2, మే 2018, బుధవారం

సమస్య - 2666 (హానిం జేయకయె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్"
(లేదా...)
"హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో"
('శంకరాభరణం' వాట్సప్ సభ్యులకు ధన్యవాదాలతో...)

129 కామెంట్‌లు:

  1. "గురోస్తు మౌనవ్యాఖ్యానం
    శిష్యాస్తు చ్ఛిన్నసంశయా: "

    ధ్యానము ధారణములతో
    నానందమ్మున లయించి యభిరూపుండై
    మౌనమ్మున సంశయముల
    హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

    రిప్లయితొలగించండి

  2. హీనంబైన గుణమ్ముల్
    స్థానంబులు తప్పిన సహజత్వము లెల్లన్
    జీనము జేయన్ వాటికి
    హానింజేయకయె యెటుల నాచార్యుఁ డగున్?

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జీనము/చీనము' ... ?

      తొలగించండి

    2. కంది వారికి

      ఆరోగ్యము జాగ్రత్త.

      జీనము - నాశనము అన్న అర్థం లో వాడాను .
      దా చీనము ఉపయోగించి ~ బంగారు వన్నె లద్దిరి ; నెనరులు !


      జిలేబి

      తొలగించండి
  3. కానల కేగక రయమున
    మౌనము గాతపము జేసి మోక్ష మటంచున్
    వానప్రస్తము దెలియక
    హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వానప్రస్థము దెలియక హానిం జేయకయె'... అర్థం కాలేదు.

      తొలగించండి
  4. పూనిక నూనుచు శిష్యుని
    మానిక మట్టుల సలుపగ , మంచిపలుకులన్
    వానికి నంతశ్శాత్రవ
    హానిం జేయకయె యెటుల నాచార్యుడగున్ ?

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    ప్రహ్లాదుడు... గురువులతో

    "కూనా ! మీ జనకున్ స్మరింపుమది నీకున్ మాకు లోకమ్మునం...
    దానందంబిడు" నన్న వారిననె ప్రహ్లాదుండు "దేవా ! హరి...
    జ్ఞానంబీయని విద్య విద్యయొకొ ? విశ్వాత్మేతరాలాపనా
    హానిన్ జేయని వాడు ధాత్రినెటు దా నాచార్యుడై యొప్పునో ?!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. నేటి పద్యం పై శ్రీ సాంప్రతి సురేంద్రనాథ్ గారి స్పందన.. 👇

      మీ సమస్యాపూరణం.

      హానిన్....
      చక్కని సమర్థన.. మంచి పద్యం..

      అయితే.. ప్రారంభం.. సంబోధన..

      "కూనా!"
      పద్యంలోని ఇతర పదాలతో కుదురుకోలేదు..
      మార్చ గలిగితే చాలా మంచి పద్యం...

      వారి సూచననుసరించి ఇలా మార్పు చేసితిని.. 🙏

      "ధ్యానింపన్ దనుజేంద్రు నామమును వత్సా ! నీకు మేలౌను , మా...
      కానందంబగు" నన్న వారిననె ప్రహ్లాదుండు దేవా ! హరి...
      జ్ఞానంబీయని విద్య విద్యయొకొ ? విశ్వాత్మేతరాలాపనా...
      హానిన్ జేయని వాడు ధాత్రినెటు దా నాచార్యుడై యొప్పునో ?!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. సవరించిన పూరణలో కవితాసౌరభం మరింత గుబాళిస్తున్నది. అభినందనలు.

      తొలగించండి

    4. కూనా అని పద్య పాదాన్ని మొదలెట్టినప్పుడు అవధాని గారి అశ్వ వేగం దాన్ని మార్చి ధ్యానంతో మొదలెట్టినప్పుడు పాండిత్య లాలిత్యం దేనికదే సాటి , పైపెచ్చు మైలవరపు వారికే అది పాటిగ సాటి


      అదురహో

      జిలేబి

      తొలగించండి
    5. కూనా అని ప్రారంభంలో జెప్పినా, వత్సా అని వాక్యాంతాన జెప్పినా పద్యార్థపటుత్వంలో ఏమీ మార్పు రాలేదు. మైలవరపువారి పాండిత్యప్రకర్ష ఇట్టిది!

      తొలగించండి
    6. జ్ఞానంబున్ సమరీతి నల్పునకు ప్రజ్ఞాశాలికిన్ బంచియున్
      సానందుండయి , శ్రద్ధఁజూపిన వరచ్ఛాత్రున్ బ్రశంసించి , వి
      ద్యానాసక్తునికంత్యమందు గన
      శూన్యాంకప్రదానమ్మునన్
      హానిన్ జేయని యాతడెవ్విధిని దా నాచార్యుడై యొప్పునో ?!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    7. మూడవపాదంలో.... విద్యానాసక్తునకంత్యమందు... అని ఉండాలి... టైపాటు... 🙏🙏

      తొలగించండి
    8. జిలేబీ గారికి.. శ్రీ శాస్త్రి గారికి నమస్సులు.. ధన్యవాదాలు 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
  6. జ్ఞానంబిచ్చుచు కరుణ న
    జ్ఞానంబును పారద్రోలు చతురుండతడే!
    లోనంగల శత్రువులకు
    హానింజేయకయె యెటుల నాచార్యుడగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      అంతశ్శత్రువులకు హానితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "జ్ఞానం బిచ్చుచు దయ న।జ్ఞానంబును..." అనండి.

      తొలగించండి
  7. జ్ఞానము గోరుచు వచ్చిన
    మానవులను చేరదీసి మాలిమి తో న
    జ్ఞానము మూర్ఖత్వములకు
    హానిం జేయకయె యెటుల నాచార్యుడగున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మూర్ఖత్వము' కంటే 'మూఢత్వము' అంటే బాగుంటుందేమో?

      తొలగించండి


  8. హీనంబై చరియించుదుర్గుణులకున్ హేఠమ్ములన్జేయు వా
    రై నట్టింట జిలేబులై తిరుగుచున్ రావమ్ము తో తర్జనల్
    స్థానంబుల్విడి జేయుమానవులకున్ జ్ఞానమ్ము జేర్చన్, "ఇ"కున్
    హానిన్ జేయని వాడు ధాత్రినెటు దా నాచార్యుడై యొప్పునో ?!


    "ఇ" = గర్వము
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇ' శబ్దానికి తెలుగులో వ్యస్త ప్రయోగం ఉన్నదా? చింత్యం!

      తొలగించండి

    2. కందివారు

      నిజం చెప్పాలంటే తెలియదండి ! వ్యస్త ప్రయోగమంటే కూడాను!

      సరియేనంటారా ? వీరతాడు వేసుకోవచ్చా ? :)

      జిలేబి

      తొలగించండి
    3. ... జ్ఞానమ్ము గూర్చన్నిభీ / హానిన్... అనండి.

      ఇ భీ హాని = రోష భయముల హాని; ఇ = రోషము [గర్వమను నర్థము సందేహము.]
      వ్యస్త ప్రయోగమంటే సమాసమున గాకుండా విడిగా స్వతంత్రముగా నని యర్థము. మన్మథుఁడు వచ్చెను దీనికి ఇ వచ్చె ననుట సరి గాదు. ఇ = మన్మథుఁడు

      తొలగించండి
    4. కామేశ్వర రావు గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి

    5. పోచిరాజు వారికి

      ధన్యవాదములు

      జిలేబి

      తొలగించండి
  9. అజ్ఞానమె భ్రాంతిగ తమమున సుఖములనదె
    పొందెదరుగ జనులు
    అవిద్యగ దృష్టి నిలిపి విద్యను తాము
    కాంచవుగా కనులు
    వెలుగు చూపగ నెంచిన గురువు కాఠిన్యమున
    దా చెప్పునో
    హానిం జేయని వాడెటుల దానాచార్యుడై
    యొప్పునో

    రిప్లయితొలగించండి
  10. +919948634619 ....వీరబ్రహ్మేంద్రాచార్య.....

    దీనుండై సువిచారతత్త్వ మెఱుగం దీండ్రంబుతో నుండి, వి

    ద్యానాథుండగు దేశికేంద్రుఁ గని శిష్యత్వంబునుం బొందినం,

    దానా శిష్యుని కాత్మవిద్యనిడి లోనందాగు మోహానికిన్

    హానింజేయని యాతఁడెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో.

    ముంజంపల్లి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వీరబ్రహ్మేంద్రాచార్యుల పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. +919948634619. వీరబ్రహ్మేంద్రాచార్య. (స్వల్ప సవరణతో) దీనుండై సువిచారతత్త్వ మెఱుగం దీండ్రంబుతోనుండి, విద్యానాథుండగు దేశికేంద్రుఁ గని శిష్యత్వంబునుం బొందినం, దానా శిష్యుని కాత్మవిద్యనిడి లోనందాగు మోహాబ్ధికిన్ హానింజేయని యాతఁడెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో. ముంజంపల్లి.

      తొలగించండి
  11. [02/05, 06:20] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి 9866610429
    తానన్నివేళలందున
    జ్ఞానానందశుభదుండు నైవెల్గుచున్
    మానవులతెలివిలేమికి
    హానింజేయకయె యెటులనాచార్యు డగున్
    [02/05, 06:38] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
    ప్రానుడుగునేర్పుటకై
    జ్ఞానాకృతిదాల్చినట్టి నందకిశోరా
    మానవమూర్ఖత్వమునకు
    హానింజేయకయె యెటులనాచార్యు డగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చారి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ రెండవ పాదం చివర గణదోషం. "వెల్గుచుఁ దా। మానవుల..." అనండి.
      రెండవ పూరణ మొదటి పాదంలో గణదోషం."ప్రానుడుగులు నేర్పుటకై" అందామా?

      తొలగించండి
  12. ప్రాణము తీయుచు జీవుల
    సేనము శోధనము చేసి జీవ బుధుoడున్
    యీ నభమున మేల్జేయున్
    "హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

    జంతువులను చంపి పరిశోధనములు చేసి మనకు నూతన ఔషధము లు అందించును జంతు శాస్త్ర వేత్తలు. మరి వారు హాని చేయక యున్న పరిశోధనలలో ఆచార్యుడు కాడుగదా అను భావన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      పూరణ విషయంలో మీ సమర్థన బాగున్నది.
      'బుధుండున్ + ఈ' అన్నపుడు యడాగమం రాదు. 'నభము'నకు అన్వయం?

      తొలగించండి

  13. కం
    జ్ఞానము,వినయముతో నిజ

    ప్రాణము ఛాత్రులకు నిలిపి ,ప్రౌఢిమ చేతన్

    మేనిన గలారు రిపువుల

    హానిం జేయకయె యెటుల నాచార్యు డగున్!


    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాంతిభూషణ్ గారూ,
      అరిషడ్వర్గ హానిని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  14. పోనీయదు పులి యెవరిన్
    దానికి కనబడిన యంత ; తగు చదువులున్
    జ్ఞానము లేకయె మనుజుడు
    "హానిం జేయకయె ; యెటుల నాచార్యుఁ డగున్?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరణతో :
      పోనీయదు పులి యెవరిన్
      దానికి కనబడిన యంత ; తగిన చదువులున్
      జ్ఞానము లేకయె మనుజుడు
      "హానిం జేయకయె ; యెటుల నాచార్యుఁ డగున్?"

      తొలగించండి
    2. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది.

      తొలగించండి
  15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2666
    సమస్య :: *హానిం జేయని యాత డెవ్విధిని తా నాచార్యుడై యొప్పునో?*
    హాని చేయని వాడు గురువెట్లా ఔతాడు? అని ప్రశ్నించడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: మనం గురుదేవునికి నమస్కారం చేస్తూ
    అజ్ఞాన తిమిరాంధస్య
    జ్ఞానాంజన శలాకయా ।
    చక్షు రున్మీలితం యేన
    తస్మై శ్రీ గురవే నమః ।। అనే శ్లోకం చెప్పుకొంటాం కదండీ.
    అజ్ఞానమనే అంధకారం వలన దేనినీ చూడలేని గ్రుడ్డి వానివలె ఉన్న శిష్యుని కన్నులను జ్ఞానమనే కాటుక పుల్లతో తెఱిపించి కైవల్యమార్గాన్ని చూపిస్తూ బ్రహ్మానందాన్ని అందించేవాడే అసలైన ఆచార్యుడు. ఆ విధంగా సముద్రమంతటి అజ్ఞానాన్నైనా సరే నశింపజేయలేనివాడు ఆచార్యు డెలా ఔతాడు అని ప్రశ్నించే సందర్భం.

    జ్ఞానాఖ్యాంజన వర్తి చేత గురు డజ్ఞానాంధకారమ్మునన్
    గానంజాలని వాని కండ్లు తెఱచున్, కైవల్య సంధాయియై
    ఆనందమ్మును గూర్చు ; నిట్లు సతతం బజ్ఞాన వారాశికిన్
    *హానిం జేయని యాత డెవ్విధిని తా నాచార్యుడై యొప్పునో?*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (2-5-2018)
    (శ్రీ చిటితోటి విజయకుమార్ గారికి ధన్యవాదములతో)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      అజ్ఞానాబ్ధికి హాని చేయనివాడు గురువు కాడన్న మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. జ్ఞానము, బుద్ధి వికాసము,
    మానంబును కలుగజేయు మాన్యుడు గాదా
    తానుగ శిష్యు నవిద్యకు
    "హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      శిష్యుని అవిద్యకు హాని జేసెడివాడు గురువన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  17. మానని వేదాధ్యయనము
    తానక పరిచర్య జేయ తత్పరమతియై
    పూనిక ఛాత్రునవిద్యకు
    హానిం జేయకయె యెటుల యాచార్యుడగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విద్యాతురాణాం న సుఖం న నిద్రా”

      జ్ఞానిగ జేయు దలంపున
      మేనుకు విశ్రాంతినీక మెలకువ తోడన్
      నానావిధ సుఖములకుం
      హానిం జేయకయె యెటుల యాచార్యుడగున్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  18. తానున్నిత్యము శాస్త్రవిద్య యెడలన్ దాదాత్మ్యమే జెందుచున్
    పూనుంగా తన శిష్య కోటి మతులన్ పొల్పార యత్నించుచున్
    జ్ఞానమ్మున్ దగినంత వేగ నిడుచున్నజ్ఞాన కాయానికిన్
    "హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో"
    ***)()(***
    (పొల్పార = దీపింప ; కాయము = చయము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      అజ్ఞానమనే శరీరానికి హాని చేయనివాడు గురువెలా అవుతాడన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పద్యం చాల బాగుందండీ! కాయానికిన్ అనడం కన్న కాయమ్ముకున్ అంటే యింకా బాగుంటుందేమో!🙏🙏🙏

      తొలగించండి
    3. 'కాయమ్ముకున్' అనరాదు. 'కాయమ్మునకున్' అనడం సాధువు. "కాయానికిన్" అనడంలో దోషం లేదు.

      తొలగించండి
    4. ధన్యవాదములాచార్యా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
  19. నా ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు. ఇన్ని రోజులు మాకు దగ్గరగా ఉన్న R. M. P. వ్రాసిన మందులు వాడాను. మంచి డాక్టరుకు చూపించుకోవాలని ఇప్పుడే మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చాను.

    రిప్లయితొలగించండి
  20. అనయుము నిస్వార్తముతో
    వినయముగా చేయుచు నిజ వృత్తిని భక్తిన్
    మనమున దుష్టతలపులకు
    హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రాస ముందున్న అక్షరాలు లఘువులుగా ఉన్నాయండీ..

      తొలగించండి
    2. అవునండి. పెద్దలు పండిత నేమాని గారితో గతంలో ఇదే తప్పుకు అక్షింతలు వేయించుకున్నాను. మాళ్ళీ ఇప్పుడు అదేతప్పు. తెలియజేసినందులకు ధన్యవాదములు. నమస్సులు.

      తొలగించండి
    3. క: జ్ఞానాంభోనిధియై తా
      వీనులకున్ విందు జేయు విద్యగరపుచున్
      మానసపు చెడుగులకు నే
      హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

      తొలగించండి
    4. అన్నపరెడ్డి వారూ,
      మనో దుర్బుద్ధులకు హాని చేయక గురువు కాదన్న మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    5. గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  21. కానఁగఁ గామక్రోధ మ
    దానీకము లెల్ల జనుల కంతస్థమ్ముల్
    తా నా యరి షడ్వర్గము
    హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

    [ ఆచార్యుఁడు = ఋషి]


    కానేరం డది నిక్క మెంచగను రక్షాదక్ష రాజన్య సం
    తానశ్రేణికి లక్ష్య దర్శన ధనుస్త్రాణోగ్ర నారాచ సం
    ధా నాదిక్రియ లందు శిష్య గణ హృత్సందేహ సంసృష్టికిన్
    హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో

    [సంసృష్టి = సమూహము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్నాన జప తపో రత స
      న్మానస యమ నియమ సువ్రత చరుఁడునై తా
      నే నర మృగ ద్విజములకు
      హానిం జేయకయె యెటు లనాచార్యుఁ డగున్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ మూడు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      చివరి పూరణలో' అనాచార్యు' డన్న విరుపు బాగున్నది.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.
      మీరు సంపూర్ణారోగ్యమును బడసినట్లు భావించెదము. మండుటెండలో నింటి పట్టున నున్న నారోగ్యకరము కదా! శ్రద్ధ వహించ విన్నపము.

      తొలగించండి
  22. జ్ఞాన ము నొసగుచు నిరతము
    తానే ర్పు చు సత్ పథం బు దార్శనికుoడై
    దీన త్వమొన ర్చు చె డు కు
    హాని oచేయకయె యె టు ల నాచా ర్యుoడగు న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      చెడుకు హానితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  23. ఙ్ఞానము నీయగ గురువులు
    మానంబునుదొలగజేసి మహనీయుడుగా
    వానినిజేయ,నహమునకు
    "హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      అహమునకు హాని అంటూ మంచి పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
      కాని 'మానమును తొలగజేయడం'...?

      తొలగించండి
  24. ఆటవిడుపు:
    (గిరీశం బాబాయి)

    ఆనందించుచు నగ్నిహోత్రునుది యాయాసమ్ము బుచ్చెమ్మతో
    పానంజేయుచు చుట్ట ధూమమును నాబాలుండు ముట్టించగా
    నానారూపములౌ నబద్ధములతో నమ్మించి వంచించుచున్
    హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      గిరీశం ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అగ్నిహోత్రునుది'...? మొదటి పాదంలో అన్వయం లోపించినట్లున్నది.

      తొలగించండి
    2. మీ సవరణ:

      "అగ్నిహోత్రునిది" 🙏

      మొదటి పాదములో "యాయాసమ్ము" తరువాత ఒక కామా (,) ఉండాల్సిన మాట.

      తొలగించండి
  25. రాణన్ జూపుచు వృత్తి పైన పని నిర్వర్తించుచున్ దీక్షతో
    జ్ఞానాంభో నిధియై వినీతులకు తాకావించుచున్ బోధనల్
    మానమ్మున్ నిలబెట్ట చిత్తమున దుర్మార్గంపు నాసక్తికిన్
    హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      దుష్టాసక్తుల హానితో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్తులకు నమస్సులు. ధన్యవదములు.

      తొలగించండి

  26. కం.
    షానము తగలనిదే పా
    షాణము శిల్పమెటులౌను, ఛాత్రులలోనన్
    హీనగుణాలు తొలగగన్
    హానింజేయకయె యెటుల నాచార్యుడగున్ ..

    'షానము " స్వర్ణకారులు, కమ్మరివారు, శిల్పులు ఉపయోగించె ఒక పనిముట్టు. దీనికే పోగర అనే మరో సమానార్థక పదముంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      హాని చేయవలసింది హీనగుణాలకా, ఛాత్రులకా? కొంత అన్వయలోపం ఉంది.

      తొలగించండి
  27. పూని బడినందు విద్యను
    దానము చేయుటకువచ్చి తాలిమితోడన్
    కూనలు వ్రాసిన కొరతల
    హానింజేయకయె యెటుల నాచార్యుడగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      విద్యార్థులకు కొరతలకు హాని అంటూ మంచి పూరణ చెప్పినారు. అభినందనలు.

      తొలగించండి
  28. డా.పిట్టాసత్యనారాయణ

    మేనిన్ యాశలు నుడుగగ
    పోనీ శిష్యుండ్రె తనదు పుత్రులటంచున్
    తానే వెలుగై తిమిరపు
    హానిం జేయకయె యెటుల నాచార్యుండౌ

    రిప్లయితొలగించండి
  29. డా.పిట్టాసత్యనారాయణ
    గ్లానిం జెందడు స్వప్రయోజనము లెల్లం ద్రోసి జ్ఞానార్థియై
    ఈ నా జాతికి నొజ్జ నౌదు ననియు న్నెన్నాళ్ళదీ జీవితం
    బౌ నా వారిదె శిష్యబృంద విహితం బాశించి యజ్ఞానపుం
    హానిం జేయని యాతడెవ్విధిని దా నాచార్యుడై యొప్పునో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'మేనిన్ + ఆశలు' అన్నపుడు యడాగమం రాదు. 'తిమిరపు హాని' అన్న ప్రయోగం అంత సబబుగా తోచడం లేదు.

      తొలగించండి
    2. డాపిట్టానుండిఆర్యా,
      తిమిరపు కు బదులుగా శోధన హానిం. గా మార్చివేస్తే.....

      తొలగించండి
  30. మధు సూధనం గారు ఇవాళ కూడా పరస్పర గణ దోష విచారణము చేసిన బాగుండునేమో???

    రిప్లయితొలగించండి
  31. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    ఏకలవ్యుని నిర్వేదనము
    >>>>>>>>>>>>>>>>>>


    ఏ నే పాపము జేసితిన్ గురువరా | యీ రీతి " నంగుష్ట మీ

    రా , నాకున్ గురుదక్షిణం " బనుట ధర్మం బౌనె | యా యద్రిభి

    త్సూనుండే విలుకాడు విశ్వమున నంచున్ రూఢి గావించుటే

    గా నీ యాశయ | మేల యిట్టి యధి వాకం బార్య ! నిత్యంబు మా

    హీనామ్నాయపు వారి గూల్చ హితమా | యెట్లేనియున్ మా కించుకన్

    హానిం జేయని వా డెటుల దా నాచార్యు డై యొప్పునో !

    పోనీ లే గురుదక్షిణంబు గొనుమా పోనాడుమా కోపమున్ !



    { అద్రిభిత్సూనుడు = అర్జునుడు ; అధివాకము = పక్షపాతోక్తి

    హీన + అమ్నాయపు వారు = హీన కులజులు }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అద్భుతమండీ గురుమూర్తి గారు


      జిలేబి

      తొలగించండి
    2. గురుమూర్తి ఆచారి గారూ,
      ఏకలవ్యుని ప్రస్తావనతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    3. జిలేబి గారికి " తియ్యని " నమః పూర్వక ధన్యవాదములు

      శ్రీ గురువర్యులకు పదనమస్కృతులు మరియు ధన్యవాదములు

      తొలగించండి
  32. సమస్య : -
    "హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్"

    కందము*

    ‌‌జ్ఞానంబునొసగు గురువులు
    మౌనంబున లంచమును సమర్ఫించకనే,
    ఈనాడిలాగు వెనుక క
    హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్
    ......................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సమర్పించకయే' అనండి. 'వెనుక కహాని' నడిపే ఆచార్యులున్నారు కూడా! బాగుంది.

      తొలగించండి
  33. మిత్రులందఱకు నమస్సులు!

    జ్ఞానౌన్నత్యకృతాగ్నిసంస్కరణుఁడై, శారీరవాఙ్మానస
    స్థానోత్కృష్టతపఃప్రభావయుతుఁడై, సమ్యక్చతుర్వేదశా
    స్త్రానీకప్రథితాప్తబోధకుఁడునై, సన్న్యాసియై, సంసృతీ
    హానిం జేయని యాతఁ, డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో?

    రిప్లయితొలగించండి
  34. దానంబెంచగ ధర్మమార్గమగు!సంధామ్ము సంతోషమౌ
    జ్ఞానంబుంచెడి విద్యబుద్దులనగా?"చాంచల్యభావంబునన్
    హీనత్వంబునుమాన్పజేయుగద!సాహిత్యంబునన్ ద్రుంచుచున్
    హానింజేయని యాతడెవ్విధిని దానాచార్యుడైయొప్పునో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్పగారూ!
      సాహిత్యంలో హీనత్వభావాలకు హానింజేయనివాడెట్లాచార్యుడగుననెడి మీ పూరణము చాలా బాగున్నదండీ! అభినందనలు!

      తొలగించండి
  35. పోచిరాజు వారికి కృతజ్ఞతలతో

    మానక జపతపములనే
    పూని సుదీక్షలను దాను పూర్ణపు రీతిన్
    మానిత గుణముల నేరికి
    హానిం జేయకనె యెటు లనాచార్యుడగున్?
    🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ!
      మీ పూరణ బాగున్నదండీ! అభినందనలు!

      తొలగించండి
    2. ధన్యవాదములండీ! మీ అభినందనలు పూజ్యులు కామేశ్వరరావు గారికే చెందుతాయి!🙏🙏🙏🙏

      తొలగించండి
  36. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  37. కానంగ బెదురు గలుగగ
    తానందించు వెలుగులును తారకలనగన్
    మానంగ దుష్ట దురితము
    హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మిగారూ!
      దుష్టదురితానికి హానిచేయనివాడు ఏలా ఆచార్యుడవుతాడు అనే మీ పూరణ చాలా బాగున్నదండీ! అభినందనలు!

      తొలగించండి
  38. కానల కేగక రయమున
    మౌనము గాతపము జేసి మోక్ష మటంచున్
    మానాభి మానములు విడచి
    హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వరి అక్కయ్య గారూ!
      మీ పూరణ బాగున్నదిఒ. అభినందనలు!
      మూడో పాదంలో విడచి బదులు విడి అనండి.

      తొలగించండి
    2. కానల కేగక రయమున
      మౌనము గాతపము జేసి మోక్ష మటంచున్
      మానాభి మానములు విడి
      హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

      తొలగించండి
  39. శార్దూలవిక్రీడితము
    తానైవిద్యల నేర్వ భిల్లుఁడట మాత్సర్యాన వృద్ధాంగులిన్
    బోనాడన్ గురుదక్షిణంచు గొనుచున్ బొమ్మైన భాగ్యమ్ముతో
    రానించన్ గురువంశ రాజగురువౌ లక్ష్యమ్ముతో బోయకున్
    హానింజేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ!
      ఏకలవ్యుని గూర్చిన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!
      మూడో పాదాదిని రాణించన్ అనాలి.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి 🙏

      టైపాటై సవరణతో

      తానై విద్యల నేర్వ భిల్లుఁడట మాత్సర్యాన వృద్ధాంగులిన్
      బోనాడన్ గురుదక్షిణంచు గొనె గా బొమ్మైన భాగ్యమ్ముతో
      రాణించన్ గురువంశ రాజగురువౌ లక్ష్యమ్ముతో బోయకున్
      హానింజేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో?

      తొలగించండి
    3. డా.వెలుదండ వారలు సూచించిన మార్పుతో

      శార్దూలవిక్రీడితము

      తానైవిద్యల నేర్వ భిల్లుఁడట మాత్సర్యాన నంగుష్టమున్
      బోనాడన్ గురుదక్షిణంచు గొనుచున్బొమ్మైన భాగ్యమ్ముతో
      రాణించన్ గురువంశ రాజగురువౌలక్ష్యమ్ముతో బోయకున్
      హానింజేయని యాతఁ డెవ్విధినిఁ దానాచార్యుఁడై యొప్పునో?

      తొలగించండి
  40. కందం
    ద్రోణుడుఁ గురు వీరులలరఁ
    దానొక బొమ్మ గురువైన దక్షిణ గొనుచున్
    దానంగుటమున్, బోయకు
    హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్! 

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ!
      ఏకలవ్యునినుండి అంగుటమును దానముగా గొని, బోయకు హానిచేయనివాడాచార్యుడెట్లగునో యనెడు మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు!

      తొలగించండి
  41. హానిం జేసిన వాడ నౌదు కొడకా ఆమ్నాయ సక్తిన్ మహా
    జ్ఞానం బొందగ జూచు ని న్నితర జిజ్ఞాసార్థ మార్గంబులన్
    నేనుంచ న్నని పంపినాడ నిచట న్నేమాత్రమున్ జ్ఞాని నా
    హా! నిం జేయని యాతడెవ్విధిని దానాచార్యుడైయొప్పునో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ!
      శిష్యుని జ్ఞానిని జేయనివాడు ఆచార్యుడెట్లగునో యనెడి మీ పూరణ మద్భుతముగా నున్నది! అభినందనలు!

      తొలగించండి
    2. ధన్యవాదాలు మధుసూదన మిత్రమా.

      తొలగించండి
  42. కం.
    ద్రోణుడి ప్రతిమను చేసియు
    కానలనొకడు విలువిద్య కౌశలమొందెన్
    వానినడిగె గురుదక్షిణ
    హానిం జేయకయె యెటుల నాచార్యుడగున్

    రిప్లయితొలగించండి
  43. డా.పిట్టాసత్యనారాయణ
    తానే ముందుగ జెప్పి బొమ్మ గొలువందా పాప మానాడు? నీ
    ద్రోణా చార్యుడు నేకలవ్యు దిగిచెన్ దుర్బుద్ధియే నందునే
    నీనాడిట్టుల దూర విద్య తపమున్ నెర్పంగ దుర్దక్షిణా
    హానింజేయని యాతడెవ్విధిని దా నాచార్యుడై యొప్పునో?!

    రిప్లయితొలగించండి

  44. ..సమస్య
    హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

    సందర్భము:శిష్యుని మనస్సులో వున్న సత్వ గుణాన్ని గురువు యెప్పుడూ పరిరక్షించాలి. అన్య గుణములను అంటే రజస్తమో గుణాలను ఏ విధంగానైనా బలహీన పరచాలి. శిష్యుని నొప్పించియైనా సరే అతని మనస్సునుండి తరిమివేయాలి.
    ఎందుకంటే సత్వగుణంతోనే శాశ్వతమైన సుఖం సంప్రాప్తిస్తుంది. వేరే గుణాలతో కాదు.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    పూని తన శిష్యుని మదిని
    మానిత సత్వగుణ శోభ మరుగుపడక ముం
    దే నేర్పున నన్యములకు
    హానిం జేయకయె యెటుల నాచార్యుఁ డగున్

    అన్యములకు= ఇతర గుణములు..
    రజస్తమో గుణములు

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  45. నేటి మాస్టార్లు: 👇

    దీనారమ్ముల గూర్చుటన్ వడివడిన్ ధ్యేయమ్ముగా నెంచుచున్
    నానారీతి ట్యుటోరియల్సు బడులన్ నందమ్ముతో జేరుచున్
    వానాకాలపు విద్యలన్ గరపుచున్ పానుల్ సిగారెట్లకున్
    హానిం జేయని యాతఁ డెవ్విధినిఁ దా నాచార్యుఁడై యొప్పునో!

    రిప్లయితొలగించండి