29, మే 2018, మంగళవారం

సమస్య - 2691 (అర్చించెను రాత్రి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"అర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"
(లేదా...)
"అర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్"

51 కామెంట్‌లు:

  1. చర్చిని క్రిస్మస్ రాత్రిని
    మార్చుచు మతవాదుల నట మాటల తోడన్
    చర్చను "ఆదిత్య హృదయ
    మ"ర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  3. చర్చిని క్రైస్తవ భక్తుం
    డర్చించెను రాత్రి, భక్తుఁ డాదిత్యు నొగిన్
    వర్చస్సును కోరుచు తా
    తర్చుచు వేడె తెలవార తరుణి జిలేబీ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    కూర్చెను పూతకూర్చ , సమకూర్చె జలమ్ము కమండలమ్మునన్
    మార్చెను వస్త్రధారణము మానసికమ్ముగ సిద్ధమౌచు దా
    దీర్చెను ఫాలభాగమున దివ్య మనోజ్ఞ విభూతి , స్వప్నమం
    దర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి

  5. సోమరి భక్తుడు కాడీ భక్తుడు అహర్నిశలు కొలిచెను !


    నేర్చెను వీలు గానతడు నెమ్మిని దేలుచు భక్తి మార్గమున్,
    తర్చుచు నిత్యమా విభుని, తామరవిందుని నాతడే గదా !
    చర్చన మైన భక్తి గల జామియు కాడయ! ప్రొద్దుటన్, భళా
    యర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. వర్చస్సు తాళ లేకను
    నర్చించెను రాత్రి , భక్తుఁ డాదిత్యు నొగిన్
    కర్చేమి లేదను కొనుచు
    చర్చికి పోవంగ నతడు సంతస మొందన్

    రిప్లయితొలగించండి
  7. కం.
    మూర్చ వలన పడి పోవగ
    మర్చి వెడలె భక్తుడొకడు మందిర పూజన్
    కుర్చిన్ ప్రతిమను బెట్టుచు
    నర్చించెను రాత్రి భక్తుడాదిత్యునొగిన్

    రిప్లయితొలగించండి
  8. చర్చికి చని క్రీస్తు నొకం
    డర్చించెను రాత్రి, భక్తుఁ డాదిత్యు నొగిన్
    చేర్చి కరములను సంధ్యను
    వార్చి యుదయ సమయమందు భజియించె లలిన్

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2691
    సమస్య:: *అర్చనఁ జేసె రాత్రిసమయమ్మున భక్తుడు భానుబింబమున్.*
    రాత్రి వేళ సూర్యబింబానికి అర్చన చేశాడు ఒక భక్తుడు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ‘’స్వదేశంలో ఉన్న మీరు విదేశాలలో ఉన్న మీ అబ్బాయి ఒకేసారి సూర్య భగవానుని పూజించండి శుభం భూయాత్’’ అని అర్చకస్వామి చెప్పడంతో నేను ఇక్కడ పగటివేళ సూర్యుని పూజిస్తూ లైవ్ టెలికాస్ట్ అన్నట్లు వీడియోకాల్ ద్వారా పూజా కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయగా అదే సమయంలో ఆ వీడియో చూస్తూ అక్కడ విదేశాలలో రాత్రివేళ ఐనాసరే సూర్యుని అర్చించాడు భక్తితో మా అబ్బాయి అని జరిగిన విషయాన్ని వివరించే సందర్భం.

    అర్చకు డన్నయట్లు కమలాప్తుని గూర్చి స్వదేశ వాసినై
    యర్చనఁ జేయ నా సుతుడు నత్తఱి నిత్య ప్రసార మందు నే
    గూర్చిన వీడియో గనుచుఁ గొల్చెను బ్రధ్ను విదేశవాసియై;
    *యర్చనఁ జేసె రాత్రి సమయమ్మున భక్తుడు భానుబింబమున్.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (29-5-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇలాంటి సమస్యకు మరొకటి పూరణ

      తొలగించండి
    2. ప్రశ్నోత్రర విధానము
      హనుమ విద్య నేర్వ నలరిన దెవ్వడో?
      అలరె నెచట తార లన్ని కలసి?
      గాఢ నిద్ర పట్టు కాలమ్ము గన నేది?
      అర్కు డలరె చదల నర్ధరాత్రి.

      తొలగించండి
  10. కూర్చుండియు నొక చోటను
    వర్చస్సున నప్రమేయ వనజ హితుని దా
    చర్చించుచు నెమ్మనమున
    "నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"

    రిప్లయితొలగించండి
  11. మడితో శివునికి కురిసెడి
    జడి  "నర్చన చేసె రాత్రి సమయమ్మున భ
    క్తుఁడు,  భానుబింబమున్" తాఁ
    గడు శ్రద్ధనుఁ బూజ చేసి గత యుదయమునన్
    (చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మార్చుము వాతావరణము
      నూర్చెద నాపంట యెండ యుర్వినిఁగాయన్
      దీర్చెద నాయప్పులనుచు
      నర్చించెను రాత్రి భక్తు డాదిత్యు నొగిన్!

      తొలగించండి
    2. అందముగా కూర్చిరిగద
      సుందరమౌ పూరణమిట స్తుతియింప దగన్
      చందర మౌళీ జిగిబిగి
      కందము నందుత్పలమును కవివర సూర్యా!

      తొలగించండి
  12. వర్చస్సున భాను సముం
    డర్చకు డొకరుండు నటకు నరిగెను నార్వే
    తర్చియు మనమునె భక్తిగ
    "నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"
    ***)()(***
    (తర్చు =మథించు)

    రిప్లయితొలగించండి
  13. ధృవ ప్రాంతమునకు తా ముచ్చటపడి మంచు ఖండమున
    కాలిడి
    పగలును చూసి తానదె తడబడి నిడివిని కొలువగ తను
    వడివడి
    రాతిరి రాదు పగలది పోదు ఎండ వెన్నెలై
    చుంభించగన్
    అర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుడు
    భానుబింబమున్

    రిప్లయితొలగించండి
  14. చర్చించగ నేమి గలదు
    మార్చగనే లేదు గనుడు మాన్యుల భావమ్
    దీర్చగ కోరిక వామను,
    "నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"

    వామనుడు = అదితి పుత్రుడు, ఆదిత్యుఁడు

    రిప్లయితొలగించండి
  15. కందం
    మార్చుదురయ మా సభ్యులఁ
    బేర్చుచు ధనము! నుదయించి వేగమె నేనా
    కుర్చీ నెక్కఁగఁ గనుమని
    యర్చించెను రాత్రి భక్తు డాదిత్యు నొగిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గు రు మూ ర్తి ఆ చా రి
      ........... .......


      G. V. S. సహదేవుడు గారికి నమస్కృతులు . మీరు ప్రొద్దటూరు వాస్తవ్యులా !

      సంతోషం . ప్రొద్దటూరికి మా చిన్న కూతురు నిచ్చామండి .

      మిమ్ము కలవడము నాకు చాలా సులభమన్న మాట !

      తొలగించండి
    2. నమస్కారమండి.మీరు ఈ మారు ప్రొద్దుటూరు వచ్చినపుడు తప్పక కలుద్దాం.

      తొలగించండి
    3. నా సెల్ నెంబరు 99 66 22 56 40

      మరి , దయచేసి మీ సెల్ తెలియజేయ గలరా ?

      తొలగించండి
  16. చర్చించగ వేదములే
    తీర్చియు గెల్వగ విబుధుల తీర్పుల నెల్లన్
    తీర్చగ కోరిన కోర్కెలు
    నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్

    రిప్లయితొలగించండి
  17. కార్యాలయ వేళలలో మద్యాహ్న సాయం సంధ్యల వార్చడం కుదరక రాత్రి యింటికి వచ్చాక సంధ్యావందనమాచరించే భక్తుడు:

    వార్చక తప్పదు సంధ్యను
    చర్చించిన గాని యతడు సమ్మతమిడడే
    మార్చక తప్పదు సమయమ
    "నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"

    అతడు = కార్యాలయాధికారి

    రిప్లయితొలగించండి
  18. అర్చకుబనుపునగుడిలో
    నర్చించెనురాత్రిభక్తుడాదిత్యునొగి
    న్నర్చనజేసినభక్తిని
    దీర్చునుమనవాంఛలన్నితీరికతోడన్

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందఱకు నమస్సులు!

    ఏర్చఁగఁ గష్టనష్టములు, నెన్నికమై యొక బ్రాహ్మణుండునౌ
    నర్చకుఁ జేరి, కోర, నతఁ "డర్కుని శీఘ్రమె పూజసేయఁ బో
    కార్చును కష్ట!" మంచు ననఁగాఁ, దగఁ దెచ్చియు సూర్య చిత్రమే,
    యర్చనఁ జేసె, రాత్రి సమయమ్మున, భక్తుఁడు భానుబింబమున్!

    రిప్లయితొలగించండి
  20. ఉత్పలమాల

    మార్చెద రంచు సభ్యులను మాయలు జేసి ప్రమాణ పూర్వమే
    చేర్చితి ప్రక్కరాష్ట్రమునఁ జీలక నుండగ భద్ర మంచు! నే
    గూర్చొన గద్దెపై రయమె కూర్చు దినమ్ములటంచు నార్తితో
    నర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్

    రిప్లయితొలగించండి
  21. సమస్య :-
    "అర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"

    *కందం**

    చర్చన పడి చెలికాండ్లును
    మర్చివెడలి కాననమున మార్గము దప్పన్
    కూర్చోనేడ్చుచు పుట్టుమ
    నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్
    ..................✍చక్రి

    రిప్లయితొలగించండి
  22. చర్చి oచియు పూజింపగ
    ఖర్చు కు వెను కాడ బో క క మ్రపు మతి తో
    నర్చకుడొక ప్రతిమ ని డి
    య ర్చిoచె ను రాత్రి భక్తుడా ది త్యునొ గి న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదం చివర లో ప్రతిమ ని డి యు అని యు చివరి పాదం మొదట నర్చకు డని సవరణ చే య బడింది

      తొలగించండి
  23. అర్చకుడానతీయగనునాయతరీతినిభక్తిశ్రధ్ధల
    న్నర్చనజేసెరాత్రిసమయమ్మునభక్తుడు,భానుబింబము
    న్నర్చనజేయుచోజలమునంజలిబోయుచుజారవోయగ
    న్నేర్చెడుభాస్కరుండిలను,నీయునుసంపదనెల్లవారికిన్

    రిప్లయితొలగించండి
  24. కూర్చి పదమ్ములు స్నాన మొ
    నర్చి ద్విజ వరుం డొకండు నయముగను సహ
    స్రార్చి నిను జగత్సాక్షిని
    నర్చించెనురా త్రిభక్తుఁ డాదిత్యు నొగిన్

    [త్రిభక్తుఁడు = మూటి (ధర్మార్థకామములు) యందు భక్తి కలవాడు]


    అర్చన కేల నెంచ సమయమ్మును సూర్యుని నర్యమున్ సహ
    స్రార్చినిఁ బూజనీయు నల సన్నుతి సేయరె యెల్ల వేళలం
    జర్చకుఁ దావు లే దిట నసంశయమే యది విగ్రహమ్ము దా
    నర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్

    రిప్లయితొలగించండి
  25. అర్చకుడాలయంబున మహామహితుండగు దేవ దేవునిన్
    యర్చన చేసె రాత్రి సమయంబున,భక్తుడు భాను బింబమున్
    వార్చుచు సంధ్య మంత్రములు నావిరిగా పఠియించి దీక్షతో
    నర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుడు భానుబింబమున్
    ...

    రిప్లయితొలగించండి
  26. మార్చగ పదవులనుదయమె
    చర్చించెను ముఖ్యమంత్రి శాసనసభలో
    కుర్చీని కోరి యొకడటు
    "లర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"
    ..

    రిప్లయితొలగించండి
  27. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    ఒక శాస్త్రి సూర్యభగవానుని విపరీతంగా కొలిచే భక్తుడు .

    సరే ఉదయము సూర్యునికి నమస్కరించి సంధ్యవార్చుతాడు

    రాత్రి సూర్యబింబము యొక్క చిత్ర పటమునకు సుమమాలవేసి

    పూజించె నట ! }



    అర్చకు డైన " శాస్త్రి " తిమిరారి , నహర్మణి , లోకబాంధవు ,

    న్నర్చన జేయు చుండు || నుదయంబున వందనమాచరించుచున్

    వార్చెను సంధ్య | నెంతయు వినమ్రత ( న్ ) ‌ సత్కళన్ ,

    జేర్చి లఖింపబడ్డ రవి చిత్రపటంబునకున్ సుమమాల వైచుచు

    న్నర్చన జేసె రాత్రి సమయమ్ము‌న భక్తుడు భానుబింబమున్

    రిప్లయితొలగించండి
  28. వర్చెస్సు మ్రింగరాహువు
    కార్చిచ్చేలేనిసూర్య కాంతియురాత్రిన్
    మార్చగ?గంటకు పైబడ
    అర్చించెను రాత్రిభక్తుడాదిత్యు నొగిన్

    రిప్లయితొలగించండి
  29. నేను 500 రూపాయలు గురువుగారి అక్కౌంటులో వేస్తాను. అసనారె

    రిప్లయితొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    ("మనసున మల్లెల మాలలూగెనే")

    చేర్చుచు బాటసారి చలచిత్రపు తున్కలు వెఱ్ఱిమొఱ్ఱిగన్
    కూర్చుచు నత్తగార్కథలు కోడలి తోడుగ నావకాయలున్
    నేర్చుచు పాటలున్ రచన నిమ్మళముంగను బ్రోవుమంచు తా
    నర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్

    భాను బింబము = భానుమతి ఫోటో
    రాత్రి సమయము = దినమంతయు అభ్యాసముతో తీరికలేక

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఈ "చలచిత్ర "మేమిటండీ జీపీయెస్ వారు ?
      అప్పుతచ్చా ?


      జిలేబి

      తొలగించండి
    2. ఈ మధ్యన వ్హాట్సప్లోని పండితులు కొందరు "చలన చిత్రం" తప్పనీ "చలచిత్రం" ఒప్పనీ తీర్మానం చేసిరి. నాదేం పోయింది...ఏ రాయయితేనేమి నా బోటికి?

      తొలగించండి
  31. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,


    ఒక శాస్త్రి సూర్యభగవానుని విపరీతంగా కొలిచే భక్తుడు .

    సరే ఉదయము సూర్యునికి నమస్కరించి సంధ్యవార్చుతాడు

    రాత్రి సూర్యబింబము యొక్క చిత్ర పటమునకు సుమమాలవేసి

    పూజించె నట ! }



    అర్చకు డైన " శాస్త్రి " తిమిరారి , నహర్మణి , లోకబాంధవు ,

    న్నర్చన జేయు చుండు || నుదయంబున వందనమాచరించుచున్

    వార్చెను సంధ్య | నెంతయు వినమ్రత ( న్ ) ‌, సత్కళన్

    జేర్చి లఖింపబడ్డ రవి చిత్రపటంబునకున్ సుమమాల వైచుచు

    న్నర్చన జేసె రాత్రి సమయమ్ము‌న భక్తుడు భానుబింబమున్

    రిప్లయితొలగించండి
  32. చర్చించ పగలు రేయిల
    మార్చునది జితముగ నుండు మార్తం డునిగా
    నేర్చగ సమయము నెంచక
    అర్చించెను రాత్రి భక్తుడాదిత్యునొగిన్

    రిప్లయితొలగించండి
  33. కూర్చుని సాధన జేసిరి
    నేర్చిన సంగీత విద్య నీమము తోడన్,
    కూర్చిన సుస్వరములచే
    నర్చించెను రాత్రి భక్తుడాదిత్యు నొగిన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  34. డా.పిట్టాసత్యనారాయణ
    అర్చన సాయం సంధ్యల
    జర్చించిరి కర్దమాఖ్యు సందేశములన్(కర్దముడు తన తల్లికి భక్తి యోగమును ఉపదేశిస్తాడు)
    పర్చా వంశపు స్పర్ధన
    అర్చించెను రాత్రి భక్తుడాదిత్యునొగిన్

    రిప్లయితొలగించండి
  35. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. .. .. .. ..
    సవరణతో..

    "అర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్"

    సందర్భము: మనకు రాత్రి యైనప్పుడు అమెరికాలో పగలు. ఆ విధంగా కూర్చినాడు దేవుడు.
    భక్తుడైన మనవా డొకడు అమెరికాలో వున్నాడు. రాత్రి పూట సూర్యు నర్చించినాడు. ( వాళ్ళ కప్పుడు పగటి పూట కదా!)
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    కూర్చె విధి మనకు రాత్రిని..
    తీర్చెను దానినె పగ లను తీరు నమెరికన్
    గూర్చొని మన వా డచ్చట
    నర్చించెను రాత్రి భక్తుఁ డాదిత్యు నొగిన్

    🖋~డా.వెలుదండ సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  36. డా.పిట్టా సత్యనారాయణ
    (అర్చనా విధులు 4.అవి,వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనునవి.)
    చర్చల కందజాలనివి చారు తరమ్మగు నాల్గు యర్చనల్
    వర్ఛసు జూపు వాడొకడు(సూర్యుడు)వచ్చెనొ లేదొ యటంచు బ్రొద్దునన్
    చర్చిని నంటి పశ్చిమము చయ్యన లేచెనమేరికా క్షితిన్
    మర్చునొ తత్కుమారకు నమాయకు క్షేమము గోరు తండ్రిగా
    నర్చన జేసె రాత్రి సమయమ్మున భక్తుడు భాను బింబమున్

    రిప్లయితొలగించండి
  37. ఏణాంకానల భానుమండల లసత్ శ్రీచక్ర మధ్యస్థితాం బాలార్క ద్యుతి భాసురాం కరతలౌ పాశాంకుశాం బిభ్రతీం .......🙏🙏🙏

    అర్చించ కోటి సూర్యుల
    వర్చస్సును, చంద్ర సూర్య వహ్నుల మధ్యన్
    గూర్చిన శ్రీచక్రమ్మున
    నర్చించెను రాత్రి భక్తు డాదిత్యు నొగిన్

    రిప్లయితొలగించండి
  38. డా.పిట్టాసత్యనారాయణ
    ఆర్యా,కర్దముని కుమారుడు కపిలాచార్యుడు తన తల్లికి భక్తి యోగమును బోధిస్తాడు. గా స్వీకరించండి

    రిప్లయితొలగించండి
  39. డా.పిట్టాసత్యనారాయణ
    ఆర్యా,కర్దముని కుమారుడు కపిలాచార్యుడు తన తల్లికి భక్తి యోగమును బోధిస్తాడు. గా స్వీకరించండి

    రిప్లయితొలగించండి
  40. తర్చుచు లోకమంతయును దారగ భానును మెచ్చి పొందగా
    వర్చసు పెల్లి యా పడతి బాలిక నొందను పోవనింటికిన్
    పర్చుచు ప్రక్కనున్ పరుపు పర్సును విప్పుచు ముద్దులాడుచు
    న్నర్చన చేసె రాత్రి సమయమ్మున భక్తుఁడు భానుబింబమున్

    రిప్లయితొలగించండి