శాస్త్రి గారూ, ఆడవారిని ఏడిపించి 'ఆడు'కొనే వారిని తన్నుట అనడం చాలా బాగుంది. అమ్ముకొనే వారినే కాదు, కొనే వారినీ కలిపి తన్నాలి. - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
మంద పీతాంబర్ గారూ , మీ పద్యం చాలా బాగుంది . హృదయపూర్వక అభినందనలు . సమస్య చూడగానే నాకు తోచిన పూరణ ఇదే....అయితే ' జనుల నాకాంక్ష ' అనే కంటే (అక్కడ నుగాగమం రాదు కాబట్టి ) , జనుల ఆకాంక్షలన్నింటి అని విడదీయడం ఉత్తమంగా ఉంటుంది కదా . జనుల కోర్కెలన్నింటిని అని కూడ అనుకోవచ్చు !!!!
ఈ మధ్య టీవీ లో భార్యాబాధితులు కొందరు మాట్లాడటం వార్తలలో చూశాను. ఒకటి రెండు కేసులు నిజంగా చూశాను. ఆ కారణంగా, నా పూరణ కొంచెం భిన్నంగా వుండవచ్చు. కానీ నిజాంశం వుందని మనవి చేస్తూ, ఒక బాధితుడి అంతర్వాణిలో:
భార్య బాధింప పలుమార్లు పరుల కెరుక పరచ నలవిగాక, భయ కంపరములఁ బడి నాత్మ హత్య జేసి కొనుట కన్న యట్టి ఆడు వారిని తన్నుటే న్యాయ మగును.
మాస్టారూ, నేను నమ్మను సార్ (నవ్వుతూ). శ్రీమతి శాంతి గారు మీకు యెంత సహకరించకపోతే మీ మదినుండి కలం (అఫ్ కోర్స్, లేఖిని అనుకోండి) ద్వారా ఆణిముత్యాల వంటి పద్యాలు జాలు వారుతున్నాయీ!
మిస్సన్న గారి సీసం బాగుంది, కానీ "...చంపగ బూను కాలుడొకడు" లో యతికోసం కాలుడు అన్న మాట వాడారేమో (నవ్వుతూ). అట్లాంటి వాళ్ళని యముడితో పోల్చగూడదు సార్. వాళ్ళు నీచులు. శాస్త్రాలు చదువుతున్న కొద్దీ యమధర్మరాజుమీద గౌరవం హెచ్చుతోంది. మహానుభావుడు, ఆయనే లేకపోతే మనం ఈ లోకంలో ఇట్లా బ్రతకలేము. ఏదో నా స్వగతంలోంచి వచ్చిన స్నేహ పూర్వక స్పందన...
వసంత్ కిశోర్ గారూ, అందరం "ఆడువరిని" తంతే "ఆడువారితో" తన్నించారు. బాగుంది. అభినందనలు. "ఆపదొనరించు"ను "ఆపద నొనర్చు" అందాం. ఇక్కడ ఒక సూక్ష్మవిషయాన్ని గమనించాలి. సమస్యలో ఉన్నది "ఆడువారు" అంటే ఆడేవాళ్ళే. స్త్రీలు అనే అర్థంలో అర్ధానుస్వారంతో "ఆఁడువారు" అని ఉంటుంది.
గురువు గారూ మీ పూరణ చాల బాగుంది. మంద పీతంబార్ గారూ ధన్య వాదాలు. చంద్ర శేఖర్ గారూ ధన్య వాదాలు. మీరన్నది నిజం. కాలుడు ధర్మ మూర్తి. మీ పద్యం వైవిధ్యంగా అలరారుతోంది.
మాస్టర్ గారూ!ధన్యవాదములు.నీతి ప్రబోధంగా సాగిన మీ పూరణ చాలా బాగుంది.యెవరెవరిని తన్నాలో సీసంలొ వివరించిన మిస్సన్న గారి పూరణ అలరించింది.యెలాటి ఆడవారిని తన్నవచ్చో చెప్పిన చంద్ర శేఖర్ గారి పూరణ విలక్షణంగా ఉంది.పీతాంబర్ గారి రెండు పూరణలు,కిశోర్ గారి పూరణలు బాగున్నవి.
వరప్రసాద్ గారూ, శంకరాభరణం బ్లాగుకు స్వాగతం. మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు. అయితే కొన్ని లోపాలు ... అవి ఔత్సాహికులైన కొత్త కవులకు సహజం. నిరుత్సాహపడకుండా పద్య రచన కొనసాగించండి. తప్పులు సవరించి దారి చూపడానికి నేనూ కవిమిత్రులూ ఉన్నాం కదా. మీ పద్యం మొదటి పాదంలో "ధరించి + ఎదుట" అన్నప్పుడు నుగాగమం రాదు. రెండవ పాదంలో గణదోషం ఉంది. మూడవ పాదంలో చివర "తొ" అన్నారు. అది "తో" అనే ప్రయోగించాలి. (బ్రాకెట్లలో) నా సవరణలతో మీ పద్యం..... నేత గాంధి టోపి ధరించి (ప్రీతి తోడ) ఓటు (న)ర్థించగా మెచ్చి ఓటు వేసి ప్రాణ మిచ్చిన; ఓటరు (బ్రతుకుతోడ) ఆడు వారిని తన్నుటే న్యాయ మగును !
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిబ్రతుకు తెరువుకు వచ్చిన పడతుల తన
అమ్మ, చెల్లాయి,అక్కయ్య,నాత్మ మరచి
ఆట బొమ్మగ భావించి అమ్ము కొనుచు
ఆడువారిని; తన్నుటే న్యాయ మగును.
శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఆడవారిని ఏడిపించి 'ఆడు'కొనే వారిని తన్నుట అనడం చాలా బాగుంది.
అమ్ముకొనే వారినే కాదు, కొనే వారినీ కలిపి తన్నాలి.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిమంత్రి ప్రగడ గారూ!ధన్యవాదములు. మీ సూచనపై చిన్న సవరణ తో!
బ్రతుకు తెరువుకు వచ్చిన పడతుల తన
అమ్మ, చెల్లాయి,నక్కయ్య,నాత్మ మరచి
అమ్ము వారిని కొనువారి, నబలలనుచు
ఆడు వారిని; తన్నుటే న్యాయ మగును.
జనుల నాకాంక్ష లన్నింటి జటిల పరచి
రిప్లయితొలగించండిపూట పూటకో తీరుగా మాట మార్చి
నటునిటులదిప్పి కపటపు నాట కముల
నాడు వారిని తన్నుటే న్యాయమగును!!!
మంద పీతాంబర్ గారూ , మీ పద్యం చాలా బాగుంది . హృదయపూర్వక అభినందనలు . సమస్య చూడగానే నాకు తోచిన పూరణ ఇదే....అయితే ' జనుల నాకాంక్ష ' అనే కంటే (అక్కడ నుగాగమం రాదు కాబట్టి ) , జనుల ఆకాంక్షలన్నింటి అని విడదీయడం ఉత్తమంగా ఉంటుంది కదా . జనుల కోర్కెలన్నింటిని అని కూడ అనుకోవచ్చు !!!!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికన్న తల్లికి పట్టె డన్నము నిడ బోక
రిప్లయితొలగించండి........బయటికి నడుపెడి భ్రష్టు డొకడు!
కట్టు కొన్నాలిని కట్న కాన్క లటంచు
....... కర కర నమిలెడు కటిక యొకడు!
ప్రేమ యెరను జూపి వేధించి, కాదన
....... కాల్చి చంపగ బూను కాలు డొకడు!
బంగరు బొమ్మల నంగడిలో బెట్టి
........వెల కట్టి యమ్మెడు విటు డొకండు!
ఇట్టి త్రాష్టుల బంధించ నేళ్ళ కేళ్ళు
కటకటాలను, మహిళల కంట నీరు
తుడిచి నట్లగు, నతివల తోడ నాట
లాడు వారిని తన్నుటే న్యాయ మగును.
అభినందించిన డా.విష్ణు నందన్ గారికి కృతఙ్ఞతలు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారి పూరణ చాలా బావుంది
బాలు టాంపరు చేసిన బోలరులను
క్యాచు చేజార్చు ఫీల్డింగు కీచకులను
మ్యాచు ఫిక్సింగు చేయించి మాయలాట
లాడు వారిని తన్నుటే న్యాయ మగును !
( సరదాగా పూరించింది, ఎవరిని నొప్పించాలని కాదు.)
అందరికీ వందనములు
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
_______________________________________
ఆది శక్తి స్వరూపమే - ఆడ దన్న
ఆద రించుము అమితమౌ - ఆర్తి తోడ !
ఆడు వారిని ! తన్నుటే - న్యాయ మగును
అతివలకు,ఆప దొనరించు - అధము నెపుడు !
_______________________________________
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమంత్రిప్రెగడ వారు ప్రశంసించినట్లుగా మీ పురణ బాగుంది. అభినందనలు.
మంద పీతాంబర్ గారూ,
డా. విష్ణు నందన్ గారి ప్రశంసము పాతులైన మీకు అభినందనలు.
వారి సూచనను గమనించారు కదా!
రెండవ పురణ ప్రశతంగా ఉంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
మీ సీసపద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
"కట్టుకోన్న + ఆలిని" అన్నప్పుడు యడాగమం వస్తుంది. "కట్టుకొన్న సతిని" అందాం.
ఈ మధ్య టీవీ లో భార్యాబాధితులు కొందరు మాట్లాడటం వార్తలలో చూశాను. ఒకటి రెండు కేసులు నిజంగా చూశాను. ఆ కారణంగా, నా పూరణ కొంచెం భిన్నంగా వుండవచ్చు. కానీ నిజాంశం వుందని మనవి చేస్తూ, ఒక బాధితుడి అంతర్వాణిలో:
రిప్లయితొలగించండిభార్య బాధింప పలుమార్లు పరుల కెరుక
పరచ నలవిగాక, భయ కంపరములఁ బడి
నాత్మ హత్య జేసి కొనుట కన్న యట్టి
ఆడు వారిని తన్నుటే న్యాయ మగును.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండినా నిరీక్షిస్తున్న పూరణ మీ నుండి వచ్చింది. సంతోషం. సంతోషం ఎందుకంటే ఏం చెప్పను? (గుసగుస) నేనూ భార్యాబాధితుణ్ణే :-(
నా పూరణ ....
రిప్లయితొలగించండిపెద్దలను గురువుల గౌరవించకుండ
స్త్రీలతో మరియాదను మాలి, ఖలులఁ
గూడి నీతి సంస్కారముల్ వీడి మాట
లాడువారిని తన్నుటే న్యాయ మగును.
నోటు - చంద్రశేఖర్ గారికి ఉన్నంత ధైర్యం నాకు లేదు.
మాస్టారూ, నేను నమ్మను సార్ (నవ్వుతూ). శ్రీమతి శాంతి గారు మీకు యెంత సహకరించకపోతే మీ మదినుండి కలం (అఫ్ కోర్స్, లేఖిని అనుకోండి) ద్వారా ఆణిముత్యాల వంటి పద్యాలు జాలు వారుతున్నాయీ!
రిప్లయితొలగించండిమిస్సన్న గారి సీసం బాగుంది, కానీ "...చంపగ బూను కాలుడొకడు" లో యతికోసం కాలుడు అన్న మాట వాడారేమో (నవ్వుతూ). అట్లాంటి వాళ్ళని యముడితో పోల్చగూడదు సార్. వాళ్ళు నీచులు. శాస్త్రాలు చదువుతున్న కొద్దీ యమధర్మరాజుమీద గౌరవం హెచ్చుతోంది. మహానుభావుడు, ఆయనే లేకపోతే మనం ఈ లోకంలో ఇట్లా బ్రతకలేము. ఏదో నా స్వగతంలోంచి వచ్చిన స్నేహ పూర్వక స్పందన...
రిప్లయితొలగించండివసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిఅందరం "ఆడువరిని" తంతే "ఆడువారితో" తన్నించారు. బాగుంది. అభినందనలు.
"ఆపదొనరించు"ను "ఆపద నొనర్చు" అందాం.
ఇక్కడ ఒక సూక్ష్మవిషయాన్ని గమనించాలి.
సమస్యలో ఉన్నది "ఆడువారు" అంటే ఆడేవాళ్ళే. స్త్రీలు అనే అర్థంలో అర్ధానుస్వారంతో "ఆఁడువారు" అని ఉంటుంది.
గురువు గారూ మీ పూరణ చాల బాగుంది.
రిప్లయితొలగించండిమంద పీతంబార్ గారూ ధన్య వాదాలు.
చంద్ర శేఖర్ గారూ ధన్య వాదాలు.
మీరన్నది నిజం. కాలుడు ధర్మ మూర్తి.
మీ పద్యం వైవిధ్యంగా అలరారుతోంది.
మాస్టర్ గారూ!ధన్యవాదములు.నీతి ప్రబోధంగా సాగిన మీ పూరణ చాలా బాగుంది.యెవరెవరిని తన్నాలో సీసంలొ వివరించిన మిస్సన్న గారి పూరణ అలరించింది.యెలాటి ఆడవారిని తన్నవచ్చో చెప్పిన చంద్ర శేఖర్ గారి పూరణ విలక్షణంగా ఉంది.పీతాంబర్ గారి రెండు పూరణలు,కిశోర్ గారి పూరణలు బాగున్నవి.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
Varaprasad from Bangalore
రిప్లయితొలగించండితే : నేత గాంధి టోపి ధరించి నెదుట నిల్చి
ఓటును అర్థించగా మెచ్చి ఓటు వేసి
ప్రాణ మిచ్చిన; ఓటరు ప్రాణములతొ
ఆడు వారిని తన్నుటే న్యాయ మగును !
వరప్రసాద్ గారూ,
రిప్లయితొలగించండిశంకరాభరణం బ్లాగుకు స్వాగతం.
మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
అయితే కొన్ని లోపాలు ... అవి ఔత్సాహికులైన కొత్త కవులకు సహజం. నిరుత్సాహపడకుండా పద్య రచన కొనసాగించండి. తప్పులు సవరించి దారి చూపడానికి నేనూ కవిమిత్రులూ ఉన్నాం కదా.
మీ పద్యం మొదటి పాదంలో "ధరించి + ఎదుట" అన్నప్పుడు నుగాగమం రాదు. రెండవ పాదంలో గణదోషం ఉంది. మూడవ పాదంలో చివర "తొ" అన్నారు. అది "తో" అనే ప్రయోగించాలి. (బ్రాకెట్లలో) నా సవరణలతో మీ పద్యం.....
నేత గాంధి టోపి ధరించి (ప్రీతి తోడ)
ఓటు (న)ర్థించగా మెచ్చి ఓటు వేసి
ప్రాణ మిచ్చిన; ఓటరు (బ్రతుకుతోడ)
ఆడు వారిని తన్నుటే న్యాయ మగును !
గురువుగారూ మీ సవరణకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి