3, మార్చి 2011, గురువారం

సమస్యా పూరణం - 243 (చచ్చి నంతనె చేఁతురు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చచ్చి నంతనె చేఁతురు సంబరములు.
ఈ సమస్యను పంపిన ఊకదంపుడు గారికి ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు.

  01)
  ______________________________________

  నరుల కంటకు డైనట్టి - నరక ప్రభువు
  చచ్చి నంతనె చేతురు - సంబరములు !
  యుగ యుగముల తరబడి - యుత్సుకముగ !
  దీప , యావళి ! పేరిట - దివ్యముగను !
  ______________________________________

  రిప్లయితొలగించండి
 2. 02)

  _______________________________________

  రమణి చెరబట్టు రావణ - రాజు వంటి
  ఖలుని భరియింప శక్యము - గాక జనులు
  చచ్చినంతనె చేతురు - సంబరములు
  మకర సంక్రాంతి యనుపేర - మరువ కుండ
  _______________________________________

  రిప్లయితొలగించండి
 3. 03)

  ________________________________________

  ప్రజల రక్షించి , కాపాడు - వాడె ప్రభువు !
  నిలచి యుండును మనముల - నిత్యముగను !
  జనుల ,హింసలు బెట్టెడు - జాతి నేత
  చచ్చి నంతనె చేతురు - సంబరములు !
  ________________________________________

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి.


  చచ్చినంతనె నరకుడు సంబరములె
  చచ్చినంతనె మహిషుడు సంబరములె
  ఎపుడు దుష్టులు గూలునొ ఇలను అపుడె
  చచ్చి నంతనె చేతురు సంబరములు.

  రిప్లయితొలగించండి
 5. 04)
  ________________________________________

  చచ్చినంతనె చేతురు సంబరములు !
  లోక కంటకు, దుర్మార్గు ! - రూఢి నిలను
  మరువ కుందురు యుగములు - మారి నంత !
  మరచి పోదురె ? రక్షకున్, - మంచివాని !
  ________________________________________

  రిప్లయితొలగించండి
 6. 05)

  ________________________________________

  ధరణి మహిషుని బోలెడి - దనుజు లంత
  చచ్చినంతనె చేతురు - సంబరములు !
  సకల నైవేద్య ధూపాది - సంహితముగ
  నవ్య నవరాత్రు లనుపేర - నాదరమున !
  _________________________________________

  రిప్లయితొలగించండి
 7. సద్గతులు గల్గ నరునకు శ్రాద్ధ విధులు
  చచ్చి నంతనె చేఁతురు; సంబరములు
  జరుపు కొందురు వానికె జన్మ తిథిని
  తరిగి పోయెడు నాయువు నరయ లేక!

  రిప్లయితొలగించండి
 8. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంగురువారం, మార్చి 03, 2011 10:26:00 AM

  పెద్దలు వసంత కిశోర్ గారు క్షమించాలి.
  మకర సంక్రాంతి కీ రావణ సంహారానికీ సంబధం లేదనుకుంటా.
  రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్ మరణాలని దసరా నాడు రామలీల ఉత్సవం గా జరుపుతారు కదా?
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 9. బాలసుబ్రహ్మణ్యం గారూ !
  మీరు చెప్పింది దక్షిణ భారదేశంలో !
  ఉత్తరాదిలో చాలా చోట్ల సంక్రాంతి నాడే రామలీలా ఉత్సవాలు
  జరుపుతారని ఎక్కడో చదవడమో
  Tv లో చూడడమో జరిగింది.
  పోనీ రావణుడు కాకపోతే మరొకడు
  ఏ దుర్మార్గుడు చచ్చినా మనకి పండగే !

  మనం చరిత్ర వ్రాయడం లేదు కదా !
  ఇక్కడ ఏదో రకంగా సమస్య సాధించడమే ముఖ్యం !
  సమస్యా పూరణంలో తర్కానికి తావుండదు!

  తర్కానికే చోటిస్తే అసలు ఏ సమస్యా నిలబడదు !

  రిప్లయితొలగించండి
 10. వసంత్ కిశోర్ గారూ,
  మీ ఐదు పూరణలూ చూసాను.
  మొదటి పూరణలో కొన్ని లోపా లున్నాయి. (బ్రాకెట్లో ఉన్నవి) నా సవరణలు....
  నరుల కంటకు డైనట్టి - నర(కుఁ డెపుడొ)
  చచ్చి నంతనె చేతురు - సంబరములు !
  యుగ యుగ(మ్ము)ల తరబడి - యుత్సుక(తను)
  (భవ్య దీపావళి యనంగ) - దివ్యముగను !
  రెండవ పూరణ చివరిపాదం తప్ప అంతా బాగుంది. "విజయదశమి పేర వేడ్కతోడ" అందాం.
  తర్వాతి మూడు పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  మూడవ పాదం "ఎపుడు దుష్టులు గూలిన నపుడె యిలను" అంటే బాగుంటుంది.

  మిస్సన్న గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. నా పూరణ ...............

  బ్రతికి యున్నంత కాలంబు బాధపెట్టి
  కన్నవారిని సుంతయుఁ గాంచనట్టి
  సుతులు కొందఱు శ్రాద్ధ మంచును ఘనముగ
  చచ్చి నంతనె చేతురు సంబరములు.

  రిప్లయితొలగించండి
 13. శంకరార్యా !
  అద్భుతం !
  సమకాలీన సమస్యలను కవిత్వంలో
  చొప్పించగలిగిన వాడే నిజమైన కవి !
  ఈ కలియుగ దానవులను బాగా కనిపెట్టారు !
  అందులో ఒక్కడైనా మారితే సమస్యా పూరణతో పాటూ
  ప్రయోజన సిద్ధి కూడా కలుగుతుంది !
  (కనీసం కలగాలని మనం ఆశించ వచ్చు )
  అభినందనలు మరియూ
  ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 14. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంగురువారం, మార్చి 03, 2011 7:16:00 PM

  గురువు గారి పూరణ చాలా బాగుంది.
  ఎప్పుడో జరిగిన వాటికోసం సంబరాలు అనకుండా ప్రస్తుత సమాజ పరిస్థితి ని ఎత్తి చూపారు.
  ధన్యవాదములు.
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 15. శంకరయ్య గారూ , అత్యద్భుతమైన పూరణ. చాలా పదునైన భావ వ్యక్తీకరణ . మీ పద్యం నిజంగా ఈనాటి సమాజంలోని కొందరు ' కడుపు చేటు కొడుకులకు ' ఒక ఉదాహరణ .ధన్యవాదాలు .

  రిప్లయితొలగించండి
 16. శంకరం మాస్టారు గారూ!ఈనాటి (ఈ కాలపు) పద్యం మేటిగా,సూటిగా,ఘాటుగా చెప్పారు.అభినందనలు. మా 'ఆనాటి ' పద్యం లో సూచించిన సవరణ బాగుంది.ధన్యవాదాలు.

  గోలి.హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 17. మొదట మొహమాటము వరుని మదిన కలుగు,
  బేల చూపు తోడ వధువు బెరుకుఁ జూపు
  వలపు తలఁపులు గెలువఁగ, వారి సిగ్గు
  చచ్చి నంతనె, చేఁతురు సంబరములు.

  రిప్లయితొలగించండి
 18. జి ఎస్ జీ !
  సిగ్గు చచ్చాక....సంబరాలు !
  వ్వా........................వ్

  రిప్లయితొలగించండి
 19. "సుతులు కొందఱు శ్రాద్ధ మంచును ఘనముగ" - మాస్టారూ, మీకు వంత పాడుతూ నే చెప్పేది, అట్లాంటి వాళ్ళు పెట్టేది శ్రద్ధతో కూడిన శ్రాద్ధము కాదు. వాళ్ళ friends, social contacts పెంచుకోవటానికి ఎంచుకొన్న మార్గము. భేషైన పద్యం.

  రిప్లయితొలగించండి
 20. తిండి దిప్పలకుఁ గరవై తీపి కవిత
  చెప్పి జనులను రంజింపఁ జేయు వాని
  బ్రతుకు భారమై సాగిన బాధ యేల
  చచ్చి నంతనె చేఁతురు సంబరములు !

  రిప్లయితొలగించండి
 21. జిగురు సత్యనారాయణ గారూ,
  సరసమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మంచి పూరణ. బ్రతికినంత కాలం పట్టించుకోని కవులకు వారు చచ్చిన తర్వాత సంస్మరణ సభల సంబరాలు చేయడం లోకంలో ఉన్నదే. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. వసంత్ కిశోర్ గారూ,
  మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
  డా. విష్ణు నందన్ గారూ,
  మిస్సన్న గారూ,
  గోలి.హనుమచ్ఛాస్త్రి గారూ,
  చంద్రశేఖర్ గారూ,
  .................... నా పూరణ నచ్చినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 23. అందరి పూరణలూ చాలా బాగున్నాయి.
  గురువులు శంకరయ్య గారి పూరణ ప్రశస్తంగా ఉన్నది. ఈ నాటి పరిస్థితిపై చక్కటి విమర్శ.

  రిప్లయితొలగించండి
 24. అందరి పూరణలూ చాలా బాగున్నాయి.
  గురువులు శంకరయ్య గారి పూరణ అన్నింటికీ తలమానికంగా ఉన్నది.
  ఈ సమస్యను సూచించినందుకు సంతోషమైంది, పూరణలవల్ల.

  రిప్లయితొలగించండి