రధ బంధ సీసములో దినకర స్తుతి . పసుపు పచ్చ రంగు గల మధ్య నిలువు వరుస లో “పూసపాటి వారి దినకర స్తుతి రధము “ అన్న వాక్యము బంధించ బడినది (బ్రాకెట్ లో ఉన్న అక్షరములు కలిపి చదువు కోవలెను) కవి పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 22-1-2018
వెంకట నారాయణ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదంలో గణదోషం. 'సురుచిత+ఇతిహాస' మన్నపుడు గుణసంధి. నుగాగమం రాదు. "హార మగును సురుచిరేతిహాసము బల్కన్" అనండి.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2578 సమస్య :: *ధారణ లేని వాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్.* ధారణ కలిగి యుండడమంటే ప్రధానంగా తన అవధాన పద్యాలను బుద్ధియందు ధరించి తిరిగి అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉండటం. అటువంటి ధారణ లేనివాడే అవధానిగా వర్ధిల్లుతాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం. సందర్భం :: అమరకోశంలో *’’సంస్థా తు మర్యాదా ధారణా స్థితిః’’* అని అంటూ సంస్థ , మర్యాద (సీమ,హద్దు), ధారణ, స్థితి అనే నాలుగు పదాలను సమానార్థకాలుగా తెలిపియున్నారు. సమస్యలోని ధారణ అనే పదానికి సీమ (హద్దు) అనే అర్థమును చెప్పుకొన్నట్లయితే *ధార, ధోరణి, ధిషణ, ధైర్యము, ధారణ అనే పంచ ధకారాలను* ఒక హద్దు అనేది లేకుండా కలిగియున్న అవధాని మాత్రమే అద్భుతమైన రీతిలో వర్ధిల్లుతాడు అని చెప్పే సందర్భం.
ధారగ పద్య పూరణ లు ధైర్య ము గా నొ న రించు నేర్పు తో కోరిన భంగి చెప్ప గల కోవిదు డై సభ రంజనoబుగా ధీరత సాగు ధారణ ము దివ్య ము నౌ గద యె ట్టీ దోష ని ర్ధార ణ లేని వాడె య వ ధాని గ వర్ధిలు న ద్భు తం బు గ న్
నా బాల్య క్రైస్తవ మిత్రుని అన్న మనుమడి పెండ్లికి ఉదయం వెళ్ళి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నాను. నెలవు చేరడానికి మరో రెండు గంటలు పట్టవచ్చు. మీ పూరణలను, వ్యాఖ్యలను చూసే అవకాశం దొరకలేదు.
ఈశ్వరప్ప గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో 'పూరణలను+అప్పజెప్పి = పూరణల నప్పజెప్పి' అవుతుంది. యడాగమం రాదు. "పూరణముల నప్పజెప్పి..." అనండి.
........సమస్య ధారణ లేని వాడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్ ~~~~~~ సందర్భం: అంతః సౌందర్యం చాలా గొప్పది. కాని ఈనాడు బాహ్య సౌందర్యంపై మోజు అతివేలంగా ప్రబలిపోయింది. ప్రచారం ఆర్భాటం మితి మీరిపోయాయి. రసజ్ఞులను మెప్పించ గలిగినవి యివి కావు. అవధానంలో పస వుండా లని వారు కోరుకుంటున్నారు. అవధాని మనస్సు ముందుగా పరతత్వానికి అనుసంధించబడి వుండాలి. అక్కడినుంచి శబ్దం దిగి వస్తుంది. అంతేగాని ఆడవాళ్ళ ముఖం చూస్తే కవిత్వం వస్తుం దనుకోరాదు. ~~~~~ తీరగు పట్టు బట్టలును, దివ్యములై కనుపట్టు కంకణాల్, మేరలు మీరు కానుకలు, మించిన వేషము, పేరుమీద మో, జోరగ జూచు కాంతలు.. న హో! యివె కొంపలు ముంచు.. వీనిపై ధారణ లేని వాడె యవ ధానిగ వర్ధిలు నద్భుతంబుగన్
- మరియొక దినకర స్తుతి బంధ సీసము
రిప్లయితొలగించండిసీ:
(పూ)షుడు!(స)విత! తపుడు!(పా)సి!కిరణుడు! చీక(టి)గొంగ!దివాకరుండు!
రవి!(వా)తి!మిత్రుడు!రాకుడు!రోహిత్తు!హ(రి)వాహనుడు!మంధి!హర్త!భువుడు!
పాధి!(ది)వామణి!పద్మినీ కాంతుడు!కమలాప్తుడు!(న)గుడు!కంజహితుడు!
వినుమాని(క)ము!అవి!వెలుగుల దొ(ర)!సూరి!కపి!అంశు హ(స్తు)డు!కర్మసాక్షి!
తే:
జ్యోతిషాంప(తి)!గోపతి!జ్యోతి!ఖ(ర)మ
రీచి!గగన మణి!తిమిరారి!(ధ)రణుడు!ఖ
చరుడు!కీసుడు!సత(ము )విజయము గూర్చి
జనతకు సుఖమునిచ్చును ఘనత తోడ
రధ బంధ సీసములో దినకర స్తుతి . పసుపు పచ్చ రంగు గల మధ్య నిలువు వరుస లో “పూసపాటి వారి దినకర స్తుతి రధము “ అన్న వాక్యము బంధించ బడినది (బ్రాకెట్ లో ఉన్న అక్షరములు కలిపి చదువు కోవలెను)
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 22-1-2018
రిప్లయితొలగించండిమారణ హోమము కాదోయ్!
ప్రేరణ కలిగించు, బుద్ధి విరులెత్తించున్
వారకమై యది యే ! రా
ధా! "రణ" లేని కవియె యవధానిగ నెగడున్
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివైవిధ్యమైన విరుపుతో పూరణ చెప్పి శుభారంభం చేశారు. అభినందనలు.
క్జాని ...రణ లేని... అని 'రణ' శబ్దాన్ని పత్యయం లేకుండా ప్రయోగించరాదు కదా!
వారము వర్జ్యము లొల్లక
రిప్లయితొలగించండికారము చేదుయును రాహు కాలపు చింతల్
బేరము నేరము దేశో
ద్ధారణ లేని కవియె యవధానిగ నెగడున్!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ భాగున్నది. అభినందనలు.
అయినా అవధానికి ఇవన్నీ ఎందుకు? కోట వారు చెప్పినట్లు పంచధకారాలుంటే చాలు కదా!
అదే సార్! సమస్యా పూరణలో మునిగినపుడు మరే చింతలూ లేని (నా లాటి) ఏకాగ్రత ఉన్నవాడే అవధాని అని...
తొలగించండి😊😊😊
రాణి సదాశివ మూర్తి గారు మెచ్చుకున్న పూరణ మీది. అందులోను చక్కని సమర్థన!
తొలగించండిశంకరకృప!
తొలగించండి🙏🙏🙏
శాస్త్రిగారి పూరణ సమంజసముగా సమర్థనీయంగా ఉన్నది.అభినందనలు!నా పూరణలో నేను స్థూలంగా చెప్పిన దాన్ని వారు వివరంగా చెప్పారు.
తొలగించండి👏
పూరణముఁ జేయఁ జాలడు
రిప్లయితొలగించండిధారణ లేని కవియె యవధానిగ, నెగడున్
తా రాగమ్మున పద్యపు
పారాయణతో ధారణమ్ముఁ బడసిన, భువిలో
అన్నపరెడ్డి వారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు మురళీకృష్ణ గారి పూరణ.....
రిప్లయితొలగించండిసారతరార్థ భావ గుణ సాంద్ర కవిత్వ మరంద మాధురుల్
ధారగ సాగుచుండు తఱి తన్మయుడై పులకింపనొప్పు ., నిం...
పార నొసంగబోయెడి యుపాయనమందు ప్రశంసలందునన్
ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్ !
మైలవరపు వారూ,
తొలగించండిఅందుకొనబోయే ఉపాయనాలు, ప్రశంసలపై ధారణ లేనివాడు... అంటూ కవిత్వ మరంద మాధుర్యాన్ని ఒలికించే పూరణ చెప్పారు. అద్భుతంగా ఉంది. అభినందనలు.
శ్రీ శాస్త్రి గారూ... మీ కోసం...
తొలగించండిధారయు ధోరణిన్ ధిషణ ధారణ ధైర్యములన్ వహించి వి...
స్తార గభీర భావ విలసద్రస బంధుర చిత్రణ క్రియా
ప్రేరితచిత్తుడౌచు , నితరేతర వస్తు నిబద్ధ దృష్టియన్
ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ప్రశస్తమైన పూరణండీ! అభినందనలు, నమస్సులు! 🙏🙏🙏
తొలగించండిశ్రీ ప్రభాకరశాస్త్రి గారికి... శ్రీ వెలుదండ వారికి... శ్రీమతి సీతాదేవి గారికి... నమోనమః 🙏🙏
తొలగించండిమైలవరపు వారూ,
తొలగించండిశాస్త్రి గారికోసమంటూ మీరు చేసిన పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివారలు పృచ్చకాళి మన వారకు లౌయని ఛీత్క రించునా
ధారణ లేనివాఁడె; యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్
వారల మాన సమ్ము లను వాంఛిత రీతిని సేద దీర్చుచున్
కోరిన పద్య మెల్ల సమ కొల్పుచు పేర్మిగ జూచు ప్రజ్ఞుడే !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వారకులౌ నని...' అనండి. అయినా 'మన వారకులౌ'...?
తొలగించండిమన శత్రువులు ?
వారకి -శత్రువు అంటే ను (ఆంధ్ర భారతి)
జిలేబి
వారము వర్జ్యము లేకను
రిప్లయితొలగించండిపేరుకు బంధువుల మనుచు ప్రీతిగ పలుకన్
పారణ ముగిసిన పిమ్మట
ధారణ లేని కవియె యవధానిగ నెగడున్
అక్కయ్యా,
తొలగించండిబంధువుల మధ్య చేసిన అవధానంలో ధారణ లేకున్నా చెల్లుతుంది. పూరణ బాగుంది. అభినందనలు.
dhanya vaadamulu
తొలగించండిశతావధాని జి.యం. రామశర్మ గారి పూరణ.....
రిప్లయితొలగించండిశ్రీరమణీయ వాక్చతుర చిన్మయ కావ్య కలాప మూర్తియై
ధారణ ధోరణీగరిమ ధైర్యము స్థైర్యము గల్గి వెల్గుచున్
స్ఫారిత శారదా కరుణ పారగ నించుకయేని దోష ని
ర్ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్.
రిప్లయితొలగించండిప్రేరణ నివ్వడు జనులకు
ధారణ లేని కవియె; యవధానిగ నెగడున్
వారల మానసమున్ భళి
యీ రణము మదిని దొలిచెడు యీప్సిత మౌరా !
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ తాజా పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.
ధీరతతోడ తెల్లనగు దేవి సరస్వతి పాదపద్మముల్
రిప్లయితొలగించండిప్రేరణ గొల్పగా దలచి ప్రేంఖణవేగము వెల్లువెత్తగా,
చారణులెల్ల మెచ్చులిడ శ్రావ్యపురీతులు సందడింప,భీ
ధారణ లేనివాడె యవధానిగ వర్దిలు నద్భుతంబుగన్.
బాపూజీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'భీధారణ'...?
భయం లేకుండా -అనే భావంతో నండీ !
తొలగించండికాని ఆంధ్రభారతిలో వెదికితే 'భీధారణ' అన్న పదం కనిపించలేదు.
తొలగించండి
తొలగించండిభీ + ధారణ ?
నిజమే.. మీ ప్రయోగం సాధువే. అభినందనలు.
తొలగించండిభారతి చేరినన్ హృదయ పద్మము నందున చిన్న నాటనే
రిప్లయితొలగించండిధారణ శక్తి తానొసగు తద్దయు ప్రీతిని నిశ్చయమ్ముగా
ప్రేరణతోడ సంతతము, విద్యగడించక పృథ్వినెవ్విధిన్
ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్?
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిపూరణ వధాన విద్యకు
హారమగు సురుచిర నితిహాసము బల్కన్
కోరిన పద్యము తడబడు
ధారణ లేని కవియె యవధానిగా నెగడున్.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. 'సురుచిత+ఇతిహాస' మన్నపుడు గుణసంధి. నుగాగమం రాదు. "హార మగును సురుచిరేతిహాసము బల్కన్" అనండి.
గురువు గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండివారించుచు నేకాగ్రత
రిప్లయితొలగించండిధారణ భంగమొనరించి తడబాటులకున్
కారణమో నితరములే
"ధారణ లేని కవియె యవధానిగ నెగడున్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవరణ:"కారణమౌ"√
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2578
సమస్య :: *ధారణ లేని వాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్.*
ధారణ కలిగి యుండడమంటే ప్రధానంగా తన అవధాన పద్యాలను బుద్ధియందు ధరించి తిరిగి అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉండటం. అటువంటి ధారణ లేనివాడే అవధానిగా వర్ధిల్లుతాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: అమరకోశంలో *’’సంస్థా తు మర్యాదా ధారణా స్థితిః’’* అని అంటూ సంస్థ , మర్యాద (సీమ,హద్దు), ధారణ, స్థితి అనే నాలుగు పదాలను సమానార్థకాలుగా తెలిపియున్నారు. సమస్యలోని ధారణ అనే పదానికి సీమ (హద్దు) అనే అర్థమును చెప్పుకొన్నట్లయితే *ధార, ధోరణి, ధిషణ, ధైర్యము, ధారణ అనే పంచ ధకారాలను* ఒక హద్దు అనేది లేకుండా కలిగియున్న అవధాని మాత్రమే అద్భుతమైన రీతిలో వర్ధిల్లుతాడు అని చెప్పే సందర్భం.
కూరిమితోడ నా యమరకోశము జూచుచు, చెప్పబూనితిన్
ధారణయన్న *సంస్థ* యగు, *ధారణ* యౌ, *స్థితి* యౌను, *సీమ* యౌ,
ధారణ యన్న ‘’సీమ’’ యను తత్వమునే తలపోయ, *ధార* లో
నారయ *ధోరణి* న్ *ధిషణ* యందున *ధైర్యము* నందు *ధారణ* న్
*ధారణ లేని వాఁడె , యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (24.01.2018)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిఅవధాన తత్త్వాన్ని విశదీకరించిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివాహ్ ! లాజవాబ్ హై !
జిలేబి
సహృదయులు జిలేబి గారికి హృదయపూర్వక ప్రణామాలండీ. కోట రాజశేఖర్.
తొలగించండిపేరేమో యవధాని,సు
రిప్లయితొలగించండివారము జేయుసమయమున వదలక దనవై
శారద్యము జూపించున్,
ధారణ లేని కవియె యవధానిగ నెగడున్"
కృష్ణసూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కారణమేమని జెప్పెద
రిప్లయితొలగించండినారహి తెల్లారిపోయె నవలోకింపన్
పూరణ జేయక పదమిది
"ధారణ లేని కవియె యవధానిగ నెగడున్"
🙂
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఏ రీతిగ రాణించడు
ధారణ లేని కవియె యవధానిగ ,నెగడున్
భూరిగ నవధానములో
ధారణ,చతురాస్య రాణి దయగల కవియున్!
🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘వనపర్తి☘
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూరణమెరుంగని మదిని
రిప్లయితొలగించండిధారణ కలుగుట గగనమె ధరణీతలమున్
కారణమెరుగక వాదిడు
ధారణ లేని కవియె యవధానిగ నెగడున్ !!
@ మీ పాండురంగడు*
౨౪/౦౧/౨౦౧౮
పాండురంగా రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"ధరణితలమునన్" అనండి.
ధారగ పద్యము ల ల్లుచు
రిప్లయితొలగించండిధీరతతో ధారణ oబు ధీ యుతు డ గుచు
న్నారయ చెల్లు న దె క్కడ
ధారణ లేని కవి యె నవ ధాని గ నెగడు న్ ?
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సుకర ప్రాసల నిచ్చిన
రిప్లయితొలగించండిమకరందము చిందనౌను మధుర కవితల
న్నకళంకముగను వెలువడు
సుకవీశ్వరు మనము నుండి జువ్వల వలెనే!
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూకః కరోతి వాచాలం...
రిప్లయితొలగించండిఛందపుటందములులేవు,వృత్తపుసొబగులురావు
యతిగతులుగావు, ప్రాసాడంబరములుగావు
మాధవా నీ కృపచే మనుచుంటిని నేను
"ధారణ లేని కవియె యవధానిగ నెగడున్"
కందం
రిప్లయితొలగించండిస్మేర వదనంబు తోడన్
శారద కరుణామృతమ్ము సభకందించన్
పూరణమౌ క్రియ కలుషిత
ధారణ లేని కవియె యవధానిగ నెగడున్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధారగ పద్య పూరణ లు ధైర్య ము గా నొ న రించు నేర్పు తో
రిప్లయితొలగించండికోరిన భంగి చెప్ప గల కోవిదు డై సభ రంజనoబుగా
ధీరత సాగు ధారణ ము దివ్య ము నౌ గద యె ట్టీ దోష ని
ర్ధార ణ లేని వాడె య వ ధాని గ వర్ధిలు న ద్భు తం బు గ న్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధారాళముగా పద్యము
రిప్లయితొలగించండిధారణ చేసిన కవులను ధాత్రిని మరువన్;
పూరణ, ప్రేరణ, వర్ణన
ధారణ లేని కవియె యవధానిగ నెగడున్
శ్రీనాథ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్పలమాల
రిప్లయితొలగించండిపూరణమందు చాతురి యపూర్వపు దత్తపదంపు కూర్పులన్
ధారగ నాశువుల్ జెలఁగ ధాటి నసంగతమాపు హాస్యమున్
శారద వాక్ప్రసాదము ప్రశంసల పంచెడు వేళ గర్వమన్
ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా 🙏
తొలగించండిభారత రామాయణముల
రిప్లయితొలగించండివారలు సేసిరె వరాంధ్ర భాగవత కవుల్
దూర కిటు లని పనుల ని
ర్ధారణ లేని కవియె యవధానిగ నెగడున్!!!
చేరును స్వర్గ ధామము సుశీలుఁడు దాన గుణంబు నందునన్
మేర యనంగ నేరని యమేయ దయా గుణ మానవుండిలన్
దూర విచార సంయుత సదుద్భవ సార్థ సుశబ్ద సంపదన్
ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్
[ధారణ = మేర / హద్దు]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిభూరిగ వర్ణనల్ కవులు పూజ్యులు మెచ్చెడి వైఖరిన్నిడన్,
రిప్లయితొలగించండిభారత మందునన్, భళిగ భాగవతమ్మున, ప్రాసలన్, యతుల్,
పూరణలందునన్ మునిగి భూషణ దూషణ లన్నిటన్ బృహ
ద్ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్...
...సార్! కష్టపడి కిట్టించితిని. పాస్ మార్కులివ్వగోరెదను... ధన్యవాదమలు (అడ్వాన్సుగా)...
చాలా బాగుందండీ మీ పూరణ
తొలగించండిశ్రీ ప్రభాకరశాస్త్రి గారూ! ప్రణామాలండీ.
...అవధాని కోట రాజశేఖర్ గారు
*********************
ధన్యవాదములు సార్! ఇటీవలే వృత్త రచన ప్రారంభించితిని. ఇదేదో లెక్కల పరీక్షలా ఉన్నది నాకు.
😂
తొలగించండివృత్తాబ్రహ్మరాక్షస శ్రీమాన్ జీపీయెస్ :)
జిలేబి
..."బ్రహ్మరాక్షసి"?
తొలగించండి
తొలగించండిధారణా బ్రహ్మరాక్షస లా వృత్తాబ్రహ్మరాక్షస అన్నమాట :)
జిలేబి
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పద్యానికి నేనిచ్చే మార్కులు....60/100.
👏👏👏👏
తొలగించండిఫస్ట్ క్లాస్!!!
తొలగించండిఅరవై మార్కుల నిచ్చిరి
గురువులు శాస్త్రుల కు వృత్త గుణకము నేర్వన్ :)
జిలేబి
పరుగులు పెట్టెను నామది;
తొలగించండిఅరవై!!! మార్కులను జూడ నచ్చెరువాయెన్!
మరి నలభై యేమయెనని
తొలగించండిపరిపరి విధముల నడుగు ప్రభాకర శాస్త్రిన్.
"యదృచ్ఛా లాభ సంతుష్టో..."
తొలగించండి🙏🙏🙏
భారముగా తానెంచును
రిప్లయితొలగించండిధారణ లేని కవియె,యవధానిగ నెగడున్
ధీరత,ధీమతి,కళలొ
ప్పారగ వాణీ కటాక్ష భాగ్యం బొగి రాన్.
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిధారణ యనునది యొకకళ
రిప్లయితొలగించండిధారణమున్గలుగుకవికిదాచేయంగన్
దరచుగనవధానంబును
ధారణలేనికవియెయవధానిగనెగడున్
సుబ్బారావు గారూ,
తొలగించండిపద్యం బాగున్నది. కాని పూరణ భావం అర్థం కాలేదు.
ధారుణిలో పేరొందునె
రిప్లయితొలగించండిధారణలేని కవియె, యవధానిగ నెగడున్
ధారణి , జ్ఞాపకశక్తియు,
శారద కృప బొందు ఘనుడె సతతము భువిలో!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధారణి/ధారణ'?
ఆచార్య రాణి సదాశివ మూర్తి గారి పూరణ
రిప్లయితొలగించండికూరలు లేవు ఇంటనదె కూర్మిని వచ్చిరి బంధుమిత్రులున్
మోరలనెత్తిరీ సుతులు మోహవశంబున తాళనోపకన్।
చారున చింతపండు మరి చాలదనంగ గృహాంగనార్తిపై
ధారణ లేని వాడె, యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్
ఆచార్య రాణి సదాశివ మూర్తి
అద్భుతమైన , వాస్తవమైన పద్యరాజము!! నమోనమః🙏🙏🙏
తొలగించండిసదాశివ మూర్తి గారూ,
తొలగించండిప్రశస్తమైన పూరణ. అభినందనలు.
'లేవు+ఇంట' అన్నపుడు సంధి నిత్యం కదా! మీరు విసంధిగా వ్రాశారు. "కూరలె యింట లేవుగద..." అంటే ఎలా ఉంటుంది?
మారణహోమమున్ సలిపి మాన్యుడుగా గణనొందు నొక్కడా
రిప్లయితొలగించండిచారము లేకయే శుచిగ సన్నుతిబొందు నొకండు చోరుడై
సారెకు కొల్లగొట్టి గుణశాలిగ నొక్కడు కీర్తిగాంచగన్
ద్ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్...
ఆరయ ధనమది గల్గిన
రిప్లయితొలగించండిచేరును తా యశము కీర్తి చెన్నలరారన్
బూరణ చేయుట నెరుగని
ధారణలేని కవియె, యవధానిగ నెగడున్
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు చక్కగా ఉన్నవి. అభినందనలు.
కం:-
రిప్లయితొలగించండిపూరణమెరుంగని మదిని
ధారణ కలుగుట గగనమె ధరణితలమునన్
కారణమెరుగక వాదిడు
ధారణ లేని కవియె యవధానిగ నెగడున్ !!
@ మీ పాండురంగడు*
౨౪/౦౧/౨౦౧౮
పాండురంగా రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేడు రథసప్తమి కదా!
రిప్లయితొలగించండిదినమున కధిపతి నీవెగ
జనమందరి హితుడవు గద జగముకు వెలుగై
ఘనమో రీతిగ భువిపై
వనముల పోషించు స్వామి వందనమిడెదన్
కన్నులు చూచుట కాతడె
వెన్నెల కాధా రమతడె, వెలుగులు పంచన్
మిన్నున నిలచిన, యేడగు
వన్నెల ఱేడుకు మనసుగ వందన మిడెదన్
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యంలో *...కధిపతివి గదా। జనులందరి... జగతికి వెలుగై..." అనండి.
ధన్యవాదాలు గురువుగారూ
తొలగించండి🙏
ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్
రిప్లయితొలగించండిధారణలేనిమాత్రమునదానవధానిగగాకబోవునే
ధారణవచ్చున్గవికిదాపలుమారులుసేయగాదగ
న్దారకమంత్రమున్వలెనుదానవధానములొయ్యనొయ్యగాన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
సారము గలదౌ కవితా
రిప్లయితొలగించండిధార చమత్కార పూరితంబగు కూర్పున్
సారస్వత దీధితులన్
ధారణలేని కవియె యవధానిగవెలుగున్!
ధారణ = హద్దు
'హద్దు'గా తీసుకోవడంతో బాగా వచ్చిందండీ!
తొలగించండి👏
ధన్యవాదములండీ!🙏
తొలగించండిసీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వారము వర్జమంచు సరివారికి మూర్తము లెక్కవేయు గో
రిప్లయితొలగించండిచారము జాతకమ్ము గ్రహసంచల నమ్ముల జాగరూకుడై
మీరక శాస్త్రమున్ వరలు మేటిగ విద్యల సాటివారిలో
ధారణ లేనివాడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్
ధారణ = మేర
అవధాని= ఎచ్చరిక గలవాడు He who is careful = వేదవిదుడు
జ్యోతిష్యము గూడ వేదాంగాలలో ఒకటిగదా!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
'వర్జ్యమంచు' అనండి.
ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! సవరిస్తాను!🙏🙏🙏🙏
తొలగించండినా బాల్య క్రైస్తవ మిత్రుని అన్న మనుమడి పెండ్లికి ఉదయం వెళ్ళి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నాను. నెలవు చేరడానికి మరో రెండు గంటలు పట్టవచ్చు. మీ పూరణలను, వ్యాఖ్యలను చూసే అవకాశం దొరకలేదు.
రిప్లయితొలగించండి.“ప్రేరణ తో వ్రాయగలుగు
రిప్లయితొలగించండిధారణలేని కవియె””యవధానిగ నెగడున్
కోరగ పృచ్చక వర్యుల
పూరణలను యప్పజెప్పిపులకితు డగుచున్”|
2.ధారుణ మైన లోకమునధర్మము వీడ?”కవీశ్వరుండుతా
మారెడి మార్గముల్ దెలిపి మంచిని బెంచు కవిత్వశక్తితో
ధారణ లేనివాడె”|”యవధానిగ వర్ధిలు నద్భుతంబుగా
కోరిన పృచ్చకుల్ తలపుకోర్కెలుదీర్చును పద్యపూరణల్.
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'పూరణలను+అప్పజెప్పి = పూరణల నప్పజెప్పి' అవుతుంది. యడాగమం రాదు. "పూరణముల నప్పజెప్పి..." అనండి.
రిప్లయితొలగించండికూరిమితో నవధానము
తీరుగ చేయమదినెంచి దీటుగ భువిలో
పూరణమదిదప్ప నితర
ధారణ లేని కవియె యవధానిగ నెగడున్.
నారాయణమూర్తి దయను
కూరిమితోపొందినట్టి కూళుండైనన్
తీరుగ కవితలు చెప్పిన
ధారణ లేని కవియె యవధానిగ నెగడున్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
......సమస్య
రిప్లయితొలగించండిధారణ లేని కవియె యవధానిగ నెగడున్
~~~~~~~
సందర్భం: సులభము
~~~~~
తీరయిన పట్టు బట్టలు
జోరుగ కంకణములు మనసు
మురియు కాన్కల్
పేరున మోజులు.. వీనిన్
ధారణ లేని కవియె యవ
ధానిగ నెగడున్ 1
తీరగు లోపలి యందము
మారని దని తెలిసికొనక
మాయను బడి కాల్
జారరె! వెలి యందంబుల
ధారణ లేని కవియె యవ
ధానిగ నెగడున్ 2
~ డా.వెలుదండ సత్యనారాయణ
........సమస్య
రిప్లయితొలగించండిధారణ లేని వాడె యవధానిగ వర్ధిలు
నద్భుతంబుగన్
~~~~~~
సందర్భం: అంతః సౌందర్యం చాలా గొప్పది. కాని ఈనాడు బాహ్య సౌందర్యంపై మోజు అతివేలంగా ప్రబలిపోయింది. ప్రచారం ఆర్భాటం మితి మీరిపోయాయి.
రసజ్ఞులను మెప్పించ గలిగినవి యివి కావు. అవధానంలో పస వుండా లని వారు కోరుకుంటున్నారు.
అవధాని మనస్సు ముందుగా పరతత్వానికి అనుసంధించబడి వుండాలి. అక్కడినుంచి శబ్దం దిగి వస్తుంది. అంతేగాని ఆడవాళ్ళ ముఖం చూస్తే కవిత్వం వస్తుం దనుకోరాదు.
~~~~~
తీరగు పట్టు బట్టలును,
దివ్యములై కనుపట్టు కంకణాల్,
మేరలు మీరు కానుకలు,
మించిన వేషము, పేరుమీద మో,
జోరగ జూచు కాంతలు.. న
హో! యివె కొంపలు ముంచు.. వీనిపై
ధారణ లేని వాడె యవ
ధానిగ వర్ధిలు నద్భుతంబుగన్
~వెలుదండ సత్యనారాయణ
కోరడు భోజనాదులను కోరడు మల్లెల పూలమాలలన్
రిప్లయితొలగించండికోరడు పట్టు వస్త్రములు కోరడు కండువ భూరిదానముల్
కోరును ధీ బలాదులిటను కొండొక వస్తువు వాహనమ్ములన్
ధారణ లేనివాఁడె యవధానిగ వర్ధిలు నద్భుతంబుగన్