"మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే ప్లేస్టోర్ నుండి ALL INDIA RADIO ONLINE అన్న ఆప్ ను డౌన్ లోడ్ చేసికొని ఇన్ స్టాల్ చేసుకోండి. అందులో లిస్టులో ఉన్న పెక్కు స్టేషన్లలో Air Telugu ఎన్నుకోండి. మీరు హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు వినవచ్చు. సమస్యాపూరణల కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7-30 నుండి 7-45 వరకు వస్తుంది."
పూరణ ధారణ హరణ చరణ శరణ అనే పద రత్నములతో విరాజిల్లే మీ సమస్యాపూరణ పద్యం హృద్యం. వాణికి నైవేద్యమండీ శ్రీ చిటితోటి విజయకుమార్ గారూ! తమకు హృదయపూర్వక ప్రణామాలండీ. భవదీయుడు కోట రాజశేఖర్
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2573 సమస్య :: * రణ మాధారము మంగళమ్ము లిడఁగా రమ్యావధానమ్మునన్.* యుద్ధమే మంగళములను కలిగిస్తుంది అవధానాలలో అని అనడం ఈ సమస్యలోని విరుద్ధార్థం. సందర్భం :: అవధానాలలో పృచ్ఛకులకు అవధానికి మధ్య యుద్ధం సాహిత్యపరంగా జరుగుతూ ఉంటుంది. కవిత్వ ధోరణి ధార ధారణ ధిషణ ధైర్యము అనే పంచ *ధ* కారములతో విరాజిల్లే పూరణలతో ఉన్న పద్యాల తోరణమే అవధానికి మంగళములను అందజేస్తుంది అని విశదీకరించే సందర్భం.
|కైలాసములో శివుని కాలక్షేపం కొరకు పార్వతీ దేవి అవధాన ప్రక్రియ చేస్తూ ఉండెను. ఆ క్రమము లో ఒక కవితకు అర్ధము తెలియక ప్రమధ గణాలు తికమకపడుతున్నాయి. వారి సంశయాన్ని తొలగించుటకు అంబ ఇచ్చిన వివరణ తో ఆ అవధానం మహత్త్వపూర్ణమయ్యింది |
రాజశేఖర్ గారూ, మీ పంచధకారాల పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు. ***** రాజేశ్వర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** ఎన్వీయెన్ చారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** ప్రసాద రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** పూసపాటి వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** జనార్దన రావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి. "కన నెన్నున్నన్" అందామా? ***** హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** శ్రీరామారావు గారూ, చక్కని పూరణ. అభినందనలు. ***** డా. మూర్తి ప్రయాగ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. ***** సీతాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** భాస్కరమ్మ గారూ, మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పూరణ సమస్య కందమయితే మీరు తేటగీతి వ్రాశారు.
ఇంగ్లీషు వాక్యాల్లో "ఇడ్లీ", "దోసె","వడ" ,"పూరీ".(ఒక వ్యక్తి భావాలు) ******* WHATEVER HE DOES, HE DOES IT SPLENDIDLY.(ఇడ్లీ) ALTHOUGH SECULAR IN OUTLOOK, HE IS A FIRM DEVOTEE.(దోసె) HE DOES NOT APPROVE ADAMANCE IF IT IS INJUDICIOUS.(వడ) HE DOES NOT POOH POOH READING MODERN POETRY.(పూరీ) (వాటెవర్ హి డస్ హి డస్ ఇట్ స్పెండిడ్లీ.(ఇడ్లీ) ఆల్ దో సెక్యులర్ ఇన్ ఔట్లుక్ హి ఈస్ ఎ ఫర్మ్ డివోటీ.(దోసె) హి డస్ నాట్ అప్రూవడమెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంజుడిషియస్,(వడ) ఇన్ జనరల్ హి డస్ నాట్ పూహ్ పూహ్(పూపూ) రీడింగ్ మాడర్న్ పొయట్రీ) SPLENDIDLY. = అద్భుతంగా INJUDICIOUS = అవివేకమైన ADAMANCE = మొండి పట్టుదల POOH POOH (పూ పూ) = గేలి చేయుట.
ఈ సమస్యలో అవధాని సమర్ధతకు పరీక్ష అంటూ ఏమీ కనబడదే! ఒక పెద్ద అవధానకార్యక్రమానికి ఇలాంటి పేలవసమస్య శోభస్కరంగా అనిపించదు. నాకైతే నిరుత్సాంకరంగా అనిపించింది. నా అభిప్రాయం చెప్పానంతే.
.............సమస్య రణమే యవధానమందు రహి మంగళమౌ ~~~~~~~~~~~~~~~~~~~~~~~ సందర్భం: పద్యం చెప్పడం అలవాటైతే ఎప్పుడైనా సులువుగా చెప్పవచ్చు. ఇంతకుముందు చెప్పినదాన్నే గుర్తుకు తెచ్చుకొని అప్పగించడ మనేదే ధారణ. అది లేకపోతే చెప్పినప్పుడల్లా కొత్తదిగా తయారయే ప్రమాదముంది. అందువల్ల ధారణ మళ్ళీ ప్రత్యేకంగా ఏమరుపాటు లేకుండా సాధించవలసిందే! గుర్తుకు రాకపోతే ధారగా చెబుతూ పోవడం అలవా టయింది కాబట్టి యేదో ఒక పదమో సమాసమో చెప్పి పద్య లక్షణం పూర్తయిం దనిపించవచ్చు. కాని అక్కడ కొత్త పదం వచ్చి కూర్చున్న సంగతి శ్రోతలు ఇట్టే పసిగట్టగలరు. ధారణ సరిగ్గా లే దని అసంతృప్తి ప్రకటించగలరు. పైగా ఈ సందర్భం కొత్త పదమో కొత్త పద బంధమో చెప్పవలసినది కాదు. ఇదివరకు చెప్పబడింది వినిపించే సందర్భం. అవధాని చెప్పలేకపోతే వినవలె ననే ఉత్సుకతగల శ్రోతల కది ఆశాభంగ మౌతుంది. కొత్తదానిని వినే ఉద్దేశ్యం వారికి లేదు కదా! ధారణ అనే దాని కున్న ప్రాధాన్య మది. ----------------------------------------------------------
గణములు యతులున్ ప్రాసలు
రిప్లయితొలగించండికణకణమున శైలి ధార కందమ్ములతో
పణము గెలుచు పద్యపు తో
రణమే యవధానమందు రహి మంగళమౌ!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవధానంలో కేవలం కందాలే ఉండవు కదా! అక్కడ "ధార కడు వేడ్క నిడన్" అంటే ఎలా ఉంటుంది?
🙏
తొలగించండిఅనుమాన మేల సుకవీ
రిప్లయితొలగించండియెనమం డ్రిడు చిక్కు ముడుల నింపుగ తుదకున్
కనుగొని విడదీయగ ధా
రణమే యవధానమందు రహి మంగళమౌ.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిజణగుల సమస్య నెదిరిచి
భణితిన్ విన్నాణముగ సభల నిలిపిరహో!
క్షణమున్ మిన్నగ జేయన్
రణమే యవధానమందు రహి మంగళమౌ
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జణగుల'...? (ఆంధ్రభారతిలో జణుగు = మోసగించు అని ఉంది. జణగు లేదు).
తొలగించండికంది వారు
నెనరులు సవరణకు !
జిలేబి
కంది వారు ఉవాచ:
తొలగించండి"మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే ప్లేస్టోర్ నుండి ALL INDIA RADIO ONLINE అన్న ఆప్ ను డౌన్ లోడ్ చేసికొని ఇన్ స్టాల్ చేసుకోండి. అందులో లిస్టులో ఉన్న పెక్కు స్టేషన్లలో Air Telugu ఎన్నుకోండి. మీరు హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు వినవచ్చు. సమస్యాపూరణల కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7-30 నుండి 7-45 వరకు వస్తుంది."
తొలగించండినెనరులండి జీపీయెస్ వారు !
ఇదిగో యాండ్రాయిడ్యా
ప్పిదిగో ఆకాశవాణి వినిపించు జిలే
బి! దెసపడకు! శనివారము
కుదురగ పూరణ సమస్య కుహుకుహు యనునే :)
జిలేబి
ఇండ్రా ప్రాసకు భయపడి
తొలగించండిగుండ్రాయికి పూజ జేసి గుడియందున్ కో
దండ్రామును భజియింపను
యాండ్రాయిడు ఫోను నాది యాప్పుల తోడన్!
తొలగించండిఆండ్రాయిడు ఫోనున బె
ట్టిండ్రన్నా రేడియోను! టిప్టాప్ గా లే!
బండ్రాయివలెన్ మెమొరీ
గుండ్రముగా లాగివేసె గురు! జీ పీయస్ :)
జిలేబి
క్షణమొక యుగముగ గడుపుచు
రిప్లయితొలగించండిపణముగ భాషను వాడి పదిల మటంచున్
గణముల నిషిద్ధా క్షరముల
రణమే యవధానమందు రహి మంగళమౌ
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ, మూడవ పాదాలలో గణదోషం. "భాషను వదలక... గణము నిషిద్ధాక్షరముల..." అందామా?
క్షణమొక యుగముగ గడుపుచు
తొలగించండిపణముగ భాషను వదలక పదిల మటంచున్
గణము నిషిద్ధా క్షరముల
రణమే యవధానమందు రహి మంగళమౌ
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిగణుతింపన్ గుణ రీతి భావ పద వాక్యార్థప్రభాదీప్త పూ....
రణముల్ మాలికఁ జేసి, భక్తిఁగొని భారత్యంఘ్రిసీమన్ సమ...
ర్పణ గావించుటయే వధానికి శుభంబౌ , నట్టి పద్యాల తో
రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిమీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
గణనీయ సమస్యా పూ
రిప్లయితొలగించండిరణమే, ప్రేక్షక హృదయహరణమే, ధీ ధా
రణమే, సద్గురు చరణ శ
రణమే యవధానమందు రహి మంగళమౌ
విజయ కుమార్ గారూ,
తొలగించండిపూరణ, ధారణ, శరణాల అంత్యానుప్రాసతో మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
పూరణ ధారణ హరణ చరణ శరణ అనే పద రత్నములతో విరాజిల్లే మీ సమస్యాపూరణ పద్యం హృద్యం. వాణికి నైవేద్యమండీ శ్రీ చిటితోటి విజయకుమార్ గారూ! తమకు హృదయపూర్వక ప్రణామాలండీ. భవదీయుడు కోట రాజశేఖర్
తొలగించండి
రిప్లయితొలగించండిజణగుల్జేసెడు కైపదమ్ముల భళీ జాగ్రత్త గా చిక్కులన్
పణబంధమ్ముల చక్క గాను సవరింపన్జేయ, సయ్యాటగన్
భణితిన్ తేగడ చేవ యున్గలుపుచున్ పద్యంబు లన్జేయ ధా
రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రణమే గుణమగు; హృదయ హ
రిప్లయితొలగించండిరణమే ప్రతిభకు నలదును రక్తిన్; సుప్రే
రణమే బలమిడు; సభ ధా
రణమే యవధానమందు రహి మంగళమౌ.
బాపూజీ గారూ,
తొలగించండిద్విప్రాసతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పణముగ పాదము లిచ్చిన
రిప్లయితొలగించండిగణుతించుచు గుణగణమ్ము కవి కోవిదులన్
గణ యతి ప్రాసల కూడిన
"రణమే యవధానమందు రహి మంగళమౌ"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిగణములు మొదలగు పద్యపు
గుణములతో,కడు సరియగు కూర్పునతో,ధా
రణతో విలసిల్లెడి పూ
రణమే యవధానమందు రహి మంగళమౌ!
🌿🌿🌿ఆకుల శాంతి భూషణ్🌷🌷
☘ వనపర్తి☘
శాంతి భూషణ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గణముల ఫణములపై కవి
రిప్లయితొలగించండిగణములతో రణమునందు గడగడమని పూ
రణలనుఁ జెప్పంగ సు ధా
రణమే యవధానమందు రహి మంగళమౌ
సూర్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సత్తువ తోడ సత్త్వమూర్తీసుతుడు
రిప్లయితొలగించండిప్రశాఖ్యలన్ నిర్జింప మేధతోన్
సుతునిగని వాణి ముదముతో నొనర్చు తాంబూలచ
ర్వణమే యవధానమందు రహి మంగళమౌ!
|అవధానములో విద్వత్తుతో గెలిచిన తన పుత్రుని చూసి మహదానందముగా సరస్వతీదేవి తాంబూలచర్వణం చేసింది.
అమ్మ తంబూలస్మేరిత రూపాన్ని మననం చేసుకుంటే మేధాశక్తి పెరుగుననని ర-కారమును, ర్వ- కారముగా మార్చాను. మన్నించగలరు....|
అట్లా మార్చగూడదండీ. అంతగా ఉత్సహించిన పక్షంలో సమస్యను ముందుగా పూరించి పిమ్మట మన భావుకత చూపటం హర్షణీయంగా ఉంటుంది.
తొలగించండికం. గణముల పదములు కూర్చుతు
రిప్లయితొలగించండిమణిహారపుభావమందుమన్ననపొందన్
గుణగణములమనుకవిధా
రణమే యవధానమందు రహి మంగళమౌ".
శివరామ కృష్ణప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కూర్చుచు' అనండి.
ఘనమగు ప్రశ్నాళీతో
రిప్లయితొలగించండిరణమును మేధోబలమున రమ్యంబగుపూ
రణముల వహించు వాక్ధా
రణమే యవధానమందు రహిమంగళమౌ
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రశ్నావళితో' అనండి.
నమస్సులు గురుదేవా! ప్రశ్నల తోరణమని భావన. ప్రశ్నావళి తోరణమనవచ్చునా! ప్రశ్నావళీ తోరణమనవలెనేమోనని సందేహించి ప్రశ్నాళీ తోరణమంటిని! దయచేసి సందేహ నివృత్తి చేయగలరు!
తొలగించండిధన్యవాదములు!
నేను 'ప్రశ్నాళితో రణము' అనుకున్నా. మీ భావన సరైనదే.
తొలగించండిడా. సీతా దేవి గారు “ఆళి”, “ఆవలి” రెండూ “ఇ” కారాంత స్త్రీలింగ పదములు.
తొలగించండిప్రశ్నల తోరణ మనిన ప్రశ్నల పంక్తి యని యర్థము వచ్చును. మళ్ళీ ప్రశ్నాళి తోరణము / ప్రశ్నావలి తోరణమన నవసరము లేదనుకుంటాను.
“ప్రశ్న కుసుమ తోరణమును / ప్రశ్నార్తవ తోరణమును” అనిను సరిపోవును.
అలాగే వాగ్ధారణమే యనండి.
పూజ్యులు కామేశ్వరరావుగారికి నమస్సులు!
తొలగించండిమీరన్నట్లు ఆళి, తోరణము అనడము పునరుక్తి దోషమే! అట్లైన గురువుగారు సూచించినట్లు ప్రశ్నావళితో రణము మేలనుకొందును! ప్రశ్నలు పూవులవలె సుకుమారముగ నుండవుగదా! సవరణలకు
ధన్యవాదములు!🙏🙏🙏🙏
అవును మీరన్నది సమంజసమే.
తొలగించండిగురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2573
సమస్య :: * రణ మాధారము మంగళమ్ము లిడఁగా రమ్యావధానమ్మునన్.*
యుద్ధమే మంగళములను కలిగిస్తుంది అవధానాలలో అని అనడం ఈ సమస్యలోని విరుద్ధార్థం.
సందర్భం :: అవధానాలలో పృచ్ఛకులకు అవధానికి మధ్య యుద్ధం సాహిత్యపరంగా జరుగుతూ ఉంటుంది. కవిత్వ ధోరణి ధార ధారణ ధిషణ ధైర్యము అనే పంచ *ధ* కారములతో విరాజిల్లే పూరణలతో ఉన్న పద్యాల తోరణమే అవధానికి మంగళములను అందజేస్తుంది అని విశదీకరించే సందర్భం.
రణమే గల్గు వధాన పృచ్ఛకులకున్ ప్రజ్ఞన్ , కవిత్వాది ధో
రణియున్ ధారణ ధార ధైర్య ధిషణల్ రాణింపగా , మేటి పూ
రణముల్ పంచ ధకార యుక్తములునౌ , రాజిల్లు పద్యాల తో
*రణ మాధారము మంగళమ్ము లిడగా , రమ్యావధానమ్మునన్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (17.01.2018)
కాలుని కాలక్షేపంబుకు కవనముచేయు
రిప్లయితొలగించండిహరమనోహరి కూర్చిన కైతలు
అవగతమవ్వని గణములకంబ ఒసగిన వివ
రణమే యవధానమందు రహి మంగళమౌ!
|కైలాసములో శివుని కాలక్షేపం కొరకు పార్వతీ దేవి అవధాన ప్రక్రియ చేస్తూ ఉండెను. ఆ క్రమము లో ఒక కవితకు అర్ధము తెలియక ప్రమధ గణాలు తికమకపడుతున్నాయి. వారి సంశయాన్ని తొలగించుటకు అంబ ఇచ్చిన వివరణ తో ఆ అవధానం మహత్త్వపూర్ణమయ్యింది |
ఇచ్చిన సమస్య కందముగదా????
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిపద్యం వ్రాయటం లో నిన్ననే అక్షరాభ్యాసం చేసాను. ఆందుకే కందం లో అందలేదు.మీ బోంట్ల నిర్దేశన నాకు ఉపయుక్తమౌతుంది.ధన్యవాదాలు...
తొలగించండిచెణుకులు విసురు చు సభలో
రిప్లయితొలగించండిగణములతో నాట లాడి ఘన పద్యావ ళుల న్
గ ణ గ ణ చెప్ప గలుగు ధా
రణ మే య వ ధానమందు ర హి మంగళ మౌ
రెండవ పాదం లో చివర ఘన పద్య ము ల న్ అని చదవాలి
తొలగించండి[17/01, 05:46] +91 75698 22984: 17, జనవరి 2018, బుధవారం
రిప్లయితొలగించండిసమస్య - *2573*
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
*"రణమే యవధానమందు రహి మంగళమౌ"*
(లేదా...)
*"రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్"*
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో పోచనపెద్ది సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన సమస్య)
[17/01, 08:36] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
గణ క్రీడావరణంబునందుకవి సద్గణ్యంబు సంధించగా
రణమున్బోలువధానమున్ తనరు నారాధ్యుండునై యోధుడై
ప్రణతుల్ జేతు కుశాగ్రబుద్ధికినిదే ప్రామాణికంబౌను ధా
రణమాధారము మంగళంబు లిడగా రమ్యావధానంబునన్
క్షణము వృధా పోనీయక
రిప్లయితొలగించండికణకణమును నిల్పి మదిని ఘనముగ వాణీ
గుణగణ గానామృత పా
రణమే యవధానమందు రహి మంగళమౌ
క్షణమున రయముగ నంబుస
రిప్లయితొలగించండిరణమ్ము వలె మేదిరమున రక్కొని సువిచా
రణమును గల్పించెడి పూ
రణమే యవధానమందు రహి మంగళమౌ
పారణ=recitation శం.నా నిఘంటువు
రిప్లయితొలగించండిభావగర్భితంగా ఉందండీ.
తొలగించండిచెణుకులు, కవితలు,విసురుల
రిప్లయితొలగించండిగణితములై యుండుగాక!యవియెన్నున్నన్
గణనీయ సమస్యా పూ
రణమే యవధానమందు రహి మంగళమౌ"
గణములు యతులును తప్పక
రిప్లయితొలగించండివణకక నిచ్చిన సమస్య వాక్చాతురితో
చెణుకులతో సరసపు పూ
రణమే యవధానమందు రహి మంగళమౌ
గణుతించి విఘ్నపతినిన్
రిప్లయితొలగించండిప్రణుతించుచు మదిని వాణిఁ బ్రారంభించన్
జెణకుల ప్రేక్షక హృదయ హ
రణమే యవధానమందు రహి మంగళమౌ.
గణనీయమ్మగు పాండితీ గరిమతో గాంభీర్య గాత్రమ్మునన్
రిప్లయితొలగించండితొణుకే లేకయె పృఛ్ఛకాళి నడుమన్ దోబూచు లాటల్వలెన్
చెణుకుల్ తోడనె యల్లినట్టివగు నా చెన్నారు పద్యాల తో
"రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్"
అణుమాత్రంబును శంకలేక మది నాహ్లాదంబుగానుండగా
రిప్లయితొలగించండిప్రణుతింజేయుచు పద్మలాంచనకు,సంప్రాప్తించగా కచ్ఛపీ
క్వణనాదంబుగ పద్యధారఝరి
సంకల్పంబుగాజార ధా
రణమాధారము మంగళంబులిడగా రమ్యావధానంబునన్
రణమును బోలిన సమరాం
రిప్లయితొలగించండిగణమున కైపద శరముల గాయపడక త
క్షణమే యోనరించెడి పూ
రణమే యవధానమందు రహి మంగళమౌ
గుణమే జనులకు వర భూ
రిప్లయితొలగించండిషణమ్ము ధర్మాచరణమె సన్మోక్షపుఁ గా
రణ మగు నిద్ధాత్రినిఁ బూ
రణమే యవధానమందు రహి మంగళమౌ
తృణమైనం బరికంప మొందమియు నుత్ప్రేక్షా సమీక్షాది నై
పుణ మత్యంతము తోడునీడ యగు సంపూర్ణంబుగం బ్రాగ్ర్య కా
రణ భూతమ్మగు శబ్ద సంప దుచితార్థాత్తమ్ము మేధ స్సధా
రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్
చాలా బాగుంది సార్
తొలగించండిధన్యవాదములు ప్రసాద్ గారు.
తొలగించండిరణమే యయ్యును ధీమతాంవరుల హోరాహోరి వాక్చాతురిన్
రిప్లయితొలగించండిఘనమౌ ప్రశ్నల సంతసంబునను
సంకోచమ్ము లేకేరహిన్
క్షణమాత్రమ్మున మారుమాటలిడ సాక్షాత్భారతీరూప ధా
రణ మాధారము మంగళంబులిడగా
రమ్యావధానంబునన్
గణనాథుని పూజించగ
రిప్లయితొలగించండిగణములు యతి,ప్రాసలన్ని గదలగ మది ధో
రణి పూరించగనే ధా
రణమే యవ ధాన మందు రహీ మంగళ మౌ!
గణముల్ బేర్చిపదాతివాహినులకాకారమ్ములన్ గూర్చి ప్రాం
రిప్లయితొలగించండిగణమందున్ తగనిల్పిశౌర్యపటిమన్ గల్పించిదుర్భేద్యపూ
రణతంత్రమ్మును దీర్చిబాహుబలియైరంజిల్లు చాతుర్యధా
రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్ !!
వరుసపృచ్ఛకులడిగినవ్యవధినందె
రిప్లయితొలగించండిపరగమస్తిష్కమందునభద్రపరచి
తగసమాధానమొసగుచుతనరువాక్య
రణమే యవ ధాన మందు రహీ మంగళ మౌ!
రాజశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమీ పంచధకారాల పూరణ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.
*****
రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
ఎన్వీయెన్ చారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
ప్రసాద రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పూసపాటి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
జనార్దన రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి. "కన నెన్నున్నన్" అందామా?
*****
హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
శ్రీరామారావు గారూ,
చక్కని పూరణ. అభినందనలు.
*****
డా. మూర్తి ప్రయాగ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
*****
సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
భాస్కరమ్మ గారూ,
మీ మొదటి పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పూరణ సమస్య కందమయితే మీరు తేటగీతి వ్రాశారు.
వినుచు నవధాని ప్రశ్నల
రిప్లయితొలగించండిఘనముగ దారణము నిష్ఠఁ గావించు నెడన్
చెనకుల పృచ్ఛకులిడు ప్రే
రణమే యవధానమందు రహి మంగళమౌ
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గణితముతోబాటుగధా
రిప్లయితొలగించండిరణమేయవధానమందురహిమంగళమౌ
గణములబొందికకుదిరిన
గణనకుదానర్హుడగునుగవిగాజగతిన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిగణముల నెంచుచు యతులను
గుణముల గమనమున నుంచి కూరిమితోడన్
క్షణమున పూరించెడి ధా
రణమే యవధానమందు రహి మంగళమౌ.
క్షణమున పూరించుచుతా
చెణుకుల కటబదులిడ ప్రజ జేజే లిడగన్
మణులంటి పద్యములతో
రణమే యవధానమందు రహి మంగళమౌ.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వాట్సప్ లో నా సూచనలను గమనించండి.
క్వణమున్ రాగయుతంబు జేయు పదముల్ వాగ్ధాటినంబల్క భూ
రిప్లయితొలగించండిషణమున్ జూడగ పండితోత్తమునకున్ సంక్షిప్త కాలంబునన్
గణముల్ దప్పక నేర్పుతోడ విచితిన్ గావించుచున్ జేయు పూ
రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్
ఫణి కుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాగ్ధాటినిం బల్క... అనండి.
గణనాథున్ మదిఁ గొల్చి ముందుగను, వాక్కాంతన్ ప్రశంసించి ప్రే
రిప్లయితొలగించండిరణనివ్వంగను పృచ్ఛకుల్, ధృతిని నిర్వర్తించ వాక్ధాటిఁ బూ
రణ కల్గించు ముదమ్ము ద్రష్టలకు, పూర్ణమ్మైన పద్యాల తో
రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వాగ్ధాటి... అనండి.
గణపతి నారాధించుచు
రిప్లయితొలగించండిగణములు ప్రాసలు యతులను గణనీయముగా
తనమదిలో చేసెడి ధా
రణమే యవధానమందు రహి మంగళమౌ.
అనయము చింతన చేయుచు
జనములు మదిలోన మెచ్చ జవమున సభలో
క్షణమున బదులిడు యాపూ
రణమే యవధానమందు రహి మంగళమౌ.
గణనము చేయుచు గంటల
నణకువతోడను బదులిడు నడిగిన వానిన్
వణకక పూరించు నా పూ
రణమే యవధానమందు రహీ మంగళమౌ.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
వాట్సప్ లో సూచనలను గమనించండి.
అనువౌ పూరణ నీయుడంచు నొకరు న్నాగాగు డంచొక్కరున్
రిప్లయితొలగించండికనుడీ దత్తము లంచు నింకొకరు వేడ్కన్ లెక్కతో నొక్కరున్
గణనల్ న్యస్తము లాశువర్ణనలకై కవ్వించు వారెందరో
రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిక్షణమైనన్ తొట్రిల్లక
ప్రణిధిని గూడుచు ఘనమగు పదముల తోడన్
ప్రణుతిగ చలుపు కవన పూ
రణమే యవధానమందు రహి మంగళమౌ
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
Namaste
రిప్లయితొలగించండిసవరణతో: చెణుకులు, కవితలు,విసురుల
రిప్లయితొలగించండిగణితములై యుండుగాక,కన నెన్నున్నన్
గణనీయ సమస్యా పూ
రణమే యవధానమందు రహి మంగళమౌ" ☃🙏☃
దత్తపది :
రిప్లయితొలగించండిఇంగ్లీషు వాక్యాల్లో "ఇడ్లీ", "దోసె","వడ" ,"పూరీ".(ఒక వ్యక్తి భావాలు)
*******
WHATEVER HE DOES, HE DOES IT SPLENDIDLY.(ఇడ్లీ)
ALTHOUGH SECULAR IN OUTLOOK, HE IS A FIRM DEVOTEE.(దోసె)
HE DOES NOT APPROVE ADAMANCE IF IT IS INJUDICIOUS.(వడ)
HE DOES NOT POOH POOH READING MODERN POETRY.(పూరీ)
(వాటెవర్ హి డస్ హి డస్ ఇట్ స్పెండిడ్లీ.(ఇడ్లీ)
ఆల్ దో సెక్యులర్ ఇన్ ఔట్లుక్ హి ఈస్ ఎ ఫర్మ్ డివోటీ.(దోసె)
హి డస్ నాట్ అప్రూవడమెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంజుడిషియస్,(వడ)
ఇన్ జనరల్ హి డస్ నాట్ పూహ్ పూహ్(పూపూ) రీడింగ్ మాడర్న్ పొయట్రీ)
SPLENDIDLY. = అద్భుతంగా
INJUDICIOUS = అవివేకమైన
ADAMANCE = మొండి పట్టుదల
POOH POOH (పూ పూ) = గేలి చేయుట.
రిప్లయితొలగించండిజీపీయెస్ వారు
మీకోసం :) పూరించుడీ కందము :(
పతియయ్యె తండ్రిగాద పావన మగుచున్ !
జిలేబి
చేత గాలేదు. ఛందోగోపనమా? సమస్య పాదములో గణములు కుదురుటలేదు నాకు :(
తొలగించండిపతి యయ్యెను తండ్రి గాద పావన మగుచున్.
తొలగించండిసతినిన్నాశ్రమ మందున
తొలగించండిగతి గానక వీడి రాజ గాంభీర్యమునన్
నుతి నొందినట్టి సీతా
పతి యయ్యెను తండ్రి గాద పావన మగుచున్
సార్! ఈ గణభంగమైన సమస్యా పాదము నిచ్చుట జిలేబీ గారి చిలిపితనమే! నేనా వలలో చిక్కుకొన లేదు :)
తొలగించండి
తొలగించండికృతికర్తయె కావ్యము నం
కితమొనరించగను తండ్రికి భళ! జిలేబీ!
కతయిదియేనమ్మా! కృతి
పతియయ్యెను తండ్రిగాద పావనమగుచున్ !
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసతి యయ్యెను తల్లియె మరి
రిప్లయితొలగించండిపతి యయ్యె తండ్రి గాద పావన మగుచున్
రతికేళి ఫలింపగ దం
పతులకు మోదమ్ము గల్గ భళ్ళున భళిరా!
ఇచ్చిన సమస్యలో గణభంగం.
తొలగించండి
తొలగించండిగణభంగపు సవరణలకు
నెనరులు! పూరణ యొనరిచి నెక్కొలిపిరి కుం
దనముగ "జీ" లిరు వురును! న
మనములివియె కవివరులకు మాన్యము గానన్!
జిలేబి
ఇచ్చిన సమస్య విధిగా 4వ పాదంలోనే ఉండాలని కొందరి అభిప్రాయం దయచేసి పెద్దలు దీని గురించి తెలుప ప్రార్ధన
రిప్లయితొలగించండిసమస్యను ఏపాదంలోనైనా ఉండవచ్చు.
తొలగించండిఈ సమస్యలో అవధాని సమర్ధతకు పరీక్ష అంటూ ఏమీ కనబడదే! ఒక పెద్ద అవధానకార్యక్రమానికి ఇలాంటి పేలవసమస్య శోభస్కరంగా అనిపించదు. నాకైతే నిరుత్సాంకరంగా అనిపించింది. నా అభిప్రాయం చెప్పానంతే.
రిప్లయితొలగించండి
తొలగించండిఎట్లాంటి సమస్య అవధాని గారికి యిచ్చి వుంటే బాగుండే దంటారు?
జిలేబి
సరిగ్గా చెప్పారు..మాలాంటి క్రొత్తవారికి యీయవలసిన సమస్య అవధానికి యీయడం శోచనీయం
తొలగించండిజిలేబీగారూ, బాగా అడిగారు! అది టపాల్లో చెబుతాను . శ్యామలీయంలో చదువుదురు గాని. మీరే అనికాదు, శంకరాభరణ కవీంద్రులకూ ఇదే నా ఆహ్వానం.
తొలగించండి. రెండవ పూరణ (నేటి సమస్యకు)
రిప్లయితొలగించండిరణమే గల్గు వధాన పృచ్ఛకులకున్ ప్రజ్ఞన్ , సమస్యాది పూ
రణమే సాగు , చమత్కృతుల్ పలుకులన్ రాజిల్లు , పద్యాల తో
రణమే వెల్గు ; నఖండ ధార , వర ధైర్యశ్రీ , సదా మేటి ధా
రణ మాధారము మంగళమ్ము లిడగా రమ్యావధానమ్మునన్.
కోట రాజశేఖర్ నెల్లూరు. (17.01.2018)
రాజశేఖర్ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ ఆద్భుతంగా ఉన్నది. అభినందనలు.
గణుతుల్ జేయుచు పార్వతీ సుతు వరజ్ఞానమ్ము నార్జించుచున్
రిప్లయితొలగించండిబ్రణతుల్ జేయుచు శారదా జనని వాగ్భాగ్యామృతమ్మందుచున్
జెణకుల్ జిందఁగ పద్యరాశి సభ జేజేల్బల్కి కీర్తించు ప్రే
రణమాధారము మంగళంబు లిడఁగారమ్యావధానంబునన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిగణములను, యతుల వేగమె
రిప్లయితొలగించండిగణన సలిపిన యవధాని కవితాత్మక పూ
రణములతో చేసెడి ధా
రణమే యవధాన మందురహి మంగళమౌ!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి.............సమస్య
రణమే యవధానమందు
రహి మంగళమౌ
~~~~~~~~~~~~~~~~~~~~~~~
సందర్భం: పద్యం చెప్పడం అలవాటైతే ఎప్పుడైనా సులువుగా చెప్పవచ్చు. ఇంతకుముందు చెప్పినదాన్నే గుర్తుకు తెచ్చుకొని అప్పగించడ మనేదే ధారణ. అది లేకపోతే చెప్పినప్పుడల్లా కొత్తదిగా తయారయే ప్రమాదముంది.
అందువల్ల ధారణ మళ్ళీ ప్రత్యేకంగా ఏమరుపాటు లేకుండా సాధించవలసిందే! గుర్తుకు రాకపోతే ధారగా చెబుతూ పోవడం అలవా టయింది కాబట్టి యేదో ఒక పదమో సమాసమో చెప్పి పద్య లక్షణం పూర్తయిం దనిపించవచ్చు. కాని అక్కడ కొత్త పదం వచ్చి కూర్చున్న సంగతి శ్రోతలు ఇట్టే పసిగట్టగలరు. ధారణ సరిగ్గా లే దని అసంతృప్తి ప్రకటించగలరు.
పైగా ఈ సందర్భం కొత్త పదమో కొత్త పద బంధమో చెప్పవలసినది కాదు. ఇదివరకు చెప్పబడింది వినిపించే సందర్భం. అవధాని చెప్పలేకపోతే వినవలె ననే ఉత్సుకతగల శ్రోతల కది ఆశాభంగ మౌతుంది. కొత్తదానిని వినే ఉద్దేశ్యం వారికి లేదు కదా!
ధారణ అనే దాని కున్న ప్రాధాన్య మది.
----------------------------------------------------------
గణ యతి ప్రాసలతో పూ
రణ మలవడిన నెపుడైన రమ్మన.. వచ్చున్
తొణకని ధారణ నుచ్చా
రణమే యవధానమందు రహి మంగళమౌ..
~వెలుదండ సత్యనారాయణ
వెలుదండ వారూ,
తొలగించండిచక్కగా చెప్పారు. ధారణలో మీరు చెప్పిన లోపం మొన్నటి శతావధానంలో స్పష్టంగా కనిపించింది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి..............సమస్య
రణ మాధారము మంగళంబు లిడగా
ర మ్యావధానంబునన్
~~~~~~~~~~~~~~~~~~~~~~~
మరొక పూరణము:
సందర్భం: ఆనాడు పర్వదినం. రసజ్ఞుని హృదయ మనే గృహమునందు సంస్కార మనే పత్తితో చేయబడినదై ఎడము లేకుండా చిక్కగా దృఢమైన దారానికి బంధింపబడినటువంటి... వింత పోకడలతో కూడినటువంటి... పద్యా లనే ఆకులతో కూడిన తోరణము అవధానమునందు మంగళం కలుగడానికి ఆధారమై యున్నది.
----------------------------------------------------------
క్షణమౌ నాడు;రసజ్ఞ హృద్ గృహమునన్
సంస్కార మన్ బత్తిదై
పణ కెచ్చోటను గానరాక దృఢమౌ
భావంపు దారాన యం
త్రణముల్ పొందిన వింత పోకడల ప
ద్యా లన్న పత్రాల తో
రణ మాధారము మంగళంబు గలుగన్
ర మ్యావధానంబునన్
~వెలుదండ సత్యనారాయణ
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
క్షణము= సంబరము పండుగ: పణకు= సందు ఎడము: యంత్రణము= బంధనము.
వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గణముల్ ప్రాసలు సంధులున్ యతులు సఖ్యమ్మౌ
రిప్లయితొలగించండియలంకారముల్
పణమున్ జేయగ పృచ్ఛకుల్ చవిగ మాన్యమ్ముంగ నొప్పారుచున్
తృణమౌ భావన దాల్చుచున్ రుచిగ ప్రీతిన్నొందు పద్యాల తో
రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండివృత్తరచన పట్ల ఆసక్తి చూపుతున్నందుకు సంతోషం.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"మాన్యత్వంబె యొప్పారగా...ప్రీతిన్ బొంద..." అనండి.
సార్!
తొలగించండిశంకరాభరణంలో వందలకొలది కంద పద్యాలు వ్రాసి యతి, ప్రాస, ఛందస్సులో భయం పోయినది. వృత్త రచన సరదాగా నున్నది. వాటి నడకే వేరు. మీ ప్రోత్సాహముతో ప్రారంభించితిని. చూద్దాం. తమాషాకే గదా నా “పద్య రచన."
🙏🙏🙏
తొలగించండివందల కొలదిగ కందము
లందమ్ముగ జేర్చ గట్టి లావణ్యములన్
బంధంబుల్ప్రాసయతుల
ఛందములన్ గూర్చు తీరు చక్కగ తెలిసెన్ :)
జిలేబి
క్షమాపణలు... మత్తేభంలో రెండవ పాదములో యతిభంగమైనది..
తొలగించండిమందుడ నేను జిలేబీ
తొలగించండిక్రిందంబడి మీదికెగరు క్రీడను గానన్
చిందర వందర తునకల్
పొందుగ గూర్చుట తెలియక ప్రొద్దది క్రుంగెన్
😭
సణుగుల్ తగ్గగ స్త్రీల భాషణములన్ సంతోష మొప్పంగగా
రిప్లయితొలగించండిగుణుగుణ్ మైకుల రోదనమ్ములుడుగన్ కుర్సీల త్రోపుళ్ళతో
గణుతిన్నొందిన హాలునందునను ప్రాకారంపు పూమాల తో
రణ మాధారము మంగళంబు లిడఁగా రమ్యావధానంబునన్