29, జనవరి 2018, సోమవారం

సమస్య - 2582 (దుఃఖమే స్త్రీల కెల్లప్డు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు"
(లేదా...)
"దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్"

78 కామెంట్‌లు:

  1. చీర సారెలు గిన్నెలు బీరువాలు
    వెండి బంగరు నగలవి దండిగాను
    భారముగ కొనగనె వచ్చు భర్త యొక్క
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అదురహో దుఃఖాన్విత జీపీయెస్ :)


      జిలేబి

      తొలగించండి
    2. "జన్మ దుఃఖం జరా దుఃఖం 'జాయా' దుఃఖం పునః పునః"

      తొలగించండి
    3. సార్! "దండిగాను" మరియు "భారముగ" అనినపుడు "పునః పునః" repeat చేసిన దోషము నాకంటదు. "దండిగా" అనగ variety. "భారముగ" అనగ weight...

      తొలగించండి
    4. ప్రభాకర శాస్త్రి గారూ,
      స్త్రీల దుఃఖాన్ని వారి భర్తలకు బదిలీ చేసిన మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      'జాయాదుఃఖం' షష్ఠి నుండి పంచమి అయింది!

      తొలగించండి
    5. శ్రీమాన్ కంది శంకరయ్య గారిని నేనూ మరి కొందరు మిత్రులూ ఈ వేళ కలిసి ఓ రెండు గంటలు ముచ్చటించుకున్నాము. వారు నవ్వితే మహ బాగుంటుంది నాకు. వారిని ఇంచుక నవ్వించడమే నా ధ్యేయం.

      🙏🙏🙏

      తొలగించండి
  2. భార్య యాడంబరాలైతె భర్తకెపుడు
    దుఃఖమే,స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు
    పట్టు చీరలు,మెరిసేటి పసిడి నగలు
    కార్లు, చక్కని భవనం,షికార్లరయగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఐతె, మెరిసేటి, భవనం' అని వ్యావహారికాలను ప్రయోగించారు. "...యాడంబరాలైన...మెరిసెడి... చక్కని గృహము షికారు లరయ" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు.. గురువుగారు...
      సవరిస్తాను...

      తొలగించండి


  3. సుఖము ఒక విధముగ తెలుసుకొనదగును
    దుఃఖమే! స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు
    మగడు తనచెంత నుండగ మనసు తోడు
    వాటి ననుభవించెడు మహద్భాగ్యము గద!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుఖము+ఒక = సుఖమొక' అవుతుంది. విసంధిగా వ్రాయరాదు. "సుఖము నొక విధముగ..." అనండి.

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    గర్భమును దాల్చి ప్రసవంపు కష్టమంద ,
    బిడ్డలను గని వారికి వేవిధముల
    పాచిపనులను జేయుట , చూచు నపుడు
    దుఃఖమే ! స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నైది. వారికి అభినందనలు.

      తొలగించండి
    2. దోఃఖలుడైన రావణుడు తొయ్యలి సీతను బట్టి తెచ్చుటన్ ,
      గీఃఖలవృత్తి గీచకుడు కృష్ణను గాంచియు మోహితుండుగాన్
      దుఃఖము గల్గె ! నింతులను దూషణ జేసెడి యిట్టివారిదౌ
      దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్"

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  5. ఎడమ యింటను చేరిన ఈశ్వరమ్మ,
    కుడిన కొలువున్న కోర్కెల కుముదవల్లి,
    నడుమ దర్పాల దమయంతి నరసి పొందు
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      పొరుగు పచ్చను ఓర్వని స్త్రీల గురించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  6. దూర దేశము పోయెడి దుహిత గాంచి
    హితము కోరుచు మదినిండ సంత సమున
    బంధ మెడబాసి మనలేక బహుళ ప్రీతి
    దు:ఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      అప్పగింతల వేళ దుఃఖంలో సుఖాన్ని వివరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. చాలా బాగుందండి.కళ్ళు చెమ్మగిల్లాయి.

      తొలగించండి
  7. 8-1-2018 (సోమవారం) నాడు ఇచ్చిన సమస్య....
    "దుఃఖ మెఱిఁగిన వానికే తుష్టి కలుగు" (లేదా...) "దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్"
    ఆ సమస్యను ఇస్తున్నప్పుడే దానిని కొద్దిగా మార్చితే మరొక సమస్య అవుతుందన్న ఆలోచన వచ్చి ఈనాటి సమస్యను సిద్ధం చేసుకొన్నాను. కొన్ని నెలల వ్యవధానంతో ఈ సమస్యను ఇవ్వాలనుకొని, మరిచిపోయి ఈరోజే ఇచ్చాను.
    ఆనాటి పూరణలు ఈ 'ఃఖ' ప్రాసతో పూరించడానికి ఔత్సాహిక కవులకు మార్గదర్శక మౌతాయి. స్వస్తి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 🙏🙏🙏

      సార్! మేము ఆదర్శ విద్యార్థులము. కాపీ కొట్టము.

      తొలగించండి
    2. పరీక్షకు ముందు 'గైడ్'ను చూడండి. వ్రాస్తున్నప్పుడు మాత్రం గైడ్‍ను ముందు పెట్టుకోకండి!

      తొలగించండి
    3. Lifco Guide ను మిత్రుని వద్ద అరువు తీసుకొని చదువగా మా నాన్నగారు చూసి గూబలు వాయించిరి.. 1957 లో

      😢😢😢

      తొలగించండి
    4. నిజమే!ఆ కాలంలో విద్యార్థులు గైడులు, డిటెక్టివ్ నవలలు, అభిసారిక పత్రిక చదవడం (పెద్దలు) నేరంగా భావించేవాళ్ళు!

      తొలగించండి
    5. జాగ్రఫీ పుస్తకములో కొమ్మూరి సాంబశివ రావు గారి ఎర్ర Lambretta డెటెక్టివ్ యుగంధర్...

      తొలగించండి
  8. భర్త పిల్లల సౌఖ్యమే భాగ్యమనుచు
    ఎల్ల వేళ ల శ్రమి యించు నిచ్చ తోడ
    కర గి పోవు ను కొవ్వొత్తి కరణి మిగుల
    దుఃఖ మే స్ర్తీల కెల్లప్దు తుష్ టి నిచ్చు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      బాధ్యతల దుఃఖాన్ని తృప్తిగా స్వీకరించే ఇల్లాలిని గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  9. ఆః! ఖిల గాంచి వాన సయి తాకిన దూకుచు, రైతు గాంచునౌ
    దుఃఖమె; స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతినిచ్చెడిన్
    జః, ఖలుడౌ మగండు తన జవ్వనమున్గమనింప బోవగన్
    దుఃఖమె! దుఃఖ మే రమణి దుమ్మరమాయెను జీవితమ్ము‌నన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జః, ఖలుడౌ'...?

      తొలగించండి

    2. కంది వారు

      నమో నమః

      జః - మన్మథుడు

      మన్మథుడు, దుష్టుడగు మగడు :)


      జిలేబి

      తొలగించండి
  10. తొమ్మిది నెలలుమోయుచు తొట్రుపడక
    బరువు తనహాయి పెంచెను భారమనక
    ప్రీతి జూపుచు పుట్టిన బిడ్డ జేయు
    దుఃఖమే స్త్రీలకెల్లప్డు తుష్టినిచ్చు

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2582
    సమస్య :: *దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టిని పుష్టిని శాంతి నిచ్చెడిన్.*
    దుఃఖము స్త్రీలకు సంతోషాన్ని బలాన్ని మనశ్శాంతిని ఇస్తుంది అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: దుఃఖం వలన వైరాగ్యం కలగాలి. తాత్కాలికమైన వైరాగ్యాలు మూడురకాలు. 1) ప్రసూతి వైరాగ్యం, 2) శ్మశాన వైరాగ్యం, 3) పురాణ వైరాగ్యం. స్త్రీ తన ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డకు జన్మ నిచ్చేటప్పుడు , అత్యంత బాధాకరమైన దుఃఖాన్ని అనుభవిస్తూ , ఇటువంటి దుఃఖం మరొకసారి వద్దనేవద్దు అని ప్రసూతి వైరాగ్యాన్ని పొందుతుంది. ఐతే తన కన్నబిడ్డను మొదటిసారి చూచుకొన్న స్త్రీ , వైరాగ్య భావాన్ని వదలివేసి , తాను అమ్మనైనానని , తన జన్మ సార్థకమైనదని , మురిసిపోతూ , మనశ్శాంతిని , అవధులులేని ఆనందాన్ని , ఆ ఆనందం వలన బలాన్ని , సంపూర్ణమైన సంతృప్తిని పొందుతుంది. కాబట్టి ఆ ప్రసవ దుఃఖమే స్త్రీలకు తుష్టిని పుష్టిని శాంతిని ఇస్తుంది అని చెప్పే సందర్భం.

    దుఃఖ విరాగ భావములు తోచును స్త్రీకి ప్రసూతి వేళ , నా
    దుఃఖమె బిడ్డ గన్పడగ దూరమగున్ ఘన తృప్తి నిచ్చు , నా
    దుఃఖమె జన్మసార్థకతతో నిడు నమ్మ పదమ్ము , గాన యా
    *దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టిని పుష్టిని శాంతి నిచ్చెడిన్.*
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (29.01.2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      చక్కని వివరణతో అద్భుతమైన పూరణ నందించారు. అభినందనలు.

      తొలగించండి
    2. తాత్కాలిక వైరాగ్యాలు మూడు మాత్రమే కాదు నాలుగవది కూడా ఉంది అదే వ్యాధి వైరాగ్యం అని తెలియజేశారు కవి పండితులు శ్రీ చిటితోటి విజయకుమార్ గారు ఈ క్రింది విధంగా.
      ‘’గర్భే వ్యాధౌ శ్మశానేచ
      పురాణే యా మతిర్భవేత్
      సా యది స్థిరతాం యాతి
      కో ను ముచ్యేత బన్ధనాత్
      - గరుడ పురాణము

      ఇక్కడ ప్రసూతి,వ్యాధి, శ్మశాన, పురాణ వైరాగ్యాలు అని నాలుగు వైరాగ్యాలు చెప్పబడ్డాయి.’’

      తొలగించండి
  12. ఉర్విలో కరువు,రణము,నుద్యమాలు
    సంభవించి నపుడు తేలు సత్య మిదియె
    ప్రథమ బాధితు లెప్పుడు ప్రమద లౌట!
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు"?
    ***)()(***
    (దుఃఖము + ఏ స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    దుఃఖితులైనవారిగని తోదపు కారణ మున్ గ్రహించ నా
    దుఃఖము తీర్చుయత్నమును దొడ్డ మనంబున జేయుచున్ సదా
    దుఃఖితులన్ గావ దైవమును తొందర పెట్టగ నేడ్చు నట్టిదౌ
    దుఃఖము స్త్రీల కెల్లపుడు తుష్టిని బుష్టిని శాంతి నిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం ప్రారంభంలో గణదోషం. "దుఃఖితు గావ..." అనండి.

      తొలగించండి
  14. తే.గీ.

    కలియుగమ్మున కొందరు కలుషమతుల

    స్వార్థము దురాశ పర్యవసానమొసగు

    దుఃఖమే, స్త్రీలకెల్లప్డు తుష్టి కలుగు

    భర్త పిల్గలు సంతోష భరితులైన

    రిప్లయితొలగించండి
  15. ఇంటి నాశన కరణము మెపుడు నింతి
    "దుఃఖమే, స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు
    సతము తన కుటుంబము సుఖ సంతసముల
    తోడ వెలుగుచు శుభములు కూడు చుండ

    రిప్లయితొలగించండి
  16. అన్నివిధముల రక్షించు కన్నవారి
    నాటపాటల మిత్రుల నక్కచెల్లి
    పుట్టినింటిని వీడుచు పుణ్యపురుషు
    జేయిబట్టుకు నడచెడి చేతయందు
    దుఃఖమే స్త్రీలకెల్లప్డు తుష్టినిచ్చు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దుఃఖము గల్గుతథ్యమది దూరము
      బోవగ నత్తయింటికిన్
      దుఃఖము తప్పదేసతికి దుర్భర భాధను కాన్పునందునన్
      దుఃఖము నందునే పిదప తొయ్యలి
      నల్లున కప్పగించ నా
      దుఃఖము స్త్రీలకెల్లపుడు తుష్టిని పుష్టిని శాంతినిచ్చెడిన్!

      తొలగించండి
  17. పుట్టినింటిని విడుచుచున్ మెట్టి నింటి
    కరుగు సమయాన గాంచిన నంతులేని
    దుఃఖమే స్త్రీలకెల్లప్డు, తుష్టి నిచ్చు
    ప్రేమ కురిపించి మురిపించు పెనిమిటయిన.

    రిప్లయితొలగించండి
  18. Asnreddy
    శత్రుసేనపైన గెలుపు సాధ్యపరచి
    సమరము ముగించి యిక్కకు సాగుచున్న
    భర్తవిజయముఁ గనుగొని పరిఢవిల్లు
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు

    రిప్లయితొలగించండి
  19. స్వంత బిడ్డను గనులార సాకునపుడు
    కలుగు సంతోషఝరిముందు కలుగ వేవి
    బ్రసవ వేదన సమయాన వరలు నట్టి
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు"

    రిప్లయితొలగించండి
  20. తేటగీతి
    తేటగీతి
    పారిజాతమ్ము సవతికి పంచినంత
    సత్య యలుఁగ, నింద్రుని పైన సమర హేల!
    వ్రతమటంచు దానమొసంగ బ్రభువుఁ బతికి
    దుఃఖమే! స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు!!

    రిప్లయితొలగించండి
  21. "ఇల్లరికంలో ఉన్న మజా..."

    ఇల్లరికంలో భార్య సుఖ శాంతులు:

    దుఃఖమె భర్తకున్ గలుగు ధూళిగ డబ్బులు వెచ్చమవ్వగన్
    దుఃఖమె భర్తకున్ గలుగు దూషణ లివ్వగ నత్తమామలున్
    దుఃఖమె భర్తకున్ గలుగు తూరుపు దిక్కున దండమౌ నదౌ
    దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్...

    సార్! మీ ఆదేశముతో, జిలేబీ గారి తరిఫీదులో, మురళీకృష్ణ గారి ఆశీర్వాదములతో, (వ్యావహారిక పదములతో, వ్యాకరణ దోషములతో) వృత్తరచనలో సిద్ధహస్తుడనైతిని. ఇక నాకు సాటెవ్వరు?

    రిప్లయితొలగించండి
  22. కలికి కష్టాల కడలితో చెలిమిఁజేయు
    కలమి లేముల దొంతరల్ పలుకరించు
    వేదనల నితరుల తోడ విన్నవింప
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టినిచ్చు

    రిప్లయితొలగించండి
  23. ప్రక్క యింటను నివసించు పడతి కంటె
    తానె యన్నింట మిన్నయై తనరవలెను
    పొలతి కోరిక యిదెసుమ్ము పొరుగు వనిత
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టినిచ్చు

    రిప్లయితొలగించండి
  24. దుఃఖము చెందగా మనము తోరముగాగను తేలికౌను యా
    దుఃఖము లేక యున్న గురుతుండునె సౌఖ్యము లోకమందునన్
    దుఃఖము జ్ఞాన దాయకము దుఃఖమె పూర్ణవికాసమెంచగన్
    దుఃఖము స్త్రీల కెల్లపుడు తుష్టిని బుష్టిని శాంతి నిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. దుఃఖ మందుఁ దొలంగును దుష్ట బుద్ధి
    దుఃఖమే చేర్చు జనులను దూర మణచి
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు
    దుఃఖ మిచ్చుఁ బురుషులకుఁ దుష్టి నెంచ


    నిఃఖర టాత్మ చింతనము నిత్య విశాల మనశ్శుచిత్వ వి
    ద్వఃఖర కాభ వాక్పటిమ బాంధవ గౌరవ భావ దృష్టి మే
    ధఃఖననప్రవృత్తి మదిఁ దథ్యము గల్గగఁ జేయు నట్టి యా
    దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్

    [నిఃఖరటము = మృదువైన; ఖరకము = జలధ్వని; ఖననము = త్రవ్వుట]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 8/1/2018 నాటి పూరణము:

      నిఃఖలతా మనో రుచిర నిర్వ్యసన ద్యుతి వెల్గు వానికిన్
      దోఃఖరమండలాగ్ర రిపు దుస్సహ వీర వరేణ్యులందుఁ బ్రా
      తః ఖురలీ విలాస వసుధాపతు లందుఁ దలంచగం బ్రజా
      దుఃఖ మెఱుంగువానికె యథోచిత తుష్టి కలుంగు నెయ్యెడన్

      [నిఃఖలత =దౌష్ట్యము లేమి; ఖురలి = సైనికుల సాము ]

      తొలగించండి
  27. దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్"
    దుఃఖమునిచ్చునాసరళ! తుష్టినిపుష్టిని స్త్రీలకెప్పుడున్
    దుఃఖమునేరికైననిల దుష్టినినీయదునానెరుంగుమా
    దుఃఖమురాకయుండుటకు దుర్గనుగొల్వుముపూటపూటకున్

    రిప్లయితొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  29. దుఃఖముకొన్నిసార్లు మనదోషము దెల్పును,కర్మయత్తమౌ
    దుఃఖము వెంబడించినను తొట్రు పడంగక నుండగాదగున్
    దుఃఖము సత్యమౌ,శుభము తూర్యనినాదము బిడ్డ గొంతులో
    దుఃఖమె స్త్రీలకెల్లపుడు తుష్టిని బుష్టిని శాంతినిచ్చెడిన్

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  31. దుఃఖము కూడదేరికిని దుఃఖమె మందులు లేని రోగమౌ
    దుఃఖమె సర్వసౌఖ్యముల దూరమొనర్చు, కుటుంబహింసయౌ
    దుఃఖమె స్త్రీలకెల్లపుడు, తుష్టిని పుష్టిని శాంతి నిచ్చెడిన్
    దుఃఖము లేని జీవనమె తోయలికెయ్యెడ హాయి గూర్చెడిన్.

    రిప్లయితొలగించండి
  32. దు:ఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు
    స్త్రీలకే కాదదెటు వంటి జీవి కైన
    కడచి నటువంటి బాధల కలుగు తుష్టి
    మరపు రాని బాధను మించి మధుర మేది?
    (సీనియర్ సముద్రాల)

    రిప్లయితొలగించండి
  33. అమ్మనాన్నల విడచియు నత్తయింట
    వెళ్ళ బూనగ సాగెడి వేడుకైన?
    సంతసంబున చిత్తంబు చింతలందు
    దుఃఖమే స్త్రీలకెల్లప్డు తుష్టి నిచ్చు|

    రిప్లయితొలగించండి
  34. విద్య నొసగఁగ మని బంపు విధియె సతిని
    వేల వనితల సిరియుండ నేలు చక్రి
    వల్ల కాటినె తిరుగు పార్వతికి భర్త
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు

    రిప్లయితొలగించండి
  35. దుఃఖమునందు జన్మ తగు దోషములంటగ?ధూషణంబునన్
    దుఃఖములావరించినను?దూరముజేయునుకళ్ళనీరె|యే
    దుఃఖము లేని సంతసము-దుగ్ధములేకనుబుట్టు వెన్నయౌ|
    దుఃఖమె స్త్రీలకెప్పుడును తుష్టిని బుష్టిని శాంతి నిచ్చెడిన్|

    రిప్లయితొలగించండి
  36. దుఃఖము లేదుగా మగడు దూషణ జేయుచు మొట్టగన్ ఠపీ...
    దుఃఖము మెండుగా కలుగు తోడగు కోడలు నవ్వగా...మహా
    దుఃఖమె!!!...; స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్
    దుఃఖితుడౌచునా మగడు తోడగు చెల్లిని తిట్టగన్ భళా...

    రిప్లయితొలగించండి
  37. ఉత్పలమాల
    దుఃఖమె దంచుచున్ విసర స్తోమములింటను !పొయ్యి మీదటన్
    దుఃఖమె వండఁ గట్టెలనుదూర్చుచుఁ జింతిలు నాటి స్త్రీలకున్ !
    దుఃఖమె మిక్సి గ్రైండరులుతోడ్పడి తీరగ గ్యాసు స్టవ్వు? నే
    దుఃఖమె స్త్రీల కెల్లపుడుతుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్?

    రిప్లయితొలగించండి
  38. కవిమిత్రులారా,
    కంటికి గాయమైన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని పరామర్శించడాని ఉదయం బయలుదేరి మదీనాగూడలో వారి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం వరకు ఉండి, అక్కడికి వచ్చిన కవిమిత్రులు జి. ప్రభాకర శాస్త్రి, మాచవోలు శ్రీధర్, ధనికొండ రవిప్రసాద్ గారలతో కాలక్షేపం చేసి, అక్కడే భోంచేసి, కంటి ఆసుపత్రికి వెళ్ళాను. రెండేళ్ళ క్రితం ఎడమకన్ను కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను. ఇప్పుడు కుడికన్ను చేయించుకోవాలి. వాళ్ళ సాయంత్రం వరకు రకరకాల డ్రాప్స్ కళ్ళలో వేస్తూ పరీక్షలు చేసి రేపు రమ్మన్నారు. ఎప్పుడు ఆపరేషన్ చేసేది రేపు చెప్తామన్నారు.
    కళ్ళల్లో డ్రాప్స్ వేయడంతో అంతా మసక మసకగా ఉంది. ఫోనులో కాని, కంప్యూటరులో కాని అక్షరాలు అలుక్కుపోయినట్లుగా అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ స్థితిలో మీ పూరణలను సమీక్షించలేను. ఈరోజుకు నన్ను మన్నించండి.

    రిప్లయితొలగించండి

  39. తొమ్మిది నెలలు కడుపున తోషము తోడ మోసి
    పిల్లలు జనియించ మురిసి పిదప వారి
    యల్లరివలన కలిగెడి యందమైన
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు.
    పట్టు చీరలనుచువేధింప పతికి కలుగు
    దుఃఖమే ,స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు.
    కోరుకొన్నవి వెంటనె కూరిమి తోడ
    నొసగునట్టిపతి పలుకులుర్వి యందు.

    రిప్లయితొలగించండి
  40. కూర్మినెఱుగని యత్తకు కోడలికిని
    నడుమ రగులంగ ననలము కడకు మిగులు
    దుఃఖమే! స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు
    సంధి పొసగు మార్గమ్ములే జగతి లోన!

    రిప్లయితొలగించండి
  41. తనదు చీరెల సొమ్ములన్ తరచి చూచి
    తమకు లేవని లోలోన కుమిలి తలచు
    ఎదర ప్రక్కింటి వారల ఈర్ష్య మరియు
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు

    రిప్లయితొలగించండి

  42. ...........సమస్య
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు

    తన మగడు తాను మాత్రమే ధరణిలోన
    నెపుడు బాగుండవలె నని యింతిఁ గోరు
    నాడుబిడ్డల యత్తలదైన యట్టి
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు..

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి

  43. .......సమస్య
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు

    అమ్మగా జేసి సతులకు కమ్మనైన
    యనుభవము మిగిలించును గనుక ప్రసవ
    మెంత దుఃఖమైనను భరియింత్రు.. ప్రసవ
    దుఃఖమే స్త్రీల కెల్లప్డు తుష్టి నిచ్చు..

    ~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  44. దుఃఖము రాదుగా పతికి దోసెలు కొద్దిగ మాడిపోవగా
    దుఃఖము రాదుగా పతికి దోసెడు కాసులు తెచ్చియిమ్మనన్
    దుఃఖము చూడగా పతిది తొమ్మిది రోజుల కమ్మరాగ నా
    దుఃఖమె స్త్రీల కెల్లపుడు తుష్టినిఁ బుష్టిని శాంతి నిచ్చెడిన్

    రిప్లయితొలగించండి