7, ఏప్రిల్ 2018, శనివారం

సమస్య - 2644 (రాముఁడు రావణు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"రాముఁడు రావణు నడిగె ధరణిజ హరింపన్"
(లేదా...)
"రాముఁడు గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపఁగన్"
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.

98 కామెంట్‌లు:

  1. కామము గన్నుఁ గప్పఁగ వికారపు చేష్టలతోడ దండకో
    ద్దామవనాంతర స్థితుని దాశరథిన్ దరిఁ జేరి భంగపా
    టే మరి పొంది శూర్పణఖ యింతినిఁ గోల్పడి తల్లడిల్లఁగన్
    రాముఁడు, గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపఁగన్.

    రిప్లయితొలగించండి

  2. భామా జిలేబి వినవే
    రాముఁడు రావణు నడిగె ధరణిజ హరింపన్,
    నీమము తప్పితి వేలా ?
    కామము నేత్రముల కప్ప గా కర్బురుడా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      పద్యం బాగుంది. కాని సమస్య పరిష్కరింపబడినట్లు లేదు.
      'కర్బురుడా'...?

      తొలగించండి


  3. నీమము గాదు సోదరుడ! నీకు శరణ్యమొసంగు నయ్య శ్రీ
    రాముఁడు! గోరె రావణుని రమ్మని, సీతను దొంగిలింపఁగన్
    కామము వీడుమా యనుచు కైకసి మూడవ పుత్రు డాతడే
    సామము చెప్పుచున్! వినక చచ్చెను వింశతి బాహుడున్ సుమా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.

      తొలగించండి


  4. "నా మాటవిను! శరణ్యము
    రాముఁడు" , రావణు నడిగె, "ధరణిజ హరింప
    న్నీ మనసెట్లొప్పెనయా"
    సామము గ విభీషుణుండు, "సరికడచితివే" !

    కర్బురుడు - రాక్షసుడు ఆంధ్ర భారతి ఉవాచ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. నా ముక్కును నరికిoచెన్
    "రాముఁడు, రావణు నడిగె ధరణిజ హరింపన్",
    వామనయన శూర్పణఖ స
    భా ముఖమున యెల్లరకు నభమును పొడయుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూసపాటి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..ముఖమున నెల్లరకు...' అనండి. 'నభమును పొడయుచున్'...?

      తొలగించండి
  6. కామిని శూర్పణఖ కనలి
    భూమిజ గూర్చియెరిగించ, మోహము జిత సు
    త్రాముడు తా గన్న కలన్
    ” రాముఁడు రావణు నడిగె ధరణిజ హరింపన్”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మోహియు' అనండి.

      తొలగించండి
  7. కామాతుర శూర్పణఖయె
    తామసమతితో బరుగున దా నసురుల సం
    క్షేమము మరచి మహాసం
    గ్రాముడు రావణు నడిగె ధరణిజ హరింపన్.

    రిప్లయితొలగించండి
  8. నీమము దప్పిమోహమున నీచపు కోర్కెల నూయలూ గుచున్
    భామల పొందుగో రుటయె భాగ్యమ టంచును మైక మందునన్
    క్షేమము గోరిపల్కె నట చేటగు పన్లను వీడుమంచు తా
    రాముఁడు గోరె రావణుని , రమ్మని సీతను దొంగిలిం పఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అన్వయదోష మున్నది. 'పనులను'.. పన్లను అనరాదు.

      తొలగించండి
    2. నీమము దప్పిమోహమున నీచపు కోర్కెల నూయలూ గుచున్
      భామల పొందుగో రుటయె భాగ్యమ టంచును మైక మందునన్
      క్షేమము గోరిపల్కె నట చేటగు కార్యము వీడుమంచు తా
      రాముఁడు గోరె రావణుని , రమ్మని సీతను దొంగిలిం పఁగన్

      తొలగించండి
  9. మైలవరపు వారి పూరణ

    మారీచుడు...

    తా మరణింపనిచ్ఛగొని దాశరథీషుమహాగ్ని కీలలన్
    ప్రేమగ జింకరూపు గొని , బిల్చుచు లక్ష్మణునార్తి, జానకీ
    భామను, తాటకాత్మజుడుపాయమునన్ , తన చోటు చేరగా
    రాముఁడు , గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపఁగన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  10. సోముని గాంచని సుకుమారి
    నీమనసును దోచె నంటె నిక్కం బెట్లౌ
    కామము కన్నుల గానక ?
    రాముఁడు రావణు నడిగె ధరణిజ హరింపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ అర్థం కాలేదు. మొదటి పాదంలో గణదోషం. "...గాంచని సుందరి" ఆనండి.

      తొలగించండి
  11. జయ విజయులకు మోక్షమది , లీలగా
    జగన్నాటకమైనది
    మంధర, కైక, శూర్పణఖ,నిమిత్త
    పాత్రోచిత వైనమిది
    విగ్రహాకృతి ధర్మముగన్, రాక్షసుల
    సంహరింపగన్
    రాముడు గోరె రావణుని రమ్మని
    సీతను దొంగిలింపగన్

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2644
    సమస్య :: *రాముడు గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపగన్.*
    సీతను దొంగిలించేందుకు రమ్మని రాముడు రావణుని కోరినాడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఒక పౌరాణికుడు రామాయణం లోని కథను చెబుతూ ఓ భక్తులారా! ‘’ శ్రీరాముడు రావణాసురుని నిందిస్తూ * ఓరీ! ఏమనుకొంటున్నావు నీవు ? నీకు మద మెక్కిందా ? *మాతృవత్ పరదారేషు* అని నీవు వినలేదా? పర భార్యను మాతృభావంతో చూడాలని నీకు తెలియదా? నీకు మతి పోయిందా? నిన్ను చంపేస్తాను , యుద్ధానికి రా * ‘’అని పిలిచాడు.
    ఎవరైనా సరే సీతామాతను దొంగిలిస్తే వారికి యోగక్షేమాలు నశించి మరణ శిక్ష పడుతుంది కదా ! అని విశదీకరించే సందర్భం.

    ‘’ఏమనుకొంటివోయి ? మద మెక్కినదా ? పర దార మాతయౌ.
    నీ మతి మండ, యుద్ధమున నిన్ను వధించెద ‘’ నంచు బల్కుచున్
    *రాముడు గోరె రావణుని రమ్మని ; సీతను దొంగిలింపగన్*
    క్షేమము గల్గునా ? మరణ శిక్ష లభించు, నశించు యోగముల్.
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (7-4-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. చాలా బాగున్నది దీనికి మీ రికార్డడు వాయిస్ లింకు వుంటే ఇవ్వగలరు


      జిలేబి

      తొలగించండి
    2. అద్భుతంగా , నాటకీయంగా హరికధ చెప్పారండీ అవధానిగారూ! అభినందనలు! 💐💐💐🙏🙏🙏

      తొలగించండి
    3. శ్రీ యుతులు జిలేబి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఫోన్ నంబరు 9966236604. మీ ఫోన్ నంబరు తెలియజేస్తే ఆడియో పంపగలనండీ.

      తొలగించండి
    4. శ్రీమతి సీతాదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

      తొలగించండి


    5. యూట్యూబు లింకు తెలియ జేయగలరు

      తొలగించండి
    6. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  13. కం

    కామిని కోరిక కాదనె

    రాముడు; రావణు నడిగె ధరణిజ హరింపన్

    భామయగు శూర్పనఖ;ఖలు

    డా మాయావటుల జేసి యాజిన జచ్చెన్




    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మాయావి + అటుల = మాయావి యటుల' అవుతుంది. సంధి లేదు. 'ఆజిని' అనాలి. "ఆ మాయావి యటు జేసి యాజిని జచ్చెన్" అనండి.

      తొలగించండి


  14. నీమము గాదు విడుమనుచు
    రాముఁడు రావణు నడిగె; ధరణిజ హరింపన్
    కామము హెచ్చగ కర్బురు
    డా మాటల వినక చచ్చె రణమున సుమ్మీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో యతి తప్పింది. అఖండయతి అనుకున్నా ర,డ లకు యతిమైత్రి లేదు.

      తొలగించండి
  15. సామము తోడను సౌమ్యుడు
    రాముడు రావణు నడిగె, ధరణిజ హరింపన్
    క్షేమము గాదని లంకకు
    తామసమును వీడి నామె త్యజింపంగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సామమున వినని మూర్ఖుని
      తామస విగ్రహు కలంకు తాటక సుతుడే
      హేమపు జింకగ, బాధిత
      రాముడు, రావణు నడిగె ధరణిజ హరింపన్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మొదటి పూరణ బాగున్నది. అభినందనలు. చివరిపాదంలో గణదోషం. "వీడి + ఆమె = వీడి యామె" అవుతుంది. "వీడి యామె ద్యజియింపంగన్" అనండి.
      రెండవ పూరణలో అన్వయదోషం ఉంది.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురువర్యా! సవరిస్తాను!🙏🙏🙏🙏🙏

      తొలగించండి
  16. (రావణునితో సీత)

    "కామముతో నో రాక్షస!
    నీమము తప్పితివి; వినుము; నీ శరణంచున్
    రాముని కోరుము; వదలును
    రాముడు"; రావణు నడిగె ధరణిజ; హరింపన్

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టా సత్యనారాయణ
    కామితమౌ మలి వోట్లను
    బాముకొనన్ గాం.గి(Cong.I){కాంగి) ఆం(యాం).ప్ర బాప(ము*అ)మనంగ
    న్నేమయె భా.జ.ప.గెలిచెన్
    రాముడు రావణునడిగె ధరణిజ హరింపన్

    రిప్లయితొలగించండి
  18. డాపిట్టా సత్యనారాయణ
    ఒక గ్రామీణ కురు వృద్ధుని అవగాహన మేరకు అతని భయాందోళన....
    క్షేమము మీకు మాధరణి క్షిప్ర గతిన్ పొలుపొంద యంత్రముల్
    సామము తోడ బెంచుడని సర్వ విదేశ జనాళి బిల్వగా
    నోములు నోచు దేము సరి నూర్చుక బోవవె భారతావనిన్?!
    "రాముడు గోరె రావణుని రమ్మని సీతను దొంగిలించగన్"?!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      కాని సమస్యకు పూరణ సమర్థంగా లేనట్టుంది.

      తొలగించండి
    2. డా.పిట్టానుండి}
      ఆర్యా, ముగింపును సాధారణీకరణముగా,,అన్నట్లయింది అని చెప్పినట్లు .కోరి తెచ్చుకున్న భార మిది అనే భావం.ఇది చేయడం వల్ల అది జరిగింది, విపరీత రీతిలో. సాధారణీకరణనకు పుష్టి సమకూరిందనుకుంటాను,ఆర్యా,ధన్యవాదములు}

      తొలగించండి

  19. సోముడె రవికుల జలధికి;
    నే మగువ విడుపును గోరి యెవరిని యడిగెన్?;
    భామ గదిసె దశ కంఠుడు;
    రాముడు; రావణు నడిగె ధరణిజ ; హరింపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఎవరిని + అడిగెన్ = ఎవరి నడిగెన్/ ఎవరిని నడిగెన్' అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
  20. కందం
    కామాంధకార మోహమె
    భామామణి లంకఁ జేర్చు వైరమని వినన్
    రామాయణమ్మున న్నే
    రాముఁడు రావణు నడిగె ధరణిజ హరింపన్?

    రిప్లయితొలగించండి
  21. యామినికలయందున శ్రీ
    రాముడు రావణునడిగె; ధరణిజ హరింపన్
    ఏమిఫలమాశ పడితివి
    గోమునఘనకీర్తినొదులు కొంటివనుటనే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'హరింపన్ ఏమి' అని పద్యం మధ్యలో అచ్చులు రాకుండా చూడండి. 'వదులు'ను 'ఒదులు' అనరాదు.

      తొలగించండి
  22. భీమ పరాక్రమమె యసుర
    రాముఁడు రావణు నడిగె ధరణిజ హరింపన్
    భామను వంచనమున వని
    రామ శితేషుల హరించు రావణ యనినిన్


    ఈ మహిఁ గాంచఁ జిత్రముగ నింతులు పంతముతోఁ జరించినన్
    భూములు రాజ్య సంపదలు వోవు నరణ్య నివాస మేర్పడుం
    గామ వశార్త శూర్పణఖ, కానన మందుఁ దిరస్కరింపగన్
    రాముఁడు, గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  23. మిత్రులందఱకు నమస్సులు!

    భామనుఁ జుప్పనాకను నృపాలుఁడు రాముఁడు భంగపెట్ట, నా
    కాముకి యన్నఁజేరి, జనకాత్మజఁ దెమ్మనఁ, దాటకాత్మజుం
    డా మని కేఁగి, స్వర్ణహరిణమ్మయి, తన్నుఁ గదింప రాఁగ శ్రీ
    రాముఁడుఁ, గోరె రావణుని, "ర" మ్మని సీతను దొంగిలింపఁగన్!

    రిప్లయితొలగించండి
  24. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సౌమనసమ్మున దొమ్మిని
    రాముడు రావణు నడిగె; ధరణిజ హరింపన్
    సామయికము కాదు గదా
    యేమిషతో నామె నిటకు నెత్తితి వంచున్

    రిప్లయితొలగించండి
  25. రాముని శూర్పణఖ వలచె
    రామానుజు డాగ్రహింప రక్కసి యటుపై
    కోమలి సీతను బాయగ
    రాముడు,రావణు నడిగె దరణిజ హరింపన్

    నిన్నటి సమస్యకు నా పూరణ

    దుస్ససేనుడు కురుసభ దుష్టుడగుచు
    ద్రౌపది వలువ లూడ్చె తత్సభ గిరీటి
    ధర్మజాదులు తలవంచ మర్మ విదుడు
    కృష్ణుడేగాచె సాధ్విని కృష్ణ నపుడు

    రిప్లయితొలగించండి
  26. ఉత్పలమాల
    కామిని చెల్లి శూర్పణఖ కానల జానకిఁ గూర్చి చెప్పుటన్
    గామము మోహమై కులిశి గౌతము పత్నిని పొందు గాథయే
    వేమరు గుర్తు దెచ్చి మది వేడుక జేయుచు సందడించు సు
    త్రాముఁడు గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపఁగన్

    రిప్లయితొలగించండి
  27. నీమము దప్పి యొండొరుల నిక్కపుటాలును దస్కరించుచో
    క్షేమము దప్పి కష్టముల జీరుట తథ్యమటంచు బల్కి సు
    త్రాముని సారథిన్ బడసి లంకను జేరుచు యుద్ధభూమికిన్
    రాముఁడు గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపఁగన్

    రిప్లయితొలగించండి
  28. (2)
    కామినియైన శూర్పణఖ ఖండిత నాసిక శ్రోత్ర వీక్షచేఁ
    దా మతిహీన రావణుఁడు దబ్బునఁ బిల్వఁగ, వచ్చి, జానకీ
    రామకుఁ బైఁడిజింకయయి, రంగుగఁ దాటక "మాతృమానసా
    రాముఁడుఁ" గోరె, రావణుని "ర" మ్మని, సీతను దొంగిలింపఁగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రారంభానఁ జిన్న సవరణముతో...

      (2)
      కాముకి యైన శూర్పణఖ ఖండిత నాసిక శ్రోత్ర వీక్షచేఁ
      దా మతిహీన రావణుఁడు దబ్బునఁ బిల్వఁగ, వచ్చి, జానకీ
      రామకుఁ బైఁడిజింకయయి, రంగుగఁ దాటక "మాతృమానసా
      రాముఁడుఁ" గోరె, రావణుని "ర" మ్మని, సీతను దొంగిలింపఁగన్!

      తొలగించండి
    2. మధుసూదన్ గారూ,
      మీ రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  29. నీమము యుద్ధమందనుచు నేర్పున నంగదు దూతనంపుచున్
    కామపు పాశమున్ దగిలి కౌగిలి గోరుచు మృత్యుదేవత
    న్నేమరు పాటునన్ దనరు నీచుని జానకి నప్పగించగా
    రాముడు గోరె రావణుని రమ్మని; సీతను దొంగలింపగన్
    పామిన దోషమెంచకను వాని క్షమించగ భాసమానుడై!

    రిప్లయితొలగించండి
  30. ఉత్పలమాల

    వేమరు పత్ని, సోదరులు విజ్ఞత కాదన సీతనుంచగన్
    సామున వంశనాశమను సత్యము నంగదు ద్వార జెప్పుచున్
    రాముఁడు గోరె రావణుని రమ్మని, సీతను దొంగిలింపఁగన్ 
    సేమమె ?నప్పగించగను, చెల్లఁగ నంపుచు రాయభారమున్

    రిప్లయితొలగించండి
  31. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    క్ర మా లం కా ర పూ ర ణ ము


    భూమిజ c జెట్టపట్ట ధనువున్ దునియించిన ‌ వీరు డెవ్వడో ?

    కామపిశాచి - శూర్పణఖ , క్ష్మాసుత c దెమ్మని కోరె నెవ్వరిన్ ?

    ఈ మనె బిక్ష , రావణు డ దేటికి , లక్ష్మణ రేఖ దాటుచున్ ?

    రాముడు | గోరె రావణుని | రమ్మని , సీతను దొంగిలింపగా ‌ |

    రిప్లయితొలగించండి
  32. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    కామించె శూర్పెణఖ యా

    రాముని | ‌ ముకుజెవులగోసె లక్ష్మణు | డపు డా

    కామిని , మిగుల కుములగన్

    రాముడు , రావణు నడిగె ధరణిజ హరింపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శూ ర్ప ణ ఖ. గా స్వీ క రిం చ మ న వి

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  33. భామిని శూర్పణఖయె తా
    కాముని మించిన సొగసరిఁ గామించగ నా
    కామినిఁ గాదనె సద్గుణ
    రాముడు, రావణునడిగె ధరణిజ హరింపన్

    రిప్లయితొలగించండి
  34. ఆమృగము కొఱకు నేగగ
    రాముడు ; రావణు నడిగె ధరణిజ "హరింపన్
    క్షేమమె నీకితరులదగు
    భామను;తగదు తగదిదియె, భావ్యమె?"యనుచున్.

    రిప్లయితొలగించండి
  35. డా.బల్లూరి ఉమాదేవి

    కోమలి గావచ్చి రక్కసి
    కామపు చూపులనుచూచి కాంక్షను తెలుపన్
    భామను నిరాకరింపగ
    రాముఁడు రావణు నడిగె ధరణిజ హరింపన్.

    కామము దీర్పుమంచునట కామిని రూపము తోడను చుప్పనాతియున్
    సోముని రూపుతో మెరయ చూచుచు కాంక్షను దెల్ప కాదనన్
    రాముఁడు ,గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపఁగన్
    కామము తోడ వచ్చెనతగాడట బిక్షకు రూపుతోడతాన్.


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. "కమలిగ వచ్చి..." అనండి.
      రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం. "కామము తోడను చుప్పనాతియున్" అనండి.

      తొలగించండి
  36. యామినికలగంటిని శ్రీ
    రాముడు రావణునడిగె; ధరణిజ హరింపన్
    ఏమిఫలమాశ పడితివి
    గోమునఘనకీర్తినొదులు కొంటివనుటనే

    రిప్లయితొలగించండి
  37. క్షేమము గూర్చువాడిలను శ్రీకర కారుడు దానవాంగకున్
    భామిని యయ్యయోనిజయె భార్యయనంచును తాను జెప్పుచున్
    గామిని చేరవచ్చినను కాదని చెప్పితిరస్కరింపగా
    రాముడు, గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శ్రీశుభకారుడు' అంటే బాగుంటుంది. 'దానవాంగకున్'...? "భార్య యటంచును" అనండి.

      తొలగించండి
  38. ధన్యవాదాలు అన్నయ్యగారూ.మొదటి పాదం సవరణలో "కమలిగ"
    పాదాది హ్రస్వమౌతుంది గదండి.మిగిలినపాదాలు దీర్ఘాక్షరాలున్నాయి

    రిప్లయితొలగించండి

  39. కం.
    ధూమము నిండెను రావణ

    ధామము నెగురుచు నొనర్చె దగ్ధము లంకన్

    ఆ మారుతినే పంపగ

    రాముడు, రావణునడిగె ధరణిజ హరింపన్ ..

    రిప్లయితొలగించండి


  40. నీమము గాదు విడుమనుచు
    రాముఁడు రావణు నడిగె; ధరణిజ హరింపన్
    కామము హెచ్చగ కర్బురు
    డా మాటల వినక చచ్చె ఢంకా మోతన్

    జిలేబి

    రిప్లయితొలగించండి

  41. .. .. .. సమస్య
    *"రాముఁడు రావణు నడిగె ధరణిజ*
    *హరింపన్"*

    సందర్భము: సులభము
    శ్రీ కంది వారి భావంతో కందం
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    రాముని గోరితి; తీరదు
    కామ మనుచు చుప్పనాతి
    కనలెను మదిలో...
    భామ నెడసి శోకింపగ
    రాముఁడు... రావణు నడిగె
    ధరణిజ హరింపన్

    2 వ పూరణము:--

    సందర్భము: సులభము
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "కాముడవు నీవె రా! " యనె
    తామసి.. రాము "డవు" ననడె!
    దానికి ముదిరెన్..
    "తామసివి నీవు పో!" యనె
    రాముఁడు.. రావణు నడిగె
    ధరణిజ హరింపన్

    3 వ పూరణము:--

    సందర్భము: రాము డున్న చోట కామ ముండదు. ఆ విషయం కాముకురాలైన శూర్పణఖకు తెలియదు.
    ఆమె మనసు హరించినాడు రాముడు. రాముని భార్యయైన ధరణిజను (సీతను) అపహరించు మని ఆమె తన అన్నయైన రావణుని కోరింది.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    రాముడు వెలిగెడి తావుల
    కామము మలుగు నని యెఱుగ
    కా శూర్పణఖా
    కామిని.. మనసు హరింపగ
    రాముడు.. రావణు నడిగె
    ధరణిజ హరింపన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  42. రాముఁడు గోరె రావణుని రమ్మని సీతను దొంగిలింపఁగన్
    నీమము తోడ జేయుటకు నిర్భయ రీతిని ధర్మయుద్ధమున్
    తోముచు వందలాదులగు దుండగ దంష్ట్రలు వేపపుల్లతో
    గోముగ వానరోత్తముల గోలను గ్రోలను కమ్మకమ్మగా

    రిప్లయితొలగించండి