13, జనవరి 2018, శనివారం

సమస్య - 2570 (హరి తత్వమ్మును మెచ్చి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె"
(లేదా...)
"హరి తత్వమ్మును మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా"
(శతావధానంలో గుండు మధుసూదన్ గారు అడిగిన నరాల రామారెడ్డి గారి సమస్య)

57 కామెంట్‌లు: 1. అస్థికల జూడగ జిలేబి ! యదిరె గుండె
  మస్తకము పని జేయ సమముగనన్, స
  మస్తము విభుని లీలగ మదిని దోయ
  నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భోగి సంక్రాంతి వచ్చెను వేగిరమ్మె!

   పండుగల శుభాకాంక్షలు జిలేబి గారికి మరియునందరికి!

   తొలగించండి


  2. జీపీయెస్ వారు

   మీకున్నూ పొంగల్ వాழ்త్తుక్కళ్ :). జెకె :)


   అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో


   చీర్స్
   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీ గారూ,
   మీ పూరణ బాగున్నది. తేటగీతికి ప్రాస కూర్చడం ప్రశంసనీయం. అభినందనలు.
   కాకుంటే 'స్త-స్థ' ప్రాస పానకంలో పుడకలా ఉంది.

   తొలగించండి


  4. ఆస్తి అంటే సరి పోతుందని కుంటా :)

   జిలేబి

   తొలగించండి
 2. ఇందు లేడు దేవుడు మరి యందు లేడు
  హరియు లేడు స్వర్గమునను హరుడు లేడు
  వెదకి వేసారి విసిగియు తుదకు తెలిసె:
  నాది నేనును లేవనె నాస్తికుండు...
  నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె!

  రిప్లయితొలగించండి
 3. మధువు సేవించ మనసుకు మత్తు గలుగ
  మిధ్య యైనట్టి జగతిది తధ్య మనగ
  మసన మందున్న వానికి వ్యసన మంట
  నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె

  రిప్లయితొలగించండి
 4. తేటగీతి
  చేత నున్నటి చరవాణిఁ జేసినట్లె
  యీ సకల చరాచర సృష్టిఁ జేసె నొకఁడు
  విశ్వమందు పగలు రేయి వేడుకలిడ
  నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె

  రిప్లయితొలగించండి
 5. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నే్టి సమస్య సంఖ్య 2570
  సమస్య :: *హరి తత్వమ్మును మెచ్చి నాస్తికుడు బ్రహ్మానందమున్ జెందెరా.*

  సందర్భము :: ఒకానొక రైతు నాస్తికుడు. అతడు తన పొలం విషయంలో ఎంతగానో కృషి చేస్తాడు. జాగ్రత్తగా నాట్లు వేసిన కొద్దిరోజుల తరువాత చూస్తే పొలం అంతా పచ్చగా కన్నులవిందుగా కనిపించింది.
  పచ్చరంగును హరిత వర్ణం అంటారు. (నిర్మల స్వభావం నిర్మలత్వం ఔతుంది. అలాగే హరిత స్వభావం హరితత్వం ఔతుంది.) కాబట్టి తన పొలంలోని హరిత త్వ మును చూచి మెచ్చుకొని ఒకానొక నాస్తికుడైన కర్షకుడు బ్రహ్మానందాన్ని పొందినాడు అని చెప్పే సందర్భం.

  అరయన్ నాస్తిక కర్షకుం డొక , డనూహ్యంబైన యత్నమ్ముతో,
  వర కేదారమె లోకమంచు , నిరతం బా నేలతల్లిన్ గనున్,
  సరిగా నాట్లను వేయగా , నదియు సస్యశ్యామలంబయ్యె , నా
  *హరిత త్వ మ్మును మెచ్చి, నాస్తికుడు బ్రహ్మానందమున్ జెందెరా.*
  కోట రాజశేఖర్ నెల్లూరు. (13.01.2018)

  రిప్లయితొలగించండి
 6. హరిని యరిగానె తలపోసి యరయలేక
  ఆత్మజుని మాట ప్రహ్లాద మందలేక
  దరినె నరసింహు దర్శించి దైత్యరాజు
  నాస్తికుడు హరితత్వము నమ్మి మురిసె .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగుంది సర్.చిన్న సందేహం. హిరణ్యకశిపుని నాస్తికుడన తగునా?

   తొలగించండి
  2. బ్రహ్మవల్ల వరం పొందిన వాడు తరువాత మారగలడా? ఈ ప్రపంచంలో తాము కోరుకున్నవేవీ లభించలేదని, ఆ భగవంతుడనే వాడే యుంటే మాకీ కష్టాలెందుకు అని నాస్తికులు గా మారుచున్నారు.

   తొలగించండి
  3. పెద్దలకు నమస్సులు. ఏదో నాకు అర్థమైనది పంచుకోవాలనే...అన్యధా భావించవద్దని మనవి. హిరణ్యకశిపుడు ఆతని తమ్ముని చంపిన కారణంగా విష్ణు ద్వేషిగా మారినాడు. జీవితాంతం విష్ణువుని జయించవలెనని ప్రాకులాడినాడు. దేవుడే లేడనేవాడు కదా నాస్రితికుడు. హరియే లేడనేవాడైతే జయించాలని ఎందుకు వెదకుతాడు?. ఆతనిని ఆస్తిక నాస్తిక చర్చలో యిమడ్చలేమని నా అభిప్రాయము. ధన్యవాదములు

   తొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  గరిమన్ త్యాగముఁ బౌరుషమ్ముఁ దెలుపున్ గాషాయవర్ణమ్ము , భా...
  సుర శాంతిన్ దెలుపంగనీ తెలుపు , నిల్చున్ సస్యసంవృద్ధికిన్
  హరితంబంచును దెల్ప కేతన రహస్యమ్మున్ , ద్రివర్ణమ్ములన్
  హరిత త్వమ్మును మెచ్చి నాస్తికుడు బ్రహ్మానందమున్ బొందెరా !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి తత్త్వము.... హరితత్వము

   హరియె పరదైవతమ్మని యాత్మయందు
   నాస్తికుడు హరి తత్త్వము నమ్మి మురిసె !
   కష్టమే నిల్చు , దైవము కల్ల! యనుచు
   నాస్తికుడు హరిత త్వము నమ్మి మురిసె !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 8. సకల ప్రాణికాధారము చక్రధారి
  ఎందు వెదకిన కలడందు హేమశంఖు
  ముక్తి నొసగి బ్రోచెడి దివ్యమూర్తివనుచు
  నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె

  వనుచును+ఆస్తికుడు ...వనుచు నాస్తికుడు

  రిప్లయితొలగించండి
 9. అఖిల విశ్వంబు నెల్ల మాయగ నెఱింగి
  నెమ్మదిని యొండు నాస్తికత్వమ్ము వీడి
  మిన్నగా భక్తితో నేడు నిన్నటి ఘన
  నాస్తికుడు హరి తత్వము నమ్మి మురిసె

  రిప్లయితొలగించండి
 10. హరి యె లే డం చు పలుకు గా నాకతాయి
  నాస్తికుడు ;హరి తత్వము నమ్మి మురిసె
  నంత ట ను గాంచి దేవుని యాస్తి కుండు
  పూత చరితు గానిక్కి పుడమి యందు

  రిప్లయితొలగించండి


 11. అరయన్ లేనిది యుండె విశ్వమున సామాన్యంబసామాన్యమై,
  విరిసెన్ పుష్పము నంతలోన గద తావిన్గూర్చి కన్విందుగన్
  మురళీగానము డొల్లలోన పలికెన్ ముద్దారగన్ గాద! శ్రీ
  హరి తత్వమ్మును మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అమ్మో!!! ఎంత బాగా చెప్పారండీ! "జిలేబి" లేకుండా...

   🙏🙏🙏🙏🙏🙏

   తొలగించండి

  2. జీపీయెస్సాయ నమః :)

   ఏమండీ నేటి ఆకాశవాణి‌ సమస్యా పూరణా విశేషాలు తెలిసిన చెప్పగలరు ! వచ్చే వారం సమస్య ఏమిటో ?

   జిలేబి

   తొలగించండి
  3. జిలేబి గారి పేరుతో సహా ఈ నాటి కార్యక్రమంలో సైతము యధావిధిగా మనబ్లాగు మిత్రులపేర్లే ఎక్కువగా వినిపించాయి. కవిమిత్రులందరికీ అభినందనలు.

   వచ్చే వారానికి సమస్య:

   "పంకజమందు చంపకము భాసురమాయెను సుందరాంగికిన్"

   తొలగించండి


  4. సహదేవుడుగారు

   నెనరులు !


   ఇంకను యింక యింక యని నీశుని వేడ జిలేబియా, మదిన్
   శంకయు తొల్గగన్ విభుని సన్నిధి పెన్నిధి యయ్యె నుల్లము
   న్నంకిత భావమే నిలువ నాత్మయు రూఢిగ వెల్గగన్ భళా !
   పంకజమందు చంపకము భాసురమాయెను సుందరాంగికిన్!   జిలేబి

   తొలగించండి
 12. ప్పుత్రుడగు హరి కొక్కడు భుని తాను
  దేవుడేలేడు లేడంచు దెలిపి తెలిపి
  తనదు బాటన సుతుడప్డు తరలి రాగ
  నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె.

  రిప్లయితొలగించండి
 13. దేవుని యునికి బ్రశ్నించు తెంపరెవడు?
  ముక్తి బ్రహ్లాదు డేరీతి బొంద గలిగె?
  రాము గనినంత జానకి యేమి చేసె?
  "నాస్తికుఁడు ; హరితత్వము ; నమ్మి మురిసె"

  రిప్లయితొలగించండి
 14. దేవుడే లేడనుచు నుండు తెంపరెవడు?
  భక్తు డేరీతి సాధించు పరమ పదము?
  భైష్మకి హరిని గనియు సంబరము గలుగ
  "నాస్తికుఁడు ; హరితత్వము ; నమ్మి మురిసె !"

  రిప్లయితొలగించండి
 15. సకల జీవుల కాధారమొకడె హరియె
  అస్తి నాస్తుల రెడింటి కతడె ధాత!
  తిమ్మి బొమ్మినిఁగాంచు నాదేవుగనగ
  నాస్తికుడు హరి తత్వము నమ్మి మురిసె

  రిప్లయితొలగించండి
 16. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,  ఒ క ‌దా స రి , హ రి కీ ర్త న చే సు కుం టూ నా స్తి కు ని కి

  క ని పిం చా డు • నా స్తి కు డు అ త ని యొ క్క త త్వ గీ తా న్ని

  వి ని మ ధు ర కం ఠ ధ్వ ని విని మె చ్చు కొ ని ఆ నం ద ప డి నాడు


  నాస్తికుడు మెచ్చుకున్నది దాసరి యొక్క భక్తిగీతమును విని కాదు ,
  -------------------------------------------------------------------------------------------------
  అతని రాగ సంగీతములను సుస్వర కంఠధ్వనిని విని •
  -------------------------------------------------------------------------------

  వరలన్ జక్కని గీత రాగములు , శ్రావ్యం బైన కంఠధ్వనిన్ ,

  హరి గానమ్మున బ్రత్యుషోదయము బ్రత్యావాసపున్ బ్రాంగణా

  న రహిన్ గన్పడి , యెల్ల వారికి గడున్ హర్షంబు జేకూర్చు దా

  హరి " తత్వమ్మును " మెచ్చి నాస్తికుడు బ్రహ్మానందమున్ జెందెగా !


  { ప్రతి + ఆవాసపున్ ప్రాంగణాన = ప్రతి యింటి ముంగిట ;

  దా హ రి = దా స రి = హరి కీర్తన సేయు వాడు ; తత్వము = తత్వ

  గీతము = వైరాగ్య భక్తి భావ మిశ్రిత మైన గీతము }


  రిప్లయితొలగించండి
 17. పరిధుల్ గల్గిన ఖైదునున్న చిలుకల్ భాషించు వాక్యంబులన్
  విరియన్ కల్వల తేఱిపాఱ గనుచున్ విశ్వప్సునిన్ దీప్తులన్
  ధరణిన్ భానుని కాంతిపుంజమున సంధ్యా కాల సౌందర్యమున్
  హరి తత్వమ్మును మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా

  రిప్లయితొలగించండి
 18. పుస్తకమ్ముగ ముద్రించి విస్తరముగ
  విత్త మందు నుంచి తనదు చిత్త మెల్ల
  సుంత యైనను హరిమీద చింత లేక
  నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె

  [తత్వమును+అమ్మి = తత్వము నమ్మి]


  కరి రక్షించెను బాలుఁ గాచెను భువిం గాపాడెఁ బుణ్యాత్ములం
  బరి రక్షించెను దక్షతన్ననుచు సంభావించి కీర్తింతురే
  హరి యంచుం గిరి యంచు మూర్ఖు లిల నిత్యంబంచు నిందింపగన్
  హరి తత్వమ్మును, మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా

  రిప్లయితొలగించండి
 19. అరయనేదైన వ్యాపారమందు మెరయు
  నధికసంఖ్యాకులు గొలుచు నాంజనేయు
  యువత వస్త్రమ్ము ముద్రించి నవతయనుచు
  నాస్తికుడు హరితత్వమునమ్మి
  మురిసె!

  హరితత్వమును+ అమ్మి= హరితత్వమునమ్మి
  హరి= ఆంజనేయుడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాగున్నది!

   హరికి నానార్ధాలతో కందివారిచ్చిన పాత సమస్య గుర్తొచ్చింది:


   సమస్య #1538

   "హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్"

   తొలగించండి
  2. ధన్యవాదాలన్నయ్యా! వాలి వధ వృత్తాంతము పై సమస్య చాలబాగున్నది!
   🙏🙏🙏🙏

   తొలగించండి
 20. శాపవశమున జనియించి యీపుడమిని
  మచ్చరమె హరి వెసఁ జేరు మార్గమనుచు
  నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె
  శౌరి చేతిలో మరణించి సాగె దివికి

  రిప్లయితొలగించండి
 21. సరిరా రెవ్వరు మానవాళి కిలలో చాల్చాలు నే దేవుడున్
  ధరలో లే డిక పూజ లర్చనలు స్తోత్రాల్ వ్యర్థమౌ గుళ్ళు గో
  పురముల్ ప్రేలుడు లిట్లు నాస్తికసభన్ పోటెత్తగా శ్రీ హరీ!
  హరి! తత్వమ్మును మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా.

  రిప్లయితొలగించండి
 22. ఆభరణము లెన్నయినను అభ్ర మొకటె
  రాగ భావము లెన్నియో రావమొకటె
  పరమము పలు రూపులనుండు హరియొక డన
  నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె ౹౹

  రిప్లయితొలగించండి
 23. దేవుడే లేడనుచుబల్కు భావకుడన?
  నాస్తికుడు”|హరితత్వము నమ్మి మురిసె
  భక్తి భావాలు గలిగిన శక్తియుతుడు|
  నమ్మి హరిగొల్వ ఫలితమేసోమ్మటంచు.
  2.పరమార్థంబన?మానవత్వమున లోపంబున్నరక్షించుటే
  శరణంబన్న?విచారమున్ దుడిపి విశ్వాసంబు గల్పించుటే
  కరుణన్ సాకెడి మిత్రుడున్ నొకడుసంకల్పాలు సాగించెడిన్
  హరితత్వమ్మును మెచ్చి నాస్తికుడు బ్రహ్మానందమున్ జెందెరా|


  రిప్లయితొలగించండి
 24. చింతామణి తల్లి యైన శ్రీహరి తత్వమును నాస్తికుడు మెచ్చుట :-

  అరయన్ పాపము లేదు పుణ్యఫలభావార్థంబు శూన్యంబెయౌ
  సరసంబే మన మూల విత్తము గదా సాధింపగానంచు ధీ
  వర చింతామణి మాత వేశ్యకుల సౌభాగ్యప్రదాతాగ్ర శ్రీ
  హరి తత్వమ్మును మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా||

  రిప్లయితొలగించండి


 25. శ్రీహరి యిల లేడని పలుకు నవని యందు
  నాస్తికుడు,హరి తత్త్వము నమ్మి మురిసె
  నా(యా)స్తికుడుమదిలోనతా ననవరతము
  నితర వాంఛల విడనాడి నెమ్మితోడ.

  దైవమేలేడనెడి వాడు ధరణి నెవడు
  ముక్తిసాధనమ్మనుచును పూర్తిగాను
  దేనిని గని యాస్తికుడిట తృప్తి నొందు
  వనిన తపమాచరించుచు మునిమనమున
  నాస్తికుడు,హరి తత్త్వము నమ్మి మురిసె.


  హరియు లేడనువాడిట యౌను తాను
  నాస్తికుడు,హరి తత్త్వము నమ్మి మురిసె
  త్యాగ రాజాదిగ కవులు ధరణి యందు
  గనుడు నట్టివారలెపుడు ఘనులటంచు.

  రిప్లయితొలగించండి
 26. దైవ నిందతో లబ్ధి పొంద దలచె నిట
  నాస్తికుడు! హరి తత్త్వము నమ్మి మురిసె
  భక్తుడొక్కడు, నమ్మించి పరుల దోచె
  భక్తి యనుచు మఱి యొకడీ భారతమున!

  రిప్లయితొలగించండి
 27. నాస్తికత్వమ్ము విడక మీ నాన్న నీకు
  నాస్తిలో చిల్లి గవ్వీయననుచు చెప్పె
  కాస్త పట్టువీడగ వచ్చుగా యన సతి
  నాస్తికుడు హరితత్వము నమ్మి మురిసె

  రిప్లయితొలగించండి
 28. పరకాంతా సుఖ భోగ లాలసమునన్ వ్యర్థానులాపంబులన్
  గురునిందల్ బుధ గణ్యకోటి తతిపై ఘోరాపారాధంబు పుం
  డరికుండాది నొనర్చె నాస్తికుడునై, నారాయణాశీ:ప్రభన్
  హరి తత్వమ్మును మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా.

  రిప్లయితొలగించండి
 29. మత్తేభవిక్రీడితము
  నిరతమ్మా నటుడక్కినేని శ్రమనే నిక్కమ్ము గా నమ్ముచున్
  సరిలే రెవ్వరనన్ ప్రకాశము గడించన్ విప్రనారాయణం
  పు రసాస్వాదక చిత్రమందు నటుడై పూర్ణమ్ముగా నైక్యమై
  హరి తత్వమ్మును మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా!

  రిప్లయితొలగించండి
 30. ప్రభాకర శాస్త్రి గారూ,
  మీ మెట్ట వేదాంతపు పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కోట రాజశేఖర్ గారూ,
  పచ్చదనాన్ని ప్రస్తావించిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
  *****
  బాపూజీ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కాని హిరణ్యకశిపుని విష్ణుద్వేషిగానే గుర్తించాలి కాని నాస్తికుడుగా కాదు.
  దీనికి చెందిన చర్చ కొంత ఫేసుబుక్కులోను జె.కె. మోహన రావు గారి పూరణలో జరిగింది.
  *****
  మైలవరపు వారు,
  త్రివర్ణపతాకంలో హరితత్వం... అద్భుతమైన పూరణ. అభినందనలు.
  *****
  శాంతి భూషణ్ గారూ,
  నాస్తికుని ఆస్తికునిగా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'హేమశంఖు'...?
  *****
  విజయ కుమార్ గారూ,
  పూర్వ నాస్తికుని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'నెమ్మదిని నొండు...' అని ఉండాలనుకుంటాను.
  *****
  రాజేశ్వర రావు గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'దేవునిన్+ఆస్తికుండు = దేవుని నాస్తికుండు' అవుతుంది.
  చివరి పాదంలో గణదోషం. "చరితుడుగా నిక్కి" అనండి.
  *****

  *****
  జిలేబీ గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. "భువిని తాను" అనండి.
  *****
  జనార్దన రావు గారూ,
  మీ రెండు క్రమాలంకార పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  ప్రసాద రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ******
  ఫణికుమార్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కామేశ్వర రావు గారూ,
  మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.
  *****
  సీతాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి వారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
  *****
  రఘురామ్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *****
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ ప్రసస్తంగా ఉన్నది. అభినందనలు.
  *****
  డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ మూడు పూరణలు వైవిధ్యంగా, చక్కగా ఉన్నవి. అభినందనలు.
  మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. "లేడని పల్కు" అనండి.
  *****
  శ్రీధర రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  సూర్యనారాయణ గారూ,
  ఆస్తికోసం నమ్మినట్టు నటించాడా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
  *****
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 31. ..............సమస్య
  నాస్తికుడు హరితత్వము నమ్మి మురిసె
  ==============================
  సందర్భం:ఆస్తికుడు ఇహపరాలలోను హరి తత్త్వమే యని నమ్మి హాయిగా వుంటున్నాడు.
  నాస్తికుడు ఇహము లేకపోతే పర మెక్కడిది అనే భావంతో హరిత త్వమునే నమ్మి హాయిగా వుంటున్నాడు. పర మతని కక్కర లేదు కదా!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ఆత్మలో నాస్తికుండు తా నహము వీడి

  యిహ పరములందు హరి తత్త్వమే
  యనుకొనె..

  నిహము లేనిది పర మది యేల యనుచు

  నాస్తికుడు హరిత త్వము నమ్మి మురిసె..

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

  రిప్లయితొలగించండి
 32. తే.గీ.
  గౌతమీస్నానపూతసుకాయుడగుచుఁ
  ధర్మపురనరసింహుని దరికిజేరి
  వినుచుఁ భక్తులగాథల విస్మయముగ
  "నాస్తికుఁడు హరితత్వము నమ్మి మురిసె"

  (విస్మయముగన్ + ఆస్తికుఁడు)

  రిప్లయితొలగించండి
 33. హరియున్ లేడిట దేవళమ్మునను హాహాకార మంత్రాలలో
  హరియున్ లేడు మసీదులం దునను బాహ్యమ్మౌ విహారాలలో
  హరియే లేడన జూడగా తెలిసి సోహమ్మన్న వాక్యమ్ములో
  హరి తత్వమ్మును మెచ్చి నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా

  రిప్లయితొలగించండి
 34. వరముల్ నిచ్చెను చంద్రశేఖరునకున్ పద్మాక్షుడా భక్తునిన్
  హరి తత్వమ్మును మెచ్చి;...నాస్తికుఁడు బ్రహ్మానందమున్ జెందెరా
  క్షురకర్మాయెను చంద్రబాబునకనన్ కూకట్టుపల్లీని భల్...
  త్వరగా పోయిరి హస్తినాపురికికన్ దామోదరున్ చంపుటన్!

  రిప్లయితొలగించండి