కవి మిత్రులారా, ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
అర్జునునకు మిత్రుఁ డంగరాజు.
ఇప్పుడే వేములవాడ నుండి హైదరాబాదు చేరుకున్నాను. వచ్చీ రావడం తోనే ముందుగా సమస్యను పోస్ట్ చేస్తున్నాను. ఇక తీరిగ్గా నిన్నటి మొన్నటి పూరణలూ, వ్యాఖ్యలూ, స్పందనలూ చూస్తాను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. అయితే "బాస చేయడం, మాట ఇవ్వడం" ఒకటే కదా. అర్థ పునరుక్తి అవుతున్నట్లు నాకు అనుమానం. "బాస చేతు ననుచు బాహాటముగ జెప్పె" అంటే ఎలా ఉంటుందంటారు?
విధి వశము చేత - విజయమ్ము వరియించె నర్జు నునకు ! మిత్రు - డంగ రాజు నన్ను వీడి పోయె - నాక మునకు నేను వచ్చు దనుక - నిలువ లేక ! __________________________________________
చంద్రశేఖర్ గారూ, మంచి పూరణ. అభినందనలు. దుశ్శాసనుడు, దుస్ససేనుడు శబ్దాలు ఉన్నాయి కాని దుస్సహుడు ప్రయోగం లేదు. "దుస్సహుం జేర్చి" ను "దుస్ససేనుతో" అందాం. చివరి పాదంలో చతుషటయములో "య" పోయింది.
బాల క్రిష్ణ,కృష్ణ పరమాత్మ పాత్ర ,నా గార్జునునకు మిత్రుడంగరాజు పాత్ర ,భీమసేను పాత్ర శ్రీహరికి ,రా రాజు పాత్ర చిన్న రామ రావు!
{పౌరాణిక సినిమా తీయాలనే కోరికతో ఒక నిర్మాత ఔత్సాహిక దర్శకునితో చర్చిస్తూమిగితా పాత్రల ఎంపికలో శ్రీ వసంత కోశోరుల వారిని సంప్రదించాలని నిర్ణయించు కొన్నట్లు సమాచారం) మిత్రులు వసంత కిశోరులకు క్షమాపణలతో
పీతాంబరధరా ! ఈ చిన్న రామ రావులూ బాలక్రిష్ణలూ నాగార్జునులూ ---------------- అబ్బే !నా వల్ల కాదు ! మనకి అన్నగారైతేనే ఆవేశం వస్తుంది !
అదేదో మీరే తీస్కోండి ! ఆ !మర్చి పోయాను ! శాస్త్రి గారు ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు ! అప్పుడే ఒక పాట పూర్తి జేసారు కూడా ! (ద్రౌపదికీ కర్ణుడికీ యుగళ గీతమట ) ఆయన్ని సంప్రదించండి !
పీతాంబర్ గారూ!పాత్రోచిత పురాణ పూరణ ప్రశస్తముగానున్నది.నటులను త్వరగా బుక్ చేసుకోండి.కిశోర్ జీ!మా సినిమా విడుదలకు సిద్ధముగానున్నది.ఇక ఎవరికీ అవకాశము లేదని మనవి.
మందాకిని గారు, ఔనండీ google లో login అయ్యి రాస్తే ఆంగ్లం లో కనిపిస్తుందండి అప్పుడప్పుడు పేరు/URL వాడుకొని అని రాస్తాను బద్దకం తో కానీ చాలామటుకు ఆయ్యే రాస్తున్నాను
చాల సంతోషం గురువు గారు అర్జునునకు = అర్జున సింగ్ మిత్రుఁ డంగరాజు = యునియన్ కార్బైడ్ అధినేత (భోపాల్ దుర్ఘటన సమయంలో జరిగినది ) . ఆ రోజు సిస్టం సరిగా పని చేయలేదు .
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండి"కదన మందు నేను కాలుని గానౌదు
అర్జునునకు;" మిత్రు డంగ రాజు
మాట తప్ప ననుచు మాట యిచ్చె
రాజరాజు కపుడు రాజ సభను.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండి"కదన మందు నేను కాలుని గానౌదు
అర్జునునకు;" మిత్రు డంగ రాజు
మాట తప్ప ననుచు మాటను ఇచ్చెను
రాజరాజు కపుడు రాజ సభను.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిమూడవ పాదం
బాస చేతు ననుచు మాటను ఇచ్చెను
అంటే..మాట.. పునరుక్తి ఉండదేమో.
అర్జునునకు, మిత్రుఁ డంగరాజునకును
రిప్లయితొలగించండిసమర రంగమందు సరిజోడు కుదిరె
రాజరాజు మదిని రాధేయుఁ దలచి,
చింత దీరి ఇంక చాల సంతసించె!
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
అయితే "బాస చేయడం, మాట ఇవ్వడం" ఒకటే కదా. అర్థ పునరుక్తి అవుతున్నట్లు నాకు అనుమానం. "బాస చేతు ననుచు బాహాటముగ జెప్పె" అంటే ఎలా ఉంటుందంటారు?
మందాకిని గారు,
రిప్లయితొలగించండిచాలా సంతోషం. దారిలో పడుతున్నారు. బాగుంది. అభినందనలు.
చివరి రెండు పదాల్లో గణదోషాలు (మరీ చిన్నవి) ఉన్నాయి. నా సవరణ....
రాజరాజు మదిని రాధేయు(ని) దలచి,
చింత దీరి చాల సంతసించె!
ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిఈ సమస్య చూడగానే "దుషట చతుషటయము", మాయాబజార్ గుర్తుకొచ్చాయి. కొంచెం మార్చి...
రిప్లయితొలగించండిరారాజు దుర్యోధనుడు వికటాట్టహాసంతో:
అటునిటు యగుగాక ఆగర్భశత్రుల
మర్జునునకు, మిత్రుఁడ౦గ రాజు,
శకుని మామ హితుడునిక, దుస్సహుం జేర్చి
దుషట చతుష టయము మేము గామె!
అయితే నాల్గో పాదం యతి కోసం:
రిప్లయితొలగించండిరారాజు దుర్యోధనుడు వికటాట్టహాసంతో:
అటునిటు యగుగాక ఆగర్భశత్రుల
మర్జునునకు, మిత్రుఁడ౦గ రాజు,
శకుని మామ హితుడునిక, దుస్సహుం జేర్చి
దుషట చతుష టమను దూరు లమ్ము!
ధూర్తుడు - దూరుడు పకృతి,వికృతులను కొని దూరులమ్ము వాడాను. కాని పక్షంలో "దూర్తులమ్ము" అనుకోవచ్చు యతి గణ దోషాలు కలగకుండా. కావున:
రిప్లయితొలగించండిరారాజు దుర్యోధనుడు వికటాట్టహాసంతో:
అటునిటు యగుగాక ఆగర్భశత్రుల
మర్జునునకు, మిత్రుఁడ౦గ రాజు,
శకుని మామ హితుడునిక, దుస్సహుం జేర్చి
దుషట చతుష టమను ధూర్తులమ్ము!
సవ్య సాచి పేరు సార్థకంబెవనికి?
రిప్లయితొలగించండితరణి యనగ నెవరు? ధరణి పైన
అడుగనంగనేమి? అమృతాశువెవ్వండు?
అర్జునునకు, మిత్రుఁ, డంగ, రాజు!!
కృష్ణరాయబార ఘట్టం లో దుర్యోధనుడు కృష్ణుడితో :
రిప్లయితొలగించండిభీష్ముఁ రాక దెలిసి భీతిలిపారరే?
ద్రోణుఁ జూచి వారు తూలిబడరె?
పిలువుమనికిఁ కృష్ణ! పెదతండ్రి నేజూపు
నర్జునునకు మిత్రుఁ డంగరాజు. :)
మందాకిని గారి పూరణరెండోపాదం కూడ చూడాలండీ ( సరిజోడు బదులు స్పర్ధ ?)
రిప్లయితొలగించండి-
దుర్యోధనుడు (స్వగతము)
రిప్లయితొలగించండియుధ్ధ మందుఁ గూలె యోధుఁడు మన మొన
నర్జునునకు మిత్రుఁ డంగ రాజు
విజయ లక్ష్మి గూడ విజయుని నీనాడు
కౌరవులకు నేమి గారవమ్ము !
"అపజయమ్ము తథ్య మా పాండవులకును
రిప్లయితొలగించండిఅర్జునునకు ; మిత్రుడంగరాజు
చెలరేగి పోవ, నాలములో" అని
పల్కె, కురుపతి సభ వైపు జూచి.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
తొడలు విరిగిన దుర్యోధనుడు మనస్సులో :
01)
_________________________________________
విధి వశము చేత - విజయమ్ము వరియించె
నర్జు నునకు ! మిత్రు - డంగ రాజు
నన్ను వీడి పోయె - నాక మునకు
నేను వచ్చు దనుక - నిలువ లేక !
__________________________________________
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమంచి పూరణ. అభినందనలు.
దుశ్శాసనుడు, దుస్ససేనుడు శబ్దాలు ఉన్నాయి కాని దుస్సహుడు ప్రయోగం లేదు.
"దుస్సహుం జేర్చి" ను "దుస్ససేనుతో" అందాం. చివరి పాదంలో చతుషటయములో "య" పోయింది.
యుద్ధానికి ముందు దుర్యోధనుడు మనస్సులో :
రిప్లయితొలగించండి02)
__________________________________________
అనియె తప్ప దనుట - ననివార్య మైనచో
యుద్ధ మునకు నెపుడు - సిద్ద మేను !
నాదు భాగ్య వశము - నాకమ్మునే జూపు
నర్జును నకు; మిత్రు డంగరాజు !
___________________________________________
జిగురు సత్యనారాయణ గారూ,
రిప్లయితొలగించండిఅత్యుత్తమమైన పూరణ మీది. అభినందనలు.
ఊకదంపుడు గారూ,
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
మందాకిని గారి పూరణలో మీ సూచనకు ధన్యవాదాలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మంచి పూరణ. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
చక్కని ఊహతో బాగా పూరించారు. అభినందనలు.
మూడవ పాదంలో గణం, యతి తప్పాయి.
చెలగి యుద్ధ మతడు చేయగల డనుచు" అంటే సరిపోయింది.
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశంకరార్యా!ధన్యవాదములు.సొగసైన సవరణ చేసారు.కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
బాల క్రిష్ణ,కృష్ణ పరమాత్మ పాత్ర ,నా
రిప్లయితొలగించండిగార్జునునకు మిత్రుడంగరాజు
పాత్ర ,భీమసేను పాత్ర శ్రీహరికి ,రా
రాజు పాత్ర చిన్న రామ రావు!
{పౌరాణిక సినిమా తీయాలనే కోరికతో ఒక నిర్మాత ఔత్సాహిక దర్శకునితో చర్చిస్తూమిగితా పాత్రల ఎంపికలో శ్రీ వసంత కోశోరుల వారిని సంప్రదించాలని నిర్ణయించు కొన్నట్లు సమాచారం)
మిత్రులు వసంత కిశోరులకు క్షమాపణలతో
vookadampudu గారికి, గురువుగారికి నెనరులు.
రిప్లయితొలగించండిఊకదంపుడు గారు, మీరు ఒకరేనాండీ!
పీతాంబరధరా !
రిప్లయితొలగించండిఈ చిన్న రామ రావులూ
బాలక్రిష్ణలూ
నాగార్జునులూ
----------------
అబ్బే !నా వల్ల కాదు !
మనకి అన్నగారైతేనే ఆవేశం వస్తుంది !
అదేదో మీరే తీస్కోండి !
ఆ !మర్చి పోయాను !
శాస్త్రి గారు ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు !
అప్పుడే ఒక పాట పూర్తి జేసారు కూడా !
(ద్రౌపదికీ కర్ణుడికీ యుగళ గీతమట )
ఆయన్ని సంప్రదించండి !
పీతాంబర్ గారూ!పాత్రోచిత పురాణ పూరణ ప్రశస్తముగానున్నది.నటులను త్వరగా బుక్ చేసుకోండి.కిశోర్ జీ!మా సినిమా విడుదలకు సిద్ధముగానున్నది.ఇక ఎవరికీ అవకాశము లేదని మనవి.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
మందాకిని గారు, ఔనండీ
రిప్లయితొలగించండిgoogle లో login అయ్యి రాస్తే ఆంగ్లం లో కనిపిస్తుందండి అప్పుడప్పుడు పేరు/URL వాడుకొని అని రాస్తాను బద్దకం తో కానీ చాలామటుకు ఆయ్యే రాస్తున్నాను
ఆ : వాహ నంబును వడివడిగా నమర్చి నే
రిప్లయితొలగించండిలోహ పక్షి పెట్టె లోన పెట్ట
ధన్యవాదములను దెలుపుతూ వెడలెను
అర్జునునకు మిత్రుఁ డంగరాజు. !
వరప్రసాదు గారూ !
రిప్లయితొలగించండిమీ భావ మేమిటో
అవగత మవకున్నది !
వివరించ గలరా !
చాల సంతోషం గురువు గారు
రిప్లయితొలగించండిఅర్జునునకు = అర్జున సింగ్ మిత్రుఁ డంగరాజు = యునియన్ కార్బైడ్ అధినేత (భోపాల్ దుర్ఘటన సమయంలో జరిగినది ) .
ఆ రోజు సిస్టం సరిగా పని చేయలేదు .