15, మే 2018, మంగళవారం

సమస్య - 2679 (మలమును గనినంత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"
(లేదా...)
"మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్"

138 కామెంట్‌లు:


  1. కలలో, జీవన యానము
    న, లబ్జుగ మనుజుని మనసున, వెతుకగ జిలే
    బి,లయన, నాట్యము లోన, వి
    మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్!


    పాకమె జిలేబి కాయువు :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      విమలమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లబ్జు' వంటి వ్యావహారిక పదాల ప్రయోగాన్ని నియంత్రించండి. 'లయను' అనండి.

      తొలగించండి
  2. ఇలలో సుందర మైనక
    మలములు వికసించు నెపుడు ,మదిదోచుగదా
    విలువలు గలిగిన బ్రహ్మ క
    మలమును గనినంత ముక్తి మార్గము దోచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      బ్రహ్మకమలముతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. కులములు మతముల నెన్నక
    నిలకడతో నాత్మశుద్ధి నెన్నిన నాడే
    ఫలముంగ మానసిక ని
    ర్మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మానసిక నిర్మలమంటూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
      'ఫలముంగ'..?

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    సలిలమునందు బుట్టు జలజాతమపంకిలమైన భంగి , ని...
    ర్మలమగు చిత్తవృత్తిఁ బెను మాయనెరింగి , యలౌకికమ్ము ని...
    శ్చలమతినెంచి బ్రహ్మమను సారమెరుంగ , తొలంగజేయుచున్
    మలముఁ ., గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. శ్యామలము... రావి చెట్టు

      ఊర్ధ్వమూలమధశ్శాఖమశ్వత్థం ప్రాహురవ్యయం
      ఛందాంసి యస్య పర్ణాని యస్సంవేద స వేదవిత్ !!

      పలు నిగమమ్ములున్ హరితపర్ణములై తరుమూలమూర్ధ్వమై
      విలసిలునీ జగమ్మనెడి వృక్షమనన్ తలక్రిందులైన కొ...
      మ్మల గననొప్పు , నిద్ది మహిమాన్వితమవ్యయమౌ నటంచు , శ్యా ...
      మలముఁ గనంగ ముక్తికదె మార్గముఁ జూపును భక్తకోటికిన్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. మైలవరపు వారి రెండవ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. మైలవరపు వారి రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నవి! అభినందనలు! 💐💐💐🙏🙏🙏🙏

      తొలగించండి
  5. ఇలలో భవబం ధములను
    వలలో జిక్కుకొ నంగ బాధలు మరువన్
    కలగాంచిన భగవ ద్రూపము
    మలమును గనినంత ముక్తి మార్గము దోఁచున్

    ఇక్కడ" మల = కొండ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      'మల మును గనినంత' అన్న విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ, మూడవ పాదాలలో గణదోషం. "..వలలో జిక్కుకొనగ పలు బాధలు మరువన్। కల గన భగవద్రూపము..." అనండి.

      తొలగించండి
    2. ఇలలో భవబం ధములను
      వలలో జిక్కుకొనగ పలుబాధలు మరువన్
      కలగన భగవ ద్రూపము
      మల మును గనినంత ముక్తి మార్గము దోఁచున్ .

      తొలగించండి



  6. ఇలన జనాళికిన్ సఖియ! యీప్సిత మైనది మోక్ష మే సుమా
    కలగన నేల దాని కొర కై యతనమ్మును చేయ మేలగున్
    పలుకున, నెమ్మి నెక్కొనగ, బంధము లన్విడి, చింత చేసి, ని
    ర్మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్

    మరో పాకం :)
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాక శాస్త్రములో అందె వేసిన చేయి మరి ఏమైనా వండగలరు

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'ఇలను' అనండి.

      తొలగించండి
  7. (స్వామి పుష్కరిణి )
    అమలము ; సుహృదయ పరిష
    ద్విమలము ; తిరువేంకటవిభు విలసిత కరుణా
    కమలము ; పరిపూరిత కో
    మలమును గనినంత ముక్తిమార్గము దోచున్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      శబ్దాలంకారం మనోహరంగా ఉన్నది. కాని ప్రాస తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. లలితము; సుహృదయ పరిష
      త్కలితము; తిరువేంకట విభు కరుణా నేత్రాం
      చలితము; పరిపూరిత కో
      మలమును గనినంత ముక్తి మార్గము దోచున్

      తొలగించండి
    3. బాపూజీ గారూ,
      మీ తాజా పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  8. పిలిచిన పలుకునతడు! కొం
    డల రాయుని దేవళమ్ము! డాంకృతి యదిగో!
    అలసిన మేనికి సఖి, తిరు
    మల, మును గనినంత, ముక్తిమార్గము దోఁచున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      తిరుమల మును గనినంత అంటూ చక్కని పూరణ నందించారు. అభినందనలు.

      తొలగించండి
  9. నిలువగ లేదీ కాయము
    కలకాలము భూమియందు గదరా నరుడా!
    కలవర పడువేళన కా
    మలమును గనినంత ముక్తి మార్గము దోచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      కామలము (వసంతం) తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వేళను' అనండి.

      తొలగించండి
  10. ఉన్నదున్నట్లుగ గాక నిరంతరం మారునదదె
    జగతియని
    జడమైనను జీవమైనను శోషితమై తను
    అంతమొందునని
    లోపల నన్నుంచుకుని బయటి తళుకులకు
    మురిసిపోవనేటికిన్
    మలము గనంగ ముక్తి కదె మార్గము జూపును
    భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రమా ఏ పద్యమిది ఒక్కసారి సరిచూడుము

      తొలగించండి
    2. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      అది పద్యం కాదు. వారి భావాన్ని అలా వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు జిలేబీ గారు వారి భావానికి పద్యరూపాన్ని ఇస్తూ ఉంటారు.

      తొలగించండి
  11. నిముసము జారగ నీయక
    సమధిక భక్త్యానురక్తి సరగున లక్ష్మీ
    రమణుని,వరదుని,ప్రేమగను పదక
    మలమునుఁగనినంత ముక్తి మార్గముఁదోచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రమా ప్రాస నొక్కసారి సరిచూడుము

      తొలగించండి
    2. ప్రసాద రావు గారూ,
      ప్రాస, మూడవ పాదంలో గణాలు తప్పాయి. సవరించండి.

      తొలగించండి
    3. ధన్యవాదములు అలాగే సవరిస్తాను

      తొలగించండి
  12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  13. పలువిధములైన సేవల
    సలుపుచు ప్రజలకు, నశించు సమయము నందున్
    వలిమలపై ప్రీతిని శ్యా
    మల, మును గనినంత ముక్తిమార్గము దోఁచున్

    రిప్లయితొలగించండి
  14. అలమేలుమంగ పతి తిరు
    మల రాయుడు కొండపైన మనుజుల కొరకున్
    వెలసెను,దీవించు కరక
    మలమును గనినంత ముక్తి మార్గము దోచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      కర కమలంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి

  15. కలియుగ దైవముగా నిల
    వెలసిన యా వేంకటపతి వేడుకొనుచునా
    నలినాక్షుని సాధుపద క
    "మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      పద కమలంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  16. పిలిచిన బలికే దైవము
    వెలసెను కొండల నడుమన, వేడుచు భక్తిన్
    గొలుచుచు వెంకన్న కర క
    మలమును గనినంత ముక్తి మార్గము దోచున్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      కర కమలంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పలికే' అన్నది వ్యావహారికం. "పలికెడి" అనండి.

      తొలగించండి
  17. [15/05, 06:16] ‪+91 75698 22984‬: 15, మే 2018, మంగళవారం
    సమస్య - *2679*
    కవిమిత్రులారా,
    ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

    *"మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"*

    (లేదా...)

    *"మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్"*

    http://kandishankaraiah.blogspot.in
    [15/05, 07:03] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
    కలహించక వినుముసఖా
    వలపులతేనెలివి నిన్ను వంచన జేయున్
    తెలివిగ పరమాత్ముని "తిరు
    మల" "మును" గనినంత ముక్తి మార్గము దోచున్

    రిప్లయితొలగించండి
  18. మలములచే నిండిన తమ
    బలహీన తనువుల యందు పావనమౌచున్
    తలపై నుండెడి బ్రహ్మక
    మలమును గనినంత ముక్తి మార్గము దోచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      బ్రహ్మకమలంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏

      తొలగించండి
  19. స లలిత మురళీ గానము
    విలసిత సమ్మోహనoబు విమల ప్ర ద మౌ
    చె ల గెడు హరి గాత్ర శ్యా
    మల ము ను గని నంత ముక్తి మార్గ ము దోచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. కలలను బోలును బ్రతుకును
      తలచక కలలే గనకను తపమును జేయన్
      వల మాయల వీడి మది క
      మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్

      తొలగించండి
  21. వలపులు విరిసెడి వయసున
    చెలియను గలియగ దలచెడు చెలికానికటన్
    కలువల రాయని జత కా
    మలమును గనినంత ముక్తిమార్గము దోచున్!

    విరించి గారికి ధన్యవాదాలతో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! కామిగాని వాడు మోక్షగామి కాడుగదా! 🙏🙏🙏

      తొలగించండి
  22. వెలలేనిది జ్ఞానమనెడి
    హలమును గొని దుక్కి చేయ నంతర్ముఖుడై
    సలలిత నిర్మల హృదయ క
    "మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"

    రిప్లయితొలగించండి
  23. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2679
    సమస్య :: *మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్.*
    మలమును చూచినట్లయితే అదే ముక్తిని పొందేందుకు మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: గజేంద్రుడు, ద్రౌపది, కుచేలుడు, పరీక్షిన్మహారాజు మొదలైనటువంటి వారందఱూ మొదట చాలా కష్టాలను అనుభవించారు. ఆ తరువాత (*నీవే తప్ప నితః పరం బెఱుగ* అని)భగవంతుని శరణువేడి ఉత్తమ గతులను పొంది, *మోక్ష సాధన సామగ్ర్యాం భక్తి రేవ గరీయసీ* అని అంటూ భక్తిమార్గము యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేశారు. కాబట్టి వారివలె (ఉమ్మలమును) కష్టమును పొందినట్లైతే భక్తులకు ఆ కష్టమే ముక్తికి మార్గాన్ని చూపిస్తుంది అని విశదీకరించే సందర్భం.

    ఇల ఘన కష్ట మందుచు గజేంద్రుడు ద్రౌపదియున్ కుచేలుడున్
    అలఘు పరీక్షిదాదులు మహర్దశ నందిరి దైవభక్తులై,
    సులభము భక్తిమార్గమని సూచన జేసిరి, వారివోలె ను
    *మ్మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్.*
    {ఉమ్మలము = కష్టము}
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు* (15-5-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కష్టాలే ముక్తికి మార్గమని అద్భుతంగా పూరించారు అవధానిగారూ! నమోనమః! 🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    2. శ్రీమతి సీతాదేవి గారూ! ప్రణామాలమ్మా.

      తొలగించండి
    3. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అత్యద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    4. గురువరేణ్యులు
      శ్రీ కంది శంకరయ్య గారికి హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించండి
  24. ఇలలో పూజలు చేతురు
    నిలింపను జనత, శుభముల నిచ్చు ను గోమా
    తలెపుడు , మూత్రస హిత గో
    మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణసూర్యకుమార్ గారూ,
      గమయాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  25. కలి కల్మష నాశుండగు
    విలసత్ శ్రీ వేంకటేశు విఖ్యాతంబౌ
    చెలువుకు నెలవగు పాద క
    మలమునుఁగనినంత ముక్తి మార్గముఁదోచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      వేంకటేశ్వర పాద కమలమును ప్రస్తావించిన మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  26. మలమని వెరచెద వేలా!
    ఫలాదులను తాకినావు పంకిల మాయె
    న్నిలను జిలేబి మలమెవరు ?
    మలమును గనినంత ముక్తిమార్గము దోచున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. మలమని వెరచెద వేలా!
      ఫలాదులను తాకినావు వర్చస్కమయె
      న్నిలను జిలేబి మలమెవరు ?
      మలమును గనినంత ముక్తిమార్గము దోచున్!

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  27. కం:-
    విలసిత బలమెరుగుటకు వి
    మలపు మనమ్మును ధరించి మననముజేయన్
    తలమెరిగిన గురుపాద క
    మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్!!

    @ మీ పాండురంగడు*
    ౧౫/౦౫/౨౦౧౮

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుపాద కమలములు! నమోనమః! 🙏🙏🙏👏👏👏

      తొలగించండి
    2. పాండురంగా రెడ్డి గారూ,
      గురుపాద కమలంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. గురువుగారికి మరియు SeethaDevi Gurram వారికి భక్తిపూర్వక ప్రణామములు ������.

      గురూజీ...గురుపాదకమలమును అని ఏక వచన ప్రబోధముకన్నా ..గురుపాదకమలములు అని పూరించడంలో వెసలుబాటుగలదా ������

      తొలగించండి
    4. కాని సమస్యాపాదంలో 'మలమును' అని ఏకవచనమే ఉన్నది కదా! దానిని మార్చకూడదు.

      తొలగించండి
  28. మలహరుడు!శివుడు!మినుసిక
    గలాడు!జడధారి!గరళకంఠుడు కోరున్
    జలయభి షేకము వర కో
    మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జల + అభిషేకము = జలాభిషేకము' అవుతుంది. యడాగమం రాదు.

      తొలగించండి
  29. ఇలవేంకటరమణుందరి
    గలుషితమగుమనసుతోడ గాంచగనేగ
    న్నలిపిరి నాధునిగిరి,దిరు
    మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తిరుమల మును'...అని పదవిభాగం చేస్తే బాగుంటుంది.

      తొలగించండి
  30. సమస్య :-
    "మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్"

    కందము*

    కలియుగ ప్రత్యక్ష ప్రభువు,
    నిలవేల్పు,దయా పయోధి,నిష్టపు దైవమ్
    కొలువైన ప్రదేశము తిరు
    మల మును గనినంత ముక్తిమార్గము దోఁచున్
    ....................చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'దైవమ్' అని హలంతంగా వ్రాయరాదు. "ఇష్టేశ్వరుడే। కొలువైన..." అనండి.

      తొలగించండి
  31. కోటవారి బాటలో
    తొలగ నహంకృతి ,మీదుగ
    బలపడ భక్తియె మనమున బహు విధములుగా
    తలచగ జనులకు ధరను
    మ్మలమును గనినంత ముక్తికి మార్గముగోచున్!
    🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  32. కందం
    ఇలలో యున్నత మైనవె
    యలంకరణములుగ నొప్పు హరి హృదయమునన్
    గల కౌస్తుభమ్మమరిన క
    మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఇలలో నున్నత..." అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :


      కందం
      ఇలలో నున్నత మైనవె
      యలంకరణములుగ నొప్పు హరి హృదయమునన్
      గల కౌస్తుభమ్మమరిన క
      మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్

      తొలగించండి
  33. చంపకమాల
    ఇల శివుడే నగమ్మనఁగ నేర్పడె నా నరుణాచలమ్ము! కే
    వల స్మరణంపు మాత్రమున భక్తుల కోర్కెల దీర్చు శంకరుం
    దలపుల నింపుచున్ రమణు ధ్యాన సమాధిని యాశ్రమంపు ని
    ర్మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      నిర్మల రమణాశ్రమాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సమాధిని నాశ్రమంపు..." ఆనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణము:


      చంపకమాల
      ఇల శివుడే నగమ్మనఁగ నేర్పడె నా నరుణాచలమ్ము! కే
      వల స్మరణంపు మాత్రమున భక్తుల కోర్కెల దీర్చు శంకరుం
      దలపుల నింపుచున్ రమణు ధ్యాన సమాధిని నాశ్రమంపు ని
      ర్మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్

      తొలగించండి
  34. తలచగవేంకటేశ్వరునిదర్శనభాగ్యములేనిదైనయా
    "మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్
    వలదురసందియంబికనుబావనమూర్తిని గన్నులారగా
    దలపునలోనజూడుమికదన్మయమొందగస్వామిరూపమున్

    రిప్లయితొలగించండి
  35. కలవర మేల మనః క
    శ్మల పరిహార సువిభూతి మానవుల కిలన్
    లలితా దేవీ ముఖ కు
    ట్మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్


    చలిమల చూలి మర్త్యులకు సంతస మీయఁగ నన్నపూర్ణ యై
    వెలయఁగఁ జంద్రశేఖరుఁడు ప్రీతిని నుంచ శిరమ్ము నందునన్
    లలిత వరాణసీ పురి ఫలప్రదమై చను జాహ్నవీయ కో
    మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్త కోటికిన్

    [కోమలము = నీళ్ళు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అద్భుతమైన పూరణలార్యా! నమస్సులు!🙏🙏🙏🙏

      ముఖ కమలముల , కుట్మల దంతముల పోలిక రివాజు! మీ ముఖ కుట్మల ప్రయోగము వినూత్నంగా , సుందరముగా నున్నది! 🙏🙏🙏

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.
      డా. సీతా దేవి గారు నమస్సులు. ధన్యవాదములు.
      ఇక్కడ మల్లె మొగ్గగా కాక విరియుటకు సిద్ధముగా నున్నసౌగంధిక కుట్మలముగా నూహింప దగును. ధ్యాన ముద్రలో కనులు మూసుకొని యున్న యమ్మ వారి ముఖము పువ్వులా గాక మొగ్గగా భావించుట సమంజసమే కదా!

      తొలగించండి
    5. నూటిటి నూరుశాతము సమంజసమే! 🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    6. కవి వరద్వయము మిస్సన్న గారు సహదేవుడు గారికి నమస్సులు.

      తొలగించండి
  36. సలలిత మలపున తలపులు
    వలువలవలె విలువ!భక్తిభావన మనసే
    నలుగక "నాధ్యాత్మికత న
    మలమును గొనినంతముక్తిమార్గముదోచున్":

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      వృత్త్యనుప్రాసతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  37. ఆటవిడుపు సరదా పూరణ:

    స్థలమిది సార్వభౌములు నిజాముల కూకటపల్లిలోనివౌ
    మలినపు కాల్వ నీరము రమారమణీయ తెరాస శుద్ధిచే
    సలలిత భాగ్యనాగరిక సాగరు తోయము నందుజేరు కో
    మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్ :)

    కోమలము = నీళ్ళు
    (శబ్దరత్నాకరము)

    https://www.google.co.in/amp/s/www.deccanchronicle.com/amp/nation/current-affairs/260418/hussainsagar-lake-stench-raises-a-stink.html

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పథ్యధార చాలా బాగుందండీ
      పద్యం లాగానే 👏🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


    3. ఆటవిడుపు పూరణలన్
      నేటి విషయముల పయిన కనికని యగువులో
      జాటరు డమాలు పదముల
      తాట వొలుతురు మన శాస్త్రి తరుణి జిలేబీ

      జిలేబి

      తొలగించండి
    4. భక్తికి రక్తికి ముక్తికి
      శక్తియు సహనమ్ము లేని శాస్త్రిని తరువాయ్
      భుక్తికి జీవించుచు మీ
      యుక్తుల భజియింతునమ్మ యువతి జిలేబీ!

      😊

      తొలగించండి
  38. తలపున జూడుమోయి మన తల్లి ముఖాబ్జము నెర్రనైన త
    మ్ములమున నోష్ఠమున్, మెరయు ముక్కెర, దృక్కులకాంతి, కుందకు
    ట్మలరదనంపు వెల్గు, ప్రకటమ్మగు వామ మరాళ నేత్ర ప
    క్ష్మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్త కోటికిన్.

    రిప్లయితొలగించండి
  39. అలవైకుంఠపురమ్మున
    కొలువై సతినెదనునిల్పి కూరిమి తోడన్
    వెలసిన శ్రీహరి పాదక
    మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్.

    2.కులమతభేదము లెంచక
    కలియుగదైవంబనంగ కామిత మొసగ
    న్నిల వెలసిన హరి చరణక
    మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్.

    3.అలిమేల్మంగాపతినిట
    కొలువంగ తొలగునఘములు కువలయమందున్
    తలచుచు శ్రీవాసుని పద
    మలమును గనినంత ముక్తిమార్గము దోఁచున్.

    4చం:జలమది వారణాశిపురిఁజక్కగ పారుచు నుండు నెప్పుడున్
    గలగలసవ్వడిన్ సతము గానము వోలెను చేయుచుండగా
    కొలిచెడు భక్తకోటికిని కోర్కెలు దీర్చెడి శంభుపత్ని కో
    మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఒకటి రెండు సవరణలు వాట్సప్‍లో సూచించినట్టున్నాను.

      తొలగించండి
  40. రిప్లయిలు
    1. ఇలపై నరుడై పుట్టిన
      యల వైకుంఠ పురవాసి హరినే మదిలో
      దలచుచు రాముని చరణ క
      మలమును గనినంత ముక్తి మార్గము దోచున్

      తొలగించండి
  41. కులమత భేదముల్ గనుచు గుట్రలు పన్నుచు స్వార్థబుద్ధితో
    లలనలు శ్రీలకున్ బెనుగు లాటలు పాపపు కార్యముల్ సదా
    యిల నరులే గదా పరమ హీనులు, శాశ్వత మంచు నెంచిరో
    నిలువని కాయమున్ గనుచు నిక్కమిదే యను బ్రాంతి యందు, కా
    మలము గనంగ ముక్తికదె మార్గము జూపును భక్త కోటికిన్

    (కామలము = మరుభూమి, శ్మశానం )

    రిప్లయితొలగించండి
  42. తలపోయుచుండ దేవుని
    కెలవుదొరకెడు విధము వెతికినపుడు మన దే
    వళమున నిత్యము మను ఆ
    మలమును గనినంత ముక్తిమార్గము దోచున్

    రిప్లయితొలగించండి
  43. లలిత లతాంతస్పర్శకు
    సలలిత సిందూర వర్ణ చందపు కాంచీ
    తల కామాక్షీ పాద క
    మలమును గనినంత ముక్తి మార్గము దోచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవికిరణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వర్ణ చందపు'...?

      తొలగించండి
  44. ఇలుజేరినంత తిని మెతు
    కులు నాలుగు విశ్రమింపఁ గోమలి వ్రేళ్ళన్
    జిలుకలుగా నలరారు త
    మలమును గనినంత ముక్తి మార్గము దోచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఊకదంపుడు గారూ,
      బహుకాల దర్శనం.. సంతోషం!
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  45. *15.5.18*
    ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    మలమును గనినంత ముక్తి మార్గము దోఁచున్

    సందర్భము: బ్రహ్మ గడిగిన పాదము.. అంటూ.. బలి తల మోపిన పాదము.. అంటూ.. అన్నమాచార్యులు భక్తి పారవశ్యంతో శ్రీ వేంకటేశ్వరుని ప్రార్థిస్తున్నారు..
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    నలువయుఁ గొలిచిన యట్టిది...
    బలియొక్క తలపయి మోప
    బడి నట్టిదియున్...
    గలనైనను నీ పాద క
    మలమును గనినంత ముక్తి మార్గము దోఁచున్

    మరొక పూరణము..

    మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ
    జూపును భక్తకోటికిన్

    సందర్భము: ఒక తిండిపోతు యెలా తెగ తిన్నాడో చూడండి. ఆ విందు భోజనంలో యెన్ని వున్నాయో అన్నీ ఆరగించినట్టుంది. అదీ రాత్రిపూట. అలయక... అలసిపోకుండా..
    మీరూ అలా ఓపికగా మెక్కగలిగిన ట్టైతే పొద్దున్నే అద్వైతమే సిద్ధిస్తుంది. (రాత్రి ద్వైత మంతా తెల్లవారేటప్పటికి అద్వైతమై తీరుతుంది.) అనుమానం లేదు. ఆచరణలోనే తేలాలి.
    రాత్రి వేర్వేరుగా వున్నవి పొద్దున్నే ఒక్కటైపో తున్నాయి కదా!
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    అలయక లడ్లు భక్ష్యములు
    నన్నము పూరి జిలేబి యాలుబాత్
    వెల గల పప్పు పచ్చడులు
    వేపుడులున్ వడలున్ రసంబు కూ
    రలు నెయి సాంబరున్ పెరుగు
    లన్ దెగ మెక్కుడు రాత్రి, వేకువన్..
    మలముఁ గనంగ ముక్తి కదె
    మార్గముఁ జూపును భక్త కోటికిన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  46. డా.పిట్టాసత్యనారాయణ
    కలితమె కర్మచోదితము గాసిలి జెందకు బ్రహ్మ రాతకౌ
    మెలికల గాంచు శోధనల మీటిన 'గౌతము' బాట వేదమౌ
    తలగల జీవి కెప్పటికి తప్పదు పాపము దుష్ట యోచనా1
    మలము గనంగ ముక్తికదె మార్గము జూపును భక్త కోటికిన్
    (సమ్యక్ విచారమునకు శత్రువు.కలితము, పొందినది,శ.ర

    రిప్లయితొలగించండి
  47. డా.పిట్టాసత్యనారాయణ
    కలలోనైనను మరువక
    సలలితముగ లోపములను సరిదిద్దంగన్
    ఇల బ్రాహ్మీ ఘడియల హృది
    మలమును గనినంత(ధ్యాన సమయములో) ముక్తి మార్గము దోచున్

    రిప్లయితొలగించండి
  48. కలియగ సాధు పుంగవుని కారణ జన్ముని కాకతాళిగన్
    వలవల నేడ్చి పూర్వమున వందల జేసిన పాపకృత్యముల్
    కలవరమౌచు మాపుకొన కష్టము నెంచక మానసమ్మునన్
    మలముఁ గనంగ ముక్తి కదె మార్గముఁ జూపును భక్తకోటికిన్

    రిప్లయితొలగించండి