27, మే 2018, ఆదివారం

సమస్య - 2689 (ఎలుకయె కడు విక్రమించి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"
(లేదా...)
"ఎలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్"

105 కామెంట్‌లు:



  1. ఎలుకలగుచుండు నపుడపు
    డులావుగా నసురుల వలె డుండుకలగుచున్
    బలముగొనుచు నొకమారొక
    యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి

  2. మా కన్నడ రాష్ట్ర కథ

    గెలిచెన్ తాకొన్నియెనట
    బలమివ్వన్ కాంగిరేసు పట్టెన్ పదవిన్
    బిలబిల గుంపును జేరుచు
    యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. అలికిడితో బోనును పడె
      నెలుకయె; కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్
      బలహీనుడైన భటుడట
      చలచల్లగ ప్రాకుచుండి చదరంగములో

      తొలగించండి


    2. అదురహో ' మౌసు ' :)



      బలహీనుడైన భటుడే,
      చలచల్లగ ప్రాకుచుండి చదరంగములో
      నల నంకోపరిని, జరుప
      నెలుకయె, కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్



      జిలేబి

      తొలగించండి
    3. చక్రవర్తి BCM ఉవాచ:

      బలే బలే జిలేబి

      తొలగించండి
    4. జిలేబి గారూ:

      వ్హాట్సప్లో మీ పాపులారిటీ పెరుగుతోంది..

      తొలగించండి
    5. గుఱ్ఱం జనార్దన రావ్ ఉవాచ: (జిలేబి):

      భేష్!🌹⛄🙏👍👌🖐👏⛄🌹

      తొలగించండి


    6. జీపీయెస్ వారికి

      నమో నమః మీరే మా జీపీయెస్ !/ చక్రవర్తి వారికి నెనరుల్స్


      శ్రీ జి. ప్రభాకర ! జిలేబి చిరుకానుకగా
      యీ జిలుగు తెలుగు కందము
      పాజము జేర్చంగ వాట్సపార్యుడ మీకై!

      జిలేబి

      తొలగించండి


    7. మా "జీపీయెస్" మీరే!
      శ్రీ జి. ప్రభాకర ! జిలేబి చిరుకానుకగా
      యీ జిలుగు తెలుగు కందము
      పాజము జేర్చంగ వాట్సపార్యుడ మీకై!

      తొలగించండి
    8. అదరహో జిలేబి మౌసు! అలరించెనులే! 👌💐👍👏

      తొలగించండి
    9. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

    10. గుర్రం జనార్ధన రావుగారికి

      నెనరులు !


      పల్లవుల యేరు తళుకుల
      నుల్లము పొంగెడు పదముల నుత్సాహముతో
      మల్లారమ్ముల పద్యము
      లల్లు పలమనేరు సుకవుల కివే జోతల్ !

      జిలేబి

      తొలగించండి


    11. సీతాదేవి గారికి

      నమో నమః !అన్నయ్య గారి మౌజూ కందానికి, మా మౌసు సాయంబంతే :)


      నెనరులు

      జిలేబి

      తొలగించండి
  4. తలుపులు బిగించి కొట్టిన
    బలహీన పుపిల్లి కూన బరుకును జనులన్
    కలికాలము వింతలు గన
    నెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. G P Sastry (gps1943@yahoo.com)మే 26, 2018 8:21 PM

      కంది వారు ఉవాచ:

      "ఈనాటి ఆకాశవాణి వారి సమస్య...
      *వాణీ ప్రేమజలమ్ము గాదె యిహమున్ భవ్యమ్ముగా దాటగన్*'
      మీ పూరణలు గురువారంలోగా padyamairhyd@gmail.com కు పంపండి."

      శంకరయ్య కందిమే 26, 2018 9:19 PM

      నేను రేడియో వినలేదు. ఒక మిత్రులు చెప్పినదానిని చెప్పాను. అది వాణియో పాణియో తెలియదు.

      G P Sastry (gps1943@yahoo.com)మే 26, 2018 11:32 PM

      శ్రీహర్ష uvaacha:

      గురువర్యా.. పాణీ🙏

      తొలగించండి


    2. అది పానీపూరి జలము జిలేబి ఉవాచ :)

      తొలగించండి
    3. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి



  5. గలగల లాడు కొండికలు గప్పము కొట్టుచు చూచి రచ్చటన్
    జిలజిల చిత్ర మై వెలుగు, జేగురు రంగుల వన్నె తోడుగా
    తలతల లాడు చిత్ర మది ! తానము డిస్నివరల్డు లో భళా
    యెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ☺️👏🏻..

      నేను కార్టూన్ నెటువర్కంటే ... మీరు డిస్నీవరల్డ్ అన్నారా!... నేను వాట్సాపులో సమస్య చూసి సరదాగా ఎలుకందము వ్రాసా...ఇక్కడ చూస్తే....మీరు కూడా...
      😃

      తొలగించండి


    2. బామ్మల కు "విట్టు" బాబుల
      కమ్మమ్మో "వేవులెంతు" కలువన్నొకటై
      ఝుమ్మను డిస్నీ కార్టూ
      న్లమ్మమ్మో శంకరునికి నట్టుగు లాయెన్ :)

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      మీ రెండవ పూరణ, దాని ననుసరించిన పద్యం బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. మీ వాట్సాప్ గ్రూపులో నేను కూడా సభ్యుడిని అవ్వాలని నా కోరిక...
      దయచేసి గ్రూప్ యొక్క లింక్ పంపగలరు...

      తొలగించండి
    5. లేదా నా నెంబర్ ని అందులో add చెయ్యండి.
      9553219978
      పద్య రచనలో ఆసక్తి ఉన్న నావంటి విద్యార్థులకు మెలకువలు నేర్పండి

      తొలగించండి
    6. తెలుగు సాహిత్య పరమైన గ్రూప్ లు ఉంటే తెల్పగలరు.
      ఫేస్ బుక్ అయినా , వాట్సాప్ అయినా...

      తొలగించండి
  6. యూదుల దేశము ఇజ్రాయేలు చూడ జనము
    ఎనభై లక్షలు
    ఎనభై కోట్లతో శత్రు దేశములు చుట్టూ
    పరచె నక్షలు
    సింహ స్వప్నమై పగవాడికి తాను
    పరాక్రమించగన్
    ఎలుక వధించె నేనుగు నహీన బలంబున
    విక్రమించుచున్

    రిప్లయితొలగించండి


  7. తెలుపుము పిల్లికి కబళము?
    వలపున నెటులు విజయమ్ము వచ్చు జిలేబీ ?
    * అల మావటి వాడినకట !
    ఎలుకయె; కడు విక్రమించి; యేనుఁగుఁ జంపెన్!


    *తిరుచ్చి సమయపురంలో ఏనుగు మావటి వాడిని (వాడి పేరు గజేంద్రుడు :)) చంపిందని హిందూ వారి వార్త.

    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. సమస్య :-
    "ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"

    *కందం**

    ఖలునివలె యెదురుగ వచ్చె
    ఎలుకయె కడు విక్రమించి; యేనుఁగుఁ జంపెన్
    కలవర పాటు నెలుకయే
    కలుగున దూరక కరి కడకాలున పడగా
    ..................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వలె నెదురుగ వచ్చె। నెలుకయె... పాటున నెలుకయె" అనండి.

      తొలగించండి
  9. తలపడి యెన్నికలందున
    సులభముగా గెలువ నొకడు శూరుని పైనన్
    ఫలితముఁ గని ప్రజ పల్కిరి
    యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  10. కందం
    బలమున్న వానిఁ గనునని
    బలహీనుని నక్కలిమిడి బలమౌదుమనన్
    భళిరా! కర్ణాటకమున
    నెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్!

    (కర్ణాటక రాజ్య రాజకీయ నేపథ్యం)

    రిప్లయితొలగించండి
  11. సులువుగ జయించె కాంగ్రెస్
    నల హస్తిన కేజ్ర్రివాలు నాప్ పార్టీ తోన్
    కలగాదు గదా నిచటన్
    ఎలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "గదా యిచ్చట। నెలుకయె..." అనండి.

      తొలగించండి
  12. మెలికల పార్టిని తెలుగులు
    కలలో నెరుగని విధముగ ఘనముగ నెటకో
    మలుపుల ద్రిప్పుచు బంపిరి;
    ఎలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్.

    రిప్లయితొలగించండి
  13. సరైన పూరణ కోసం ఆలోచించే లోపు ఈ సరదా పూరణ..

    టాము, జెర్రీ మధ్యలో ఏనుగు

    అల కార్టూ న్నెటువర్కున
    కలుగున గల జెర్రి టాము గడబిడ లోనన్
    బలగజ మొకటటు రాగా
    "ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"

    రిప్లయితొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    నలుగురు చూచుచుండిరిట నర్తనశాలకు రమ్ము , పండు నీ
    వలపనఁ గృష్ణ , కీచకుడు వచ్చెను , భీముడు చంపెనాతనిన్ !
    వలలుని కీచకున్ గనుచు పల్కిరి పౌరులు "వంటయింటిదౌ
    యెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ విట్టుబాబు గారి స్పందన..

      వలలుడు కీచకుడిని రహస్యంగా చంపాడు కదా! అందరూ గంధర్వులు చంపారనుకున్నారు కదా అని...

      అవునండీ..కానీ కొంతమందికయినా తెలియకపోతుందా.. కొంతకాలం తర్వాతనైనా.. అని సమర్థించుకొంటూనే వ్రాశా 🙏
      అని బదులిస్తూ...

      పూరణలో చిరుసవరణ... మన్నించండి 🙏🙏

      నలుగురు చూచుచుండిరిట నర్తనశాలకు రమ్ము , పండు నీ
      వలపనఁ గృష్ణ , కీచకుడు వచ్చెను , భీముడు చంపెనాతనిన్ !
      వలలుని కీచకున్ దలుపఁ బద్యము దోచెను "వంటయింటిదౌ
      యెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్ !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  15. బలవంతు డైన వానిని
    కలతలనెడు చీడపురుగు కలవర పెట్టన్
    విలవిల లాడుచు చచ్చిన
    నెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  16. కలలో వలె రష్యాపై
    చెలరేగియు భళి ! జపాను సేనయె గెలిచెన్!
    తలపగ విధి బహు చిత్రము!
    "ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"
    ****)()(****
    (1905 లో రష్యా-జపాను యుద్ధంలో రష్యా దిగ్గజముపై చిన్న దేశము జపాను విజయము ప్రస్థావించ బడినది.అప్పట్లో అది సంచలనము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చిత్ర। మ్మెలుకయె...' అనండి.

      తొలగించండి
  17. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2689
    సమస్య :: *ఎలుక వధించె నేనుఁగు మహీనబలంబున విక్రమించుచున్.*
    ఎలుక ఏనుగును చంపింది అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ఛత్రపతి శివాజీ అని ప్రసిద్ధి వహించిన శివాజీ మహారాష్ట్రలో జన్మించి మన భారతమాతకు వీరపుత్రుడుగా వీరశివాజీగా కీర్తింపబడుతున్నాడు. జిజియా షాహాజీ పుణ్యదంపతుల సుపుత్రుడైన శివాజీ మొఘల్ రాజులను వ్యతిరేకించి మరాఠా సామ్రాజ్య స్థాపనకు అంకురార్పణ చేశాడు. దేశభక్తితో ధైర్యసాహసాలతో శక్తియుక్తులతో అనేక కోటలను జయించాడు. ఉక్కు కవచాన్ని ధరించి తన పిడి పులి గోళ్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను (నరసింహస్వామి వలె) చీల్చి చంపినాడు. ఆ సమయంలో అక్కడ ఉండిన శత్రుపక్షం వాళ్లు ‘’ ఈ శివాజీని చిట్టెలుక అని అనుకొన్నాము. ఐతే ఈ ఎలుక ఏనుగు లాంటి మన నాయకుని వధించింది’’ అని మాట్లాడుకొన్న సందర్భం.

    పిలిచెద రెల్ల హిందువులు వీరశివాజి యటంచు భక్తులై
    యిలను శివాజి వ్యక్తి యని యెంచితి మీతడు శక్తి యౌచు తా
    నలయక కోటలన్ గెలిచె, నఫ్జలుఖానును జంపె గోళ్లఁ జి
    *ట్టెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (27-5-2018)

    రిప్లయితొలగించండి
  18. కలనొక దట్టమౌనడవిఁ గంటిని యందొక కేసరమ్ము తా
    బలిమినినొక్క కుంజరముఁ బట్టుటకైపరుగెత్తిఁ దానితో
    కలఁబడె రౌద్రరూపమున ఘర్జనఁజేయుచు, చూచుచుండనో
    ఎలుక - వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  19. తలచుచు తనసుతు మరణము
    కలతను చెందిన గురువని కన్నరికాగా
    తలద్రుంచి ద్రుపద సుతుడను
    యెలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సుతుడను నెలుకయె...' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను! 🙏🙏🙏🙏

      తొలగించండి
  20. నా పూరణలో తప్పులను సవరణలను చూపిన శ్రీ BCM చక్రవర్తి గారికి కృతజ్ఞతలతో..

    మెలగక తాను నీచమని మెండగు దిగ్గజ రూపు గాంచుచున్
    తొలగక దారి నుండి యది తొండము లోనికి దూరి యంతటన్
    "యెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్"
    కలుగున నున్నదే యనుచు గ్రక్కున నెంచగ
    రాదు చూడగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారి సూచనతో రెండవ పాదము:
      "తొలగక దారి నండి యది తొండము లోనికి దూరి యంత నా"

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  21. వలలో చిక్కిన సింహము;
    కలుగును వీడియు బటువుగ కడు నేరుపుతో
    వల కొఱికియు విడిపించగ
    "యెలుకయె ; కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విడిపించగ। నెలుకయె...' అనండి.

      తొలగించండి
  22. మరియొక పూరణ:

    జై పాతాళ భైరవీ!!

    కలలను దక్కునా యనెడి కాంచన కోటల రాకుమారియే
    యిల గని తోటరామునిక నింపునఁ బ్రేమనుఁ బంచ గోరగా
    చెలువము గోరు మాంత్రికుని చిత్తుగ దృంచెను దుర్బలుండటన్
    "ఎలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్"

    రిప్లయితొలగించండి
  23. పలు రీతుల హింసిం చు చు
    చలమున మెలగు చు వెలి గెడి సంకుచితాఖ్యు న్
    కల కల ము రేపు నట్లు గ
    నె లు క యె కడు విక్రమించి యేను గు జంపె న్

    రిప్లయితొలగించండి
  24. ఉలిలో సగమును గొఱికెను
    నెలుకయెకడువిక్రమించి,యేనుగుజంపె
    న్జలపతి పాపను గరమున
    నలవోకగనెత్తిపైకి యవనింద్రోసిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పైకి నవనిం..' అనండి.

      తొలగించండి
  25. ఎలుకను చిన్నజీవి యని యెన్నకు డేమరుపాటునందు, న
    య్యెలుకయె బొజ్జదేవరకు నింపొనగూర్చెడు నెక్కిరింతయౌ,
    యెలుకయె కాచె నొక్కెడ మృగేంద్రునిఁ గానలఁ, దూరి తొండమం
    దెలుక వధించె నేనుగు నహీనబలమ్మున విక్రమించుచున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నెక్కిరింతయౌ। నెలుకయె...' ఆనండి.

      తొలగించండి
  26. ఇల ఘన కీర్తినందుచు మహీతల మందున మేటి స్థానమున్
    నిలిచిన వారిపై గెలువనేరదు నిక్కమనంచు దల్చినన్
    దలపడి గెల్చె బంగ్ల యది ద్రావిడు సేనను విశ్వక్రీడలో
    నెలుక వధించెనేనుగు నహీన బలంబున విక్రమించుచున్

    రిప్లయితొలగించండి
  27. అలనాటి యాంగ్ల పాలన
    వలదనుచున్ గాంధి తాత వారల తఱుమ
    న్నిలలో ఖ్యాతిని బడసెన్!
    ఎలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్!

    రిప్లయితొలగించండి
  28. రిప్లయిలు
    1. అతిశయోక్తుల గైడు సందర్శకులు మెచ్చేట్టుగా చెప్పుచున్నాడు.😊

      ఇలలో నిచ్చట జూడుడు
      "యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"
      తలకోన యడవి గొప్పిది
      విలుకానికి యెదురు జింక వేడుక నిలిచెన్!

      తొలగించండి
    2. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జూడుం। డెలుకయె..' అనండి.

      తొలగించండి
  29. కలిగిన కొద్ది సైన్యమును క్రన్నన దింపి శివాజి, యుక్తితో
    తలపడి యుద్ధరంగమున తద్దయు సత్త్వము తోనెదుర్చుచున్
    మెలుకువతో చరించి కొనమేలుఫలమ్మును పల్కి రందరు
    న్నెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్

    రిప్లయితొలగించండి
  30. ఖలుఁ డా సైంధవుఁడే వర
    బల సత్త్వమ్మున హరించెఁ బాండు సుతులలో
    నలుగురి విక్రమ మకటా
    యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్ !


    బల మది యెంత యున్న మఱి భద్రమె వేగ మొకింత లేనిచో
    నలమటఁ జెంది యాఁకలికి నాగ్రహ మేసర సింహ రాజమే,
    కలుఁగునఁ దూఱ సత్వరము గాంచి మృగేంద్రుని భీతి జెంది యా
    యెలుక, వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు.

      తొలగించండి
  31. అలుకను బూని పిలిచె హరి
    నెలుకయె, కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్
    చెలికాడే కోరగ బహు
    బలమే దీర్చె నతనిచిరు పంతము నపుడున్

    రిప్లయితొలగించండి
  32. చులకన జేసి పోవుదురు చూపుచు దర్పము నాధిపత్యమున్
    బలముగ త్రోసి నోర్పరిని బంధనమై చెలగాటమాడి, ధీ
    బలుడు నెదుర్చు కీలెఱిఁగి వాతను పెట్టును, కాలమేర్పడన్
    ఎలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్౹౹

    రిప్లయితొలగించండి
  33. హిరణ్యకశిప ప్రహ్లాద సంవాదము...

    చంపకమాల
    పలుకులఁ జిక్క వోయి! హరి వాసము సర్వమటంచు నిక్కు చి
    ట్టెలుకవు, కంభమందు కనిపించునొ? నీహరి యన్నఁ, బిల్వగన్
    యెలుక, వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్ 
    వెలువడి తా నృసింహముగ విష్ణువు! దైత్య విరోధి! క్రుద్ధుడై!!



    రిప్లయితొలగించండి
  34. ఆటవిడుపు సరదా పూరణ:
    (దండకారణ్య గణేశ నిమజ్జనము)

    కలవరమొంది కుంజరము కానన మందొకనాడు కాచుచున్
    నలుబదిమంది లాగెడు వినాయక విగ్రహ యాత్ర జూడగా
    ములుగుచు చచ్చె పుష్కరిని మూషిక రాజము మోయుచుండగా...
    నెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్

    ములుగు = మూలుగు
    పుష్కరి = ఏనుగు
    (శబ్దరత్నాకరము)

    రిప్లయితొలగించండి
  35. పలు పరకాయ ప్రవేశము
    లలరించగ విఠ్ఠలార్య!లాశ్చర్యములే
    నిలిపిన సినిమాలందున
    ఎలుకయెకడువిక్రమించి యేనుగుజంపెన్!

    రిప్లయితొలగించండి
  36. చెలగగ శత్రుల జంపగ
    నిలనే గావగ గణపతి నిక్కము జూడన్
    కలుగున నాతని వాహన
    యెలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  37. మిత్రులందఱకు నమస్సులు!

    [ఏకచక్రపురాన సాధారణ బ్రాహ్మణుని వేషముననున్న భీముఁడు, భయంకరాకృతుఁడైన బకునిఁ జంపఁగా, జను లెట్లు నుతించిరో తెలుపు సందర్భము]

    పలుక వశమ్ముగాని ఘన వర్ష్మముతోడ భయంకరాకృతిన్
    జెలఁగుచు, నేకచక్రపుర జీవులఁ జంపి, భుజించు నా బకున్,
    గలఁబడి చంప భీముఁడు, దగన్ మనుజుల్ నుతియించి రిట్టు "లా
    యెలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్!"

    రిప్లయితొలగించండి
  38. అల ప్రహలాదుడెంతయు నహమ్మున వర్తిలు తండ్రి నవ్విధిన్
    నెలకొను విష్ణు భక్తియను నిర్మలమై చను నాయుధమ్మునన్
    గెలిచెను ధారుణిన్ విజయ కేతన.మెంతయు కాంతులీనగా
    "ఎలుకవధించెనేనుఁగునహీనబలంబున విక్రమించుచున్"

    రిప్లయితొలగించండి
  39. ఎలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచు
    న్నెలుకవధించుటాగజ మునెక్కడనైననుజూచితేరిలన్
    కలనునగంటివేయదియెకాకినినేనుగునేగురించియా
    కలవరపాటుజెందుటకుకారణమేదిలచెప్పుమాయికన్

    రిప్లయితొలగించండి
  40. అల హస్తినా పురమ్మున
    బలమగు మోదీని గెలిచి పరిపాలించెన్
    లలితమ్ముగ నరవిందుడు
    "ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ జంపెన్"

    రిప్లయితొలగించండి
  41. డా.పిట్టాసత్యనారాయణ
    వెలసెను నాటకరమ్యత
    ఇల కవి దిగ్గజము రచన నీడ్చిన కథలన్
    ఎలమిని కుందా1 ధామపు
    టెలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్
    (1.శ్రీ కుందా సత్యనారాయణ రూపొందించిన శిల్పకళాధామము)

    రిప్లయితొలగించండి
  42. డా.పిట్టాసత్యనారాయణ
    పలుకదు మౌజు వీడదదె పట్టు గజంబును డెస్కుటాపునన్
    గిలికిన చాలు నా గురికి గిట్టును యేనుగు ముక్కలై చనన్
    బలమన దేహభారమదె ,భ్రాంతి; గజానను మోయ గల్గదే?
    ఎలుక వధించె నేనుగు నహీన బలంబున విక్రమించుచున్!(mouse ,desktop)

    రిప్లయితొలగించండి
  43. ఇల వింటిమి శివ మహిమను
    కలుగగ మోక్షము సులువుగ కరికాళములే
    యలుగుచు పెనగొన, నెచ్చట
    నెలుకయె కడు విక్రమించి యేనుగు జంపెన్?

    రిప్లయితొలగించండి
  44. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

    బలిసిన పిల్లి యొక్కటి దబాలున పైబడి - రక్కి నా

    యెలుక(న్) వధించె | నేనుగును + అహీనబలంబున విక్రమించుచున్

    తల పయి కొట్టి క్రొవ్వును ముదంబున మెక్కి రహించె సింహ | మీ

    యిల గల పెద్దజీవి సమయించి భుజించును చిన్న జీవి | న

    ట్టులె నశియింప జేయు నరుడున్ నరునిన్ విచిత్ర సృష్టిలో !


    * క్రొ వ్వు = మె ద డు *

    రిప్లయితొలగించండి
  45. తెలియక వెదకుచు నటునిటు
    కలుగని తొండమున దూరి గానక దారిన్
    గలగల దిరుగుచు కొఱుకుచు
    ఎలుకయె కడు విక్రయించి యేనుగు జంపెన్!!!

    రిప్లయితొలగించండి
  46. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    "ఎలుకయె కడు విక్రమించి యేనుఁగుఁ
    జంపెన్"

    సందర్భము: వృద్ధాప్యం పైబడే కొద్దీ శరీరపటుత్వం తగ్గిపోతుంది. యౌవనంలో వున్నట్టుగా వుండదు. "అయ్యో! ఒకప్పు డేనుగులా వుండేవా డిప్పు డెలుకలా తయారయ్యాడే!" అంటారు.
    "శ్రీ వేంకటాచల నివాస శతకం"లో శ్రీ జనువాడ రామ స్వామి అనే ఒక (భక్త) కవి మిత్రుడు ఇలా పేర్కొన్నాడు.
    "ఇంద్రజాలము చేయు నింద్రియములు జూడ భోగముల్ రోగముల్ జోల బాడు..
    బలమున్న మొనగాడు భంగపడకపోడు వయసు పశ్చిమ దిశ వాలుచుండ..
    కాళ్ళు చేతులు కూడ కదలనే కదలవు ఆసరా లేనిదే అడుగు లేదు.."
    అని చెబుతూ చివరకు "ఏనుగని పిల్చి రొకనాడు ఎలుక నేడు.." అంటాడు.
    వీధిలో వెళుతున్న ఒక పెద్దాయనను చూచి "ఏనుగులాగా వున్నవా డ దేమిటి? ఎలుకలా తయారయా" డని నే నంటే పక్కనే వున్న నా మిత్రుడేమో
    " కాదు కాదు. ఎలుకే విక్రమించి యేనుగును చంపిందిలే!" అన్నాడు కవితాత్మకంగా...
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "పలు వరుస లూడె; నెరిసెను
    తల వెంట్రుక; లేనుగు వలెఁ దనరె; నెలుకయై
    నిలిచె నత" డంటి ; సఖు డనె
    "నెలుకయె కడు విక్రమించి
    యేనుఁగుఁ జంపెన్"

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  47. పలుకులు నేర్చి కాంగ్రెసున పన్నుగ చేరుచు తెల్గుదేశమున్
    నలుగురిలోన మెప్పుగొని నాయకు పుత్రిని పెండ్లియాడుచున్
    వలపున నేత కూలబడ బాకును తీయుచు వెన్ను గ్రుచ్చెనే...
    ఎలుక వధించె నేనుఁగు నహీనబలంబున విక్రమించుచున్!

    రిప్లయితొలగించండి