4, మే 2018, శుక్రవారం

సమస్య - 2668 (చీకటిలో వస్తుచయము...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్"
(లేదా...)
"చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్"
(బొగ్గరం V.V.H.B. ప్రసాద రావు గారికి ధన్యవాదాలతో...)

155 కామెంట్‌లు:


  1. శ్రీ కంది వరులు పలికిరి
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుక
    న్నా కందుకనియె నిష్టం
    బీ కవి వరుల సభ! దొరకు విరివిగ పదముల్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వెదుక న్నా కందుకనియె' ఇక్కడ కొంత సందిగ్ధత?

      తొలగించండి
  2. ఆకట నటమట లాడెడి
    శ్రీకరులగు ముద్దుముద్దు చిన్నారులపై
    చీకాకందని యమ్మకు
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్ .

    రిప్లయితొలగించండి
  3. సరదాగా:

    "లోకంబులు లోకేశులు
    లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
    జీకటి కవ్వల నెవ్వం
    డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్"


    పాకము పట్టగ ధ్యాన మ
    నేకము లయమై నిజమ్ము నీవె మిగులగా
    శోకము మాయమ్మై పెను
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్

    వస్తువు = వాస్తవిక పదార్థము
    చయము = సమూహము
    "సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం"

    (విరుపు నచ్చనపుడు వేదాంతమే శరణ్యం)

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. నీకో సముమది నిండుగ
      నేకాంతము కోరుకొనుచు నేనుండగ వెలుగై
      రాకాశశి యడ్డు బడిన
      చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. "కోరుకొనగ నే నట వెలుగై" అందామా?

      తొలగించండి
    3. నీకో సమెమది నిండుగ
      నేకాంతము కోరుకొనగ నేనటు వెలుగై
      రాకాశశి యడ్డు బడిన
      చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్

      తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    చేకొని సాధువేషమును స్త్రీలను మోసము చేసి , వారి లో...
    లాకుల , గాజులన్ , గొలుసులన్ గొని , దాచుచు పంచె యందు , చీ...
    కాకులు పెట్టు వాని పసిగట్టియు , కొట్టియు , లాగిచూడ గో...
    చీ , కటిలోపలన్ వెదుక చిక్కును వస్తుచయంబు దప్పకన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విశిష్టమైన విరుపుతో రుచిరమైన చమత్కారం
      సాధించారండీ! 👌

      తొలగించండి

    2. ఆహా చీకటి లో గోచీ లాగట మా !

      భేష్! అవధానులవధానులే !

      అడురహో !

      జిలేబి

      తొలగించండి
    3. చీకటి యావరించెనని చింతలఁబొందగనేల ? ధీరతన్
      చేకొని నిల్వఁ బోవు పెనుజీకటి , నూతన కాంతి చిందుచున్
      వేకువ వచ్చు , దీరునిక వేదన , భానుని రాక ద్రుంచగా
      చీకటి , లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పకన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    4. మైలవరపు వారి రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    5. అవధానుల కలానికి రెండువైపులా పదునే! 👏👏👌👌🙏🙏

      తొలగించండి
    6. ఏ కారపు డబ్బాయో ,
      యే కర్రయొ , కత్తిపీట , యేబండయొ , యే
      చాకో దొంగను కొట్టగ
      చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  6. రేఖా! పోయిన వేవియు
    చీకటి ముదిరిన దొరకవు శీఘ్రము తోడన్
    శోకము మానుచు నీ చిరు
    చీకటిలో వస్తు చయము చిక్కును వెదుకన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'క-ఖ'లకు ప్రాసమైత్రి లేదు. సవరించండి.

      తొలగించండి


  7. వేకువజాము జోగి సయి వెంగలి విత్తువ లెన్జిలేబియా
    చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్?
    నీకల నివ్వటిల్లదు! సునిశ్చలు నిన్మది నెంచి యత్నమున్
    సాకము చేయ గావలయు శాశ్వతు డాతడు లోన వెల్గగన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టాసత్యనారాయణ
    ఓ కవి వర్యా యితరుల
    దౌ కవనము గిట్టదయ్య దయ కరువై యా
    లోకనగన వరుసల చిరు
    చీకటిలో వస్తు చయము చిక్కును వెదుకన్

    రిప్లయితొలగించండి


  9. సోకక దూరముగ నిలిచి
    మాకిక పద్యములు రావు మల యన నేలా ?
    జోక పడగన్ కవులతో
    చీకటిలో వస్తు చయము చిక్కును వెదుకన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. శ్రీకరు లార్యులు,యోగులు,
    ప్రాకటముగ కనులు మూసి ప్రణవంబందున్
    వీకను దైవముఁజూడరె!
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్

    రిప్లయితొలగించండి
  11. చీకటి వెలుతురులందున
    లోకమ్మును జూడగలుగు లోపమె వరమై
    చీకునకనవరతమ్మున్
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్!!!

    చీకు = అంధుడు

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    పోకను జూర(చూర) జేసికొని పొందుగ దంతము లాడనీయకన్
    పాకము రాదు(అది తాంబూలమనే అర్థం)పద్యముల భంగులు లేఖలవ్రాసినట్లుగా,
    రూకల
    గుప్ప బెట్టునటు రొక్కపు నాణెములౌనె? పాదముల్
    వీకన రెంటి మధ్యనొక విస్తృత భావము (absurdity)నానగా వలెన్
    చీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పకన్
    (విశ్వకవి రవీంద్రుని పద్యం లోని శబ్దము/సమూహము యొక్క అర్థమేమిటని పాఠకులు అడుగగా"నాకూ తెలియదు. ఒక్కొక్క పాఠకుడు ఒక్కొక్క అర్థాన్ని గ్రహిస్తాడు." అని సమాధానము నిచ్చారట రవీంద్రుడు.ఉన్నదున్నట్లు చదవడం ఊహలు లేని పాఠకుని స్వభావము.వివరణ లేనిది నే నెట్లా ఒప్పుకుంటానని అనకూడదని భావము.)

    రిప్లయితొలగించండి
  13. కం.
    ఆకలిగొని మార్జాలము
    చీకటిలో నెలుకcజంపు చిత్రము తోడన్
    చీకటి వెలుగౌ పిల్లికి
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్

    రిప్లయితొలగించండి
  14. చద్ది దిని వెళ్ళే రైతు గురించి
    ఆకటిని యలమ టించకు
    చేకూరునువలయు తిండి సిద్ధముగనటన్
    వేకువ జామున కప్పర
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆకటిని నలమటించకు' అనండి.

      తొలగించండి
  15. నీకే కా దెల్లరకును
    జీకాకును గూర్చుఁ జిమ్మచీకటి గనుకన్
    వీకన్ దివిటీఁ జేకొనఁ
    జీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారూ! అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి జ్ఞాన జ్యోతిని వెలిగించాలని చక్కగా చెప్పారు! ధన్యవాదాలండీ! 🙏🙏🙏🙏

      తొలగించండి
  16. మే కొ ని జ్ఞాన పు వెలుగుల
    ధీ కరుడ గు గురువు నింపు దేదీప్యము గా
    నే కరణి న్న జ్ఞాన పు
    చీకటి లో వస్తు చ య ము చిక్కు ను వెదుక న్ ॥

    రిప్లయితొలగించండి
  17. నీకవి దొరకునె వెదకిన
    చీకటిలో ,వస్తుచయము చిక్కును వెదుకన్
    వేకువ వెలుగులు విచ్చిన
    ప్రాకటముగ గానుపించు ప్రతి యెక్కటియున్!!!

    రిప్లయితొలగించండి
  18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2668
    సమస్య :: *చీకటి లోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయమ్ము దప్పకన్.*
    చీకట్లో వెతికితే వస్తువులు తప్పకుండా దొరుకుతాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
    సందర్భం :: భక్త ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుని నామ స్మరణతో తాను తరిస్తూ తన తోటి విద్యార్థులను కూడా తరింపజేయాలని అనుకొన్నాడు. ఓ బాలకులారా! శ్రీ హరిని స్మరించే భక్తులకు క్రమంగా యోగము క్షేమము మొదలైన శ్రీకరమైన వస్తువులు దొరుకుతాయి. బాహ్య ప్రపంచ భాంతి అనే చీకటి తొలగిపోతుంది. చివరకు మోక్షం లభిస్తుంది. ఎవరైనా సరే *పుట్టని చావని త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి* అంటూ ఉపదేశం చేసే సందర్భం.

    చేకురు భక్తవర్యులకు శ్రీకర వస్తు చయమ్ము, భక్తితో
    నా కమలాక్షు శ్రీ హరిని యాశ్రితపాలకునే స్మరింపు డీ
    పోక నెఱుంగుడీ, తొలగి పోవును బాహ్య ప్రపంచ భ్రాంతియన్
    *చీకటి ; లోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (4-5-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అద్భుతమైన పూరణ అవధాని గారూ! అందుకోండి అభినందనలు! 💐💐💐🙏🙏🙏🙏

      తొలగించండి
    3. సందర్భంలో
      భాంతి అనే పదానికి బదులు
      భ్రాంతి అని చదువ ప్రార్థన.

      తొలగించండి
    4. గురువరేణ్యా! శ్రీ కంది శంకరార్యా! ప్రణామాలండీ. మీకు ఆరోగ్యం పూర్తిగా సమకూరినదా? మీరు మరికొంత విశ్రాంతి తీసికొంటే బాగుంటుంది కదండీ.

      తొలగించండి
    5. శ్రీమతి సీతాదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. .

      తొలగించండి
  19. చీకటిలో వేటాడెడు
    నాకటి ప్రాణులకునందు నాహారమహో
    తేకువ గురిగొన చిక్కని
    చీకటిలోవస్తుచయము చిక్కును వెదుకన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేకొని ధ్యానపు మార్గము
      వేకువ ఝామున తలపగ వెన్నుని మనమున్
      పోకార్చుచు నజ్ఞానపు
      చీకటి, లో వస్తుచయము చిక్కును వెదకన్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  20. ఏకాగ్రత సాధించిన
    లోకమునే గెలువ నగును లోతుగ జూడన్
    నాకము సృజియించ నగును
    "చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్"

    రిప్లయితొలగించండి
  21. కాలములో తను వచ్చినది కాలములోనే
    కరిగి పోవును
    కళ్ళకు కనబడు జగతి చూడు రోజొక రీతి
    రూపు మారును
    నిత్యము సత్యము తెలియగ అంతర దృష్టిని
    సారించినన్
    చీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు
    దప్పకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. రమేశు గారి భావనకు


      వేకువ తో తురీయమును వేగముగాను‌‌ రమేశ దాటగ
      న్నాకడ నీకడన్ జనుడ ! నమ్ముము నేకడ యైన నే మయా!
      చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పక
      న్నీకది సత్యమైవెలయు నిత్యము బాహ్యపు దృష్టి వీడగన్

      జిలేబి

      తొలగించండి
  22. లోకమునను దీపముతో
    "చీకటిలో వస్తుచయము చిక్కును వెదుక"
    న్నేకేశ్వరు నెఱిగినపుడు
    శోకమ్ములు లేవు సత్య శోధన జేయన్!

    రిప్లయితొలగించండి
  23. లోకేశుని సేవించిన
    గీకారణ్యమున నైన గ్రీడించనగున్
    శోకము బోద్రోలనగును
    "చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్"






    రిప్లయితొలగించండి
  24. చీకటికి దివ్వె జూపిన
    జీకటులే బోయి వెలుగు జిమ్మును, నచట
    న్జీకటి మాటే యుండక
    చీకటిలో వస్తుచయముచిక్కును వెదకన్

    రిప్లయితొలగించండి
  25. కందం
    తాకిన వెలుగులఁ జిమ్మెడు
    సౌకర్యంపు చరవాణి సాధనపు వలన్
    లోకమ్మును జూడఁ దగును
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వలన్' అన్న ప్రయోగం సాధువు కాదు. "సాధనములచే" అనండి.

      తొలగించండి
    2. అక్కడ వల అంటే నెట్(అంతర్జాలమను) భావముతో వాడితిని. గురుదేవులు పరిశీలించ మనవి.

      తొలగించండి

  26. *** *** *** *** ***
    కం
    శ్రీకరు దయగొన జాలును

    సాకారమగు సుళువుగ నసాధ్యములెల్లన్

    ప్రాకటముగ జరుగు నిదియె

    "చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్"




    🌿🌿🌿 ఆకుల శాంతి భూషణ్🌷🌷
    ☘ వనపర్తి☘


    రిప్లయితొలగించండి
  27. కం.
    ఆకారము కనిపించదు
    శ్రీకారము చేయవలెను చీకటి గదిలో
    కోకయను తెరను దీయగ
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్

    రిప్లయితొలగించండి


  28. రమేశు గారి భావనకు


    వేకువ తో తురీయమును వేగముగాను‌‌ రమేశ దాటగ
    న్నాకడ నీకడన్ జనుడ ! నమ్ముము నేకడ యైన నే మయా!
    చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పక
    న్నీకది సత్యమైవెలయు నిత్యము బాహ్యపు దృష్టి వీడగన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. పాకెటు టార్చిలైటొకటి పన్నుగ నింపిన బ్యాటరీలదౌ...
    చేకొని పృష్ఠభాగమున చెన్నుగ తట్టుచు గట్టిగట్టిగా
    కేకలు వేయుచున్ పతిని గిచ్చుచు మొట్టుచు మీట నొక్కగా...
    చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. జిలేబీ పేటెంటడ్ పజ్జాలను మీర్రాస్తే ఎట్లాగండీ జీపీయెస్ వారు :)


      సూపర్


      జిలేబి

      తొలగించండి
    2. మీ పేటెంట్లు "శార్"దూలాలు కదా!

      😊😊😊

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా చమత్కార జనకంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.
      అయినా ఆమాత్రం దానికి మొగుణ్ణి గిచ్చడ, మొట్టడం ఎందుకు?

      తొలగించండి

    4. అవన్నీ లేకుండా పద్యాన్ని లాగడమెట్లాగండి నాలుగు పాదాల దాక :)


      జిలేబి

      తొలగించండి
    5. సార్! జిలేబీ గారికి తెలియనిదేమున్నది?

      తొలగించండి
    6. పతిని గిచ్చడం, మొట్టడం, inverter పెట్టించలేదని... ఎన్నిసార్లు మొత్తుకున్నా...

      తొలగించండి
  30. చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్"
    చక్కగ జెప్పిరార్యులిట సాధ్యముగానిదిలేదుగానిలన్
    చీకటి బోవగాదివియ చిమ్మును గాంతిని వెల్తురయ్యెడన్
    మక్కువతోడరాగమరి మంచిగ గన్పడు వస్తుసంపదల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేదుగా యిలన్' అనండి.

      తొలగించండి
  31. శోకించ నేల భీతిని
    నే కాలము నందు నైన నింకఁ గరమునం
    బ్రాకటపు దీప ముండగఁ
    జీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్


    నాకుఁడు గృంకె నక్కట వినా వర దీపిక దుష్కరంబగున్
    వాకిట జాఱి కన్పడని బంగరు టుంగర మింకఁ బొందగన్
    వ్యాకుల చిత్త మేల ననపాయమ సోమ కృపా లసన్మరీ
    చీ కటి లోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అరసున్న మహిమ:
      నాకుఁడు = సూర్యుఁడు; అరసున్న పెట్టకున్న నాకుట

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      'నాకుఁడు గ్రుంకె' టైపాటు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు. అవునండి సరిచేశాను.

      తొలగించండి


  32. వాకబు చేసి చూడగను వాక్కున కాయము లోగలండు;పెం
    జీకటి కావలన్ గలడు! జీవుని కాతడు పట్టు గొమ్మగా
    పాకలమై సదాశివుడు భాగ్యము గాగలడయ్య నాతడిన్
    చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  33. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    స ర దా గా = సె ల్ ఫోన్ పై ఒ క చి న్న ప ద్యం

    >>>>>>>>>> >>>>>>>>

    వాకొన వచ్చు | దూరముగ వాసము జేసెడు నట్టి వారి నా

    హా ! కనులార జూడ నగు | హాయి వినం దగు శ్రావ్య గీతముల్ |

    మైకును వెట్టి మాట , కెమెరా గొని చిత్రము = దాచవచ్చు | నీ

    లోకపు సంగతుల్ విని -- విలోకన మీ వొనరింప వచ్చు | నీ

    పాకెటు లోని . సెల్లున . ప్రపంచ మిముడ్చగ వచ్చు | దానిలోన్

    దాకొని యున్న టార్చి నిడినన్ > బ్రసరించెడు కాంతిరేఖచే

    జీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయమ్ము తప్పకన్ ! !



    { వాకొను = మాటాడు ; దాచవచ్చు = S a v e చేయవచ్చు ;

    దాకొనియున్న = దాగియున్న }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. గురుమూర్తి వారి చరవాణి మధురవాణి :)

      చాలా బాగుందండీ "సెల్పక" మాల ;


      జిలేబి

      తొలగించండి

    2. * -సెల్ ఫల మాల సెల్ఫల మాల !

      జిలేబి

      తొలగించండి
    3. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. గురువర్యులకు పదనమస్కృతులు , ధన్యవాదములు

      జిలేబి గారికి మధుర మయిన ధన్యవాదములు

      తొలగించండి





  34. రాకాసి సునామీచే
    భీకర నష్టము కలిగెను విద్యుత్పోయెన్
    ఈ కందిలి వెలిగించియు
    చీకటిలోపలన్, వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లక్ష్మినారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని సమస్యగా కందపాదాన్ని కాక, ఉత్పలమాల తీసుకున్నారు.
      'విద్యుత్' అని హలంతంగా వ్రాయరాదు. అక్కడ "విద్యుత్తు చనెన్" ఆనండి.

      తొలగించండి
  35. ఉత్పలమాల
    చేకొని పూనికన్ దపముఁ జేయుచు వేలకు వేల యేళ్లుగన్
    శ్రీకర వేదవాజ్ఞ్మయముఁ జిన్మయ మంద ఋషీశ్వరాదులున్
    మీకును ధ్యానమార్గమది మేలొనరించును, వీడ మోహపున్
    జీకటి, లోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్

    రిప్లయితొలగించండి
  36. చీకటి చీకటి యనుచును
    చీకాకును జెంద నేల చినవాడా లే
    వాకిటి దీపము తెమ్మిటు
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్.

    రిప్లయితొలగించండి
  37. కేకలు పెట్ట గూరుచొని గీ యని చిక్కునె లోని వస్తువుల్?
    పోకిరి వేమి? చాలు నిక, పొ మ్మిట సేవకు లేరి? లేచి యా
    వాకిటి దీపముం గొనుము, వంట గదిం జని చూడు వెల్గులో
    చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్.

    రిప్లయితొలగించండి
  38. ఆకర్షణగా యంధుడు
    జేకొను కార్యాలుజేయు చేతులుకాళ్లే
    దాకగ?కళ్లై!జూపగ
    చీకటిలోవస్తు చయము చిక్కును వెదకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఆకర్షణగా నంధుడు' అనండి.

      తొలగించండి
  39. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


    ** త త్త్వ సా ర ము **

    *****************



    [ అన్నిటి కన్న ఙ్ఞానధనము మిన్న • భవబంధము విడుము •

    నీవు మనసు లో ఆ అఙ్ఞానాంధకారమును పోగొట్టుకొనుము •

    వెదికినచో నీకు అన్ని విషయములు గోచర మగును • ]



    లోకములో మిన్న యగును

    ప్రాకట మగు ఙ్ఞానధనము | బంధము విడుమా !


    పోకార్చు కొనుము నీ వా

    చీకటి (న్ ) , " లో " || వస్తు చయము చిక్కును వెదుకన్ ! !


    { బంధము = భవబంధము ; పోకార్చుకొనుము = పోగొట్టుకొనుము

    చీకటి = అఙ్ఞానము ; లో = మనసు లో ; వస్తువు = విషయము ;

    వెదుకన్ = పరిశోధించగా }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యులకు పద నమస్కృతులు & ధన్యవాదములు

      తొలగించండి
    3. గురుమూర్తి గారూ,
      ఇప్పుడే నా సహాధ్యాయి, తెలుగు పండితులు భూసారపు నర్సయ్య గారు ఫోన్ చేశాను. "చాలారోజుల తర్వాత నాకు ఆత్మానందాన్ని కలిగించే పద్యాన్ని మీ బ్లాగులో చూసాను. 'లో వస్తుచయము' అన్న విరుపులో లోతైన ఆధ్యాత్మిక భావ సంపద ఉన్నది. పద్యాన్ని వ్రాసిన గురుమూర్తి గారికి అభినందనలు తెలియవలసింది" అని ఆ ఫోన్ సారాంశం. మాట్లాడిన పది నిమిషాలూ మీ పద్యాన్ని గురించిన ప్రశంసయే...

      తొలగించండి
  40. వేకువ లేదజ్ఞానికి
    ప్రాకటముగ వెలుగు చుండు ప్రాజ్ఞున కెపుడున్
    లోకములో నతి సులువుగ
    చీకటిలో వస్తు చయము చిక్కును వెదుకన్.

    రిప్లయితొలగించండి
  41. కోకారి వెన్నెలచందము
    పై కవితలనల్లకలము పట్టితి వ్రాయన్
    పైకొన నెటుల నవిద్యపు
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. గమనించితిని. ధన్యవాదములు ఆచార్యా
      🙏🏽

      తొలగించండి
  42. మిత్రులందఱకు నమస్సులు!

    [వడఁగండ్ల వాన తీవ్రతచే, నిన్న పండ్రెండు గంటలకుఁ బోయిన కరెం, టిప్పుడే వచ్చినందున, నా పూరణ మిప్పటికిఁ బెట్టఁగలిగితిని! నిన్న చీఁకటిలో నన్ని వస్తువులనుఁ జూపించుటకు మొబైల్ టార్చియే మాకు దిక్కయ్యెను! శంకరయ్య గారునుం జీఁకటిలో వస్తుచయమ్మునకై వెదకిన దొరకునంచు సమస్యనుం బెట్టినారు! ఇంక నా కేమి తక్కువ? వెంటనే, మొబైలు టార్చిని నాధారము చేసికొని, సమస్యనుం బూరించితిని!]

    నాకునుఁ జూడఁ జోద్యమిడు నవ్య కృతమ్మగు యంత్ర కల్పనల్
    శ్రీకరమయ్యు నొప్పె భువిఁ! జెప్పఁగ లేని భయమ్ముఁ జీల్చి, నీ
    కాకృతిఁ జూపు, నీదు కరమందున నుండిన ఫోను టార్చిచేఁ,
    జీఁకటిలోపలన్ వెదుకఁ, జిక్కును వస్తుచయంబు దప్పకన్!

    రిప్లయితొలగించండి
  43. (2)
    వేకువ జామునన్ నిదుర వీడియు, నింటఁ గలట్టి వస్తువుల్
    చేకొని శుభ్రమందఁగనుఁ జేసియు, నెచ్చటి వస్తు వాడ హే
    వాకము తోడఁ జేర్చు నలవాటు గడించిన కాంత కెప్పుడున్
    జీఁకటిలోపలన్ వెదుకఁ, జిక్కును వస్తుచయంబు దప్పకన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

    2. శబ్ద భేది లాగ స్థాన భేది విద్యాప్రకాశ భామామణి :)

      జిలేబి

      తొలగించండి
    3. బహుబాగా శలవిచ్చారు జిలేబిగారు!!👌👌👌

      తొలగించండి
    4. ఆడవారైనా, మగవారైనా అలవాటైన పరిసరాల్లోని వస్తువుల్ని చీకట్లోనూ తేలిగ్గా వెతుకగలుగుతారు! నన్నే తీసుకోండి... అది రాత్రైనా, పగలైనా నేను పఠించెడి గ్రంథచయాన్ని నేను కళ్ళుమూసుకొని వెదుకగలను! చీకట్లోనూ నాకు కావలసిన పుస్తకాన్ని సులభంగా గుర్తించి, బయటికి తీయగలను! ఇది కేవలం అలవాటు, పరిసర పరిచయము ఉంటే చాలు...ఎవరికైనా సాధ్యమే!

      స్పందించినందులకు జిలేబీ గారికి, సీతాదేవి గారికి ధన్యవాదాలు!

      తొలగించండి
  44. తప్పక - చివర నకారం వస్తుందా. తెలియజేయ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక ప్రత్యయాంత అవ్యయమైన 'తప్పక' కళయే. 'తప్పకన్' అన్న ప్రయోగం దోషమే.
      అయితే ఇది ఆకాశవాణి వారిచ్చిన సమస్య. సమస్యను ఉన్నదున్న?ట్లుగా స్వీకరించడం జరిగింది. దానికి కందపాద రూపాన్నిచ్చింది నేను. (బి.వి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారు తాము పూరించిన ఆకాశవాణి సమస్యలను ఒక పుస్తకంగా ప్రకటించారు. అందులోనుండి గ్రహించాను).
      నిజానికి ఇచ్చే సమయంలో నాకు అనుమానం రాలేదు. ఈరోజు ఉదయం గుర్తించి గుండు మధుసూదన్ గారితో ఈ విషయమై చరించాను కూడా. శ్రీహరి నిఘంటువు దీనిని క్రియా విశేషణం అన్నది. అప్పుడు 'తప్పకన్' అంటే దోషం లేదు. బి.ఎన్.రెడ్డి నిఘంటువు అవ్యయంగా పేర్కొన్నది. అప్పుడు దోషమే. కాబట్టి మనం క్రియావిశేషణంగా స్వీకరిద్దాం.

      తొలగించండి
    2. నామ సర్వ నామంబులకును గళ లగు నవ్యయంబులకును గడపల సముచ్ఛయార్థవిశేష పాదపూరణంబుల యందు “ను” శబ్దంబు తఱచుగ నగు.
      కళ లగు ననుదదంత శబ్దము మీఁద నయ్యడది యు వర్ణ పూర్వకంబు విభాషనగు.
      మఱియు నది శేష షష్టి యందు యొక్క లోపించు నపుడు లాగమాంత బహు వచనంబు మీదను సముచ్చయమునం జూపట్టెడి. --- ప్రౌఢ. వ్యా. శబ్ద. 116.

      ను శబ్దాగమమున కూదాహరణలు:

      కొమ్మన్ = కొమ్మయును
      పురారిన్ = పురారియును
      ఏమిని = ఏమియును
      ఇట్టిదిన్ = ఇట్టిదియును
      వెండిన్ = వెండియును
      పోయిన్ = పోయియును
      ఎంతను = ఎంతయును
      ఏనిన్ = ఏనియును
      మఱిన్ = మఱియును
      లేకను = లేకయును
      ఊఱడకను = ఊఱడకయును

      తొలగించండి

  45. చీకటి మాటునన్ బడసి చేర్చిన లెక్కకు మిక్కిలైనవౌ
    పైకము వెండి బంగరము వజ్రము లాదిగ సంపదల్ నహో!
    తాకను వీలులేని యెడ తాపడమున్ గొన సీబియైనకున్
    జీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. నెల్లూరు వంద కోట్ల అటెండరేనా ? :)


      జిలేబి

      తొలగించండి
    2. ఇట్లాంటి వారు దేశమంతా ఉన్నారు!😪😪😪

      తొలగించండి
    3. సీతాదేవి గారూ,
      సీబీయైని ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'సంపదల్ + అహో' అన్నపుడు నుగాగమం రాదు. "సంపదల్ భళా" అనండి.

      తొలగించండి
    4. ధన్యవాదములాచార్యా! సవరిస్తాను🙏🙏🙏

      తొలగించండి
    5. చీకటి మాటునన్ బడసి చేర్చిన లెక్కకు మిక్కిలైనవౌ
      పైకము వెండి బంగరము వజ్రము లాదిగ సంపదల్ పరుల్
      తాకను వీలులేని యెడ తాపడమున్ గొన సీబియైనకున్
      జీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పగన్!

      తొలగించండి
  46. శోకమదేలనో సఖియ సొమ్ముల నెచ్చట నుంచి మర్చినా
    వో కద తాలుమోయి యిట పొద్దది గ్రుంకగ జేరె నిండుగా
    జీకటి, లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పకన్
    నీకొరకై వెదంకెదను నేనును తెమ్మిక దీపమొక్కటిన్.

    రిప్లయితొలగించండి
  47. శ్రీకరుడైన శ్రీపతిని చిత్తము లోనతలంచనిత్యమున్
    ప్రాకటమౌ ప్రకాశమిడు స్వామి యెడందకు,నట్టివేళలో
    భీకర మైన శర్వరిని వెల్గు కనంబడు, దైవ లీలతో
    చీకటిలోపలన్ వెదుకఁ జిక్కును వస్తుచయంబు దప్పకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అన్నపరెడ్డి వారి పూరణ వారు ప్రత్యక్షంగా అనభవించి వ్రాసినట్లే ఉన్నది! 🙏🙏🙏🙏

      తొలగించండి
  48. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .సమస్య
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్

    సందర్భము: అజ్ఞాన మనే చీకటి వున్నంతవరకు వస్తు వ్యామోహం వుంటుంది. అంటే రకరకాల వస్తువులను సేకరించడంలో భ్రమ. ఆ దశలో నరునికి లభించేవి వస్తువులే! కాని శాశ్వతమైన దివ్యానందానుభవాన్ని ప్రసాదించే *ఆత్మ* కాదు.
    వెదుకగా వెదుకగా.. అనగా ఆత్మకోసం అన్వేషించగా.. అజ్ఞానాంధకారం నశిస్తుంది. జ్ఞాన భాస్కరు డుదయిస్తాడు. ఆ వేకువలోనే ఆత్మ లభిస్తుంది. వస్తు ప్రీతిని వర్ధిల్ల జేసే భ్రమ లన్నీ పటాపంచ లౌతాయి.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    ప్రాకటమగు నజ్ఞానపు
    చీకటిలో వస్తుచయము చిక్కును; వెదుకన్
    చీకటి నశించు; జ్ఞానపు
    వేకువ నాత్మయె లభించు;
    విడు వస్తు భ్రమల్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  49. డా.పిట్టా సత్యనారాయణ
    పోకను జూర(చూర) జేసికొని పొందుగ దంతము లాడనీయకన్
    పాకము రాదు(అది తాంబూలమనే అర్థం)పద్యముల భంగులు లేఖలవ్రాసినట్లుగా,
    రూకల
    గుప్ప బెట్టునటు రొక్కపు నాణెములౌనె? పాదముల్
    వీకన రెంటి మధ్యనొక విస్తృత భావము (absurdity)నానగా వలెన్
    చీకటి లోపలన్ వెదుక జిక్కును వస్తుచయంబు దప్పకన్
    (విశ్వకవి రవీంద్రుని పద్యం లోని శబ్దము/సమూహము యొక్క అర్థమేమిటని పాఠకులు అడుగగా"నాకూ తెలియదు. ఒక్కొక్క పాఠకుడు ఒక్కొక్క అర్థాన్ని గ్రహిస్తాడు." అని సమాధానము నిచ్చారట రవీంద్రుడు.ఉన్నదున్నట్లు చదవడం ఊహలు లేని పాఠకుని స్వభావము.వివరణ లేనిది నే నెట్లా ఒప్పుకుంటానని అనకూడదని భావము.)

    రిప్లయితొలగించండి
  50. కూకటి వేళ్ళను దీయుచు
    మూకల చీకటి ధనంబు ముట్టడి సేయఁ న్,
    కోకల చాటున మాటుగ
    చీకటి లో వస్తు చయము చిక్కును వెదుకన్
    కొరుప్రోలు రాధాకృష్ణారావు

    రిప్లయితొలగించండి
  51. కేకలు పెట్టగ పెద్దలు
    మేకల కొట్టమ్ము నందు మేలిమి సొమ్ముల్
    వీకొని చోరుడు పారెను
    చీకటిలో, వస్తుచయము చిక్కును వెదుకన్ !!

    రిప్లయితొలగించండి
  52. చీకటి యని చింతెందుకు
    చీకటిలో సెల్లు ఫోను చేతిలొ నుండన్
    చీకటి వెలుగుల మధ్యను
    చీకటిలో వస్తుచయము చిక్కును వెదుకన్

    చీకటి చీకటి యనుచును
    చీకటినె దిట్టుకొనక చిరు దీపముతోన్
    చీకటిలో యత్నించిన
    చీకటిలొ వస్తుచయము చిక్కును వెదుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'చేతిలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. "చేతను నుండన్" అనండి. రెండవ పూరణలో కొన్ని టైపు దోషాలున్నవి.

      తొలగించండి