5, మార్చి 2011, శనివారం

సమస్యా పూరణం - 245 (తుందిలుఁ గని మన్మథుఁడని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......

తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్.
(తుందిలుడు = పెద్ద బొజ్జ గలవాడు)
ఈ సమస్యను సూచించిన దేవి గారికి ధన్యవాదాలు.

42 కామెంట్‌లు:

 1. గోలి హనుమచ్ఛాస్త్రి.

  ఇందుధరు నింతి ముద్దిడి
  మందగమను శూర్పనఖుని స్కందాగ్రజునిన్
  చిందులు వేయుచు తిరిగెడి
  తందిలునిగని మన్మథుడని తొయ్యలి మెచ్చెన్.

  రిప్లయితొలగించండి
 2. శాస్త్రిగారు,
  చాలా బాగా చెప్పారు.
  మీరు చెప్పినది చదువుతుంటేనే చిన్ని గణపతి ముచ్చట గొలుపుతూ కనిపిస్తున్నాడు.

  రిప్లయితొలగించండి
 3. మందాకిని గారూ ధన్యవాదములు.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 4. అందము తరుగు నటంచును
  విందులు వలదంచు జెప్పు వింతగు పతి తా
  నందించగ విరగ దినగ
  తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్.

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారు,
  మీ గణపతి పూరణ బాగుంది. చిన్న అనుమానము.
  గణపతి "శూర్పకర్ణుడు" కదా! మీరు "శూర్పనఖుడు" అంటున్నారేమిటి?

  రిప్లయితొలగించండి
 6. నాకూ అదే సందేహం వచ్చిందండీ. కానీ శూర్పకర్ణుఁడు అనే పదం గుర్తు రాలేదు.

  రిప్లయితొలగించండి
 7. సత్యనారాయణగారూ! ధన్యవాదములు.శూర్పకర్ణుని అనే ఉండాలి.నేనూ తొందరలో గమనించలేదు. క్షమించాలి.సవరణతో ఇప్పుడు పంపుచున్నాను.

  ఇందుధరు నింతి ముద్దిడి
  మందగమను శూర్పకర్ణు స్కందాగ్రజునిన్
  చిందులు వేయుచు తిరిగెడి
  తుందిలుని గని మన్మథుడని తొయ్యలి మురిసెన్.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 8. "అందమ్ము లేదు నాకున్
  సందేహంబేల మదిన సరసపు వేళన్
  పందిరి మంచము పై"నని
  తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్.

  రిప్లయితొలగించండి
 9. బృందమునుఁ గూడి యాడెడు
  తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్,
  కందువఁ పాట మొదలయె ప
  సందనె దర్శకుఁడు షాటుఁ చాలింపంగన్

  రిప్లయితొలగించండి
 10. అందమునే చూతు రొకో
  సుందరమౌ హృదయమేల చూడరు లోకుల్
  వందనము మనీషు నకని
  తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్.

  రిప్లయితొలగించండి
 11. కవిమిత్రులారా, ఈ రోజు అందం అనే పదం ఇద్దరు ముగ్గురు వాడటం చూసి, ఈ సమస్యకి సందర్భం కుదిరింది కాబట్టి పద్యం బదులు రెండు మాటలు. స్వర్గీయ శ్రీభాష్యం అప్పలాచార్యులు గారి రామాయణ ప్రవచానాలలోంచి సూక్ష్మంగా నా మాటల్లో. అందం వస్తు ప్రధానం కాదు. కాకిపిల్ల కాకికి ముద్దు. అయితే మనకు కాదు. అంతేకాదు ఒక వస్తువు ఒకప్పుడు అందంగా కనిపించినా వేరొక సందర్భంలో అందంగా కనిపించకపోవచ్చు. మరి అందం అంటే ఏమిటి? ఏదయితే మన మనసులోని ఆనందాన్ని వెలికి తీసి హాయిని చేకూరుస్తోందో, లేక దు:ఖమును తీరుస్తుందో అది అందమైనది. అది మాట కావచ్చు, మనిషి కావచ్చు చేత కావచ్చు వస్తువు కావచ్చు, ఇంకేమయినా అవ్వవచ్చు. స్వోత్కర్ష కాదు గానీ, ఈ మాట విన్నప్పటి నుంచి చాలా సందర్భాల్లో అన్వయించి చూచుకొన్నాను. "అందము" నకు ఎంతో లోతైన భావం వున్న నిర్వచనమని పించింది.
  ఇక గణపతి కి "సుముఖుడు" అనే నామం వుండనేవుంది. హనుమకి వున్న సుందరుడనే నామము గురించి చెప్పాలా. సుందర కాండ ఆ ఘనుడిదే. ఆ సందర్భంగా నేను ఎప్పుడో వ్రాసిన రెండు లఘు పద్యాలు.

  ౧. హనుమ సుందరు డేలన తాను రాము
  సేమము తెలిపె లంకలో సీత సంత
  సింప,రాముని దు:ఖము బాపె నతఁడు
  సీతఁ గంటినంచునుడివి శ్రీముఖుండు!

  ౨.నే నీ సుందర నామము
  లను నిత్యము తలచి నంత లాభమె గాదా
  మనమున నీ రూపమునా
  కనిశము కనిపించు చుండు నందముగ హరీ!

  రిప్లయితొలగించండి
 12. చంద్ర శేఖరా దివ్యమైన మాటలు సెలవిచ్చారు

  రిప్లయితొలగించండి
 13. అందరికీ వందనములు
  అందరి పూరణలూ చక్కగా
  అలరించు చున్నవి.
  _________________________________________

  వినాయకుని జూచి ఉమ :

  01)
  _________________________________________

  మందముగా తేతెయ్యలు
  సింధుర వదనుడు సలిపిన - చేతను నెదుటన్ !
  డెందము నానందముతో
  తుందిలుఁ గని మన్మథుఁడని - తొయ్యలి మురిసెన్.
  _________________________________________
  తేతెయ్యలు = నాట్యము
  చేతనుడు = శివుడు
  సింధుర వదనుడు = కరి వదనుడు
  _________________________________________

  రిప్లయితొలగించండి
 14. ముద్దుపలుకుల
  మురిపించే
  మగని గని యొక
  మగువ
  ముచ్చటగా :

  02)
  _________________________________________

  డెందము ,సుందర మైనచొ
  విందొన గూర్చును, పలుకులు - వీనుల కెంతో !
  అందము బాహ్యము కాదని !
  తుందిలుఁ గని మన్మథుఁడని - తొయ్యలి మురిసెన్.
  _________________________________________

  రిప్లయితొలగించండి
 15. 03)

  _________________________________________

  పొందికగ ప్రేమ తోడుత
  సందిట బందీ యొనర్చు - సఖుని తలపులే
  డెందము కడు సిగ్గు నొదల
  తుందిలుఁ గని ,మన్మథుఁడని - తొయ్యలి మురిసెన్.
  _________________________________________

  ఒదలు=వర్ధిల్లు.
  _________________________________________

  రిప్లయితొలగించండి
 16. మిస్సన్న గారూ, మందాకిని గారూ, ధన్యవాదాలు. దివ్యత్వం రామాయణానిది, దానిని అందమైన పలుకులలో అందించిన శ్రీభాష్యం వారు చిరస్మరణీయులు.

  రిప్లయితొలగించండి
 17. అవునూ, ఇంతకీ మాష్టారు ప్రహేళికలు, గల్లనుడికట్లు ఇస్తున్నట్టా లేనట్టా? సమస్యాపూరణలో పడి వాటి ప్రస్తావన మరచాను.

  రిప్లయితొలగించండి
 18. మిత్రుల పూరణ లన్నీ మనోహరముగా ఉన్నాయి. మిస్సన్న గారి పూరణ చాలా సుందరంగా ఉంది. చంద్ర శేఖరులు మంచి మాటలు,పద్యాలు చెప్పడమే గాక ఒక మహనీయుడిని స్మరింప జేసారు.

  రిప్లయితొలగించండి
 19. వసంత కిశోర్ గారి పూరణలు చక్కగా ఉన్నాయి.
  సత్యనారాయణ గారు, రవిగారు, మిస్సన్నగారు చక్కటి పూరణలందించారు.కానీ షాటు ఒక చిన్న ముల్లులా అనిపించింది.

  రిప్లయితొలగించండి
 20. కందళిత హృదయ రాగము
  నిందిందిర వేణి గాంచె నీశుని మదిలో
  పొందుండు రూపమున్నని
  తుందిలుఁ గని మన్మధుఁడని తొయ్యలి మురిసెన్

  రిప్లయితొలగించండి
 21. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు.
  "శూర్పకర్ణు"డని సవరించారు. కాని ఆ పాదంలో యతిని సవరించలేదు.

  హరి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రవి గారూ,
  చమత్కార భరితమై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. చంద్రశేఖర్ గారూ,
  అందాన్ని చక్కగా నిర్వచించారు. బాగుంది. మొదటి పద్యం 1,3 పాదాల్లో యతి తప్పింది. నా సవరణ.....

  హనుమ సుందరు డేలన (నతఁడు) రాము
  సేమము తెలిపె లంకలో సీత (ముదము
  బడయ), రాముని దు:ఖము బాపె నతఁడు
  సీతఁ గంటినంచునుడివి శ్రీముఖుండు!

  ప్రహేళిక, గళ్ళనుడికట్టు శీర్షికలను త్వరలోనే పునఃప్రారంభిస్తాను.

  రిప్లయితొలగించండి
 23. వసంత్ కిశోర్ గారూ,
  మీ మూడు పూరణలూ బాగున్నాయి. రెండవది ఉత్తమోత్తమం. అభినందనలు.

  గన్నవరపు నరసింహమూర్తి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. మూర్తిగారు,
  శబ్దసౌందర్యం బాగుంది. భావ సౌందర్యం తెలియాలంటే మూడవ పాదం ఎలా అన్వయించుకోవాలో తెలీలేదు. నా అజ్ఞానానికి మన్నించి , దయచేసి వివరించగలరు.

  రిప్లయితొలగించండి
 25. మందాకిని గారూ కృతజ్ఞతలు. పోతన గారి భాగవతములో ఎప్పుడో ఆకర్షించిన పదము ఇందిందిరములు ( తుమ్మెదలు ) ప్రయోగించాను. స్ఫూర్తి మిస్సన్న గారిదే. మూడవ పాదము
  పొందు + ఉండు, రూపమున్ + అని = స్నేహము ( ప్రేమ ) లోనే అందము ఉందని నా భావన. చివరి నిముషము వరకు పూరణ చేసే ఉద్దేశము లేదు, మిత్రుల పూరణలు బాగా నచ్చడము వలన, కాని అలవాటు కొలది...

  రిప్లయితొలగించండి
 26. మందాకిని గారూ, నా జ్ఞానము గొప్పదేమీ కాదు, తెలుగు భాషాభిమానిని. మీ అందఱి దగ్గఱ ,గురువు గారి దగ్గఱ నేర్చుకోవాలనే అభిలాష కలవాడినే .

  రిప్లయితొలగించండి
 27. తుందిలుని తరువాత ఈరొజు సమస్య ఇంకా రాలెదని ఎదురుచూస్తున్నాను. కారణమేమైయుంటుంది చెప్మా? శ్రీనివాస్ - హైదరాబాదు

  రిప్లయితొలగించండి
 28. అజ్ఞాత గారూ,
  తుందిలుని తర్వాత కాశి కేగు వాణ్ణి పట్టుకొచ్చాను. చూడలేదా?

  రిప్లయితొలగించండి
 29. గురువుగారూ బ్లాగులో కాశి కేగు వాడెక్క డున్నాడు?

  రిప్లయితొలగించండి
 30. మాస్టారూ, సవరణకి ధన్యవాదాలు. కానీ, నేను మొదటి పాదంలోనూ మూడవ పాదంలోనూ ప్రాసయతి వాడానని అనుకొన్నాను. ఇప్పుడే గ్రహించాను, మూడో పాదంలో "౦ప" కి ప్రాస యతిలో కూడా అనుస్వారం తప్పిందని. మొదటి పాదము కరక్టే అనుకొంటున్నాను. వివరింపగలరు.

  రిప్లయితొలగించండి
 31. చంద్రశేఖర్ గారూ,
  ప్రాసాక్షరానికి ముందు లఘు గురువులలో ఏది ఉంటే మిగిలిన చోట్లా అదే ఉండాలి.
  మీ పద్యం మొదటి పాదంలో "హనుమ" అన్నప్పుడు ప్రాసాక్షరానికి ముందు లఘువున్నది. ప్రాసయతి స్థానంలో "తాను" అన్నప్పుడు గురువుంది. కాబట్టి తప్పే.

  రిప్లయితొలగించండి
 32. శంకరార్యా!ధన్యవాదములు.మందగమను కీ స్కందాగ్రజ కీ ప్రాసయతి సరిపోతుందనుకుంటాను.సందేహం తీర్చవలసిందిగా కోరుచున్నాను.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 33. మాస్టారూ, తప్పుచూపి దిద్దినందుకు శతధా కృతజ్నుడ్ని. ఇక ఆ నియమము మరచిపోను.

  రిప్లయితొలగించండి
 34. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రిప్పుడు చెప్పే వరకూ నా దృష్టికి రాలేదు. అక్కడ యితిదోషమే. కందంలో "ప్రాసయతి" నియమం లేదు కదా.

  రిప్లయితొలగించండి
 35. శకరం మాస్టరు గారూ!కందానికి ప్రాసయతి లేదను నియమం నాకు అవగాహన లేదు. తెలియజేసినందులకు కృతజ్ఞతలు.ఇకముందు ఆ నియమం పాటిస్తాను.స్కందాగ్రజునిన్.. బదులుగా "మదగజ ముఖునిన్ " అంటె సరిపొతోదనుకుంటాను.


  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 36. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఇప్పుడు సరిపోతుంది. అయినా మదించిన ఏను గెందుకు? "మాతంగ ముఖున్" అందాం.

  రిప్లయితొలగించండి
 37. కుందుచు కుమ్ముచు పట్టుచు
  క్రిందకు త్రోసెడు జపాను క్రీడకు బోవన్
  సుందర వదనుడగు సుమో
  తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్

  తుందిలుడు = పెద్ద బొజ్జ గలవాడు

  రిప్లయితొలగించండి
 38. బందరు గణేశ వ్రతమున
  పందిరిలో పూజజేయ పరుగిడి రాగా
  సుందరముగ నవ్వులొలకు
  తుందిలుఁ గని మన్మథుఁడని తొయ్యలి మురిసెన్

  రిప్లయితొలగించండి