3, జనవరి 2018, బుధవారం

సమస్య - 2562 (కన్నవారి కన్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కన్నవారి కన్న ఖలులు గలరె"
(లేదా...)
"కన్నవారి కన్న ఖలులు గలరె వెదకి చూచినన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో కౌండిన్య తిలక్ గారు ఇచ్చిన సమస్య)

113 కామెంట్‌లు:

 1. గుణము,దేహమిచ్చు గొప్పవారలు లేరు
  కన్నవారికన్న ; ఖలులు గలరె
  వారి మోసగించు బధిరాంధులను మించి?
  అమ్మనాన్నలన్న నవనిసురలు.

  రిప్లయితొలగించండి
 2. సున్న లొసుగులున్న సుందరియేలేదు,
  బుగ్గ మీద సొట్ట సిగ్గుచేట?
  చిన్న తప్పులన్ని చీపురుతో చిమ్మి
  కన్నవారి కన్న ఖలులు గలరె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   తప్పులకు వెదకి చూచేవారు ఖలులంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

   తొలగించండి
 3. మొదలు భర్త చేత ముగ్ద సంతును గని
  పిదప ప్రియుని మీద ప్రేమ బుట్టి
  రమ్య సంతు జంపె రంకుసాగించగన్
  కన్నవారి కన్న ఖలులు గలరె ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతి భూషణ్ గారూ,
   ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కాల మహిమ!
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి


 4. మిన్నగాను జనుల నెల్ల మిక్కు టమ్ము గా భళా
  మన్నన గల వారి కైపు మత్తు గొల్పుదురుగ, వెం
  కన్న! వారి కన్న ఖలులు గలరె వెదకి చూచినన్
  వెన్న పూసి నట్టి కత్తి వెంట దగులు వారలౌ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   వెంకన్న అంటూ సంబోధిస్తూ విలక్షణమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 5. గుడిల వెలయు వారు గొప్పకారెప్పుడు
  కన్నవారి కన్న ; ఖలులు గలరె
  కన్నవారి నెపుడు కనికరంబులు లేక
  సంకటమ్ముల నిడు సంతు కన్న

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతి భూషణ్ గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'గుడుల వెలయు' అనండి.

   తొలగించండి
 6. కన్నవారి ఎడల కారుణ్యమే లేక
  యాశ్రమమున విడచి యాస్తి కొరకు
  ఏడిపించు సుతులు, ఏడుకొండలన వెం
  కన్న! వారి కన్న ఖలులు గలరె ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రఘురామ్ గారూ,
   చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

   తొలగించండి
 7. అక్ర మంపు బుద్ధి సక్రమమని తలచి
  వక్ర పనుల తోన వఱలు వారు
  సంతు క్షేమ మనక గొంతును లిమిచంపు
  కన్న వారి కన్న ఖలులు గలరె ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వక్రపనులు' దుష్టసమాసం. అక్కడ "వక్రకార్యములను వఱలువారు" అనండి.

   తొలగించండి
  2. మొదటి పాదములో చివర ఒక మాత్ర ఎక్కువగా ఉందనుకుంటా! చూడండి.

   తొలగించండి
  3. శర్మ గారూ,
   నిజమే. నేను గమనించలేదు. ధన్యవాదాలు!
   "సక్రమమని యెంచి" అంటే సరి!

   తొలగించండి
  4. అక్ర మంపు బుద్ధి సక్రమమని తలచి
   వక్ర కార్య ములను వఱలు వారు
   సంతు క్షేమ మనక గొంతును లిమిచంపు
   కన్న వారి కన్న ఖలులు గలరె ?

   తొలగించండి


 8. లోక మందు జనుల లొంగదీయుదురన్న
  బుట్ట లోన వేసి బురిడి జేసి
  మాయ మాట చెప్పి మత్తున దేల్చి! వెం
  కన్న! వారి కన్న ఖలులు గలరె!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. చిన్న వయసు లోనె సీరుని రప్పించి
  చిన్న కూన నొంది మిన్న గాను
  చిన్న పడవ నందు చీకటిలో త్రోలు
  కన్నవారి కన్న ఖలులు గలరె?

  సీరుడు = సూర్యుడు

  రిప్లయితొలగించండి
 10. పెట్టిన వానిని తిట్టెడి వారలు
  ****పొరుగు బాగున్నను పొగులు వారు
  కడుపున పగ దాచి కౌగిలించెడివారు
  ****సిరి రాగ గతమును మరచు వారు
  మేలుకు కీడును మిగులజేసెడి వారు
  ****నమ్మించి ముంచెడి నడక వారు
  చేరి చాడీలను చెప్పెడి వారలు
  ****విత్తమన్నను సిగ్గు విడుచు వారు

  పరులఁ ద్రోసి పైకి వచ్చెడి వారలు
  వావి వరస లేక వలచువారు
  నీతి నుడివి తాము నిలవని వారలు
  కన్న| వారి కన్న ఖలులు గలరె??

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్యనారాయణ గారూ,
   ఖలుల జాబితాను చక్కగా వివరించారు. అద్భుతమైన పూరణ. అభినందనలు.
   కన్న అన్నదానిని సంబోధనగా స్వీకరించినా, 'చూచిన' అనే అర్థాన్ని గ్రహించినా సరిపోతుంది.

   తొలగించండి
 11. ఘనుడు శంతనుండు గంగను మనువాడె
  కాపురంబు జేసి కనిరి సంతు
  జాహ్నవి కడతేర్చె చక్కని బిడ్డలన్
  కన్నవారి కన్న ఖలులు గలరె ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతి భూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అలా కడతేర్చడానికి వారిని తొందరగా శాపముక్తులను చేయాలన్న సదుద్దేశమే ఉంది కదా!

   తొలగించండి
 12. ఉన్నతంపు విద్య యుద్యో గ భాగ్యం బు
  కలుగ జేసి నట్టి కన్న వారి
  నాశ్ర మం బు జేర్చు నాధుని కు ల జూడ
  కన్న వారి కన్న ఖలు లు గలరె ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "...నాధునిక జనుల। కన్న..." అంటే అన్వయం కుదురుతుందేమో?

   తొలగించండి
 13. పసిడి పసితనంపు వాసినెరుగలేక
  బాధపెట్టు ఘనుల పాడుపనులు
  చూచి చిన్నబోకు చోద్యముగాచిన్ని
  కన్న!వారి కన్న ఖలులు గలరె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీరామారావు గారూ,
   సంబోధనతో మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 14. ఆ. వె.
  మనసు మెచ్చిన హరి మహిమలఁ బొగడుచున్
  దనదు తనయుఁడుఁ దగ తనరు చుండఁ
  గాదనెడు హిరణ్య కశిపుని బోలెడు
  కన్నవారి కన్న ఖలులుఁ గలరె?

  రిప్లయితొలగించండి
 15. అవధాని శ్రీ జి. యం. రామశర్మ గారి పూరణ....

  కంపు సీరియళ్ళ వంపులు కొంపలన్
  కంపలట్లు తగిలె కెంపులూడె
  కోపతాపములకు గురిచేయు సీర్యల్సు
  కన్న వారికన్న ఖలులు గలరె?

  రిప్లయితొలగించండి
 16. కన్నవారి మదికి చిన్న కష్ట మైన తాళమే !
  పిన్నవాడు సుతుఁడు హరిని వీడననుచు భక్తితో
  వెన్నుని తలపోసె ననుచు విషమొసంగ జూచెడున్
  కన్న వారి కన్న ఖలులు గలరె వెదకి చూచినన్!

  రిప్లయితొలగించండి
 17. మైలవరపు వారి పూరణ

  చెవిని మెలిబెట్టి , కొట్టజూచిన యశోదతో.. కన్నయ్య అన్నము దిననని మారాము చేస్తుంటే చాడీలు చెప్పిన వారిని నిందిస్తూ.. కన్నతల్లి యిదిగో ఇలా బ్రతిమాలుతోంది... 👇

  బుంగమూతి యేల ! బువ్వను దినుమురా !
  కన్న ! *వారి* కన్న ఖలులు గలరె ?
  పిల్లలనగ సుంత యల్లరిఁ జేయరా?
  దానికింత జేయ దగునె రభస ?


  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


  దశరథుడు... కైక తో 👇

  మున్ను వరము నిడిన పాపమునకు నేను నేడిటుల్
  కన్నతండ్రి రామభద్రుఁ గానకంప జూచుచో
  నిన్ను నన్ను లోకమెల్ల నిందజేయునివ్విధిన్
  కన్నవారి కన్న ఖలులు గలరె యెంచి చూడగన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారూ,
   మీ రెండు పూరణలు మనోహరంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 18. కనగ సంతు క్షేమము గోరు కన్నవారు!
  బ్రతుకు బాట నొడలు వంగి బడలు సరికి
  ముదిమి వయసులోన వదలు మూఢ జనుల
  "కన్న, వారి కన్న ఖలులు గలరె" యిలను!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నమ్మ వలదు జనుల నాతీపి పలుకులన్
   తీరు తెలిసి మెలగు తెలివి గలిగి
   పెట్టి తీపి ముందు వెనక తెగడు వారి
   "కన్న, వారి కన్న ఖలులు గలరె"

   తొలగించండి
  2. ఆ.వె.
   జనుల మనములోనె గనుడు తానుండును
   వేరు గాను యతని వెదకు టేల
   అదియు దెలియకుండ ఆతనిన్ వైరిగా
   కన్న వారి కన్న ఖలులు గలరె

   తొలగించండి
  3. విట్టు బాబు గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   "వేరటంచు నతని" అనండి. 'వేరుగాను+అతని' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 19. పెద్దవారలేరి వెదుకగ ధరలోన
  కన్నవారికన్న? ఖలులుఁగలరె
  తల్లిఁదండ్రులందు దయలేని వారలు!
  నిత్య సత్య మిద్ది నెమ్మిఁగనుము!!

  రిప్లయితొలగించండి
 20. కన్య మనసు దోచి కౌగిలింత కుజేర్చి
  గర్భ వతిని జేయ?కనిన పిదప
  కాల్వ కంద జేయ కనికరమే లేక!
  కన్న వారి కన్న ఖలులు గలరె?

  రిప్లయితొలగించండి
 21. చిన్న వయసు నందు పెళ్ళి జేయ తల్లిదండ్రులున్
  విన్న వించ లేని బ్రతుకు వేద నంబు బెంచగా
  చిన్న దాని మనసు చెదర?చింత లందు బల్క్ గా
  కన్న వారి కన్న ఖలులు గలరె వెదికి చూచినన్?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   అలా కన్నవాళ్ళను తిట్టుకుంటూ కూతురు పాడే ఒక జానపద గీతాన్ని విన్నాను. గుర్తుకు రావడం లేదు. "ఈడుగాని జోడెట్ల ఇచ్చిరి" అని ఉంటుంది ఆ పాటలో...

   తొలగించండి
  2. ఆమె - "వడ్లు దంచీ దంచీ దంచీ వడలెల్ల నొప్పులు పుట్టె
   కన్నవాళ్ళ కడుపట్లా కాల - ఈడుగాని జోడెట్ల ఇచ్చిరి?"
   అతడు - ఏమిటీ? ఏమంటున్నావ్? (అని కసిరితే)
   ఆమె - "నిన్న గాదూ నీలాటి సామీ - నా వాళ్ళ నేననుకున్నా"
   (ఏదో నాకు గుర్తున్నది ఇది...)

   తొలగించండి
 22. నాకొచ్చిన ఊహని ఇక్కడ పంచుకుంటున్నాను.

  బాబు వస్తే ప్రతి ఇంటికి ఒక జాబు వస్తుందని,
  బాబు రాజ్యంలో తెలుగు వెలుగుతుందని,
  బాబు పాలనలో సామాజిక న్యాయం పరిఢవిల్లుతుందని,
  కలలుకన్న వారికన్న ఖలులు గలరె.....

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భవానీ ప్రసాద్ గారూ,
   మీ భావానికి నా పద్యరూపం....

   బాబు వచ్చిన ప్రతివారి కుద్యోగంబు
   వచ్చు, తెలుగు వెలుగవచ్చు, పాల
   నమున వెల్లివిరియు న్యాయమని కలలు
   కన్నవారి కన్న ఖలులు గలరె.

   తొలగించండి
  2. ఇంకొక ఆలోచనని కూడా పంచుకుంటున్నాను.

   చచ్చువరకు తలిదండ్రుల మాట జవదాటని,
   పెండ్లిన కట్నకానుకల వరద మునిగిన కొడుకును....
   కూతురి మనసెరిగి మసలుకొను,
   కట్నమించుక కోరని అల్లుడును....
   అత్తమామల పంజరంలో బందీ కాకూడని,
   మెట్టినింట సదా పుట్టినింటి వారి డాబులాడు కూతురును....
   అత్తమామల అంతఃపురమున సేవచేయుటె పరమార్ధమని నమ్మి,
   పెళ్ళయిన తక్షణం పుట్టింటివారితో తెగతెంపులు చేసుకొనగల కోడలును....
   కోరుకున్న కన్న వారికన్న ఖలులు గలరె?   తొలగించండి
  3. భవానీ ప్రసాద్ గారూ,
   ఈ బ్లాగులో కేవలం ఛందోబద్ధమైన పద్యాలనే పోస్ట్ చేయాలి. మీ భావాలను నా మెయిల్ (shankarkandi@gmail.com)పంపిస్తే అవకాశాన్ని బట్టి ఆ భావాలకు పద్యరూపాలనిచ్చి ఇక్కడ ప్రకటిస్తాను.

   తొలగించండి
 23. పరుగు లిడుచు నెపుడు పరకాంతల కొరకు
  పరుల సొత్తు దోచ ప్రాకులాడు
  దుష్ట జనుల నుండి శిష్ఠుల బ్రోవు;వెం
  కన్న ! వారి కన్న ఖలులు లేరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   సంబోధనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 24. విద్య కున్న మేటి విలువ నెరుంగక బడికి పంప కుండ పనికి పంపి బాల బాలిక లకు భవితనే చెరచెడి కన్న వారి కన్న ఖలులు లేరు

  రిప్లయితొలగించండి
 25. డా.ఎన్.వి.ఎన్.చారి
  కన్నుమిన్ను గానకుండ కఱచు కాల మహిమనున్
  తన్నుకొచ్చె ప్రేమ యంచు తనువు తనువు లొక్కటై
  వెన్న వంటి శిశువు బుట్ట పెంట బుట్ట పాలవన్
  కన్నవారి కన్న ఖలులు గలరెవెదికి చూచినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తన్నుకొని వచ్చె'ను 'తన్నుకొచ్చె' అన్నారు. "తన్నుకొనుచు వచ్చు ప్రేమ తనువు లొకటి జేయగా" అనండి.

   తొలగించండి
 26. పుంశిశువుయె కాదు పుట్ట బోవు నదని
  ముందు గానె నెరిగి మందు లగుచు
  నెదగ నీయ కుండ చిదిమి వేయగ నెంచు
  కన్న వారి కన్న ఖలులు లేరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "..గానె యెరిగి" అనండి.

   తొలగించండి
 27. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య 2561
  *కన్నవారి కన్న ఖలులు గలరె వెదకి చూచినన్ ?*

  సందర్భం :: హిరణ్యకశ్యపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని ఏమీ చేయలేక ఓరీ! అందరినీ గెలిచిన నేను నిన్ను గెలువలేకపోతున్నాను. ఇలా జరగడానికి ఏమిటి కారణం అని ప్రశ్నింపగా ప్రహ్లాదుడు ఓ తండ్రీ !

  లోకములన్నియున్ గడియలోన జయించిన వాడ , *వింద్రియా*
  *నీకముఁ జిత్తమున్ గెలువ నేరవు! నిన్ను నిబద్ధుఁ జేయు నీ*
  *భీకర శత్రు లార్వురఁ ప్రభిన్నులఁ జేసినఁ* బ్రాణికోటిలో
  నీకు విరోధి లేఁడొకడు, నేర్పున జూడుము దానవేశ్వరా !
  అని అంటాడు.
  అలా జ్ఞానమును బోధించగల కుమారుడైన ప్రహ్లాదుని
  తండ్రి హింసపెట్టినాడంటే
  వెదకి చూచినా సరే అలాంటి కన్నవారి కంటే ఖలులు ఎక్కడైనా ఉంటారా? అని భావించే సందర్భం.

  ఛందస్సు :: ఉత్సాహ వృత్తము

  మున్ను కామ క్రోధ లోభ మోహ మద విమత్సరా
  లన్ని యింద్రియాలు చిత్త , మరులటంచు బలికి , తా
  నెన్ని హరిని దలచు సుతుని , హింసబెట్టు వారలౌ
  *కన్న వారి కన్న ఖలులు గలరె వెదకి చూచినన్ ?*
  కోట రాజశేఖర్ నెల్లూరు. (03.01.2018)

  రిప్లయితొలగించండి

 28. నీచ నరకు కన్న కీచకాధముకన్న
  చెడ్డపనులు జేయ జేరి భువిని
  దుస్ససేనుకన్న దుర్మార్గ రారాజు
  కన్న,| వారి కన్న ఖలులు గలరె?

  రిప్లయితొలగించండి
 29. అన్యకులజుడైన నబ్బాయి బ్రేమింప
  పరువు పోవుననెడు భ్రమనుగొనుచు
  కన్నబిడ్డనకట! కడతేర్చసిద్ధమౌ
  కన్నవారికన్న ఖలులుగలరె?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. కలియుగమ్మునందు కాసులేయూసులు
   కాంతలన్న మిగుల కామితంబు
   ధర్మమన్న వెగటు ధరణియందే బ్రతు
   కన్నవారి కన్న ఖలులు గలరె?

   ప్రహ్లాదుని భావన:

   రామ నామముగొని రమ్యమౌ రీతిని
   రాత్రిపగలు మరచి రక్తితోను
   భజనసేయు నెడల వ్యర్ధమయిన పలు
   కన్నవారి కన్న ఖలులుగలరె!

   తొలగించండి
  2. సీతాదేవి గారూ,
   మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ప్రహ్లాదుడు రామనామాన్ని గొనడం? అప్పటికి రాము డవతరించలేదు కదా?

   తొలగించండి
  3. వందనములు గురువర్యా! నా మాటగానే వ్రాద్దామనుకొన్నాను,కాని అందరూ రామభక్తులు కారుగదా,వ్యతిరేకిస్తారేమోనని ప్రహ్లాదుడనేశాను!అంతదూర మాలోచించలేదు!

   తొలగించండి
 30. చిన్ననాట నుండి చేసిన చౌర్యమున్
  మెచ్చి వెన్ను తట్టి మేలనంగ
  పెరిగి దొంగ యయ్యి బిడ్డ జైలును చేర
  "కన్నవారి కన్న ఖలులు గలరె"

  రిప్లయితొలగించండి
 31. మరొక పూరణ ..
  చదువ వెళ్ళనంచు జావడమునుఁ జూప
  బడికి గారబమున పంపకున్న
  బిడ్డ పెఱిగి చూడ భిక్షువాయె బ్రతుక
  "కన్నవారి కన్న ఖలులు గలరె"

  జావడము = పిరికితనము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విశ్వనాథ శర్మ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. క్షమించాలి శర్మగారూ! చిన్న అక్షరాలలో నాకంటికి జూపడము వలె కన్పించగా ప్రశ్నించితిని!నాకది క్రొత్తపదము!
   సందేహ నివృత్తిజేసిన శాస్త్రిగారికి ధన్యవాదములు!

   తొలగించండి
  3. శంకరయ్య గారికి 🙏 వందనములు.ధన్యవాదములు.
   సీతాదేవిగారికి నమస్కారములు.

   తొలగించండి
 32. అన్న! యెన్నఁ బుడమి నందు నసుర కృత్య
  కారకు లిరువురును దుష్ట కార్య తతుల
  వెలయు శిశుపాల దంతవక్త్రులను గనుమ
  కన్న! వారి కన్న ఖలులు గలరె వెదక

  [కన్న = కృష్ణ]


  తిన్నఁదనము లేని జనులఁ దీవ్ర వాద చరితుల
  న్నన్నుల విలపించు వారి నన్య విత్త చోరుల
  న్నన్న మవని పాలు సేయు నవగుణ రత దుష్టులం
  గన్నవారి కన్న ఖలులు గలరె వెదకి చూచినన్

  [కన్న వారు = చూచు వారు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
  3. అయ్యా! కామేశ్వర రావుగారూ:

   నిన్నటి మీ సుందరకాండ పద్యములోని "జాల వృత" పై శ్యామలరావు గారు అభ్యంతరం తెలిపియున్నారు. తదుపరి కొంత తర్జన భర్జన జరిగినది. మీరు స్పందించినచో బాగుండును. లేనిచో ఆ చర్చ అర్ధాంతరంగా బ్లాగులో ఉండిపోగలదు.

   నమస్సులు!!!

   తొలగించండి


  4. జాలవృతమ్మందుర! హ
   న్నా!లబ్జుగ లేదనిరి మన గురువు లకటా!
   చాల దినమ్ములు గడిచెన్
   బాలా! తర్జనల జూచి భర్జన వేగున్ ?

   నారాయణ

   జిలేబి

   తొలగించండి
  5. అమ్మా జిలేబీ గారూ,
   ఈ 'కెలుకుడు'ను ఇతర బ్లాగులలో ప్రయోగించండి తల్లీ! వివాదాల కతీతంగా ఏదో నా మానాన నేను బ్లాగును నడుపుకుంటున్నాను. శంకరాభరణాన్ని దయచేసి మినహాయించండి.

   తొలగించండి
  6. మిత్రులు శంకరయ్యగారు, వివాదం ఏమీ లేదండి.ఈ జిలేబీగారు ఎగదోద్దామని గడబిడ చేసినా ఏమీ లేదు. 'జాల' అన్నది విడిపదంగా ప్రయోగించటం గురించి తెలుసుకొని సంతోషించాను. ఈ విషయంలో ఇంక చర్చించవలసినది ఉందనుకోను. కామేశ్వరరావుగారూ, మీరు నొచ్చుకొని ఉంటే నన్ను మన్నించ గోరుతాను. ప్రత్యేకంగా ఇంకా మీరు ఏదో వివరణ ఇవ్వాలని అనుకోవటం లేదు. అవసరం లేదుకదా, సందేహం తీరాక!

   తొలగించండి
  7. గురువు గారికి మఱియు నందఱికి వందనములు. ఇప్పుడే చూచితిని. శ్యామలరావు గారు వందనములు. దోషము లేమైనా యున్న సవరించుట కొఱకే ప్రచురించు చున్నాను. నొచ్చుకునే ప్రశ్నముత్పన్నము కాదు. ధన్యవాదములు.

   తొలగించండి
 33. వట్టి పశువు వోలె పరకాంతలను జూచి
  తనను పెంచి నమ్మ తలపు మరచి
  కీచకుని వలె కడు నీచ కామము తోడ
  కన్నవారి కన్న ఖలులు గలరె.

  రిప్లయితొలగించండి
 34. కొలుచు వేల్పులైన గొప్పవారలు గాదు
  కన్నవారికన్న, ఖలులు గలరె
  జన్మమిచ్చినట్టి జనని జనకులను
  సుంత నైన గనని సంతు కన్న!!!

  రిప్లయితొలగించండి
 35. చిన్ననాటి నుండి సత్సంప్రదాయము
  నెన్నగాను నేర్పి మన్నుమనగ
  బ్రతుకుకు వెలుగిచ్చు బాటజాపించెడి
  కన్నవారికన్న ఖలులు గలరె!

  ఖలుడు = సూర్యుడు (ఆంధ్రభారతి)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
  2. సవరిస్తానండీ!ధన్యవాదములు!

   తొలగించండి
  3. చిన్ననాటినుండి శీలసద్గుణముల
   నెన్నగాను నేర్పి మన్నుమనగ
   బ్రతుకుకు వెలుగిచ్చు బాటజూపించెడు
   కన్నవారికన్న ఖలులు గలరె!
   తొలగించండి
  4. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 36. వెన్ను డనెను రాయబార వేళ విను సుయోధనా
  పన్నుగాను పాండవులకు పల్లె లైదు చాలు నే
  నన్న మాట నీకు సఖుల కాయె కాని దెన్న నీ
  కన్న వారి కన్న ఖలులు గలరె వెదకి చూచినన్.

  రిప్లయితొలగించండి
 37. ఎంతయాస్తియున్ననెన్ని సంపదలున్న
  హద్దునదుపులేని యాశతోడ
  పేదవారికిచ్చు బియ్యమ్ము కూడ మా
  కన్నవారి కన్న ఖలులు గలరె (మాకు+అన్న)

  రిప్లయితొలగించండి
 38. చదువు కున్న పిల్ల చక్కని రూపమ్ము
  కోడలై గృహమునఁ గూడినపుడు
  కట్నకానుకలను కాంక్షించు, పుత్రుల
  కన్నవారి కన్న ఖలులు గలరె

  రిప్లయితొలగించండి
 39. ఉన్నయాస్తు లమ్మిబిడ్డ నున్నతమగు మనసుతో
  మిన్నగ చదివించి, పంప మేలుకోరి వధువుగా
  కన్నకొడకు కోసమైన ఖర్చులన్నికోరు ఆ
  కన్నవారి కన్న ఖలులు గలరె వెదకి చూచినన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 40. వేరుదైవమిలనువెదకిజూడగలరె
  కన్నవారికన్న.ఖలులుగలరె
  రావణాసురువలెరహిచెడిమెలగుచు
  నన్యకాంతలనపహరించెడి

  రిప్లయితొలగించండి
 41. కన్నవారికన్నఖలులుగలరెవెదకిజూచిన
  న్నెంతయెచటవెదకిజూడనెంతమాత్రమున్ఖలు
  ల్గాదుభువినినిజముస్వామి!కన్నవారుపూజ్యులే
  యాదిదంపతులకుసాటియగుదురుగదవారలే

  రిప్లయితొలగించండి
 42. కన్నవారికన్న ఖలులు గలరె వెదకి చూచినన్!
  **************************************
  సందర్భం:శాశ్వతసుఖం కలుగాలంటే
  యెన్నటికైనా యింద్రియాలను గెలువాల్సిందే!
  ==============================

  ఎన్నడైన నింద్రియముల
  నిల గెలిచిన వారికే
  యున్నది నిజమైన సౌఖ్య
  ముర్విని యని తెలుపరే!
  ఉన్నతమగు సంప్రదాయ
  మున్నది యని తెలుపరే!
  కన్నవారికన్న ఖలులు
  గలరె వెదకి చూచినన్!

  ✒~ డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి 43. ఎవరు గలరు దెల్పుమవనిలో దేవతల్

  కన్నవారికన్న..ఖలులు గలరె

  స్వార్థభావమూని  పనులు చేయించుచు

  పిల్లపాపలకును విద్యనేర్పని వారు?


  ఆడపిల్ల బాగ యార్జించు చున్నచో

  యార్జనమ్ము పైన యాశ తోడ

  పెండ్లి చేయకుండ పేచీలు పెట్టెడి

  కన్నవారికన్న..ఖలులు గలరె

  రిప్లయితొలగించండి
 44. అన్నదాత ఆశ లన్ని యావిరైన నిత్యమున్
  మన్నుమిన్నునమ్ముకున్నమనిషి రైతు సేవలన్
  సన్నుతించ నట్టి వార్ని, సాయ పడిని వారలన్
  కన్నవారికన్న ఖలులు గలరె వెదకి చూచినన్

  రిప్లయితొలగించండి
 45. తత్త్వ బోధ లేదు దాన ధర్మము నాస్తి
  ఫరుల సేవ జేయు వారు లేరు
  స్వార్థ చింతనంబు లపకార వాంచ, వెం
  కన్న! వారి కన్న ఖలులు గలరె ?

  రిప్లయితొలగించండి
 46. ప్రణయజలధినందు ప్రవహించు యువతకు
  అడ్డుచెప్పుచుండు గడ్డుమనసు
  ఆదిమధ్యాంతపు టాలోచనేలేని
  కన్నవారికన్న ఖలులుగలరె..

  రిప్లయితొలగించండి