ఈ రోజు పూరించ వలసిన సమస్యను టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు పంపారు.
సింహమునెదిరించి గ్రామ సింహము గెలిచెన్
అయితే అనుస్వార పూర్వకమైన హకార ప్రాస కొందరిని ఇబ్బంది పెడుతుందేమో అన్న సందేహంతో కంద పాదాన్ని తేటగీతి పాదంగా మార్చాను. సింహమును జయించెను గ్రామసింహ మొకటి.
కవిమిత్రులు మీ వీలును బట్టి పై రెండింటిలో దేనినైనా స్వీకరించి పూరణలు పంపండి.సమస్యను పంపిన టేకుమళ్ళ వెంకటప్పయ్య గారికి ధన్యవాదాలు.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిసింహళ జట్టును జూడగ
సింహమె క్రిక్కెట్టునందు చిన్నదె కెనడా
'సంహౌ'గెలిచిన అనెదము
సింహము నెదిరించి గ్రామ సింహము గెలిచెన్.
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ చాలా బాగుంది.. అభినందనలు.
శాస్త్రి గారి పూరణ చాలా బాగుంది .
రిప్లయితొలగించండిసింహుని జీల్చిన ఘన నర
సింహుని నామమ్ము బెట్టె ,చిరుతనయునికిన్ ,
సింహుం డెట్లౌ ? తన "నర
సింహము " నెదిరించి గ్రామ సింహము గెలిచెన్!
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిశంకరార్యా!పీతాంబర్ గారూ! ధన్యవాదములు.
బొమ్మ కథలను వేసెడు పొత్తమందు
కండ బలమును మించును కలుగ తెలివి
అనుచు చెప్పెడు కథ గంటి, అందు లోన
సింహమును జయించెను గ్రామ సింహ మొకటి.
సింహా వలోకన ముగరిపి
రిప్లయితొలగించండిసింహ ద్వారము ననేగి సింహబ లుండున్
సింహ ధ్వ నిజే యుచునా
సింహము నెదిరించి గ్రామ సింహము గెలిచెన్
"ఓం హరి" యని కొలిచెడి కురు
రిప్లయితొలగించండిసింహము భీష్ముని, విరోధ చిత్త భయకరున్
సంహారముఁ జేసె మగువ
సింహమునెదిరించి గ్రామ సింహము గెలిచెన్!!
మొదటి పాదం సవరణతో:
రిప్లయితొలగించండిసింహావలోకనుండై
సింహ ద్వారమున నేగి సింహబలుండున్
సింహధ్వని జేయుచునా
సింహము నెదిరించి గ్రామ సింహము గెలిచెన్
Typo
రిప్లయితొలగించండివిరోధ > విరోధి
పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిపద్యం సర్వ లక్షణ శోభితమై అందంగా ఉంది. కాని భావం అర్థం కావడం లేదు. దీనికేదైనా సినిమా నేపథ్యం ఉందా? మరేదైన ఉందా?
హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండవ పూరణ ఇంకా బాగుంది. అభినందనలు.
"కండ బలమును మించును కలుగ తెలివి" అనడం కంటె "కండ బలము నధిగమించఁ గలదు తెలివి" అంటే ఇలా ఉంటుంది?
చంద్రశేఖర్ గారూ,
మంచి పద్యం. అభినందనలు. ఇంతకీ ఇక్కడ గ్రామ సిమ్హం ఎవరు?
సత్యనారాయణ గారూ,
అత్యుత్తమమైన పూరణ. ధన్యవాదాలు.
ఈ రోజు పూరణలు ఎక్కువగా రాలేదు. "సింహం" భయపెట్టిందా?
రిప్లయితొలగించండిసింహ సమానుడగు రాక్షస రాజ సింహుని(హిరణ్య కశిపుని )చీల్చి న నరసింహుని నామమును తన చిన్న కుమారునికి ఒక తండ్రి పెట్టుకొని ఆనందించ ,తన కుమారుడైన "నరసింహము"ను ఒక గ్రామ సింహము ఎదిరించగా, తన కుమారుడు సింహు డెట్లౌనని మదన పడ్డ తండ్రి మనోగతాన్ని పద్యంలో జొప్పించ ప్రయత్నిచాను .
రిప్లయితొలగించండిపీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిమీ భావాన్ని పట్టలేక పోయినందుకు సిగ్గు పడుతున్నాను. మన్నించాలి. ఇప్పుడు ఇది కదళీ పాకం అయింది మీ వివరణతో. ధన్యవాదాలు.
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిద్వార పాలక గ్రామ సింహములతో భయపెట్టిన పీతాంబర్,చంద్రశేఖర్ గార్ల పూరణలు బాగున్నవి.భీష్ముని పరంగా పూరించిన జీ యస్ యన్ గారి పూరణ బహు బాగా వున్నది.
గోలి హనుమచ్ఛాస్త్రి.
సింహము నెదిరించగలుగు
రిప్లయితొలగించండిసింహము తానే నటంచు సింగారముగా
సింహా పేరిడి, గ్రామపు
సింహము నెదిరించి గ్రామ సింహము గెలిచెన్
సింహా పేరున్న శునకమొకటి సింహాన్నెదిరించగలనని ప్రగల్భాలు పలికి చివరికి గ్రామసింహాన్ని మాత్రం ఎదిరించగలిగింది అని నా భావము.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిభేష్! కంద పద్యం నడక పట్టుబడింది. ఇక వెనక్కి తిరిగి చూడకండి.
చక్కని పూరణ. సలక్షణమైన పద్యం. అభినందనలు.
చిన్న సవరణ..... "తానే + అటంచు" అన్నప్పుడు నుగాగమం కాకుండా యడాగమం వచ్చి "తానే యటంచు" అవుతుంది.
ధన్యవాదములు గురువుగారూ!
రిప్లయితొలగించండిశంకరార్యా !
రిప్లయితొలగించండిఅందరికీ ఇదే సమస్య !
ఎప్పుడు యడా గమం వస్తుందో
ఎప్పుడు నుగాగమం వస్తుందో
కాస్త వివరించిన తొభై వంతులు
తప్పులు లేకుండా వ్రాయ గలుగే నేర్పు
సమకూరు తుంది , మాకు
శ్రమ తగ్గుతుంది , మీకు !
____________________________________
మందాకిని గారూ !
అనతి కాలం లోనే అద్భుతంగా అలరిస్తున్నారు !
"మగువల్ నేర్వగరాని విద్య గలదే - ముద్దార నేర్పించినన్ !
శకరార్యుని సాహచర్యంలో
అందరినీ తొందర్లోనే అధిగమించేట్టున్నారు !భేష్ !
అందరికీ వందనములు.
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
________________________________________
చందమామ లోన కధల - జదువ లేదె !
సింహ మును , చిట్టి కుందేలు - సంహ రించె
తనదు నీడనె , కూపముం - దనకు జూపి !
సింహమును జయించెను ,గ్రామ - సింహ మొకటి !
________________________________________
వసంతకిశోర్ గారూ!
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ!
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పద్యం. కాని కథలోని కుందేలు గ్రామసింహం ఎలా అయింది?
దుష్కర ప్రాస : "౦హ" దుష్కర ప్రాసయే. కానీ ఒక్క సింహ అనే పూర్వ పదం తోనే ఎన్నో మాటలు వున్నాయి అని చెప్పాలని పద్యం అట్లా వ్రాశాను. మిగతా ఎక్కువ సంస్కృత మూలం కలిగిన పదాలు నా ఊహకి అందినమటుకు:
రిప్లయితొలగించండి౧. సంహారము, సంహరణము, సంహర్త వగైరా...
౨. సంహిత(ము)
౩.బృ౦హితము
౪. అంహతి;
౫. సంహతి
౬. సంహననము
౭. సంహతలము
౮. రంహస్సు
ఇంకా తెలిసిన వారుంటే పట్టిక కి చేర్చగలరు. అందరికి ఉపయోగపడతాయి.
ధన్యవాదాలతో...
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీరిచ్చిన పదాలతో నేనేదైన పద్యం వ్రాయ గలనేమో చూస్తాను.
శంకరార్యా !
రిప్లయితొలగించండిసింహాన్ని కుక్క గెలవడమంటే
ఒక అర్భకుడు బలాఢ్యుని జయించడమే గదా !
కుక్క కన్నా ఎన్నోరెట్లు బలహీనం కుందేలు !
మరి అది నిజంగానే సింహాన్ని జయించింది ఆ కథలో !