23, జనవరి 2018, మంగళవారం

సమస్య - 2577 (ఖరమార్గంబున సాగుమా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"ఖరపథంబు సౌఖ్యకారకంబు"
(లేదా...)
"ఖరమార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో సుశర్మ గారు ఇచ్చిన సమస్య)

130 కామెంట్‌లు:

  1. తినుచు పేపరులను తిరుగుచు వీధిలో
    యోగి వోలె నిలిచి భోగ మొంది
    చాకి రేవునుండి కోకలు మోసెడి
    ఖరపథంబు సౌఖ్యకారకంబు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కనుల నగవు లొలుకు ; గాంచును శమముతో ;
      ఇంత గడ్డి తిన్న నెంతొ మురియు ;
      చీకు చింత లేని చిన్నారి గార్దభా !
      ఖరపథంబు సౌఖ్య కారకంబు .

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇంతకీ 'ఎవరికి' సౌఖ్యకారకం?
      *****
      బాపూజీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గార్ధభమా!' అని సంబోధించవలసింది "గార్దభా!" అన్నాడు. అక్కడ "గాడిదా!" అనవచ్చు కదా!

      తొలగించండి
  2. తీరి భర్త నెపుడు తిట్టుటే సరసంబు
    చీరె సారె లనుచు పోరు సలుప
    బరువు మోసి నంత భారమవగ మేను
    ఖరపధంబు సౌఖ్య కార కంబు

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    తిరిపమ్మై తిరుగాడు దాను , సుదతిన్ దివ్యాంబరశ్రేణితో
    మురిపించున్ , తపమాచరించుచును దా పుత్రద్వయమ్మున్ సుధీ..
    వరులన్ జేయ దపించు , పూర్ణమగు నిస్వార్థమ్మునౌ చంద్రశే....
    ఖరమార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ చంద్రశేఖర పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      ఇంతకూ చంద్రశేఖరుని మార్గమూ ఖరమార్గమే అంటారు (గాడిద చాకిరీ!).

      తొలగించండి
    2. మురళీకృష్ణగారూ! పద్యం అద్భుతంగా ఉన్నది! కాని, శివుని నిస్వార్ధసేవను కుటుంబానికే పరిమితం చేశారు! విశ్వనాథునిగా వర్ణించి ఉంటే ఇంకా ఉత్తమంగా ఉంటుందని నా భావన! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
    3. శివునికి విశ్వమే కుటుంబం. అతని కుటుంబం, బాంధవ్యాలన్నీ కేవలం సంకేతాలే.

      తొలగించండి
    4. శ్రీమతి సీతాదేవి గారికి నమస్సులు..... మహానుభావుడు శంకరుడు... విశ్వనాథ వృత్తాంతం విపులమైనది.. సమస్య ఒక మార్గంలో వెళ్లమంటోంది....అందునా.. గరళాశనం వంటి విషయాలు మనం పాటించలేనివి... ఆ మార్గంలో వెళ్ళమనలేము.. మనకు సాధ్యమైనంత వరకు అన్వయించుకొనుటయే ఈ పరిమితమైన పద్యంలోని చమత్కారం గా భావించితిని... నమోనమః....

      మురళీకృష్ణ

      తొలగించండి
    5. కర్మయందు నీకు కలదధికారమ్ము !
      ఫలమునందు కోర్కె వలదటంచు
      నమలబోధజేయు నాయదువంశశే..
      ఖరపథంబు సౌఖ్యకారకంబు !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  4. సాగ గలమె దాటి సంసార జలధిని?
    పరిమితమ్ము మనకు ప్రతిభ జూడ!
    నరయ నొకటె మార్గ మాచంద్ర శేఖశే
    "ఖరపథంబు సౌఖ్యకారకంబు!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చంద్రశేఖశేఖర'...? "మార్గ మభవుడౌ చంద్రశే।ఖర పథంబు..." అందామా?

      తొలగించండి
    2. అరయ నొకటె మార్గము + ఆచంద్ర శేఖర.....
      అని నేనుద్దేశించాను.

      తొలగించండి
  5. ఓర్పు గూర్చి మనకు నేర్పులే పాఠంబు
    ఎంత బరువు నైన ఇట్టె మోయు
    "గాడిదన్న" తిట్టుకాదురా! పొగిడెరా!
    ఖరపథంబు సౌఖ్యకారకంబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీనాథ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తిట్టు కాదు పొగడ్తరా!" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి


  6. అరయగన్ జిలేబి యానము చంద్రశే
    ఖరపథంబు సౌఖ్యకారకంబు,
    గొల్వ వలెను హృదయ కుహురమ్మునన్ దీవె
    న లతనివి యహర్దినమ్ము గాన!

    అహర్దినము -అనుదినము ప్రతిదినము
    ఆంధ్రభారతి ఉవాచ

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. ఖరము కనగ తెలియు కష్టపడు విధంబు
    బద్ధకస్తులకది పాఠ మౌను
    శ్రమను నమ్ముకున్న ప్రాప్తమౌ సుఖములు
    ఖరపథంబు సౌఖ్యకారకంబు

    🌿🌿🌿ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘వనపర్తి☘

    రిప్లయితొలగించండి


  8. అరయన్నిచ్చలు డాత డమ్మ మదిలో నాయుగ్మనేత్రుండవన్
    చరమై యాతడు వేల్పు గానమరె నుచ్ఛ్వాసై సమాహారమై
    వరమై వెల్గె జిలేబి, జీవితమునన్ వర్ధిల్లగన్ చంద్రశే
    ఖరమార్గంబున సాగుమా, కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  9. వరలున్ కష్టపుమార్గమందెపుడు నవ్యంబైన ధీస్పూర్తితో
    మురికిన్ దేటగజేయుచున్నరుల నెమ్మోముల్ ప్రదీప్తింగొనన్
    పరమార్దంబునెరుంగువానికిల నింపైనట్టిదౌ శ్రామికా
    ఖరమార్గంబున సాగుమా,కలుగు సౌఖ్యశ్రీలు నీకెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి వారూ,
      పద్యం బాగుంది. పూరణ సమర్థంగా తోచడం లేదు. 'శ్రామిక+అఖర మార్గ' మంటే శ్రామికుల యొక్క కఠినం కాని మార్గం అనే అర్థం వస్తుంది.

      తొలగించండి
  10. వల్ల కాడు నెలవు వలువలు లేకుండ
    మేన బూది నలది మెలగు వాడు
    బిచ్చ మెత్తు కొనుట వేడు క చంద్ర శే
    ఖర పథం బు సౌఖ్య కార కం బు

    రిప్లయితొలగించండి
  11. మూఢ జనుల బుద్ధి మోకరిల్లినగాని.
    మార్పు చెందఁబోదు మాట వినదు
    'దురుసు'తనమె దానితో సాగు మార్గము.
    ఖర పథంబు సౌఖ్య కారకంబు.

    ఖరము=harsh బ్రౌణ్యం

    రిప్లయితొలగించండి
  12. గాడిదన్న మాట కాదులే హేయంబు
    చూడ నందు లేదు చోద్యమేమి
    అంద నెంచ శాంతి ఆధ్యాత్మికమ్మున
    "ఖరపథంబు సౌఖ్యకారకంబు"

    రిప్లయితొలగించండి
  13. కష్ట సుఖములెపుడు కావడి కుండలై
    మహిని సాగు చుండు మనిషి వెంట
    జీవితమ్ము సాగ స్థిరముగా చంద్ర శే
    ఖరపథంబు సౌఖ్యకారకంబు

    రిప్లయితొలగించండి
  14. సరదా పదాలతో:

    పరుగుల్ పెట్టక వీధిలో నిలిచి తాపమ్మున్ భరించున్ సదా
    సరుకుల్ మోయుచు వీపుపై నెపుడు వేసారున్ విసుంగున్ వినా
    కరుగున్ నాహృది కొట్టుచో భళిగ చాకళ్ళుల్ విధింగన్నెటుల్
    "ఖరమార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్" ???

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. జీపీయెస్ వారు

      మీకో కంద సమస్య :)

      వ్యర్థములే పద్యములు సువర్ణము లైనన్ !

      జిలేబి



      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. జిలేబీ గారూ:

      మీ అందరి ప్రోత్సాహంతో గత కొన్ని రోజులనుండి కంద పద్యములపై మోజు తగ్గి వృత్తములలో మజా ఎక్కువైనది.

      మీకు బెంగాలీ వచ్చు కాబట్టి రామకృష్ణ పరమహంస మాట ఈ సందర్భంలో వినిపించెదను:

      "బాలక్ కే రమణ సుఖ్ కీ కొరే బుఝానొ జాబే!"

      😊😊😊

      తొలగించండి


    4. అయితే అందుకోండి వృత్తాన్ని :)


      వ్యర్థంబయ్య ప్రభాకరా! విడువుమా పద్యమ్ము సౌఖ్యంబగున్ !

      జిలేబి

      తొలగించండి
    5. అర్థమ్మున్ గడియింప లేని పరమో పాధ్యాయుడై పోతివే!
      అర్థమ్ముల్ తెలియంగ లేక తెలుగున్నాచార్యుడై పోతివా?
      స్వార్థమ్మున్ విడనాడ లేని విధురా! శాస్త్రీ! హి! నీజన్మ హా!
      వ్యర్థంబయ్య ప్రభాకరా! విడువుమా పద్యమ్ము సౌఖ్యంబగున్ !

      తొలగించండి
    6. వావ్ !!👏👏👏👏. నిష్ణాతుడివైపోయావు!!

      తొలగించండి


    7. పార్టీచేతుము రండి!వృత్తమునిటన్ పారించినా భేషుగన్ :)

      తొలగించండి
  15. కుతుక యెoడి పోవు కృత్తిక కార్తె లో,
    దినకరుండు వేడి దివము యంత
    పొంది, రాత్రి వేళ పొడ చూపెడి శివశే
    "ఖరపథంబు సౌఖ్యకారకంబు

    రిప్లయితొలగించండి
  16. శిరము వంచి మోయు ఖరము బరువు నంత
    వీపు పైన,యింటి వెలుపల నివ
    సించి సతము కుక్క సేవించు, యట్టి ప్ర
    "ఖరపథంబు సౌఖ్యకారకంబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'దివము+అంత' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'శివశేఖర' అంటే మీ భావం?
      రెండవ పూరణలో "వీపుపైన నింటి... సేవించు నట్టి..." అనండి.

      తొలగించండి
    2. శివ శేఖర అనగా చంద్రుడు శివశేఖరము [permalink]

      చంద్రుడు : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 Report an error about this Word-Meaning

      అంబుజన్ముడు, అంబుజుడు, అంభోజుడు, అంశుడు, అజుడు, అత్రినేత్రుడు, అత్రినేత్రభువు, అబ్జారి, అబ్జుడు, అబ్ధిజుడు, అబ్ధినవనీతకుడు, అభిరూపుడు, అమతి, అమృతకరుడు, అమృతకిరణుడు, అమృతదీధితి, అమృతసువు, అమృతసూతి, అమృతాంశుడు, అమృతుడు, ఆత్రేయుడు, ఇందు(డు)(వు), ఉడుపతి, ఉడుపుడు, ఉడ్వధిపుడు, ఉడ్వీశుడు, ఉత్పలబాంధవుడు, ఋక్షరాజు, ఎదగందు, ఏణతిలకుడు, ఏణభృత్తు, ఏణలాంఛనుడు, ఏణాంకుడు, ఓషధీషుడు, ఓషధీపతి, కడలివెన్న, క(లా)(ళా)దుడు, కలాపుడు, క(లా)(ళా)వంతుడు,

      తొలగించండి
  17. చీడపీడ దొలగి చీకట్లు దొలగంగ
    శీతగాలిబోయి జీవులకును
    వెచ్చవెచ్చగాను హెచ్చు జవమునిచ్చు
    ఖరపథంబు సౌఖ్యకారకంబు!

    ఖర = వేడిమి గలది (ఆంధ్ర భారతి )
    ఖరపథము = ఉత్తరాయణము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉన్నతంబుగాగ నుజ్వలమైయుండు
      పన్నగేశు శిరము పగిదిదోచు
      తిరముగాను నిలుచు తిరుమల కొండశి
      ఖరపథంబు సౌఖ్యకారకంబు!

      తిరుమల కొండ = అన్నమాచార్య విరచితము ( కట్టెదుర వైకుంఠము కాణాచైన కొండ)

      తొలగించండి
    2. మొదటి పద్యము పాఠాంతరము
      మూడవ పాదము
      వెచ్చవెచ్చగాను హెచ్చజవము రవి

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  18. విషము త్రాగి సుధను వేల్పులకై వీడె
    తిరిపెమెత్తి భక్త వరదుడయ్యె
    నిట్టి శ్లాఘ్యమైన హితకర చంద్రశే
    ఖర పథంబు సౌఖ్య కారకంబు

    రిప్లయితొలగించండి
  19. సవరణతో:
    సాగ గలమె దాటి సంసార జలధిని?
    పరిమితమ్ము మనకు ప్రతిభ జూడ!
    నరయ నొకటె మార్గ మభవుడౌ చంద్రశే
    "ఖరపథంబు సౌఖ్యకారకంబు!"

    రిప్లయితొలగించండి
  20. కష్టకాలమందు కరుణించు మని జను
    లిష్ట దైవములను నిష్టతోడ
    వేడుకొందురు సరె, వినుతించు చంద్ర శే
    ఖరపథంబు సౌఖ్యకారకంబు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిష్ఠ'ను 'నిష్ట' అన్నారు. 'నిష్ఠతోడ' అంటే ప్రాసయతి తప్పుతుంది. ఆ పాదాన్ని "..లిష్టదైవములను హితము గోరి" అందామా?

      తొలగించండి
  21. ఎట్టి వారి కైన నిహమున జంద్రశే
    ఖరప థంబు సౌఖ్య కా ర కంబు
    సందియంబు లేదు శ్రధ్ధగా బూజను
    జేయ పరమపదము జెందు సుమ్ము

    రిప్లయితొలగించండి
  22. ధర్మరాజుతో మునుల పలుకులు
    అరయన్ నున్నతమైన స్థానమున తానారీతి రాణింపగన్
    నరులేవేళను యత్నముల్ సలుపగా నందున్ గమ్యమేనాడు
    వే
    సరి,యాగంగను నిల్చిపోవు తలపుల్ స్థైర్యమ్ముగా రాజశే

    ఖర!మార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  23. అరయ గార్ధభమ్ము నలుసుగా గనవద్దు
    బరువు మోసి మనకు గరపు నీతి
    జీవితమున భారమది చింత కాదింక
    ఖరపథంబు సౌఖ్యకారకంబు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
  24. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2577
    సమస్య :: *ఖర మార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్.*
    ఖర అనే పదానికి అర్థం *గాడిద* అని ఉన్నది. గాడిద వెళ్లే మార్గంలో వెళ్లు నీకు సుఖములు కలుగుతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: దేవతలు రాక్షసులు కలసి అమృతంకోసం పాలసముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు , హాలాహలం పుట్టి లోకాలను దహించేందుకు సిద్ధం కాగా , దాన్ని చూచి అందరూ భయపడుతూ ఉంటే , శివుడు లోకకల్యాణం చేసేందుకు దానిని మ్రింగి , గొప్ప శోభతో నీలకంఠుడు అని ప్రసిద్ధి కెక్కినాడు. కాబట్టి స్వార్థం లేకుండా లోకహితం కోరుకొంటూ ఆ నీలకంఠునికి మార్గాన్ని అనుసరిస్తే నీకు సుఖ సంపదలు కలుగుతాయి అని గురువు శిష్యునికి ఉపదేశం చేసే సందర్భం.

    సురలున్ దైత్యులు సంద్రమున్ చిలుక నాశు ప్రౌఢి , హాలాహలం
    బరుదెంచెన్ , భయమంది రంద , రనుకంపన్ లోకకల్యాణ త
    త్పరుడై శంభుడు దాని మ్రింగె , ఘన శోభన్ నీలకంఠుండుగా
    మెరిసెన్ , లోకహితమ్ము నెంచుట సదా మేలంచు నా చంద్ర శే
    *ఖర మార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీకెప్పుడున్.*
    *కోట రాజశేఖర్ నెల్లూరు.* (23.01.2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


    2. రాజశేఖరుల చంద్రశేఖరుల నిఘృష్వము అత్యద్భుతః


      జిలేబి

      తొలగించండి
    3. పద్య ప్రశంస గావించిన
      సహృదయులు శ్రీ జిలేబి గారికి
      హృదయపూర్వక ధన్యవాదాలు. కోట రాజశేఖర్.

      తొలగించండి
  25. సత్యవాక్కు లందు నిత్య మలరి మిత
    భాషణ రతులు నయి వేష భాష
    లందు నింపు గొలుపు సుందర విబు ధాము
    ఖర పథంబు సౌఖ్యకారకంబు

    [విబుధ+అముఖర= విబుధాముఖర; అముఖరము= ముఖరము కాని/ అసంబద్ధ వచనము లాడనివారు]


    పరిశీలించఁగ భోగ భాగ్యములు సువ్యక్తం బనిత్యమ్ములే
    స్థిర జీవేచ్చ వహించి జీర్ణపట రీతిన్ వీడి విత్తంపు లా
    హిరి చిత్తమ్మున రామకృష్ణ ముఖ యోగీంద్రాది వేదజ్ఞ శే
    ఖర మార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా, ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  26. వారం, పది రోజులుగా వ్యాఖ్యలు ప్రచురించడానికి ఒక్కొక్కదానికి రెండు నుండి ఐదు నిమిషాల సమయం పట్టేది. ఎంతో ఇబ్బందిని ఎదుర్కొన్నాను.
    నిన్న రాత్రినుండి వ్యాఖ్యలు వెంట వెంటనే ఏమాత్రం ఆలస్యం లేకుండా బ్లాగులో ప్రత్యక్షమౌతున్నాయి.
    ఇబ్బంది దానికదే తొలగిపోయినందుకు సంతోషంగా ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. పార్టీచేతుము రండి!వృత్తమునిటన్ పారించినా భేషుగన్ :)

      జిలేబి

      తొలగించండి


    2. గూగుల్ బగ్గును మాపన్
      మా గురువులకు శ్రమయు సుమా తగ్గెనయా :)


      జిలేబి

      తొలగించండి
    3. హార్టుల్ స్టాపును జేయుచుండ గడుసౌ హార్డ్వేరు ప్రాబ్లెమ్మెమో!
      పోర్టల్లందున వైరసుల్ విరివిగా పోరాటమాడ్చున్నవా? ...
      సార్టౌటాయనుగా తనంట తదియే సాఫ్ట్వేరు ప్రాబ్లెమ్మ హా!
      పార్టీచేతుము రండి!వృత్తమునిటన్ పారించినా భేషుగన్ :)

      తొలగించండి
    4. స్టాపున్ జేయగలేమికన్ పరుగిడ
      స్టార్టప్పు శాస్త్రీయమై!😇😇😇

      తొలగించండి
    5. డన్ అని ఉండాలా? డ గురువా లఘువా?

      తొలగించండి
  27. ధరపైపుట్టెను పుణ్యమూర్తి నడిచే దైవంబుగాఁ గంచిలోఁ
    బరమాచార్యుడు చంద్రశేఖరుడు సర్వజ్ఞుండు చూపించెగా
    హరువౌ ధర్మపథమ్ము - ముక్తిగొన దివ్యమ్మైన యా చంద్రశే
    ఖరమార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  28. భావమునకె యధిక ప్రాధాన్యమన నమ్ము
    భక్త జనుల బ్రోచు పరమ శివుడు!
    ఫలము పలల మనక వరమిడు చంద్రశే
    ఖర పథంబు సౌఖ్య కారకంబు!

    రిప్లయితొలగించండి
  29. కరమౌ భక్తిని భక్తవత్సలుని , శ్రీకాంతున్నుపాసించుచున్
    స్థిరమౌ ప్రేమము తోడుతన్ సతతమున్ సేవించు చున్ పేదలన్
    పరలోకమ్మునకేగు నిశ్చయముతో వర్తిల్లుచున్ యుక్త శే
    ఖరమార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్
    శేఖర: శ్రేష్ఠము

    రిప్లయితొలగించండి
  30. కలుగు కష్టములకు కాసింత వెఱవక
    నీదు కర్మలందు నియతి గలిగి
    భక్తి తోడ గొలువ భవుని, యాఇందుశే
    ఖరపథంబు సౌఖ్యకారకంబు!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భవుని నా యిందుశే..." అనండి.

      తొలగించండి
  31. ఖర పథంబు సౌఖ్య కారకంబుయనుట
    నిజములేదు జనుల నిందకొరకె
    వెట్టిచాకిరందు-పట్టుదలను బెంచు|
    చాకిరేవు గాదు చాకిబాన?
    2.గిరిలోదాచగ దొంగ సొమ్ములను సాగించంగ గుర్తించియున్
    గురువొక్కండనె “శిష్య”నీవిపుడు సంకోచంబు లేనట్లుగా
    ఖర మార్గంబున సాగుమా కలుగుసౌఖ్య శ్రీలు నీకెప్పుడున్
    అరుదౌ సంపదలంటు నీకు|వినుమాయాశీస్సులందించితిన్.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కారకంబు+అనుట = కారకం బనుట' అవుతుంది. యడాగమం రాదు. "కారకం బనుటలో" అనండి. 'చారికి+అందు = చాకిరి యందు' అవుతుంది. సంధి లేదు.

      తొలగించండి
  32. ఆటవెలది
    ప్రాకటముగఁ దీయఁ జీకటి దుప్పటిన్
    తూర్పున నుదయించి తోషమలర
    జీవ క్రియలకొసఁగ చేయూత భాస్కర
    ఖరపథంబు సౌఖ్యకారకంబు.

    రిప్లయితొలగించండి
  33. అరయన్నాతడు సర్వభూతముల కాధారమ్ము శాంతమ్ముతో
    సరళమ్మౌ హృది సన్నుతించ సరగున్
    జాల్వారు కారుణ్యమే
    కరకౌ శంకువు నారగించి ప్రజలన్ కాపాడినట్టిందు శే
    ఖరు మార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీకెప్పుడున్

    రిప్లయితొలగించండి
  34. దుక్కి దున్ని నావు తోడుచుంటివి నీరు
    చేను తడవ దనెడి చింత యేల
    పాఱ జేత బట్టి పారించు నీటి నా
    ఖరపథంబు సౌఖ్యకారకంబు.

    రిప్లయితొలగించండి
  35. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వేద ధర్మములను వెలయంగ నలరించి
    పాటి యైన రీతి బ్రదుకు మనుచు
    నెల్ల వేళ లందు నెచరించెడి విధుశే
    ఖర పథంబు సౌఖ్య కారకంబు

    రిప్లయితొలగించండి
  36. ...........సమస్య
    ఖర మార్గంబున సాగుమా! కలుగు
    సౌఖ్య శ్రీలు నీ కెప్పుడున్
    ~~~~
    సందర్భం: శంకరుడు దేవతలకు అమృతం త్రాగే అవకాశా న్నిచ్చాడు. తానేమో హాలాహలం మింగినాడు.
    పట్టు పీతాంబరాలు దేవతలు ధరిస్తే తానేమో గజ చర్మాన్ని ధరించినాడు.
    స్వర్ణ సౌధా లున్న స్వర్గంలో వా రుంటే తానేమో శ్మశానంలో వున్నాడు.
    ఈ త్యాగ గుణమే లోక హితం. కాబట్టి పరమేశ్వరుని దారిలో సాగితే శాశ్వత సౌఖ్యం కలుగుతుంది.

    సురలన్ ద్రావగఁ జేసె నిర్జరము.. తా
    సొంపారగా మింగెనే
    గరళం బంతయు! పట్టు బట్టలు సురల్
    కట్టంగ దాఁ గట్టెనే
    కరి చర్మంబును! భర్మ హర్మ్యముల స్వ
    ర్గంబున్ సురల్ గైకొనన్
    మురిసెన్ తాను పరేత భూమి గొని శం
    భుం డీవి, నా చంద్ర శే
    ఖర మార్గంబున సాగుమా కలుగు సౌ
    ఖ్య శ్రీలు నీ కెప్పుడున్

    ~ డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  37. మరొక పూరణము:

    సందర్భం: విషం త్రాగినా భర్తను
    కాపాడు కోగలిగిన భార్య , పరమ ప్రయోజకులైన యిద్దరు కొడుకులు,
    లోకమంతా ఆయన చెప్పినట్లే నడుస్తుంది. శివు నాజ్ఞ లేనిదే చీ మయినా కుట్టదు కదా!
    ఇంక ఇంతకన్న ఏం కావాలి? చంద్ర శేఖరుని దారిలో నడిస్తే ఇలాంటి శాంతి గల సుఖమైన సంసారం నీకూ ఏర్పడుతుంది.
    ~~
    గరళంబున్ దిగమింగినన్ పెనిమిటిన్
    కాపాడు నిల్లాలు, ని
    ద్దరు పుత్రుల్ పరమ ప్రయోజకులు, నం
    తా జెప్పినట్లే కదా
    మరి వర్తిల్లు జగంబు! శాంతి గల సం
    సారంబు నౌ.. చంద్ర శే
    ఖర మార్గంబున సాగుమా కలుగు సౌ
    ఖ్య శ్రీలు నీ కెప్పుడున్

    ~ డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  38. ఆ.వె.

    పుత్రహత్య చేత పుట్టెడు దుఃఖము

    మరచిపోవు సఫల మార్గమేది?

    కంసుడాశ్రయించె గాడిదపాదాలు

    ఖరపథంబు సౌఖ్యకారకంబు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      పద్యం బాగుంది.
      కాని పూరణ సమర్థంగా లేదు. పుత్రహత్యాపాపం పోడానికి కంసుడు గాడిద పాదాలు పట్టినాడా? ఇదెక్కడి కథ? వివరించండి.

      తొలగించండి
    2. వసుదేవుడు కదా గార్దభ సేవ చేసింది....

      తొలగించండి
  39. శ్రీ రామ రామ రామేతి....

    రమణీయపు రఘురామనామమును
    పునహ్పునహ్ పలుకువాడు భువిలో‌‌ఱేడని
    భువనేశ్వరికి నుడివిన రాకేందుశే
    ఖర పథంబు సౌఖ్య కారకంబు ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకటేశ్ ప్రసాద్ గారూ,
      మీ భావానికి నా పద్యరూపం.......

      రామనామ మెంతొ రమణీయ మద్దాని
      మరల మరల పలుక మంచిదనుచు
      భువనమాత యుమకు బోధించిన శశిశే
      ఖర పథంబు సౌఖ్య కారకంబు.

      తొలగించండి
    2. చాలా బాగుంది సార్. ఇటువంటి శైలిని నేనెలా నేర్చగలను. వివరించండి. మరో సంగతి. నేను చాలా చాలా చిన్నవాడిని. 'గార'వమొద్దు సార్...

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  40. ఖర దూషణుల నేపథ్యంలో ఈ సమస్యాపూరణం ఎలా ఉంటుంది....

    రిప్లయితొలగించండి
  41. మత్తేభవిక్రీడితము
    గిరిపైనుండియు దూకుచున్ నదిగ సంక్షేమమ్ము నందించుచున్
    ధరపై నిత్యముఁ బాపపంకిలములన్ దాక్షిణ్యమున్ జూపుచున్
    గరుగన్ జేసి పునీతయై సురల సాగంగన్న్నహో! రుద్రశే
    ఖరమార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్

    రిప్లయితొలగించండి



  42. ఆ.వె:పాలకడలి యందు ప్రభవించిన విషమున్

           శంక లేక దాచి సర్వ జగతి

            కాచినట్టి గరళ కంఠుడా చంద్రశే

             ఖరపథంబు సౌఖ్యకారకంబు.


    ఆ.వె:సాలె పురుగు తోడ సామజమునకును

       కాళమునకు కూడ కరుణ చూపి

     నట్టి గరళ కంఠు డైనయా చంద్రశే

     ఖరపథంబు సౌఖ్యకారకంబు.


    ఆ.వె:దుష్టశిక్షణమును శిష్టరక్షణమును

      ప్రతియుగమ్మునందు వాసిగాను

     చేయుచున్నస్వామి శ్రీయాదవకులశే

      ఖరపథంబు సౌఖ్యకారకంబు.

    రిప్లయితొలగించండి
  43. చంద్రశేఖరమాశ్రయేత్ కింకరిష్యతివైయమ ।।

    రిప్లయితొలగించండి
  44. [23/01, 08:31] Thirukkovallur Sreeharsha: భరియింపన్ ధరభర్త యౌను గదరా *భార్యన్ సదావీపు పై*
    భరణంబెద్దన మూడుపూటలును *దివ్యంబైనయాహారమే*
    సరసంబింకను రాత్రికానుకనుచున్ సాధింపగా *స్వర్గమౌ*
    *ఖరమార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష
    [23/01, 12:23] Thirukkovallur Sreeharsha: భిక్షువగుచు తాన భిక్షాటనముజేయ
    నిల్లు నిల్లు దిరిగి,వల్ల కాడు
    నందు నిదుర జేయు నభవుడా *చంద్రశే*
    *ఖర పథంబు* సౌఖ్య కారకంబు

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి

  45. ఆ.వె.

    చెల్లి శిశువునతడు చెరసాలలో చంపె

    కరుణ లేని వాడు కంసుడౌను

    దేవకి వసుదేవు దిగులుతో చూడగ

    ఖరపథంబు సౌఖ్య కారకంబు .

    రిప్లయితొలగించండి

  46. ఆ.వె.

    చెల్లి శిశువునతడు చెరసాలలో చంపె

    కరుణ లేని వాడు కంసుడౌను

    దేవకి వసుదేవు దిగులుతో చూడగ

    ఖరపథంబు సౌఖ్య కారకంబు .

    రిప్లయితొలగించండి
  47. బరువుల్ మోయుచు భాగ్యనగ్రమున తా బంగారు తెల్గాణకై
    సరియౌ ట్రిక్కుల గెల్చినెన్నికల తా సాధించి నేతృత్వమున్
    ఖరమౌ మాటల చంద్రబాబునిట తా ఖండించు మా చంద్రశే
    ఖరమార్గంబున సాగుమా కలుగు సౌఖ్యశ్రీలు నీ కెప్పుడున్

    రిప్లయితొలగించండి
  48. Experiencing copious errors while selling and buying bitcoin on the Blockchain platform is quite a difficult task to deal with. If you have no techniques to deal with it and need ways to remove this error, you can talk to the team of professionals and get help from the team in no time. You have to dial Blockchain customer care number and speak to the Blockchain customer support team who is always at your service. Discuss your issue with the team and get desired results in no time by taking help from the team who is there to help you.

    రిప్లయితొలగించండి