనా సరే పద్యం వ్రాయవచ్చు. సందర్భం :: (10.4.1997) నేను చేసిన అష్టావధానమునకు సభాధ్యక్షులుగా ఉండిన , నా అవధాన విద్యా గురువర్యులు శ్రీ నరాల రామారెడ్డి గారు , *పంచ ధకార సమ్మేళనం అవధానం* అని సెలవిచ్చిన సందర్భం. ఛందస్సు :: ఉత్పలమాల వృత్తము.
మైలవరపు వారూ, మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. ***** జిలేబీ గారూ, మీ రెండు పూరణలు (రుచిర వృత్తంతో పాటు) బాగున్నవి. అభినందనలు. ***** అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** బాపూజీ గారూ, మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. ***** విట్టుబాబు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'పండుగ యవధాని...' అనండి. ***** ఎన్వీయెన్ చారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'అవధాన క్షేత్ర' మన్నపుడు 'న' గురువై గణదోషం. అక్కడ "నా నవధాన వేదికన్" అనండి. ***** శాంతి భూషణ్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** రాజేశ్వర రావు గారూ, మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు. ***** కోట రాజశేఖర్ గారూ, పంచ ధకారాలను ఒకే పాదంలో ఇమిడ్చి చెప్పిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. ***** సీతాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శైలజ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వచ్చె' ఏకవచనం, కవివరులు బహువచనం. అక్కడ "మెండుగ వచ్చె కవిగణము" అనండి. ***** పాండురంగ రెడ్డి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** బల్లూరి ఉమాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'నిండుగ నగుపించె' అనండి. రెండవ పూరణ అడిగిన అంశానికి చెందింది కాదు. జనార్దన రావు గారి సూచనను పాటించి "మెండుగ నవధాన సభను మెచ్చిరి సభికుల్" అందాం. ***** సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మనోహరమైన పూరణ. అభినందనలు. ***** జనార్దన రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కామేశ్వర రావు గారూ, దత్త పదాలను స్వార్థంలో ప్రయోగింపకుండా వైవిధ్యంగా అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
నిండుగ సమస్య లిడుగగ
రిప్లయితొలగించండిమెండుగ పూరించి లెస్స మిత్రుల తోడన్
దండిగ నవధానులిచట
పండుగ జేసిరి తెలుగుకు భాగ్యనగరిలో!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"సమస్య లిడగన్" అనండి.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండినిండుగ పృచ్ఛకాళి గమనించుచునుండ , వధాని నాల్కపై
పండుగ గాదె పద్యముల వాహిని పర్వులు వెట్టుచుండగా !
మెండుగ భారతీసతియె మెచ్చును ! శ్రోతలు తన్మయమ్మునన్
దండిగ మేలటంచు కరతాళరవమ్ములనిచ్చి మెచ్చరే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
చాలా బాగున్నదండీ.
తొలగించండిశ్రీ వెలుదండ వారి సూచనతో.. 🙏
తొలగించండినిండుగ పృచ్ఛకాళి గమనించుచునుండ , వధాని నాల్కపై
పండుగ గాదె పద్యముల వాహిని పర్వులు వెట్టుచుండగా !
మెండుగ భారతీసతియె మెచ్చును ! శ్రోతలు తన్మయమ్మునన్
దండిగ మేలటంచు కరతాళరవమ్ముల జేసి మెచ్చరే !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిపండుగ దినమిది పృచ్చక !
నిండుగ పూరణల జేసి నెమ్మది తోడన్
మెండుగ నప్రస్తుతముల
దండిగ చెణుకుల విసురు "సుదర్శన" మిదియే !
జిలేబి
పండుగ వేడుక లంటవి
రిప్లయితొలగించండిమెండుగ నవధాన మందు మిన్నం టెనుగా
నిండుగ సభలే విరిసెను
దండిగ జనులంత విందు తనరుచు మురిసెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసర్ నమస్తే..దండిగ మరిచారు..రెండవ పాదము...
తొలగించండిఅవునమ్మా శైలజా పొరబాటు. సవరిస్తాను. ధన్యవాదాలు.
తొలగించండినిండుగ వాణీయర్చన
తొలగించండిదండిగ పద్యాభిమాన తతులకు ముదమున్
మెండుగ చెణుకుల తళుకులు
పండుగ యవధాన వైభవము తిలకించన్.
నిండుగ నష్టపద్యముల నేర్పుగ బల్కును నొక్క పూజ్యుడున్;
రిప్లయితొలగించండిపండుగ సల్పు నూరయిన పద్యసుమమ్ముల నొక్క యార్యుడు
మెండుగ వేయిపద్యముల మీరును మేధను నొక్క ప్రౌడుడున్;
దండిగ వాణిపాదముల దక్షత గొల్తురు సత్కవీంద్రులున్.
చక్కని పూరణండీ! నమస్సులు!
తొలగించండిధన్యవాదాలండీ !
తొలగించండిరెండవపాదంలో చివర -యార్యుడున్;అని చదువ మనవి.
రిప్లయితొలగించండిపండుగ కాదా సభలను
రిప్లయితొలగించండినిండుగ అవధానమందు నియమము లిడగా
దండిగ పద వైభవమున
మెండుగ పూరణలు జేయ మేధ విరియగన్!
రిప్లయితొలగించండిభగద్విలాసమిదియె! భాగ్యమిద్ది! నిం
డుగన్ సమస్యల మజ డూయు కైపు ! మెం
డుగన్నటన్ పదముల రూఢమెల్ల దం
డిగన్, జరీన సలుపు డింకి పండుగౌ !
రుచిరము
జిలేబి
పదమూడన్నభయమ్మదేల రమణీ ప్రార్థింపు మా యీశునిన్ !
నిండుగ వినువారుండగ
రిప్లయితొలగించండిపండుగ నవధాని కచట ప్రభువుల దయతో
మెండుగ కానుక లందగ
దండిగ చప్పట్ల మద్య దండలు వేయన్ !
డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించండినిండుగ నుండెప్రాంగణము నిండెను పద్య రసానుభూతియున్
పండుగ పద్యసస్యరమ పండగ నానవ ధాన క్షేత్రమున్
మెండుగ పృఛ్ఛకోత్తములుమెచ్చగ పూరణలన్ చలోక్తులన్
దండిగ విందుభోజనము తత్త్వవి చారము నింపెనీ సభన్
నా రాజమండ్రి ప్రయాణం....
రిప్లయితొలగించండిఈరోజు రాజమండ్రికి బయలుదేరుతున్నాను.
రేపు కీ.శే. శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారి ద్వాదశదిన కర్మలో పాల్గొంటాను.
ఎల్లుండి ద్రాక్షారామం, పిఠాపురం దేవాలయాలను దర్శించుకొని ఆరాత్రి రాజమండ్రిలో రైలెక్కి తిరుగుప్రయాణం.
కవిమిత్రు లెవరినైనా కలిసే అవకాశం ఉందా?
🍁శంకరాభరణం 🍁 010/01/2018 🌸సమస్య 🌹
రిప్లయితొలగించండి🌷దత్తపది::మెండుగ పండుగ దండిగ నిండుగ🌷
💚💙💛💜💝💚💙💜💝💛💚
కం
నిండుగ ప్రజ కన వచ్చిరి
పండుగ వలెనయె తెలుగు ప్రపంచపు సభలున్!
దండిగ సమస్యలడుగగ
మెండుగ నవధాని జెప్పె మేలు జవాబుల్!
🌿🌿 🌿ఆకుల శాంతి భూషణ్ 🌴
🌺 వనపర్తి🌺
నిండుగ ధి ష ణ ధారణ నేర్పు కలిగి
రిప్లయితొలగించండిధీ వరుoడుగ మెండు గ దివ్యమైన
పద్యము ల పండు గ ను నట్లు పరి ఢ విల్లి
సాగ దండిగ సభ యంత సంత సిం చు
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండినేటి అంశము :: దత్తపది (131)
ఇచ్చిన పదాలు :: *నిండుగ* *పండుగ* *మెండుగ* *దండిగ*
విషయము :: అవధాన వైభవం
ఛందస్సు :: ఏ ఛందస్సులోనైనా సరే పద్యం వ్రాయవచ్చు.
సందర్భం :: (10.4.1997) నేను చేసిన అష్టావధానమునకు సభాధ్యక్షులుగా ఉండిన , నా అవధాన విద్యా గురువర్యులు శ్రీ నరాల రామారెడ్డి గారు , *పంచ ధకార సమ్మేళనం అవధానం* అని సెలవిచ్చిన సందర్భం.
ఛందస్సు :: ఉత్పలమాల వృత్తము.
*నిండుగ* ధార ధారణ సునిశ్చిత *ధీయుత* ధైర్య ధోరణుల్ ,
*పండుగ* జేయు చుండగను , పంచ ధకారములన్ , వధాని తా
*మెండుగ* తృప్తి గూర్చు గద , మేలను పృచ్ఛక ప్రేక్షకాళికిన్ ;
*దండిగ* కాన్క లందు , నవధాన సభాంగణ వైభవమ్మిదే.
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (10.01.2018)
తొలగించండిఅద్భుతమండీ రాజశేఖర గారు !!!!
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపండుగ యది పండితులకు
తొలగించండిమెండుగ ప్రశ్నలశరములు మేధనుబెంచన్
నిండుగ సభనుండగ ప్రజ
దండిగ జేజేలునిండ దండలతోడన్
మెండుగ వచ్చె కవివరులు
రిప్లయితొలగించండిపండుగ వలె దోచె నచటి ప్రాంగణమంతన్
దండిగ నిడు పూరణముల
నిండుగ నవధానము కడు నెమ్మిని గూర్చెన్!!!
కం:-
రిప్లయితొలగించండిపండుగ దినమీతిథి యని
దండిగ సలహాలనిచ్చి దడుమనఁదీర్చన్
మెండుగ యవధానుండిల
నిండుగ లగ్గము కుదిర్చి నిపుణతఁదెల్పెన్!!
@ మీ పాండురంగడు*
౧౦/౦౧/౨౦౧౮
తడుమన...దడుమన ... సందేహము
మెండుగ.....విధిగా..కర్తవ్యబద్ధంగా
కుదిర్చి....ఏర్పరచి..నిర్ణయించి.
నిపుణత....యోగ్యత..నైపుణ్యము.
నిన్నటి పూరణ :
రిప్లయితొలగించండిఉత్పలమాల
వర్షము మృగ్యమై బ్రతుకు వాటున జిక్కుచు తల్లడిల్లెడున్
కర్షక దైవమున్ గొలువ గావలె నిండు జలాశయమ్ములున్
హర్షము గూర్చునే ఋణసహాయము? యాగెనె యాత్మహత్యలున్
తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్!
రిప్లయితొలగించండిదండిగ జనములు వచ్చిరి
మెండుగ హాస్యము విరియగ మెచ్చిరి సభికుల్
పండుగ వాతావరణము
నిండుగ యగుపించె కాదె నెమ్మనములకున్.
కం:మెండుగ వానలు కురిసిన
నిండును బావులు చెరువులు నెమ్మది ప్రజకున్
దండిగ హరుషము కలుగును
పండుగయేయౌను గనుడు వసుమతి యందున్.
డా.ఉమా దేవి గారు ! మీ మొదటి పూరణ బాగున్నది.
తొలగించండిఅయితే అవధాన సభ అన్న ప్రసక్తి లేదు. రెండవ పాదంలో దానిని ఇమిడ్చి సూచించ వచ్చునేమో చూడండి.
నిండుగనున్న శ్రోత మది నిండగ జేయు సమస్యపూరణల్
రిప్లయితొలగించండిపండుగ గాదె పద్య సుమభాసిత మైన నిషిద్ధ వైఖరుల్
మెండుగ వర్ణనాంశములమేయ తరంబగు ధారణాప్రభల్
దండిగ వాక్చమత్కృతిని దండుకొనుండు వధాన వేదికన్
సంపత్ కుమార్ శాస్త్రి గారు! చక్కని పూరణ ! అభినందనలు !
తొలగించండిధన్యోస్మి శ్రీ జనర్ధన రావుగారు.
తొలగించండి_/\_ .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసంపత్ కుమార్ శాస్త్రి గారు! చక్కని పూరణ ! అభినందనలు !
రిప్లయితొలగించండిశ్రోత లెందరో గుమిగూడి చూచుచుండ
రిప్లయితొలగించండిసభను పండుగ మించిన సంబరమున
ప్రతిభ మెండుగ గల పండితులును
పాలుగొనిన వధానము బాగు!బాగు!
ముదము దండిగ గూర్చెను ముచ్చటగను
(చాలా పేలవంగా వచ్చినట్టు నాకే అనిపిస్తున్నది)
కవన మరటి పండు గతి మృ
రిప్లయితొలగించండిదు వతి మధుర మెండుగడ్డిఁ దూగ వచనముల్
సువిధిని గానిండు గమన
పు వరుస కాదండి గరిమపు విగర్హణలన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమెండుగనొకచోటమేటిసమస్యలకలరంగపూరణసలుపురీతి
రిప్లయితొలగించండిదండుగయనుచొప్పదంటుప్రశ్నలకెల్లసహనానబదులిచ్చుచతురతయును
నిండుగవర్ణననెలమితోనొనరించికరతాళధ్వనులనుగాంచురీతి
పండుగయేతెలుగుపద్యాలపూరణమదినిదోచుననుచువిదితపరచి
పరగనవధానప్రక్రియపండితాళిమనసుదోచుటెకాదుసామాన్యులకును
మోదమునుగూర్చెనింపారమొన్నమొన్నపరిమళించినతెలుగుప్రపంచసభల
భాస్కరమ్మ గారూ,
తొలగించండిఅవధాన వైభవాన్ని వివరిస్తూ ప్రశస్తమైన పూరణ చెప్పారు. చాలా బాగుంది. అభినందనలు.
దండిగసమస్యలీయగ
రిప్లయితొలగించండిమెండుగలాలిత్యపదపుమిళితముతోడన్
నిండుగ నవధానిగూర్చి
పండుగదోపించెమాకుపావనచరితా!
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం మూడవ గణం జగణం అయింది.
మైలవరపు వారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
*****
జిలేబీ గారూ,
మీ రెండు పూరణలు (రుచిర వృత్తంతో పాటు) బాగున్నవి. అభినందనలు.
*****
అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
బాపూజీ గారూ,
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
*****
విట్టుబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పండుగ యవధాని...' అనండి.
*****
ఎన్వీయెన్ చారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అవధాన క్షేత్ర' మన్నపుడు 'న' గురువై గణదోషం. అక్కడ "నా నవధాన వేదికన్" అనండి.
*****
శాంతి భూషణ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
*****
కోట రాజశేఖర్ గారూ,
పంచ ధకారాలను ఒకే పాదంలో ఇమిడ్చి చెప్పిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
*****
సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వచ్చె' ఏకవచనం, కవివరులు బహువచనం. అక్కడ "మెండుగ వచ్చె కవిగణము" అనండి.
*****
పాండురంగ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
బల్లూరి ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'నిండుగ నగుపించె' అనండి.
రెండవ పూరణ అడిగిన అంశానికి చెందింది కాదు.
జనార్దన రావు గారి సూచనను పాటించి "మెండుగ నవధాన సభను మెచ్చిరి సభికుల్" అందాం.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.
*****
జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కామేశ్వర రావు గారూ,
దత్త పదాలను స్వార్థంలో ప్రయోగింపకుండా వైవిధ్యంగా అద్భుతమైన పూరణ చెప్పారు. అభినందనలు.
ఉత్పలమాల
రిప్లయితొలగించండినిండుగ ప్రేక్షకాళి హృది నేర్పును గోర వధాని సిద్ధమై
పండుగ జేయునంశముల పాటవమొప్పగ గూర్చఁ బృచ్ఛకుల్
మెండుగ కొంటె ప్రశ్నలకు మేటిగ మాటకు మాట జెప్పగన్
దండిగ పద్య ధార కరతాళరవమ్ముల జాలువారదే !
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
మెండుగ సమస్య లిడగ
రిప్లయితొలగించండిన్నిండుగ పూరణలు నింపి నెయ్యము తోడన్
దండిగ వేడుకలు సలుప
పండుగ వోలె నవధాన వైభవ మడరెన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
౧.
రిప్లయితొలగించండిమెండుగ మ్రోగె తాళములు, మేలు సమస్యల నివ్వ పృచ్చకుల్
నిండుగ మ్రొక్కి భారతికి , నేర్పునఁ జెప్ప వధాని పద్యముల్
పండుగ వోలె కన్పడె సభాభవనమ్మునఁ గాంచ దృశ్యముల్
దండిగ నివ్వకానుకలు తద్దయు ప్రీతి వధాని బొందె తా
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గురువు గారు మా పూరణ చూడవలెను
రిప్లయితొలగించండినిండుగ పద్యపుష్పముల నింపి మనమ్మున శారదాంబకున్
రిప్లయితొలగించండిమెండుగ పూజ సేయును మమేక మనాన వధాని ప్రాశ్నికుల్
దండిగ నిచ్చి చిక్కులను ధారణ కగ్ని పరీక్ష బెట్టినన్
పండుగ పద్యప్రేమికుల పాలిట నీ యవధాన ప్రక్రియల్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
............దత్తపది
రిప్లయితొలగించండినిండుగ-పండుగ-మెండుగ-దండిగ
పై పదాలతో అవధాన వైభవాన్ని వర్ణించాలి.
**************************************
సందర్భము: ఒక పండుగ నాడు గుడి నిండా పృచ్ఛకు లనబడే భక్తు లున్నారు. అవధాని యనబడే దేవు డున్నాడు.వా రాయనను ప్రశ్న లనబడే కోరికలను అడుగుతున్నారు.
నిండుగ పృచ్ఛక భక్తులు
పండుగ నాడు గుడి నుండి,
భగవాను నటుల్
మెండుగ వెలుగు వధానిని
దండిగ ప్రశ్నల నడిగిరి:
తగు కోర్కె లవే!
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
నిండుగ కవితాకన్యక
రిప్లయితొలగించండిపండుగ వెలుగులను కవుల పందిరి యందున్
మెండుగ బరువగ జేరెను
దండిగ పదముల మెరుపుల ధగధగ మనుచున్