"మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే ప్లేస్టోర్ నుండి ALL INDIA RADIO ONLINE అన్న ఆప్ ను డౌన్ లోడ్ చేసికొని ఇన్ స్టాల్ చేసుకోండి. అందులో లిస్టులో ఉన్న పెక్కు స్టేషన్లలో Air Telugu ఎన్నుకోండి. మీరు హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు వినవచ్చు. సమస్యాపూరణల కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7-30 నుండి 7-45 వరకు వస్తుంది."
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2572 సమస్య :: *భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్.* ఏకపత్నీవ్రతుడైన శ్రీరామునికి ముగ్గురు భార్యలు అనే విరుద్ధమైన అర్థం ఉన్నట్లు ఈ సమస్యలో మనకు కనిపిస్తుంది. సందర్భం :: వాల్మీకి మహర్షి రామాయణ ప్రారంభంలో శ్రీరాముని గుణములను వర్ణిస్తూ *విష్ణునా సదృశో వీర్యే ధైర్యేణ హిమవానివ* అని అన్నారు. కాబట్టి వీర్యములో విష్ణువు , వేదవేదాంగములను ఎఱిగినవాడు , ధర్మమూర్తి , ధైర్యంలో హిమవంతునితో సమానమైనవాడు అగు శ్రీరాముడు తన శౌర్యాన్ని ప్రదర్శించి, రావణాసురుని చంపి , సీతాదేవితో అయోధ్యకు రాగా , ఆ రామమూర్తికి పట్టాభిషేకం చేస్తూ , శుభము అని పలుకుతూ *కోసలదేశరాజైన దశరథుని ముగ్గురు భార్యలు* (కుమారుని దీవించే తల్లులుగా) హారతి పట్టిన సందర్భం.
రాజశేఖర్ గారు ముందుగా రాణులు అంతఃపురవాసినులు పైగా పెద్దలు ,గురుతుల్యులు అయినటువంటి వారు జయము పల్కి పరిచారిక గణముతో మంగళహారతులు పడతారు అది రాజ సాంప్రదాయం. పైగా తన తల్లులు హారతి పట్టాలన్నా వారు వైధవ్యం చెంది వున్నారు . వైధవ్యం వున్నా వారు ఆయనకు తల్లులే అంటారేమో ఎంత తల్లియినా బిడ్డ క్షేమం కోరుతుంది అందుకే అటువంటి స్థితిలో వారు వారి ఉనికిని చాటరు . కావున మీ భావం అంత సమంజసం గా లేదేమో ఆలోచించండి .
సవరణతో (గురువులు శ్రీ రాణి సదాశివ మూర్తి గారి సూచనతో సందర్భాన్ని మార్చి) గురువులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2572 సమస్య :: *భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్.* ఏకపత్నీవ్రతుడైన శ్రీరామునికి ముగ్గురు భార్యలు అనే విరుద్ధమైన అర్థం ఉన్నట్లు ఈ సమస్యలో మనకు కనిపిస్తుంది. సందర్భం :: వాల్మీకి మహర్షి రామాయణ ప్రారంభంలో శ్రీరాముని గుణములను వర్ణిస్తూ *విష్ణునా సదృశో వీర్యే ధైర్యేణ హిమవానివ* అని అన్నారు. కాబట్టి వీర్యములో విష్ణువు , వేదవేదాంగములను ఎఱిగినవాడు , ధర్మమూర్తి , ధైర్యంలో హిమవంతునితో సమానమైనవాడు అగు శ్రీరాముడు తన శౌర్యాన్ని ప్రదర్శించి, శివుని విల్లు విరిచి సీతాదేవితో సహా కల్యాణరాముడుగా అయోధ్యకు రాగా , ఆ రామమూర్తికి స్వాగతం అంటూ , శుభము అని పలుకుతూ *కోసలదేశరాజైన దశరథుని ముగ్గురు భార్యలు (అంటే కౌసల్య సుమిత్ర కైకేయి)హారతి పట్టిన సందర్భం.
"మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే ప్లేస్టోర్ నుండి ALL INDIA RADIO ONLINE అన్న ఆప్ ను డౌన్ లోడ్ చేసికొని ఇన్ స్టాల్ చేసుకోండి. అందులో లిస్టులో ఉన్న పెక్కు స్టేషన్లలో Air Telugu ఎన్నుకోండి. మీరు హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు వినవచ్చు. సమస్యాపూరణల కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7-30 నుండి 7-45 వరకు వస్తుంది."
ప్రభాకర శాస్త్రి గారూ, చక్కని పూరణతో శుభారంభం చేశారు. బాగుంది. అభినందనలు. 'ద్వారక+అభిరాముడు = ద్వారకాభిరాముడు' అవుతుంది. అక్కడ మీరు "ద్వారకాభి। రామునకు..." అనవచ్చు. ***** శాంతి భూషణ్ గారూ, సేమియాలకు సంస్కృత పదం ఏదో ఉంది. నా వద్ద 'వస్తుగుణ దీపిక' ఉంటే చెప్పేవాణ్ణి. ***** విరించి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పూరణలో గణదోషం. "కైక కౌసల్యయు సుమిత్ర కలల పంట" అందామా? (వరుస తప్పినా రామునికి, దశరథునికి కైక అంటేనే ఎక్కువ ఇష్టం కదా! అందుకే ముందుకు వచ్చింది!) ***** జిలేబీ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో "పేర్మితోడ" అనండి. రెండవ పూరణలో 'కమాను' అన్న అన్యదేశ్య మెందుకు? "సదాగతి నిచ్చియు విల్లు ద్రుంచెనౌ" అనండి. అలాగే 'కోసల+ఆయునిన్' అన్నచోట అయుడంటే కంచుకి. అక్కడ "కోసలాధిపున్ భార్యలు" అనవచ్చు కదా! ***** శ్రీహర్ష గారూ, మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో "ధైర్య మదేల వచ్చె..." అనండి. రెండవ పూరణలో "చూడ నొక్కటౌ" అనండి. నాల్గవ పూరణలో "భార్య యొకతె... పార్వతి యయ్యెను.." అనండి. (వారు ఒకే సమయంలో కాకుండా వేరువేరు సమయాలలో అని ఒక మిత్రుడు చమత్కరించాడు). ***** మైలవరపు వారూ, మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. ***** పూసపాటి వారూ, జి. మెట్టురామశర్మ గారి పూరణలో కౌసల్యాదుల ప్రస్తావన లేదు కదా? ***** బాపూజీ గారూ, మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు. "చల్లని స్వామికి" అనండి. లేకుంటే గణదోషం. ***** కోట రాజశేఖర్ గారూ, మీ పూరణ (సవరించిన దానితో పాటు) అద్భుతంగా ఉన్నది. అభినందనలు. ***** జనార్దన రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'సతీమణి' అన్నచోట గణదోషం. "పద్మసంభవు సతి మేటి..." అందామా? ***** శాంతి భూషణ్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** సీతాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'శూకము' అంటే కనికరం అని అర్థం ఉన్నా ప్రసిద్ధార్థం మాత్రం తేలుకొండి. "రాముని కరుణ బొందగ" అనవచ్చు కదా! రెండవ పూరణ రెండవ పాదం చివర గణదోషం. "పుశ్పకానా నా। శ్చర్యము..." అందామా? ***** హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** సూర్యనారాయణ గారూ, తేటగీతి పాదాన్ని కందంలో ఇమిడ్చి మీరు చెప్పిన పూరణ. అద్భుతంగా ఉన్నది. అభినందనలు. ***** ఎన్వీయెన్ చారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'శౌర్యు డయోధ్య..' టైపాటు. ***** చేపూరి వారూ, మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. ***** గురుమూర్తి ఆచారి గారూ, మీ తేటగీతికా పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. ***** సహదేవుడు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. ఇంద్రునికి శచి మాత్రమే భార్య. సంతానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞులై వాళ్ళు విడివిడిగా హారతులు పట్టారనుకుందాం. రెండవ పూరణలో కొంత అన్వయదోష మున్నట్టుంది. అర్థం కాలేదు. వివరించండి. 'వాజజమున్'...? ***** అన్నపరెడ్డి వారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** పూసపాటి వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. శ్యామలీయం గారి సూచనను గమనించండి. 'చెలియలు, సతులు' అని ఒకే వాక్యంలో చెప్పడం యుక్తంగా లేదు. "చిత్త మలర। రామునకు..." అనవచ్చు. కాని ఇక్కడ 'సతులు' రామానుజుల భార్యలు అన్న విషయం పద్యంలో ప్రస్తావింపబడలేదు. ***** వెలుదండ సత్యనారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** డా. ఉమాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'ఒసరిగి+అజుని = ఒసగి రజుని' అవుతుంది. యడాగమం రాదు. రెండవ పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి. ***** ***** కామేశ్వర రావు గారూ, మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. ఎప్పుడూ వైవిధ్యంగా ఆలోచిస్తూ, సమర్థ శబ్ద ప్రయోగంతో, చక్కని ధారతో ఉత్తమంగా, ఔత్సాహికులకు మార్గదర్శకంగా మీరు చేసే పూరణలు ప్రశంసార్హాలు! ***** వేంకట రాజారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** కృష్ణారావు గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ***** శ్రీధర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. ***** ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'అందురు+ఏలన, రాజు+ఐన' అన్నపుడు యడాగమం రాదు. సవరించండి. "భార్యయు నాదరణలు" అనండి. ***** మిస్సన్న గారూ, మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. ***** లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదం చివర గణదోషం. సవరించండి. ***** విశ్వనాథ శర్మ గారూ, చక్కనైన పూరణ. అభినందనలు.
గురువు గారు రాజేశ్వర రావు గారి పురనములో మొదట దశరధుని భార్యలు మువ్వురు శత్రు సంహారాము చేసి వచ్చిన రామునకు హారతిని ఇచ్చినారు అని వ్రాసినారు. దాని గురించి నేను వఖ్యనిమ్హినాను. తర్వాత వారి పద్యము తొలగిమ్చినారు.
..............సమస్య రామునకు మువ్వురు సతు లారతు లొసగిరి ============================== సందర్భం: దశరథుడు పుత్ర కామేష్టి యాగం చేశాడు. యజ్ఞ పురుషు డుద్భవించి పాయసంతో నిండిన పాత్రను ప్రసాదించాడు. అందులో సగం (1/2) దశరథుడు మొదటి భార్య కౌసల్య కిచ్చాడు. మిగతా సగంలో సగాన్ని(1/4) సుమిత్ర కిచ్చాడు. మిగతా (1/4) దాంట్లో సగం(1/8) కైకేయికి, సగం (1/8) మళ్ళీ సుమిత్రకూ ఇచ్చాడు. కౌసల్యకు శ్రీ మహా విష్ణువు రామునిగా జన్మించాడు. సుమిత్రకు ఆది శేషుని అంశతో లక్ష్మణుడు, చక్రం అంశతో శత్రుఘ్నుడు జన్మించారు. కైకేయికి శంఖం అంశతో భరతుడు జన్మించారు. రాముడు సీతను పెండ్లాడి అయోధ్యలోని తన రాజ మందిరానికి వచ్చాడు. తల్లులు ముగ్గురూ నూతన దంపతులకు హారతు లిచ్చారు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~
సత్యభామయు రుక్మిణి జాంబవతియు
రిప్లయితొలగించండిగోకులాష్టమి దినమున గోముగాను
ద్వారబంధమున నిలిచి ద్వారకయభి
రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి
మిగిలిన సతులందరు వంటింటిలో సేమియా పాయసము జేయుచుంటిరి :)
తొలగించండిచాలా బాగుంది సర్ 👌👏👏🙏🙏🙏
తొలగించండి🙏🙏🙏
తొలగించండిఓ.. హొ...సేమియా కి కూడ పురాణ చరిత గలదా...దాని జన్మ ధన్యమాయను గదా.....
రిప్లయితొలగించండికోరినట్టి యింద్రునకు తాఁ బోరునందు
రిప్లయితొలగించండిసాయ మందించి వచ్చు దశరథునకట
తరుణులు విజయు డై వచ్చు తమ మనోభి
రామునకు మువ్వురు సతు లారతు లొసగిరి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి🙏🙏🙏👏👏👏👍👍👏
తొలగించండి* అంబరము నంటె సంతోష సంబరాలు
నవమి తిధినాడు జనియించె భువికి వెలుగు
తొలగించండికౌసల్య సుమిత్ర కైకేయి కలల పంట
అంబ రమునంటె సంతోష సంబ రాలు
రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి
నవమి తిధినాడు జనియించె భువికి వెలుగు
తొలగించండికైక కౌసల్యయు సుమిత్ర కలల పంట
అంబ రమునంటె సంతోష సంబ రాలు
రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి
రిప్లయితొలగించండికైకయు, సుమిత్ర కౌసల్య, కన్న కొడుకు
లకు మునుపుగ వరుసన నిలబడి యచట
పెండ్లి యాడియింటికి రాగ పేర్మి తోడు
రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి
జిలేబి
నా చెవిటి చెవులతో గత శనివారం ప్రసారమైన ఆకాశవాణి సమస్యా పూరణము (చంద్రమౌళి సూర్యనారాయణ గారు రికార్డు చేసిన) ఆడియో క్లిప్పులో మీ పేరు వినియుంటిని...
తొలగించండి🙏🙏🙏
కంది వారు ఉవాచ:
తొలగించండి"మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే ప్లేస్టోర్ నుండి ALL INDIA RADIO ONLINE అన్న ఆప్ ను డౌన్ లోడ్ చేసికొని ఇన్ స్టాల్ చేసుకోండి. అందులో లిస్టులో ఉన్న పెక్కు స్టేషన్లలో Air Telugu ఎన్నుకోండి. మీరు హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు వినవచ్చు. సమస్యాపూరణల కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7-30 నుండి 7-45 వరకు వస్తుంది."
[16/01, 05:27] Thirukkovallur Sreeharsha: ఆర్యుడ!నవ్విపోదురుగ హాహహ యంచును లోకులెల్లరున్
రిప్లయితొలగించండిధైర్యము నేలవచ్చెనొకొ తప్పును జెప్పగ నిట్లునాల్కకున్
*"భార్యలు మువ్వురారతులు పట్టిరి పావన రామమూర్తికున్"*
సూర్యుని వంశమాతనిది చూడగ నొక్కతె భార్యసీతయే
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
[16/01, 05:55] Thirukkovallur Sreeharsha: 2వ పూరణ..
ఆర్యుడు రాముడే కనగ నద్భుత రీతిన పట్టెమువ్వురిన్
కార్యములందు మాటొకటి!కార్ముక మద్దియె చూడనొక్కటిన్!
భార్యయు సీతనొక్కతియె!భావన సేయ నయోధ్య భర్తకున్
భార్యలు మువ్వురారతులు పట్టిరి ,పావన రామమూర్తికున్
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిసూర్య కుల ప్రభాకరుడు , సుందరరూపుడు , ధైర్య శౌర్య గాం...
భీర్యగుణోన్నతుండచట విల్లును ద్రుంచియు , జేతఁ బట్టి తా
భార్యగ జానకిన్, గడప వద్దకు జేరగనే యయోధ్యరా....
డ్భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
నవవికసితాబ్జవదనుడై నవ్వులొల్కు
తొలగించండిరామునకు , మువ్వురు సతులారతులొసగిరి
దశరథుని ధర్మపత్నులతండు మెచ్చ !
నూయలను జేర్చు మధుర డోలోత్సవమున !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
దోషములను సూచించిన మాన్య శ్రీ నరాల రామారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ... సవరణకు మన్నింపుమని కోరుతూ.... నమోనమః 🙏🙏
తొలగించండిసూర్య కులైకభూషణుడు , సుందరరూపుడు , ధైర్య శౌర్య గాం...
భీర్యగుణోన్నతుండచట విల్లును ద్రుంచి , వరించి సీతఁ దా
భార్యగ , చేరినంత గడపన్ గని మోదముతో నయోధ్యరా....
డ్భార్యలు మువ్వురారతులు పట్టిరి పావన రామమూర్తికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
శతావధాని శ్రీ జి. యం. రామశర్మ గారి పూరణ.....
రిప్లయితొలగించండిఆర్య మహామహీతలము హాయిగనౌ నొక భార్య ముద్దుగన్
ధైర్యరమావిలాసమున దారగ వెల్గెను కీర్తిమూర్తి యౌ
దార్య ధరాకుమారి యయి తానొక భార్యగ దైత్యు గెల్వగా
భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికైక కౌసల్య యు సుమిత్ర వీరంతా విధవ రాళ్ళు గదా
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఆర్యుడు;సూర్యవంశమున నంచితతేజుడు;పొంగులెత్తు నౌ
రిప్లయితొలగించండిదార్యమహాగుణుండు;భరతాదుల గూరిమి యన్నగారు నౌ
శౌర్యరసావతారుడగు చల్లనిస్వామికిన్ గోసలాధిపున్
భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావనరామమూర్తికిన్.
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2572
సమస్య :: *భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్.*
ఏకపత్నీవ్రతుడైన శ్రీరామునికి ముగ్గురు భార్యలు అనే విరుద్ధమైన అర్థం ఉన్నట్లు ఈ సమస్యలో మనకు కనిపిస్తుంది.
సందర్భం :: వాల్మీకి మహర్షి రామాయణ ప్రారంభంలో శ్రీరాముని గుణములను వర్ణిస్తూ
*విష్ణునా సదృశో వీర్యే ధైర్యేణ హిమవానివ* అని అన్నారు. కాబట్టి వీర్యములో విష్ణువు , వేదవేదాంగములను ఎఱిగినవాడు , ధర్మమూర్తి , ధైర్యంలో హిమవంతునితో సమానమైనవాడు అగు శ్రీరాముడు తన శౌర్యాన్ని ప్రదర్శించి, రావణాసురుని చంపి , సీతాదేవితో అయోధ్యకు రాగా , ఆ రామమూర్తికి పట్టాభిషేకం చేస్తూ , శుభము అని పలుకుతూ *కోసలదేశరాజైన దశరథుని ముగ్గురు భార్యలు* (కుమారుని దీవించే తల్లులుగా) హారతి పట్టిన సందర్భం.
వీర్యమునందు విష్ణువుగ , వేదవిదుండుగ ,ధర్మమూర్తిగా,
ధైర్యమునందు చూడగను దా హిమవంతుడు నైన రాముడే
శౌర్యము తోడ రావణుని జంపి , యయోధ్యకు రాగ, మేటి ధీ
వర్యుని రాజు జేయుచు, శుభ మ్మని కోసల నామ దేశ రాట్
*భార్యలు మువ్వు రారతులు బట్టిరి పావన రామమూర్తికిన్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (16.01.2018)
రాజశేఖర్ గారు ముందుగా రాణులు అంతఃపురవాసినులు పైగా పెద్దలు ,గురుతుల్యులు అయినటువంటి వారు జయము పల్కి పరిచారిక గణముతో మంగళహారతులు పడతారు అది రాజ సాంప్రదాయం. పైగా తన తల్లులు హారతి పట్టాలన్నా వారు వైధవ్యం చెంది వున్నారు . వైధవ్యం వున్నా వారు ఆయనకు తల్లులే అంటారేమో ఎంత తల్లియినా బిడ్డ క్షేమం కోరుతుంది అందుకే అటువంటి స్థితిలో వారు వారి ఉనికిని చాటరు . కావున మీ భావం అంత సమంజసం గా లేదేమో ఆలోచించండి .
తొలగించండి3వ.పూరణ
రిప్లయితొలగించండివర్యుడ!సత్యవాక్యపరి పాలన జూడఁగ నొక్క భార్యగా
ధైర్యము తోడనేలెధర,ధర్మము జూడఁగ నొక్కభార్యగా
చర్యల నందుజూడ మరి సాహస మద్దియె నొక్కభార్యగా
భార్యలు మువ్వురారతులు పట్టిరి పావన రామమూర్తికిన్
భార్యయె సీతమెచ్చగను భాను కులోద్భవునాదరమ్ముగన్
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష 4వ పూరణ
For the sake of purana only..
బసవ తారకముకనగ భార్య నొకతె
లక్ష్మి పార్వతి నయ్యెను లలన రెండు
తెలుగు దేశము భార్యగ వెలుగ *యెంటి*
రామునకు, మువ్వురు సతులారతు లొసిగిరి
తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
బ్రహ్మ సతీమణి యగు మేటి భారతియును
రిప్లయితొలగించండిశివుని సతి గౌరి,యింద్రుని యువిద కలసి
దిగ్వి జయుడై యయోధ్యకు తిరిగి రాగ
రామునకు మువ్వురు సతు లారతు లొసగిరి!
రిప్లయితొలగించండిధర్మ పాలకుడు,పరమ ధార్మికుండు,
కోసల ప్రజల పరిపాలకుడు,రఘుకుల
తిలకుడు,దశరథుండు,సకల గుణాభి
రామునకు మువ్వురు సతు లారతు లొసగిరి
🌿🌿 🌿ఆకుల శాంతి భూషణ్ 🌺
వనపర్తి
రామపాదము సోకగ రాయహల్య
రిప్లయితొలగించండిరామశూకము బొందగ రమణి శబరి
రామరూపము లోబడి కామరూపి
రామునకు మువ్వురు సతులారతు లొసగిరి!
సతులు = స్త్రీలు!
ఆర్యుడు భానువంశజుడు,హాటక లంకదొరన్ రణంబునన్
తొలగించండిశౌర్యముమీరగా దునిమి జానకిచేగొని
పుష్పకమ్మున నా
శ్చర్యము మోదమందప్రజ చక్కగ నేగగ సోదరావళీ
భార్యలు మువ్వురారతులు పట్టిరి పావన రామమూర్తికిన్!
ఏగగ= ఉత్సవముగా రాగ (ఊరేగు)
కళాప్రపూర్ణ డా।। కొండూరి వీరరాఘవాచార్యుల పూరణకనుసరణ! వారికి కృతజ్ఞతలతో!
తొలగించండిపుట్టినదినము వేడుక బూని సేయ
రిప్లయితొలగించండిహారతిమ్మని జెప్పగా దారలకును
దశరథుండట, ముందుగా దరినిజేరి
రామునకు, మువ్వురు సతు లారతు లొసగిరి
రిప్లయితొలగించండిక్రౌర్యము జూప తాటకను కాననమందున మట్టు బెట్టె,నౌ
దార్యుడ యెన్నహల్య కుసదాగతి నిచ్చి; కమాను ద్రుంచెనౌ
శౌర్యము చూపి;జానకిని శాలిని యైగన కోసలాయునిన్
భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావనరామమూర్తికిన్.
జిలేబి
సందర్భం: సీతారామ కళ్యాణానంతరం అయోధ్య విచ్చేసిన సీతారాములను స్వాగతించటం
రిప్లయితొలగించండికం.
ఇనవంశ విభుడగు దశర
థుని "భార్యలు మువ్వు రారతులు పట్టిరి పా
వన రామమూర్తికిన్" మరి
యునవనిజకు జనులుమురియనుత్సాహముతో
తొలగించండిఅదురహో కందః!
జిలేబి
ధన్యోస్మి జిలేబీ గారు
తొలగించండిNvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
రిప్లయితొలగించండిఆర్య మునీంద్రుడా సుతుల యాగము గావగ పంపుమన్న నౌ
దార్య వశిష్టుడున్ మునులు తద్విధి వ్రాతయె నంచుచెప్పగన్
శౌర్యడయోధ్యరాజు తమ సమ్మతి కై సతులన్నుతింప నా
భార్యలు మవ్వురారతులు పట్టిరి పావన రామమూర్తికిన్
సవరణతో (గురువులు శ్రీ రాణి సదాశివ మూర్తి గారి సూచనతో సందర్భాన్ని మార్చి)
రిప్లయితొలగించండిగురువులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2572
సమస్య :: *భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్.*
ఏకపత్నీవ్రతుడైన శ్రీరామునికి ముగ్గురు భార్యలు అనే విరుద్ధమైన అర్థం ఉన్నట్లు ఈ సమస్యలో మనకు కనిపిస్తుంది.
సందర్భం :: వాల్మీకి మహర్షి రామాయణ ప్రారంభంలో శ్రీరాముని గుణములను వర్ణిస్తూ
*విష్ణునా సదృశో వీర్యే ధైర్యేణ హిమవానివ* అని అన్నారు. కాబట్టి వీర్యములో విష్ణువు , వేదవేదాంగములను ఎఱిగినవాడు , ధర్మమూర్తి , ధైర్యంలో హిమవంతునితో సమానమైనవాడు అగు శ్రీరాముడు తన శౌర్యాన్ని ప్రదర్శించి, శివుని విల్లు విరిచి సీతాదేవితో సహా కల్యాణరాముడుగా అయోధ్యకు రాగా , ఆ రామమూర్తికి స్వాగతం అంటూ , శుభము అని పలుకుతూ *కోసలదేశరాజైన దశరథుని ముగ్గురు భార్యలు (అంటే కౌసల్య సుమిత్ర కైకేయి)హారతి పట్టిన సందర్భం.
వీర్యమునందు విష్ణువుగ , వేదవిదుండుగ ,ధర్మమూర్తిగా,
ధైర్యమునందు చూడగను దా హిమవంతుడు నైన రాముడే
శౌర్యము జూపి సీత గొని , సౌమ్యు డయోధ్యకు రాగ, మేటి ధీ
వర్యుని స్వాగతించుచు , శుభ మ్మని కోసల నామ దేశ రాట్
*భార్యలు మువ్వు రారతులు బట్టిరి పావన రామమూర్తికిన్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (16.01.2018)
ధైర్యము శౌర్యకీర్తులును దానగుణమ్ములరామచంద్రు డౌ
రిప్లయితొలగించండిదార్యము జూపుచున్ ధరణి ధర్మమునిల్పెడియత్నమందు నా
చార్యుల సాహచర్యమున చారు సుశీలలయోధ్య రాజుకున్
భార్యలు మువ్వురారతులు పట్టిరి పావన రామమూర్తిిన్
ధైర్యము శౌర్యకీర్తులును దానగుణమ్ములరామచంద్రు డౌ
రిప్లయితొలగించండిదార్యము జూపుచున్ ధరణి ధర్మమునిల్పెడియత్నమందు నా
చార్యుల సాహచర్యమున చారు సుశీలలయోధ్య రాజుకున్
భార్యలు మువ్వురారతులు పట్టిరి పావన రామమూర్తిిన్
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,
{ రావణుని చంపినపుడు విజయకాంత , అయోధ్యకు సీత తో
చేరినపుడు కీర్తికాంత శ్రీ రాముని వరించిరి . ఈ ముగ్గురు సతులు
ఆయనకు అయోధ్య లో హారతు లిచ్చిరి }
1) దాశరథి దశముఖు నిర్మధన మొనర్ప
విజయ కాంత వరించెను ప్రేమ మీర
2) పావక పునీత యగు సీత వచ్చె నపుడు
రాము తోడ నయోధ్యాపురమ్మున | కట
3) జనులు జయజయ ధ్వనులతో స్వాగత మిడ
కీర్తి కాంత వలచెను సాకేత విభుని
రామునకు మువ్వురు సతు లారతు లొసగిరి
----------------------------------------------------------------
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కల్పన తగునో కాదో?
రిప్లయితొలగించండితేటగీతి
దివిని 'ఋక్షరజయుఁ' 'గుంతి' సవినయమున
పిండి వంటల వడ్డించి విడిగ 'శచియు'
కొసరి సుత్రామునకు మువ్వురు సతు లార
తు లొసఁగిరి జన్మదినమంచు తోషమంది!
ద్వారకా నగరమ్ము భద్ర గతి వేగఁ
రిప్లయితొలగించండిజేర విశ్వకర్మ కృతమ్ము మీర ముదము
దేవకి యశోద రోహిణు లా వర బల
రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి
భార్యల తోడ వచ్చిన నవారిత తేజులు రాఘవానుజుల్
తూర్య నినాదముల్ సెలఁగఁ దూర్ణము రాణులు ముందుగన్ మహా
శ్చర్య కరాస్త్ర భగ్న విలసద్సుత మాత లజాత్మ జేద్ధ స
ద్భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్
ఆర్యా:
తొలగించండినా చెవిటి చెవులతో గత శనివారం ప్రసారమైన ఆకాశవాణి సమస్యా పూరణము (చంద్రమౌళి సూర్యనారాయణ గారు రికార్డు చేసిన) ఆడియో క్లిప్పులో మీ పేరు వినియుంటిని...
🙏🙏🙏
ఓహో. అలాగా ధన్యవాదములండి. సమస్య నచ్చి మొన్ననొక్క సారి మాత్రమే పంపించితిని. పద్యమును కూడ చదివినారా?
తొలగించండి
తొలగించండిఈ రికార్డింగుల బ్లాగులో పెడితే బాగుంటుందేమో నండి చాలా కాలము దాక వుండడానికి ఆస్కారం వుంటుందేమో ?
జిలేబి
కంది వారు ఉవాచ:
తొలగించండి"మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే ప్లేస్టోర్ నుండి ALL INDIA RADIO ONLINE అన్న ఆప్ ను డౌన్ లోడ్ చేసికొని ఇన్ స్టాల్ చేసుకోండి. అందులో లిస్టులో ఉన్న పెక్కు స్టేషన్లలో Air Telugu ఎన్నుకోండి. మీరు హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు వినవచ్చు. సమస్యాపూరణల కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7-30 నుండి 7-45 వరకు వస్తుంది."
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపెండ్లి వేళను వరునిగా వేడ్కమీర
శోభలొందిన కొమరుని శుభము గోరి
సరవిని సుమిత్ర కైక కౌసల్య లచట
రామునకు, మువ్వురు సతు లారతు లొసగిరి
ధరణిజను గని భార్యగా తగినదనుచు
రిప్లయితొలగించండిరామునకు, మువ్వురు సతు లారతు లొసఁగిరి
భర్త దశరధుడానంద భరితు డవగ
పండితులు సేసలిడ వధూ వరుల పైన
నిన్నటి సమస్య కు పూరణ
రాజ వంశీయులను గూల్చ ప్రతిన బూని
క్షితిని గల క్షత్రియుల నెల్ల వెతకి , జంపి
రామచంద్రుని గన, శాంతరసము జూప
రాఘవా నీ కుఠారమున్ బ్రస్తుతింతు
సిగ్గులొలుకు నవ వధువు సీత, రామ
రిప్లయితొలగించండిచంద్రు గూడి వందనమన, స్వస్తి యనుచు
దశరధుండు దీవన లిడె ధరణి సుతకు,
రామునకు! మువ్వురు సతు లారతు లొసగిరి!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల
తొలగించండిసూర్యకులాబ్ధి చందురుని సోకిన రావణ బ్రహ్మ హత్యయే
యార్యులు నశ్వమేథమున నంతము జేసిన మేలు మేలనన్
భార్యను స్వర్ణ సీతఁ గొను వాజజమున్ గని కోసలాధిపున్
భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్!
✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*
సార్, కొంత వివరణ ఇవ్వాలని కోరిక
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములతో వారు సూచించిన సవరణతో :
తొలగించండిసూర్యకులాబ్ధి చంద్రునకు సోకిన రావణ బ్రహ్మ హత్యయే
యార్యులు నశ్వమేథమున నంతము జేసిన మేలు మేలనన్
భార్యను స్వర్ణ సీతఁ గొను వాజజమున్ గని కోసలాధిపున్
భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్!
వాజజము = యాగము
తొలగించండిశివుని విల్లును భేదించి సీతనుగొని
రిప్లయితొలగించండిదాశరథి యయోధ్యకు రాగ తనివితోడ
దశరథుని యాఙ్ఞతో, దిష్టి తగలకుండ
రామునకు, మువ్వురు సతు లారతు లొసఁగిరి
దశముఖుని జంపి వచ్చిన దాశరదికి
రిప్లయితొలగించండిబలికె స్వాగతంబుల నెల్ల ప్రజలు, ముదము
గలుగ పసిడిబల్లెము దెచ్చి చెలియ లపుడు
"రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి
"బలికె స్వాగతంబుల నెల్ల ప్రజలు"
తొలగించండిలింగవచనాద్యైక్యతలు పాటించాలండీ. స్వాగతంబును, ప్రజయు అనండి. పలికె అన్నది ఏకవచనం కదా.
రాముని సోదర భార్యలు హారతి యిచ్చిరి అను భావన
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి..............సమస్య
రామునకు మువ్వురు సతు
లారతు లొసగిరి
==============================
సందర్భం: కృష్ణునికి ప్రధానంగా ఎనమండుగురు భార్యలు. వారు అష్టమహిషులుగా ప్రసిద్ధులు.
ఒక గోకులాష్టమి నాడు రుక్మిణి సత్య భామ భద్ర కృష్ణునికి హారతి పట్టినారు. తక్కిన ఐదుగురు కమ్మని సేమియా పాయసము వండుతున్నారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
కమ్మనగు సేమియా పాయసమ్ము మిగత
సతులు వండగా- రుక్మిణి సత్య భద్ర
గోకులాష్టమిన్ గో గోప గోపికాభి
రామునకు మువ్వురు సతు
లారతు లొసగిరి..
~వెలుదండ సత్యనారాయణ
దరహసిత వదను డగుచు ధరణి నేలు
రిప్లయితొలగించండిరామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి
యజుని సుతుడానతివ్వగ ననవరతము
కన్నులారగ తనయుని కాంచుచుండ.
డా.బల్లూరి ఉమాదేవి.16/1/18
కన్నతల్లితో బాటుగ కడమ తల్లు
లినకులతిలకునకట తిలకమునిడుచు
వీరగుణము చూపి శివుని విలువిరిచిన
రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి
సూర్య కులమ్మునందునను సోముడు, జానకిఁ బెండ్లియాడి తా
రిప్లయితొలగించండిభార్యను వెంట బెట్టుకొని పావన మైన యయోధ్యకేగ ధీ
వర్యుని గాంచి పంక్తిరథు పంపున, పెల్లగు ప్రేమ తోడుతన్
భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్
విజయదశిమి పండు గనిన విశ్వమందు
రిప్లయితొలగించండిపెద్దదందురు యేలన?పెద్ద,చిన్న,
అన్నదమ్ములు,భార్యయున్ నాదరణలు
నాటి రామాయణ కథలు చాటుచుండ?
పూజాసలిపిరి భక్తిగా”రాజుయైన
రామునకు”|మువ్వురు సతులారతులొసగిరి
ఒకని కున్నట్టి భార్యలు నొక్కటయ్యు
చాలా బాగుంది సార్
తొలగించండిబసవతారక రమణి తారాపథగామి కాగా
రిప్లయితొలగించండిలక్ష్మి పార్వతమ్మ ఇంతియై నడయాడ
ఓటాయుధమ్ము రాజ్యలక్ష్మి నొసంగ, ఎన్టీ
రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి"
రమణి సీతను పెండ్లాడి రామ చంద్రు
రిప్లయితొలగించండిడ డు గు పెట్ట న యోధ్య లో నాద రముగ
దశరథుని భార్య లొ క్క్తటై ధరణి సు త కు
రాము నకు మువ్వు లారతు లొస గిరి
చివరి పాదం లో మువ్వు రు సతు లని చదవాలి
తొలగించండిశౌర్యము మించ రాక్షసుల జంపి మఖమ్మును గాచి పొంగ నా
రిప్లయితొలగించండిశ్చర్యము రాట్సభన్ శివుని చాపము ద్రుంచి వరించి జానకిన్
సూర్యకులాబ్ధి సోముడయి శోభిల పంక్తిరథ ప్రధానలౌ
భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్.
ధైర్యము బూని రాఘవుడు తమ్మునితో వనికేగె తాల్మితో,
రిప్లయితొలగించండిశౌర్యముతోడ రావణుని జంపె రణాంగణమందు, జానకీ
భార్య సమేతుడైతిరిగి వచ్చెనయెద్యకు, తమ్ములయొక్కధీ
భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్
నేటి సమస్య :-
రిప్లయితొలగించండిరామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి"
భర్గచాపకాఠిన్యమున్ భార్గవమద
గర్వమున్ ఖర్వమొనరించు గనులపంట
రాముని గనుచు సీతతో, రాజు దెల్ప
"రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి"
ప్రభాకర శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిచక్కని పూరణతో శుభారంభం చేశారు. బాగుంది. అభినందనలు.
'ద్వారక+అభిరాముడు = ద్వారకాభిరాముడు' అవుతుంది. అక్కడ మీరు "ద్వారకాభి। రామునకు..." అనవచ్చు.
*****
శాంతి భూషణ్ గారూ,
సేమియాలకు సంస్కృత పదం ఏదో ఉంది. నా వద్ద 'వస్తుగుణ దీపిక' ఉంటే చెప్పేవాణ్ణి.
*****
విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పూరణలో గణదోషం. "కైక కౌసల్యయు సుమిత్ర కలల పంట" అందామా? (వరుస తప్పినా రామునికి, దశరథునికి కైక అంటేనే ఎక్కువ ఇష్టం కదా! అందుకే ముందుకు వచ్చింది!)
*****
జిలేబీ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో "పేర్మితోడ" అనండి.
రెండవ పూరణలో 'కమాను' అన్న అన్యదేశ్య మెందుకు? "సదాగతి నిచ్చియు విల్లు ద్రుంచెనౌ" అనండి. అలాగే 'కోసల+ఆయునిన్' అన్నచోట అయుడంటే కంచుకి. అక్కడ "కోసలాధిపున్ భార్యలు" అనవచ్చు కదా!
*****
శ్రీహర్ష గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో "ధైర్య మదేల వచ్చె..." అనండి.
రెండవ పూరణలో "చూడ నొక్కటౌ" అనండి.
నాల్గవ పూరణలో "భార్య యొకతె... పార్వతి యయ్యెను.." అనండి. (వారు ఒకే సమయంలో కాకుండా వేరువేరు సమయాలలో అని ఒక మిత్రుడు చమత్కరించాడు).
*****
మైలవరపు వారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
*****
పూసపాటి వారూ,
జి. మెట్టురామశర్మ గారి పూరణలో కౌసల్యాదుల ప్రస్తావన లేదు కదా?
*****
బాపూజీ గారూ,
మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.
"చల్లని స్వామికి" అనండి. లేకుంటే గణదోషం.
*****
కోట రాజశేఖర్ గారూ,
మీ పూరణ (సవరించిన దానితో పాటు) అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
*****
జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సతీమణి' అన్నచోట గణదోషం. "పద్మసంభవు సతి మేటి..." అందామా?
*****
శాంతి భూషణ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సీతాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'శూకము' అంటే కనికరం అని అర్థం ఉన్నా ప్రసిద్ధార్థం మాత్రం తేలుకొండి. "రాముని కరుణ బొందగ" అనవచ్చు కదా!
రెండవ పూరణ రెండవ పాదం చివర గణదోషం. "పుశ్పకానా నా। శ్చర్యము..." అందామా?
*****
హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
సూర్యనారాయణ గారూ,
తేటగీతి పాదాన్ని కందంలో ఇమిడ్చి మీరు చెప్పిన పూరణ. అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
*****
ఎన్వీయెన్ చారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శౌర్యు డయోధ్య..' టైపాటు.
*****
చేపూరి వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
*****
గురుమూర్తి ఆచారి గారూ,
మీ తేటగీతికా పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.
*****
సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. ఇంద్రునికి శచి మాత్రమే భార్య. సంతానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞులై వాళ్ళు విడివిడిగా హారతులు పట్టారనుకుందాం.
రెండవ పూరణలో కొంత అన్వయదోష మున్నట్టుంది. అర్థం కాలేదు. వివరించండి. 'వాజజమున్'...?
*****
అన్నపరెడ్డి వారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
పూసపాటి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్యామలీయం గారి సూచనను గమనించండి.
'చెలియలు, సతులు' అని ఒకే వాక్యంలో చెప్పడం యుక్తంగా లేదు. "చిత్త మలర। రామునకు..." అనవచ్చు. కాని ఇక్కడ 'సతులు' రామానుజుల భార్యలు అన్న విషయం పద్యంలో ప్రస్తావింపబడలేదు.
*****
వెలుదండ సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఒసరిగి+అజుని = ఒసగి రజుని' అవుతుంది. యడాగమం రాదు.
రెండవ పూరణ రెండవ పాదంలో యతి తప్పింది. సవరించండి.
*****
*****
కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
ఎప్పుడూ వైవిధ్యంగా ఆలోచిస్తూ, సమర్థ శబ్ద ప్రయోగంతో, చక్కని ధారతో ఉత్తమంగా, ఔత్సాహికులకు మార్గదర్శకంగా మీరు చేసే పూరణలు ప్రశంసార్హాలు!
*****
వేంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అందురు+ఏలన, రాజు+ఐన' అన్నపుడు యడాగమం రాదు. సవరించండి. "భార్యయు నాదరణలు" అనండి.
*****
మిస్సన్న గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
*****
లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర గణదోషం. సవరించండి.
*****
విశ్వనాథ శర్మ గారూ,
చక్కనైన పూరణ. అభినందనలు.
సంస్కృత పదము
తొలగించండిసూత్రికా = సేమియా (vermicilli)
http://sanskritdictionary.com/sūtrikā/269945/1
తొలగించండిపాయసము సూత్రికా పాయసమయ్యుంటుందాండి జీపీయెస్ వారు ? :)
పాయసమున్ సూత్రికతో
సాయింపగ గైకొనంగ చక్కని కొమరుల్
ఆయింతులుబడసిరయా
వాయించిరి వాద్యములను వర్ధిల వారున్ !
జిలేబి
ఆయాసము వచ్చెనమ్మ హాయిగ మెక్కన్ :)
తొలగించండిధన్యవాదములు గురుదేవా! ఏదో లయకోసం కరుణకు పర్యాయపదాలు వెదుకగా శూకము కనబడినది! శూకమునకు రూఢ్యర్ధం మీవలన తెలుసుకోగలిగాను!
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగులో అడుగిడి నిన్నటికి సరిగా సంవత్సరమైనది! మీ మార్గదర్శనములో యెన్నోవిషయములు నేర్చుకోగలిగాను! అందులకు మీకెంతగానో ఋణపడియున్నాను! కృతజ్ఞతాభివందనములు!🙏🙏🙏🙏🙏
శుభం! స్వస్తి!
తొలగించండిగురువు గారు రాజేశ్వర రావు గారి పురనములో మొదట దశరధుని భార్యలు మువ్వురు శత్రు సంహారాము చేసి వచ్చిన రామునకు హారతిని ఇచ్చినారు అని వ్రాసినారు. దాని గురించి నేను వఖ్యనిమ్హినాను. తర్వాత వారి పద్యము తొలగిమ్చినారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి..............సమస్య
రామునకు మువ్వురు సతు
లారతు లొసగిరి
==============================
సందర్భం: దశరథుడు పుత్ర కామేష్టి యాగం చేశాడు. యజ్ఞ పురుషు డుద్భవించి పాయసంతో నిండిన పాత్రను ప్రసాదించాడు.
అందులో సగం (1/2) దశరథుడు మొదటి భార్య కౌసల్య కిచ్చాడు. మిగతా సగంలో సగాన్ని(1/4) సుమిత్ర కిచ్చాడు. మిగతా (1/4) దాంట్లో సగం(1/8) కైకేయికి, సగం (1/8) మళ్ళీ సుమిత్రకూ ఇచ్చాడు.
కౌసల్యకు శ్రీ మహా విష్ణువు రామునిగా జన్మించాడు. సుమిత్రకు ఆది శేషుని అంశతో లక్ష్మణుడు, చక్రం అంశతో శత్రుఘ్నుడు జన్మించారు. కైకేయికి శంఖం అంశతో భరతుడు జన్మించారు.
రాముడు సీతను పెండ్లాడి అయోధ్యలోని తన రాజ మందిరానికి వచ్చాడు. తల్లులు ముగ్గురూ నూతన దంపతులకు హారతు లిచ్చారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
హరిఁ గనిన తల్లి, యాది శేషాహి చక్ర
ములఁ గనిన తల్లి, వర శంఖమునకు తల్లి...
కలికిఁ జేపట్టి, కడపలోఁ గాలుఁ బెట్టు
రామునకు మువ్వురు సతు
లారతు లొసగిరి..
~వెలుదండ సత్యనారాయణ
వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
సవరించిన పద్యములు
రిప్లయితొలగించండిదరహసిత వదను డగుచు ధరణి నేలు
రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి
దశరథుండానతివ్వగ తన్మయతన
కన్నులారగ తనయుని కాంచుచుండ.
కన్నతల్లితో బాటుగ కడమ తల్లు
లచ్చెరువునగాంచుచు నవని యందు
వీరగుణము చూపి శివుని విలువిరిచిన
రామునకు మువ్వురు సతు లారతు లొసఁగిరి
ధైర్యము నేనటంచొకతె దైత్యుల గూల్చితి గావునన్ననిన్
రిప్లయితొలగించండిశౌర్యము నేనటంచొకతె శాంతము దాంతము భూషణమ్మనిన్
స్థైర్యము నేనటంచొకతె సీతను గాచుచు బ్రోచితిన్ననిన్
భార్యలు మువ్వు రారతులు పట్టిరి పావన రామమూర్తికిన్