30, ఏప్రిల్ 2018, సోమవారం

దత్తపది - 138 (కుండ-దుత్త-చెంబు-గరిటె)

కుండ - దుత్త - చెంబు - గరిటె
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
భారతార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

80 కామెంట్‌లు:

  1. మైలవరపు వారి పూరణ

    ఉత్తరకుమారుడు...

    ఎవరినైనను గూల్తు విల్లెత్తకుండ ,
    నుర్వి రణమన భీతి లేదుత్తరునకు !
    ననగ , దలచెం బురజనుండు విని , యితండు
    తేరుఁ గరిటెక్కెములఁ గని పారిపోవు !!

    ( రథమును., ఏనుగులపైనున్న జెండాలను చూచి....)

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శూరులకు యుద్ధము మృష్టభోజనము....

      ముంగిట మృష్టభోజనము మోదము గూర్పగ , పొందకుండ మా
      యెంగిలి కోరు పాండవులదెట్టిది ధైర్యమదుత్తదే ! హరీ !
      చెంగట గెల్పు మాది ! తలచెం బురుషోత్తమ ! మా మనమ్ము వీ...
      లుంగొని పోరు సల్పుటకు , లొంగరిటెవ్వరు ! కృష్ణ ! సంధికిన్ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  2. అజ్ఞాతము తమకది గోప్యమని మసలవలెనుగ
    బయల్పడకుండ
    సుధేష్ణ పాన సురాపాన దుత్తల సైరంధ్రి
    తెచ్చుచుండ
    నిష్టా గరిష్ట బ్రాహ్మణుండై చెంబుతో చెలగి
    ధర్మజుడుండ
    గదనొదిలిన వలలుడు వంటగదిని ఘుమ ఘుమల
    గరిటె తిప్పుచుండ

    రిప్లయితొలగించండి
  3. (పద్మవ్యూహానికి వెడలబోతూ అభిమన్యుడు ధర్మరాజుతో)
    ఊరడిలుడు;పట్టుటయన్న దుత్తమాట;
    అయ్య లేకుండనైన నేనరుగుదయ్య!
    గురువునకు నశించెం బుద్ధి తరిగి తరిగి;
    చివ్వ నేసల్ప సాగ రిటెవ్వరయ్య!


    రిప్లయితొలగించండి

  4. యక్షుడు ధర్మరాజు తో

    మీ తమ్ముల దుత్త ఢమడ
    మే! తరగరి!టెంకణమిడు! మేటిజవాబుల్
    ద్యోతింపకుండ విడువన్!
    యాతన కొంచెంబు వారి యాయువు సుమ్మీ!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశం :: దత్తపది (138)
    ఇచ్చిన పదాలు :: * కుండ దుత్త చెంబు గరిటె * (వేరే అర్థంలో ఉపయోగించాలి)
    విషయం :: భారతార్థం.
    సందర్భం :: కురుక్షేత్రంలో నేను ఒక పక్షం వైపు ఉంటాను. యుద్ధం చేయను. మరొక పక్షంలో నాతో సమానమైన వీరులు అసంఖ్యాకంగా ఉండి యుద్ధం చేస్తారు. అర్జునా నీ ఇష్టం. ఎవరిని కోరుకొంటావో కోరుకో అని శ్రీకృష్ణుడు అన్నప్పుడు ఫల్గుణుడు శ్రీకృష్ణునే కోరుకొన్నాడు. దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకొన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పాండవుల భక్తిని గుఱించి కౌరవుల రక్తిని గుఱించి ఆలోచించే సందర్భం.

    శ్రీ మత్సైన్యము కోర(కుండ) నను గోరెన్ పార్థు డార్తుండు, తా
    భూమిన్ గెల్చును, ధర్మ మెక్కడికి పోబో (దుత్త)ముల్ పాండవుల్,
    క్షేమమ్మున్ విడి రాజరాజిటు తలం(చెంబు)ణ్యహీనుండు నన్
    సామాన్యుండని, కౌరవుల్ త(గరిటెం)చన్ ధర్మ మార్గమ్ములన్.
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (30-4-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణ అవధానిగారూ! ప్రణామాలు!💐💐💐🙏🙏🙏

      తొలగించండి
    2. శ్రీమతి సీతాదేవి గారికి ప్రణామాలు.

      తొలగించండి
    3. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారికి హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించండి


  6. కుచేలుడు కృష్ణుడు



    తనదుత్తరీయమును జా
    పెను కొంచెంబు! యవనారి పేర్మి నటుకుల
    న్ననుకోకుండ గొనెను పొం
    తన!డింగరి టెంకణమిడె తరుణి‌ జిలేబీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. భాగ్యనగరిటెక్కు లరయ పంప, సుతుడు
    దానియందుత్తమమగు సౌధముల చూడ
    కుండ వచ్చినందుకు తండ్రికోపగించి
    పాణివిసర కొంచెంబుగ్గ వాచెనపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      పద్యం బాగుంది. కాని భారతార్థంలో వ్రాయమన్నాను కదా?

      తొలగించండి
    2. సరిగా గమనించలేదు. ధన్యవాదములు

      తొలగించండి
  8. ద్రౌపదితో కీచకుడు

    బాల! విరటుని సైన్యపు పాలకుండ
    దురమునందు నాకెదురన్న దుత్తమాట
    పుణ్యకాలమది గడచెం బుణ్యశీల
    రవ్వజేయకు సాగరి టెవ్వరేని!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి సవరణతో
      ద్రౌపదితో కీచకుడు

      బాల! విరటుని సైన్యపు పాలకుండ
      దురమునందు నాకెదురన్న దుత్తమాట
      పుణ్యకాలమది గడచెం బుణ్యశీల
      రవ్వజేయగ సాగరి టెవ్వరేని!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  9. నిండు సభలోన శిరముల నెత్త కుండ
    దుష్ట దూరుని గాంచని దుత్త మంబు
    గడువు దాటిన కీచకుని గరి టెక్కి
    విరిచి నేతెంచెం బురవీధి వెఱఁగు బడుచు


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. నిండు సభలోన శిరముల నెత్త కుండ
      దుష్ట దూరుని గాంచని దుత్త మంబు
      గడువు దాటిన కీచకుని గరి టెక్కి
      విరిచి నడచెం బురవీధి వెఱఁగు బడుచు

      తొలగించండి
  10. కృష్ణ రాయబారము నూహించి

    వినుము, కాదుత్త మాటలివి యని లోన
    నరుని విల్లెత్త కుండగ నాప గలరె
    తేరు గరిటెక్కములగాంచి నీరుగారి
    పోవరే వచించెంబుణ్య పురుషు డచట

    రిప్లయితొలగించండి
  11. పాండవుల తరగరి,టెక్కు పలుకు లేల,
    కుండకీలుల మిత్రుల కూటమనుచు
    దుత్తపాడు వచనముల తోడ మాకు
    కినుక తెప్పించితివిగదా! వినుము యివ్వ
    బోము కుప్పముల్, యిది సచ్చెం, బుగ్గి కూడ
    రాల్చనని బల్కె రారాజు రౌద్ర గతిని
    కృష్ణుడు రాయభారమునకు వచ్చినపుడు దుర్యోధనుడు పలికిన మాటలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణసూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఐదవ పాదంలో గణదోషం. 'కుప్పముల్ + ఇది' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  12. పెక్కురరుల నెదురుకొను బెదరకుండ
    నొనరు ధీరత్వము గన కాదుత్తదేమి
    చెలగు క్రీడి శౌర్యమది కొంచెంబు కాదె
    యొక్కడె యరులదౌ గరి టెక్కు నణచు

    రిప్లయితొలగించండి
  13. [30/04, 06:10] ‪+91 75698 22984‬: 30, ఏప్రిల్ 2018, సోమవారం
    దత్తపది - *138*

    *కుండ - దుత్త - చెంబు - గరిటె*
    పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
    *భారతార్థంలో*
    మీకు నచ్చిన ఛందస్సులో
    పద్యాన్ని వ్రాయండి

    http://kandishankaraiah.blogspot.in
    [30/04, 09:10] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
    నీవు నా'కుండ'నండగ నిఖిల జగతి
    గెలుప 'దుత్త'దే యంచును! గురుని జంపి
    పోరునణ"చెంబు"రందర పుత్రు డకట
    కురున"గరి టె"క్కమునేల గూలె రాజ !
    (సంజయుడు ధృతరాష్ట్రునితో )

    రిప్లయితొలగించండి
  14. వినుము మామాయ్య! కాదుత్త వియవి కావు
    నాదు మాటలు,రణమున నరుడు విల్లు
    నెత్తకుండగ జేయంగ నీశు తరమె?
    తేరు గరి టెక్కెములగని శత్రువులట
    నారి కొంచెంబు సారించ నభము జేరు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీకృష్ణుని పలుకులు
      కోమలికి చిక్కు నేను రాకుండజేతు
      ఉర్వి బాలుర నిటు కూడదుత్తరింప
      మిమ్ము గలచెం బురాకృత మీ పగిదిని
      డింగరిటె వచ్చె మిమ్ము నోడింపనెంచి

      డింగరి=అశ్వత్థామ బాలురు=ఉప పాండవులు
      ఉత్తరింప=ఖండింప కోమలి=ద్రౌపది
      మిమ్ము=పాండవులను

      తొలగించండి
    2. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *******
      ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. +919948634619.. .వీరబ్రహ్మేంద్రాచార్య..... (తపస్వి వేషమున అర్జునుఁడు సుభద్రతో)

    కోరికుండని దెవరికి కోమలాంగి,
    తత్తరములేక యిమ్ముసదుత్తరమ్ము,
    మరలిచెంబుద్ధి నీపైనమాధవుండు,
    నగరి టెక్కేల? పలుకవు నళిన నయన.

    ముంజంపల్లి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీరబ్రహ్మేంద్రాచార్యుల పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. కౌరవ సభలో ద్రౌపది శ్రీ కృష్ణపరమాత్మను పిలుస్తారు :

    కందం
    తలలెత్త కుండ నుండిరి
    వెలువడదుత్తరము వారె పెద్దలు సభలో! 
    పిలిచెం బుష్కరనాభ! య
    బల! సాగరిటెవ్వరు నిను బాయుచు రారా!

    రిప్లయితొలగించండి

  17. guruvu gaaru maarchina padyamu

    పాండవుల తరగరి,టెక్కు పలుకు లేల,
    కుండకీలుల మిత్రుల కూటమనుచు
    దుత్తపాడు వచనముల తోడ మాకు
    కినుక తెప్పించితివిగదా! వినుము యివ్వ
    బోము కొటికల, నిది సచ్చెం, బుగ్గి కూడ
    రాల్చనని బల్కె రారాజు రౌద్ర గతిని
    కృష్ణుడు రాయభారమునకు వచ్చినపుడు దుర్యోధనుడు పలికిన మాటలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ సవరించిన పద్యంలోను కొన్ని లోపాలు...
      'వినుము + ఇవ్వబము' అన్నపుడు యడాగమం రాదు. "విను మొసంగ। బోము" అనండి. 'సచ్చెం'...?

      తొలగించండి
    2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  18. సదమల హృదుత్తరా త
    ద్హృద యాపహ రాభిమన్య దివ్యానురతిన్
    మదిఁ దలఁచెం బువుఁబోడి ద్రు
    పదజ నగరి టెక్కెము కడఁ బడకుండ వెతన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      చక్కని పదాడంబరంతో ఉత్తమంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  19. విజయున్ బోరున జంపకుండ విడు తు న్ విశ్వాస ము oచమ్మరో
    నిజ మౌమాటగనిత్తదుత్త ద న క న్ నిశ్చింత గా నమ్ము మా
    కుజ నుండoచె రు గంగ కమ్మ మదిలో కొంచెం బు గా నెప్పుడు న్
    సృజనా రంగ రి టెక్ కె ము న్ గలిగి వాసిoగాoతు నే కర్ణుడై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాటగనిత్తదుత్తదనకన్, సృజనా రంగ రి టెక్కెమున్' అర్థం కాలేదు. ఇక్కడ పదవిభాగం ఏమిటి?

      తొలగించండి
    2. మాటగని త్తు+అది +ఉత్త దగు చు న్
      సృజనా రంగ రి =సృజన త్వం తో రంగు లు వేయు వాడు

      తొలగించండి
  20. అప్సరస ఊర్వశి విజయునితో :

    కందం
    తలనెత్తకుండ జవ్వని
    పిలువంగ సదుత్తరంబు విన బల్కవహో
    కలికికి కొంచెంబు! సరస
    ముల తూగరిటెవ్వరన్న పోలిక తగదే?

    రిప్లయితొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    రాజరా జొలిపించెం బురంధ్రి వలువ ,

    లార్యుల నుడుల వినకుండ నహము తోడ |

    మెదల లేదుత్త మానుజుల్ , మీరకుండ

    నగ్రజుని సంఙ్ఞ || యబల కాపాడు మనుచు

    కోరగా , నబ్ధినగరి (న్) టెక్కువము మీర

    నేలు దొర యామె విలువ రక్షించె నపుడు



    [ అబ్ధినగరి = ద్వారక ; టెక్కువము మీర = చక్కగా , విలాసముతో ;

    అబ్ధినగరినేలుదొర. = కృష్ణుడు ; విలువ = మానము ;

    దుర్యోధనుడు వలువ లొలుచ శౌరి ఆమె విలువ కాపాడెను ]

    రిప్లయితొలగించండి
  22. [4/30, 2:49 PM] Dr Umadevi B: డా.బల్లూరి ఉమాదేవి.

    30/4/18

     

    వినుము కాదుత్త మాటలు వేగ మేను

    నాకురుపతిఁవదలకుండ నాహవమున

    దునిమెదంచెంబురంధ్రి దుఃఖ ముడిపి

    చనియె నాగరిటెవ్వరటంచు నాకిరీటి.

     

    కూల్చెద ననిలో విల్లెత్తకుండ వైరి

    వర్గము నిదుత్తదైనట్టి వచనమసలు

    కాదటంచెంచు మింకనాగరిటెవరును

    ననగ సంతసించెంబురమందు కృష్ణ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'దునిమెదంచెంబురంధ్రి' ఇక్కడ పదవిభాగం?

      తొలగించండి
  23. మిత్రులందఱకు నమస్సులు!

    [అంతఃపుర స్త్రీల యెదుట నుత్తరుని ప్రగల్భములు]

    "అలు పెఱుఁగకుండ పోరాడునట్టివాఁడ;
    నుత్తరాఖ్యుఁడ; దురమునం దుత్తరుండఁ;
    "జీరి యరుల నబ్బుర పఱిచెం బులి!"యన
    డిల్లఁ బడఁజేయు గరగరి టెక్కునాది!"

    రిప్లయితొలగించండి
  24. (2)
    [అగ్నిమాంద్యముచేఁ దల్లడమందెడి యగ్నిదేవుం డర్జునునిఁ జేరి, ఖాండవ మేర్చుమని కోరు సందర్భము]

    తగ నా యాగపు టగ్నిమాంద్య మెలమిం దత్పావకుం "డర్జునా!
    వగ పిందుత్తగఁ దీర్ప ఖాండవవనిన్ భస్మమ్ముఁ జేయంగదే!
    పొగులన్ నన్ నినుఁ జేర బ్రహ్మ పనిచెం బుణ్యాత్మ! చేకొమ్ము బు
    గ్గిగఁ జేయం జను విల్లు, నంపగరి, టెక్కెంపున్ శతాంగమ్ములన్!"

    రిప్లయితొలగించండి
  25. యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు కర్ణునితో

    శ్రేయ మార్గంబు జనువారి జేరకుండ
    దుష్ట దుర్యోధనుని పొంద దుత్తమంబె?
    బుద్ధిహీనతను దలచెం బురుషశ్రేష్ఠ
    ధార్తరాష్ట్రుల మైత్రిని ధర్మమనుచు
    వారలు తగరిటెంచను వాస్తవముగ
    కుంతి పుత్రులె హితమును గూర్చువారు!

    రిప్లయితొలగించండి
  26. శంతనమహారాజు గంగాతీరాన విహరించు చున్న పడతిని చూసిన సందర్భం

    గంగదరిని బాగరిటెక్కు గాంచ నట్టి
    యింతి పొందుత్తమముతోచ శంత నుండు
    తెలిపె తనయిచ్ఛ చెలియేమి తెలుప కుండ
    ఈలపడగ కొంచెంబుగ్గ యెరుపుదాల్చె

    రిప్లయితొలగించండి
  27. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి

    2. ఉత్తరుడు భీరుకుండన దుత్త మాట
      కత్తి నీచెంబుగా బట్ట గర్ర లేగ
      చిత్తుగ రిటెల్ల చావరే చిత్తు గాను
      భృతుల జూచుచు పల్కడే భీరువేగ
      (నిన్న వ్రాసిన శంకరాభరణం వారి దత్తపది.. ..కుండ, దుత్త, చెంబు, గరిటె)

      తొలగించండి
  28. (3)
    [కౌరవ సభకు రాయబారిగా నేఁగుచున్న శ్రీకృష్ణునితో ద్రౌపది తనకు జరిగిన యవమానముం గూర్చి తెలిపిన సందర్భము]

    యదుకులభూషణా! యటు లహంకృతిఁ బెద్దలఁ గాంచ[కుండ] నన్
    మదమున నీడ్చి రా సభకు! మాన్య! స[దుత్త]ర మీక, ధూర్తుఁడే
    ముదమున నంకపీఠమునుఁ బొందఁగ నన్ బిలి[చెం; బు]నీతు లా
    సదయులు పాండవుల్ గనుచు, సైఁచుచు సి[గ్గరి టె]క్కుఁ జూపరే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిన్న సవరణతో...
      యదుకులభూషణా! యటు లహంకృతిఁ బెద్దలఁ గాంచ[కుండ] నన్
      మదమున నీడ్చి రా సభకు! మాన్య! స[దుత్త]ర మీక, ధూర్తుఁడే
      ముదమున నంకపీఠమునుఁ బొందఁగ నన్ బిలి[చెం; బు]నీతుఁ డా
      సదయుఁడు ధర్మజుండుఁ గని, సైఁచుచు సి[గ్గరి టె]క్కుఁ జూపఁడే!

      తొలగించండి
  29. డా.పిట్టా సత్యనారాయణ
    యుద్ధము జేయ(కుండ) తమ యోజనలే ఫలియించ జూచిరా(రాయబారంతో)
    బుద్ధి య(దుత్తి)దే యను ప్రబోధము నిచ్చెను భారతమ్ము వే
    బద్ధుల గూరి(చెం బు)ధులు బం (గరిటె)త్తుకు నెత్తు శాంతినిన్
    విద్ధిగ నిల్పినా రు.య.ను.వొ(UNO)వీథులనే నడువంగ ధర్మమౌ!
    (యురేనియం ధాతువు బంగారం వంటిది.దీనిని అణు బాంబుల యుత్పత్తికి ఉపయోగిస్తారు. ఆ బంగరిటెత్తు శాంతినే కోరుకున్నవి దేశాలన్నీను.ఇది నవ భారత ధర్మము.)

    రిప్లయితొలగించండి
  30. కవిమిత్రులారా, ఈరోజు ఒక మిత్రుని పని మీద ఎండలో తిరిగి అస్వస్థతకు గురయ్యాను. డాక్టర్ దగ్గరికి వెళ్లి వచ్చాను. ఈరోజు మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  31. ఆకాశవాణి, హైదరాబాద్, వారి సమస్య(28-04-2018)
    రెండవ పూరణ :
    బలమెంతైనను కల్గు గాక మఱియా ఫాలాక్షుడేతెంచినన్
    కలలో నైనను కానరాని సిరులన్ కష్టించి యార్జించినన్
    జలమొక్కింతయు లేక సస్య మెటులౌ చర్చింప నాబ్రహ్మ రా
    తలపువ్వుల్ వికసించి నప్పుడె కదా ధన్యత్వ మీజన్మకున్!
    ****)()(****

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. వలపుల్ వాసన కెక్కి నప్పుడెగదా వాంకమ్ముగా ప్రేమయు
      న్నిలలో నెక్కొను కేంద్ర బిందువుగ పన్నీరమ్ము గా నారికిన్
      తలపువ్వుల్ వికసించి నప్పుడె గదా ధన్యత్వ మీజన్మకున్
      కలలో నైనను కుంభినిన్సయితమున్ కాంతా మనోజ్ఞంబుగన్ !

      జిలేబి

      తొలగించండి
  32. డా}.పిట్టా} నుండి
    ఆర్యా
    4వపాదం ‌వరణ
    విద్ధిగగ నిల్పగా యు.యను.వొ వీథులలో నడువంగ ధర్మమౌ...గా చదువ గలరు.

    రిప్లయితొలగించండి
  33. డా.పిట్టా నుండి టైపాటు
    విద్ధగ.....గ అదనంగా వచ్చినది

    రిప్లయితొలగించండి
  34. *30-4-18*
    ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .దత్తపది
    కుండ.. దుత్త.. చెంబు.. గరిటె..
    అన్యార్థంలో... భారతార్థంలో..

    సందర్భము: సులభము.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    చెలగి పాశుపతాస్త్ర మిచ్చెం బురారి;
    గొప్పగ నడిపె లోటులేకుండ శౌరి;
    క్రీడి మిగుల పొడగరి,
    టెక్కెమున హనుమ;
    ఇంక నోటమి లే, దుత్తదే యనవలె..

    మరొక పూరణము

    సందర్భము: వలలుడైన భీమసేనుడు తనకు వంటలయందు గల ప్రావీణ్యాన్ని గురించి కొన్ని ఆరోగ్య సూత్రాల గురించి ఒక భోజన ప్రియుడైన తన డింగరి అనగా సేవకునితో నిలా వివరిస్తున్నాడు.
    ప్రతి పాదంలో స్వార్థం పరార్థం రెండూ చోటుచేసుకున్నాయి.
    డింగరి= సేవకుడు
    టెంక=ఎండిన మామిడి
    యూరగాయలోని విత్తు
    (తెలుగువా రావకాయ ప్రియులు కదా!)
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "కుండలో వండిన గొప్పదౌ రుచి; కుండ
    లేకుండ వండిన లేదు రుచియు;
    దుత్తలో నీర మెంతో చల్లన; యది లే
    దుత్త భేషజమె కా యుర్వమీద!
    చెంబు నీరైననుఁ జెంత లేనిది తినఁ
    జెల్ల దనుచు వచించెం బుధ తతి;
    గరిటెఁ ద్రిప్పినఁ జాలుఁ గమ్మని ఘుమ ఘుమ;
    లౌర! డింగరి! టెంక లనఁ బసందు;.."
    వలలుడౌ భీమసేనుడు వంటకముల
    గొప్ప లూరించి, యూరించి చెప్పె నిటుల..
    "వారు వీ రన నేలరా! వాయు సుతుడె
    వచ్చి తిన్నాడు; నా వంట మెచ్చినాడు.."

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      ముఖ్యంగా రెండవ పూరణలో దత్తపదాలను స్వార్థంలోను, అన్యార్థంలో ప్రయోగించిన మీ నైపుణ్యం బహుధా ప్రశంసనీయం!

      తొలగించండి