8, జనవరి 2018, సోమవారం

సమస్య - 2566 (దుఃఖ మెఱిఁగినవానికే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు"
(లేదా...)
"దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ప్రమోద్ కుమార్ గారు ఇచ్చిన సమస్య)

119 కామెంట్‌లు:

 1. ఎచటినుండి దీరాకయు నెచటి పోక?
  నాల్గు దినముల బ్రతుకిది నవ్వి పోవు;
  నిశ్చయ మరణము దెలిసి నిజవియోగ
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు

  శ్మశాన వైరాగ్యము :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నిజ వియోగదుఃఖము! అద్భుతమైన ప్రయోగము!

   తొలగించండి
  2. శాస్త్రి గారు నిజముగ నాణిముత్యము వేదాంత సారము మీ పూరణ. అభినందనలు. నమస్సులు

   తొలగించండి
  3. అలవాటు లేకుండా తెల్లవారు ఝామున లేచిన వైరాగ్యమే సార్! ఏదో ఒక కిట్టింపు!

   ఈపాటి చిన్న చిన్న పద్యాలు వ్రాయగలడంలో నాకు మీరు పెట్టిన భిక్ష చాలా ఉన్నదిగదా!

   నమస్సులు!

   తొలగించండి


  4. అలవాటులేక తెలవా
   రి లేచి కిట్టించినాను రివ్వున సారూ :)
   భళి వేదాంతంబుల ప
   ద్య లాహిరన్నారు గాద ధన్యుడనైతిన్ !

   జిలేబి

   తొలగించండి
  5. చూశావా బ్రహ్మముహూర్తబలము! అభినందనలు!!

   తొలగించండి
  6. (పింఛను తప్ప) అన్నీ విడిచిన బాపడికి అన్నియును బ్రహ్మాండ ముహుర్తాలే!

   నమస్సులు!

   తొలగించండి


  7. అన్నీ విడిచిన పారుని
   కన్నియు బ్రాహ్మీముహూర్త కాలము లమ్మా !
   సన్నిధి కందివరు సభ
   క్రన్నగ నేర్పెను ప్రభాక రన్నకు సీతా!

   జిలేబి

   తొలగించండి
  8. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదాన్ని "ఎచటినుండి యీరాకయు నెటకు పోక?" అంటే బాగుంటుందని నా సూచన.
   ****************
   జిలేబీ గారూ,
   ఇంతకాలంగా మీరు స్త్రీ అనుకుంటున్నాను. మరి ఈ పద్యంలో "ధన్యుడనైతిన్" అన్నారు? ఒకవేళ మీరు స్త్రీలే గనుక అయితే "ధన్యతఁ గంటిన్" అనవచ్చు.

   తొలగించండి


  9. ఆ పద్యమ్ జీపీయెస్ వారన్నట్టుగా నండి !


   జిలేబి

   తొలగించండి


 2. అదియును నిదియు సరిజోదయ! అది‌వున్న
  చోటు నిదియుండు నిదియున్న చో నదియును
  తప్పదయ! వినుమ జిలేబి తరుణి పల్కు
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శంకరాభరణ సమస్య వంక తోను
   బ్రహ్మముహురుతమున లేచి పళ్ళు తోమి
   కాఫి త్రాగుచునుండెడి కష్ట మందు
   దుఃఖ మెఱిఁగిన వారికే తుష్టి కలుగు :)

   తొలగించండి
  2. కాఫీ కృత పరిణయం :)


   http://gpsastry.blogspot.in/2016/06/blog-post_18.html?m=0

   తొలగించండి


  3. "శుక్లాంబరధరం విష్ణుం" ని ఇంతగా మధించేసారన్న మాట :)

   జిలేబి

   తొలగించండి


  4. కాఫీ కృతపరిణయమిది
   తోఫాయై వచ్చెనమ్మ తోడుగ సుదతీ !
   సాఫీ గా కుల్ఫీవలె
   మా ఫాండము జీవనమ్ము మధురము బడసెన్ !


   జిలేబి

   తొలగించండి
  5. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'వున్న' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'అది యున్న' అనవచ్చు.
   'జిలేబీ తరుణి' అన్నారు కనుక మీరు స్త్రీలే అన్న విషయం స్పష్టమయింది.
   *****************
   ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆత్మాశ్రయమైన పూరణ బాగున్నది. అభినందనలు.
   'ముహురుతము' అన్న శబ్దం లేదు. "బమ్మ మూరుతమున లేచి" అనండి.
   మీ కాఫీ పురాణం చదివాను. ఇంగ్లీషు వాడడం ఇష్టం లేకున్నా అనక తప్పడం లేదు... "హాట్స్ ఆఫ్!"

   తొలగించండి
  6. కంది శంకరయ్య has left a new comment on your post "కాఫీ కృత పరిణయం":

   "మీలో మంచి కథకుడు ఉన్నాడు. మంచి భాష, చక్కని వాక్య నిర్మాణ నైపుణ్యంతో పాటు హాస్యప్రవృత్తి కూడా ఎక్కువే. మీరు తలచుకుంటే మంచి హాస్యరచయిత అవుతారు. ఒక కాలు ఆ పడవలోనూ పెట్టి చూడండి!"

   ********************

   అయ్యా! స్వామీ!

   మీ శంకరాభరణ జాలములో బందీనై ఊపిరి పీల్చుకోడానికి కూడా తీరిక లేదు గత సంవత్సరమునుండీ. ప్రస్తుతం సమస్య నంబరు # 1529 నడుస్తోంది. కంద పాద సమస్యలు మాత్రమే. ఇంకొక రెండు సంవత్సరాలు ఇంతే సంగతులు (ఏమి ఆశ!!!).

   🙏🙏🙏

   తొలగించండి


  7. కందపు కట్టడముల భళి
   యందము గా గట్టినారు యబ్బుర మనగన్ !
   డెందంబరయన్ హాస్యము
   లందించుడు కథ లగట్టి లబ్జుగ మేలున్ :)

   జిలేబి

   తొలగించండి
 3. పవలు రేయియు కష్టించు బడుగువారి
  రాలు రప్పలు దున్నెడి రైతుజనుల
  గనుల బనిచేసి మండెడి కనులవారి
  దుఖ్ఖ. మెరిగిన వానికే తుష్టి కలుగు .

  రిప్లయితొలగించండి
 4. ప్రీతి యంచును తీపినే విడువకుండ
  నారగించిన వేళనే యన్యరుచుల
  విలువ తెలిసిన చందమ్ము విశ్వమందు
  దుఃఖ మెరిగిన వానికే తుష్టి కలుగు

  రిప్లయితొలగించండి


 5. దుఃఖము సౌఖ్యమెల్ల యిల దొర్లు జిలేబియ చక్రమైగనన్
  దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్
  దుఃఖితు లెల్ల రున్ మదిని దుర్భర మై వెలయంగ వారికిన్
  దుఃఖము తీర గాధ లను తోచిన రీతిని చెప్పి గావలెన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "సౌఖ్యమెల్ల నిల..." అనండి. "చెప్పగా వలెన్/ చెప్పి కాచుమా" అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 6. ।పరుల కష్టాలు తనవి గా పరిగణించి
  చేత నైనట్టి సాయం బు జేయ జెల్లు
  దుఃఖ మెరి గి న వానికే ;తు ష్ టి కలుగు
  మాధవు ని సేవ యని యెంచు మను జ త తి కి

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  ధర్మకార్యమ్ములొనరింప దండుగ యని
  తల్లిదండ్రుల సేవ వృథా యటంచు
  నన్ని ధనమూలమని యెంచి యంత్యమందు
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు ?!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అర్థానామార్జనే దుఃఖమ్
   ఆర్జితానాం చ రక్షణే ।
   ఆయే దుఃఖం వ్యయే దుఃఖం
   ధిగర్థం దుఃఖభాజనమ్ ।।

   దుఃఖము విత్తసంచయము దుఃఖమగున్ ధనరక్షణమ్మిలన్
   దుఃఖము వచ్చుటందు , కడు దుఃఖము పోయినవేళ , సర్వమున్
   దుఃఖము నార్థికమ్మనుచు దూరవివేచన జేసి తృప్తుడై
   దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్"


   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి


  2. అదురహో మైలవరపు వారు !


   జిలేబి

   తొలగించండి
  3. ధన్యవాదాలండీ.. జిలేబి 🙏గారికి.. మీకు కూడా... 🙏

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  4. ప్రహ్లాదుడు... తండ్రి తో

   దుఃఖము గాదు నాకు నను ద్రోసిన సాగరమందు నగ్నులన్ ,
   దుఃఖము గాదు నన్ను కరి ద్రొక్కిన పాములు కాటువేసినన్
   దుఃఖము గాదు, తండ్రి ! విను ! తోయజనాభు వియోగ మొక్కటే
   దుఃఖమెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్"

   ( దుఃఖము., ఎఱుంగువానికె అని అన్వయం.)

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  5. అద్భుతమైన పూరణలు మురళీకృష్ణగారూ!!
   నమోనమః!!

   తొలగించండి
  6. ధన్యవాదాలు.. శ్రీమతి సీతాదేవి గారికి... మీకూనూ 🙏

   మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  7. మురళీకృష్ణ గారూ,
   మీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 8. మేఖల మైవిచారములుమేదినిమర్త్యుల చుట్టుముట్టుచున్
  శృంఖల బంధమందు గత శాపములంటెడు కర్మలందునన్
  వైఖరి జూడగా సరిగ వాంఛలు తీరక కర్మయోగియై
  దుఃఖ మెఱుంగువానికె యధోచిత తుష్టి కలుంగు నెయ్యెడున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చేపూరి వారూ,
   మీ ప్రయత్నం ప్రశసార్హమే. కాని ప్రాస తప్పింది. మరో ప్రయత్నం చేయండి!

   తొలగించండి
 9. శతావధాని శ్రీ జి. యం. రామశర్మ గారి పూరణ....

  పాండుపుత్రులు కానల బాధలంది
  దివ్య యోగీంద్ర దర్శన దీప్తులైరి
  హరిని సత్ప్రేమ లహరిని స్మరణఁ జేయ
  దు:ఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు.

  రిప్లయితొలగించండి
 10. అందరికీ శుభోదయం! గురుదేవులకు నమస్సులు!

  Refreshment after toil and ease after pain!

  ఆకలెరిగిన వానికే యన్నహితవు
  కాలువిరిగిన వానికే కట్టుసుఖము
  నిదురరాని వాడుదెలియు నిదుర విలువ
  దుఃఖమెరిగిన వానికే తుష్టికలుగు

  మనిషి గోరుదానెపుడును మార్పునరయ
  మంచిచెడులు వచ్చునుగాదె మరలమరల
  షడ్రుచుల భోజనమ్మెగా సౌఖ్యమొసగు
  దుఃఖమెరిగిన వారికే తుష్టికలుగు


  రిప్లయితొలగించండి

 11. బాల్యమందు బీదతనము బాధలిడిన

  పట్టువదలక మరి చదువగ,తదుపరి

  వృద్ధి జెందుచు సుఖపు జీవితము గడుపు

  దుఃఖ మెరిగిన వానికే తుష్టి కలుగు

  🌿🌿 🌿ఆకుల శాంతి భూషణ్ 🌺
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 12. ఎచట గలదు సంతోషమ్ము, నెచట గలదు
  నిర్మలమగు యానందమ్ము, నిశ్చయంబు
  జేసుకొనుచు మాధవ సేవ జేయ పరుల
  "దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "ఎచ్చట గలదు సంతోష మెచట గలదు" అనండి. బాగుంటుంది.

   తొలగించండి
 13. ఎడతెగని సఖములు మన కెన్నడైన
  వెగటు కలిగించు నేగాని విందులౌనె?
  అరయ కష్టాలు కసరత్తు లవని లోన
  రహిని గలిగించు మనుజుల రాటు దేల్చి
  తెలియ జేయును చేదుయే తీపి విలువ
  శ్రమయె విశద పరచును విశ్రాంతి విలువ
  కలదు కష్టార్జ నలలోనె కలదు సుఖము
  కనగ దేవుడిచ్చు వరము కష్టమౌను
  "కస్య సౌఖ్యం నిరంతరం?"- కాదె నిజము?
  దుఃఖ మెరిగిన వానికే తుష్టి కలుగు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జనార్దన రావు గారూ,
   చక్కని పూరణ. అభినందనలు.
   'చేదు+ఏ' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "తెలియ జేయును గద చేదు తీపి విలువ" అందామా?

   తొలగించండి
 14. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  . సమస్యాపూరణ :: నేటి సమస్య (సంఖ్య-2566)
  సమస్య :: *దుఃఖ మెఱుంగు వానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్.*
  సందర్భము ::
  . సుఖ స్యానన్తరం దుఃఖమ్ ,
  . దుఃఖ స్యానన్తరం సుఖమ్ ।
  . చక్రవ త్పరివర్తన్తే ,
  . దుఃఖాని చ సుఖాని చ ।।

  అని వ్యాస భారతంలోని శాన్తి పర్వంలో చెప్పబడి ఉన్నది. చక్రంలోని ఆకుల వలె సుఖము దుఃఖము అనేవి ఒకదాని తరువాత మరొకటి మనకు సంప్రాప్తమౌతూ ఉంటాయి అని అర్థం చేసికొని , దుఃఖమును అనుభవించిన వానికే తగినవిధంగా సుఖము కలుగుతుంది అని చెప్పే సందర్భం.

  దుఃఖము గల్గినన్ బిదప తుష్టియు గల్గును ; తుష్టి గల్గినన్
  దుఃఖము గల్గెడిన్ బిదప ; తోచును చక్రము లోని యాకులై ;
  దుఃఖము తుష్టి ప్రాప్తమగు ధోరణి నర్థము జేసికొన్నచో ,
  *దుఃఖ మెఱుంగు వానికె , యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్.*
  *కోట రాజశేఖర్ నెల్లూరు.* (8.1.2018)

  రిప్లయితొలగించండి
 15. లౌకికస్థానవస్త్వనురక్తిచేత
  సుఖము లేశంబు కలుగదు; శుద్ధబుద్ధిఁ
  సాధువైరాగ్యమెంచుచు జననమరణ
  దుఃఖమెరిగిన వానికే తుష్టికలుగు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లలిత్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'బుద్ధి' తరువాత అర్ధానుస్వారం అవసరం లేదు.

   తొలగించండి
 16. ప్రవచనమ్ములు భాషించు భాగవతుల
  దివ్య వాక్కుల సారమ్ము తెలిసికొంటి
  సత్యమెఱుగ తాపత్రయ జనితమైన
  దుఃఖమెఱిగిన వానికే తుష్టి గలుగు

  రిప్లయితొలగించండి
 17. ఈ:ఖను ప్రాసనందిడుట నెంచగ కష్టము గాదె చూడ చే
  త:ఖలుడైనవానికిని ధైర్య విహీనుల బీదవారికిన్
  దు:ఖితులైన వారలకు తోడయి యన్యుల రక్షణార్థమై
  దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్.

  రిప్లయితొలగించండి


 18. ఈ దుఃఖమన్నపదము మరీ దుష్టుగా వుంది ! ఆ పదం తో తప్ప మరే పదం తోనూ వృత్త పాదాన్ని మొదలెట్ట లేము లాగుందే ?


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహృదయులు జిలేబి గారికి ప్రణామాలు. కష్టమైన ప్రాసను ఇష్టంగా అవధాన విద్యా గురువర్యులు శ్రీ నరాల రామారెడ్డి గారు 1972 లో తన అవధానంలో పూరించారండీ. ఆ పద్యాన్ని ఈ రోజు మన బ్లాగులో సాయంకాలం 6.11 కి ఉంచినాను. చూడగలరు. కోట రాజశేఖర్ నెల్లూరు.

   తొలగించండి

  2. గౌరవనీయులైన రాజశేఖరుల వారికి

   చాలా బాగున్నదండీ ! అద్భుతః !

   సఃఖచితమ్ముగ అని ప్రారంభిద్దా మనుకున్నా
   మొదటి ఆ పై యేమి రాయాలో తెలియక తెల్లమొగం పెట్టేసుకున్నా :) తెల్లారి


   జిలేబి

   తొలగించండి
 19. ఆహా! ఈ రోజు బ్లాగు వేదాంత వాక్యాలతో గుబాళిస్తున్నది!!🙏🙏🙏🙏

  రిప్లయితొలగించండి
 20. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


  దుఃఖ మెరుంగు వానికె యధోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్

  దుఃఖము లేకయున్న పరితోషము విల్వ నెరుంగ లే మికన్

  దఃఖమె జీవితాన " సుఖ తోయధి తీరము " జేర్చు నౌక యౌ

  దుఃఖ మతిక్రమించి నలుడున్ రఘురాముడు నైరిగా ఘనుల్

  దుఃఖ మహోగ్ర కాననము ద్రుంచుము ధైర్య దవానలంబుచే

  దుఃఖము గల్గ జేయకుము తోడ వసించెడు వారి కెన్నడున్

  రిప్లయితొలగించండి
 21. దుఃఖము కల్గినన్ పరుల దుస్థితికిన్ చలియింప లేమిచే
  దుఃఖము పొంగినన్ గురుని త్రోవను తప్పి చరించి నందునన్
  దుఃఖము ముంచినన్ మదికి తోచమి యీశుని దివ్య నామ మా
  దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్.

  రిప్లయితొలగించండి
 22. కష్టములనుభవించిన గాని సుఖము
  విలువ నెరుగుట సాధ్యమే ?విశ్వమందు
  కడుపు మాడిన తెలియును కబళమురుచి
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి గలుగు!!!

  రిప్లయితొలగించండి
 23. ధనము లందుఁ దృప్తిఁ గొనండు తనివి తీర
  దెన్నఁడును భోగములఁ గృత హితమె తృప్తి
  తనదు సుఖములే కాక యిద్దరణిఁ బరుల
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు


  నిఃఖలతా మనో రుచిర నిర్వ్యసన ద్యుతి వెల్గు వానికిన్
  దోఃఖరమండలాగ్ర రిపు దుస్సహ వీర వరేణ్యులందుఁ బ్రా
  తః ఖురలీ విలాస వసుధాపతు లందుఁ దలంచగం బ్రజా
  దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్

  [నిఃఖలత =దౌష్ట్యము లేమి; ఖురలి = సైనికుల సాము ]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీయుతులు కామేశ్వరరావు గారికి నమస్సులు
   మీ పూరణ అత్యద్భుతము

   తొలగించండి

  2. వావ్ ! దుఃఖము తో కాని పూరణ ! అద్భుతమండీ పోచిరాజు వారు


   జిలేబి

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ,
   సమస్యలను పూరించే విధానం మిమ్మల్ని చూచి నేర్చుకోవాలి. ఔత్సాహిక కవులు ఎందరు మీ పూరణలను చూసి నేర్చుకుంటున్నారో?
   మీ పూరణలు అత్యద్భుతంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. ధన్యోస్మి.
   శ్రీ హర్ష శ్రీ గారు నమస్సులు, ధన్యవాదములు.
   జిలేబి గారు నమస్సులు ధన్యవాదములు.

   తొలగించండి
  5. పోచిరాజు కామేశ్వరరావు గారు అధ్భుత నాపుారణ సార్.అభివందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏తురిమెళ్ల రాధాకృష్ణముార్తి 9966319792🌻🌻🌻🌻🌻

   తొలగించండి
  6. శాస్త్రి గారు శ్రమ తీసుకొని వారి యభినందనలు తెల్పిన మీకు శ్రీయుతులు రాధా కృష్ణమూర్తిగారికి నమస్సులు ధన్యవాదములు.

   తొలగించండి
  7. 🙏🏻🙏🏻🙏🏻👌👌👌

   ...చంద్రమౌళి సూర్య నారాయణ

   తొలగించండి
  8. కామేశ్వరరావులకు కృతజ్నతలతో..
   ఉ.మాటలురావురావుమరిమాయలమారులుకారయమీరలున్
   ధీటుగపద్యమున్నుడివిదివ్యపుదుష్కరప్రాసతోడుతన్
   తేటగచెప్పినారలిటతీయనిశంకర బ్లాగునందునన్
   నీటుగసేతునయ్యమదినిత్తరిజోతలుపోచిరాజుకున్!
   .....అవధానులు పద్యానికి ధీటుగా కష్టమైన ప్రయాసతో చప్పున చెప్పిన పద్యము నామదినలరించినది.సంతోషముతో మీకీ చిట్టి పద్యము పరమాణువు తుల్యముగా గైకొన మనవి...

   ...వెలిదె ప్రసాదశర్మ ...

   తొలగించండి
  9. శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారికి, శ్రీ వెలిదె ప్రసాదశర్మగారికి, శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి కృతజ్ఞతా పూర్వక వందనములు.

   తొలగించండి
 24. రిప్లయిలు
  1. దుఃఖము లివ్విమూడుగన, దుర్జయముల్గద మానవాళికిన్
   దుఃఖము వ్యాధిచే,మరణ దుఃఖముచేత జరాభయంబు చే
   దుఃఖమవశ్యమంచు విధి తోడుత సాగెడువాడు ధన్యుడౌ!
   *దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్*

   తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

   తొలగించండి
  2. శ్రీహర్ష గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 25. ఆకలి రుచిగోరదు పట్టెడన్నమున్న
  నిద్ర సుఖముగోరదొకింత నేల చాలు
  మరణ మెరిగిన బ్రతుకంత మధుర మగును
  *దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు*

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
 26. దుఃఖమెరిగినవానికేతుష్టికలుగు
  సుఖముదుఃఖముల్ రెండునుసఖులుభువిని
  వరుసవెంబడివచ్చునుబ్రజలకవియ
  యనుభవించుకొలదినిసహ్యమగునుగద

  రిప్లయితొలగించండి
 27. దుఃఖమెరుంగువానికెయధోచితతుష్టికలుంగునెయ్యెడన్
  దుంఖముసౌఖ్యముల్లరయదోబుచులాడునునొక్కటొక్కటిన్
  దుంఖమునొందగాతుదినిదుష్టియుగల్గునుఖచ్చితంబుగాన్
  దుఃఖమెకారణంబగునుధూర్వహనాధునివేడుకుంటగన్

  రిప్లయితొలగించండి
 28. పెళ్లి జరిగియు పది యేండ్లు పిల్ల పాప
  లాట పాట లెరుగనట్టి యాలుమగల
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు
  దత్తుగొని పొందునట్టి సంతసము జూచి౹౹

  రిప్లయితొలగించండి
 29. సతము పరులను సేవించ సాధ్యమగును
  దు:ఖ మెరిగిన వానికే, తుష్టి కలుగు
  చేసినట్టి సహాయము శీఘ్రముగను
  ఫలితమొదవినచో నీకువలయమందు

  రిప్లయితొలగించండి
 30. వదలి వృద్ధాశ్రమంబున ముదిమి నందు
  తల్లి దండ్రుల , సుఖియించ దలచు వాడు
  తనను తమ సంతు వదలుచో తనకు గలుగు
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు

  నిన్నటి సమస్యకు నా పూరణ

  విద్యల రాణిని గొలువక
  చోద్యముగా భుక్తి కొఱకు క్షుద్రులు మెచ్చన్
  మద్యమునకు బానిసగుచు
  పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్

  రిప్లయితొలగించండి
 31. బాల ప్రహ్లాద శ్రీహరి భక్తి యందు
  కష్ట నష్టాలు గలిగినా ?యిష్టమైన
  తండ్రినెదురించు టందున తగిలి నట్టి
  దుఃఖ మెరిగిన వానికే తుషిటికలుగు

  రిప్లయితొలగించండి
 32. దుఃఖములేనిజీవితముదుర్లభమేరికి,భూతలమ్మునన్
  దుఃఖముగల్గువారలకెదోపుసుఖమ్ములమేటిభావముల్
  దుఃఖముసౌఖ్యమున్ బ్రదుకుత్రోవకుమార్గములైచెలంగగన్
  దుఃఖమెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్"

  రిప్లయితొలగించండి
 33. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


  దుఃఖ మెరుంగు వానికె యధోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్

  దుఃఖము లేకయున్న పరితోషము విల్వ నెరుంగ లే మికన్

  దఃఖమె జీవితాన " సుఖ తోయధి తీరము " జేర్చు నౌక యౌ

  దుఃఖ మతిక్రమించి నలుడున్ రఘురాముడు నైరిగా ఘనుల్

  దుఃఖ మహోగ్ర కాననము ద్రుంచుము ధైర్య దవానలంబుచే

  దుఃఖము గల్గ జేయకుము తోడ వసించెడు వారి కెన్నడున్

  రిప్లయితొలగించండి
 34. క్రొవ్విడి వెంకట రాజారావు:

  కష్టము లెసగొలిపెడి కక్కసము దెలియు
  దుఃఖ మెఱిగిన వానికే; తుష్టి కలుగు
  వెతల పరిభవములనన్ని బిగువు దోడ
  నభిగమించెడి వానికే ననవరతము

  రిప్లయితొలగించండి
 35. లేమికలిగినవేళ తా లెస్సగాను
  కలిమిరాకడసౌఖ్యమ్ముకలుగజేయు
  దుఃఖముండినసుఖముసంతోషమొసగు
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు  రిప్లయితొలగించండి
 36. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఒక్కొక్కరి పూరణలపై నేను వ్యాఖ్యను టైప్ చేసి "ప్రచురించు" అన్న ట్యాబును నొక్కిన తరువాత అది ప్రచురింపబడడానికి రెండు నిమిషాలనుండి ఐదు నిమిషాల సమయం తీసుకుంటున్నది. కారణం తెలియదు. ఈ సమస్య నా ఒక్కడికేనా? మీకు కూడానా?
  బ్లాగు స్పీడు పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మిత్రు లెవరైనా సలహాలు ఇస్తారా? అలాగే ఇప్పటి వరకు బ్లాగులో వేలకొద్ది సమస్యలు, వాటి పూరణలు ఉన్నాయి. వీటిని 'బ్యాకప్' చేసికొనవచ్చా? ఆ వివరాలను కూడా తెలియజేయ వలసిందిగా మనవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువర్యా ! నాకు 20 సెకన్ల సమయం పడుతున్నది.కారణం అంతర్జాలము యొక్క వేగము అని అనుకొంటున్నానండీ. కోట రాజశేఖర్.

   తొలగించండి


  2. ఇదేదో బ్లాగర్ వారి ప్రాబ్లెమ్ లాగుందండి !


   ౨ బ్లాగు మొత్తం డౌన్ లోడ్ ఎలా చేసుకోవాలో అన్నదానికి ఈ లింకు చూడండి కాని అందులో కామెంట్లు వస్తాయా అన్నది తెలియదు ( ఈ బ్లాగు వరకు కామెంట్లే ఎక్కువ మేటరున్నది :)


   https://support.google.com/blogger/answer/41387?hl=en


   May be భారారె గారేమైనా ఐడియా ఇవ్వొచ్చు


   @ భాస్కర రామి రెడ్డి గారు

   ఎనీ హెల్ప్ ?


   జిలేబి

   తొలగించండి


 37. పసితనాన పలురకాల బాధలంది
  నప్పటికిని విడువకుండ నవనియందు
  పట్టుదలతో పనులు చేయ బ్రతుకు పండు
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు.

  చావుపుట్టుక లన్నవి జగతి యందు
  శాశ్వితంబులు కావను సంగతెరిగి
  దైవమును నమ్మి నడుచుచు ధరణిని సుఖ
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు.

  రిప్లయితొలగించండి
 38. ఆర్యా!మా అభ్యర్ధన మన్నించి సమయం మార్పు చేసినందుకు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 39. *విసర్గను ముందు కలిగియున్న ‘’ఖ’’ ప్రాస* ఎంతో క్లిష్టమైనది. ఐనప్పటికినీ *అవధాన విద్యా గురువర్యులగు శ్రీ నరాల రామారెడ్డి గారు* తన 23 వ యేట నెల్లూరులో 1972 లో చేసిన అష్టావధానంలో *శ్రీ పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి గారు ఇచ్చిన క్లిష్టప్రాస గల సమస్యను* అద్భుతంగా పూరించారు. ఆ పద్యాన్ని ఈ సందర్భంలో అందరికీ తెలియజేయదలచినాను. గమనించ ప్రార్థన.
  సందర్భం :: రావణుడు రంభతో పలికిన సందర్భం.

  స్వః ఖర దేవనాథ కర వజ్రము ముక్కలు చేసినాడ , రో
  చిః ఖుర వాజి వల్గన విశీర్ణ దిగంతుడ , రావణుండ ; నం
  తః ఖల మన్మథాగ్ని , వనితా ! దహియించెను , కాదు పొమ్మనన్
  *దుఃఖము గాదె , చక్కటి వధూటి రతమ్ము విలాసి కోటికిన్.*
  (శ్రీ నరాల రామారెడ్డి గారు తన అవధానంలో చెప్పిన పద్యం)
  {సేకరణ :: కోట రాజశేఖర్ నెల్లూరు.}

  రిప్లయితొలగించండి
 40. బాధ మోదమ్ము లీ రెండు ప్రజల నెపుడు
  నీడవలెనంటు కొనియుండు నిజము సుమ్మి
  ఆపదలనున్న వారిని యాదు కొనుచు
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు"

  రిప్లయితొలగించండి
 41. *నిన్నటి పూరణ*

  వ్రాయఁ బోవు ఆంధ్రమహాభాగవతమును రాజునకు అంకితమిచ్చి వారొసంగు ధన కనక వస్తువాహనాలతో వైభవమునందమన్న శ్రీనాథునితో పోతనామాత్యుల వారు:

  ఉత్పలమాల
  విద్యనుఁ గూర్చి విష్ణుకథ వీనుల విందుగ రామచంద్రు నై
  వేద్యము జేసి, భారతికి వేదన బాపిదె, దైవచిత్తమున్ 
  ఖాద్యము నెంచి ద్రోసి ప్రభు కాన్కలఁ గోరి రచించి వారి పై
  పద్యము వ్రాయు వాఁడు చెడిపాతకమందును సత్కవీశ్వరా!

  రిప్లయితొలగించండి
 42. బడుగు వారలు పుడమిపై పడు నిడుములు,
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు
  వలయు సహకారమును తాను సలిపినపుడు
  కలుగు భవబంధపు విముక్తి కచ్చితముగ

  రిప్లయితొలగించండి
 43. కావ్యసౌరభవీచికల్ గ్రాంథికంబు
  శ్రవణపేయంబు శ్రోతకుఁ జేయనెంచు
  కవివరుఁడు దాను ముందుగన్ కావ్యజసుఖ
  "దుఃఖ మెఱిఁగిన, వానికే తుష్టి కలుగు"

  రిప్లయితొలగించండి
 44. తేటగీతి
  నాడు సత్యవ్రతమటంచు ఱేడొకండు
  ఆలుబిడ్డల నమ్మియు చాలదనుచు 
  కాటి కాపరాయె! భువిని మాట నిలుప 
  దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు!

  రిప్లయితొలగించండి
 45. ఉత్పలమాల
  దుఃఖము గాదె రాజ్యమును ద్రోయుట రాజుకు సత్యవాక్కుకై
  దుఃఖము గాదె యమ్ముకొన తోయలిఁ బుత్రుని, కోర తాళినే!
  దుఃఖమె కాటికాపరిగ దుర్భర వాసము! సత్యనిష్ఠకై
  దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్!

  రిప్లయితొలగించండి
 46. ....సమస్య
  దుఃఖ మెఱిగిన వానికే తుష్టి కలుగు
  **************************************
  సందర్భము: సులభము..
  ==============================

  దుఃఖపడు వేళ "దుఃఖమ్ము
  తొలగ సుఖమె"
  యనుచు సంతోషపడవలె-
  నవని సౌఖ్య
  మందు వేళ "సుఖము వోగ
  నవల శోక"
  మనుచు చింతిల్లగావలె -
  నదియు నిదియు
  ద్వంద్వములు - వీని దాటంగ
  వలయు - సుఖము
  దుఃఖ మెఱిగిన వానికే
  తుష్టి కలుగు

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

  రిప్లయితొలగించండి
 47. దుఃఖము వచ్చుగా వధువు తుష్టిగ తెల్పగ నమ్మ రాకనున్
  దుఃఖము వచ్చునత్తయయె దూరము జేయగ బీడి కల్లునున్
  దుఃఖము తాళజాలకిక త్రోలగనత్తను భార్యపొందునా
  దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్

  రిప్లయితొలగించండి