12, మార్చి 2024, మంగళవారం

సమస్య - 4703

13-3-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఒరియాకున్ సాటి వచ్చునొకొ తెలుఁ గధిపా”
(లేదా...)
“ఒరియా భాషకు సాటి వచ్చునె తెలుం గోకృష్ణరాయాధిపా”

26 కామెంట్‌లు:

వివియన్ వరలక్ష్మి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వివియన్ వరలక్ష్మి చెప్పారు...

అరయగ ప్రపంచ నుడులను
కొరియా తెలుగు నుడులెట్టి కొదువ నెఱుగకన్
వరనుడులై గెలిచినన
క్కొరియాకున్ సాటి వచ్చునొకొ తెలుగధిపా

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
పరమేశ్వరుని డమరొలుక
దొరలిన నక్షరసిరులను దూగు తెలుగదే
భరతావని లెస్సయనఁగ,
నొరియాకున్సాటి వచ్చునొకొ తెలుఁ గధిపా!

మత్తేభవిక్రీడితము
పరమేశుండల వెండికొండ డమరున్ వాయింప నృత్యంబునన్
దొరలన్ బుట్టెఁ దెనుంగు నక్షరములున్ దూగంగ లేవేవియున్
భరతోర్విన్గన లెస్సయంచుఁ దమరున్ బల్కంగ సత్యమ్మదే
ఒరియా భాషకు సాటి వచ్చునె తెలుం గోకృష్ణరాయాధిపా!

('దేశభాషలందు తెలుగులెస్స'
ఒరియా భాషను సైతము మించును గాని సమూనము కాదు అను భావముతో)

కంది శంకరయ్య చెప్పారు...

ఆ + కొరియా = అక్కొరియా అవుతుంది. కాని సమస్యలో ఉన్నది ఒరియా.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

ఒరియా ఘనమగు నొడ్డుల
కరయగ నమ్మనుడి మేలు నందరికినదే
ఒరియా ప్రజ భావనయిన
నొరియాకున్ సాటి వచ్చునొకొ తెలుగధిపా

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

పర భాషా వ్యామోహము
నర నర ముల పొంగి పొరల నయ వంచకు డై
తర తమముల మరచి యనియె
" నొరియా కున్ సాటి వచ్చు నొకొ తెలు గ ధి పా!"

BMahalakshmi చెప్పారు...

గరిమన్ప్రాకృతమాండలీకమునవేగంబందుముచ్చట్లతో
అరబిక్లోనుగభాషలందుగననౌనొయ్యారంపునాట్యంబుతో
సరిగంచున్గనశేముషీవిభవమాసద్భాషతెల్గంచునున్
ఒరియాభాషకుసాటివచ్చునె తెలుంగోకృష్ణరాయాధిపా

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

నమస్కారములు,
గెలినిలిచె అని వ్రాసి ఊరుకోక మార్చాను.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

విరించి చెప్పారు...


దురహంకారి యొకండనె
పరిహాసముతోడ మేటి ప్రజ్ఞానులతో
నరయగ నుత్కళమందున
ఒరియాకున్ సాటి వచ్చునొకొ తెలుఁ గధిపా.


సరియేలేదని తెల్గుభాషకిట దేశంబందు శ్రేష్ఠంబనిన్
పరిభాషించుట సత్యమైన నిక నా వ్యాహార మాలించుమా
పరిభాళింపక నుత్తరమ్మిడుము మా ప్రాంతమ్మొ డిస్సాన నా
ఒరియా భాషకు సాటి వచ్చునె తెలుం గోకృష్ణరాయాధిపా.


(ఒడిస్సా రాష్ట్రంలో సంఖ్యాపరంగ ఒరియా పలికెడి వారికన్న తెలుగుమాటాడెడి వారు తక్కువని ఉద్దేశ్యము )

M.B.G.TILAK చెప్పారు...

ఒరియా యాత్రికుడొక్కడు
పరవశమున తెలుగును విని ప్రశ్నించె నిటుల్
సరియగు తెలుగున్నెరుగక
నొరియాకున్ సాటి వచ్చునొకొ తెలుఁ గధిపా

వరవీణామృదుపాణి పూన్చె తెలుగున్ భాషాశిరోరత్నమున్
సరిగా తెల్గును నేర్వనట్టి ఘనుడై సందేహ నివృత్తికై
నొరియా యాత్రికుడొక్కరుండనె తెలుంగొయ్యారమై తోచగా
నొరియా భాషకు సాటి వచ్చునె తెలుం గోకృష్ణరాయాధిపా

Sitharamayya Solasa చెప్పారు...

పొరుగున నుండిన యొడిశా
దరిదాపుల నెదిగినట్టి దారకునడుగన్
యెరిగించె నివ్వి మధంబుగ
ఒరియాకున్ సాటి వచ్చునొకొ తెలుఁ గధిపా

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ ఎరుగనె ఒరియా భాషను
మరులు తెలుఁగు కన్నడముల మాధురి యనఁగా
నరయక భాష నుడువనయ
“ఒరియాకున్ సాటి వచ్చు నొకొ తెలుఁగథిపా”

మ॥ అరయన్ మేదిని భాషలన్నియు మనోహారంబులై యొప్పఁగన్
భరతంబందున నేల భేదములు సంభావించగా భాషల
న్ని రసా భూషితమై తనర్చును గదా నేఁ బల్కఁగా లేనొకో
“ఒరియా భాషకు సాటి వచ్చునె తెలుంగో కృష్ణరాయాధిపా”

(కన్నడ కూడ వ్యావహారికము వరకే వచ్చునండి)

Subbarao Ayyalasomayajula చెప్పారు...

మ.

చురకత్తుల్ ఝళిపించు దుండగులచే సొమ్ముల్ విసర్జించెడిన్
బరువౌ మూటలు మోయలేక శ్రమతో భాషించు నిర్భాగ్యులున్
దొరలే దొంగల మధ్యలో నిలువగా దూషించు వైనమ్మునన్
*ఒరియా భాషకు సాటి వచ్చునె తెలుం గోకృష్ణరాయాధిపా.*

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:గురు వగు సంస్కృత భాషయె
భరతావని , కా పదములు భవ్యముగా మా
ఒరియా భాషన్ మిక్కిలి
ఒరియాకున్ సాటి వచ్చు నొకొ తెలు గధిపా!
(ఒరియా భాషలో సంస్కృతపదా .హిందీ కంటే కూడా ఎక్కువ.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:గురువే సంస్కృతభాష దాని పదముల్ కోకొల్ల లై నిల్చి ద
గ్గరి సంబంధము నుత్కళమ్మునకె యై గర్వమ్ము జేగూర్చు,మా
థురి లో తెల్గును గొప్పదే,యమరమందున్ రక్తి యే యున్నచో
ఒరియా భాషకు సాటి వచ్చునె తెలుం గో కృష్ణరాయాధిపా?

subbarao చెప్పారు...

ఒరియాదేశపు భాషది
బొరపాటున సాటి రాదు పుడమిని నెచటన్
నరనరముల తెలుగుండును
ఒరియాకున్ సాటి వచ్చునొకొ తెలుఁ గధిపా”

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అరయం గాకికి ముద్దగు
గురుతరముగఁ గాకి పిల్ల కోరఁగ నేలా
తరతమము లిట్లు భాషల
నొరియాకున్ సాటి వచ్చు నొకొ తెలుఁ గధిపా


ధరలో నెంచఁగ నెల్ల భాషలకునుం దా నిల్చు మూలమ్ముగాఁ
బరఁగున్ నిత్యము మాతృ భాషగను సంభావింపఁగా సుంద రా
మర భాషా ప్రవరమ్ము సంస్కృతము సంపాదింప దోషంబ మీ
కొరి యా భాషకు సాటి వచ్చునె తెలుం గో కృష్ణరాయాధిపా

[ఒరి=వైరము]

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

మత్తేభములో రెండవ పాదము చివరనుండి మూడవ పాదము ప్రథమార్ధము వరకు
'భాషలన్ని రసోచ్చిషటములై తనర్చును' అని మార్చినానండి

Subbarao Pochiraju చెప్పారు...

ఒరియా భాషకు సాటి వచ్చునె తెలుం గోకృష్ణరాయాధిపా!
యరయన్ సామ్యముఁ జూడగాఁదెలియు బాహాటంబు గారెంటినిన్
నొరియా భాషను గంటెనా దెలుఁగుపీయూషమ్ముఁద్రాగంగ నౌ
గరమున్ హ్లాదముఁదీపినిన్గలుగు నెక్కాలంబునిక్కంబుగా

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

రసోచ్చిష్టములై

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఒరియా భాషకు సాటి వచ్చునె తెలుంగో  కృష్ణరాయాధిపా?
మరియాభాషను గూర్చి నేనెరుఁగ నింపైనట్టిదౌ భాషలన్
గరిమన్ తేటతెనుంగుభాషకిల సంకాశంబుగా నిల్వగన్
సరిరాదెద్ది, యజంతమై యలరు భాషన్నన్ తెలుంగే సుమా

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఒరియాయను భాషను నే
నెరుఁగను తీయని తెలుంగు నెరుగుదు నార్యా!
సరికాదిటు మీరడుగ
న్వొరియాకున్ సాటి వచ్చునొకొ తెలుఁ గధిపా

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

పరికించ తెలుగు నాడున
ఒరియా భాషకును మన్ననుండని కరణిన్
ఒరియా దేశము నందున
నొరియాకున్ సాటివచ్చునొకొ తెలుగధిపా?

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

ధరణిని జూడగ నిజముగ
*"ఒరియాకున్ సాటి వచ్చునొకొ తెలుఁ గధిపా”*?
పరభాషలెన్ని యున్నను
స్థిరమగుకీర్తినిబడసినతెలుగుకుసమమే?,