ఈ కావ్యం పేరేమిటి?
సీ.ఏది జటాయువు సోదరునకుఁ బేరు?
సాగరముఁ గలువ సాగు నేది?
మత్తుఁ గల్గించు గమ్మత్తు వస్తు వదేది?ఇల్వలు సోదరుం డెవ్వఁ డతఁడు?
పాంచాలితోడ సుభద్ర వరుస యేది?నాల్గవ శత్రువు నామ మేది?
కామధేనువునకుఁ గల వేఱు పేరేమి?సముదాయమునకును సంజ్ఞ యేది?
ఆ. వె.
వాయుసుతుఁడు పాండవద్వితీయుఁ డెవండు?
త్ర్యక్షరపదము లవి; తడవి చూడ
మధ్యమాక్షరముల మధుర ప్రబంధమై
యొప్పు కావ్య మేదొ చెప్పఁ గలరె?
ముందు తొమ్మిది ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, ఆ తర్వాత ఆ కావ్యం పేరు చెప్పండి.
సమాధానాన్ని క్రింది మెయిల్ అడ్రస్‌కు పంపండి.
shankarkandi@gmail.com
సమాధానం మీ ఈమెయిలు కు పంపాను, మాస్టారు.
రిప్లయితొలగించండిగురువు గారూ,
రిప్లయితొలగించండిసమాధానం ఈమెయిలు ద్వారా పంపాను.
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
ఇప్పటికి సమాధానాలు పంపినవారు ..............
రిప్లయితొలగించండి1. చంద్రశేఖర్ గారు,
2. కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
3. మందాకిని గారు,
4. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు,
5. వసంత్ కిశోర్ గారు
అందరి కందరూ సరియైన సమాధానాలు పంపారు. అందరికీ అభినందనలు.