7, జనవరి 2018, ఆదివారం

సమస్య - 2565 (పద్యము వ్రాయువాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్"
(లేదా...)
"పద్యము వ్రాయువాఁడు చెడి పాతక మందును సత్కవీశ్వరా"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో మద్దూరి రామమూర్తి గారు ఇచ్చిన సమస్య)

123 కామెంట్‌లు:

  1. మద్యము మంచిదటంచును
    మాద్యద్వేశ్యానుషక్తి మాన్యంబనుచున్
    ప్రోద్యత్తమోగుణభరిత
    పద్యమ్మును వ్రాయువాడు పాతకమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్యసనాలను గురించి గొప్పగా చెబుతూ తమోగుణయుక్తమైన పద్యరచన చేసేవాడు పాతకముల పాలౌతాడంటూ సమస్యాపూరణ గావించిన అవధాని శ్రీ చిటితోటి విజయకుమార్ గారూ! హృదయపూర్వక ప్రణామాలండీ. కోట రాజశేఖర్ నెల్లూరు.

      తొలగించండి
    2. విజయకుమార్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  2. "బాల రసాలసాల..."

    సేద్యమె మేలని తలచక
    విద్యాదేవిని వెలకిడి విచ్చల విడిగా
    ఖాద్యము కొఱకై స్తోత్రపు
    పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్

    రిప్లయితొలగించండి
  3. చోద్యంబుకు గురిజేయుచు
    నాద్యంతమ్ము కృతినందు నర్థము లేకన్
    హృద్యమగురీతి గాకన్
    పద్యమ్మును వ్రాయువాడు పాతకమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతి భూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చోద్యమునకు... కృతియందు (లేక, కాక అన్నవి కళలు. 'లేకన్, కాకన్' అనరాదు) ...నర్థరహితమై ... రీతి వీడియు...' అనండి.

      తొలగించండి
    2. మీ సవరణలకు ధన్యవాదములు...సర్

      తొలగించండి
  4. హృద్యమ్మే చిత్ర సీమని
    విద్యను చులకన జేసి వేదుఱు పనులన్
    మధ్యము క్లబ్బులె నయమని
    పద్యమ్మును వ్రాయువాఁడు పాతక మందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి రెండవ పాదాలలో గణదోషం. "హృద్యమగు చిత్ర.. విద్యను చులకనగ జేసి..." అనండి.

      తొలగించండి
    2. హృద్యమగు చిత్ర సీమని
      విద్యను చులకనగ జేసి వేదుఱు పనులన్
      మధ్యము క్లబ్బులె నయమని
      పద్యమ్మును వ్రాయువాఁడు పాతక మందున్

      తొలగించండి
  5. సద్యో హృద్యము ; బుధజన
    విద్యోదంచిత సుమధుర విహరణ ధీనై
    వేద్యమ్ము కాని యతుకుల
    పద్యమ్మును వ్రాయువాడు పాతకమందున్ .


    పద్యమ్మును వ్రాయువాడు పాతకమందున్ .

    రిప్లయితొలగించండి
  6. ఉద్యమ కవితల పేరిట
    బాధ్యత లేకయె యువతను పరుషపు చేష్ట
    న్నుద్యుక్తుల జేయు వికట
    పద్యమ్ముల వ్రాయువాడు పాతకమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (మీకు మీ సోదరుని గాలి సోకినట్టుంది. లేకుంటే ఇంత రాత్రివేళ పూరణ చేస్తారా?!)

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నాకు నెలలో కొన్నిరోజులు నిద్రపట్టని సమస్య యేర్పడుతుంది! ఆయా రోజులలో అర్ధరాత్రి పూరణలుంటాయి! మీరు నా పాత పద్యాలను గమనిస్తే తెలుసుకోగలరు!

      కాని, గురుదేవా! మీకు ఇదివరలో బ్లాగు ద్వారానూ, మిమ్మల్ని కలిసినప్పుడు ప్రత్యక్షంగానూ అర్ధించడం జరిగింది! సమస్యలను అర్ధరాత్రికాక బ్రాహ్మీముహూర్తంలో ఇవ్వమని! కొద్దిమంది పరదేశవాసులకోసం అధికసంఖ్యలో ఉన్న స్వదేశీయులను ఇబ్బంది పెట్టడం భావ్యమా?
      మీ రన్నట్టు రోజులో యెప్పుడైనా పూరణ చేయవచ్చు! కాని మాబోటి ఔత్సాహికులకు సమస్య చూసేవరకు నిద్రపట్టదు! మీరు నమ్మకపోవచ్చు గానీ పదిగంటలకే నిద్రపోయినా ఠక్కున పన్నెండుకు అటూఇటూగా మెలకువ వచ్చేస్తుంది!
      మహాప్రభో! మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను! మీ సాఫ్ట్ వేర్ అనుమతిస్తే సమయము మార్చండి! మీ పుణ్యాన బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచే మంచి అలవాటు వస్తుంది!
      మీరే ప్రస్తావించారు కనుక నా గోడు వెళ్ళబోసుకున్నాను! ఇహపై మీదయ, మా ప్రాప్తం! వందన శతములు!🙏🙏🙏🙏

      తొలగించండి
    3. "యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ"

      తొలగించండి


    4. నడిరాత్రి మేళముల్లే
      ల డమడమల కైపదముల లాహిర దేలా !
      పడమటి వారల కై మా
      గుడాక చెడగొట్టనేల గురువర్యుండా :)


      జిలేబి

      తొలగించండి


    5. మీ పద్య పాదమున్ గని
      చాపము తో దానిని విరిచాక గద గుడా
      కౌ పరుగిడివచ్చునయా!
      కైపదములను తెలవారి కాలము నిమ్మా :)

      జిలేబి

      తొలగించండి
    6. రేపటి నుండి మన బ్లాగులో సమస్యలను భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రకటిస్తాను.

      తొలగించండి
    7. నమఃపూర్వక ధన్యవాదములు గురుదేవా!!🙏🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  7. విద్యను నేర్వజాలక వివేచనమందక క్రొత్త భావముల్
    సాధ్యము గాక భాషయును జాలక యూరక కీర్తి కాముడై
    బోధ్యమెరుంగలేక పర పుస్తక చౌర్యము జేసి గొప్పకై
    పద్యము వ్రాయువాఁడు చెడి పాతక మందును సత్కవీశ్వరా||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      లాక్షణికులు చెప్పినా సాధ్యమైనంత వరకు ద-ధ ప్రాసను ఆశ్రయించకండి.

      తొలగించండి


  8. ఆద్యంతము సుఖముబడయు
    పద్యమ్మును వ్రాయువాఁడు, పాతకమందున్
    విద్యల నేర్వని మనుజుడు!
    అద్యతనీయపు నడతకు యంత్రణమిదియే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (పద్యం వ్రాసేవాడు సుఖపడతా రంటున్నారు. మరి నాకెందుకీ ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాశ్రమవాసం? :-)

      తొలగించండి


    2. మొదట బడయడు అని రాద్దామనుకున్నానండి :)
      ఒక లఘువు ఎక్కువై తగ్గించేసా :)


      జిలేబి

      తొలగించండి


  9. అద్యతనీయ మైనది సయాటగ నేర్పును మేళ వించుచున్
    పద్యము వ్రాయువాఁడు ; చెడి పాతక మందును సత్కవీశ్వరా
    విద్యల నేర్వ లేక సయి విస్తృత కౌశల మున్గ్రహింపకన్
    సద్యపు మంచి పల్కుగనజాలని మానవుడే సుమా యిలన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. హృద్యమభావసంపదల హాయినిగూర్చుచుపల్కుబోటి నై
    వేద్యముగా సమాజహిత వీక్షణ లక్షణ పూర్ణసారమై
    నుద్యమరీతి లేకనిల నుద్గమ దుర్భర భావజాలమున్
    పదియము వ్రాయువాడు చెడి పాతకమందును సత్కవీశ్వరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హృద్యపు భావసంపదల' అనండి.

      తొలగించండి
  11. సేద్యము చేసిన పదముల హృద్యముగా వ్రాయనౌను హేలగ నెపుడున్ మద్యముగొని నీచులకై పద్యమ్మును వ్రాయువాడు పాతకమందున్

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    పద్యము వాణికి నర్ఘ్యము
    పాద్యము నైవేద్యమనుచు భావించినచో
    హృద్యము , తద్భిన్నమతిన్
    పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    హృద్యమునా తరంగము మథించి రచించినదెల్ల కోటి చం...
    ద్రద్యుతి దివ్య భాసుర సిత ప్రభలన్ వెలుగొందు వాణికిన్
    హృద్య నివేదనమ్మనుచు నెంచిన భద్రము గల్గు , నర్థియై
    పద్యము వ్రాయువాఁడు చెడి పాతక మందును సత్కవీశ్వరా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణలు మురళీకృష్ణగారూ! నమోనమః!!

      తొలగించండి
    2. మైలవరపు వారూ,
      హృద్యమైన పూరణలు మీవి. అభినందనలు.

      తొలగించండి
    3. శ్రీమతి సీతాదేవి గారికి ధన్యవాదాలు.. మీకు కూడా ( నా పద్యాలకు బహుళప్రచారం కలిగిస్తున్నందుకు) 🙏🙏🙏

      మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  13. హృద్యపు భావ స్పోరక
    పద్యమ్ముల వ్రాయు వాడు వాసి ని గాంచు న్
    ఆద్యంతము దోష ము లుగ
    పద్యమ్ములు వ్రాయు వాడు పాతకమందు న్

    రిప్లయితొలగించండి
  14. విద్యలు మిడిమిడి గైకొని
    పద్యపు రీతులు దెలియక ప్రౌఢిమలేకన్
    చోద్యమగు విధము దోషపు
    పద్యమ్మును వ్రాయువాడు పాతకమందున్

    రిప్లయితొలగించండి
  15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య (సంఖ్య 2565)

    సమస్య :: *పద్యము వ్రాయువాఁడు చెడి పాతక మందును సత్కవీశ్వరా !*

    సందర్భము :: ఓ సుకవీ ! బమ్మెర పోతన , జంధ్యాల పాపయ్య శాస్త్రి , జాషువా మొదలైన మహాకవుల పద్యాలు అందరికీ సంతృప్తి నిస్తాయి. సరస్వతీ అమ్మవారు ప్రీతితో కోరుకొనే నైవేద్యంలాగా ఉంటాయి. లోకంలో అందరూ మెచ్చుకొనేటట్లు ఉంటాయి. బ్రహ్మానందాన్ని చేకూర్చే రసముతో పండినవిగా ఉంటాయి. ఆ విధంగా హృద్యంగా పద్యం వ్రాసే ప్రయత్నం చేయాలి. అలా కాకుండా వంచనాపరుడై కుకవియై పద్యం వ్రాసేవాడు చెడిపోతాడు. పాపాన్ని పొందుతాడు అని చెప్పే సందర్భం.

    పద్యము పోతనార్యువలె , పాపయ వోలెను , జాషువా వలెన్
    హృద్యము గాగ వ్రాయవలె , తృప్తి నొసంగగ , వాణి గోరు నై
    వేద్యము గా , భళీ యనుచు విశ్వము మెచ్చ , రసమ్ము పండగా ,
    పద్యము వ్రాయగా దగునె వంచనతో ? కుకవి స్వరూపుడై
    *పద్యము వ్రాయువాడు చెడి పాతకమందును , సత్కవీశ్వరా !*
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (7.1.2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట రాజశేఖర్ గారూ,
      మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. హృద్యముగా కవితలనే
    పద్యమ్ముగ నల్లి చేయు పద విభవమ్మున్
    చోద్యమ్మిది యిటులనుటయె
    "పద్యమ్మును వ్రాయువాడు పాతకమందున్"

    రిప్లయితొలగించండి
  17. అధ్యయనపు లోపమ్ముతొ
    సద్యోగము పొందలేక సాగక యిలలో
    విద్యార్జన మెందుకనెడి
    పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విద్యయె వినయము గూర్చును
      మేధ్యో క్తంబై నమాట మేలును గూర్చున్
      హృద్య మ్ముగలే నికుటిల
      పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్

      తొలగించండి
    2. ఆద్యంతము లేని విభుని
      చోద్యంబున నెఱుగలేక శోధించక నా
      రాధ్యంబౌ నతని తెగడు
      పద్యంబును వ్రాయువాడు పాతకమందున్

      చివరి పాదంలో అక్షర మార్పు సమర్ధనీయం కానిచో క్షమించగలరు
      🙏

      తొలగించండి
    3. విట్టుబాబు గారూ,
      మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'లోపమ్ముతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. అక్కడ "లోపముతో" అనండి.

      తొలగించండి
  18. విద్యల రాణికి ప్రియనై
    వేద్యమ్ముగ సురుచిరపద విన్యాసమునన్
    హృద్యమ్మగు రీతిగొనక
    పద్యమ్ముల వ్రాయువాడు పాతకమందున్!

    రిప్లయితొలగించండి
  19. విద్యా విహీను డయ్యును
    నాద్యంతము మదము తోడ నహమించు నరున్
    చోద్యమ్ముగ బొగడుచునే
    "పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్"

    రిప్లయితొలగించండి
  20. గురుదేవులకు వినమ్రవందనములు
    సరదాగా ....
    గద్యమ్ములు వ్రాయు వరులు
    నాద్యంతము వ్యాకరణపు యతులుదెలియకన్
    చోద్యమ్ముగ బలుకుదురుగ
    పద్యమ్మును వ్రాయు వాడు పాతకమందున్ !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తెలియక' అన్నది కళ. తెలియకన్ అనరాదు. అక్కడ "తెలియకే" అందామా?

      తొలగించండి
  21. విద్యలతల్లివాణి,యరవిందదళేక్షణి,గొల్చువారికిన్
    సద్యశమిచ్చిబ్రోచువనజాసనురాణి,సరస్వతిన్ సదా
    గద్యముపద్యమందుశుభకల్పనజేయకదూషణాత్ముడై
    పద్యము వ్రాయువాడు చెడి పాతకమందును , సత్కవీశ్వరా !*

    రిప్లయితొలగించండి
  22. విద్యవివేకమునొసగెడి
    సద్యశమునుమరచిజిహ్వచాపల్యముతో
    మద్యముపానముసేయుచు
    పద్యమ్మును వ్రాయువాడు పాతకమందున్



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్యాకకరణం ప్రకారము విద్యావివేకమనాలి. అదేవిధముగా జిహ్వాచాపల్యము. ఛందస్సుకొఱకు వ్యాకరణమునకు భిన్నముగా వ్రాయకూడదు.

      తొలగించండి
    2. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ******
      విశ్వనాథ శర్మ గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  23. కం. విద్యల నెంతయొ నేర్చియు
    మద్యాసక్తుడగుచు చెడు మగువతొ చెడుచున్
    చోద్యము గను నశ్లీలపు
    "పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విశ్వనాథ శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మగువతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించండి
    2. మద్యాసక్తుడగుచు చెడు మగువలతోడన్

      తొలగించండి
    3. ధన్యవాదములు. .శంకరయ్య గారు !మీరు చెప్పినట్లు👆పై విధంగా మార్చాను.సరి పోయిందనుకొంటాను.

      తొలగించండి
  24. వాద్య విశేషము వినుచును
    చోద్యముగా వింత వింత' షోకు'ల తోడన్
    నింద్యబును,దూష్యమునగు
    పద్యంబును వ్రాయువాఁడు పాతకమందున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు.రాత్రి వేళల నిద్ర ముంచుకొస్తున్నా ఏ సమస్య ఇస్తారో అని వేచి చూసిన రోజులెన్నో!కొన్ని రోజులైతే మొదటి పూరణ పంపాలని మెలకువగా ఉండి అలా పూరణలు పంపాను.ఆరోగ్యం అశ్రద్ధ చేయవద్దని ఇంట్లో వాళ్ళ గోల! కాబట్టి సమస్య ఇచ్చే వేళ మార్చమని సీతాదేవి గారి అభ్యర్ధనతో ఏకీభవిస్తూ విన్నవిస్తున్నాను.మా కోరిక మన్నించండి

      తొలగించండి
    3. రేపటి నుండి మన బ్లాగులో సమస్యలను భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రకటిస్తాను.

      తొలగించండి
    4. ధన్యవాదాలండీ ప్రసాదరావుగారూ!సమర్ధించినందుకు!!🙏🙏🙏

      తొలగించండి
    5. వాహ్! ధన్యవాదములు గురుదేవా! అభ్యర్ధన మన్నించినందులకు!
      2018 సంవత్సరపు మంచి కానుక!!🙏🙏🙏

      తొలగించండి
    6. సీతాదేవి గారూ,
      మీ అన్నగా రేమంటారో అన్న భయం కలుగుతోంది...

      తొలగించండి
    7. అన్నగారి ఆరోగ్యరీత్యాకూడ ఇదే మంచిది గురువర్యా!

      తొలగించండి

    8. నేను కూడా జీపీయెస్ వారికి సపోర్టు :) నడిరేయి యే బెటరు :)

      జిలేబి

      తొలగించండి
    9. అమ్మా! మీరు భారతదేశంలోనే ఉంటారా?

      తొలగించండి


    10. సీతాదేవి గారు బ్రాహ్మీ ముహుర్తమన్నారు ! ఓ మూడు గంటలకు పెడితే బాగుంటుందేమో నండి


      జిలేబి

      తొలగించండి
    11. మనకు ననుగుణమగు నానందము నిచ్చు పనులను మన యాధీనములో నున్న చేతలను చేయక పరులను మన కను గుణముగా చేయ మనడము కంటే మనము మన పనుల ద్వారా మన యానందమును పొందుట తేలిక కదా!

      నేను రోజూ రామయాణ పఠనానంతరము (ఒక సర్గ. సుమారు ఉదయము 9.30 -10.00 గం.) శంకరాభరణము వీక్షించి నాపూరణలు ప్రచురించిన పిదప యే యితరుల పూరణలు చూస్తుంటాను.

      తొలగించండి
    12. ఆర్యా! అందరూ మీ వంటి ప్రాజ్ఞులూ, మా అన్నయ్య వంటి సంయమివరులూ కాదుకదా! యేదో సాధారణ మానవులం! తాపత్రయ బద్ధులము!🙏🙏🙏🙏

      తొలగించండి
    13. సార్! శంకరయ్య గారూ:

      శంకరాభరణం సమస్యా ప్రచురణ సమయంలో నాకెలాంటి పట్టింపులూ లేవు. మీరెప్పుడు ప్రచురించినా, నా "ఉడుతా భక్తి పూరణ" మొదటిదో రెండవదో మూడవదో అయివుంటుంది నాకీ పాటి ఓపిక ఉన్నన్నాళ్ళూ. నిజానికి నాకు నిద్రాహారాల విషయాలలో ఎలాంటి నియమాలూ లేవు. కోడికునుకూ, పిచుక తిండీ.

      శుభం భూయాత్!

      Ladies First...when tiger comes :)

      తొలగించండి
  25. పద్యమువ్రాయపట్టుదల పద్యమువ్రాయసుశబ్ధసంపదల్
    పద్యమువ్రాయవాణిదయ పద్యము వ్రాయమనో జ్ఞభావనల్
    పద్యమువ్రాయపుట్టవలె పాపతలంపులురేపునట్టిదౌ
    పద్యము వ్రాయువాడుచెడి పాతకమందునుసత్కవీశ్వరా!!!

    రిప్లయితొలగించండి
  26. విద్యల నన్నియుఁ దానన
    వద్యముగా నేర్చి దూష్య భావ నిరసనా
    పద్యాలాప సమాహిత
    పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్


    మద్యపు మత్తు నందున నమానుష రీతిఁ జెలంగి విత్త సా
    రద్యుతి వెల్గి పుక్కిటి పురాణములంచును వెక్కసమ్ముగన్,
    హృద్యపు సత్పురాణముల నెంచి పఠించక యొక్కటేనియుం
    బద్యము, వ్రాయువాఁడు చెడి పాతక మందును సత్కవీశ్వరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  27. హృద్యంబగుపదములతో
    బద్యంబునువ్రాయకుండపరిహాసముగాన్
    మద్యముశ్రేయంబనుచును
    పద్యమ్మునువ్రాయువాడుపాతకమందున్

    రిప్లయితొలగించండి
  28. మద్యము త్రాగెడి వాడు, న
    ఖాద్యమ్ములతినెడివాడు, కాపురుషుండున్
    విద్యలనవమానించుచు
    పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్

    రిప్లయితొలగించండి
  29. పద్యపు రీతుల నెరుగక
    మద్యమునకు బానిసైన మనుజుండిట్లనె
    "పద్యమనగ 'సీస'; మితర
    పద్యమ్మును వ్రాయువాడు పాతకమొందున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యస్వీయార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మనుజు డిట్లనెన్" అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువు గారు!
      సవరించిన మీదట:

      పద్యపు రీతుల నెరుగక
      మద్యమునకు బానిసైన మనుజుడిటనియెన్
      "పద్యమనగ 'సీస'; మితర
      పద్యమ్మును వ్రాయువాడు పాతకమొందున్"

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  30. పద్యమువ్రాయువాడుచెడిపాతకమందునుసత్కవీశ్వరా!
    పద్యమువ్రాయగాభువినిపాతకమంచునుబల్కుచుంటిరే
    చోద్యముగాదెస్వామి!శూన్యమయాయెనుడెందమిత్తరిన్
    బద్యమువ్రాయువాడుగదపంకజనాభునిముద్దుబిడ్డడున్

    రిప్లయితొలగించండి
  31. విద్యాబుద్దులు జెరిపెడి
    మద్యమ్మును గ్రోలువాడి మాటల విధమై
    అద్యయనమ్మునకందని
    పద్యమ్మును వ్రాయువాడు పాతక మందున్|
    2.పద్యపదాల మల్లియల భావసుగంధము బంచనట్టిదై|
    అద్యయనాన యర్థములు నారిననిప్పునవండు వండువంటలై|
    విద్య వివేకముల్ నిడని,వేదన నింపెడి మూర్ఖతత్వమౌ
    పద్యము వ్రాయువాడుచెడి పాతకమందును|సత్కవీశ్వరా|

    రిప్లయితొలగించండి
  32. కవిమిత్రులకు గమనిక...
    చాలామంది కోరిక ననుసరించి రేపటి నుండి మన బ్లాగులో సమస్యలను భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ప్రకటిస్తాను. ప్రాశ్చాత్యదేశాల మిత్రులకు కొంత ఇబ్బంది కలుగవచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. సీతాదేవి గారు బ్రాహ్మీ ముహుర్తమన్నారు ! ఓ మూడు గంటలకు పెడితే బాగుంటుందేమో నండి


      జిలేబి

      తొలగించండి
    2. శంకరార్యా
      నాకు మాత్రం చాలా యిబ్బంది
      పగలు నేనసలు పూరణనే చెయ్యలేను
      ఉదయం ఏడు నుండి
      రాత్రి 12 కు మార్పించు కున్నదే నేను !
      నన్ను పూర్తిగా విస్మరించారు

      తొలగించండి
    3. ఇన్ని రోజులూ నా కోరిక మన్నించినందులకు ధన్యవాదములు

      తొలగించండి

  33. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    పద్య.పయోజ.మాల.సముపస్కృత.రూపిణి యైన యట్టి యా

    విద్యల తల్లి సత్కరుణ (న్ ) , వీలుపడున్ రచియింప బద్యమున్ |


    పద్యములన్ రచించి భగవంతుని స్తోత్రము జేయగా దగున్

    పద్యములన్ రచించి యభివర్ణన జేయ నగున్ బురాణముల్

    హృద్యముగా జగధ్ధితములన్ వివరింపగ ‌వచ్చు | కాని , యు

    ఛ్ఛేద్య మొనర్పగా దగు నశిష్టుల నెల్లరి >> సన్నుతించుచున్ ,

    పద్యము వ్రాయు వాడు చెడి పాతక మందును " సత్కవీశ్వరా ! "


    { పద్య.పయోజ.మాల. సముపస్కృత.రూపిణి = పద్య పద్మ మాలికా

    సమలంకృత రూపిణి ; ఉఛ్ఛేద్య మొనర్పగా దగు నశిష్టుల =

    బహిష్కరింప దగిన దుర్జనుల ; }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  34. ఆద్యంతంబతుకులతో
    గద్యంబున గణముజేర్చి కవిత యటంచున్
    వేద్యంబు గాని విధముగ
    పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్

    చోద్యము చూపలేక కడు శుష్క వివాద పరీత భూతమై
    హృద్యపు లేమి, సత్కవనమెందుఁ ఘటింపని భావ హీనతల్
    సద్యశ కారణంబుల విచారణ లేక పదార్థ హీనమై
    పద్యము వ్రాయువాఁడు చెడి పాతక మందును సత్కవీశ్వరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  35. హృద్యంబగు చందమ్మున
    పద్యములను వ్రాయగలిగి, బరిహాసముతో
    నుద్యమముగ నశ్లీలపు
    పద్యములను వ్రాయు వాడు పాతకమందున్!!!

    రిప్లయితొలగించండి
  36. కందం
    విద్యార్థీ! లలితకళల
    హృద్యమ్మౌనది కవిత్వమేర్పడ జెప్పన్
    బాధ్యతఁగొను తద్భిన్నపు
    పద్యమ్మును వ్రాయు వాఁడు పాతకమందున్

    రిప్లయితొలగించండి
  37. సద్యశ మంద కావ్యతతి చక్కగ వ్రాయగ వచ్చు కానిచో
    హృద్య కవిత్వ ప్రక్రియకు నింపగు తళ్కుల నద్ద వచ్చు కాని యు
    చ్ఛేద్యము శ్లీల వైకృతము ఛీ యని సభ్యులు రోయు నట్టిదౌ
    పద్యము వ్రాయువాఁడు చెడి పాతక మందును సత్కవీశ్వరా!



    రిప్లయితొలగించండి



  38. విద్యల నేర్వగ ముఖ్యము

    పద్యమనిపల్కు చుంద్రు పండితులెల్లన్

    హృద్యము కానటువంటి కు
    పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్.


    విద్యన చదువుల తల్లే

    పద్యాదులతోడగూడి వాసిని గాంచెన్

    మద్యము త్రాగుచు నెప్పుడు

    పద్యమ్మును వ్రాయువాఁడు పాతకమందున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      వాట్సప్ సమూహంలో నా సూచనను గమనించండి.

      తొలగించండి
  39. కం:-
    విద్యల నెంతయు నేర్చిన
    హృద్యంబెరుగక మనీషి హితమునుఁజెరచన్
    మద్యము సేవించి వెడఁగు
    పద్యమ్మును వ్రాయువాడు పాతకమందున్ !!!

    @ మీ పాండురంగడు*
    ౦౭/౦౧/౨౦౧౮

    రిప్లయితొలగించండి
  40. సమస్య:
    పద్యంబును వ్రాయువాడు పాతక మందున్
    **************************************
    సందర్భము: యతి ప్రాసలను మింగివేసి గణాలను బ్రేవు మని త్రేన్చి చవకబారు పద్యాన్ని సరిపెట్టే వారికి పాతకమే వస్తుంది.

    ఆద్యంతము యతిప్రాసలు
    ఖాద్యము లటు మింగి బ్రేవు
    గా గణములనే
    చోద్యంబుగ త్రేన్చి చవక
    పద్యంబును వ్రాయు వాడు
    పాతక మందున్

    మరొక పూరణము:

    సందర్భము: సత్కవికి పద్యంతో చేసే దైవారాధనమే వ్యవసాయం. దానికి మొదటి వాడు పోతనయే! అలా కాకుంటే పాతకమే వస్తుంది.

    పద్యమ్మున దైవార్చన
    సేద్యము గద సుకవికి! మురిసిన
    పోతనయే
    యాద్యుం, డటు గానిది యగు
    పద్యంబును వ్రాయువాఁడు
    పాతకమందున్

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

    రిప్లయితొలగించండి
  41. ...........సమస్య
    పద్యంబును వ్రాయువాడు పాతక మందున్
    **************************************
    సందర్భం:మామూలు వ్యవసాయం ఇహ లోకానికే పనికి వస్తుంది. దైవానికి అంకితమైతే పద్యం ఉత్తమమైన సేద్యమై ఇహ పర సాధక మౌతుంది. అలా కాని పద్యంవల్ల పాతకమే!

    సేద్యం బిహమునకే గద!
    పద్యము దైవమున కీయబడు
    సేద్య, మిడున్
    చోద్య మిహ పరముల, నితర
    పద్యంబును వ్రాయువాడు
    పాతక మందున్..

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెలుదండ వారూ,
      మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  42. ఉత్పలమాల
    విద్యనుఁ గూర్చి విష్ణుకథ వీనుల విందుగ రామచంద్రు నై
    వేద్యము జేసి, భారతికి వేదన బాపిదె, దైవచిత్తమున్ 
    ఖాద్యము నెంచి ద్రోసి ప్రభు కాన్కలఁ గోరి రచించి వారి పై
    పద్యము వ్రాయు వాఁడు చెడిపాతకమందును సత్కవీశ్వరా!

    రిప్లయితొలగించండి
  43. విద్యలనన్నిటిన్ గఱచి వెన్నుని గాధల కూర్చియుండతా
    ఖాద్యము కొఱకై నృపుల కాళ్ళకు నిచ్చుట కంటె రీతిగా
    సేద్యము చేయుటే శుభము; సేవ్యుని ఖ్యాతిని ప్రస్తుతించుచున్
    పద్యము వ్రాయువాఁడు చెడి పాతక మందును సత్కవీశ్వరా!

    రిప్లయితొలగించండి
  44. గద్యము వ్రాయజాలకయె గట్టిగ నేడ్చుచు గోలబెట్టుచున్
    సద్యశ శంకరాభరణ సంగము నందున సుంత నేర్చుచున్
    విద్యల రాణికిన్ మిగుల బింకము జూపుచు నన్నుబోలుచున్
    పద్యము వ్రాయువాఁడు చెడి పాతక మందును సత్కవీశ్వరా!

    రిప్లయితొలగించండి