బాపూజీ గారూ, భగవల్లీలలను వర్ణించేది భాగవతం. భారతంలోనూ భగవానుడైన కృష్ణుని లీలావిశేషాలు వర్ణింపబడ్డాయి కనుక మీ పూరణ సమర్థనీయమే. బాగున్నది. అభినందనలు. పొరపాటున యతిదోషాన్ని గమనించకుండా సమస్య నిచ్చాను. మీ పూరణ మూడవ పాదం చివర "సేవ సల్పగాన్" అంటే యతిదోషం తొలగిపోతుంది.
చారి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. రెండవ పాదం చివర 'మహా'కు బదులు 'తమిన్' అంటే సమస్యలోని యతి దోషం తొలగిపోతుంది. లేదా సవరించిన సమస్య పాదాన్ని పెడితే సరి!
జిలేబీ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. సమస్య పాదాన్ని సవరించానండీ. కాని అలా యతిదోషంతో సమస్య ఇవ్వడం కూడా ఒక సంప్రదాయమే. ముందు పాదం చివర ద్రుతం (న్) వచ్చేట్లు వ్రాస్తే యతి కుదురుతుంది. పైన బాపూజీ గారి పూరణపై నా వ్యాఖ్యను పరిశీలించండి.
జిలేబీ గారూ, ఈరోజు సమస్యాపూరణ కార్యక్రమంలో మీ పద్యాన్ని చదివారు. అభినందనలు. వచ్చేవారానికి సమస్య... "రంగవల్లుల కాంతి సంక్రాంతి వచ్చె" (ఇందులో సమస్య ఏమీ లేదనీ, సంక్రాంతి పండుగను వర్ణించమనీ వారే చెప్పారు).
అంతా మీరిచ్చిన ప్రోత్సాహమే ; ఈ వేదిక లో నేర్చుకున్నదే ! నెనరులు ఆకాశవాణి వారికి కూడా పద్యమును అదిన్నూ శార్దూలమును చదివినందులకు - నా మొదటి వృత్త 'అడ్వెంచర్ ' శార్దూలము :- బ్లాగులో లెక్కచూస్తే అందులో 170 పైబడి "పిచ్చి పిచ్చి గా గ్రుచ్చిన శార్దూలాలున్నాయి :) )
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం సమస్యాపూరణ :: నేటి సమస్య (సంఖ్య-2564) సమస్య :: *భాగవతమ్ము వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెల్గునన్.* సందర్భం :: భాగవతము అనే పదానికి వ్యుత్పత్త్యర్థం భగవంతునికి సంబంధించినది , దైవ భక్తి గల భాగవతులకు సంబంధించినది అని చెప్పుకోవచ్చు. అందువలన కృష్ణ భగవానుని గురించి , భక్తులైన పాండవుల గురించి వ్రాయబడిన భారతాన్ని , భాగవతము అని కూడా భావించవచ్చు. కాబట్టి తెలుగులో నన్నయభట్టు భాగవతాన్ని వ్రాసినాడు అని చెప్పవచ్చు అని విశదీకరించే సందర్భం.
భాగవతంబె యౌను భగవంతుని గాథల భక్త గాథలన్ బాగుగ వ్రాయ , పాండవుల భక్తి ప్రపత్తుల , కృష్ణ రీతులన్ సాగిన భారతమ్ము గని , చక్కగ బల్కగవచ్చు నిట్టులన్ *భాగవతమ్ము వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెల్గునన్.* *కోట రాజశేఖర్ నెల్లూరు.* (6.1.2018)
ఆకాశవాణి, హైదరాబాదు వారి 'సమస్యాపూరణం' కార్యక్రమంలో ఈరోజు మన సమూహానికి చెందిన క్రింది కవిమిత్రుల పూరణలు ప్రాసరమయ్యాయి. ౧. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు (వీరివి రెండు పద్యాలు) ౨. తురుక్కోవళ్ళూర్ శ్రీహర్ష గారు ౩. కె. ఈశ్వరప్ప గారు ౪. బొగ్గరం ఉమాకాంత ప్రసాద్ గారు ౫. చంద్రమౌళి సూర్యనారాయణ గారు ౬. మాచవోలు శ్రీధర రావు గారు ౭. పోచిరాజు సుబ్బారావు గారు ౮. తాతా ఫణికుమార్ శర్మ ౯. గండూరి లక్ష్మినారాయణ గారు ౧౦. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు ౧౧. వి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారు ౧౨. చంద్రమౌళి రామారావు గారు ౧౩. మంద పీతాంబర్ గారు ౧౪. గుఱ్ఱం జనార్దన రావు గారు ౧౫. జిలేబీ ....................అందరికీ అభినందనలు. వచ్చేవారానికి సమస్య.... "రంగవల్లుల కాంతి సంక్రాంతి వచ్చె" మీ పూరణలను padyamairhyd@gmail.com కు వచ్చే గురువారంలోగా పంపండి.
బాగుగ రాజసూయమును భవ్యము జేయుచు భక్తిరంజిలన్,
రిప్లయితొలగించండివేగమె యర్ఘ్యపాత్ర గొని వెన్కనె చైద్యుని నీసడించుచు
న్నేగురు తమ్ములున్ వినయమేర్పడ కృష్ణుని సేవసల్పగా
భాగవతంబు వ్రాసె నల నన్నయభట్టు తెనుంగునన్ భళా!
బాపూజీ గారూ,
తొలగించండిభగవల్లీలలను వర్ణించేది భాగవతం. భారతంలోనూ భగవానుడైన కృష్ణుని లీలావిశేషాలు వర్ణింపబడ్డాయి కనుక మీ పూరణ సమర్థనీయమే. బాగున్నది. అభినందనలు.
పొరపాటున యతిదోషాన్ని గమనించకుండా సమస్య నిచ్చాను. మీ పూరణ మూడవ పాదం చివర "సేవ సల్పగాన్" అంటే యతిదోషం తొలగిపోతుంది.
ధన్యవాదాలండీ !
తొలగించండిమృదు మధురమధుర కవితామృత మనంగ
రిప్లయితొలగించండితెనును భాషలో పోతన్న తెలిపినాడు
భాగవతమును, నన్నయభట్టు వ్రాసె
భారతమ నంగ దెనుగున వాసి కెక్కె.
బాలసుబ్రహ్మణ్యం గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవపాదంలో "న్నేగురు సోదరుల్"అని చదువమనవి.చైద్యుడు-శిశుపాలుడు
రిప్లయితొలగించండిఆంధ్రుల తెలగాణుల పోటి యదురుచుండ
రిప్లయితొలగించండికోతలు మితిమీరుచు పిచ్చి కూత లవగ
రాజమండ్రి శాస్త్రి పలికె రాజసమున:
"భాగవతమును నన్నయభట్టు వ్రాసె"
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పోతన కడప జిల్లా ఒంటిమిట్ట వాడన్న వాదన ఉండనే ఉన్నది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభోగము నందు భాగ్యముల పొందున విందున నేడు నిన్నయున్
రిప్లయితొలగించండిరాగల కాలమందునను రాజ్యము నందు వనమ్ము లందునన్
మా గతి మాధవుం డనుచు మన్నన జేసిన పాండవాళిదౌ
భాగవతంబు వ్రాసె నల నన్నయభట్టు తెనుంగునన్ భళా.
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరిపాదంగా సవరించిన సమస్యను పెడితే సరి!
పోతన రచించె తెలుగు రాముడు వచించ
రిప్లయితొలగించండిభాగవతమును, నన్నయభట్టు వ్రాసె
భారతము మూడు పర్వములు భారతి కృప
నాదికవిగ తెలుగునాట నందెకీర్తి
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "పర్వముల్" అంటే సరి!
[06/01, 00:38] +91 75698 22984: 6, జనవరి 2018, శనివారం
రిప్లయితొలగించండిసమస్య - *2584*
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
*"భాగవతమును నన్నయభట్టు వ్రాసె"*
(లేదా...)
*"భాగవతంబు వ్రాసె నల నన్నయభట్టు తెనుంగునన్ భళా"*
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో ఓంప్రకాశ్ గారు ఇచ్చిన సమస్య)
[06/01, 05:39] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
శ్రీ గుణధాముడామురహరిన్ముద మార నుతించుచున్ సుధా
సాగర భక్తి తత్త్వరసఙ్ఞుడు పోతనయేగదా మహా
భాగవతంబు వ్రాసె నల నన్నయ భట్టు తెనుంగునన్, భళా!
వాగనుశాసనుండగుచు భారతగాథ రచించె ధీధృతిన్
చారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం చివర 'మహా'కు బదులు 'తమిన్' అంటే సమస్యలోని యతి దోషం తొలగిపోతుంది. లేదా సవరించిన సమస్య పాదాన్ని పెడితే సరి!
మీరు కేవలం పూరించిన పద్యాన్ని పెడితే చాలు. మిగతా వివరాలు అక్కరలేదు.
తొలగించండి
రిప్లయితొలగించండివిశ్వ సృష్టి రహస్యము విధిగ తెలియ
పొత్త మేది చదువవలె? పుంఖితముగ
భారతమ్మును తెలుగున వ్రాసె నెవరు ?
భాగవతమును; నన్నయభట్టు వ్రాసె
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాళిదాసురచించెను కావ్యము రఘు
రిప్లయితొలగించండివంశమును, పోతనార్యుడు వ్రాసె ఘన
భాగవతమును, నన్నయభట్టు వ్రాసె"
భారతంబుకొంత దటము భరత మహిన
కృష్ణ సూర్యకుమార్ గారూ,
తొలగించండివిరిపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదం చివర "వ్రాసెను ఘన" అనండి. లేకుంటే గణదోషం. అలాగే "మహిని" అనండి.
శతావధాని జి.యం. రామశర్మ గారి పూరణ....
రిప్లయితొలగించండిభాగవతమ్ము విష్ణుపద వందన చందన సుందరమ్మగున్
ధీగుణ వైభవాన రసదీప్తులఁ గూర్చియు పోతనార్యుఁడున్
భాగవతంబు వ్రాసె; నల ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్
వాగనుశాసనత్వమున భారత భారతినే రచించెగా.
పోత నార్యుడు వ్రాసెనే పొత్తమయ్య?
రిప్లయితొలగించండిఆది కవి యని పేరొంది యాధ్యు డ గు చు
భారత oబు నదె వ రి ల వ్రాసి రయ్య?
భాగవత ము ను ;నన్నయ భట్టు వ్రాసె
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఇదిగొ ! వాక్యమ్ము *సరిజేయ* నిచ్చిరిట్లు
*భారతమ్మును నన్నయభట్టు వ్రాసె*
ననుచుఁ ., దడబడి వ్రాసె విద్యార్థి యిట్లు
*భాగవతమును నన్నయ భట్టు వ్రాసె*!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
లేగలు గెంతినట్లు, మురళీస్వరముల్ రవళించినట్లుగా
తొలగించండివాగమృతమ్ము జల్లి యదుబాలుని లీలల పోతనార్యుడున్
భాగవతంబు వ్రాసె , నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెన్గునన్
వాగనురక్తి భారతము వ్రాసెను వాగనుశాసనుండుగా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిభా, న లకు యతి సరిపోతుందాండి ?
సాగరఘోష వ్రాసెనిల సాంఖ్యుని భక్తుడు!పోతనార్యులే
భాగవతంబు వ్రాసె; నల నన్నయభట్టు తెనుంగునన్ భళా
పాగెముగాన యాంధ్రులును భారతమున్ మజ తీర్చి దిద్దిరే !
లాగరి యొగ్గి నేర్వ దగు లక్షణ మైనది, లేమ యీ యతిన్
సావేజిత
జిలేబి
కంది వారు ఉవాచ:
తొలగించండి"కవిమిత్రులు మన్నించాలి. సమస్యగా ఇచ్చిన ఉత్పలమాలా పాదంలో యతి తప్పింది. నిజానికి అవధానం అడిగింది ఇది... *"భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్"*.
తొలగించండిసాగరఘోష వ్రాసెనిల సాంఖ్యుని భక్తుడు!పోతనార్యులే
భాగవతంబు వ్రాసె నల; ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్,
పాగెముగాన యాంధ్రులట భారతమున్ మజ తీర్చి దిద్దిరే !
లాగరి యొగ్గి నేర్వ దగు లక్షణ మైనవి లేమ యీ కృతుల్ !
జిలేబి
తొలగించండిధన్యవాదాలండి జీపీయెస్ వారు :)
ఆకాశవాణి వచ్చే వారం సమస్య యేమైనా తెలుసునా ?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య పాదాన్ని సవరించానండీ.
కాని అలా యతిదోషంతో సమస్య ఇవ్వడం కూడా ఒక సంప్రదాయమే. ముందు పాదం చివర ద్రుతం (న్) వచ్చేట్లు వ్రాస్తే యతి కుదురుతుంది. పైన బాపూజీ గారి పూరణపై నా వ్యాఖ్యను పరిశీలించండి.
జిలేబీ గారూ,
తొలగించండిఈరోజు సమస్యాపూరణ కార్యక్రమంలో మీ పద్యాన్ని చదివారు. అభినందనలు.
వచ్చేవారానికి సమస్య... "రంగవల్లుల కాంతి సంక్రాంతి వచ్చె" (ఇందులో సమస్య ఏమీ లేదనీ, సంక్రాంతి పండుగను వర్ణించమనీ వారే చెప్పారు).
తొలగించండికంది వారు !
నమో నమః !
అంతా మీరిచ్చిన ప్రోత్సాహమే ; ఈ వేదిక లో నేర్చుకున్నదే ! నెనరులు ఆకాశవాణి వారికి కూడా పద్యమును అదిన్నూ శార్దూలమును చదివినందులకు - నా మొదటి వృత్త 'అడ్వెంచర్ ' శార్దూలము :- బ్లాగులో లెక్కచూస్తే అందులో 170 పైబడి "పిచ్చి పిచ్చి గా గ్రుచ్చిన శార్దూలాలున్నాయి :) )
రంగి! యిలలోన ఋతువులు రక్తి జేర్చ
భంగిమల విభుని విచిత్ర పాదములన
నింగి నేలను కలుపుచు నెక్కొలుపుచు
రంగవల్లుల కాంతి సంక్రాంతి వచ్చె!
జిలేబి
తొలగించండితబ్బిబ్బుల్పడుచున్ జిలేబులనిటన్ తాంతమ్ము ధూంధామనన్
జొబ్బిల్లంగన ఆంధ్ర భారతినటన్ శోధించి గాలించుచున్
జబ్బల్బట్టి తెలుంగు నేర్చు సరదా సావేజితల్మేమహో
రుబ్బన్మాకు కవీ నిఘంటు వదియే రూఢమ్ము గానన్ సుమా!
జిలేబి
గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
రిప్లయితొలగించండిసమస్యాపూరణ :: నేటి సమస్య (సంఖ్య-2564)
సమస్య :: *భాగవతమ్ము వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెల్గునన్.*
సందర్భం :: భాగవతము అనే పదానికి వ్యుత్పత్త్యర్థం భగవంతునికి సంబంధించినది , దైవ భక్తి గల భాగవతులకు సంబంధించినది అని చెప్పుకోవచ్చు. అందువలన కృష్ణ భగవానుని గురించి , భక్తులైన పాండవుల గురించి వ్రాయబడిన భారతాన్ని , భాగవతము అని కూడా భావించవచ్చు.
కాబట్టి తెలుగులో నన్నయభట్టు భాగవతాన్ని వ్రాసినాడు అని చెప్పవచ్చు అని విశదీకరించే సందర్భం.
భాగవతంబె యౌను భగవంతుని గాథల భక్త గాథలన్
బాగుగ వ్రాయ , పాండవుల భక్తి ప్రపత్తుల , కృష్ణ రీతులన్
సాగిన భారతమ్ము గని , చక్కగ బల్కగవచ్చు నిట్టులన్
*భాగవతమ్ము వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెల్గునన్.*
*కోట రాజశేఖర్ నెల్లూరు.* (6.1.2018)
కోట రాజశేఖర్ గారూ,
తొలగించండిసమర్థనీయమైన చక్కని పూరణ. అభినందనలు.
పైన బాపూజీ గారి పూరణను, దానిపై నా వ్యాఖ్యను గమనించండి.
గురుదేవులకు కృతజ్ఞతాపూర్వక వందనములతో,
రిప్లయితొలగించండిమీ ప్రత్యుత్తరమే నా పద్యమైనది.
భారతంబు గాదె గనంగ పాడిగ వసు
దేవ సుతుడిగా బుట్టిన దైవ లీల
చెలువముగ నప్పుడిటులనె చెప్పదగును
"భాగవతమును నన్నయభట్టు వ్రాసె"
విట్టుబాబు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆకాశవాణి, హైదరాబాదు వారి 'సమస్యాపూరణం' కార్యక్రమంలో ఈరోజు మన సమూహానికి చెందిన క్రింది కవిమిత్రుల పూరణలు ప్రాసరమయ్యాయి.
రిప్లయితొలగించండి౧. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు (వీరివి రెండు పద్యాలు)
౨. తురుక్కోవళ్ళూర్ శ్రీహర్ష గారు
౩. కె. ఈశ్వరప్ప గారు
౪. బొగ్గరం ఉమాకాంత ప్రసాద్ గారు
౫. చంద్రమౌళి సూర్యనారాయణ గారు
౬. మాచవోలు శ్రీధర రావు గారు
౭. పోచిరాజు సుబ్బారావు గారు
౮. తాతా ఫణికుమార్ శర్మ
౯. గండూరి లక్ష్మినారాయణ గారు
౧౦. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు
౧౧. వి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారు
౧౨. చంద్రమౌళి రామారావు గారు
౧౩. మంద పీతాంబర్ గారు
౧౪. గుఱ్ఱం జనార్దన రావు గారు
౧౫. జిలేబీ
....................అందరికీ అభినందనలు.
వచ్చేవారానికి సమస్య.... "రంగవల్లుల కాంతి సంక్రాంతి వచ్చె"
మీ పూరణలను padyamairhyd@gmail.com కు వచ్చే గురువారంలోగా పంపండి.
ధన్యవాదాలు శంకరార్యులకు !
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు
తొలగించండిపోత నామాత్యు డద్భుత రీతి వ్రాసె
రిప్లయితొలగించండిభాగవతమును ; నన్నయ భట్టు వ్రాసె
పాక్షి కమ్ముగ నలనాడు భారతమును
నవియె యాచంద్ర తారార్క మనగ నొప్పు!
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వ్యాస భట్టార కాంచిత భారత వర
రిప్లయితొలగించండిభాగవత పురాణమ్ముల భారతంపు
బర్వములు సశేషము మూడు, వదలి యపర
భాగవతమును, నన్నయభట్టు వ్రాసె
ఆగమ సన్నిభమ్మనుచు నార్యులు చెప్పఁగ భారతమ్మునే
నాగరికంపు టాది కవి నా వినుతించఁగఁ బండితోత్తముల్
వాగనుశాసనుండు తమి భారతమున్, మత గర్భితమ్మనన్
భాగవతంబు, వ్రాసె నల ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్
[నాగరికము = నాణెమైనది; మతము =సమ్మతము]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఆర్తిగా వేడ ద్రౌపది నాదు కొనిన
కృష్ణ భగవాను లీల రచించి తనదు
భారతమ్మున వివరించ, పాక్షికముగ
భాగవతమును నన్నయ భట్టు వ్రాసె
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆకాశవాణి హైదరాబాద్ వారి 6-1-2018 నాటి సమస్యకు పూరణ:
రిప్లయితొలగించండివరుస కరువుల తదుపరి కురిసి నట్టి
వర్షములు రైతుల కిపుడు హర్ష మొసగ
పాడి పంటల నందింప పరుగు లిడుచు
"రంగ వల్లుల కాంతి సంక్రాంతి వచ్చె".
****)()(****
బాగుంది.
తొలగించండిధన్యవాదాలార్యా!
తొలగించండిధర్మ మనుకరణలు దెల్ప?”ధర్మరాజు
రిప్లయితొలగించండిభాగవతమును”నన్నయ భట్టువ్రాసె
భక్తి తత్వంబు వివరించుభాగవతము
పోతనార్యుడురచియించి జాతికొసగె|
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆ గుణశాలి పోతన మహాయశమొందుచు వ్రాసె బేర్మితో
రిప్లయితొలగించండితా గణుతింప భారతము తద్దయు వేడుక నాదిపర్వమున్
వేగముమీరగా సభయువీకనరణ్యపుటర్దభాగమున్
భాగవతంబు, వ్రాసె నల ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
'వ్రాసె బేర్మితో' తరువాత కామా పెడితే అన్వయం సుగమ మౌతుంది. లేకుంటే సందేహానికి కారణమౌతుంది.
హలము తోడుత పోతన కలము బట్టి
రిప్లయితొలగించండియాంధ్ర భారతి యుప్పొంగ ననువదించె
భాగవతమును! నన్నయ భట్టు వ్రాసె
తిక్కనయు నెఱ్ఱనల గూడి తీపు నింప!
వ్యాస భారతమ్ము తెనుగు బాస లోన
శ్రీధర రావు గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
అరయనజ్ఞాని యొక్కడీ కరణిబల్కె
రిప్లయితొలగించండిభారతము వ్రాసె బోతన్న బాగుగాను
రామ చరితము వ్రాసెనెఱ్ఱాప్రగడ
భాగవతమును, నన్నయభట్టు వ్రాసె
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదం చివర గణదోషం. "వ్రాసె నెఱ్ఱాప్రెగడయు" అనండి.
భక్త పోతన రచియించి భారతి కిడె
రిప్లయితొలగించండిభాగవతమును; నన్నయభట్టు వ్రాసె
భారతమ్మును కొంతైన ప్రధమమందు
తెనుగు నందున కవితల తేనెలొలుక
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,
యోగి , నియోగి భూసురు డహో ! యల పోతన యా సరస్వతీ
రాగము నానుచున్ సుమధురంబగు నుక్తులతో రచించెగా
భాగవతంబు | వ్రాసె నల ప్రాఙ్ఞుడు నన్నయ భట్టు తెన్గునన్
వాగను శాసనుం డగుచు భారత మందు ద్రిపర్వ భాగమున్
వాగను రంజన మ్మయిన భావము కూర్చి పటుత్వ వాక్కులన్
( యోగి = బోగము నాశించని వాడు )
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువు గారికి నమస్సులు.
రిప్లయితొలగించండిపలుకులన్నియు రాముడు పలికినట్లు
భక్త పోతన ప్రాజ్ఞుడు బాగ వ్రాసె
భాగవతమును,నన్నయభట్టు వ్రాసె
భారతoబు నా రింటొక భాగ భాగ్య కవిగ.
భారతము పర్వాను క్రమణి కలో 100 పర్వాలు సూక్ష్మముగా విభజన చేయబడ్డాయి. స్థూలంగా 18 పర్వాలు.కావున అందున 6 వ భాగము మూడు.
పూర్వము తాళ పత్రములో గ్రంధాలు రచయించారు.నన్నయ్య అరణ్య పర్వము పూర్తీగా వ్రాసాడని ప్రతీతి.
భాగ తీసుకొన్న (భాగ్య),భాగ్య(భాగ) చదువ ప్రార్థన.
రిప్లయితొలగించండిఒక పదము అదనంగా వ్రాసాను.
వెంకట నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదం గణదోష మనుకున్నాను. ఒక పదాన్ని అదనంగా వేశానని మీరే చెప్పారు కదా!
భక్తిభావానవ్రాసెనుపోతనయిల
రిప్లయితొలగించండిభాగవతమును.నన్నయభట్టువ్రాసె
భారతమ్మునుదెనుగునవాసిగాను
నదియపంచమవేదమునాబరగెను
ఆగనిభక్తిభావముననార్యుడుపోతనదెన్గునన్భళా
రిప్లయితొలగించండిభాగవతంబువ్రాసెనలప్రాఙ్ఞుడునన్నయభట్టుతెన్గున
న్వాగనుశాసనుండగుచుభారతగాధనువ్రాసెనేగదా
యాగమశాస్ర్రమయ్యదియహర్షమునొందుచుసమ్మతించగన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు (ముఖ్యంగా వృత్తపూరణ) బాగున్నవి. అభినందనలు.
తీయతేనియ లూరెడు తెలుగులోన
రిప్లయితొలగించండిపోతనార్యుడు రచియించె మురభిదుకధ
భాగవతమును, నన్నయభట్టు వ్రాసె
భారతమున రెండున్నర పర్వములను!!!
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నాగలిదున్నుచున్ తెలుగునన్ ఘనపోతనయే లిఖించె తా భాగవతమ్ము, వ్రాసె నల నన్నయభట్టు తెనుంగునన్ వాగది దేవి మానసము భాసిల భారత పర్వముల్ కడున్ రాగముతోడుతన్ కరము రంజిల జేయ ప్రజాళి చేతముల్
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు
తొలగించండిసహజకవి పోతనమలచె సరసరీతి
రిప్లయితొలగించండిభాగవతమును; నన్నయభట్టు వ్రాసె
నాంధ్రశబ్ధచింతామణి యాదికవిగ
తెలుగు వ్యాకరణమునకు దీప్తిగూర్చ
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారూ! నమస్సులు!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినా “శ్రీమదాంధ్ర సుందర కాండ పఞ్చాశ సర్గమున నేటి పద్యములలో నొకటి.
రిప్లయితొలగించండిపలుక బ్రహస్తుఁ డివ్విధిని వానర ముఖ్యుఁడు రాక్షసేంద్రు తో
సలలిత భాషలం బలికె శక్ర కృతాంత కుబేర పాశ హ
స్తుల ననుఁగుం దనమ్మెఱుఁగఁ జోదితుఁడై హరి చేఁ జెలంగ నే
నల హరి వంశ సంభవుఁడ నాగత కేవల వానరుండనే
మూలము:
ఏవముక్తో హరిశ్రేష్ఠస్తదా రక్షోగణేశ్వరమ్৷৷5.50.12৷৷
అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా.
ధనదేన న మే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః৷৷5.50.13৷৷
జాతిరేవ మమ త్వేషా వానరోహమిహాగతః.
__/\__
తొలగించండిఉత్పలమాల
రిప్లయితొలగించండియోగి మురారి నీలమణి యున్నత లీలల, గీతబోధలన్
సాగుచు భీష్మపర్వ యనుసంధిత విష్ణు సహస్రనామముల్
భాగము జేయలేని విధి భారత మందున పాక్షికమ్ముగన్
భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెన్గునన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పర్వ+అనుసంధిత' అన్నపుడు సవర్ణదీర్ఘసంధి. యడాగమం రాదు. "భీష్మపర్వమున సంధిత..." అనండి. అనుసంధిత, సంధిత... రెండూ సమానార్థకాలే.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
తొలగించండియోగి మురారి నీలమణి యున్నత లీలల, గీతబోధలన్
సాగుచు భీష్మపర్వమును సంధిత విష్ణు సహస్రనామముల్
భాగము జేయలేని విధి భారత మందున పాక్షికమ్ముగన్
భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెన్గునన్
నిన్నటి పద్యములు.
రిప్లయితొలగించండిఆ.వె:పదిలముగ బ్రతికెడి చదువు నేర్పు గురువు
మదికి హత్తుకొనగ నదియు నేర్వ
వలయు,మరల దాని వాసిగా గదిలోన
నధ్యయనము చేయ హర్ష మొదవు.
ఆ.వె:ఛాత్ర ధర్మ మదియు చక్కగా చదువుట
దినదినమ్మును గురు దేవులొద్ద
పదిలముగను నిత్య పాఠము లెల్లను
నభ్యసించ ధిషణ మదియు పెరుగు.
సహజ కవి పోతన రచించె జగతియందు
భాగవతమును, నన్నయభట్టు వ్రాసె
మొదటి కావ్యము చక్కగా ముదము తోడ
నాది కావ్యమయ్యె నదియు నవని యందు.
పోతనార్యుడనువదించె పుడమి యందు
భాగవతమును ,నన్నయభట్టు వ్రాసె
భారతమునుమన తెలుగు భాష
యందు మెచ్చిరెల్ల జనులు నాదరాన.
పోతనార్యుడేమి రచించె పుడమి యందు
నాదికవియటంచెవరిని యందురయ్య
రామకథ నేమి వాల్మీకి రహిని చేసె.
భాగవతమును నన్నయభట్టు వ్రాసె
డా. ఉమాదేవి గారూ,
తొలగించండిమీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
'భారతమునుమన తెలుగు భాష' అన్నపాదంలో గణదోషం. సవరించండి.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రిప్లయితొలగించండి"భాగవతమును నన్నయభట్టు, వ్రాసె"
నా పూరణ....
తే.గీ.
చదవె నైతిహ్యగ్రంథముల్ జదివె నింక
"భాగవతమును నన్నయభట్టు, వ్రాసె"
నంతఁ దాను మొదలిడుతు నాదికవిగఁ
భారతాంధ్రీకరణమును వాసికెక్క
విశ్వనాథ శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మొదలిడుచు' అనండి.
.............సమస్య
రిప్లయితొలగించండిభాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయ భట్టు తెల్గునన్
**************************************
సందర్భము: సులభము..
==============================
భాగవతంబు సంస్కృతము
వ్యాసకృతం బది దేవనాగరిన్
వేగ పఠింపజాల మని
ప్రీతి లిఖించె తెలుంగు టక్షరాల్
వాగనుశాసనుండు చదు
వన్ సులభం బని యొక్క మేల్ ప్రతిన్
భాగవతంబు వ్రాసె నల
ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెల్గునన్
✒~ డా.వెలుదండ సత్యనారాయణ
డా. వెలుదండ సత్యనారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య
రిప్లయితొలగించండిభాగవతమును నన్నయ భట్టు వ్రాసె
**************************************
సందర్భము: సులభము..
==============================
ఎత్తునకును పై యె త్తని చిత్తుఁ జేయు
భారత రచనన్ శాంతిని బడయలేక
భక్తి నపు డప్డు చదువగ వ్యాస కృతిని
భాగవతమును నన్నయ భట్టు వ్రాసె
✒~ డా. వెలుదండ సత్య నారాయణ
వెలుదండ వారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆగడముల్ రగుల్కొనగ నాంధ్ర తెలంగణులందునన్నిలా:
రిప్లయితొలగించండి"భాగవతంబు వ్రాసిన శుభంకరు డెచ్చటి వాడురా మహిన్?"
రాగము దీయుచున్ వలికె రాజమహేంద్రపు పండితుండిటుల్:
"భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్"
మీగడ వోలు పద్యముల మెప్పుగ నొప్పుగ పోతనార్యుడే
రిప్లయితొలగించండిభాగవతంబు వ్రాసె;...నల ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్
బాగుగ మూడు పర్వములు వ్రాసెను వ్యాసుని భారతమ్మునన్...
ఈగలు దోలు పృచ్ఛకుడ! యింతయె చాలును నీకు నాకిటన్