కవి మిత్రులారా, ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ...... స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా. ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.
మాష్టారుగారు, మిస్సన్న గారూ, ఒక సందేహం. ఇచ్చిన పాదంలో సాహిత్య పరంగా గానీ, అర్థపరంగా గానీ "సమస్య" యేమిటనేది తోచటం లేదు. చిన్న మాట, మీరు వ్రాసిన పదం Artificial Intelligence subject లోని Sphota Theory లో చెప్పిన దానికి దగ్గర గా వుంది. మన శాస్త్రాలు చాలా విషయాలను abstract form లో వివరించాయి. విడమరచి చెప్పేవాళ్ళు తగ్గిపోతున్నారు.
చంద్ర శేఖర్ గారూ నాకున్న చిన్ని జ్ఞానం బట్టి చెబుతున్నాను. కొన్ని సందర్భాల్లో సమస్యగా ఇచ్చిన పద్య పాదంలో ఏదో చిక్కుముడి గానీ, సమస్య గానీ ఖచ్చితంగా ఉండి తీరాలని నియమం ఏమీ ఉన్నట్లు కనుపించడం లేదు పెద్దలు, పండితులు,కవి వరేన్యులు చేసిన, చేస్తూన్న అవధానాలను పరిశీలించి నట్లయితే. ఇచ్చిన పద్య పాదం ఒక మనోహరమైన వర్ణనను గానీ, సందర్భాన్ని గానీ, వ్యక్తిని గానీ, సంఘటనను గానీ ఇలా దేనినైనా ప్రస్తావించేదిగా కూడా ఉంటూ ఉంటుంది ఒక్కోప్పుడు. అందుచేత ఈరోజు ఈ సమస్య ఇవ్వడంలో గురువుగారు ఔచిత్యాన్ని పాటించారని నా అభిప్రాయం. ఇక మీరు చిన్న మాట గా వ్రాసిన తర్వాతి వాక్యాలు,వాటిలోని సాంకేతిక పదాలు నా చిన్ని బుర్రకు అవగాహన కాలేదు. అన్యథా భావించకండి.
గురువుగారు ఇంత కన్నా మంచి సమగ్రమైన వివరణ ఇస్తారని నా నమ్మకం.
మిస్సన్న గారు, నేనూ ఇలాగే అనుకున్నాను. ప్రతీసారీ చిక్కుముడిగా కాకుండా, వర్ణనలను చేయమంటే రకరకాల వర్ణనలను, ఉపమానాలను మనం చూడవచ్చు కదా అని నా భావన. గురువుగారిని కూడా ఈ విషయం పరిశీలించమని అభ్యర్థించాను.
మిస్సన్న గారూ, నిజమే. చిక్కుముడి వుండవలసిన అవసరం లేదని నేను కూడా చాలా చాలా సాహితి సమ్మేళనాల్లో చూశాను. కానీ, శంకరయ్య మాష్టారి కోరికకి (అదివరలో వారు ఇమెయిల్లోచెప్పిన దాన్ని బట్టి)ఇది సమస్యగా సమకూడలేదని పించింది. అందువల్ల నాకు తెలియని అంతరార్థ మేదైన దాగి వుందా అని అనుమానం వచ్చింది. అంతే.
చంద్రశేఖర్ గారూ, సాధారణంగా అవధానాల్లో ఇచ్చే సమస్యలు క్లిష్టంగానో, విపరీతార్థ స్ఫోరకంగానో, అసమంజసంగానో ఉంటాయి. అయితే కొన్ని ప్రసిద్ధ అవధానాలలో అర్థవైపరీత్యం లేని సమస్యలను ఇవ్వడం చూసాను. ఇచ్చిన పాదాన్ని సమర్థించే మూడు పాదాలను వ్రాయడం సమస్య కాదా? గతంలో నేను మీకు మెయిల్ చేసిన వ్యాఖ్య గురించి ............... ఈ మధ్య నేను చూసిన అవధానాల్లో సమస్యలను పరిశీలించినప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఉదాహరణగా నేను విన్న కొన్ని సమస్యలు.... 1. కోరి భజించెడు నరులకు కోర్కెలు దీరున్. 2. రాము చేతిలో మడిసెను రణములోన. 3. స్వరమున నాలపించెద వసంత వనాంత రసాల శాఖలన్. 4. చెన్నకేశవ! చూడుమా కన్ను తెఱచి.
మాస్టారూ, మీ ప్రశంస అమోఘమైన పద్య రూపం దాల్చింది. మీరు మాకోసం ఎంతో కుదించి మిగతా పద్యాలు సులభంగా వ్రాస్తున్నారని చాలా సార్లు అనుకొన్నాను. నా భావన నిజమే. మీరు కూడా అప్పుడప్పుడూ విజృ౦భించటం మాకు ఆనందదాయకమే:-)
మాస్టారూ, వివరణకు ధన్యవాదాలు. మీ లిస్టు లో ఒకటి, ఏడు నేను కూడా విన్నట్లు గుర్తు. ఇప్పుడు మీరు ఇచ్చిన స్వతంత్రం వల్ల ఇంకొన్ని సమస్యలు పూరణల కోసం పంపే అవకాశం మాకు కలిగింది. ధన్యవాదాలు.
డా.విష్ణు నందన్ గారూ, మీ పూరణలో అద్భుతమైన నిరుపమ మాధురీ మహిమ తొణికిసలాడుతున్నది. హృదయపూర్వక అభినందనలు. శ్రీ పీతాంబర్ గారూ, మీ కవితలో కమ్మదనము నిండుగా ఉన్నది, మీకు మనసారా అభినందనలు ! గురువుగారూ చంద్రశేఖర్ గారు శలవిచ్చి నట్లు మీ ప్రశంసా పద్యాలు,మధురంగా ఉన్నాయి. మీకు మరోసారి ప్రణామములు.
ఆర్య విష్ణువర్ధన్ గారూ మీ పూరణ ప్రాచీన కవుల శైలితో శారదా ప్రసన్నం చేస్తూ అద్భుతంగా అలరారుతోంది. మంద పీతామ్బర్ గారూ గురువుల ప్రశంసకు పాత్రమైన మీ పూరణ మంచి మనోహరంగా ఉంది. నరసింహ మూర్తి గారూ మీ పూరణ హంస మీద ఆశీనురాలై వీణ నాదం చేస్తూన్న శారదను సాక్షాత్కరింప జేస్తూ చాల బాగుంది.
మిస్సన్న గారూ కృతజ్ఞతలు. బ్రహ్మాండమైన పూరణలు చూచి యీ పూరణకు దూరంగా ఉందామనే తలచాను ,గాని నిద్ర లేవకముందు మగత నిద్రలో పద్యము కూడింది. చాపల్యముతో వ్రాసాను.
మందాకిని గారూ యీ సందిగ్ధము వస్తుందని తెలుసు. ఓలలాడున్ + ఈ స్ఫురణ = ఓలలాడు నీ స్ఫురణ అని నా భావము. వ్యాకరణము లో కూడా నేను వీకే ! పద్యము వ్రాసి పడేస్తాను, గురువులు దిద్దు కొంటారని .
మందాకిని గారూ,కృతజ్ఞతలు. మనందఱమూ విద్యార్ధులమే ! సందిగ్ధము రాకుండా మరోలా వ్రాయ వచ్చు గాని పరుగుల బ్రతుకులు. మీ దగ్గఱ నుండి వారము దినములలో ఒక పద్యము ఆశిస్తున్నాము.మా అందఱి లాగే మీరు దూకండి.
మూర్తిగారు, మీ ఆశీస్సులతో నియమాలన్నీ కొంతవరకైనా ఆకళింపు చేసికొని దూకాలనుకుంటున్నాను. ఇప్పుడే దూకేస్తే నా కాళ్ళు విరిగినా పర్లేదు కానీ రసజ్ఞుల మనసు విరగకూడదని...:) జాప్యం చేస్తున్నాను. అభ్యసించుటలో భాగంగానే సందేహాలు అని భావించి ధైర్యంగా అడిగేస్తున్నాను.
మందాకిని గారూ, అడివరలో నేను బ్లాగులో పోస్ట్ చేసినదే మీ స్పందన చూశాక మళ్ళా వ్రాయాలని పించింది. మనం చిన్నప్పుడు నేర్చుకొనే విధానం వేరు (rote learning, memorization dominating), కానీ పెద్దవుతున్న కొద్దీ comparative, analysis based, critical reading based etc. వంటి పద్ధతుల వాళ్ళ తేలికగా నేర్చుకొంటాము. కాబట్టి, మనకు నేర్చుకొనేటప్పుడు "Guess and check", "write first and rewrite later to correct" లాంటి methods తేలికగా వుంటాయి. దూకేయండి, "...నా కేటి సిగ్గు..." అని కృష్ణ శాస్త్రి గారి స్వేచ్చా గీతం తలుచుకొంటూ. రసజ్ఞుల మనసు ద్రాక్ష పాకం లాంటిది, అది విరగదు, సాగుతుంది. Dont worry, "Learn to swim while in the pond not sittting on the banks".
ఎందఱో మహానుభావులు అందఱికీ వందనములు. ఈ సమస్య కి వచ్చిన పూరణలు అన్నీ కూడా బాగున్నాయి. మన భారతీయసాహిత్యసంగీతాది కళల స్ఫురణ వలెనే ఈ బ్లాగు కూడా బ్లాగ్ధరిత్రిలో వాణీ స్వరూపమును సాక్షాత్కరింపఁజేస్తున్నది.
మిత్రు లందరూ మన్నించాలి. అందరి పూరణలూ బాగున్నాయి. పెళ్ళికి వరంగల్ వచ్చిన నేను సమయాభావం వల్ల వారాంతపు సమస్యా పూరణలను వ్యాఖ్యానించలేక పోతున్నాను. హైదరాబాదుకు తిరిగి వచ్చాక వ్యాఖ్యానిస్తాను.
శ్రీ నరసింహ మూర్తి,వసంత కిశోర్ మరియు మిస్సన్న గారల పూరణలు చాలా బావున్నాయి అందరికి నమస్కారములు . శ్రీ చంద్ర శేఖర్ గారు నమస్కారం .మీ వివరణాత్మక motivation నా వంటి వారలందరికి ఉపయుక్తంగా ఉంటుంది .
వర కవితాప్రసాదమయి , పావన మంజుల వాగ్విలాసమై ,
రిప్లయితొలగించండిపరమ పవిత్ర భావనలు బంచెడి నిర్మల కావ్య రాశియై ,
నిరుపమ మాధురీ మహిమ నిచ్చలు వెల్గెడి సత్కవిత్వ వి
స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా !!!
మీ పూరణ అద్భుతం గా ఉంది డాక్టర్ గారూ.
రిప్లయితొలగించండి- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
శారదాస్వరూపము ను, పవిత్ర భావనలు పంచెడి కావ్యరాశి తో చక్కగా సరిపోల్చారు.
రిప్లయితొలగించండిఅపురూపంగా ఉంది.
డా.విష్ణు నందన్ గారి, పూరణ అద్భుతం. డా.ప్రసాదరాయ కులపతి గారి పద్యరచనా శైలి గుర్తుకొస్తోంది ఇది చదువుతుంటే.
రిప్లయితొలగించండిమాష్టారుగారు, మిస్సన్న గారూ, ఒక సందేహం. ఇచ్చిన పాదంలో సాహిత్య పరంగా గానీ, అర్థపరంగా గానీ "సమస్య" యేమిటనేది తోచటం లేదు. చిన్న మాట, మీరు వ్రాసిన పదం Artificial Intelligence subject లోని Sphota Theory లో చెప్పిన దానికి దగ్గర గా వుంది. మన శాస్త్రాలు చాలా విషయాలను abstract form లో వివరించాయి. విడమరచి చెప్పేవాళ్ళు తగ్గిపోతున్నారు.
రిప్లయితొలగించండిఅరువది నాల్గు విద్దెలకునమ్మయె ముద్దుల బల్కు రాణి ,శ్రీ
రిప్లయితొలగించండికరముల నిచ్చు నక్షరపు కమ్మని నాకృతి ,వేద రూపిణీ !
వరముల నిచ్చి పామరుని పండితు జేసిన వాణి, సద్గుణ
స్పురణ భవత్స్వ రూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!
చంద్ర శేఖర్ గారూ నాకున్న చిన్ని జ్ఞానం బట్టి చెబుతున్నాను.
రిప్లయితొలగించండికొన్ని సందర్భాల్లో సమస్యగా ఇచ్చిన పద్య పాదంలో ఏదో చిక్కుముడి గానీ, సమస్య గానీ ఖచ్చితంగా ఉండి తీరాలని నియమం ఏమీ ఉన్నట్లు కనుపించడం లేదు పెద్దలు, పండితులు,కవి వరేన్యులు చేసిన, చేస్తూన్న అవధానాలను పరిశీలించి నట్లయితే. ఇచ్చిన పద్య పాదం ఒక మనోహరమైన వర్ణనను గానీ, సందర్భాన్ని గానీ, వ్యక్తిని గానీ, సంఘటనను గానీ ఇలా దేనినైనా ప్రస్తావించేదిగా కూడా ఉంటూ ఉంటుంది
ఒక్కోప్పుడు. అందుచేత ఈరోజు ఈ సమస్య ఇవ్వడంలో గురువుగారు ఔచిత్యాన్ని పాటించారని నా అభిప్రాయం.
ఇక మీరు చిన్న మాట గా వ్రాసిన తర్వాతి వాక్యాలు,వాటిలోని సాంకేతిక పదాలు నా చిన్ని బుర్రకు అవగాహన కాలేదు. అన్యథా భావించకండి.
గురువుగారు ఇంత కన్నా మంచి సమగ్రమైన వివరణ ఇస్తారని నా నమ్మకం.
మిస్సన్న గారు, నేనూ ఇలాగే అనుకున్నాను. ప్రతీసారీ చిక్కుముడిగా కాకుండా, వర్ణనలను చేయమంటే రకరకాల వర్ణనలను, ఉపమానాలను మనం చూడవచ్చు కదా అని నా భావన. గురువుగారిని కూడా ఈ విషయం పరిశీలించమని అభ్యర్థించాను.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ, నిజమే. చిక్కుముడి వుండవలసిన అవసరం లేదని నేను కూడా చాలా చాలా సాహితి సమ్మేళనాల్లో చూశాను. కానీ, శంకరయ్య మాష్టారి కోరికకి (అదివరలో వారు ఇమెయిల్లోచెప్పిన దాన్ని బట్టి)ఇది సమస్యగా సమకూడలేదని పించింది. అందువల్ల నాకు తెలియని అంతరార్థ మేదైన దాగి వుందా అని అనుమానం వచ్చింది. అంతే.
రిప్లయితొలగించండిడా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిసత్కవిత్వ విస్ఫురణము, శశ్వదర్థ
పూర్ణమును, కవిపండితామోద యోగ్య
శైలి గల్గిన పద్యమ్ము సంతస మిడె
విందుగా; విష్ణునందనా! వందనములు.
అభినందించిన కవిపండితులకూ , రసజ్ఞులకూ పేరుపేరునా ధన్యవాదాలు. శంకరయ్య గారూ మీ మెచ్చుకోలు ఏనుగునెక్కినంత సంబరమివ్వదూ ? శిరసా నమామి !!!
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిసాధారణంగా అవధానాల్లో ఇచ్చే సమస్యలు క్లిష్టంగానో, విపరీతార్థ స్ఫోరకంగానో, అసమంజసంగానో ఉంటాయి. అయితే కొన్ని ప్రసిద్ధ అవధానాలలో అర్థవైపరీత్యం లేని సమస్యలను ఇవ్వడం చూసాను.
ఇచ్చిన పాదాన్ని సమర్థించే మూడు పాదాలను వ్రాయడం సమస్య కాదా?
గతంలో నేను మీకు మెయిల్ చేసిన వ్యాఖ్య గురించి ...............
ఈ మధ్య నేను చూసిన అవధానాల్లో సమస్యలను పరిశీలించినప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఉదాహరణగా నేను విన్న కొన్ని సమస్యలు....
1. కోరి భజించెడు నరులకు కోర్కెలు దీరున్.
2. రాము చేతిలో మడిసెను రణములోన.
3. స్వరమున నాలపించెద వసంత వనాంత రసాల శాఖలన్.
4. చెన్నకేశవ! చూడుమా కన్ను తెఱచి.
మాస్టారూ,
రిప్లయితొలగించండిమీ ప్రశంస అమోఘమైన పద్య రూపం దాల్చింది. మీరు మాకోసం ఎంతో కుదించి మిగతా పద్యాలు సులభంగా వ్రాస్తున్నారని చాలా సార్లు అనుకొన్నాను. నా భావన నిజమే. మీరు కూడా అప్పుడప్పుడూ విజృ౦భించటం మాకు ఆనందదాయకమే:-)
మాస్టారూ, వివరణకు ధన్యవాదాలు. మీ లిస్టు లో ఒకటి, ఏడు నేను కూడా విన్నట్లు గుర్తు. ఇప్పుడు మీరు ఇచ్చిన స్వతంత్రం వల్ల ఇంకొన్ని సమస్యలు పూరణల కోసం పంపే అవకాశం మాకు కలిగింది. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండివృత్తలేఖన ప్రావీణ్య విదుఁడవై మ
నోహరములగు భావము లూహ జేసి
హృద్యమయిన ధారాశుద్ధిఁ బద్యములను
వ్రాయు మంద పీతాంబరా! వందనములు.
పీతాంబర్ గారి పూరణ కూడా బాగున్నది.
రిప్లయితొలగించండివిష్ణునందన్ గారి పూరణ గంగాఝరి లాగానూ, పీతాంబర్ గారి పూరణ గోదావరి లాగానూ ముచ్చట గొలుపుతున్నాయి.
డా.విష్ణు నందన్ గారూ, మీ పూరణలో అద్భుతమైన నిరుపమ మాధురీ మహిమ తొణికిసలాడుతున్నది. హృదయపూర్వక అభినందనలు.
రిప్లయితొలగించండిశ్రీ పీతాంబర్ గారూ, మీ కవితలో కమ్మదనము నిండుగా ఉన్నది, మీకు మనసారా అభినందనలు !
గురువుగారూ చంద్రశేఖర్ గారు శలవిచ్చి నట్లు మీ ప్రశంసా పద్యాలు,మధురంగా ఉన్నాయి. మీకు మరోసారి ప్రణామములు.
మిత్రుల పూరణలు
రిప్లయితొలగించండిముచ్చటగా నున్నవి !
డాక్టర్ గారి పూరణ చదివిన తర్వాత, నా బోంట్లు రాస్తే పేషెంటు రాసినట్టు ఉంటుందని ప్రయత్నం చేయలేదు.
రిప్లయితొలగించండిపీతాంబర్ గారి రచన కూడా ముగ్ధంగా ఉంది.
డా.విష్ణునందన్ గారి పూరణ ప్రశస్తంగా ఉంది .
రిప్లయితొలగించండివెన్నుదట్టి ప్రోత్సహిస్తున్న గురువు గారికి ,తోటి కవి మిత్రులకు కృతఙ్ఞతలు ,ధన్య వాదములు .
కరముల పద్మయుగ్మముల కంపిత తంత్రుల వీణరావముల్
రిప్లయితొలగించండిస్వరములు, నాద రాగమయ సత్కవి గీతి సుధాంబు లందుటన్
తెరలను భావసంపదల , తెల్లని యంచను నోలలాడు నీ
స్ఫురణ భవత్స్వరూపమను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా !
( తెరలు = అలలు )
ఆర్య విష్ణువర్ధన్ గారూ మీ పూరణ ప్రాచీన కవుల శైలితో శారదా ప్రసన్నం చేస్తూ అద్భుతంగా అలరారుతోంది.
రిప్లయితొలగించండిమంద పీతామ్బర్ గారూ గురువుల ప్రశంసకు పాత్రమైన మీ పూరణ మంచి మనోహరంగా ఉంది.
నరసింహ మూర్తి గారూ మీ పూరణ హంస మీద ఆశీనురాలై వీణ నాదం చేస్తూన్న శారదను సాక్షాత్కరింప జేస్తూ చాల బాగుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ కృతజ్ఞతలు. బ్రహ్మాండమైన పూరణలు చూచి యీ పూరణకు దూరంగా ఉందామనే తలచాను ,గాని నిద్ర లేవకముందు మగత నిద్రలో పద్యము కూడింది. చాపల్యముతో వ్రాసాను.
రిప్లయితొలగించండిమందాకిని గారూ యీ సందిగ్ధము వస్తుందని తెలుసు. ఓలలాడున్ + ఈ స్ఫురణ = ఓలలాడు నీ స్ఫురణ అని నా భావము. వ్యాకరణము లో కూడా నేను వీకే !
పద్యము వ్రాసి పడేస్తాను, గురువులు దిద్దు కొంటారని .
మూర్తిగారు,
రిప్లయితొలగించండిఇప్పుడు అర్థమయ్యిందండి. కృతజ్ఞురాలిని.
మీ పద్యం చాలా బాగుంది.
తెలియని వాళ్ళకు నాలాంటి వాళ్ళకు సందేహాలుకానీ,
విజ్ఞులకు తెలుస్తుంది కదా!
మూర్తి గారూ !
రిప్లయితొలగించండిముచ్చటైన పూరణ !
మీరు వీక్ కాదు బాబూ ,మేకే !
మందాకిని గారూ,కృతజ్ఞతలు. మనందఱమూ విద్యార్ధులమే ! సందిగ్ధము రాకుండా మరోలా వ్రాయ వచ్చు గాని పరుగుల బ్రతుకులు. మీ దగ్గఱ నుండి వారము దినములలో ఒక పద్యము ఆశిస్తున్నాము.మా అందఱి లాగే మీరు దూకండి.
రిప్లయితొలగించండికిశోర్ జీ ధన్యవాదములు.
మూర్తిగారు,
రిప్లయితొలగించండిమీ ఆశీస్సులతో నియమాలన్నీ కొంతవరకైనా ఆకళింపు చేసికొని దూకాలనుకుంటున్నాను.
ఇప్పుడే దూకేస్తే నా కాళ్ళు విరిగినా పర్లేదు కానీ రసజ్ఞుల మనసు విరగకూడదని...:) జాప్యం చేస్తున్నాను.
అభ్యసించుటలో భాగంగానే సందేహాలు అని భావించి ధైర్యంగా అడిగేస్తున్నాను.
సరసులు పండితుల్ కవులు చక్కగ కైతల జెప్పు వేళలన్
రిప్లయితొలగించండిపరిణతి నొంది శబ్దములు, పల్కులు, వాక్కులు, పద్య గద్యముల్
కురియుట నీ కృపా రసపు కూరిమి జల్లుల చిల్కరింపులే
'స్ఫురణ' భవత్స్వరూపమను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!
మందాకిని గారూ, అడివరలో నేను బ్లాగులో పోస్ట్ చేసినదే మీ స్పందన చూశాక మళ్ళా వ్రాయాలని పించింది. మనం చిన్నప్పుడు నేర్చుకొనే విధానం వేరు (rote learning, memorization dominating), కానీ పెద్దవుతున్న కొద్దీ comparative, analysis based, critical reading based etc. వంటి పద్ధతుల వాళ్ళ తేలికగా నేర్చుకొంటాము. కాబట్టి, మనకు నేర్చుకొనేటప్పుడు "Guess and check", "write first and rewrite later to correct" లాంటి methods తేలికగా వుంటాయి. దూకేయండి, "...నా కేటి సిగ్గు..." అని కృష్ణ శాస్త్రి గారి స్వేచ్చా గీతం తలుచుకొంటూ. రసజ్ఞుల మనసు ద్రాక్ష పాకం లాంటిది, అది విరగదు, సాగుతుంది. Dont worry, "Learn to swim while in the pond not sittting on the banks".
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు.
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అద్భుతముగా నున్నవి!
మందాకిని గారు సంకోచిస్తున్నారు గాని
తేడా వస్తే గురువు గారే శరణనుకొని
నేను దూకేస్తున్నాను !
01)
__________________________________________
అరయగ కాళిదాసు గళ - మందున కావ్య సుధా ప్రవాహముల్ !
స్థిరమగు పోతనార్యు నుత - శ్రీహరి భాగవతా మహాత్మ్యముల్ !
వరమిడె నాంధ్రజాతికిని - భారత సంహిత నన్నయాదులున్ !
స్ఫురణ భవత్స్వరూప మను - సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!
___________________________________________
వసంతకిశోర్ గారూ, దంచేశారు, సంస్కృతాంధ్ర కవులను కలిపి జెప్పారు. మన:పూర్వక ప్రశంసలు. మీకు అర్థరాత్రి అయితే గానీ కవితావేశం వస్తున్నట్లు లేదు (నవ్వుతూ).
రిప్లయితొలగించండిచంద్రశేఖరా !
రిప్లయితొలగించండిధన్యవాదములు !
మీరు సరిగ్గానే ఊహించారు !
ఆ సంగతి నేనింతకుముందు
మనవి చేసాను కూడా !
వసంత మహోదయా అద్భుతం మీ పూరణ!
రిప్లయితొలగించండిస్ఫురణ విధాత సృష్టి ఘన సూత్రము, ధారుణి ప్రాణి కోటికిన్
రిప్లయితొలగించండిస్ఫురణ యనుక్షణమ్ము నిడు సొంపగు జీవన శైలి, ఎంచగా
స్ఫురణ వినా ప్రపంచమున శూన్యము నిండదె? దివ్య శక్తి యా
స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!
మిస్సన్నగారూ మీ పూరణ అద్భుతంగా ' పరిణతి నొంది శబ్దముల,' చక్కని శైలిలో చాలా బాగుంది.
రిప్లయితొలగించండికిశొర్ జీ మీ పూరణ చాలా మధురంగా ఉంది. పేరు పేరునా కవిశేఖరులను ప్రస్తావించారు. పద్యము అందంగా ఉంది
మిస్సన్న గారూ మీ రెండవ పూరణ కూడా చాలా బాగుంది
రిప్లయితొలగించండిఎందఱో మహానుభావులు అందఱికీ వందనములు.
రిప్లయితొలగించండిఈ సమస్య కి వచ్చిన పూరణలు అన్నీ కూడా బాగున్నాయి.
మన భారతీయసాహిత్యసంగీతాది కళల స్ఫురణ వలెనే ఈ బ్లాగు కూడా బ్లాగ్ధరిత్రిలో వాణీ స్వరూపమును సాక్షాత్కరింపఁజేస్తున్నది.
ప్రోత్సహిస్తున్న మిత్రులందఱికీ ధన్యవాదములు.
మిత్రు లందరూ మన్నించాలి. అందరి పూరణలూ బాగున్నాయి. పెళ్ళికి వరంగల్ వచ్చిన నేను సమయాభావం వల్ల వారాంతపు సమస్యా పూరణలను వ్యాఖ్యానించలేక పోతున్నాను. హైదరాబాదుకు తిరిగి వచ్చాక వ్యాఖ్యానిస్తాను.
రిప్లయితొలగించండిశ్రీ నరసింహ మూర్తి,వసంత కిశోర్ మరియు మిస్సన్న గారల పూరణలు చాలా బావున్నాయి అందరికి నమస్కారములు .
రిప్లయితొలగించండిశ్రీ చంద్ర శేఖర్ గారు నమస్కారం .మీ వివరణాత్మక motivation నా వంటి వారలందరికి ఉపయుక్తంగా ఉంటుంది .
మిస్సన్న మహాశయా !
రిప్లయితొలగించండిధన్యవాదములు !
"స్ఫురణ వినా ప్రపంచమున శూన్యము నిండదె"
మీ రెండవ పూరణ అద్భుతం !
స్ఫురణ లేకపోతే ఏదీ లేదని తేల్చేసారు !
మూర్తిగారికీ
మందాకిని గారికీ
పీతాంబరధరులకూ
ధన్యవాదములు !
గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండివసంత మహోదయా నరసింహ మూర్తి గారూ పీతాంబర ధారా
అందరికీ ధన్యవాదాలు.
శ్రీ మంద పీతాంబర్ గారికి నమస్కృతులు, కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిపేషెంట్ పూరణ :)
రిప్లయితొలగించండిసరసులు,పండితోత్తములు,స్రష్టలు, ద్రష్టలు, శ్లేషబద్ధులున్
విరసులు,ఛాందసాగ్రణులు,వేత్తలు తోచిన ప్రశ్నలేయగా
అరసినరీతిజెప్పును రసార్ద్రకవిత్వము సూ!వధాని, తత్
స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా
ఊకదంపుడు గారూ భేషైన పూరణ!
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
పరపతి కోరుచున్ తరలి భాగ్యపు నగ్రపు వీధులందునన్
రిప్లయితొలగించండికరముల బుడ్డి నందుకొని కైతల కోసము ప్రాకులాడగా
వరముల నిచ్చెడిన్ సినిమ పాటలు వ్రాయగ హృత్తునందునన్
స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!