28, జనవరి 2018, ఆదివారం

గజ బంధ సీసములో శ్రీహరి ప్రార్ధన


సీ:       
పచ్చ వలువదారి! పచ్చ విలుతునయ్య! పద్మినీ వల్లభా! పద్మ గర్భ !
శ్రీనాధ!,శ్రీకరా!,శ్రీజాని!,శ్రీ వరా!,శ్రీ కాంత!,శ్రీపతి!శ్రీనివాస!
విశ్వంభర!విరించి!విరజా!విశాలాక్ష!విక్రమా!విశ్వాత్మ!విశ్వ రూప!
మధుజిత్తు!మరునయ్య! మాధవా! మాపతీ!కమలాక్ష!కపిలుడా! కంబుపాణి!
తే:      
గరుడ వాహనా! కేశవా !కైటభారి!
జన్మకీలా!జనార్ధనా! చక్ర పాణి!
అంబు జోదరా!అచ్యుతా!అజిత! రమ్ము
రమ్ము, వేగాన కుంభికి  రక్ష నిమ్ము         

చదువు పధ్ధతి : 
తొండము దగ్గ్గిర (పచ్చ )తో మొదలు బెట్టాలి  పద్మ గర్భ తర్వాత చెవి దగ్గిర  (శ్రీ ) తో కలిపి పదాలు  చదువుకోవాలి  తర్వాత వీపు  పై నున్న  (వి)  తోటి  తర్వాత వరుసగా  (మ) తోటి  (మా) తోటి  (క)తోటి పదాలు కలిపి చదువుకొని  కాళ్ళ వద్ద నుంచి మొదలుకొని  మొసలి వద్ద  గల  కాలి లో  (రక్ష నిమ్ము) తో ముగించాలి

కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్ 

3 కామెంట్‌లు: