12, మార్చి 2024, మంగళవారం

కవిమిత్రులకు మనవి...

రేపటి నుండి దాదాపు 15 రోజుల వరకు సమూహానికి అందుబాటులో ఉండక పోవచ్చు.
14 నాడు నారాయణఖేడ్ లో పుస్తకావిష్కరణ సభకు వెళ్తున్నాను.
15 నాడు ప్రయాణపు టేర్పాట్లు..
16 నాడు రైలెక్కి 17న కాశీ చేరుకుంటాను.
18 నాడు కాశీలో ప్రసాద రాయ కులపతి గారి చేతుల మీదుగా గంగాభవాని శాంకరీదేవి గారి పుస్తకావిష్కరణ
19 నాడు బయలుదేరి నేపాల్ చేరుకుంటాను. ఐదు రోజులు నేపాల్ క్షేత్ర సందర్శన.
బహుశా 25 నాడు ఇంటికి చేరుకోవచ్చు.
అన్నిరోజులు ప్రయాణంలో ఉండి మీ పూరణలను సమీక్షించలేకపోవచ్చు.
దయచేసి ఇన్ని రోజులు ఎవరైనా ముందుకు వచ్చి పద్యాలను సమీక్షించవలసిందిగా మనవి.

7 కామెంట్‌లు:

విరించి చెప్పారు...

నేను వాట్సాపు సమూహంలో రాత్రి గం9-00 కల్లా పోస్ట్ చేయగలను

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

మీ ప్రయాణాలు తదితర కార్యక్రమాలు శుభప్రదం జయప్రదం కావాలని ఆకాంక్ష
సమస్యలు యథావిధిగా మీరిస్తారు కాకపోతే పూరణలు సమీక్షంచలేరు. అంతేనాండి.

subbarao చెప్పారు...

గురువులకు నమస్సులు . ప్రయాణము సుఖమయమగు గాక!

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మీ కాశీ, నేపాల్ యాత్రలు జయ ప్రద మగు గాక!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురపదేవులకు ప్రణామములు. మీ యాత్ర సుఖమయమై, శుభఫలము లందించాలని భగవంతునికి మా వేడుకోలు 🙏🙏🙏

కంది శంకరయ్య చెప్పారు...

అవునండి

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గురుదేవులకు ప్రణామములు.
మీ కాశీ యాత్ర సుఖప్రదము శుభప్రదము కావాలని కోరుకొంటున్నాను.