28, జనవరి 2018, ఆదివారం

సమస్య - 2581 (కీచకుఁ డైనట్టి గురువు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్"
(లేదా...)
"కీచకుఁ డైన సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్"

117 కామెంట్‌లు:

 1. నీచపు బుద్ధుల మాపుచు
  కాచుచు మనములను కండ కావరమందున్
  దోచుచు హృదయపు చీరలు
  కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్

  రిప్లయితొలగించండి
 2. ఆచరణము సరిలేకను
  రేచీకటి వానివలెను రేయిం బవలు
  న్నీచపు పనులను జేసిన
  కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్

  రిప్లయితొలగించండి
 3. లోచనరహితుడు మహిలో
  "కీచకుఁ డైనట్టి గురువు ,కీర్తి గడించున్
  వాచస్పతుడనవరతము
  నాచిని మాతృక గజూచి నమసము లిడగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. గోచర మౌనుగ చూడగ
  పాచక కథనముల తోడ పదేపదే టీ
  వీ చానల్సే చూపగ
  "కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విట్టుబాబు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని పూరణ భావం బోధపడలేదు. పాచకునకు, గురువుకు సంబంధం? 'వంటలు నేర్పే నెపంతో హింసించే పాచక గురువు' అని మీ అభిప్రాయమా?
   రెండవ పూరణలో 'పదేపదే' అన్నచోట గణదోషం. అక్కడ "పలుమారులు టీ..." అనండి.

   తొలగించండి
  2. పాచక కథనాలు అని టీవీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అన్నాను గురూజీ. అంటే టీవీ వాళ్ళు కథనాలు వండి పదే పదే చూపించి ప్రపంచమంతటికీ తెలిసేలా ప్రచారం చేస్తారనే భావంతో రాశాను. పాచక శబ్ధానికి అన్వయం సరిగా కుదరలేదంటారా?🤔

   ధన్యవాదాలు

   తొలగించండి
  3. నాలుగవ గణం జగణం కారాదనే నియమం మరిచాను. క్షంతవ్యుణ్ణి.
   🙏

   తొలగించండి
 5. గోచర మౌనుగ చూడగ
  వాచాలపు కథనములతొ పదేపదే టీ
  వీ చానల్సే చూపగ
  "కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వాచాలత్వము తోడను
   ఆచారము మంటగలుపు నాచరణముతో
   నీచపు రీతిని గనుమా
   "కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్"

   తొలగించండి
  2. విట్టుబాబూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  నీచపథానువర్తి , రమణీ జనహింసనొనర్చు శిష్యుడే
  కీచకుఁ డైన ., సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్
  శోచితమానసుండయి వచోవిభవమ్మున వాని మార్చియున్
  గాచియు , విద్యనేర్పి మొనగానిగ నిల్పిననాడు సత్కవీ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అల్లరి చేస్తున్న పిల్లలతో... నిద్రలోనికి జారుకుంటున్న గురువు..😊

   పేచీలు మాని వ్రాయుడు
   "కీచకుఁడైనట్టి గురువు కీర్తి గడించున్"
   సూచన యిదె గణవిభజన !
   లేచియు నే రాక మునుపు లిఖియించవలెన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  2. మైలవరపు వారి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. వారికి అభినందనలు.

   తొలగించండి
  3. శ్రీ P S Rao విట్టుబాబు గారికి... మీకు... ధన్యవాదాలండీ 🙏🙏

   ...మైలవరపు మురళీకృష్ణ

   తొలగించండి
  4. సమస్యను పాదం క్రింద జమ కట్టినారన్నమాట మీరు బహు నేర్పరులే

   తొలగించండి
 7. నీచపు మాటల చంపుచు
  దాచిన ద్వేషమ్ము నంత ధాటిగ విసరన్
  తోచని మంచే కానక
  కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్

  రిప్లయితొలగించండి
 8. (కీచకుడు-బృహన్నల)
  నీచపుకోర్కెలో మునిగి నిర్మలమూర్తిని ద్రౌపదీసతిన్
  మేచకవేళలన్ మితులు మీరిన భీమునిచేత చచ్చులే
  కీచకుడైన;సద్గురువు కీర్తిగడించు ధరిత్రిలోపలన్
  సేచనుడై బృహన్నలగ జెల్వుగ నుత్తరరాకుమారిచే.

  రిప్లయితొలగించండి
 9. మా మిత్రుడు రాజగోపాల్ గారు చెప్పిన భావానికి నా పద్యరూపం......

  లేచినతోడనె బ్లాగున
  జూచితి నిచ్చిన సమస్యఁ జోద్యము గాగన్
  దోచ దెటుల పూరించుటొ
  "కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్"

  రిప్లయితొలగించండి
 10. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
  శౌచమనంబునన్ వెలుగు శాంతపు చింతన ఙ్ఞాన రూపమున్
  వాచకమందు స్పష్టత నవారిత వాగ్వి భ వోన్నతుల్ మహా
  వీచికలౌచు నిత్యమవి వేకపు చీకటి వస్త్రమూడ్చగాన్
  కీచకుడైన సద్గురువు కీర్తి గడించు ధరియ్ర లోపలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చారి గారూ,
   చీకటి వస్త్రాలూడ్చే కీచక గురువుపై మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జ్ఞానము'ను 'ఙ్ఞానము' అని టైపు చేశారు.

   తొలగించండి
 11. గురువులకు పెద్దలకు నమస్సులు. బహుకాలంగా చిన్నశంక నన్ను పీడిస్తోంది. జ్ఞానము అనాలా...ఙ్ఞానము అనాలా...
  అనుమాన నివృత్తి జేయ ప్రార్థన!
  🙏

  రిప్లయితొలగించండి
 12. ఏచు ను శిష్యా ళి నె పుడు
  కీచకు డైనట్టీ గురువు ; కీర్తి గడిoచు
  న్నాచరణం బున నేవి యు
  దాచ క బోధించు గురువు దైవము వోలె న్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వర రావు గారూ,
   విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 13. టీచరు వృత్తికనర్హుడు
  "కీచకుఁ డైనట్టి గురువు ,కీర్తి గడించున్
  నీచపు మనమును గలిగెడి
  నాచాత్రులను సుపధంబున నడక నేర్పన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   మీ రెండవ పూరణ విరుపుతో చక్కగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 14. నీచత్వము బొందునిజము
  కీచకుడైనట్టి గురువు; కీర్తినిబొందున్
  వాచస్పతియై విద్యల
  దోచగశిష్యుల మనములు ద్రోణునివలెనే!

  రిప్లయితొలగించండి
 15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2581
  సమస్య :: *కీచకుడైన సద్గురువు కీర్తి గడించు ధరిత్రి లోపలన్.*
  గురువు కీచకుడైతే కీర్తిని పొందుతాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
  సందర్భం :: ధర్మము , అర్థము , కామము , మోక్షము అనే పురుషార్థ చతుష్టయాన్ని సాధించాలంటే , మన ఆలోచన ఎల్లప్పుడూ ధర్మ బద్ధంగా ఉండాలి. రావణుడు కీచకుడు మొదలైనవారు అధర్మపరులై పర సతీ వ్యామోహంతో నశించిపోయారు కదా అని సద్గురువు దుర్మార్గులను సన్మార్గులుగా మార్చేందుకోసం బోధ చేస్తాడు. గురు బోధను చక్కగా తెలిసికొన్నవాడు కీచకుడైనా సరే మంచివాడుగా మారిపోతాడు. అలా తన మంచి మాటలతో దుర్జనుని సజ్జనునిగా మార్చగల గురువే సద్గురువుగా కీర్తిని పొందుతాడు అని చెప్పే సందర్భం.

  యోచన ధర్మ బద్ధముగ నుండవలెన్ పురుషార్థ సిద్ధికై,
  కీచక రావణాదు లపకీర్తిని గూలిరి చూడుమా యనెన్
  నీచుని మార్చ సద్గురువు ; నీతి నెఱింగిన మారిపోవు గా
  *కీచకుడైన ; సద్గురువు కీర్తి గడించు ధరిత్రి లోపలన్.*
  *కోట రాజశేఖర్ నెల్లూరు.* (28.01.2018)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అద్భుతమైన పూరణ రాజశేఖర్ గారూ! అభినందనలు!🙏🙏🙏🙏

   తొలగించండి
  2. శ్రీమతి సీతాదేవి గారూ! హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. ప్రణామాలు.

   తొలగించండి
  3. రాజశేఖర్ గారూ,
   మీ ఉత్తమంగా ఉన్నది. అభినందనలు.

   తొలగించండి
 16. తా చదివిన జ్ఞాన మెపుడు

  దాచక నిడు గురువె పొందు ధాత్రిన ఖ్యాతిన్!

  గోచరమగు నెటుల పరమ

  కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్!


  🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
  ☘వనపర్తి☘

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతి భూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'తాఁ జదివిన' అనడం సాధువు. దానివల్ల ప్రాస చెడుతుంది. "ధాత్రిని" అనండి.

   తొలగించండి
 17. రిప్లయిలు
  1. ఈశ్వరప్ప గారూ,
   పద్యం బాగుంది. కాని అన్వయం కుదరడం లేదు. 'కీచకుడైనట్టి(వాడు)' ఎవరు? టైపు దోషాలున్నవి. 'ఆచరణపు+ఆదర్శుడు = ఆచరణపు టాదర్శుడు' అవుతుంది.

   తొలగించండి
 18. ఊచలు లెక్కించు సుమీ
  కీచకుఁ డైనట్టి గురువు, కీర్తి గడించున్
  సూచించుచు సన్మార్గము
  ను చదువులను చెప్ప నిచ్చ నూతన విధమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పూరణ బాగున్నది.అభినందనలు!చవరి పాదం ప్రథమాక్షరం లఘువు వచ్చింది. చూడండి.

   తొలగించండి
  2. సవరణ తో
   ఊచలు లెక్కించు సుమీ
   కీచకుఁ డైనట్టి గురువు, కీర్తి గడించున్
   సూచించుచు సన్మార్గము
   తా చదువులు చెప్ప నిచ్చ తద్దయు ప్రీతిన్

   తొలగించండి
  3. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వాస్తవానికి 'తాన్+చదువుచు = తాఁ జదువుచు' అవుతుంది.

   తొలగించండి
 19. యోచన మృగ్యమ్మై ధ
  ర్మాచరణను విస్మరించి మరిమరి వటువున్
  దోచుచు నుండగ నెవ్విధి
  కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్

  రిప్లయితొలగించండి
 20. ఆచార్యుడు గానేరడు
  కీచకుడైనట్టి గురువు, కీర్తి గడించు
  న్నాచరణమ్ముల నేర్పుచు
  నీచత్వము దరిమివేయు నిజ బోధకుడే!!!

  రిప్లయితొలగించండి
 21. వాచకమందునన్ విమల వాంఛిత విద్యల నారితేరియున్
  శోచవ దుష్టభావనల చోదనమందున రాణకెక్కునా
  కీచకుడైన సద్గురువు?కీర్తి గడించుధరిత్రి లోపలన్
  యోచన జేయగాగరిమ నుజ్వల మానస భావదర్శనన్

  రిప్లయితొలగించండి
 22. రిప్లయిలు
  1. 'జేతనుడు' అన్న పదం లేదు. 'చేతనుడు' సరళాదేశ సంధి వల్ల 'జేతనుడు' అవుతుంది. మీ రెక్కడ చూశారు ఆ పదాన్ని?

   తొలగించండి
  2. భక్తజేతనుడు అని ఎక్కడో చదివిన గుర్తు సార్

   తొలగించండి
 23. నీచపు బుద్ధులన్ నిలువ నీయక దండన జేయుచున్ సదా
  కాచుచు మానసమ్ములను కన్నెల కాపరి శక్తులన్ భళా
  దోచుచు హృత్తులన్ సతము తుంటరి చోరుని యుక్తులన్నహా!
  కీచకుఁ డైన సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్

  రిప్లయితొలగించండి
 24. గురువు గారికి నమస్సులు
  కూర్చొని బోధన సేయును
  కీచకుడైనట్టిగురువు,కీర్తిగడించున్
  తోచిన పద్యము లెల్లను
  సూచించు సొబగు నవీన సూక్తుల మతియే.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వెంకట నారాయణ రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. కాని మొదటి పాదంలో ప్రాస తప్పింది.

   తొలగించండి
  2. వెంకటనారాయణ రావు గారి పద్యంలో రెండవ పాదంలో ప్రాస సరియైన దేనా?

   తొలగించండి
 25. గోచీ పెట్టిన ప్రతివా
  డాచార్యుండంచు మూర్ఖులర్చించుటచే
  నీచనికృష్ట దురాశయ
  కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్

  రిప్లయితొలగించండి
 26. వాచాలత లేకయె విధు
  లాచరణయె జేయుచుండి యందరి మనముల్
  దోచుచు, క్రమశిక్షణలో
  "కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్"  రిప్లయితొలగించండి
 27. పీచమడంచగా వలయు భీరవులన్ చెరబట్టి శిష్యుడే
  కీచకుఁ డైన! సద్గురువు, కీర్తి గడించు ధరిత్రిలోపలన్
  బ్రోచెడి వాడనంచు ధర బోడులు భీముడటంచుకొల్వగన్
  కాచెడి వాడె సద్గురువు కాముకులన్ కలినందు ధీరుడై

  తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీహర్ష గారూ,
   మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   'కలియందు' అనండి.

   తొలగించండి


 28. యోచన చేయడు లలనా
  కీచకుఁ డైనట్టి గురువు ; కీర్తి గడించున్
  రాచందముగా శంకరు
  లాచికొని చదువులగరపి లావై యిలలో !


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వేచియు జిలేబి చూచితి...
   దాచుకొనిన పూరణమును దయతో నిడిరే!
   పూచిక మీకీ సమసియ:
   "కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్"

   తొలగించండి
  2. జిలేబీ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'సమస్య'ను 'సమసియ' అన్నారు. అక్కడ "పూచిక సమస్య మీకిది" అందామా?

   తొలగించండి

  3. రెండో పూరణ జీపీయెస్ వారిదండి :)


   జిలేబి

   తొలగించండి
 29. సాచివ్య సమాకలిత మ
  హా చాతుర్యానుశాస నాధ్యాపకుడుం
  బ్రాచుర్య గళోపమిత సు
  కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్

  [గళ+ఉపమిత+సు కీచకుడు: కంఠము, పోల్చ బడిన వెదురు గొట్టము కల వాడు; కీచకము = గాలి తాకున మ్రోగెడి వెదురు/ పిల్లనగ్రోవి]


  చాచుచు స్నేహ హస్తమును జాటుచు నీతిని శిష్య కోటికిం
  బ్రోచుచు సంకటమ్ములను స్ఫూర్తి నొసంగి నిరంతర ప్రమో
  దాచరణ ప్రచోదక మహార్థ సుశబ్ద సుశాస్త్ర కృష్ణకుం
  కీచకుఁ డైన సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 30. నీచకుడగు,శిక్షార్హుడు
  కీచకుడైనట్టి గురువు, కీర్తి గడించున్
  గాచుచునిరతము జనులను
  సూచావాచాలుడవకశుధ్ధిగబలుకన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'నీచకుడు' అన్న పదం లేదు. "నీచుండగు..." అనండి.

   తొలగించండి
 31. ఊచలు లెక్కించు సుమీ
  కీచకుఁ డైనట్టి గురువు, కీర్తి గడించున్
  సూచించుచు సన్మార్గము
  తా చదువులు చెప్ప నిచ్చ తద్దయు ప్రీతిన్

  రిప్లయితొలగించండి
 32. మానసిక పరివర్తన చెందిన ఒక ఉపాధ్యాయుని గురించి ఇతరులు అనుకుంటున్నట్లుగా ......

  చాచిన చిట్టిచేతుల కసాధ్య సుసాధ్యములన్ని జెప్పి స
  ద్యోచిత పాఠముల్ గఱపి యున్నత భావ మెసంగఁ జేయుచున్
  నీచఁపు దుష్ప్రవర్తనము నేడు సమాప్తి యటంచుఁ జెప్పు నీ
  కీచకుఁ డైన సద్గురువు, కీర్తి గడించు ధరిత్రిలోపలన్

  రిప్లయితొలగించండి


 33. దోచుచు విద్య పేరిట పదోన్నతు లన్గను మాయమాటల
  న్నోచిన దాన ! వీరి కథ నోపరి గాన సమాజమున్ భళీ
  యోచన చేసి చూడ కలయో మరి వైష్ణవ మాయ యోగదా
  కీచకుఁ డైన సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 34. నీచునిగాదలంచియునునేర్పుననాతనిబారద్రోలుమా
  కీచకుఁ డైన ,సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్"
  వాచ్యపుభావనల్సరళభాషనుబోధనజేయుచుండుటన్
  కీచకుడన్నవానికిలకీలక వృత్తినినీయగాదుగా

  రిప్లయితొలగించండి
 35. కందం
  సైచక రహస్య లోచన
  పాచికతో పట్టుబడఁ బ్రవర్తించంగన్
  నాచి, తలవంచి నిలబడఁ
  గీచకుడైనట్టి గురువు, కీర్తి గడించున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. సవరణతో

   కందం
   సైచక రహస్య నేత్రపు
   పాచికతో పట్టుబడఁ బ్రవర్తించంగన్
   నాచి, తలవంచి నిలబడఁ
   గీచకుడైనట్టి గురువు, కీర్తి గడించున్

   తొలగించండి
 36. రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'గోచీలనె యూడలాగి' అనండి.

  రిప్లయితొలగించండి
 37. నీచ పు బుద్ది గల్గి యవి నీతి కీ పాల్పడి ద్రోహచింతన ల్
  దాచుచు స్వార్థ పున్ గురువు దారుణ వర్తను డై మె లం గ డే
  కీచకు డైన; సద్గురు వు కీర్తి గడించు ధ రిత్రి లోపల న్
  దాచక మంచి మార్గ ములు ధర్మ వివేచన బెంచ బూని యు న్

  రిప్లయితొలగించండి
 38. ఉత్పలమాల
  సైచక యాగడమ్ముల విచారణఁ జేసి రహస్య లోచనా
  పాచిక వైచి పట్టుబడు వైనము నాచరణంబునన్ దగన్
  నాచి విజేతగా, నిలువ నైచ్యము వెల్వడ నిస్సహాయుడై
  కీచకుఁ డైన సద్గురువు, కీర్తి గడించు ధరిత్రిలోపలన్

  రిప్లయితొలగించండి
 39. కం:-
  వాచకపఠనముఁజేయుచు
  సూచనలిడి పాఠకుండు సుప్రియలెడలన్
  నీచపు వ్యవహారమ్ముల
  కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్ !!!

  @ మీ పాండురంగడు*
  ౨౮/౦౧/౨౦౧౮

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాండురంగారెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. 🙏🙏🙏🙏🙏

   కం:-
   వాచకపఠనముఁజేయుచు
   సూచనలిడి పాఠకుండు సుప్రియలెడలన్
   నీచపు యోచనలు సలుపు
   కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్ !!!

   @ మీ పాండురంగడు*
   ౨౮/౦౧/౨౦౧౮

   తొలగించండి
 40. నీచత్వంబును నమ్మును
  కీచకు డైనట్టి గురువు!॥కీర్తి గడించున్
  దాచక ధర్మపు విద్యను
  ఆచరణాత్మగ దెలిపెడి నద్యాపకుడే !

  రిప్లయితొలగించండి
 41. దోచగ జూచును కన్యల
  కీచకుఁ డైనట్టి గురువు; కీర్తి గడించున్
  నీచపుబుధ్ధిని మెలగక
  దాచక తన జ్ఞాన ధనము ధరకందించన్

  శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  27/01/2018 నాటి నాపూరణ లోని భావం
  '' నా బావ '' = శ్రీ నాథ కవిసార్వభౌముడు = భక్త పోతన బావ

  రిప్లయితొలగించండి


 42. నీచమగుతిట్లుదినునట

  కీచకుఁ డైనట్టి గురువు కీర్తి గడించున్"*
  కాచుచు బాలికల సతము

  సూచించుచుమంచిదారి సులలిత శైలిన్.


  దోచగ నెంచును శీలము

  .కీచకుఁ డైనట్టి గురువు, కీర్తి గడించున్

  శోచన చేయుచు భవితను

  తాఛాత్రులసద్గురుండు ధరలో నెపుడున్

  రిప్లయితొలగించండి
 43. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 44. ఒక ప్రయోగం


  తగనిపనులజేయ నతని
  కెగదపడు సంకెలనిల కీచకుడైన
  ట్టిగురువు; కీర్తి గడించున్
  ద్విగుణీకృతబోధనమ్ము దీప్తిని బెంచన్

  రిప్లయితొలగించండి
 45. ఊచలు లెక్కపెట్టు టగు నొజ్జ ధరిత్రి నకార్యశీలతన్
  కీచకుఁ డైన, సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్
  తాచరి యించుచున్ సతము తద్దయు యర్మిలి పాఠశాలలో
  చూచన లిచ్చుచున్ సతము సొంపుగ శిష్యుల తీర్చిదిద్దినన్

  రిప్లయితొలగించండి
 46. నీచగుణాఢ్యుడైన అవినీతుడు పిల్లల విత్తమానముల్
  దోచి దురంతదుష్కృతముతో అపకీర్తినిఁ బొందు ఒజ్జ తా
  కీచకుడైన, సద్గురువు కీర్తి గడించు ధరిత్రి లోపలన్
  యోచన తోడ బోధనల ఓర్పునఁ జేసియు చిత్తహారుడై.

  రిప్లయితొలగించండి
 47. నీచగుణాఢ్యుడైన అవినీతుడు పిల్లల విత్తమానముల్
  దోచి దురంతదుష్కృతముతో అపకీర్తినిఁ బొందు ఒజ్జ తా
  కీచకుడైన, సద్గురువు కీర్తి గడించు ధరిత్రి లోపలన్
  యోచన తోడ బోధనల ఓర్పునఁ జేసియు చిత్తహారుడై.

  రిప్లయితొలగించండి
 48. నీచగుణాఢ్యుడైన అవినీతుడు పిల్లల విత్తమానముల్
  దోచి దురంతదుష్కృతముతో అపకీర్తినిఁ బొందు ఒజ్జ తా
  కీచకుడైన, సద్గురువు కీర్తి గడించు ధరిత్రి లోపలన్
  యోచన తోడ బోధనల ఓర్పునఁ జేసియు చిత్తహారుడై.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దయచేసి క్షమించగలరు విషయం తెలియక మూడు మారులు టైపు అయ్యింది

   తొలగించండి
 49. నీచుని కంఠదఘ్నముగ నిల్వున నేలను పాతుపెట్టుడౌ
  బూచిని బోలు ఆగురువు బోధననర్తనశాలలోపలన్
  కీచకుడైన, సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్
  యోచనవాచనమ్ము సమయోచితమట్లునొనర్చి శ్రేష్ఠుడై.

  ఒక సంస్కృతకవిశ్లోకం--
  "గురవో బహవో రాజన్ శిష్యవిత్తాపహారకాః,
  భవాదృశాస్తు విరళాః శిష్యచిత్తాపహారకాః.

  రిప్లయితొలగించండి

 50. ...........సమస్య
  కీచకుడైన సద్గురువు
  కీర్తి గడించు ధరిత్రిలోపలన్
  ~~~~~~
  సందర్భం: దుర్జనులతో జట్టుకట్టి వారికి కొమ్ము కాస్తూ వుంటే కూడ కీర్తి వస్తుంది కాని అది చెడ్డది.
  కీచకుడైనప్పటికీ దుర్జనుల పాలిట అతడు సద్గురువుగానే పరిగణింపబడుతాడు. (చెడ్డ
  గురు వని వా రనరు గదా!)
  ~~~~~~
  లేచిన వేళనుండి తెగ
  రిమ్మఁ జరించుచు స్వీయ వర్గమున్
  కాచుచునున్న గూడ మరి
  కల్గును కీరితి, యైన చెడ్డదై
  తోచును గాని, వాడె కడు
  దుర్జన శిష్యుల మూక కెప్పుడున్
  కీచకుడైన- సద్గురువు;
  కీర్తి గడించు ధరిత్రిలోపలన్

  ~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి

 51. .........సమస్య
  కీచకుడైన సద్గురువు
  కీర్తి గడించు ధరిత్రిలోపలన్
  ~~~~~~~
  సందర్భం: దుర్యోధనుడు మహాత్ముడైన బలరాముని వద్ద గదాయుద్ధా న్నభ్యసించినాడు. ధర్మాచరణాన్ని మాత్రం కాదు.
  విద్యవల్ల వీరుడైతే అయ్యాడు. కాని ధర్మాత్ముడు కాలేకపోయాడు. ఎంత మహాత్ముడైనా మనుష్యుల బుద్ధులను మార్చలేడు (ఎక్కడో తప్ప).
  ~~~~~~~
  నీచుడునౌ సుయోధనుడు
  నిర్మలుడౌ బలరాము జేరగా
  దాచెనె! య మ్మహాత్ముడు గ
  దాయుధ యుద్ధము నేర్పలేదె! ధ
  ర్మాచరణమ్ము నేర్వడు గ
  దా! కురు భూపతియైన మూర్ఖుడౌ
  కీచకుడైన--సద్గురువు
  కీర్తి గడించు ధరిత్రిలోపలన్

  ~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి

 52. ...........సమస్య
  కీచకుడైనట్టి గురువు కీర్తి గడించున్
  ~~~~~~
  సందర్భం: "కీచక" మంటే ఖాళీ భాగాన్ని కలిగివుండి చిన్న గాలి తాకినంతనే చప్పుడు చేసే (rattling or whistling in the wind) వెదు రని యర్థం.
  కీచక స్వన మంటే ఇది= a hallow groaning sound as that of the wind passing the mouth of a tube.
  కీచకము కలవాడు కీచకుడు. వేణువాదనం నేర్పే ఒక కీచకుడు చక్కని కీర్తికి పాత్రు డౌతున్నాడు.
  ~~~~~
  కీచకము.. 'గాలి తాకిన

  చో చాలును మ్రోగు వెదురు..'
  సొంపుగ మురళిన్

  దాచక నేర్పెడి నొక సత్

  కీచకుడైనట్టి గురువు కీర్తి గడించున్

  ~డా.వెలుదండ సత్యనారాయణ

  రిప్లయితొలగించండి
 53. నీచుడు చోరుడైననిట నీరజ నేత్రల పాలిటన్ను తా
  కీచకుఁ డైన సద్గురువు కీర్తి గడించు ధరిత్రిలోపలన్
  దోచుచు కోటి కోట్లనిట దోరపు కన్నెల మోసపుచ్చుచున్
  వేచెడి భాజపాకునిడ ప్రీతిగ రాముని మందిరమ్ముకై...

  రిప్లయితొలగించండి