17, మార్చి 2011, గురువారం

సమస్యా పూరణం - 258 (మాధవుఁడు మాధవుని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మాధవుఁడు మాధవునితోడ మత్సరించె.
ఈనాటి సమస్యను సూచించిన మందాకిని గారికి ధన్యవాదాలు.

10 కామెంట్‌లు:

 1. గోలి హనుమచ్ఛాస్త్రి.

  లింగ రూపము నందున లీల జూపి
  ఆది అంతము లేకుండ అట్లె నిలువ
  మొదలు గానక అప్పుడు మ్రొక్కె,ఎపుడు
  మాధవు డుమాధవుని తోడ మత్సరించె?

  రిప్లయితొలగించండి
 2. పరశు రాముడు ,రాముడు నరయ నొకరు
  గాదె !మాధవాంశ లువారు ,కార్య రథులు.
  పాపులను ద్రుంచి సుజనుల ప్రభను బెంచ
  మాధవుడు మాధవుని తోడ మత్సరించె !

  రిప్లయితొలగించండి
 3. హనుమచ్ఛాస్త్రి గారూ,
  చాలా బాగుంది. ప్రశ్నార్థకంగ ముగించారు. సంతోషం. అభినందనలు.

  పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 4. శంకరార్యా! ధన్యవాదములు.మాధవుడు+ఉమాధవుని తోడ - కలిపి మాధవు డుమాధవుని తోడ అని వ్రాశాను.తప్పేమీ లేదుకదా.సందేహం తీర్చగలరు.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 5. సింహమునెదిరించి గ్రామ సింహము గెలిచెన్ ....శంకరయ్య గారూ... ఈ సమస్య ఎలా ఉంది? బాగుందనుకుంటే.. ఇవ్వండి.

  రిప్లయితొలగించండి
 6. పలికె శిశుపాల పత్నులు బాధ తోడ
  నిటుల " రాజసూయంబున కుటిల బుద్ది
  మా ధవుఁడు (1) మాధవుని(2)తోడ మత్సరించె

  కడకు మరణించి మమ్ముల విడిచి వెళ్లె"!!

  (1) మా ధవుఁడు = మా యొక్క భర్త = శిశుపాలుడు
  (2) మాధవునితో = లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణునితో

  రిప్లయితొలగించండి
 7. హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీరు వ్రాసింది ఒప్పే.

  వెంకటప్పయ్య గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 8. సత్యనారాయణ గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. శంకరార్యా! ధన్యవాదములు.
  సత్ర్యనారాయణ గారూ! మాధవుని పేరు శిశు పాలునికి చక్కగా అన్వయించారు.అభినందనలు.

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి