12, జనవరి 2018, శుక్రవారం

సమస్య - 2569 (చోరుఁడు పూజ్యుఁడాయె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే"
(లేదా...)
"చోరుఁడె పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్"
(ప్రపంచ తెలుగు మహాసభల శతావధానంలో పి. సరళ గారు ఇచ్చిన సమస్య)

54 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. చీరలు దోచుచు దాగుచు
   చీరలు పదివేలనిచ్చి శ్రీకరముంగన్
   వారిజ నేత్రుల సిగ్గుల
   చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే!

   తొలగించండి


  2. అదిరెన్ సిగ్గుల సింగార చోరుని పూరణ

   జిలేబి

   తొలగించండి

 2. ఆ రుక్మిణి వినెను కథల
  వారావధి బాపడవగ, వనితా రమణిన్
  హోరెత్తించుచు మానస
  చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. దారులు కాచి సరసగతి
  బారులు తీరిన గొల్ల భామల శాటికల్
  సారస నయనుడు మానస
  చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే

  రిప్లయితొలగించండి
 4. వారిండ్లను వీరిండ్లను
  గోరుచు క్షీరంబు పెరుగు కొంకక సతముం
  జేరుచు నుండెడి వెన్నల
  చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే.

  రిప్లయితొలగించండి
 5. వేరని యెంచకుండ నలివేణుల యుల్లము కొల్లగొట్టుగా;
  పారెడి ప్రేమతో వకుళమాలిక మాలికలెల్ల దాల్చుగా;
  మీరిన కోర్కె నన్నమయ మెండగు గీతుల మూటగట్టుగా;
  చోరుడె పూజ్యుడాయె గద చోద్యము గాగ నిలాతలంబునన్.

  రిప్లయితొలగించండి
 6. ధీరుoడైగిరి నెత్తి యు
  కోరిన కోర్కె లను దీర్చు గోవిందు oడై
  వీరు డు రుక్మిణి మానస
  చోరు oడేపూజ్యుడ య్యే చోద్యము గాదే !

  రిప్లయితొలగించండి


 7. ఆఱవిడిన్ జిలేబి మజ అయ్యరు గారిని మాటకారియై
  సోరణి దివ్వె వెల్గు సయి సొంతము చేసుకొనన్సయాటలన్,
  వారము శుక్ర వారమది ! పారుడు, నుల్లపు వాటికన్ పట
  చ్చోరుడె, పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
  భారతమందు గీతను సుభాషిత జీవిత సత్య రూపమున్
  కారణజన్ముడా విమలకాంతుడు బోధన జేసి లోమనంబులన్
  దారినిజూపి గోవిభుడుతత్త్వవిచారుడు
  గోపికా మనః
  చోరుడు పూజ్యుడాయె గద చోద్యముగాగ నిలా తలంబునన్

  రిప్లయితొలగించండి
 9. చేరియు మిథిలా నగరము
  శౌరియె తా కొల్లగొట్టె జానకి మనము
  న్నౌరా! మైథిలి మానస
  చోరుండే పూజ్యుడయ్యె చోద్యము కాదే?
  *****
  (చోద్యము కాదే = చోద్యము కాదు)

  రిప్లయితొలగించండి
 10. దారుణముల నిచ్చెనపై
  మారణకాండల ‌నెదిగిరి మన నేతలుగా
  కారణమేమైన తుదకు
  "చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆరణమున నర్జునునకు
   పోరాటము జేయ గీత భోధించెనుగా
   కారణజన్ముడు వెన్నుడు
   "చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే"

   తొలగించండి
 11. కవిమిత్రులారా,
  నమస్కృతులు.
  నిన్న రాజమండ్రిలో మిస్సన్న గారి ఆతిథ్యాన్ని, సత్కారాన్ని అందుకొని ద్రాక్షారామం వెళ్ళి దైవ దర్శనం చేసుకుని కాకినాడ చేరుకున్నాను.
  ఇక్కడ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి అతిథిగా ఉన్నాను.
  ఇక్కడి నుండి సామర్లకోట, అటుపై పిఠాపురం వెళ్తాను.
  పిఠాపురంలో చింతా రామకృష్ణారావు గారు నాకోసం ఎదురు చూస్తున్నారు.
  రాత్రికి రాజమండ్రి చేరుకొని రైలెక్కుతాను.
  నిరంతర ప్రయాణం వల్ల మీ పూరణలను సమీక్షించలేకున్నాను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుదేవులకు నమస్సులు! మీ యాత్రలన్నీ సంతోషకరంగా సమకూరాలని ఆశిస్తున్నాము!🙏🙏🙏

   తొలగించండి
 12. హారకు రత్నాకరు, శ్రీ
  నారద ముని కరుణచేత జ్ఞానిగ మారెన్
  శ్రీ రాము చరిత వ్రాసెను
  చోరుండే పూజ్యుడయ్యె జోద్యము గాదే!

  రిప్లయితొలగించండి
 13. దారులు కాచెడు వాడట
  నారదుని వలన భజించి నారాయణుని
  న్నారామచరిత వ్రాయగ
  చోరుండే పూజ్యుడాయె చోద్యముగాదే

  రిప్లయితొలగించండి
 14. తీరుగ వెన్నలు దొంగిలె
  చీరెలనే దాచివేసె శ్రీకృష్ణుండే
  దూరుచు గొల్లెత మానస
  చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే.

  రిప్లయితొలగించండి
 15. దూఱుచు నిండ్లన నెప్పుడు
  క్షీరదధులు,వెన్న దోచి చిక్కక తిరుగా
  డా రేపల్లె నివాసపు
  చోరుండె పూజ్యడయ్యె జోద్యము గాదే!

  రిప్లయితొలగించండి
 16. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


  శిశుపాలుడు శ్రీ కృష్ణుని నిందించుట


  క్షీర నవోధృతంబుల భుజించును , మ్రుచ్చిలి కొంప ‌‌ లందునన్ |

  వారిజ నేత్రలన్ మరుగు పల్లవికుం | డిత డొక్క ఙ్ఞానియే ?

  ధీరుడె ? వెర్రివాని పగిదిన్ గర మందున చక్ర మూను | నా

  గౌరవనీయు లందరిని గాదని , శౌరికి బీఠ మివ్వ స్వీ

  కారమె ? సత్యదూరుడు - వికారుడు - ఘోరుడు , వీడు | శ్రీ పట

  చ్చోరుడు పూజ్యు డాయె గద. చోద్యము గాగ నిలాతలమ్మునన్ !

  వీరుడు - చైద్యు డోప డిక | వెంటనె క్రిందికి ద్రోయు , ధర్మజా !


  {నవోధృతము = వెన్న ; పల్లవికుడు = వ్యభిచారి ;‌ పటచ్చోరుడు =

  చోరుడు ; శ్రీ పటచ్చోరుడు = శ్రీ ని హరించువాడు ; }

  రిప్లయితొలగించండి
 17. నారీమానస చోరుడు
  పారావారుండు ప్రేమ ప్రవిమలరీతిన్
  ధీరుండు రుక్మిణీమణి
  చోరుండే పూజ్యుడాయె చోద్యముగాదే

  రిప్లయితొలగించండి
 18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2569
  సమస్య :: *చోరుఁడు పూజ్యుఁడాయె గద చోద్యముగాగ నిలాతలమ్మునన్.*

  సందర్భం :: ధర్మరాజు రాజసూయ యాగం చేయదలచి , దిగ్విజయ యాత్ర పూర్తిజేసి , రాజసభలో భీష్ముని సలహా ననుసరించి , శ్రీకృష్ణునికి అగ్రపూజను నిర్వహిస్తూ ఉండగా , శిశుపాలుడు శ్రీకృష్ణుని అనేక విధాలుగా నిందించే సందర్భం.

  కూరిమి రాజసూయమున ,గొప్పగ నందెడి నగ్రపూజలన్,
  క్రూరుడు బాలుడై వివిధరూపుల జంపెను పూతనాదులన్,
  జారుడు నుంచెడిన్ తన వశమ్మున నిత్యము గోపకాంతలన్,
  మారడు సజ్జనుండుగను , మానడు దొంగతనాలు , శాటికా
  *చోరుడు పూజ్యు డాయె గద చోద్యముగాగ నిలాతలమ్మునన్.*
  {శాటికా చోరుడు=గోపికా వస్త్రాపహారి}
  *కోట రాజశేఖర్ నెల్లూరు.* (12.01.2018)

  రిప్లయితొలగించండి
 19. మైలవరపు వారి పూరణ

  🙏శ్రీ వివేకానంద స్వామినే నమః 🙏

  ధీరత వేషభాషలను దీప్తుడునై యట ప్రాచ్యవాసిదృ...
  క్చోరుడునై , చికాగొ సభ జూడగ వాక్సుధ జల్లి , ప్రేమతో
  భారతసంస్కృతిన్ బలికి వారల ముగ్ధుల జేసెఁ దన్మన... ....
  శ్చోరుడె పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. వివేకానందుల వారి జన్మ దినాన్ని పురస్కరించుకుని మైలవరపు వారు చేసిన పూరణ అద్భుతము గావున్నది !


   జిలేబి

   తొలగించండి
  2. మైలవరపు మురళీకృష్ణ గారు చాలా బాగుంది మీ పూరణ.
   ప్రాచ్యవాసిదృక్చోరుడు: తూర్పు దేశ నివాసుల నియేనా మీ యుద్ధేశ్యము. కాని పాశ్చాత్యుల దృష్టిని కదా అక్కడ దోచుకున్నది.

   తొలగించండి
  3. శ్రీ జిలేబి గారికి.. పోచిరాజు వారికి నమస్సులు... ధన్యవాదాలు... వారి సూచననుసరించి సవరణ.. మన్నించండి..

   🙏శ్రీ వివేకానంద స్వామినే నమః 🙏

   ధీరత వేషభాషలను దీప్తుడునయ్యు విదేశవాసిదృ
   క్చోరుడునై , చికాగొ సభ జూడగ వాక్సుధ జల్లి , ప్రేమతో
   భారతసంస్కృతిన్ బలికి వారల ముగ్ధుల జేసెఁ దన్మన... ....
   శ్చోరుడె పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  4. సవరణ చక్కగ నున్నది. మీ ప్రథమపు టాలోచనకు ననుగుణము గా నుంచ నెంచిన “వారుణీస్థ దృ / క్చోరుఁడు” నన సందర్భోచితముగా నుండును.

   తొలగించండి
  5. శ్రీ పోచిరాజు వారికి నమస్సులు... ధన్యవాదాలు..మీ సూచన సవరణ అవశ్యం కోరుకుంటాను... నమస్కారములండీ...

   ��శ్రీ వివేకానంద స్వామినే నమః ��

   ధీరత వేషభాషలను దీప్తుడునయ్యును వారుణీస్థ దృ
   క్చోరుడునై , చికాగొ సభ జూడగ వాక్సుధ జల్లి , ప్రేమతో
   భారతసంస్కృతిన్ బలికి వారల ముగ్ధుల జేసెఁ దన్మన... ....
   శ్చోరుడె పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 20. మీరగ విత్త బలంబుల
  ధారుణి నేత లగుదురు సుతవ్రజ యుతులై
  బీరు వకృత కార్య చయ వ
  చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే

  [వచః+ఉరు = వచోరు; అధికప్రలాపి]


  క్షీరము నీయఁ బూతనను జీరిన వాఁడు కుమారుఁ డయ్యు నా
  తేరును గూల్చె వాయ్వసురుఁ దేర్చెను మద్దులఁ ద్రుంచెఁ గాలి దు
  ర్వార బకాసురారి పసి బాలుఁ డు వెన్నుఁ డు తక్ర సారపుం
  జోరుఁడె పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్

  రిప్లయితొలగించండి
 21. డేరాబాబాయనునొక
  కారణజన్ముండువచ్చె గావగయనుచుం
  జేరిన స్త్రీ మానమ్ముల
  చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే సవరణ
  డేరాబాబాయనునొక
  కారణజన్ముండువచ్చె గావగయనుచుం
  జేరిన స్త్రీజన మానపు
  చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే

  రిప్లయితొలగించండి
 22. ఆరయవిష్ణుమూర్తిముదమారగదేవకిపుత్రుడైచెఱన్
  సారెకునుద్భవింపగనుచానయశోదయెబెంచువేళలన్
  నేరుపుతోడగోకులమునేగికురింపగవెన్నదొంగయౌ
  *చోరుడు పూజ్యు డాయె గద చోద్యముగాగ నిలాతలమ్మునన్.*

  రిప్లయితొలగించండి
 23. ఆరయనొకతండాలో
  నేరుపుతోకన్నెపిల్లనెత్తుకురాగా
  కూరిమిబెండ్లినిసేతురు
  చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే

  రిప్లయితొలగించండి
 24. పరమాత్మ పుట్టె జగతిని
  కారణ జన్ముండు నగుచు గాంక్షలు దీర్చన్
  వారిజ నేత్రుల మానస
  చోరుండే పూజ్యుడయ్యె జోద్యము గాదే

  రిప్లయితొలగించండి
 25. రెండవపూరణ
  శ్రీ వివేకానంద స్వామి వారి జయంతి సందర్భంగా
  గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
  సమస్యాపూరణ :: సమస్య సంఖ్య-2569
  సమస్య :: *చోరుడు పూజ్యుడాయె గద చోద్యముగాగ నిలాతలమ్మునన్.*

  ‘’భారతదేశ సంస్కృతి శుభ మ్మిడు , తత్వము యోగ విద్యలున్
  పారము జేర్చు , సత్య ‘’ మని బల్కి నరేంద్రుడు పూజలందెగా
  కారణజన్ము , డా యమెరికా ప్రజ మెచ్చగ , స్వామి తన్మన
  *శ్చోరుడు , పూజ్యు డాయె గద , చోద్యముగాగ నిలాతలమ్మునన్.*
  *కోట రాజశేఖర్ నెల్లూరు.* (12.01.2018)

  రిప్లయితొలగించండి
 26. శౌరి జనించెను గొల్లగ
  భారముఁ బాపగ పుడమికి ద్వాపరమందున్
  శూరుడు రాధా మానస
  చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే?

  రిప్లయితొలగించండి
 27. కారణ జన్ముడై వరలి కాంతల ,మర్త్యుల మానసంబునున్
  చోరుడె పూజ్యుడాయె గద చోద్యముగాగ నిలాతలంబునన్
  వారిజనేత్రులందరిని బ్రాణ ప్రదంబుగ జూచు గావుతన్
  భారమునం తయు న్నతని బాహువు లందున నుంచిరే సుమా

  రిప్లయితొలగించండి
 28. నేరమనస్కులై ప్రజల నిత్యము నారడి బెట్ట రక్కసుల్
  భారముమోయలేక భువి ప్రార్థన జేయగ పద్మనాభునిన్
  శౌరి జనించె తా పుడమి చక్కని రూపున వెన్నదొంగగా
  చోరుఁడె పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్

  రిప్లయితొలగించండి
 29. కారణ జన్ముడు కృష్ణుడు
  ఆరాధ్యుడు వెన్నదొంగఅబలల మదిలో
  దూరియు మనసును దోచే
  చోరుండే పూజ్యుడయ్యె చోద్యముగాదే|
  2.చేరియు కనుపాపలలో
  ఆరనికనుకొలను నందు నావరు డీదన్
  ప్రేరణ పెళ్ళాడన్ పతి
  చోరుండే పూజ్యుడయ్యె|చోద్యముగాదే|


  రిప్లయితొలగించండి
 30. ఉదయం తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారితో వారి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వరుసగా సర్పవరం భావనారాయణ స్వామిని, సామర్లకోట కుమార భీమేశ్వర స్వామిని, పెద్దాపురం మరిడమ్మను, తొలి తిరుపతి (దివిలి) శృంగార వల్లభ స్వామిని దర్శించుకుని పిఠాపురం చేరి చింతా రామకృష్ణారావు గారిని కలిసాను. సాయంత్రం కుక్కుటేశ్వర స్వామిని, పరహూతికా దేవిని దర్శించుకుని రాజమండ్రి చేరి రైలెక్కుతాను. రేపు నెలవు చేరుకుంటాను.

  రిప్లయితొలగించండి
 31. కందం
  భారీ దొంగతనాలకు
  వారలె చిరునామ యైన బడుగులు వారి
  న్నారాధించఁగఁ దోడ్పడఁ
  జోరుండే పూజ్యుఁ డయ్యెఁ జోద్యము గాదే!

  ఉత్పలమాల
  గారముఁ జేసి పెంచిరిల కన్నని! చీరలఁ బాలు మీగడల్
  జీరుచు దోచె వాడెనని జెప్పి యశోదకు, వచ్చు దారినన్
  సూరిని గాంచ గోపికల చూపులఁ బొంగఁగ భక్తి భావనల్
  చోరుఁడు పూజ్యుఁడాయెఁ గదచోద్యముగాగ నిలాతలంబునన్!

  రిప్లయితొలగించండి
 32. వీరుడు, సాదు సజ్జనుల పెక్కగు చాట్లను బెట్టుచున్న దురా
  చారుల సంహరించిగను సాగరమేఖల జన్మమెత్తియున్
  కోరిన గోపికా తతికి కూరిమి పంచిన రాథికామనో
  చోరుఁడె పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్"

  రిప్లయితొలగించండి
 33. నిన్నటి పూరణ :
  ఉత్పలమాల
  జన్యమశాంతి కారకము సంధికి నొప్పిన నాశమాగదే?
  గుణ్యమదే యనంగ నొగి క్రోధమునన్ హరిఁ జుట్టు ముట్ట కా
  ర్పణ్యము! విశ్వరూపమున ప్రార్థనలందఁగ కౌరవాళికిన్
  మాన్యుడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో?

  రిప్లయితొలగించండి
 34. .............సమస్య
  చోరుఁడె పూజ్యు డాయెఁ గద
  చోద్యము గాగ నిలాతలంబునన్!
  ==============================
  సందర్భం: కృష్ణుడు చోరుడా! అది నిజానికి చిన్న మాట! గోపికల చీరలు దొంగిలించినాడు. చీరలేనా! వాటితోబాటు వారి శరీరాలనూ దొంగిలించినాడు.
  శరీరాలనేనా! వాటితోబాటు హృదయా లనూ దొంగిలించినాడు. హృదయాలనేనా! వాటితోబాటు వాటిలోని ప్రేమలనూ దొంగిలించినాడు.
  ఐనా పూజ్యుడే ఐనాడు అనే సందర్భం.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  చోరుడు- చిన్న మాట గద!
  శోభిత గోప పురంధ్రి శాటికా
  చోరుడు- శాటికా సహిత
  సుందర పుష్ప సమాన దేహ సం
  చోరుడు- దేహ రాజి యుత
  శుభ్ర స దంకిత భావ పూర్ణ హృ
  చ్చోరుడు- సత్ హృ దబ్జయుత
  సుప్త సురాగ మరంద పాళికా
  చోరుడె- పూజ్యు డాయె గద!
  చోద్యము గాగ నిలా తలంబునన్!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ

  రిప్లయితొలగించండి
 35. .......సమస్య
  చోరుండే పూజ్యు డయ్యెఁ జోద్యము గాదే!
  ==============================
  సందర్భం: మాన్య శ్రీ కంది శంకరయ్యగారు రోజూ "సమస్యల"ను (సమస్యా పూరణం కోసం) తెచ్చిపెట్టి మా తీరిక సమయాన్ని దొంగిలిస్తున్నాడు అనే సందర్భం.
  ఈ విధంగా చోరులైనా వారు ధీరులే!.. పూజ్యులే!..
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  ధీరుడు "కంది" కవిత్వము

  పేర "సమస్యల"ను తెచ్చిపెట్టి యిటుల మా

  తీరిక వేళను దొంగిలె....

  చోరుండే పూజ్యుడయ్యెఁ జోద్యము గాదే!

  ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
  """""""""""""""""""""""""
  శ్రీ కంది శంకరయ్య గారికి క్షమాపణలతో..

  రిప్లయితొలగించండి
 36. కం
  నారాయణ ! నీవే గతి
  నీరజనేత్రా ! యని శరణిమ్మని కోరన్
  హారియగుచు పాపచయపు
  "చోరుండే పూజ్యుఁడయ్యెఁ జోద్యము గాదే"

  రిప్లయితొలగించండి
 37. దారుణసర్పము మృదుకా
  సారంబున నింపగా విషంబును, వానిన్
  శౌరి గెలువఁ లోకమన
  శ్చోరుండే పూజ్యుడయ్యె చోద్యముగాగన్

  రిప్లయితొలగించండి
 38. చీరలు గోపికల్ విడువ చెట్టున దాచుచు దాగుచుండెనే
  కోరిన వెంటనే విరివి కోకల నిచ్చుచు బ్రోచుచుండెనే
  వారిజ నేత్రలన్ వలచి వారల సిగ్గుల దోచునట్టి యా
  చోరుఁడె పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్

  రిప్లయితొలగించండి
 39. వారల దైన్యమున్ తరుము వారి స్వతంత్రపు సంగరమ్ముకై
  కోరుచు వీధులన్ వెడల కోమటి కొమ్మలు వారివారి బం
  గారపు గాజులిచ్చిరట! గాంధి మహాత్ముడు బోసితాతయౌ
  చోరుఁడె పూజ్యుఁడాయెఁ గద చోద్యముగాగ నిలాతలంబునన్!

  రిప్లయితొలగించండి