11, జనవరి 2018, గురువారం

సమస్య - 2568 (మాన్యుఁడు గానివాఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్"
(లేదా...)
"మాన్యుఁడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో రామమోహన శర్మ గారు ఇచ్చిన సమస్య)

50 కామెంట్‌లు:

 1. అన్యుల సతులను కానక
  ధన్యుండై తన పడతిని ధార్మిక రీతిన్
  మాన్యతతో వలచియు సా
  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్

  శ్రీరామ జయం!

  రిప్లయితొలగించండి

 2. ఎట్లాంటి దుండగాలైనా చేయండి ఆఖర్లో గుళ్ళను కట్టి పాపులర్ అయిపోదాం :)


  విన్యాసముల పురజనుల
  కన్యాయమ్ములను జేసి కబళించి, గుడుల్
  మాన్యముగా గట్టి భళా
  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. మైలవరపు వారి పూరణ

  దైన్యముగా పడవ నడిపి
  ధన్యుండై గుహుడు నిలిచె దాశరథి కృపా
  విన్యాసమ్మున , గనుమా !
  మాన్యుడు గానట్టివాడు మన్నలందెన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. లంకా రాజ్యసభలో....

   మాన్యను పార్వతీ సతిని మంగళగౌరిని గోరినాడటన్ ,
   మాన్య మహీజనన్యసతి మాయఁ గొనెన్ జెరబట్టి , దైత్య రా...
   జన్యుడు రావణుండన ప్రశస్తుడె ? రాక్షసుడయ్యు , స్త్రీలకున్
   మాన్యుడు గాని వాడు సభ మన్నన పొందె నదేమి చిత్రమో !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 4. కందం
  మన్యపు వీరులఁ దెల్లలు
  నన్యాయమ్ముగ వధింతురన విని గుండె
  న్నన్యము లెంచక జూపిన
  మాన్యుడుగా నట్టి వాఁడు మన్నన లందెన్!

  రిప్లయితొలగించండి


 5. "ధన్యత గల్గె గాద మన ధాత్రికి గుళ్ళను నిల్పె నిచ్చట
  న్నన్యుల వల్ల కాదయ సనాతన ధర్మము గావగాను! సౌ
  జన్యుడితండు!" దుష్టుడగు జంబుక మున్కొనియాడి రే! కవీ!
  మాన్యుఁడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. అన్యాయము నె ది రించుచు
  అన్యు ల కోస ము తపించు నౌ త్సా హి కుడై
  జన్య oబొన రించె డు సా
  మాన్యుడు కానట్టి వాడు మన్న న లందు న్

  రిప్లయితొలగించండి
 7. విన్యాసము జూడుడు సా
  మాన్య కుచేలుండు బొందె మాధవుఁ సేవల్
  అన్యుల ఊహల కందక
  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్

  రిప్లయితొలగించండి
 8. అన్యాయము నెదురించుచు
  సన్యాసుల కుండునట్టి *సాజ గుణమునన్
  ధన్యుండై యొప్పుచు నొక సా
  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్"
  ***)(***
  *లేదా సహజ గుణమునన్.

  రిప్లయితొలగించండి
 9. 🌸 శంకరాభరణం🌼 11/01/2018 🌺నేటి సమస్య 🌺
  మాన్యుడు గానట్టివాడు మన్ననలందెన్🍁
  🌠🌠🌟🌟🌟🌟🌟🌠🌠 కం.

  మన్యమున వసించెడు సా
  మాన్యుడు తిన్నడు శివునికి మాంసంబొసగిన్
  ధన్యుండయ్యెను కద, మరి
  మాన్యుడు గానట్టివాడు మన్ననలందెన్!

  ( తిన్నడు అనగా భక్త కన్నప్ప )

  🌿🌿 🌿ఆకుల శాంతి భూషణ్ 🌺
  వనపర్తి

  రిప్లయితొలగించండి
 10. రిప్లయిలు
  1. సన్యాసి కొంగ జపమున
   విన్యాసము లెంచి చూడ వేడుక బుట్టున్
   ధన్యత కోరెడి జనులకు
   మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్

   తొలగించండి
 11. సన్యాసిఁగాడతండును
  విన్యాసముఁజేసె'శర్మ' వినువీధులలో
  ధన్యుండయ్యెనుగా సా
  మాన్యుడుఁగానట్టి వాడు మన్ననలందెన్
  శర్మ=రాకేష్ శర్మ భారతీయ వ్యోమగామి

  రిప్లయితొలగించండి
 12. మాన్యుడు ద్రోణుని నొక సా
  మాన్యుడు గురువుగ దలచియు మది,చతురతతో
  ధన్యత్వము బొందె భళిర!
  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్"

  రిప్లయితొలగించండి
 13. అన్యాయపు రీతి గెలచి
  జన్యంబగు పదవి బట్టి జనకంటకుడే
  విన్యాసము జేసె గనుడు
  "మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్"

  రిప్లయితొలగించండి
 14. అన్యంబెరుగక వెన్నుని
  మాన్యంబగుపూజ మట్టి మాలలగొనగా
  ధన్యుండయ్యెను కుమ్మరి
  మాన్యుడు గానట్టివాడు మన్ననలందెన్!

  కుమ్మరి భీముడు(తొండమాను చక్రవర్తి గర్వమణచినవాడు)

  రిప్లయితొలగించండి
 15. అన్యాయమునెదిరించుచు
  పుణ్యమ్ములజేసి ప్రజల పూజలనందెన్
  ధన్యత లోకమ్మున సా
  మాన్యుడు గానట్టి "వాడు" మన్ననలందెన్!

  రిప్లయితొలగించండి
 16. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2568
  సమస్య :: *మాన్యుఁడు గానివాడు సభ మన్నన లందె నదేమి చిత్రమో ?*

  సందర్భం :: దక్షయజ్ఞంలో తనదేహాన్ని అగ్నికి సమర్పించుకొనిన సతీదేవి , మరుజన్మలో పార్వతిగా జన్మించి , శివుని భర్తగా పొందగోరి , తపోదీక్షలో ఉండగా , శివుడు ఆమె మనసును పరీక్షింపదలచి బ్రహ్మచారి వేషంలో ఆమెను సమీపించి , *’’ఓ ఉమా ! నీ చిత్తము (మనసు) అనే సభలో వరుడుగా కొలువుదీరియున్న శివుడు మంచి వరుడు కాడు అతనిని కోరుకోవడం మానుకో’* అని మాట్లాడే సందర్భం.

  మాన్యవు , నీదు చిత్తసభ మంచి వరుండుగ గొల్వు దీరె సా
  మాన్యుడు భూతనాయకు డమంగళ శీలి శ్మశానవాసియున్ .
  మాన్యుడె ? నాగభూషణు డుమా ! వలదమ్మ త్రినేత్రు , డక్కటా !
  మాన్యుడు గానివాడు సభ మన్నన లందె నదేమి చిత్రమో ?
  *కోట రాజశేఖర్ నెల్లూరు.* (11.01.2018)

  రిప్లయితొలగించండి
 17. శిశుపాలుని ప్రలాపములు:

  దైన్యముతో వెన్నాడెడి
  కన్యల లాలించునట్టి కన్నడి నాహా!
  ధన్యుని వలె పూజించిరి!!
  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్!!!

  రిప్లయితొలగించండి 18. అన్యాయార్జన చేయక

  నన్యుల కెపుడును హితమును నవనిస్థలిలో

  మాన్యంబుగ చేసెడు సా

  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్.


  అన్యుల మానసంబులను నాదరభావము తోడను సదా

  అన్యుల మానసములసౌ

  జన్యము తోడను గెలువగ జగముల యందున్
  ధన్యుండగుచు సతము సా

  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్.

  అన్యుల మానసంబులను నాదరభావము తోనిలన్ సదా

  నన్యపుచింతనల్ విడిచి హర్షము తోడను గౌరవించుచున్

  మాన్యత నిచ్చుచున్ సతము మానుగ సేవచేయు సా

  మాన్యుఁడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో.

  రిప్లయితొలగించండి
 19. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

  " ధన్యుల జేసెదన్ , బహువిధమ్ముల నుధ్ధరణం బొనర్తు > సా

  మాన్యుల " నంచు ఓట్లు గొని మంత్రిగ నైనటు వంటి నాయకుం ,

  డన్య ధనాభిలాషకు , డనంత దురాగత కార్య శీలుడున్ ,

  మాన్యుడు కానివాడు . సభ మన్నన లందె నదేమి చిత్రమో ! ! !

  రిప్లయితొలగించండి
 20. ధన్యుఁడు భూ దేవుఁడు ధన
  ధాన్యాధిక్యమ్ముల భరత మహాకుల రా
  జన్యుని చేత యశో గరి
  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్

  [యశోగరిమ+అన్యుఁడు = ఘన యశస్కున కన్యుఁడు]


  హైన్యము ధర్మ దూర మని యాత్మఁ దలంచక రావణుండు దా
  నన్యుల యక్ష కిన్నర విషాస్య నిలింప నృపాత్మ జాదులం
  గన్యలఁ దస్కరించెడు సకామ తమిస్ర మనో వికారుఁడే
  మాన్యుఁడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో

  రిప్లయితొలగించండి

 21. మన్యపు వీరుడు పోరుచు
  వన్యజములవెంటనిలిచి వసుధా స్థలిలో
  ధన్యుండయ్యెను గను సా
  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్.

  రిప్లయితొలగించండి
 22. వన్యములైన కాయలను,పాలను చక్కగ నారగించుచున్
  జన్యములైన మానసికచంచలరీతు లవెన్నొ నిండగా
  ధన్యుడయెన్ మహాకవిగ ధారుణి కాలుడు కాళిదాసుడై
  మాన్యుడు గానివాడు సభ మన్ననలందె నదేమి చిత్రమో !

  రిప్లయితొలగించండి
 23. శూన్యముపాండిత్యము,ప్రా
  ధాన్యతయొక్కింతలేదు,తానిలలో సా
  మాన్యుడు,లౌక్యముకలదని
  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్.

  రిప్లయితొలగించండి
 24. అన్యాయపు మార్గమ్మున
  విన్యాసమ్ములను జేసి పెరగాయొక్కం
  డన్య విబుధులకు బదులుగ,
  మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్

  రిప్లయితొలగించండి
 25. మాన్యతతోడనోట్లుగొనిమాయముయౌనొకనాల్గుయేండ్లు ప్రా
  ధాన్యతకొత్తయెన్నికలదారులనేగెడివేళనేర్పుతో
  శూన్యమునుండియాశలనుచోద్యముగాసృజియించు నేతయౌ
  మాన్యుడు గానివాడు సభ మన్ననలందె నదేమి చిత్రమో !

  రిప్లయితొలగించండి
 26. శూన్యత నిండమానసము శోకవిచంచల జానకమ్మకున్
  దైన్యము దొల్గగా హనుమ ధాటిగ లంకన నుద్యమించి ప
  ర్జన్యపు గర్జనన్ దునుమ రాక్షసులన్,మది సీతదల్చె సా
  మాన్యుడుగానివాడు,సభమన్ననలందె నదేమిచిత్రమో

  రిప్లయితొలగించండి
 27. శూన్యత నిండమానసము శోకవిచంచల జానకమ్మకున్
  దైన్యము దొల్గగా హనుమ ధాటిగ లంకన నుద్యమించి ప
  ర్జన్యపు గర్జనన్ దునుమ రాక్షసులన్,మది సీతదల్చె సా
  మాన్యుడుగానివాడు,సభమన్ననలందె నదేమిచిత్రమో

  రిప్లయితొలగించండి
 28. అన్యాయంబునుజేయును
  మాన్యుడుగానట్టివాడు,మన్ననలందెన్
  మన్యపుభూములుబ్రజలకు
  నన్యులుగాదలచకుండహర్షుడునీయన్

  రిప్లయితొలగించండి
 29. స్వామీజీల దగ్గరనుండి విద్వాంసుల వరకు భోగలాలసతతో పతనమైన వారిని చూసి...

  ధన్యత పొందలేడు గద ధాత్రిన నెవ్వడు నెంచి చూడగా
  అన్యములైన సంపదలఁ, ఆశ్రితమొందిన షడ్గుణమ్ములన్,
  కన్యలఁ మోహమున్ విడక కాపురుషుండుగ మారగా, సదా
  "మాన్యుఁడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో"

  రిప్లయితొలగించండి
 30. మాన్యుడుగానివాడుసభమన్ననలందెనదేమిచిత్రమో
  మాన్యతలేకపోయిననుమన్ననలొందుచుగొందరుందురే
  యన్యులనంగవారిలనునార్ధికరంగమునందునన్సదా
  విన్యాసములైమన్ననలబెంపునునొందుచునుంటిరేకదా

  రిప్లయితొలగించండి
 31. .అన్యులు నాంగ్లేయులకడ
  మాన్యులు గానట్టివారు|”మన్నన లందెన్
  ధన్యుడు గాంధి మహాత్ముడు|
  అన్యుల కాదర్స మూర్తినాంగ్లేయులకున్|
  2.సూన్యుడు గాదు గాంధి|మనసున్న మహాత్ముడు దేశ రక్షకై
  అన్యుల తెల్లవారలనునంపగ జేసిన శాంతి దూతయౌ
  ధన్యుడువేష భూషణలు దగ్గర జేర్చన నేత-తాత సా
  మాన్యుడు గాని?వాడు సభ మన్ననలందెనదేమి చిత్రమో?

  రిప్లయితొలగించండి
 32. అన్యాయమెదుర దొరలపై
  జన్యంబనె రామ రాజు, జాతిని గాచన్
  మన్యపు నాయకుడై సా
  మాన్యుడుగానట్టి వాడు మన్నన లందెన్!

  రిప్లయితొలగించండి
 33. మాన్యత మరిచిన కురుసభ
  నన్యాయము జరుగబోవ నాద్రౌపదికిన్
  కన్యా లోలుడె గాచెను
  మాన్యుఁడుగా; నట్టివాఁడు మన్నన లందెన్

  రిప్లయితొలగించండి
 34. .........సమస్య
  మాన్యుడు కానివాడు సభ మన్నన లందె న దేమి చిత్రమో!
  ==============================
  సందర్భం: ధర్మరాజు రాజసూయయాగంలో కృష్ణుని కగ్రపూజ గావించా లని వేదికమీది కాహ్వానించగా శిశుపాలు డవహేళన చేస్తూ కింది విధంగా మాట్లాడాడు.
  "వంశము (వంశ గౌరవం) సున్న. గుణము సున్న (గుణాతీతుడు కదా!). చుట్టాలకు శత్రువు (మామను వధించినాడు).ఊరు పేరు లేదు (సర్వ వ్యాపకుడు కాబట్టి ఒక ఊరంటూ లేదు. అన్ని పేర్లూ ఆయనవే.. కాబట్టి ఒక పేరంటూ లేదు). మంచి చెడ్డా ఎఱుగడు.(ద్వంద్వాతీతుడు కదా!)
  అతడు గొప్పవాడే కాదు. అతణ్ణి గౌరవించడం ఏమిటి" అనే సందర్భంలోనిది.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  శూన్యము వంశమున్, గుణము-
  చుట్టములే రిపు, లూరు పేరు లే,
  దన్య సతీ రతుండు, నొక
  టైన నెఱుంగడు మంచి చెడ్డ- సా
  మాన్యుడు వీడు, కా డెపుడు
  మాన్యుడు-కృష్ణుడు, గొల్లవా,
  డయో!
  మాన్యుడు గాని వాడు, సభ
  మన్నన లందె, న దేమి చిత్రమో!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

  రిప్లయితొలగించండి
 35. ఉత్పలమాల
  జన్యమశాంతి కారకము సంధికి నొప్పిన నాశమాగదే?
  గుణ్యమదే యనంగ నొగి క్రోధమునన్ హరిఁ జుట్టు ముట్ట కా
  ర్పణ్యము! విశ్వరూపమున ప్రార్థనలందఁగ కౌరవాళికిన్
  మాన్యుడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో?

  రిప్లయితొలగించండి
 36. అన్యుల కాంతలన్ గనక నాతని కాంతను కానలందునన్
  దైన్యము తోడ దేవుచును ధైర్యము శౌర్యము వీర్యమందునన్
  ధన్యుడు రాఘవుండె గద ధారుణి పుత్రికి కాంతుడౌచు సా
  మాన్యుఁడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో

  రిప్లయితొలగించండి