గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం . సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2567 సమస్య :: *తర్షము దీరలేదు గద ద్రాక్షరసమ్మును ద్రాగిచూచినన్.* సందర్భము :: పిల్లలకు అత్యవసరమైనప్పుడే ధనం ఇవ్వాలి. తగినంత మాత్రమే ఇవ్వాలి. అప్పుడే వారికి మేలుకలుగుతుంది. కన్న బిడ్డలపై విపరీతమైన ప్రేమాభిమానాలతో ఈనాటి తల్లిదండ్రులు అవసరం లేకున్నా సరే వారికి అధిక మెత్తాలను అందిస్తున్నారు. అది పిల్లలకు అనర్థాన్ని కలిగిస్తుంది. దప్పికైతే ఓర్పుతో మంచినీరే త్రాగాలి. నేను ద్రాక్షరసం త్రాగిచూచినాను నా దప్పిక తీరలేదు. అని తెలియజెప్పే సందర్భం.
కవిమిత్రులకు విన్నపం... ఒక్కొక్క వ్యాఖ్యను పోస్ట్ చెయ్యడానికి రెండు నుండి ఐదు నిమిషాల సమయం పడుతున్నది. ఆ లెక్కన రోజంతా బ్లాగులో వ్యాఖ్యలను ప్రచురించడానికి సరిపోతుంది. బ్లాగు స్లో అయిందా? సిస్టమ్ స్లో అయిందా? తెలియదు. ఈ సమస్య తీరేవరకు అందరి పూరణలపై వ్యాఖ్యలను ఒక్కసారే ప్రకటిస్తాను. గమనించండి. ********** ప్రభాకర శాస్త్రి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ********** అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** జిలేబీ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'తీర్చ దమ్మ దగను'...? ********** మైలవరపు వారూ, మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. ********** మిస్సన్న గారూ, మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. ********** విజయ కుమార్ గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. ********** బాపూజీ గారూ, మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు. ********** రాజేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** శాంతి భూషణ్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** జనార్దన రావు గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. ********** కోట రాజశేఖర్ గారూ, మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. ********** సీతాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ********** విట్టుబాబు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటిసారి వ్రాసినా మీ ఉత్పలమాల దోషరహితంగా చక్కగా ఉన్నది. ********** సుబ్బారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. రెండవ పూరణ మూడవపాదం చివర గణదోషం. సవరించండి. ********** రాజారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** శ్రీహర్ష గారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. ********** ప్రసాద రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** భాస్కరమ్మ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ********** కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. ********** అన్నపరెడ్డి వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** కృష్ణారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ********** గురుమూర్తి ఆచారి గారూ, మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు. ********** ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. **********
శంకరాభరణం బ్లాగులో ప్రచురించుటకు కొంత ఎక్కువ సమయము తీసుకొనుచున్న మాట నిజమే. నేను "ప్రచురించుము" మీట మీద నాలుగైదు సార్లు టపటపా నొక్కినచో కొన్ని సెకండ్లలో ప్రచురిస్తున్నది.
అని ఆదిశంకరుల సౌందర్య లహరి... శరత్కాల చంద్రిక లాగా తెల్లనైనది.. ఇంకా అనేక విశేషాలు గలిగిన ఆ విద్యా దేవికి ఒక్కసారి నిండు భక్తితో నమస్తే ద్రాక్ష తేనె పాల వంటి మధురమైన కవిత వరిస్తుంది అని యిందలి భావం. ఈ శ్లోకము యొక్క భావమే క్రింది పద్యాని కాధారము.
పర్యటించుచు వచ్చిన పండితులకు దప్పికలు వాసి చను డని ద్రాక్ష రసము పల్లె ప్రజ లిచ్చి సాగిల పడిరి గాని, యాది శంకర శిష్యుల కాత్మ యెఱుక యన్నది పిపాస, యాచార్యు డన్నయట్టు లంబ ప్రార్థనమున దత్తమైన ద్రాక్ష, తేనె,పాల వంటి కవితన్ దీరు గాని తర్ష మది తీర దట త్రాగ ద్రాక్ష రసము!
ద్రాక్ష పండ్ల రసము దీసి దాచియుంచి,
రిప్లయితొలగించండికొద్ది దినముల తరువాత ముద్దు గాను,
మూత విప్పగ మదిరయౌ ముచ్చటగ హ!!!
తర్షమది తీరదఁట త్రాగ ద్రాక్ష రసము :)
"yeast" కి మంచి తెలుగు పదం దొరకలేదు కనుక wine తయారీ లోని కిటుకులన్నీ దాచియుంచితిని :)
తొలగించండిజూద మాడెడి వారికి మోద మలరు
రిప్లయితొలగించండిగెలుపు నోటము లన్నవి కీలక ములు
ఆస్తు లడుగంటి పోయిన పస్తు లున్న
తర్ష మదితీర దఁటత్రాగ ద్రాక్ష రసము
రిప్లయితొలగించండివర్షము నందు జూచితిని వాగుల వంకల నెల్ల నౌర! నా
తర్షము దీరలేదు గద! ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్
హర్షము గల్గె మేలు మజ హాయిగ నుండెను తీర లేదయా
తర్షము ! మానికమ్ము మరి దప్పిక తీరగ మంచి నీరమే !
జిలేబి
రిప్లయితొలగించండినా తేట గీతి దారి తప్పి పోయే రామా హరే ! జీపీ యెస్ వారు యేమి మాయ చేసారు >
జిలేబి
నేనెరుగ నేనెరుగ
తొలగించండినట్టింటి లోనున్న మీ వారినడుగు!!
తొలగించండిపరుగులేసే వయసున "కాలం" నుండి దొంగిలించి..ఇలా ఎలా చేసారు :)"
ఉరకలు వేసే నా మదిని :)
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండితగ్గగా శక్తి త్రాగుము ద్రాక్ష రసము
కలుగజేయును బలమది ., ఘన నిదాఘ
చండకిరణుని బాధకు జలము వలయు!
తర్షమది తీరదఁట త్రాగ ద్రాక్ష రసము !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కదలీ ఖర్జూరాది ఫలముల కన్నను...
తొలగించండిహర్షము గల్గజేయు పరమౌషధమేమన రామనామమే !
శీర్షము ద్రుంచినన్ విడువ జిత్తమునందున రామభక్తి ! సం
ఘర్షణ లేదనెన్ రుచిని గాంచిన గోపన ! వానికాత్మలో
తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
కర్షకు లంద హర్షణము కమ్మని వాసన క్రమ్మ నేలపై
రిప్లయితొలగించండివర్షపు చిన్కులై తనువు వల్లె యటంచును సేద దీరగా
హర్షము పొంగి నా మదిని యద్భుత కావ్య రసాన మున్గితిన్
తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్.
హమ్మో ! GPS వారికి మాయల శక్తిఉందా ?????????????????
రిప్లయితొలగించండి🙏🙏🙏
తొలగించండిజగమే మాయా!! బ్రతుకే మాయా!!! హు హ్హు హ్హు!!!
రిప్లయితొలగించండితరచి చూడ పడతి, తీర్చ దమ్మ దగను
తర్ష మది; తీర దఁట త్రాగ ద్రాక్ష రసము
ను; వలయును మంచి నీరము నుడివితి నిది
యె వినుమమ్మ జిలేబియా యెరుక గాన !
జిలేబి
మధుర లోక విహార సంప్రాప్తి కలుగు
రిప్లయితొలగించండిమధు రస విశేష జనితమౌ మత్తు కలుగు
కాని దాహార్తియై యున్న మానవునకు
తర్షమది తీరదట త్రాగ ద్రాక్ష రసము
దాహార్తియైన మానవునికి
తొలగించండిద్రాక్షరసం త్రాగితే
తర్షము తీరదంటూ సమస్యాపూరణ గావించిన అవధాని శ్రీ చిటితోటి విజయకుమార్ గారికి భక్తిపూర్వక ప్రణామాలు.
కోట రాజశేఖర్.
వర్షపునీటి నెంతగనొ పట్టుచు పోడిమి ద్రాగుచుండినన్;
రిప్లయితొలగించండిఆర్షపు ధర్మవీరమును హాయిగ నాబగ గ్రోలుచుండినన్;
తర్షము దీరలేదు గద ద్రాక్షరసమ్మును ద్రాగి చూచినన్;
హర్షము మీర దెన్గుకవితాసుధ గుండెలు నిండిపోయెలే!
పెక్కు రకముల త ర్ ష ము ల్ నక్కి యుండి
రిప్లయితొలగించండిజనుల యందు న జెలరేగు జాడ్యమగుచు
ఎంత యున్న ను ధనము మ రింత యనె డు
త ర్ ష మది తీర దట త్రాగ ద్రాక్ష రసము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమండు వేసవినందున మొండిగ తమ
రిప్లయితొలగించండిపొలము పనులు చలుపు కర్షకులకు మిగుల
తర్షమది తీరదట త్రాగ ద్రాక్ష రసము
చల్ల నీరు ద్రాగ కడుపు చల్లగుండు !
వర్షము లెన్నియో గడచి వార్ధకమే తమ నావరించినన్
రిప్లయితొలగించండిహర్షము బొందబోరు దరహాసము చిందరు కొందరేలనో?
ఘర్షణ లేని జీవితము గావలె తృప్తియె పారమార్థమై!
"తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్"
****)()(****
(..................................
సతు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా
మనసిచ పరితుష్టే కో2ర్థవాన్ కో దరిద్ర)
చక్కని పూరణ జనార్ధనరావుగారూ! అభినందనలు!
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండి. సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2567
సమస్య :: *తర్షము దీరలేదు గద ద్రాక్షరసమ్మును ద్రాగిచూచినన్.*
సందర్భము :: పిల్లలకు అత్యవసరమైనప్పుడే ధనం ఇవ్వాలి. తగినంత మాత్రమే ఇవ్వాలి. అప్పుడే వారికి మేలుకలుగుతుంది. కన్న బిడ్డలపై విపరీతమైన ప్రేమాభిమానాలతో ఈనాటి తల్లిదండ్రులు అవసరం లేకున్నా సరే వారికి అధిక మెత్తాలను అందిస్తున్నారు. అది పిల్లలకు అనర్థాన్ని కలిగిస్తుంది. దప్పికైతే ఓర్పుతో మంచినీరే త్రాగాలి. నేను ద్రాక్షరసం త్రాగిచూచినాను నా దప్పిక తీరలేదు. అని తెలియజెప్పే సందర్భం.
హర్షము గూర్ప బిడ్డలకు , నర్థము నిమ్ముచితమ్ముగా , మహో
త్కర్షము గల్గు ; మేటి తమకమ్మున లక్షల నీయ జెల్లునే ?
మర్షము తోడ త్రాగవలె మాన్య జలమ్మును దప్పిగొన్న ; నా
తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్.
(ఉచితము=తగినంత) (ఉత్కర్షము=మేలు) (మర్షము=ఓర్పు) (తర్షము=దప్పిక)
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (9.1.2018)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిహర్షము నందగా జనులు హాయిగ గ్రోలరె మద్యమున్సదా
తొలగించండిహర్షము నిచ్చునంచు సురలందరు ద్రాగు సుధారసమ్ము సం
కర్షణు జేరగాదలచి కానగబ్రహ్మము
నాత్మనందునన్
తర్షణ దీరలేదుగద ద్రాక్షరసమ్మును ద్రావిచూసినన్
శీర్షము నర్పణంబునిడ శీఘ్రము శ్రీహరి గానగానగున్!
శీర్షము = అహంకారము
మానుషానందము కలుగు మదిరవలన
తొలగించండిదేవతానందమిచ్చును దివ్యసుధయె
అక్షయానంద మందగ నాత్మనందు
తర్షమది తీరదట త్రాగ ద్రాక్షరసము
తీవ్ర సాధనలగొనగ తీరునదియె
అహంకార నశ్యం శ్రీహరి దర్శనమవశ్యం..అని చెప్పిన మీ పద్యరాజం కడు ప్రసంశనీయం..
తొలగించండిశ్రీమతి సీతాదేవిగారికి ప్రణామాలు
ధన్యవాదములు శ్రీహర్షగారూ!!
తొలగించండిసీతాదేవి గారు!ధన్యవాదాలు!
తొలగించండిదప్పిగొన్నపుడు గొనుడు తామ్రపాత్ర
రిప్లయితొలగించండిలోన ఘటములోన జలము లోకులెల్ల
శీతలీకరణమును చేసికొను నీట
"తర్షమది తీరదఁట త్రాగ ద్రాక్ష రసము"
వర్షము వోలెనే కురియ వాంఛితమైన ధనాది సౌఖ్యముల్
తొలగించండితర్షము దీరునా! తుదకు తానుగ నేర్పున పొందు నా మనో
హర్షము తోడనే కలుగు నర్థములీయని శాంతి! చూడగన్
"తర్షము దీరలేదు గద ద్రాక్షరసమ్మును ద్రాగి చూచినన్"
మొదటి సారి ఉత్పలమాల ప్రయత్నించాను.
తొలగించండి☺️
చాలా బాగున్నది సార్!
తొలగించండిధన్యవాదాలు శాస్త్రిగారూ!
తొలగించండి🙏
వర్షమందున స్నానమ్ముబడయునెడల
రిప్లయితొలగించండితర్షమదితీరదట,త్రాగద్రాక్షరసము
మత్తుగలిగించునొడలికామధురరసము
నేదియేమైనద్రాగుటకాదుమంచి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఆకలి కలిగినప్పుడు నన్న మొదిలి
వేరొకటి నంజుచో క్షుధ తీరనటుల
దాహమౌ వడి జలమును త్రాగనపుడు
తర్షము తీరదట త్రాగ ద్రాక్షరసము
తేటగీతి
రిప్లయితొలగించండిదార విరహాన రేగెడు తరుణమెంచి
మరుని బాణంపు వడదెబ్బ జ్వరమొసంగ
తర్షమది తీరదఁట త్రాగ ద్రాక్ష రసము
నయ్యతివ యధరామృత మాదు కొనదె!
వర్షమునందుగంతులనుబాగుగవేసిననైననున్భళా
రిప్లయితొలగించండితర్షముతీరలేదుగదద్రాక్షరసమ్మునుద్రాగిచూచినన్
తర్షముతీరదెన్నటికిదాగలిగించునుమత్తుదప్పకను
త్కర్షముగాదుగానెరుగుమోకవిశ్రేష్ఠుడ!నీవయిత్తరిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహర్షము గల్గలేదు రుచిరాన్నము దిన్నను పాయసమ్ములన్
రిప్లయితొలగించండి*తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్*
హర్షము తోడ నిద్దురది హాయిని గొల్పదు హంసతూలికన్
ఘర్షణ మెద్దియో మనము గాల్చుచు నుండెను కావ,రా!శివా!
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
జ్ఞాన సముపార్జనము కష్ట సాద్యమగును
రిప్లయితొలగించండితనివి తీరదు కొన్ని గ్రంథములుఁజదువ
చదవి,చదివిన,మరికొంత చదువ మిగులు
తర్షము తీరదట త్రాగ ద్రాక్షరసము.
హర్షముతోడద్రౌపదినియాత్మసహోదరిచెంతగాంచియా
రిప్లయితొలగించండికర్షితుడైనకీచకుడుకామునిచేతికిజిక్కిమోహమన్
వర్షముముంచగన్ మనమవారితకాంక్షలనొందనక్కటా
తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్
చక్కని పూరణ భాస్కరమ్మగారూ!అభినందనలు!
తొలగించండిఅతడుమద్యమ్ముత్రాగుటకలవడంగ
రిప్లయితొలగించండిమిగులబ్రియమయ్యెమదిరయుమిక్కుటముగ
వెలదియందించెపానీయమెలమినపుడు
తర్షము తీరదట త్రాగ ద్రాక్షరసము.
గో వృషభముల నటకుఁ గొంపోవగ, రహి
రిప్లయితొలగించండితర్షమది, తీరదఁట త్రాగ ద్రాక్ష రసము
వాటి కాకలి దప్పులు పన్నుగఁ గొను
పచ్చగడ్డియు నీరము వలన గాక
[రహిత+ఋషము =రహితర్షము; ఋషము = గడ్డి]
కర్షకు లైనఁ గార్మిక నికాయము నైన నధీశు లైన నా
ధర్షము సేయ జాలరిలఁ ద్రాగెడు నీటిని నెన్న డైననున్
వర్ష జలంబు వోని శుచి వాజము దాహముఁ దీర్చు నింపుగం
దర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్
[తర్షము = దప్పి]
ఎండను తిరుగు వానికి దండిగనగు
రిప్లయితొలగించండితర్షమది తీరదఁట త్రాగ ద్రాక్ష రసము
మరియును ఘృతము, దప్పిక ధరణిపైన
నీరు మాత్రమే తీర్చును నిక్కముగను
మండుటెండను కష్టించి కండ కరుగ
రిప్లయితొలగించండిఝర్మజలమది ధారగ కారునపుడు
నూతినీటిని త్రాగగ నొప్పు గాని
తర్షమది తీరదఁట త్రాగ ద్రాక్ష రసము
మరొకటి:
రిప్లయితొలగించండిహర్షము పొంగువార ప్రణయాబ్ధిని గ్రుంకిడి నూత్నప్రేమసం
వర్షపు జల్లులం దడిసి వాటముగా బిగికౌగిలిండ్లలో
ఘర్షణలై మనోజుని ప్రకాముని జేసిరి యైన రాగపుం
దర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,
కర్షకు డొక్క డిట్లనియె , " కాంతరొ ! కష్టము జేసి వచ్చితిన్
దర్షము దీర లేదు గద , ద్రాక్షరసమ్మును ద్రాగి చూచినన్ |
హర్షము గూర్చు మిప్డు మధురాంబు వొసంగి | నిశీధి లోన ను
త్కర్ష రసావసిక్త మధు ధారల -- చుంబన ( న్ ) సేద దీర్చుమా ! "
{ ఉత్కర్ష.రసావసిక్త.మధుధారల చుంబనన్ = మేలైన , (అధికమైన)
అనురాగసిక్త మగు మధు ధారల తో గూడిన చుంబనము }
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇవ్వగ సమస్య?పూరణకిష్టబడుచు
రిప్లయితొలగించండివ్రాయబూన నప్రస్తుత వంతులాగ
తీర్షముతీరదట |త్రాగద్రాక్షరసము
యూహకంటినమార్పుకు దాహమేగ|
2.వర్షము లెన్నివచ్చినను వంకలు వాగులు పారిపొయినా?
హర్షము బొందినా?మనసునందున దాహమందగా?
తీర్షము దీరలేదు గద|ద్రాక్ష రసమ్మును త్రాగి చూచినన్
కర్షక వర్యులందరికి కల్పనవృత్తులు పంచినట్లుగన్
గంగ గోవు పాలను త్రాగు గరిటెడైన
రిప్లయితొలగించండిఖరము పాలను త్రాగుము కడివెడైన
మేక పాలు త్రాగుము;
...మధుమేహమునను
తర్షమది తీరదఁట త్రాగ ద్రాక్ష రసము!
"People with diabetes need to moderate their fruit juice intake as larger glasses of juice can substantially raise blood sugar levels."
https://www.diabetes.co.uk/food/juice-and-diabetes.html
కవిమిత్రులకు విన్నపం... ఒక్కొక్క వ్యాఖ్యను పోస్ట్ చెయ్యడానికి రెండు నుండి ఐదు నిమిషాల సమయం పడుతున్నది. ఆ లెక్కన రోజంతా బ్లాగులో వ్యాఖ్యలను ప్రచురించడానికి సరిపోతుంది. బ్లాగు స్లో అయిందా? సిస్టమ్ స్లో అయిందా? తెలియదు. ఈ సమస్య తీరేవరకు అందరి పూరణలపై వ్యాఖ్యలను ఒక్కసారే ప్రకటిస్తాను. గమనించండి.
రిప్లయితొలగించండి**********
ప్రభాకర శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
**********
అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
జిలేబీ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'తీర్చ దమ్మ దగను'...?
**********
మైలవరపు వారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
**********
మిస్సన్న గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
**********
విజయ కుమార్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
**********
బాపూజీ గారూ,
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
**********
రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
శాంతి భూషణ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
జనార్దన రావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
**********
కోట రాజశేఖర్ గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
**********
సీతాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
**********
విట్టుబాబు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిసారి వ్రాసినా మీ ఉత్పలమాల దోషరహితంగా చక్కగా ఉన్నది.
**********
సుబ్బారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ మూడవపాదం చివర గణదోషం. సవరించండి.
**********
రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
శ్రీహర్ష గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
**********
ప్రసాద రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
భాస్కరమ్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
**********
కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
**********
అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
**********
ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
**********
తొలగించండిదగ - దప్పిక
తర్షము - సముద్రము
జిలేబి
ధన్యవాదాలు గురువుగారు
తొలగించండి🙏
సార్!
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగులో ప్రచురించుటకు కొంత ఎక్కువ సమయము తీసుకొనుచున్న మాట నిజమే. నేను "ప్రచురించుము" మీట మీద నాలుగైదు సార్లు టపటపా నొక్కినచో కొన్ని సెకండ్లలో ప్రచురిస్తున్నది.
నా వ్యక్తిగత బ్లాగులో ఈ సమస్య లేదు.
ఎంతటి ధనవతులైనా దాహనివారణకు నీరు త్రాగాలె తప్ప బీరు తాగరాదనే భావన........
రిప్లయితొలగించండిశీర్షము తల్లక్రిందులయె చెప్పిన మాటలె జెప్పుచుంటి యా
మర్షము పెచ్చరిల్లె జన మండలి మమ్ముల త్రోసి వైచెనా
వర్షపు నాటి రాత్రి, ధనవంతులకైనను నీరు నీరమే
తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిహర్షముతోడ గ్రంథములు హాయిఁ బఠించెడునట్టి నాకు, నా
కర్షణ మెక్కుడాయెనయ; కాంక్షయు మిక్కుటమాయె; నింక, గో
శీర్ష మలందినన్ జనదె; చిక్కని కావ్య సుధన్ గ్రసించు నా
తర్షము తీరలేదు గద ద్రాక్ష రసమ్మునుఁ ద్రాగి చూచినన్!
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండి....సమస్య
రిప్లయితొలగించండితర్షము తీరలేదు గద
ద్రాక్ష రసమ్మును త్రాగి చూచినన్
**************************************
సందర్భము: దప్పిక తీర్చేది మంచి నీరే గాని పండ్ల రసాలు కావు.
మర్షముతోడ జూడగను
మాధురికో రుచికో బడాయికో--
తర్షము దీరునే ధరణి
దండి ఫలాల రసాలఁ గ్రోలినన్!
హర్షము మీర దప్పిక య
టన్నది తీరగ మంచి నీరు చాల్...
తర్షము తీర లేదు గద
ద్రాక్ష రస మ్మది త్రాగి చూచినన్!
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
కర్షక మిత్రుడొక్కడల! కమ్మని ద్రాక్ష వనమ్ము పెంచె నా
రిప్లయితొలగించండికర్షణ పెంపుమీరగను కంటికి గుత్తులు నింపు గూర్చగన్
తర్షము తీర్చుకోగ,వడి,ద్రాక్షలు త్రెంపితి గ్రోలవానినిన్
తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్
నిరతముఁ గనెడు కలలోన నురుములురమ
రిప్లయితొలగించండివర్షమందున ప్రియురాలు భయముగ నను
హత్తుకొన తనమోవినేనందుకొందు
తర్షమది తీరదఁట త్రాగ ద్రాక్ష రసము
తర్షము తీరునెట్టులను తావరియించిన వస్తువందకన్
రిప్లయితొలగించండివర్షపు చిన్కులొచ్చిన ప్రవాహము లేకను పంటపండునా
హర్షము పొందు మానవున కందిన కోరిన కోర్కె, కాని యా
తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్"
తర్షమది దీరదట త్రాగ ద్రాక్షరసము
రిప్లయితొలగించండితీర దాహార్తి నాకేది దారి యిచట
మధురసుధలను త్రాగంగ మనసు గోరె
పద్యమధువిచ్చి నిలుపుమా ప్రాణములను
రామచంద్రుని నామమే రమ్యముగను
రిప్లయితొలగించండిఆలపించిన కలుగునానందమిలను
రామనామామృతపుధార రసను తాక
తర్షమది తీరదట, త్రాగ ద్రాక్షరసము
మత్తులో విహరించును మానవాళి!!!
వెలుదండ వారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
**********
శ్రీహర్ష గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
***********
లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**********
Unknown గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎండలో బడి దిరిగెడు నెవరికైన
రిప్లయితొలగించండిచల్లనైన నుదకమును చక్క గాను
త్రాగ గనుపశమించును తధ్యముగను
తర్షమది, తీరదట త్రాగ ద్రాక్షరసము!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మంచి నీరము కాదని మందు గ్రోల
రిప్లయితొలగించండితర్షమది తీరదట! త్రాగ ద్రాక్ష రసము
చల్లబడు శరీరమ్ములు నుల్లములును
తాప మడచ ఫల రసమ్మె తగిన మందు!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
.........సమస్య
రిప్లయితొలగించండితర్ష మది తీర దట త్రాగ ద్రాక్ష రసము
**************************************
సందర్భము:
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత
జటాజూట మకుటాం
వర త్రాస త్రాణ స్ఫటిక
ఘుటికా పుస్తక కరామ్
సకృ న్నత్వా నత్వా కథమివ
సతాం సన్నిధధతే
మధు క్షీర ద్రాక్షా మధురిమ
ధురీణాః ఫణితయః
అని ఆదిశంకరుల సౌందర్య లహరి...
శరత్కాల చంద్రిక లాగా తెల్లనైనది.. ఇంకా అనేక విశేషాలు గలిగిన ఆ విద్యా దేవికి ఒక్కసారి నిండు భక్తితో నమస్తే ద్రాక్ష తేనె పాల వంటి మధురమైన కవిత వరిస్తుంది అని యిందలి భావం. ఈ శ్లోకము యొక్క భావమే
క్రింది పద్యాని కాధారము.
పర్యటించుచు వచ్చిన పండితులకు
దప్పికలు వాసి చను డని ద్రాక్ష రసము
పల్లె ప్రజ లిచ్చి సాగిల పడిరి గాని,
యాది శంకర శిష్యుల కాత్మ యెఱుక
యన్నది పిపాస, యాచార్యు
డన్నయట్టు
లంబ ప్రార్థనమున దత్తమైన ద్రాక్ష,
తేనె,పాల వంటి కవితన్ దీరు గాని
తర్ష మది తీర దట త్రాగ ద్రాక్ష రసము!
✒~ డా. వెలుదండ సత్యనారాయణ
రుచిని కల్గచేయుచు నుండు రుజలు తగ్గు
రిప్లయితొలగించండిచుండు గాని తరచు త్రాగుచుండ భువిని
తర్షమది తీరదఁట త్రాగ ద్రాక్ష రసము
దాహమార్పకొబ్బరి నీళ్ళు త్రాగ వలయు.
ఉత్పలమాల
రిప్లయితొలగించండివర్షము మృగ్యమై బ్రతుకు వాటున జిక్కుచు తల్లడిల్లెడున్
కర్షక దైవమున్ గొలువ గావలె నిండు జలాశయమ్ములున్
హర్షము గూర్చునే ఋణసహాయము? యాగెనె యాత్మహత్యలున్
తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్
తర్షము దీరనొప్పుగద తల్లడి జల్లును జూడ వేసవిన్
రిప్లయితొలగించండితర్షము దీరనొప్పుగద తల్లడి పాపను జూడ నింటిలో
తర్షము దీరనొప్పుగద తల్లడి ప్రేమనునొంద వృద్ధుడై...
తర్షము దీరలేదు గద ద్రాక్ష రసమ్మును ద్రాగి చూచినన్