24, మే 2018, గురువారం

సమస్య - 2686 (అంది యందని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"అంది యందని యందమే విందొసంగు"
(లేదా...)
"అందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా"

141 కామెంట్‌లు:

  1. అమిత్ షా ఉవాచ:

    "అంధులందరు జూడగ బంధులైరి
    నందులును పందులెల్లరు మందు త్రాగి
    కంది పోయిన మోముతో చిందు లాడ...
    అంది యందని యందమే విందొసంగు" :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమితానందకరమ్ము పద్యమిది సత్యంబిద్ది ముమ్మాటికిన్ !

      శాస్త్రి గారూ నమోనమః.. 🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  2. కందెనట మోము చెప్పగ కన్నులార
    యంది యందని యందమే విందొసంగు!
    పందె ములనొడ్డి చూసిరి భామ లనట
    యంది నన్ మేలగున యని యవ్వనులట !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కన్నులార। నంది యందని...' అనండి.

      తొలగించండి
  3. విరిసి విరియని మమతలు వేన వేలు
    తెలిసి తెలియని ప్రేమకే విలువ మిన్న
    కనులు కన్నులు కలసిన కలత పడగ
    అంది యందని యందమే విందొ సంగు

    రిప్లయితొలగించండి



  4. పందియముల్ జిలేబులన, భామల జూచుచు చేసి రంటనే
    నందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా? సఖా
    సందియ మేల నందినను నందక పోయిన నా లలామలే
    డెందపు సేద దీర్చు దురు, డెప్పకు డెప్పకు నన్ను మిత్రమా !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సందియమేల యందినను...' అనండి.

      తొలగించండి
  5. డా. పిట్టా సత్యనారాయణ
    "అంది యందని యందమే విందొసంగు"
    ననుచు ముందున్న యందము నరయకుంద్రు
    తప్పటడుగది యా "దేవదాసు"దారి
    నెన్న నందవు తృప్తియె సున్న యగును

    రిప్లయితొలగించండి
  6. మైలవరపు మురళీకృష్ణ

    అందమనంగ వస్తువులనన్నిట దోచుచునున్న బ్రహ్మమే
    యందము ! శాశ్వతమ్మది ! మహాత్ములు గాంచిరి ! ద్వైతదృష్టితో
    పొంద లభింపబోదు , పరిపూర్ణత గల్గిన దక్కు , నట్టిదౌ
    యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  7. డా.పిట్టాసత్యనారాయణ
    బందివి నీవు ప్రస్తుతపు బాటను జూడుము కష్ట పుంజముల్
    ముందర నెన్నొ యుండు నట మూర్ఛయె మేలనిపించు నాగతం
    బందదు, పొందు యందమునె పాడిగ నమ్ముము గాని తప్పిదే
    "అందియు నందరానిదగు నందమె విదొసగున్"గదా, సఖా!
    (నేటి యువత "నేను నిన్ను ప్రేమించడం లే"దన్నా ఆ యువతిని వెంబడించి యాసిడ్ దాడులకు పాల్పడుచున్న నేపథ్యంలో విజ్ఞులు వారికివ్వ వలసిన సలహా నూహించి;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పొందు మందమునె' అనండి.

      తొలగించండి
  8. రాధ తలపు
    నందనందన!గోపాల!నళిన నేత్ర!
    లీలగానిట్లు దోబూచు లేలనోయి?
    జాలిఁజూపుము బేలను జాలమేల
    నంది యందని యందమే విందొసంగు

    రిప్లయితొలగించండి
  9. తే: చెలి తనంత తానె దరికి చేర చులక
    నౌను. దాచిన యందమే యనవరతము
    మోజు కలిగించు ప్రియునకు, పుడమిపైన
    నంది యందని యందమే విందొసంగు

    రిప్లయితొలగించండి
  10. (తీర్థయాత్రాపరుడైన అర్జునుడు ద్వారకానగరంలో మిత్రుడు మైత్రేయునితో)
    చందురకావిపావడ పసందుగ దాల్చిన సుందరాంగి;సత్
    చందమునందు సందడిలు సాహితిబోలిన కోమలాంగి;గో
    విందుని ముద్దుచెల్లెలగు విశ్వమనోజ్ఞ సుభద్రకన్యదౌ
    అందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!

    రిప్లయితొలగించండి
  11. అంది వచ్చిన సులువుగ నలుసె గాని
    సుంత యానంద మీయదు సుఖము లేదు
    యవధి మీరిన స్వేచ్ఛయు అందగించ
    దంది యందని యందమే విందొసంగు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేదు + అవధి' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. 'సుఖము దొరుక। దవధి మీరిన..' అందామా?

      తొలగించండి
  12. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    "అంది యందని యందమే విం దొసంగు"

    సందర్భము: అంద మే నందము.. అనగా మేను అందము.. అందగా.. అని.
    మేను అందము.. అంటే శారీరకమైన సౌందర్యం అని. అది అందుకోగలిగిన వాడు ఎప్పుడో ఒకసారి "ఇంతేనా!" అనుకొని తీరుతాడు. అనగా నిర్లక్ష్యం చేస్తాడు. ఎందుకంటే ఇంద్రియాలకు తృప్తి చెందే లక్షణం ఎప్పుడూ లేదు కదా!
    శరీర సౌందర్యం ఒకసారి అందినట్టే వుండి అందకుండా పోతూ వుంటే దీని తీ రింతే అని తెలుసుకోగలిగి ఆత్మ సౌందర్యం వైపు క్రమంగా ఆకర్షింపబడుతాడు. అదే క్రమ పరిణామంలో మానవు డెదుగవలసిన విధానం. అందుకే గోపికలకు కృష్ణుడు వియోగాన్ని కల్పిస్తాడు.
    అందుతున్న ఆత్మ సౌందర్యమే జీవునికి నిజమైన విందు చేస్తుంది. అదే ఆత్మానందం.
    ఒకసారి ఆ విందులో రుచి మరిగితే తక్కిన రుచు లన్నీ ఇక ఆనవు. క్రిందకు వెళిపోతాయి. భౌతిక సౌందర్యాలు బంధించలేకపోతాయి.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    అంద మే నంద "మింతెనా!" యందు; రంది

    యందనపు డాత్మ సౌందర్య మందుకొందు;

    రదియె యిచ్చు నాత్మానంద మన్న విందు..

    "నంది యందని యందమే విం దొసంగు"

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. వెలుదండ వారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  13. మిత్రులందఱకు నమస్సులు!

    ["ప్రేయసీ! నీవు నాకు అందినను, నీదు తండ్రిమాత్రము నిన్ను నాకు అందనీయుట లేదు! నేను నిన్నెట్టుల నందుకొనఁగలను సఖీ?" యనిన ప్రియునితోఁ బ్రియురాలు "ప్రియా! యందినట్టి యీ నా చేయి నందుకొని, పెండ్లాడినచో, నీ యందియు నందరానిదగు నందమె యందఱకుఁ గనువిందొనర్చును గదా సఖా! కావున, నా పెద్దలఁగూర్చి యాలోచింపక, రుక్మిణినిం గృష్ణుఁడు చేపట్టినట్టుల నన్నుఁ జేపట్టుము! హాయిగ నానందముగ జీవించునట్టి మననుం జూచి, యందఱును నానందమందఁగలరు!" అని ప్రేయసి, ప్రియునకు సలహా నొసఁగిన సందర్భము]

    "అందితి వీవు! కాని, నిను నందఁగనీయఁడు నీదు తండ్రియే!
    యందియు నందరాని నిను నందుకొనంగను నెట్టులే సఖీ!"
    "యందిన నాదు చెట్టఁ గొని, యందఱకుం గనువిందు సేయ, నీ
    యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా!"

    రిప్లయితొలగించండి
  14. రేపును తలచు నేడది గడుచు రేపు నేడై
    మనసది కలచు
    దూరమునదె ఆర్తిగ పిలుచు సంగతిని
    నీవొల్లక నడుచు
    కలలవి కనుము వేయి తలలుగ నిజమవి
    కావుగ భిన్న ముఖా
    అందియు నందరానిదగు నందమె విందొసగున్
    గదా సఖా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఎట్టెబ్బోడా

      ఈ వాక్యానికి అర్థ మే మి ?


      దూరమునదె ఆర్తిగ పిలుచు సంగతిని
      నీవొల్లక నడుచు

      అనగా నేమి ?

      జిలేబి

      తొలగించండి


    2. కొంతవరకు కిట్టింపు :)


      తొందర దేల రేపటికి తొంగలి దాని జిలుంగు దానిదే!
      కొందలమేల నో మదిని కోరిక తీరక బోవ మిత్రమా!
      డెందము బోవ స్వప్నమున డీనపు కైపుల నిక్కమయ్యెనో
      నందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!

      జిలేబి

      తొలగించండి
  15. తే.గీ.
    సినిమ తెరమీద నాయిక చిత్రమెంత
    యందముగనుండి మనసుకు హాయి గొల్పు
    చేత స్పృశించ బోవగ చిక్కదంట
    యంది యందని యందమె విందొసంంగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మల్లేశ్వర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      స్పృశించ... అన్నచోట గణదోషం. 'స్పృశియింప బోవగ' అనండి.

      తొలగించండి

  16. మా అయ్యరు గారి పల్కు :)

    ముద్దు లొల్కు జిలేబిని మొగదలగని
    యంది యందని యందమే విందొసంగు
    నో యని మధనపడి తాళినొకపరి ముడి
    వెట్టి దరిజేర్చి జూడ గుభిల్లె మదియు :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      ఆఖరుకు అయ్యరు గారిని పూరణలోకి లాక్కొచ్చారు. బాగుంది. మీకు, అయ్యరు గారికి అభినందనలు.
      அய்யர் சாமீ வணக்கஂ!

      తొలగించండి
  17. ఆకసంబు న జాబిలి యం ద మగును
    దరి కి జేరి యు పరికింప వర లు చుండు
    రాళ్ళు ర ప్పలుగా న ద్ది ర హి తొ లం గి
    అంది యందని యందమే విందొ సంగు

    రిప్లయితొలగించండి
  18. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2686
    సమస్య :: అందియు నందరాని దగు నందమె విందొసగున్ గదా సఖా!
    సందర్భము :: ధ్వన్యాలోకము అనే గ్రంధంలో కవిత్వం ఎలా ఉండాలి? అనే విషయం గుఱించి చెబుతూ
    ‘’ నో ఘూర్జరీ స్తన ఇవాతితరాం నిగూఢః
    నాంధ్రీ పయోధర ఇవాతితరాం ప్రకాశః।
    అర్థం గిరా మపిహితః పిహితశ్చ కశ్చిత్
    సౌభాగ్యమేతి మరహట్ట వధూ కుచాభః।।
    అని వర్ణించియున్నారు. పై శ్లోకానికి అనువాద పద్య మన్నట్లు

    ఘనతర ఘూర్జరీ కుచయుగక్రియ గూఢము గాక, ద్రావిడీ
    స్తన గతిఁ దేట గాక, యరచాటగు నాంధ్రవధూటి చొక్కపుం
    జనుగవ బోలి గూఢమును చాటుదనంబును గాక యుండఁ జె
    ప్పిన యదిపో కవిత్వ మనిపించు, నగిం చటుగాక యుండినన్.

    అని అంటూ కవిత్వం ఎలా ఉండాలి అనే విషయాన్ని పూర్వ కవి ఒకరు విశదీకరించి యున్నారు. కాబట్టి అందీ అందని అందమే (కావ్యార్థమే)విందును చేకూరుస్తుంది అని వివరించే సందర్భం.

    అందము ఘూర్జరీ స్తనము లట్లు నిగూఢము గాక, పూర్తిగా
    నందము నారబోయు ద్రవిడాంగన సుస్తన రీతి గాక, మా
    కంద లతాంతరస్థమగు కాయ వలెన్, కనిపించనట్లుగా
    ముందుగ కొంత కన్పడెడి ముగ్ధతరాంధ్ర వధూటి సుస్తనం
    బంద; మిటుల్ గనన్ మెఱుపు నౌచు తళుక్కున దోచు కైత దా
    *నందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (24-5-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవధాని గారి పూరణ అద్భుతంగా ఉన్నది! సమస్యా పాదము చూడగానే నాకు ఘనతర ఘూర్జరీ కుచ పద్యం గుర్తువచ్చింది! 🙏🙏🙏🙏

      తొలగించండి
    2. 💐👍👌💐
      బైచరాజు వేంకటనాథుడిదీ పద్యము.(ఘనతర ఘూర్జరీ....)

      తొలగించండి


    3. ఇవ్వాళ కోట వారు డబల్ సిక్సరే ! వాహ్ వాహ్ ! దీనికి గళమూ వుందాండీ ?


      జిలేబి

      తొలగించండి
    4. నిజమేనండీ. నమో నమః. గూగుల్ లో అల్లసాని వారి పద్యమని కూడా తెలిపియున్నారండీ.

      తొలగించండి
    5. సహృదయులు జిలేబి గారూ! హృదయపూర్వక ప్రణామాలండీ. నాపై మీకు గల అభిమానమునకు ధన్యవాదాలండీ. ప్రతిరోజూ వాట్స్ యాప్ లో నా పద్యానికి గళమును అందజేస్తున్నానండీ. బ్లాగులో ఆడియో పెట్టడం నాకు తెలియదండీ. కోట రాజశేఖర్

      తొలగించండి
    6. రాజశేఖర్ గారూ,
      మనోహరమైన పూరణ. అభినందనలు.
      **************
      జిలేబీ గారూ,
      బ్లాగులో ఆడియో ఫైల్ పెట్టే టెక్నిక్ ఉంటే తెలియజేయండి.

      తొలగించండి
  19. వింది కన్నియ రమ్మన విందు జేయ
    అంది నమ్మగ నాధుడే నంద గాడె
    బంది నవ్వగ కోరిన బంధ మేగ
    అంది యందని యందమే విందొసంగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరలక్ష్మి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వింది' అన్నది వ్యావహారికం.

      తొలగించండి
  20. చట్టసభన బలిమిలేక సడలు పదవి
    అంది యందని యందమే విందొసంగు
    ప్రత్యర్థి సభికులకెపుడు, వారు జరుపు
    వేడుకలరీతి కనులకు విందొసంగు

    అందమే=విధమే

    రిప్లయితొలగించండి

  21. కనుల ముందర గన్పట్టు కన్యకన్న
    కలల సుందరి యెంతయో కమ్మగుండు
    నంది యందని యందమే విందొసంగు
    చేతికందిన దంతయు చేదుగుండు!

    రిప్లయితొలగించండి
  22. పాలబుగ్గల పసివాడి పసిడి పలుకు
    పల్లవించిన నవ పల్లవంపు సొగసు
    చేతి కందక నూరించు చిగురు బోడి
    యంది యందని యందమె విందు సేయు

    రిప్లయితొలగించండి
  23. సమస్య :-

    "అంది యందని యందమే విందొసంగు"

    *తే.గీ**

    తళుకులీనెడి నాకాశ తారలన్ని
    రాత్రి వేళన మురిపించు,రమ్యపరచు
    దరికి జేరగ భస్మమౌ తనువు, జూడ
    అంది యందని యందమే విందొసంగు
    ... ...............✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తళుకు లీనెడి యాకాశ...' అనండి.

      తొలగించండి
  24. తెలిసి దెలియని బాల్యమే తీపియొసగు
    విరిసి విరియని పూవులె హరుసమిడును
    అంది యందని యందమె విందొసంగు
    ననుచు దెల్పెను జగతికి మనసుకవియె!!!

    రిప్లయితొలగించండి
  25. అందిన నన్ని యందముల నందుల పొందిన దెల్ల మృగ్యమే,
    అందని వైన నందముల నందుకొనన్ వలె నన్న దుగ్ధయే,
    యందము లక్ష్యమై నపుడె యయ్యెడ నిట్లగు, లేక శూన్యమే,
    యందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!.
    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  26. అందియందనియందమేవిందొసంగు
    నక్షరాలనిజముగదయదియమనకు
    నందనటువంటిద్రాక్షకైయాశపడుట
    నైజమేగదధరణినినరులకార్య!

    రిప్లయితొలగించండి
  27. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

    ప్రేయసీ ప్రియుల శృంగార సంభాషణ :--
    ........... ............ ........... .............


    సుందర మైన నీ మొగము జూచిన యంతనె సిగ్గుచెందుచున్ ,

    జందురు డేగె తా మొగులు చాటున కంచు , ముసుంగు దాల్చితే

    సుందరి | తీసివేయు మిక | జుంబన మెట్టు లొనర్తునే సఖీ ?

    ................................................................................................


    అందియు నందరాని దగు నందమె విందొసగున్ సఖా !

    తొందర యేల నా సొగసు దోచగ నో దొర ? తాలు మించుకన్ |

    ముందుగ బెండ్లి కావలయు | నా సొబ గంతయు నారబోయుచున్

    విం దొనగూర్చెద | న్నిటుల వేగిర పాటును పొంద నేటికన్ ?

    రిప్లయితొలగించండి
  28. ఈ రోజు శంకరాభరణం సమస్యకు
    నా రెండవ పూరణ. సమస్య చివరి పాదం లో


    అందము లందు నెన్న దగు నందము మోక్షమె లక్ష్యమై, సదా
    నందముఁ గల్గుఁ గాక, ధర నందము లన్నియు తత్క్షణమ్మె, గో
    విందుని పొందు గోరుటయె విందులు భోగ్యము లౌను గాని, "యే
    యందియు నందరాని దగు నందమె విందొసగున్," గదా సఖా!

    రిప్లయితొలగించండి
  29. తేటగీతి
    కుందనపు బొమ్మగఁ గనుల విందొనరఁగ
    వెంటబడుచుఁ బెళ్లాడెను వెర్రివాడు
    మోముఁ దొలఁగఁ బూత కలికి భూతమయ్యె
    నంది యందని యందమే విందొసంగు!

    రిప్లయితొలగించండి
  30. కన్ను మీటుచు కవ్వించు కలికి జేర
    సిగ్గు లొలికించి దరితాను జేరనీక
    దూరముంచుచు మురిపించు నీరజాక్షి
    యంది యందని యందమే విందొసంగు

    రిప్లయితొలగించండి
  31. ముందర పెండ్లిచేసికొనుమోయి ప్రియా తదనంతరమ్మునన్
    సుందరమైననీదు చెలి సొంపులనన్నియు చూడవచ్చురా
    తొందరవద్దు నిగ్రహముతోడ మెలంగుము కోపమేలరా
    యందియు నందరానిదగు నందమె విందొసఁగున్  సఖా

    రిప్లయితొలగించండి
  32. చందురు వంటి మోముగల చక్కని చిన్నది యేక వేళయన్
    సుందరి గాంచి మొహమున సోలిన సేతు పతిన్ మరల్పనే
    చందము బల్కె మిత్రుడిటు చాలును తాపము లోకముందున
    న్నందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా

    రిప్లయితొలగించండి
  33. అకట భూపుత్రి మనసీయ దనుచు వగచు
    రావణుని గాంచి పలికెను రాక్షసుండు
    నైన మిత్రుండు, వసుధలో నబ్బురముగ
    నంది యందని యందమే విందొసంగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదం చివర 'ఏకవీర యన్' అని ఉండాలనుకుంటాను.

      తొలగించండి
  34. సుందరంపు రజత భర్మ కందుకమ్ము
    మంద వాయు చలిత మేఘ మందలమ్ము
    నిందు నందున్న నందఁడు చందురుండు
    నంది యందని యందమే విందొసంగు


    సందె జపంబు మాని కను స్వప్నము నిచ్చలు నంద మందగన్
    మందుఁడు తూఁగు నూహల విమానము నందున మందహాసుఁడై
    చిందులు వేయు హర్షమునఁ జెప్పఁగ జోస్యుఁడు జాతకమ్మునే
    యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
  35. అందల మందుజేరి యట అద్భుత వెన్నెల కాంతులీనెడిన్
    జందురు డందగాడనుచు సత్కవు లెల్లరు జెప్పినంత నే
    నందిన గ్రంథముల్ జదువ నచ్చట కొండలు బండరాలనన్
    నందియు నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. పైట చెదరిన వేళన పరువము మది
      లాగు సూదంటు రాయిలా లలితముగను
      కొంగు తొలగించి చూపినన్ గోమలాంగి
      వెగటు బుట్టు నిజముగాదె విమల మతికి
      యంది యందని యందమె విందొసంగు

      తొలగించండి
    3. విరించి గారూ,
      మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  36. అందియునందరానిదగునందమె విందొసగున్గదాసఖా
    యందము జూడగామనము హర్షమునొందుచుజూరగొందుమా
    యందమునందరానిదయి యారడివెట్టినవిందులేవియు
    న్బొందకజీవితంబికనుమోడునువారినయట్లయుండుసూ

    రిప్లయితొలగించండి
  37. సుందరి! నీదు రూపుఁగని చొక్కుచు నుంటి. తపమ్ము మాన్పుమా!
    యందగఁజేసి నీసొగసు హర్షముతో దరిఁజేరి యిచ్చతో
    తొందర కూడదయ్య విను. దూరము తప్పదు కొంతకాల మీ
    యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా!

    రిప్లయితొలగించండి
  38. పొందిక యైనదౌ సతిని, పొందియు
    చక్కని పుత్రపుత్రికల్
    బంధువు లెల్ల మెచ్చగను బంగళ, కారును, సెల్లుఫోనుల
    న్నందియు, నందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా!
    సందియ మెందుకోయి పర సంపద
    మిన్నగు నెల్లవారికిన్!

    పొరుగింటి పుల్లకూర రుచి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుందర మైన కావ్యమన జూడగ మెండగు వర్ణనల్లటన్
      సందడి జేసినన్నదియె సత్కృతి కాదనెఱంగుమో ప్రియా!
      యందును మర్మగర్భమున హాస్యము నీతిపరోక్షమై సదా
      యందియు యందరానిదగు నందమె విందొసగున్ గదా సఖా

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *************
      విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వర్ణనల్ + అటన్' అన్నపుడు ద్విత్వలకారం రాదు.

      తొలగించండి
  39. విజయుడి తిరస్కారముతో భంగ పడిన ఊర్వసి మనోగతము :
    ****))((****
    అంది వచ్చిన వారల పొందు చేదు
    యంద రాని దాని పయిన నాదరమ్ము
    పెరటి చెట్టు మందది యేమొ ప్రియము కాదె
    యంది యందని యందమె విందొసంగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేదు + అందరాని' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.

      తొలగించండి
  40. సిగ్గుల సింగారి సిరిమల్లె జడయందు
    గంధబంధాలట చిందులేయ!
    చూడవచ్చినవారి చూపులకందిరి
    అందాలహరివిల్లు చందమట్లు!
    పాటమాటలువిన పాడిగాదనియెంచి
    ఊహలనుయ్యాలలూగియాగి
    నవ్వులురానీక కవ్వింతలణగించ?
    పళ్లెమందునపళ్లు బలుకకున్న
    అందియందని యందమేవిందొసంగు
    కందిపోనట్టి కన్యపసందురూపు
    వరునివయ్యారమందున వలపురేప?
    పెళ్లిచూపులునిలచె నాకళ్లముందు!

    రిప్లయితొలగించండి
  41. ఆటవిడుపు సరదా పూరణ:
    (Tom speaking about Jerry)

    పొందుగ కల్గు వెల్పలగ పోరును కాచుచు వేచియుండగా
    సందడి లేకయే వెనుక చట్టున తోకను పీకుచుండి పల్
    సుందర రూపుడై మెలగి చుప్పుగ గుమ్మని పారిపోయి నా
    కందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      టామ్ అండ్ జెర్రీల ప్రస్తావనతో మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  42. స్వగతం:
    (డా. విష్ణు నందన్ డిసెంబర్ 16, 2010 10:10 AM

    "శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశః కారణం
    నటదంగీకృత వాగ్విలాస చరణం నానార్థ సంపూరణం
    చరదత్యద్భుత సత్కవీశ్వర గణం సాలంబనం ' శంకరా
    భరణం ' నిత్యమహం స్మరామి కలవాణీ దివ్య సింహాసనం!!!")


    ఇందొక ప్రాసదోషమన యిందొక దుష్ట సమాసమోయనన్
    క్రిందను మీదనున్ పడుచు క్రీడగ నేర్చుచు పద్యవిద్యనున్
    కందము వ్రాయలేకనిట కందివరేణ్యుని జాలినొందు నా
    కందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా!

    http://kandishankaraiah.blogspot.in/2010/12/170.html?m=1

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సార్:

      మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. శంకరాభరణం గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని విష్ణునందన్ గారి శ్లోకాన్ని quote చేశాను. అంతకు మించి మరేమీ దురుద్దేశం లేదు.

      🙏

      తొలగించండి
  43. కర్మ లొనరించ నీ కధికార ముండు
    నెన్న డైన ఫలము లందు సున్న సుమ్ము
    కాకు వాటి ఫలములకు కారణమ్ము
    నుంచకు మకర్మ లందాస కొంచ మైన.......శ్రీకృష్ణ. సూ.సుధా. 2.47.


    మూలము:
    కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన |
    మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగో౽ స్త్వకర్మణి ||......శ్రీమద్భగ. 2.47.

    రిప్లయితొలగించండి
  44. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  45. ఇందును నందునుం గలుగు నెందుకు సందియ మిందు నుండు వా
    డందు గలండొ లేడొ యని యందరి డెందము లందు నుండు నా
    యిందిర యందగాడు గమనించుము పొందియు పొందలేని వా
    డందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వృత్యనుప్రాసతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది! అభినందనలు మిస్సన్నగారూ!🙏🙏🙏🙏

      తొలగించండి
    2. మిస్సన్న గారూ,
      ఆలంకారిక రచనలో మిస్ కాని మిస్సన్నలు మీరు. మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  46. సందియ మొక్కటిన్ గలదు సాంబుని దేహపు టర్థభాగమున్
    బొందితి వెట్లొ జెప్పగదె పుష్కరనాభ సదా శివార్చనల్
    విందగు మానసంబునకు వీడెను మన్మధు చేష్టితంబుచే
    నందియు నందరానిదగు నందమె విందొసగున్ కదా సఖా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రవికిరణ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సందియ మొక్కటే గలదు...' అనండి.

      తొలగించండి
  47. గందర గోళమౌ నుడుల గాఢపుటూహల మేళవింపుగా
    చిందర వందరై చపల చిత్తపు వ్రాతల చీదరింపుగా
    తొందర మీరగా మదిని తోచిన రీతిని వ్రాయుపద్యముల్
    సందడి జేయగా తుదకు సత్కవితామయ కావ్యమందునన్
    నందియు నందరానిదగు నందమె విందొసగున్ సఖా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏🙏🙏

      తొలగించండి
    3. నాల్గవ పాదం చివరలో
      సత్కవితామయ కావ్యకన్యదౌ
      యని చదువ ప్రార్ధన!

      తొలగించండి
  48. చిందులాడెను బాలిక చిలిపిగాను
    అందమైన నాట్యమలరె నభినయమ్ము
    కన్ను పలుకు కావ్యములెన్నొ కాలి నొదుగు
    అందియం దని యందమే విందొసంగు ౹౹

    రిప్లయితొలగించండి
  49. సింహము వనిలో కట్టెనా చీర నెపుడు,
    ఒంటె దాల్చదెడారిలో ఓణి నెపుడు,
    కుక్క తీయదు జుట్టులో చిక్కు నెపుడు,
    మేక పూయునా గంధంబు మెడకు చుట్టు,
    కోతి కప్పునా చనులపై కూసమెపుడు,
    బాతు ముఖముపై పులుమునా భస్మ మెపుడు,
    నెమలి కాటుక దాల్చదే నేత్రములకు,
    కల్పనమ్మది,కలుగదు కామ వాంఛ
    దిసమొ లను కాంచి నా ప్రతి దినము, నరులు
    చూడ గోరుదు రెప్పుడు సుద్యు పాస్య
    నగ్న దేహంబు నంతయు , సెగ్గు గలుగు,
    రోజు జూచినంత తొలగు మోజు కొన్ని
    నాళ్ళ లోన. సత్యమిది యే నమ్మ వలయు
    గుప్పెటను మూసియుంచిన గుట్టు గలుగు
    మూసి యుంచిన దేదియు పాసి పోదు
    అంది యందని యందమే విందొసంగు




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      అబ్బో... పెద్ద పట్టికనే ఇచ్చారే! బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  50. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    అందియు నందరాని దగు నందమె
    విందొసఁగున్ గదా సఖా!

    సందర్భము: శ్రీ రంగం సమీపంలో ధనుర్దాసు ఒక మల్ల యుద్ధ విశారదు డుండే వాడు. ఆతని ప్రేయసి హేమాంగి. ఆమె కన్ను లెంతో అందమైనవి.
    కావేరీ తీరాన శ్రీ రంగనాథునికి వైభవంగా తిరుమంజన మహోత్సవం జరుగుతున్నది. సౌంద ర్యారాధకుడైన ధనుర్దాసు హేమాంగి కన్నులు వాడిపోతా యేమో నని ఎవ రే మనుకున్నా లెక్కచేయక ఆమె పక్కనే నడుస్తూ ఆమెకు గొడుగు పట్ట సాగాడు.
    శిష్యులతో కలిసి వెళుతున్న శ్రీమద్రామానుజుల వారు శిష్యుల నడిగి యతని విషయం తెలుసుకొని తన వద్దకు పిలిపించుకున్నాడు. అడిగినాడు. "ఎవ రే మనుకుంటే నా కేం?" అన్నా డతడు. "ఇంతకన్న అందమైన కండ్లు చూపిస్తాను సాయంత్రం వస్తావా!" అన్నారు స్వామి వారు.
    "ఇంతకన్న అందమైన కండ్లీ లోకంలోనే వుండవు. ఉంటే నేను వాటికి జీవితాంతం దాసు ణ్ణవుతా" అన్నాడు ధనుర్దాసు.
    సాయంత్రం రంగనాథుని స్మరించి పవిత్ర కమండ లూదకంతో స్వామివా రాతని కన్నులను తుడిచారు.అతనికి శ్రీ హరి నేత్ర కమలాలు దర్శన మయ్యాయి. ఆనంద బాష్పా లాగలేదు. అతని మోహ మంతా నశించిపోయింది. స్వామివారికి పాదాక్రాంతుడై దాసుడై పరమ భాగవతోత్తము డైనాడు.
    "నీ కన్నులకంటె కోటి రె ట్లందమైనవి నారాయణుని నయన పద్మము" లన్నాడు దాసు. ఆతని ప్రేయసి "అందీ అందని అందమే విందు గూర్చును సుమా!" అన్నది.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "అందముఁ జిందు నీ కనులె
    యన్నిటి కన్నను మిన్న యంచు నే
    నెందుకొ భ్రాంతిఁ జెందితిఁ గదే!
    హరి నేత్ర సరోజ శోభ యే
    మందును? కోటి రె ట్లధిక
    మౌ" ననె దాసు; మృగాక్షి పల్కె ని
    "ట్లందియు నందరాని దగు
    నందమె విం దొసఁగున్ గదా సఖా!"

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 👌👏🙏🙏🙏

      కంజకంజదళాక్షులగనక కాగల భక్తులు భూమినుందురే

      తొలగించండి
    2. డా. వెలుదండ వారూ,
      ధనుర్దాసు ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి



  51. 1.నిండు జాబిల్లి యగుపించు నింగియందు

       తాకి ముద్దాడు నంతటి తపన కలుగు

        అందు కొనగలేమనిదెల్సి నప్పటికిని

        అంది యందని యందమే విందొసంగు


    2.వస్తువైనను వెలచల వలువలైన

      మనము తెచ్చుకొన్నవెపుడు మదికి తృప్తి

     నీయక పరుల చెంతవి యున్న నిష్టమగును

      అంది యందని యందమే విందొసంగు.


    3.హద్దులందున్న నేదైన ముద్దగునిల

     హద్దు దాటిచరింపగ హాని కలుగు

     ననెడు పెద్దల మాటల నాలకించు

      మంది యందని యందమే విందొసంగు

    రిప్లయితొలగించండి
  52. ఉత్పలమాల
    అందము చందమున్ గలిసి యౌవన శోభల వెల్గు సుందరీ! 
    సందిట జేర్చినిన్ను మెడ సందున ముద్దిడ బోవ జారుచున్
    యందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా! 
    ముందర పెళ్లి వేదిపయి ముచ్చట దీరఁగ జూడమందువే!

    రిప్లయితొలగించండి
  53. .డెందెము చిక్కె నీపయిన ఢీకొని ముద్దుల నాడగా తమిన్
    గొందలమున్నిటన్ కలిగెకూరిమి హెచ్చుచు నుండ వచ్చితిన్
    సుందరియైన నేనిపుడు సోయగ మెల్లను కాన్కగా నిడన్
    అందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా

    5.మందముగాను వీచెనిట మారుత మాతని జూడగా మనం
    బందున కల్గె కూరిమియు నత్యధికంబుగ చూడగా నిదు
    ల్లంబునకింకతాపమువిలాపము హెచ్చెను ముద్దిడంగనా
    కందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మీ పద్యాలపై నా సమీక్షను వాట్సప్‍లో చూడండి.

      తొలగించండి
  54. క్రొవ్విడి వెంకట రాజారావు:

    విరిసి విరియని పుష్పమ్మె పరవశమిడు
    తెలిసి తెలియని డెందమె నలిని పెంచు
    పిఱుదులను దాటి దాటని వేణి మెఱయు
    అంది యందని యందమే విందొసంగు

    రిప్లయితొలగించండి
  55. వందల కుక్కలన్ కులుకు పావుర జంటల వీధివీధినిన్
    చందపు బర్రెలన్ కనుచు చందర శేఖర భాగ్యనగ్రినిన్...
    పందుల కాకులన్ గనక బారులు తీరెడి గార్దభమమ్ములన్...
    అందియు నందరానిదగు నందమె విందొసఁగున్ గదా సఖా!

    రిప్లయితొలగించండి