18, జనవరి 2018, గురువారం

సమస్య - 2573 (పడతియె శాంతి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు"
(లేదా...)
"పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ఇచ్చిన సమస్య... కొద్ది మార్పుతో)

138 కామెంట్‌లు:

  1. నడచి వచ్చి దేవేంద్రుని నాట్యకత్తె
    హడల గొట్టి తపమ్మును పడక బెట్టి
    కడకు పాపనిచ్చి వదలి వెడలి పోవు
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు

    రిప్లయితొలగించండి
  2. రమణి సీతకై దశకంఠు రావణుండు
    తెలివిదప్పి లంకపురికి తీసుకొచ్చె
    రామబాణముకు విడిచె ప్రాణములను
    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దశకంఠ రావణుండు' అనండి. 'లంకాపురి' అనడం సాధువు. 'తీసుకొచ్చె' అన్నది వ్యావహారికం. "తెలివి దప్పియు లంకకు దెచ్చినాడు" అనండి. '...బాణమునకు వీడె ప్రాణములను' అనండి.

      తొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    బడుగుల జీవితమ్ములకు బాసటయౌ శ్రమశక్తి రూపయై
    కడు సుఖమిచ్చు సంపదకు కారణమౌ వరలక్ష్మి పంటగా
    నడుగిడ , గాని ఆమెకొక యక్కట , యామె చరింప నక్కటా !
    పడతియె శాంతిసౌఖ్యముల భంగమొనర్పగ కారణంబగున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      జ్యేష్ఠాదేవి ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


    2. పడతియే శాంతిసౌఖ్యముల్ వరలఁజేయు!
      పడతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు !
      పడతియే వృద్ధి , నష్టమున్ బడతి యగును !
      పడతి మూలము సకలప్రపంచమిలను !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. చక్కని పూరణ మురళీకృష్ణగారూ!
      పడతిమూల మిదంజగత్!😊😊😊

      తొలగించండి
    4. ఉభయోరపి ధన్యవాదాః 🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    5. అడిగినదొక్క చీర కొనవైతివి ! నే జడ దాల్ప కోర మూ..
      రెడు పువులైన తేవు ! నడి రేయిని మాత్రమె నీకు ముద్దు నన్
      విడువక ఆటబొమ్మగ గణింతువటంచును ముక్కు చీదు నా
      పడతియె శాంతిసౌఖ్యముల భంగమొనర్పగ కారణంబగున్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    6. ప్రభాకర శాస్త్రి ఉవాచ:

      అడగక నిచ్చితిన్ గదర హాయిగ వేలకువేల ముద్దులన్
      తడబడి రాత్రి మందులను త్రాగియు రాగనె తల్పుతీసితిన్
      భడవర! నీవు పద్యములు వ్రాయుచు మమ్మిటు తిట్ట భావ్యమే:
      "పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్"???

      తొలగించండి


    7. భడవ !కవీశ! పద్యములు వ్రాయుచు మమ్మిటు తిట్ట భావ్యమే :)

      ఇదే మరో సమస్య అయిపోయిందండి జీపీయెస్ వారు :)

      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    8. కటకట మురళీకృష్ణులు
      వెటకారపు మాటలాడ వెక్కసమాయ
      న్నెటుల తలంచిరి స్త్రీలను
      పుటుకున చేజార్చగాను పూజ్యతమదిలో!
      🤔🤔🤔🤔🤔

      తొలగించండి
    9. శ్రీమతి సీతాదేవి గారికి నమస్సులు...

      స్త్రీలన గౌరవమ్మది మదిన్ కొలువున్నది., పద్యభావమం...
      దాలిని బ్రేమఁ జూడని దురాత్ముని మానసవృత్తి మాత్రమే
      లీలగ జెప్పియుంటి , లవలేశము లేదు మరొక్క భావమున్ !
      స్త్రీలను మాతృభావ పరిశీలన జేసెద నన్ను నమ్ముడీ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    10. శ్రీమతి సీతాదేవి గారికి నమస్సులు...

      స్త్రీలన గౌరవమ్మది మదిన్ కొలువున్నది., పద్యభావమం...
      దాలిని బ్రేమఁ జూడని దురాత్ముని మానసవృత్తి మాత్రమే
      లీలగ జెప్పియుంటి , లవలేశము లేదు మరొక్క భావమున్ !
      స్త్రీలను మాతృభావ పరిశీలన జేసెద నన్ను నమ్ముడీ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    11. ఐతే ఓకే! 😄 నాఆశీర్వాదములు! నాకంటే చిన్నవారని విన్నాను!😊

      తొలగించండి
  4. జిలేబీ గారి పూరణ....

    నుడివిరయ్య గురువులట నూతనముగ
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు
    వడివడిగ వచ్చెను జిలేబి పద్య మొకటి
    జేర్చి కాదని యెనుగాద చెంప చేర్చి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంధ్ర భారతి గాలించి హద్దుమీఱి
      మారు మూలల పదముల మభ్యపఱచి
      చిలిపి సమసియల నిడుచు చిక్కుపెట్టు
      పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు

      తొలగించండి


    2. ఆంధ్ర భారతి గాలించి అలసి మురిసి
      మారు మూల పదముల కమాను జేర్చి
      చిలిపి సమసియలను చెక్కి చిక్కుపెట్టు
      పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు :)

      జిలేబి

      తొలగించండి


  5. వడివడి గాను భార్య పరివారము కాంతుని యింటిలోన జే
    ర డిమడిమల్మొదల్! మగడి రాధనముల్తొలగున్ జిలేబియా!
    కడిగడి గండ మైనతని కాల్చును తేగడ వమ్ము బోవగా
    పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. జిలేబీ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  7. గురువర్యుల సవరణతో...


    రమణి సీతకై దశకంఠ రావణుండు

    తెలివిదప్పియు లంకకు తెచ్చినాడు

    రామబాణమునకు వీడె ప్రాణములను

    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు

    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  8. గడగడలాడజేసి ప్రజ, గమ్యము గానని మత్సరమ్ముతో,
    నొడయని కోడిపందెముల నూహకు నందని రీతిజేయుచున్,
    దడయక నాయికాంబ తన దానము,సామము,భేదసృష్టితో
    పడతియె శాంతిసౌఖ్యముల భంగమొనర్పగ గారణంబగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      పలనాటి యుద్ధ ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  9. తపము భంగము జేసెడి నెపము తోన
    మేని విరుపులు సొగసుల మేన కయన
    పక్షి గణముల కొదిలెను బాలిక నిడి
    పడఁతియే శాంతి సౌఖ్యముల్ భంగ పఱచు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పక్షి గణములకు వదలె బాలిక గని" అనండి.

      తొలగించండి
    2. తపము భంగము జేసెడి నెపము తోన
      మేని విరుపులు సొగసుల మేన కయన
      పక్షి గణములకు వదిలె బాలిక గని
      పడఁతియే శాంతి సౌఖ్యముల్ భంగ పఱచు.

      తొలగించండి
  10. పొరుగువారి ఘన విలాసములను జూచి

    పోరుఁబెట్టునెపుడు వాటి పొందు కొరకు

    తలపుజేయగ మనమున తెలియు నింటి

    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు


    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి
  11. చక్క దిద్దుచు నిం టి ని సాధ్వి యగుచు
    భర్త పిల్లల బాగుకై పాటు పడుచు
    లక్క వోలె గ ర గు తా నిక్కము గను
    పడతి ' యే శాంతి సౌఖ్యము ల్ భంగ పర చు ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      సమస్యను ప్రశ్నార్థాకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2573
    సమస్య :: *పడతియె శాంతి సౌఖ్యముల భంగ మొనర్పఁగ గారణం బగున్.*
    స్త్రీ యే శాంతిని సౌఖ్యాన్ని దూరం చేస్తుంది అనేది ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: స్త్రీమూర్తి సహజంగా సౌఖ్యాన్ని అందిస్తుంది. శాంతిని ప్రసాదిస్తుంది. ఐతే తాటక, మంథర, కైక, శూర్పణఖ మొదలైనవారు కరుణ అనేది లేకుండా ఇతరులను కష్టపెడుతూ వారి ప్రాణాలను తీసేవారు. వాళ్లలాగా ఎల్లప్పుడూ దుష్టమైన స్వభావంతో ఉండే ఆడది శాంతిసౌఖ్యాలు దూరమయ్యేందుకు కారణమౌతుంది అని చెప్పే సందర్భం.

    దడ గలిగించు శూర్పణఖ , తాటక , మంథర , కైక వంటి వా
    రిడుముల బెట్టువారు , కరుణింపరు , ప్రాణము దీయువారు తా
    మొడుపుగ ; వారి వోలె నిల నొప్పుచు , నిత్యము దుష్టచిత్తయౌ
    *పడతియె , శాంతి సౌఖ్యముల భంగమొనర్పఁగ గారణంబగున్.*
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (18.01.2018)

    రిప్లయితొలగించండి
  13. మగని యాధిపత్యము జూచి మండిపడచు
    తానె గొప్పదనుచు నెప్డు తలుచుకొనుచు
    పదుగురెదుట దూషణజేయ భర్తకట్టి
    "పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు"

    రిప్లయితొలగించండి
  14. పదుగురెదుట నో జ్ఞానిగ పండితునిగ
    పేరు పొందిన వారల, వేరు రీతి
    వారి కామపుటూహలు పారెనో! హ!!
    "పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఓ చిన్న అనుమానం!
      పారు సరైనదా...పాఱు సరైనదా?

      తొలగించండి
    2. గడచిన కాలమందునను ఖ్యాతిని పొందిన మేటి వారలే
      పడతుల మోహబంధనపు బారిన దూరములెంచకన్‌ ధరన్
      బడిరి అమోఘమైన తమ ప్రాభవమున్‌ విడిరెందరో!గనన్
      "పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్"

      తొలగించండి
    3. విట్టుబాబు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'ఒక'ను 'ఓ' అన్నారు. అక్కడ "పదుగు రెదుటను జ్ఞానిగ..." అనండి.

      తొలగించండి
    4. పారు, పాఱు... రెండు రూపాంతరాలు. సరైనవే. అర్థాలు కూడా ఒకటే.

      తొలగించండి
    5. పారు = పరుగెత్తు, పాఱు = ప్రవాహము

      తొలగించండి
  15. మరొక పూరణ :-
    చేతబట్టిన సుందరి సిరులుఁ గోరి
    సత్యహీనభాషిణి యామె సతతముగను
    పదిమందిలోను తనను భంగపఱుచు
    "పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విశ్వనాథ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "పదుగు రుండగనె తనను..." అందామా?

      తొలగించండి
    2. క్షమించండి. గమనించలేదు. మీ సవరణ బాగుంది.

      తొలగించండి
    3. మరొక పూరణ :-
      తే.గీ.చేతబట్టిన సుందరి సిరులుఁ గోరి
      సత్యహీనభాషిణి యామె సతతముగను
      పదుగు రుండగనె తనను భంగపఱుచు
      "పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు"

      తొలగించండి
  16. గడుసు తనముతోనత్తింటి గడపత్రొక్కి
    గొడవకున్ దిగి యెవరితో పడక తనకు
    తడవతడవకిల్లునొదలి వెడలునట్టి
    పడఁతియే శాంతిసౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తడవ కిల్లు వదలి..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలూ మాష్టారూ
      సవరణ తో:
      గడుసు తనముతోనత్తింటి గడపత్రొక్కి
      గొడవకున్ దిగి యెవరితో పడక తనకు
      తడవతడవకిల్లు వదలి వెడలునట్టి
      పడఁతియే శాంతిసౌఖ్యముల్

      తొలగించండి
  17. కడచిన కాల మంతయును కాంతలు సౌఖ్యము గూర్పలేదొకో?
    సడలని యోర్పు నేర్పులను సాగర మీదను తోడు లేరొకో?
    గడపరె భర్తతో బ్రదుకు కానల నైనను ; నెవ్విధంబునన్
    పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్?"

    రిప్లయితొలగించండి
  18. గడుసరి యౌచు కావరము ఘాటున నిత్యము విర్రవీగుచు
    న్నడకువ లేకయే మగని యానతి సైతము ధిక్కరించుచు
    న్నెడనెడ గాక యెప్పుడు తనేడ్చుచు నిక్కుచు నుండునట్టిదౌ
    "పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్"

    రిప్లయితొలగించండి
  19. వెడగు తనంబు తోడ తన ప్రేష్యయు నేర్పిన బుద్ధితోడుతన్
    వడితనమొప్ప భర్తృ పరిభావమొనర్చి వివేకహీనత
    న్నెడయిక నొందె కైక సమయించని మంకుతనంబు గల్గినన్
    పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్

    రిప్లయితొలగించండి
  20. జడలవి కళ్ళు గప్పుచును జార్చును లోకమునంధకారము
    న్నొడలది కట్టివేయుచు మనోజ్ఞతతోడ భవాబ్ధి ముంచురా,
    యిడుముల సంద్రమే కనగ, నింతి మనోజుని బాణమేనురా!
    *పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్*

    2. జనని యగుచు తాను మనకు జగము జూపు
    చెల్లి యగుచు తాను మనకు సేమ మొసగు
    చెలియ యగుచు తాను మనతో చెలిమి జేయు
    నిన్ని సుగుణములకు మూలమెన్న! *నెట్లు*
    *పడతియే శాంతి సౌఖ్యముల్ భంగ పరచు*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  21. [18/01, 09:31] Nvn Chary: అతి సర్వత్ర వర్జయేత్
    [18/01, 09:31] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    పడతులు కారు, కోరికలు బాధ లమూలము, దెల్పె బుద్ధుడున్
    వడవడి కాటువేయు విష ప్రాణుల వోలె దహించు నెప్పుడున్
    గడబిడ జేయునాశలకుగట్టునుకట్టలేని జీవుడా
    పడు(డ+అ) తియె శాంతిసౌఖ్యముల
    భంగమొనర్పగ గారణంబగున్

    రిప్లయితొలగించండి
  22. శ్రీకృష్ణ రాయబారము: శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో

    పడతిని మాతృమూర్తి వలె భావన సేయక దుష్ట వృత్తితో
    నడచెడు వారి బంధు జన నాశము తప్పదు రాజరాజ! నీ
    వడరుచు కృష్ణ మాన హరణైక విచారుడవైతి గాన, యా
    పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణ విజయకుమార్ గారూ! అందుకోండి అభినందనలు!!

      తొలగించండి
    2. విజయకుమార్ గారూ,
      సీతాదేవి గారు చెప్పినట్లు మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. సీతాదేవి గారూ! శంకరయ్య గారూ! నా మనః పూర్వక ధన్యవాదాలు.

      తొలగించండి
  23. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఇతవు లేనట్టి పెండ్లితో నింటి కొచ్చి
    భర్త మాటల కఱుముచు పంత గించి
    వలదనెడి చేష్ట లడరించు పాటి గాని
    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగ పఱచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చి'ని 'ఒచ్చి' అన్నారు. అక్కడ "ఇంట జేరి" అనండి. 'మాటల కుఱుముచు" టైపాటు అనుకుంటాను.

      తొలగించండి
  24. నమస్తే

    ఈరోజునుండి మోచెర్ల వెంకన్న గారి సమస్యాపూరణాలు శ్యామలీయం బ్లాగులో వ్రాస్తున్నాను. ఆసక్తి కలవారందరికీ ఆహ్వానం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంతోషం!
      మోచెర్ల వెంకన్న గారి సమస్యాపూరణలను 'శంకరాభరణం' బ్లాగులో 18-5-2011 నుండి 6-7-2011 వరకు రోజు కొకటి చొప్పున 'చమత్కార పద్యాలు (మోచెర్ల వెంకన్న కవి సమస్యాపూరణలు) అనే శీర్షికతో ప్రకటించాను.

      తొలగించండి
    2. అలాగా. చాలా సంతోషం. ఇంక నేను మరలా వాటిని ప్రచురించటం ఎందుకు? అవసరం లేదు కదా.

      తొలగించండి


    3. శ్యామలీయం వారు

      మీ బాణి మీది ఆ సమస్యా పూరణ ల మీద మీ వ్యాఖ్యానం తో సహా చదవటం అదో కిక్కు

      కాబట్టి మీ టపా పరంపర కొనసాగిస్తేనే బాగుంటుంది


      జిలేబి

      తొలగించండి
  25. భర్తకు కుటుంబమునకును బాధ్యతగొని
    జీవితాంతము బ్రతుకీడ్చు భావముఁ గల
    పడతి, యేశాంతి సుఖ్యముల్ భంగపరచు?
    మనిషిగ చరించు దేవత మహిని మహిళ

    రిప్లయితొలగించండి
  26. కంజుని పడతి యొసగును కవనపటిమ
    శ్రీహరి పడతి గూర్చునే శ్రీలనెపుడు
    శంభుని పడతి యొనరించు సర్వశుభము
    పడతులెల్లరు లోకశుభమ్ము గాంచు
    పడతి యే శాంతిసౌఖ్యముల భంగపరచు?

    రిప్లయితొలగించండి
  27. పాత రోజుల నిల్లాలు వంకఁజూచి
    యింటి సౌభాగ్యమునుఁదెల్పు చుంటిరిఁగద!
    నేటి'మాడరన్'యువతుల నీటుఁజూడ.
    "పడతియె శాంతి సౌఖ్యముల్ భంగపఱచు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు సమస్య ను విధిగా చివరి పాదంలో ఉంచి పూరించాలా?దయచేసి తెలుప ప్రార్ధన

      తొలగించండి
    3. అవసరము లేదండి. ఏపాదముగా నైన లేక పాద విభజన తో గూడ (అక్షరములలో మార్పులేమియు లేకుండ) చేయ వచ్చును. మొదటి , చివర అక్షరములకు సంధి చేయ వచ్చును ఉచ్ఛారణ భేదము లేకుండ సంయుక్తాక్షరము చేయ వచ్చును. అర్థము మార వచ్చును.

      తొలగించండి
  28. పడతియే మూల కారణం బగును వంశ
    వర్దనంబు జేయగ, పడతి వల్ల బొంద
    గలము విజయము,తధ్యము గట్టి వాయి .
    "పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "..జేయ పడతి..." అనండి.

      తొలగించండి
  29. అడఁకువతోడ జీవనపు యానముఁ జేయుచుఁ బ్రేమఁ బంచుచున్
    పడు వ్యథలెన్నొసంతతము పత్ని కుటుంబ నిమిత్తమై ధరన్
    పుడమికి వచ్చెసుమ్మ సతి పుణ్యఫలమ్మునఁ గావ, నెవ్విధిన్
    పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్?

    రిప్లయితొలగించండి
  30. పడతియేశాంతిసౌఖ్యముల్భంగపరచు
    ననుటసరికాదుపురుషుడునగునునార్య!
    శాంతికినిసౌఖ్యములవినాశనమునకిల
    నహముమూలానభంగములగునుసుమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పురుషుడు మాత్రం ఎందుకవుతాడు?

      తొలగించండి
  31. విభీషణుడు రావణునితో

    జడమతియై హితంబును విచారము జేయను నిచ్చగించక
    న్నడరదిలేక, లోగడ సురాంగన రంభనుగోర శాపమున్
    బడసిన వైనమున్మరచి, పావని సీతను దొంగలించ నా
    పడతియె శాంతిసౌఖ్యముల భంగమొనర్పగ కారణంబగున్!

    రిప్లయితొలగించండి
  32. తడబడకుండ ధైర్యమున తాతలదన్ని ప్రధాన మంత్రియై
    వడివడి పాకి దేశమును భంగమొనర్చుచు చించి నవ్వుచున్
    హడవుడి జేయుచుండెడి బిహారి ప్రకాశును బంది జేసినా
    పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. “హడావుడి” సాధువు... "హడవుడి" మరింత తొందరపాటు 🙏

      తొలగించండి

    2. మరీ అడలించేస్తున్నారు :)


      జిలేబి

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      పద్యం బాగున్నది. మీరు వృత్తాలను కూడా అలవోకగా వ్రాయగలరని అర్థమయింది. కొనసాగించండి.
      కాని పూరణలో చెప్పిన విషయం నాకు అవగాహన కాలేదు.

      తొలగించండి
    4. 🙏🙏🙏

      సార్! ఇందిరా గాంధీ ధైర్యమునూ, ఆవిడ చేసిన ఘనకార్యములనూ, తప్పులనూ, చివరకు అత్యంత విచారకరమైన దుర్దశను ప్రస్తావిస్తూ...

      తొలగించండి
  33. అమ్మననురాగ మందించు నాదిశక్తి|
    భార్య?భర్తబాగోగుల కార్యసిద్ది|
    చపల చిత్తగ యింటను సాగునట్టి
    పడతియే శాంతిశౌఖ్యముల్ భంగపఱచు|
    2.ముడులను మూడు వేయుటకు ముచ్చట దేనికి?కట్న మాశకే|
    గడిపెడి జీవితాశయము గందరగోళమ?కాన్క లిచ్చుటే|
    ముడిబడు ముచ్చటల్ ముసర?ముద్దగు మోమున గర్వ మేర్పడన్?
    పడతియె శాంతి సౌఖ్యముల భంగ మొనర్పగ గారణంబగున్|
    3.ఇడుములయందు యింతి తగు యిష్టత నింపెడి మల్లెపువ్వుగా
    తడబడు జీవితంబునకు దత్తర పాటును మాన్పు తల్లిగా
    గడుపక?”యవ్వనంబున సకాలము నందున దుష్ట శక్తియౌ
    పడతియె శాంతి సౌఖ్యముల భంగ మొనర్పగ గారణంబగున్”|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "అమ్మ యనురాగ...చిత్తగ నింటను" ఆనండి.
      మూడవ పూరణలో "తగు నిష్టత..." అనండి.

      తొలగించండి
  34. పుడమినిమానవాళికినిపూజ్యుడురాముడుకానకేగగన్
    యడుగువరమ్ములంచువనజాననికైకకునూరిపోసెనా
    పడతుకమందరాఖ్యకడుపాపచరిత్రచరిత్రమార్చదే
    పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కాన కేగగా। నడుగు... వనజానన..." ఆనండి.

      తొలగించండి
  35. చెడుతలపుల్ సదా మదినిఁ జేరి తొలంచుచునుండ పుర్వులై,
    గడగడ లాడఁ జేయుచును కాంతుని, బిడ్డల, నత్తమామలన్,
    నడవడియక్రమం బయిన, నాథునికిన్ భువిపైనఁ దుంటరౌ
    పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్

    రిప్లయితొలగించండి
  36. అకటపల్నాటియుద్ధాననమరులైరి
    రెండుపక్షాలసైనికుల్ మెండుగాను
    వెలదినాగమ్మకర్తయైవెలసెనపుడు
    పడఁతియే శాంతి సౌఖ్యముల్ భంగ పఱచు.

    రిప్లయితొలగించండి
  37. ఇడుములు గల్గువేళల నయిష్టత జూపక భర్తతోడుగా
    నడుగులు వేసి సఖ్యత వినమ్రత జూపుచునష్టలక్ష్మి యౌ
    పడతియె, శాంతి సౌఖ్యముల భంగ మొనర్పగ గారణంబగున్
    కడువిపరీత బుద్దుల మగండు, వికారపు దుష్టచింతనన్

    రిప్లయితొలగించండి
  38. ఇడుములు గల్గువేళల నయిష్టత జూపక భర్తతోడుగా
    నడుగులు వేసి సఖ్యత వినమ్రత జూపుచునష్టలక్ష్మి యౌ
    పడతియె, శాంతి సౌఖ్యముల భంగ మొనర్పగ గారణంబగున్
    కడువిపరీత బుద్దుల మగండు, వికారపు దుష్టచింతనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వేళల ననిష్టత" అనండి.
      మీ పూరణలు ప్రతిరోజూ రెండు రెండు సార్లు పోస్ట్ అవుతున్నాయి. ఎందుకు?

      తొలగించండి
  39. అన్నదమ్ము లైనను మఱి యక్కజముగఁ
    జిన్న వానికిఁ దమ కంటె సిరులు పెక్కు
    లంచు మన మందు నీర్ష్య జనించి నట్టి
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు


    శ్రీ భూ వనితా రత్నములలో ఒకటి గాని రెండు గాని యన్నియు గాని కారణ భూతముల కదా సకల యుద్ధములకు.

    పడఁతియె యిచ్చి భాగ్యములు భండన సంతతి కారణంబగుం
    బడఁతియె రాజ్య కాంక్షలను బన్నుగఁ బెంచి యొసంగు యుద్ధముల్
    పడఁతియె మోహ కారిణిగ భస్మము చేయును మానవత్వముం
    బడఁతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్

    [భాగ్యముల నిచ్చు లక్ష్మీ దేవి, భూదేవి, సీతా ద్రౌపదీ ప్రభృతులు పడఁతులే గద!]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  40. అడకు వగా మెలంగుచు నవారిత క్రోధము తోడ నుండు నా
    పడతియె శాంతి సౌఖ్యముల భంగ మొనర్పగ గారణంబగున్
    న్బడతులనంగ నేర్వుమిక బాధల దీర్చెడి యాది శక్తియై
    పుడమిని జన్మ నొందునట పోడిమి తోడన ను ధ్ధరించగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదాన్ని "బడతి యనంగ..." అని ప్రారంభించండి. ఎందుకంటే చివర "ఆదిశక్తియై" అని ఏకవచన ప్రయోగం ఉంది.

      తొలగించండి

  41. మైలవరపు వారికి కౌంటరు :)


    పిడికెడు బువ్వ బెట్టగను పేర్మిగ ముద్దుల నివ్వ సత్తులే !
    కడకయు లేక నన్నిట బికారిగ చేసితి వయ్య గేస్తుడా!
    పడిపడి నేను నీ రహిని పట్టుగ గాచితి; యెట్లు రుచ్యుడా
    పడతియె శాంతిసౌఖ్యముల భంగమొనర్పగ కారణంబగున్ ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారు ఉవాచ:

      శ్రీ జిలేబీ గారికి నమోవాకములు.. స్పందన భలే ఉంది... నమోనమః.... 🙏🙏

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ కౌంటర్ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  42. 1.పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు
    ననెడు మాటసరియు కాదటండ్రు బుధులు
    పతి ప్రగతికిమూలమిలను సతి యటంచు
    నమ్మి జీవనము నడుప నాక మదియె.

    2.విచ్చలవిడిగా ధనమును వేడుకలకు
    నవని యందు ఖర్చుచేసి యనవరతము
    పరుల యెదుట పతిని హీన పరచు నట్టి
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు.

    3.గేహినియె దీపమందురు గృహమునకు
    నామె లేనట్టి సదనమదడవి సమము
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు
    ననెడు వారలు మూర్ఖులే యవని యందు.

    4.అత్తమామలన్ కసురుచు నమ్మయె యిల
    సర్వమని తలచి పతిని సతము తిట్టు
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు
    ననెడిమాటలు నిజమండ్రు నార్యులెల్ల.

    5.పురుషుని విజయము నకిల పొలతి నేర్పె
    కారణమనుచుండబుధులు ఘనముగాను
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు
    నని పలుకు మొరకుల మాట నమ్మకెపుడు.

    6.సంప్రదాయములు విడిచి జగతియందు
    భ్రష్టు రాలై తిరుగుచును బ్రతుకు గడుపు
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు
    చుండ నామెపై కరుణను చూపబోకు.

    7.పడతుల వలనె పెరుగును పగలు సతము
    పడతుల వలననె కలిగెను బవరములిల
    జరిగె పడతుల వలననె జగడములును
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు

    8.పతిని సాధించుచు సతతమతని హితము
    కోరక యాతనలిడుచును కువలయాన
    కోరుచు నగలన్ సొమ్మును కోకల నట్టి
    పడఁతియే శాంతిసౌఖ్యముల్ భంగపఱచు.

    9.పతియె దైవమటంచును సతము తలచి
    పూజలు వ్రతములు సలుపు పుడమియందు
    పడఁతియే, శాంతిసౌఖ్యముల్ భంగపఱచు
    నన్నమాటలు కలనైన నమ్మ వలదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ తొమ్మిది పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వాట్సప్ సమూహంలో నా సూచనలను గమనించండి.

      తొలగించండి
  43. ఎచట పుట్టెనో? పెరిగెనో? యిచట మీదు
    వంశ వృద్ధికి తనువిచ్చి పాటుఁ బడుచు
    నింటి దీపమై వెలుగొంద నిష్టపడెడు
    పడఁతి యే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు?

    రిప్లయితొలగించండి
  44. చంపకమాల
    పడిపడి కామవల్లభుని వాటున జిక్కుచు మోహమందునన్
    విడివడ నింగితమ్మది వివేక విహీన బుధున్ గనంగ నా
    బుడతకుఁ దండ్రెవండనుచుఁ బొక్కగ రంకది తారఁ బోలెడున్
    బడఁతియె శాంతి సౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్

    రిప్లయితొలగించండి
  45. సిరియు సంపద లనొసగు ధరను లిబ్బి
    పడతి, విజ్ఞాన మొసగును బలుకుపడతి
    సకల శుభముల నందించు శంభుపడతి
    యించుపడతియే ప్రియునకు పంచు ప్రేమ
    పడతి, యేశాంతి సౌఖ్యముల్ భంగపఱచు!!!

    రిప్లయితొలగించండి
  46. కన్న వారి తోడుత కట్టుకున్న వాని
    పేరును ప్రతిష్ఠ లెదుగంగ కారణంబు
    పడతియే! శాంతి సౌఖ్యముల్ భంగ బఱచు
    కుజనులు కుటుంబములనిల గూల్చు చుంద్రు!

    రిప్లయితొలగించండి
  47. ..................సమస్య
    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగ పఱచు
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    1 వ పూరణము

    సందర్భం: పెండ్లి చేసుకున్నాక తాను మనసు పడక పోయినట్లైతే తన భార్యయే యైనా శాంతి సౌభాగ్యాలను దూరం చేస్తుంది. (భార్య తనమీద మనసు పడకపోయినా సరే!)
    అట్లే పెండ్లాడకుండానే మనసు పడినట్లైతే పరులయొక్క మగువ శాంతి సౌభాగ్యాలను దూరం చేస్తుంది సుమా!

    వసుధఁ బెండ్లాడిన మనసు పడని వేళ

    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు

    వసుధఁ బెండ్లాడక మనసు పడిన పరుల

    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు

    2వ పూరణము

    సందర్భం: ఎప్పుడూ తల్లి మాటే వింటూ మగడు అత్త మామ అక్కర లే దని, తల్లి బాగుంటే చాలు నని భావించే మగువ శాంతి సౌభాగ్యాలను దూరం చేస్తుంది సుమా!

    మాటి మాటికి తన తల్లి మాట వినుచు

    నుర్వి మగ డత్త మామ లేకున్న మానె

    తల్లి బాగున్న చా లని తలచునట్టి

    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు

    ~వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  48. .................సమస్య
    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగ పఱచు

    3 వ పూరణము

    సందర్భం: సంప్రదాయం అక్కర్లేదు. పసుపు గాజులు కుంకుమ ఇవన్నీ పాతకాలం వాళ్ళ ఛాదస్తాలు. చీరలు కట్టడం నాగరికత కాదు. అనే భావాలు గల పడతి సంప్రదాయ కుటుంబంలోకి వచ్చి పడితే శాంతి సౌభాగ్యాలను దూరం చేస్తుంది సుమా!

    పసుపు కుంకుమ గాజులు పక్క నెట్టి

    పూలు వెట్టక చీరలు ముట్టుకొనక

    సంప్రదాయ కుటుంబాన సాగునట్టి

    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు

    4 వ పూరణము

    సందర్భం: మగని ఆదాయ వ్యయాల గురించి అవగాహన లేకుండా విలాస జీవితమే ధ్యేయ మని భావించి నిత్యమూ పోరాటానికి దిగే పడతి శాంతి సౌభాగ్యాలను దూరం చేస్తుంది సుమా!

    మగని యాయ వ్యయంబుల మా టెఱుగక

    ఘన విలాసంపు జీవితమునకు మరిగి

    దినము దినము పోరాటాన దిగెడునట్టి

    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు

    ~వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  49. ...............సమస్య
    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగ పఱచు

    5 వ పూరణము

    సందర్భం: మగని నత్త మామలనుండి విడదీస్తేనే తనకు సుఖ మని నమ్మి మనసులు విరిచివేస్తూ బాధ్యత మరచిపోయే పడతి శాంతి సౌభాగ్యాలను దూరం చేస్తుంది సుమా!

    ధరణి నత్త మామలనుండి తనదు మగని

    వేరు చేసిన సుఖ మంచు విశ్వసించి,

    మనసులు విరిచి, బాధ్యత మరచిపోవు

    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు

    6 వ పూరణము

    సందర్భం: పడతు లందరూ మంచివారే!
    ఐనా పురుషుడు తెల్లని వన్నీ పా లని భ్రమలో పడి చెడు తలంపులు గల తరుణుల చేరుకోరాదు. అలా అజాగ్రత్తగా చేరితే పడతి శాంతి సౌభాగ్యాలను దూరం చేస్తుంది సుమా!

    తెల్లనివి యన్ని పా లని తెలివి దప్పి

    చెడు తలంపుల తరుణుల చేర వలదు...

    పురుషు డేమరుపాటున దరికి జేర

    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు

    ~వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  50. ..........సమస్య
    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగ పఱచు

    7 వ పూరణము
    సందర్భం: కలుపుగోలుగా వుంటేనే స్నేహం చేస్తేనే అభ్యుదయం అనుకుంటారు. విద్యాలయాల్లో విచ్చలవిడితనం పెరిగిపోతున్నది. అట్టి దశలో చదువు మూలన పడవేసి చవటయైన యువకునికి పడతియే శాంతి సౌభాగ్యాలను దూరం చేస్తుంది సుమా!

    కలుపుగోలుతన మ్మంచు చెలిమి యంచు

    చదువుకొను ప్రాయమందున చదువు మాని

    చవటయై తిర్గమర్గిన యువకునికిని

    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగపఱచు

    ~వెలుదండ సత్యనారాయణ

    (తిర్గ మర్గిన.. ప్రయోగం పెద్దలకు నచ్చక పోవచ్చు. కాని జీవితమే సంక్లిష్ట మౌతున్నది కదా! అందుకే పద ప్రయోగమూ సంక్లిష్టమే అయింది.)

    రిప్లయితొలగించండి

  51. .............సమస్య
    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగ పఱచు
    8 వ పూరణము
    సందర్భం: తాను ప్రేమించి ఆమె ప్రేమించక పోతే ఆతడు ద్వేషంతో ఆమె శాంతి సౌఖ్యాలను నాశనం చేస్తాడు.
    తాను ప్రేమించి ఆతడు ప్రేమించకపోతే ఆమెకూడ అతని శాంతి సౌఖ్యాలను దూరం చేస్తుంది సుమా!

    తా వలచి యామె వలవని తరుణమందు

    పురుషుడే శాంతి సౌఖ్యాల తరిమికొట్టు...

    తా వలచి వాడు వలవని తరుణమందు

    పడతియే శాంతి సౌఖ్యాల భంగపఱచు

    ~వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెలుదండ సత్యనారాయణ గారూ,
      మీ ఎనిమిది పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  52. చం. మెడకొకతాళినేసుకొనిమేనునుపంచినతల్లిజూచినన్
    కడవరకూసదామగనిగాంచిసపర్యలనిచ్చుసాధ్వియున్
    కడుపునపుట్టినట్టిసిరిగారపుముద్దులయాడబిడ్డయూ
    నడతనుమార్చిజీవితపునౌకనుయీడ్చునభాగిజూచినన్
    చెడినదివారుగాదురసుశీలురువారురచేతులెత్తరే
    బడఁతియె శాంతి, సౌఖ్యము,లభంగ మొనర్పఁగఁ గారణం బగున్.
    ***********************************************************************
    note : స్త్రీ ఏరూపం లో ఉన్నా ఏ పరిస్థితిలో వున్నా జాతి మనుగడ కు కారణం కాబట్టి వారు శాంతి సౌఖ్యాలను అభంగ పర్చేవారే కాని భంగ పరచే వారు కారని పద్య భావన. భంగ ని అభంగ కి అన్వయించడమైనది. మిత్రులు నా యీ ప్రయత్నానికి పూర్తీ మద్దతు పలుకుతారని ఆశిస్తూ ఈ పూరణ.

    రిప్లయితొలగించండి
  53. తే.గీ.

    కోరరాని వరములను కోరి కైక

    భర్త దశరథరాజును బాధపెట్టె

    రాముడడవికి వెడలెను రాజుగాక

    పడతియే శాంతి సౌఖ్యముల్ భంగ పఱచె

    రిప్లయితొలగించండి
  54. అడిగిన వెంటనే సఖున కన్నము ప్రేమను సంతునిచ్చుచున్
    చెడుగుల నోర్చి శాంతమున చెంతకు చేర్చుచు నూరడించుచున్
    ముడుపుగ పెద్దపండుగకు పుట్టిన నింటికి పారిపోవు నా
    పడతియె శాంతిసౌఖ్యముల భంగ మొనర్పఁగఁ గారణం బగున్

    రిప్లయితొలగించండి