11, అక్టోబర్ 2018, గురువారం

సమస్య - 2814 (వాలిని భార్యగా...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్"
(లేదా...)
"వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్"

93 కామెంట్‌లు:

  1. శూలాయుధుండు జగముల
    పాలించెడి వాడు హరుడు పరమేశ్వరుడే
    కాలుండని పేరు సినీ
    వాలిని తన సతిగగొన్న స్వామియె ప్రోచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలగ భండ తనయు నవ
      లీలగ ఖండన మొనర్చ లేతగు చేతిన్
      చాలిత రక్తాంకిత కర
      వాలిని తన సతిగగొన్న స్వామియె ప్రోచున్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      రెండవ పూరణలో మొదటి పాదం అర్థం కాలేదు. వివరించండి.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా!

      లలితా పరమేశ్వరియే బాలా త్రిపుర సుందరిగా భండాసుర సంహారంలో భండాసురుని పుత్రుని వధిస్తుంది!
      “భండపుత్ర వధోత్సుక్య బాలా విక్రమ నందితా” యని లలితా సహస్రనామములలో ఒక శ్లోకం! దాని ఆధారంగా పూరించాను!
      🙏🙏🙏🙏

      తొలగించండి
    4. క్షమించాలి! “భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందితా”!

      తొలగించండి
  2. మేలుగ నహల్యఁ బ్రోయుచు
    గేలిగ హరువిల్లుఁ ద్రుంచ గింగురుమనగా
    వీలుగ సీతను;...తునుమను
    వాలినిఁ;...దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      పద్యం బాగుంది. కాని సీత రావణసంహారానికి కారకురాలైంది. వాలి వధకు కాదు కదా!

      తొలగించండి
    2. వాలిని చంపకుండా రావణుడను చంపడం ఎలా సాధ్యం సార్ ;)

      తొలగించండి


  3. కాలంజరి,కాత్యాయని,
    కాలక,కాళిక,కిరాతి,గౌరమ్మ,జయం
    తీ, లంభ, బాభ్రవి, సినీ
    వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కందం చిన్నదై పోయింది యేమి చేద్దాం :)


      జిలేబి

      తొలగించండి
    2. నమస్తే జిలేబి గారూ ! సినీ వాలి = అనగా ? ?

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      పార్వతికి ఉన్న పర్యాయపదాల లిస్టుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      గురుమూర్తి గారూ,
      సినీవాలి అంటే రెండర్థాలున్నాయి. ౧) చంద్రకళ కనిపించే అమావాస్య, ౨) పార్వతి.

      తొలగించండి

    4. గురుమూర్తి గారు

      పైన కంది వారర్థం చెప్పేసారు .


      ఈ కాలానికి అర్థం చెప్పు కావాలంటే సినీ - సినిమా లో వాలి - కోతి - హీరో :)


      జిలేబి

      తొలగించండి
  4. మైలవరపు వారి పూరణ

    కాలుని గెల్చి బాలకుని గాచినవాడు , దయార్ద్రుడౌచు శ్రీ...
    కాళభుజంగరాజముల గాచి విముక్తినొసంగినాడు , కా...
    పాలియె కాని లోకముల పాలకుడాతడె , ఈశుడౌ , సినీ...
    వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిరుసవరణతో... (మన్నించండి)

      కాలుని గెల్చి బాలకుని గాచినవాడు , దయార్ద్రుడౌచు శ్రీ...
      కాళమదేభరాజముల గాచి విముక్తినొసంగినాడు , కా...
      పాలియె కాని లోకముల పాలకుడాతడె , ఈశుడౌ , సినీ...
      వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. 🙏శ్రీశక్త్యె నమః🙏

      లీలారూపిణి , శ్రీ చ...
      క్రాలయ , శక్తిస్వరూపఁ , గాళిఁ గరాళిన్
      మాలీకృత రుండను , కర...
      వాలినిఁ దన సతిగ గొన్న స్వామియె ప్రోచున్!!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    3. అద్భుతమైన పూరణలు అవధానిగారూ! అభినందనలు!🙏🙏🙏

      తొలగించండి
    4. నమస్తే అవధానిగారూ ! సినీ వాలి = ? ?

      తొలగించండి
    5. మైలవరపు వారి రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      *****
      సినీవాలి = చంద్రకళ కనిపించే అమావాస్య, పార్వతి.

      తొలగించండి
  5. డా. పిట్టా సత్యనారాయణ
    వాలము లేకనె నరుడగు
    జాలమ్మది యేల నరుడె జాయగ గూడన్
    కాలము మారెను నొక"గై"
    వాలిని తన పతిగ గొన్న;స్వామియె ప్రోచున్

    రిప్లయితొలగించండి


  6. మాలిని !నందయంతి! సతి! మాతృక !కౌశికి కొండచూలి చం
    డాలిక ! నీలలోహిత! మృడాని ! జయంతి ! భవాని! సౌమ్యయున్,
    కాలక! అన్నపూర్ణ ! ఉమ! కాళిక! పార్వతి ! శక్తి యా సినీ
    వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      కందం సరిపోలేదని వృత్తాన్ని స్వీకరించారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
      మొన్నెప్పుడో మీరు నాకేమో పంపానన్నారు. నాకైతే ఇంతవరకు అందలేదు.

      తొలగించండి
  7. మాలిని ,దశభుజ ,భార్గవి
    కాలక ,గాంధర్వి ,పింగ, కాలంజరి చం
    డాలిక, పురుహూతి,సినీ
    వాలినిఁ, దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణసూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      దేవతల పర్యాయ పదాలతో పద్యం వ్రాయడం మీకు కొట్టినపిండి.

      తొలగించండి

  8. కం

    కూలార్చె రాఘవు డనిని
    మేలునిడెడు రాముడు కడు మేలిమి సీతన్
    పాలిత సుర సీతాపతి
    వాలిని, దన సతిగ గొన్న స్వామియె, ప్రోచున్


    🌱🌱 ఆకుల శాంతి భూషణ్🌱🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  9. పాలనియై లోకములకు ;
    మాలినియై స్తుతిసుమముల ; మదమత్సర దై
    త్యాలివధోద్ధురధరకర
    వాలిని ; దనసతిగ గొన్న స్వామియె ప్రోచున్ .

    రిప్లయితొలగించండి
  10. కాలుడునగజాధీశుడు
    ఫాలాక్షుడుసాంబశివుడుభస్మాంగుండా
    మాలతినింబోలు సినీ
    వాలినిదనసతిగగొన్నస్వామియెప్రోచున్

    రిప్లయితొలగించండి
  11. పాలాక్షు డు పరమేశుడు
    కాలు డు శశి మౌళి శివుడు గంగాధరు oడా
    శూలి సుర లు కోరసినీ
    వాలి ని దన సతి గ గొన్న స్వామి యె ప్రోచు న్

    రిప్లయితొలగించండి
  12. పూర్వము వృక్ష రాజు అను మహనీయుడు దగ్గిరలో నున్న కొలనులో స్నానము చేసి బయటకు రాగానే అతడు చక్కని స్త్రీ రూపము దాల్చాడు . ఒకనాడు ఇంద్రుడు ,సూర్యుడు ఆ దోవలో వెళ్తూ ఆ సుందరమగు స్త్రీని చూచి మోహించి ఆవిడతో సంగమించారు . అప్పుడు ఇంద్రుని వలన వాలి సూర్యుని వలన సుగ్రీవుడు పుట్టారు. వృక్ష రాజును తన భార్యగా గొనిన ఆ ఇంద్రుడే తన పుత్రుడైన వాలిని కాపాడుతాడు. రాముని తో జరుగ బోవు ఈ యుద్ధములో నీవు ఇంద్రుని (నీ మామ తండ్రి గారు) పూజ చేయమని, ఆయనే కాపాడుతాడు అని ఒక వృద్ధ స్త్రీ తారకు చెప్పినదను భావన

    కంద పాదమును సీసములోనికి మార్చి నా పూరణము

    స్నానము చేయ విస్మయముగ వృక్షరాజు తనువు మారి , నెలతుక నయ్యె,
    దారిని బోవుచు స్వారాట్టు,రోహిత్తు లిరువురు మోహించి సురతము సలు
    ప దినమణికి బుట్టె బలుడు సుగ్రీవుడు, బలబేధి వనితను కలసి యిచ్చె
    నుగ వాలినిఁ, దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్ సతము తన పుత్రుని, వెత
    బడగ వలదు.మాతా ,పూజ భక్తి తోడ
    చేసి కోరుము యింద్రుని, యీ సమరము
    లోన నీ వల్లభునకు గెలుపు కలుగగ
    ననుచు తారతో యనె వృద్ధ వనిత యొకతె



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ సీసపద్య పూరణ బాగున్నది. అభినందనలు.
      'కోరుము + ఇంద్రుని + ఈ' అన్నపుడు యడగమం రాదు. "కోరుమా యింద్రుని నీ సమరము" అనండి.

      తొలగించండి



  13. పరమాత్ముడొకడే పురుషుడు తతిమ్మా అందరు నెచ్చెలులే

    లోలాక్షి! పురుషుడొకడే
    నే! లోతక్కువ జనులిక నెచ్చెలు లే లె
    మ్మా! లాఘవముగనడచచు
    వాలిని, దన సతిగ గొన్న స్వామియె, ప్రోచున్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం చివర 'నడచుచు/నడపుచు' అని ఉండాలనుకుంటాను. టైపాటా?

      తొలగించండి

  14. ఆ లయకారుడు భవుడా
    ఫాలాక్షుడు భవహరుడగు భసితాంగుండున్
    హేలగ గిరిసుతను సినీ
    వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్"*

    మరొక పూరణ

    బాలుని బ్రోచిన శంకరు
    డాలమునందున.త్రిపురుల నంతము చేసెన్
    లీలగ కరమంది సినీ
    వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్.

    రిప్లయితొలగించండి
  15. పూల మృదుత్వము నేయవ
    లీలగనే తాజయించు లీలావతినిన్
    మేలగు నడత గల సినీ
    వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్

    రిప్లయితొలగించండి
  16. మేలుగ మనసున దలచిన
    జాలిని చూపించి వేగ సర్వజ్ఙుండే
    శూలియె, త్రినేత్రుడు సినీ
    వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్.

    రిప్లయితొలగించండి
  17. ఫాలాక్షుండగు భద్రుడు
    కైలాసమ్మున వసించు కరకంఠుండే
    శైలేంద్రుని పుత్రి సినీ
    వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్

    రిప్లయితొలగించండి
  18. బాలుడు మార్కండేయుని
    కాలుని పాశమ్మునుండి గాచిన దొరయౌ
    ఫాలుండౌ శివుడు సినీ
    వాలిని దన సతిగ గొన్న స్వామియె ప్రోచున్!!!

    రిప్లయితొలగించండి
  19. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి పూలతో అంకితం)

    నీలపు మేఘముల్ కురిసి నేలను నింగిని హాయిదేల్చగా
    మాలల నింపుగా నిముడు మల్లెలు జాజులు బంతి చెండ్లతో
    పూలను మేలుగా నిలిపి ముచ్చట మీరిన కొల్వులొందు ఫూల్
    వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్

    ఫూల్ వాలి = (పూలతో విరాజిల్లునది) బతుకమ్మ (మహా గౌరీ దేవి)
    https://en.m.wikipedia.org/wiki/Bathukamma


    *****************************

    మైలవరపు వారి స్పందన:


    చక్కగా ఉందండీ.. చివర్లో... పూ వాలిని... అంటే మరింత సొగసు గా ఉంటుంది... నమోనమః 🙏🙏

    వాలి.. వలతి ఇతి... ధరించేది... అని అర్ధం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. బతుకమ్మకు పూవాలి అని పేరుకనుక్కున్నందుకు వేసుకోండి వీరత్రాడు

      అద్భుతః


      జిలేబి

      తొలగించండి
    2. సీతా దేవి గారికి ధన్యవాదములు.

      జిలేబి గారూ: మీరిచ్చిన వీరతాడు మైలవరపు వారు లాగేసుకుంటారేమో! పోనీ లెండి...కంది వారి స్టాకులోనుంచీ ఒకటి తస్కరిస్తాను...ఆషాఢభూతిలా...

      తొలగించండి


    3. మైలవరపు వారికి వీరత్రాడెందుకు జీపీయెస్ వారు ! వారే వీరత్రాడు వేరే దేనికి

      మనలాంటి సామాన్యులకే అప్పుడప్పుడూ అవసరం సెబాసో అని భుజాలను చరుచుకోవడానికి :)

      కాబట్టి మీ ఖాతాలోకే అది.


      జిలేబి

      తొలగించండి
    4. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      మీరు ప్రయోగించిన 'ఫూల్‌వాలి' ప్రయోగమే సముచితంగా ఉన్నది. మైలవరపు వారన్నట్లు 'పూవాలి' అంటే దుష్టసమాసమయ్యే అవకాశం ఉంది.

      తొలగించండి
  20. (అష్టాదశ నామాలతో అమ్మకు...)

    కాలిక గట్టుపట్టి యుమ కర్వరి కౌశికి నందయంతి చం
    డాలిక కప్పుటైదువ మృడాని కపాలిని భద్రకాళియౌ
    శైలజ సింహయాన సతి శాకిని శాంభవి శక్తి యౌ సినీ
    వాలిని భార్యగా గొనిన స్వామి జగమ్ముల బ్రోచు నెప్పుడున్!!!

    రిప్లయితొలగించండి
  21. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2814
    సమస్య :: వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ముల బ్రోచు నెప్పుడున్.
    *వాలిని భార్యగా పొందిన స్వామియే జగద్రక్షకుడు* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: *శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్* అని ఆదిశంకరాచార్యులవారు తాను రచించిన సౌందర్యలహరి అనే గ్రంథంలో చెప్పియున్నారు కదండీ. ఇల్లాలు తోడుగా ఉంటేనే పురుషుడు సంపూర్ణంగా శక్తిశాలి ఔతాడు అనడం సత్యం సుమండీ. శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తగ్గించేందుకు శ్రీరాముడుగా అవతరించి రాక్షస సంహారం చేయదలచి శక్తిమంతు డయ్యేందుకు శక్తి స్వరూపిణి శ్రీ లక్ష్మీస్వరూపిణి భూజాత ఐన సీతను వరించినాడు. భవిష్యత్తులో లంకాదహనమునకు కారణం కాగల అగ్ని యైన సీతాదేవిని భార్యగా స్వీకరించిన ఆ సీతాపతి ఆ స్వామి సర్వజగద్రక్షకుడు అని విశదీకరించే సందర్భం.

    శ్రీ లలనా స్వరూపిణిని, సీతను, భూజను బెండ్లియాడి, దా
    నాలము లోన రాక్షసుల నంతము జేయగ రామచంద్రుడున్
    లీల జరించె, భావి నవలీలగ లంక దహింపజాలు తత్
    జ్వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ముల బ్రోచు నెప్పుడున్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (11-10-2018)

    రిప్లయితొలగించండి
  22. : శైలజను కలుప మదనుడు
    కోలలను విడువ దహించి కోపముతోడన్(కోటేశ్వరుడే)
    మాలిమితోచేరి సినీ
    వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్

    రిప్లయితొలగించండి
  23. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,

    దయచేసి నిన్నటి పూరణ ‌ స్వీకరించండి .


    పొరపాటున పద్యం మత్తేభంలో వ్రాశాను . చేయునది లేక సమస్యను
    -------------------------------------------------------------------------------------------------
    కూడా మత్తేభం లోనికి మార్చాను .
    -----------------------------------------------
    ‌ ‌
    కావున నన్ను క్షమించండి
    ***********************


    [ ఒక శైవమతస్తుడు ఇలా వాదించాడు ]

    '''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''


    సుర దైతేయ నికాయ మప్డు సుధ కై శోధించుచున్ , క్షీరసా

    గర మున్మంథ మొనర్చు వేళ విష ముగ్రంబై జనింపంగ , మా

    హరుడే గ్రోలి - గళమ్మునన్ నిలిపి భీత్యర్తిన్ నివారించె || నా

    హరిసంసేవిత సద్గుణాకరుడు - ‌ సర్వాఘాయు నిర్వేద సం

    హరుడౌ మా హరుడే కలిప్రజల గాపాడున్ గదా నిత్యమున్ |

    హరుడే వర్ధిలె ‌ దేవుడై తిరుమల న్నత్యంత సంప్రీతితోన్ |

    తిరు ‌ '' శ్రీ " యౌ | మల " కొండ "యౌను | కవి ! కానన్ సమర్థం బగున్ |


    { ఉన్మంథము = మథనము ; భీతి + అర్తి = భీత్యర్తి ;

    అర్తి = ఆర్తి = దుఃఖము ; ‌‌‌‌అఘాయువు = ‌ పాపము ; ‌‌‌ }


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      సమస్యాపాదాన్ని మార్చి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. ఫాలమునందునన్దనరుభస్మపురేఖలుదేజరిల్లగా
    గాలునిరూపమున్గలిగిగావుచుభక్తులనెల్లవేళలన్
    మాలతివోలెనాగలుగుమాయమ,శ్రీసతియైనయాసినీ
    వాలినిభార్యగాగొనినస్వామిజగమ్ములబ్రోచునెప్పుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..గాచుచు భక్తుల...' అనండి.

      తొలగించండి
  25. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    వాలిని భార్యగా గొనిన స్వామి
    జగమ్ముల బ్రోచునెప్పుడున్
    ========================
    లోకములను పాలించు ఏ దేవుడికిని
    వాలి భార్యగా ఉన్నట్లు కనిపించదు,
    పైగా గౌతముని భార్య అహల్య, దేవ-
    రాజు ఇంద్రునికి అక్రమ సంతానంగా
    పుట్టిన వాలి పురుషుడు కూడాను,ఈ
    తీరున కనబడు అసంబద్దతె సమస్య
    =========================
    సమస్యా పూరణం - 280
    ==================

    తల్లి కదా తానందరికి చండిక-
    శక్తిగ తాను అఖండిక
    అమ్మల కమ్మగ మాతృక-
    సురలు అసురుల మొక్కుల పాతృక
    దుష్టుల దునుమాడి దీపించెను-
    తానై కపాల కరవాలిని
    భార్యగా గొనిన స్వామి-
    జగమ్ముల బ్రోచునెప్పుడున్ మాలిని

    ====##$##====

    సూక్ష్మము అణువు, అతి సూక్ష్మము
    పరమాణువు, అట్టి పరమాణువున కేంద్రకము
    చుట్టు కక్ష్యలుగా చలించునవి ఎలక్రానులు,
    ప్రోటానులు,న్యూట్రాన్లు,కేంద్రక విఛ్ఛిత్తి, కేంద్రక
    సమ్మేళనములుగా అపార శక్తి వెలువడును.

    "యాదేవీ సర్వభూతేషు -
    శక్తి రూపేణా సంస్థితః "

    ప్రయివేటు ఆర్టీసీ బస్సు "పల్లె వెలుగును"
    పరిశుభ్రంగా ఉంచుకుని జాగ్రత్తగా చూసుకునే
    డ్రైవర్ ఇంజిన్ బానెట్ పై " నేను శక్తిని నాపై
    కాళ్ళు పెట్ట కూడదు " అని వ్రాయిస్తాడు.

    వాడికి తెలిసిన శక్తి నిర్వచనం మనలో
    చాలా మందికి తెలియదేమో !

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  26. రిప్లయిలు
    1. కాల మహిమ నగ్ని యలుఁగ
      జ్వాలిగ నంగిరసుఁ డయ్యె భారము మోయన్
      మే లొనగూడుఁ దమి సినీ
      వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్

      [సినీవాలి = అంగిరస మునీంద్రుని కూతురు]


      కాల సమాన తారక విఘాతక జన్మ నిమిత్త మిత్తరిన్
      శూలినిఁ గామపాశమున సోలఁగఁ జేయుము మీనకేతనా
      కాలగళుండు వీరవరుఁ గ్రౌంచనిషూదను గాంచు నీ సినీ
      వాలిని భార్యగాఁ గొనిన, స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్

      [సినీవాలి = పార్వతీ దేవి]

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణలు రెండూ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి

  27. రమేశా వారి భావనకు


    మాలిని జగజ్జననియు,క
    పాలిని,యమ్మలకునమ్మ పార్వతి గట్రా
    చూలి దునుమ నసురుల కర
    వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్


    జిలేబి

    రిప్లయితొలగించండి
  28. కాలములను లెక్క గొనక
    చాలించక తనదు దీక్ష సన్నుతి సేయన్
    శైలసుత నపర్ణ సినీ
    వాలిని దన సతిగ గొన్న స్వామియె ప్రోచున్!

    రిప్లయితొలగించండి
  29. కాళిక చంద్రశేఖరుని కాంచగ, మారుడు వేయబాణముల్
    కాలగళుండు తామదను గర్జనతో మసి చేసె చెచ్చెరన్
    శైలజ రూపురేఖలకు సంతసమొందుచు నిచ్చనా సినీ
    వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్

    రిప్లయితొలగించండి
  30. జాలియుమరచిన సత్యయె
    తేలికగాజంపెనరకదిగ్గజమును క
    ల్లోలము మాన్పినదౌ దీ
    వాలిని దనసతిగగొన్న స్వామియె ప్రోచున్

    రిప్లయితొలగించండి
  31. కాలము మారిన దనివిని
    జాలిగ నొకపేద పిల్ల జవరా లనగన్
    మేలిమి యనుకొని తుదకట
    వాలినిఁ దన సతిగఁ గొన్న స్వామియె ప్రోచున్

    వాలి = ఐంద్రి జ్యేస్టా నక్షత్రము, మాలకాకి,ఇలా....


    రిప్లయితొలగించండి
  32. ఫాలము నందు లోచనము పావన గంగయె జూటమందునన్
    శూలము చేతియందు తలఁ జుక్కల రేణిఁధరించినట్టి యా
    శూలియె పర్వతేంద్రు బ్రియసూనను సద్గుణ శీలియౌ సినీ
    వాలిని భార్యగాఁ గొనిన స్వామి జగమ్ములఁ బ్రోచునెప్పుడున్

    రిప్లయితొలగించండి
  33. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    వాలిని భార్యగాఁ గొనిన
    స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్

    సందర్భము: కవి యశక్తత.. తీర్థ యాత్రలలో ప్రయాణపు బడలిక.. అనేక కారణాలవల్ల వ్రాయా లని వున్నా వ్రాయలేక పోవడం.
    పరమేశ్వరుడు నన్ను మన్నించు గాక! జగములను బ్రోచు గాక!
    పూరి= పూరీ (పుణ్య క్షేత్రం).
    సినీవాలి= పార్వతి
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మేలుగ "పూరి"లో నిదుర
    మేల్కొని నే డుదయానఁ జూచితిన్
    లీలగ నే సమస్య యని
    నే ; నపుడే మది దోచెనే "సినీ
    వాలి" పదంబు నందముగ
    వ్రాయగనైతి ; క్షమించి నన్, సినీ
    వాలిని భార్యగాఁ గొనిన
    స్వామి జగమ్ములఁ బ్రోచు నెప్పుడున్

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    11.10.18
    -----------------------------------------------------------
    శ్రీ సూరం శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలతో..

    రిప్లయితొలగించండి