31, మే 2018, గురువారం

సమస్య - 2693 (రక్తముఁ ద్రాగెదను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..
"రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే"
(లేదా...)
"రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో"

100 కామెంట్‌లు:



  1. దోమల సందోహం :)


    "యుక్తము కుట్టుము మనుజుల
    శక్తి కొలదిగా జిలేబి ! సఖి, నా దోమా !
    ఫక్తుగ నినువెను కాడుచు,
    రక్తముఁ ద్రాగెదను చెలియ" రమ్మనెఁ బ్రియుఁడే :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మశక రక్తము (అందులో అన్ని గ్రూపులూ ఉంటాయి) 😊🙏👏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    2. మీ క్రిస్మస్, దోమల రెండు పద్యములు బాగున్నవి. వైవిధ్యమైన అంశాలు. దోమల లో ఆడ దోమలు మాత్రమే రక్తము తాగుతాయి. మగ దోమలు రక్తపు జోలికి వెళ్ళవు. కవి సమయం కాబట్టి మంచి ఆలోచన.

      తప్పులున్న క్షమాపణలు.

      ...రాజా

      తొలగించండి

    3. :) సూపర్ ఫైండింగ్ :)

      ఇంత వ్యత్యాసం వుందా ? ఈ మహానుభావుడెవరో మరీ "ఆడ దోమల" బాధితుడై రీసెర్చి చేసారేమో :)

      సావేజిత
      జిలేబి

      తొలగించండి
    4. 😊😊😊

      Don't believe all that you read on the net :)

      gps

      ***************************

      "The female mosquito is the one that bites (males feed on flower nectar). She requires blood to produce eggs. Her mouthparts are constructed so that they pierce the skin, literally sucking the blood out. Her saliva lubricates the opening. It’s the saliva plus the injury to the skin that creates the stinging and irritation we associate with mosquito bites."

      http://www.loc.gov/rr/scitech/mysteries/mosquitoes.html

      తొలగించండి

    5. నమో నమః కంది వారికివ్వాళ దోమల సందడే సందడి :)

      నెనరులు
      Interesting.

      జిలేబి

      తొలగించండి
    6. The speed with which u write the poems is amazing! Hats off to Zelebi!! 🙏🙏🙏🙏

      తొలగించండి

    7. సీతాదేవి గారికి నమో నమః

      టపటప యనుచున్ టైపా
      టి పదములన్ జేయగా పటిష్టత జేకూ
      రు,పడతి, జిలేబి నుపయో
      గపడునకో దేనికైన గరిమయు లేకన్ :)

      జిలేబి

      తొలగించండి


    8. పదముల నత్తొచ్చించున్
      సదనంబున తిరుగుచున్ వెసవెసగ వేయం
      గ దరువుల జిలేబులను గ
      లదే తరుణి ఫలము? గలగల గులక రాళ్ళే :)

      జిలేబి

      తొలగించండి


    9. మశకమశక పూరణలోన మా జిలేబు
      లమ్మి మాగట్టిదయ్య గలగల యనుచు
      తిరుగు చీకటీగవలెను తీరుగాను
      విశ్వదాభిరామ వినుమ విట్టుబాబు !

      జిలేబి

      తొలగించండి
    10. జిలేబీ గారూ,
      మీ పూరణ, దాని ననుసరించిన ముచ్చట్లు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

    11. గలగలమని కలదిరుగుచు
      కిలకిల నగవుల విరులవి కెఱలగ సభలో
      వలపల దాపల చేతుల
      జలజల వారెడు కవితలు జల్లు జిలేబీ!

      తొలగించండి
  2. క్రిస్మస్ పండుగ వేడుకలు:

    ముక్తికి మార్గమ్మిదియే!
    రక్తికి జీససు డొసగిన రమ్యపు దైనన్
    భక్తులు తెచ్చిన ప్రేమపు
    రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే

    King James Bible

    "He that eateth my flesh, and drinketh my blood, dwelleth in me, and I in him."

    http://biblehub.com/john/6-56.htm

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. జీపీయెస్ వారు మీకోసం శార్దూల కైపదం :)


      పారుండే సిసుడయ్య జీససునకున్ ప్రారబ్ధకర్మంబుగాన్

      జిలేబి


      తొలగించండి
    2. పురాణాలకీ నాకూ చాలా దూరము గదా!

      😊

      తొలగించండి
    3. ప్రభాకర శాస్త్రి గారూ,
      క్రీస్తురక్తంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ముందు నాకు చేతకాదంటూనే ఏదో ఒక సమయంలో ఠక్కున పూరణ పెట్టేస్తారు! ఇలా ఎన్నిసార్లు జరగలేదు?

      తొలగించండి
    4. 🙏🙏🙏

      నిద్ర పట్టదు సార్! ఏమిచేయగలను?

      తొలగించండి


    5. నిదుర పట్టదు గురువర నేమి చేతు
      నయ్య పూరణలను వేతు నయ్య శక్తి
      కొలదియు! పురాణముల కత కొంచె మైన
      తెలియదయ చేతు నెట్లవి తేట గీతి :)

      జిలేబి
      దొందూ దొందే ఇక్కడా నిద్ర పట్టని బామ్మే :)

      తొలగించండి

  3. దోమల సంభాషణ :)


    "వక్తుల మంచు తోయదము, పాలు,జిలేబుల, తైరులన్, భళా
    శక్తికి ద్రావి కొమ్ముగల సారము లొప్పు జనాళి యీ కవుల్ !
    ఫక్తుగ నీ మెయిన్నడతు ! పాముచు కుట్టుము వీరలన్,సఖీ,
    రక్తముఁ ద్రాగెదన్ జెలియ", రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. భక్తిగ పూజించిన మరి
    శక్తికి మించిన ఫలితము సరిలే దనుచున్
    యుక్తిగ ననురా గంబున
    రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే

    రిప్లయితొలగించండి
  5. వ్యక్తులు వేవురుండిరి నివాసమునన్ , మరుగింత చిక్కదే !
    శక్తము గాదులే శయనశాలకు బోవ, రమించుటెట్లొ ? సు...
    వ్యక్తము వాంఛ ! కాదనకుమా ! మధురాధర బింబలిప్తమౌ
    రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో !!

    రక్తము... ఎరుపురంగు

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మధురాధర బింబలిప్తమౌ రక్తముఁ :)

      అవధాను లంటే మజాకాయా !అదురహో !


      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారికి వందనములు 🙏🙏

      ...మైలవరపు మురళీకృష్ణ

      తొలగించండి
    3. మైలవరపు వారి పూరణ మధురంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి


  6. శక్తికి, యుక్తికి, రక్తికి
    ముక్తికి, భక్తికి శుభాంగి ముప్పొద్దులటన్
    భుక్తికి జిలేబి, నీయను
    రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      వృత్త్యనుప్రాసతో మీ పూరణ మనోజ్ఞంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  7. ముక్తిని కోరబోము మరిమూఢుల వోలె సుఖాల తీరముల్
    శక్తిని మించు కోరికలు చల్లని మల్లెల పిల్లవా యువుల్
    యుక్తిగ కుట్టు దోమలను నెవ్విధి జంపిన శోణమున్ చవిన్
    రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొంత అన్వయదోష మున్నది!

      తొలగించండి
  8. అమరుని జేయగన్ అధరామృతమనె ఉత్తమ
    జాతి ప్రియుడు
    కళ్ళవి కార్చె మద్యమనుచు తూలుతు పేలే
    మధ్యమ గతుడు
    అధముడదె శాడిజోపహతుడు కౌతుకమున
    తాననె భామతో
    రక్తము ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చె
    బ్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  9. (దుశ్శాసనుని వధించి వేణీసంహారానికై ద్రౌపదిని
    పిలుస్తున్న భీమసేనుడు )
    "సక్తతతోడ వీడు కురుసభ్యులముందర కొప్పులాగె ; నీ
    దిక్తటముల్ ధ్వనింపగను దీనవు నీదగుచీరనూడ్చె; నా
    యుక్తతలేని కావరు మదోద్ధరు జంపితి ; వెచ్చవెచ్చనౌ
    రక్తము ద్రాగెదన్ జెలియ! ర"మ్మనిపిల్చె బ్రియుండు ప్రేమతో .

    రిప్లయితొలగించండి
  10. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,


    రక్తిగ బ్రేమ జంట మకరందపు టూహలలో విహార ‌ మా

    సక్తిగ జేయుచుండు నెడ సర్పము కాటిడె బ్రేయసిన్ || " నినున్

    యుక్తి - చికిత్స జేయు చెటులో బ్రతికించెద | బాము కాటుపై

    రక్తము ద్రాగెదన్ జెలియ ర " మ్మని పిల్చె బ్రియుండు ప్రేమతో



    { యుక్తి - చికిత్స = చట్కా వైద్యము }

    ..................................................................

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  11. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2693
    సమస్య :: *రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని బిల్చెఁ బ్రియుండు ప్రేమతో.*
    ‘’రక్తం త్రాగుతాను రా’’ అంటూ ప్రియుడు ప్రేమతో పిలిచినాడు అని అనడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: కీచకుని దౌర్జన్యాన్ని తలచుకొని కుమిలిపోతూ ఉన్న ద్రౌపదిని ఓదారుస్తూ భీమసేనుడు ఓ ప్రియా ! వీరాధివీరులైన భర్తలు ఉండగా నీవు ఇలా బాధపడటం తగదు. నీవు యుక్తితో ఆ కీచకుని ఈ రోజు రాత్రికే ఈ నర్తనశాలకు రమ్మని పిలువు. ఈ ఉగ్ర భీమసేనుని శక్తిని చూపించి వాడిని చంపి యమలోకానికి పంపిస్తాను. బాధపడకు దగ్గరకు రా అంటూ పిలిచే సందర్భం.

    యుక్తమె రోదనల్ సలుప యోధులు భర్తలు గాచుచుండ ? నీ
    నక్తమె కీచకున్ దునుమ నర్తనశాలకు బిల్వుమా ప్రియా
    యుక్తిగ, భీమశక్తిని మహోగ్రతఁ జూపి వధింతు నేనె, త
    *ద్రక్తముఁ ద్రాగెదన్ జెలియ! రమ్మని బిల్చెఁ బ్రియుండు ప్రేమతో.*
    *కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.* (31-5-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మీపద్యమ్ముల వెంటవచ్చు కథలున్ మీ వ్యాఖ్యలో నేర్పులున్
      మీ పర్యుక్తుల బూర్వ గాథలహరీ మేధః ప్రియాఖ్యానముల్
      మీ పేరొందిన శ్రావ్య కంఠమున బ్రాహ్మీస్తన్య దుగ్ధోర్మికల్
      దీపించెన్ గద రాజశేఖర సుధీ దీవ్యన్మహా వాఙ్నిధీ!

      తొలగించండి
    3. కోటవారికీ, చిటితోటి వారికీ నమోనమః! 👌👌👌💐💐💐🙏🙏🙏

      తొలగించండి
    4. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
      ******
      విజయకుమార్ గారూ,
      కోట వారిని ప్రశంసించిన మీ పద్యం మనోహరంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    5. నిజముగ నాదు పద్యముల నిత్యముఁ జూచుచు సంస్కరించుచున్
      భుజమును తట్టుచుండ పరిపూర్ణ ప్రశంసల నందుచుంటి నో
      సుజన! వధాని వర్య! గుణశోభిత! హే చిటితోటి వంశజా!
      విజయకుమార! మాన్యవర! విజ్ఞుడ! మీకు కృతజ్ఞతాంజలుల్.
      కోట రాజశేఖర్ నెల్లూరు (31-5-2018)

      తొలగించండి
    6. సహృదయులు శ్రీ మిస్సన్న గారికి ధన్యవాదాలు.

      తొలగించండి
    7. శ్రీమతి సీతాదేవి గారికి హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించండి

    8. వావ్ ! కోట వారు మీరసాధ్యులు !

      వాక్యాలనే ఛందస్సులో చంపకమాలలో నిమిడ్చేరు !!!!


      జిలేబి

      తొలగించండి
  12. రక్తిని కోరుచు ముదమున
    యుక్తిగ పిలిచెను చెలిమిగ యుద్వే గమునన్
    ముక్తికి మార్గము ప్రియమగు
    రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చెలిమిగ నుద్వేగమునన్' అనండి.

      తొలగించండి
  13. డా.పిట్టాసత్యనారాయణ
    యుక్తమయుక్తము గానక
    రిక్తపు వాగ్దానపరుని రెక్కలు విరువన్
    శక్తుడ సుకవిని దుష్టుల
    రక్తము ద్రాగెదను చెలియ రమ్మనె బ్రియుడే

    రిప్లయితొలగించండి
  14. డా.ఎన్.వి.ఎన్.చారి
    శక్తిని గోరుచున్ పతికి శారద వైద్యుని సంప్రదించగా
    రక్తము లేదు నాతనికి రాసెదమందులు వాడుమన్నచో
    యుక్తిని బీటురూటురసముంచగ భర్త యు మేలమాడి"సం
    రక్తము, ద్రాగెదన్ జలియ రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో"

    రిప్లయితొలగించండి
  15. వ్యక్త ము చేసెను భయము ను
    శక్తి యుతు లు నైన శత్రు సైన్య ము లుండ న్
    యుక్త మ దె ట్ ల గు న న నరి
    రక్త ము త్రాగెదను చెలియ రమ్మనె ప్రియుడే

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టా సత్యనారాయణ
    శక్తికి బ్రాకులాటలయె, సర్వమబద్ధము మాతృమూర్తి నా
    సక్తిని గొల్వుడంచనుచు చాటుగ నిన్ నిరసించి యశ్రు సం
    సిక్తను జేయువారలె యిసీ!తగు న్యాయము జేతు నే కవిన్
    ఉక్తుల వారి నడ్డుకొను ఓరిమి(యోరిమి) జచ్చెను, వారి జీల్చి యా
    రక్తము ద్రాగెదన్ చెలియ రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  17. భోక్తగ భుజించి తదుపరి
    యుక్తముగా బీటురూటు నూరిన రసమున్
    వ్యక్తము కాగా సరసము
    "రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే"

    రిప్లయితొలగించండి
  18. ఈనాటి ఉన్మాద ప్రేమికుడు!

    యుక్తము కాదనుచు వ్యతి
    రిక్తత జూపితివి ప్రేమ రేగగ నాలో
    రక్తిని దరి జేరు వినా
    రక్తము ద్రాగెదను చెలియ రమ్మనె ప్రియుడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. 'కాదనుచును' అనండి. 'వినారక్తము'?

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు! సవరిస్తాను!🙏🙏

      తొలగించండి
    3. ఈనాటి ఉన్మాద ప్రేమికుడు!

      యుక్తము కాదనుచును వ్యతి
      రిక్తత జూపితివి ప్రేమ రేగగ నాలో
      రక్తిని దరి జేరనిచో
      రక్తము ద్రాగెదను చెలియ రమ్మనె ప్రియుడే!

      తొలగించండి

  19. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,



    .....................* శ్లే షా లం కా ర ము * ................................


    " యుక్త వయస్సులో బరువ మూగిస లాడెడు నిన్ను , నిత్యమున్

    భుక్తియు - నిద్ర మాని తలపోసెద | బ్రేమ నిమిత్తమై పరి

    త్యక్త మొనర్చెదన్ > దనువు | దావక రాగ మరంద సిక్త హృ

    ద్రక్తము ద్రాగెదన్ జెలియ ర " మ్మని పిల్చె బ్రియుండు ప్రేమతో


    { హృత్ + రక్తము = గుండెలోని రక్తము ( లే దా ) ‌ మనసు లోని

    అనురాగము ; తావక రాగ మరందసిక్త హృద్రక్తము ద్రాగెదన్ =

    నీ గుండె లో ఉన్న అనురాగ మధు సిక్త మయిన రక్తము ద్రాగెదను

    . . . . . అని ఒక అర్థము . . . . . . . . . . . . . . .


    నీ యొక్క మధు సిక్త మయిన హృదయానురాగము ద్రాగెద

    . . . . . . . . . . అని యింకొక అర్థము . . . . . . . . . . . . . . . . . }


    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,




















    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  20. యుక్తమె నీకిది? వలపును
    వ్యక్తము జేసితిని నేనె, యధరము నిమ్మా!
    రక్తిని,యిక తోడకు నా
    "రక్తముఁ ;ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే

    రిప్లయితొలగించండి
  21. భక్తుడను నీకు నిజమను
    రక్తి కలిగె మానసమున లలితాంగీ యా
    సక్తిని దంతక్షతముల
    రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే

    రిప్లయితొలగించండి
  22. యుక్తిని పాయస మందా
    సక్తిని కుంకుమము పూవు శర్కర జేర్చన్
    శక్తి నొసగు క్షీర రసా
    రక్తము ద్రాగెదను! చెలియ! రమ్మనె బ్రియుడే!

    రస+ఆరక్తము (ఆరక్తము=ఇంచుక ఎఱ్ఱనిది)

    రిప్లయితొలగించండి
  23. వ్యక్తముఁజేయుచుంటి హృదయమ్మున నీపయినున్న ప్రేమ ను
    ద్రిక్తత చెందుచుంటిని మదిన్ - విను! లేదనిచెప్పబోకుమా
    సక్తి , విషమ్ము! ఘోరముగఁ జంపును ముక్కులఁ గారిపించుచున్
    రక్తముఁ! , ద్రాగెదన్ జెలియ! రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో"
    (చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  24. భక్తుని! నీవియోగమునుఁ బాపు సుహాసిని! పంకజాక్షి! నా
    శక్తి తఱుంగుచుండె. మనసారగ నా సఖి రూపు గాంచ నా
    సక్తియు హెచ్చుచుండెను.పసందగు చందురు వంకలందు నీ
    రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  25. యుక్తమె నీ వలుగుట సం
    రక్త సులోచన మది నను రాగ మరయవే
    రిక్త కషాయము గంధ ని
    రక్తముఁ ద్రాగెదను జెలియ రమ్మనెఁ బ్రియుఁడే

    [నిరక్తము = పోనట్టిది; అక్తము =పోయినది]


    భుక్తము లెల్ల భోగములు భూరి తరమ్ముగ భార్యతోమహా
    రక్తిని నీవు గూడ మఱి రంజిలి త్రాగఁగ భర్త సన్నిధిన్
    యుక్త ఫలాతిరిక్తము మహోత్తమ శీతల పేయరాజ సం
    రక్తముఁ ద్రాగెదం జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

    [సంరక్తము = ఎఱ్ఱనిది]

    రిప్లయితొలగించండి
  26. శక్తుడనే?నీకునీయ
    రక్తము,ద్రాగెదనుచెలియరమ్మనెబ్రియుడే
    భక్తినిదెచ్చిన పాలను
    రక్తినిజేకూర్చినట్టిరమ్యపు రుచులన్

    రిప్లయితొలగించండి
  27. "రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో"
    రక్తముద్రాగునాబళిర రాక్షసజాతిని జన్మనొందెనా?
    రక్తముదానుద్రాగునటరమ్మనిపిల్చుటచూడగాజెలిన్
    రక్తినివారలొండురులురాలునుదేలిన వారలేసుమా

    రిప్లయితొలగించండి
  28. రావణాసురుడు సీతతో

    యుక్తము కాదటంచు నను నోర్పునశించగ దూరముంచుచున్
    శక్తిని గోలుపోయిన యశక్తుని రాముని దల్చనేటికిన్
    వ్యక్తము జేయవేని యొక వారము లోపల నానుకూల్యతన్
    రక్తము ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చె బ్రియుండు ప్రేమతో!

    రిప్లయితొలగించండి
  29. శక్తిగ రాక్షసుడొక్కడు
    యుక్తిగ యిద్దరిని జంపి యోచనతోడన్
    “భుక్తికి మనకగు గనుమా
    రక్తము ద్రాగెదను”చెలియ రమ్మనె ప్రియుడే.

    రిప్లయితొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (కూకటపల్లి సంతలో)

    శక్తి యొకింత లేదు సఖి సమ్మరు హీటును తాళజాలనే
    ముక్తియె కల్గునే మనకు ముచ్చట మీరిన మూడు గ్రుక్కలన్
    రక్తిగ మానసమ్మునకు రంజన నిచ్చెడి పుచ్చకాయదౌ
    రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  31. జీపీయస్ వారి ప్రోత్సాహంతో

    భోక్తగ తాఁ భుజించె ఘన భోజన మంతట వెండిప ళ్ళెమున్
    (సూక్తుల జెప్పుచు న్నతివ శోభను నెత్తురు బెంచునో సఖా)
    సూక్తుల జెప్పుచు న్నతివ క్షుద్రముఁ గాదిది జూడుమో సఖా
    యుక్తము బీటురూటనుచు నూరిన నారస మందజేయగా
    "రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. బీటురూటును రక్తమంచును భీతిగాంచె జిలేబియే :)


      జిలేబి

      తొలగించండి
  32. నక్తము లుండ కార్తికము నందున నీ యెద పొంగ గాఢమౌ
    రక్తిని నారికేళపు జలమ్మును నాకిడ కోసి తెస్తివా
    యుక్తిగ బొండము న్నిలువవో కట జూపుము లేత చేతిలో
    రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో.

    రిప్లయితొలగించండి
  33. యుక్తుల మోహపు ప్రేమలు
    రక్తిగ పెడదారి బట్టి రక్కసి ప్రేమన్
    యుక్తిగ ద్రావక దాడుల
    రక్తము ద్రాగెదను చెలియ రమ్మనె ప్రియుడే!

    రిప్లయితొలగించండి
  34. డా.పిట్టా సత్యనారాయణ
    శక్తికి బ్రాకులాటలయె, సర్వమబద్ధము మాతృమూర్తి నా
    సక్తిని గొల్వుడంచనుచు చాటుగ నిన్ నిరసించి యశ్రు సం
    సిక్తను జేయువారలె యిసీ!తగు న్యాయము జేతు నే కవిన్
    ఉక్తుల వారి నడ్డుకొను ఓరిమి(యోరిమి) జచ్చెను, వారి జీల్చి యా
    రక్తము ద్రాగెదన్ చెలియ రమ్మని పిల్చె ప్రియుండు ప్రేమతో

    రిప్లయితొలగించండి
  35. ఉత్పలమాల
    యుక్తవయస్కులై తలపు లూయల లూగిన జంట పుష్ప సం
    యుక్త వనమ్ము కేగి ప్రియుఁడొక్క గులాబిని గోట గిల్లగన్
    రక్తముఁ జింద ప్రేమికుని రాగిణి లాలనఁ జేయ నోట యా
    రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండుఁ బ్రేమతో
    (10-11-2004 నాడు నా పూరణ ఆకాశవాణి కడప కేంద్రము వారిచేత ప్రసారంచేయడం జరిగింది.)

    రిప్లయితొలగించండి
  36. కవిమిత్రులకు నమస్కృతులు.
    ఉదయం నుండి 'జడ శతకము' పద్యాల సమీకరణంలో వ్యస్తుణ్ణై ఉండి మీ పూరణలపై స్పందించలేక పోయాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  37. ..............🌻శంకరాభరణం🌻...............
    .. .. .. .. .. .. 🤷🏻‍♂సమస్య🤷‍♀.. .. .. ..
    "రక్తముఁ ద్రాగెదను చెలియ
    రమ్మనెఁ బ్రియుఁడే"

    సందర్భము: "ఇదేదో పూర్వకర్మం! విచారించకు. ఇటురా! తేలు కఱచిన చోటు (సమీపం) చూపించు. కొరికి ఉమ్మి వేస్తాను. విషం పోతుంది. అంతే!"
    అంటున్నాడు భార్యతో ఒక భర్త.
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    "ప్రాక్తన కర్మమె! కొరికెద
    యుక్తిగఁ దేల్ కఱచిన దరి;
    నుమిసెద విష ;మా
    సక్తిగఁ జూపవె వేగమె!
    రక్తముఁ ద్రాగెదను చెలియ!"
    రమ్మనెఁ బ్రియుఁడే..

    2 వ పూరణము..

    సందర్భము: "ఈ మంత్రిగారు జనాల రక్తం బాగా పీల్చినాడు. వీని రక్తం నేను పీలుస్తాను చూడు."
    అంటున్నాడు ఒక జలగ ప్రియుడు భార్యతో..
    ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ ~
    రక్తుడు జలగ ప్రియుడు కద!
    "శక్తి కొలది మంత్రిగారు జను లందరిదౌ
    రక్తముఁ బీల్చెనె! యీతని
    రక్తముఁ ద్రాగెదను చెలియ!
    ర " మ్మనెఁ బ్రియుఁడే..

    🖋~డా.వెలుదండ సత్య నారాయణ

    రిప్లయితొలగించండి
  38. రక్తం త్రాగే మగ నల్లి/చీమ/జలగ అన్నట్టుగా


    1.శక్తియు వీరికి గలదిక
    రక్తము త్రాగెదను ,చెలియ రమ్మనె ప్రియుడే
    భుక్తియు తీరును మనకిట
    రక్తియు కలుగును జనముల రక్తము ద్రావన్.
    భీముడు ద్రౌపదితో
    2.శక్తియె నాయుధమవగా
    రక్తము త్రాగెదను చెలియ రమ్మనె ప్రియుడే
    యుక్తిగ వానినణచి నే
    రక్తిని కూర్తును రణమున రమణీ మణిరో.

    రిప్లయితొలగించండి
  39. కందం
    రక్తికి నర్తనశాలకు
    యుక్తిగ సింహబలుఁ జేర్చ వ్యూహముఁ బన్నన్
    శక్తుడఁ వానిన్ గూల్చఁగ
    రక్తముఁ ద్రాగెదను చెలియ రమ్మనెఁ బ్రియుఁడే

    రిప్లయితొలగించండి
  40. రక్తిని కట్టుగా నుడుకు రక్తము గ్రోలగ మాధురీమణీ
    శక్తిని నిచ్చుగా పెదవి చక్కగ నొక్కుచు పీల్చుచుండగా
    ముక్తిని డెంగితో నిడుదు మూర్ఖుడు పండిత శాస్త్రివర్యుకున్
    రక్తముఁ ద్రాగెదన్ జెలియ రమ్మని పిల్చెఁ బ్రియుండు ప్రేమతో!

    రిప్లయితొలగించండి