శివుని రాత్రి యంచు సినిమాలు మూడేయ; గాఢ నిద్ర తూలె!గార్డు గారు! భార్య పెట్టె ఇంట భారీగ ఫుడ్డును ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు (ఒకానొక శివ రాత్రి నాడు మూడు సినిమాల డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డు కు ఇంటికి రాగానే భార్య ఎక్కువగా వడ్డించింది.బాగా తినేసాడు. ఇంకేముందీ తెల తెల్లవారుతుండగానే నిద్ర తన్నుకొచ్చింది పాపం గార్డు గారికి)
01) నవ వధువు మనసులో : ___________________________________
తెల్ల వార్లు కునుకు - తీయ నీయ డతడు అతని ప్రేమ మందు - అలసి నాను ! రమ్య మలర తిరిగి - రాత్రి వచ్చే లోపు ! ప్రొద్దు పొడిచె నింక - నిద్దు రింతు ! ___________________________________
రేపు కలదు ఒక పరీక్ష,శ్రద్ధ గలిగి
రిప్లయితొలగించండిరాత్రి యంత టీలు త్రాగి త్రాగి
ఛదువు చుంటి,గడిచె సమయ మిట్టులె జూడ
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు!
చిన్న సవరణ!మొదటి పాదం లో (కలదు +ఒక)సంధి విడిపోయింది .. కనుక
రిప్లయితొలగించండి"రేపు వ్రాయ వలె పరీక్ష,శ్రద్ధ గలిగి"
అని మార్పు చేస్తున్నాను.
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిపరీక్ష చదువుల మీ పూరణ బాగుంది. అభినందనలు.
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిసవరణతో పద్యసౌందర్యం ఇనుమడించింది.
శివుని రాత్రి యంచు సినిమాలు మూడేయ;
రిప్లయితొలగించండిగాఢ నిద్ర తూలె!గార్డు గారు!
భార్య పెట్టె ఇంట భారీగ ఫుడ్డును
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు
(ఒకానొక శివ రాత్రి నాడు మూడు సినిమాల డ్యూటీ చేసిన సెక్యూరిటీ గార్డు కు ఇంటికి రాగానే భార్య ఎక్కువగా వడ్డించింది.బాగా తినేసాడు. ఇంకేముందీ తెల తెల్లవారుతుండగానే నిద్ర తన్నుకొచ్చింది పాపం గార్డు గారికి)
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిముద్దు లొలుకు వాఁడు మామచ లువఱేఁడు
రిప్లయితొలగించండిగగన మందు వెల్గు ఘనముగా ననుచును
వేచి యున్నతార వేసారి దాఁదల్చె
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
నవ వధువు మనసులో :
___________________________________
తెల్ల వార్లు కునుకు - తీయ నీయ డతడు
అతని ప్రేమ మందు - అలసి నాను !
రమ్య మలర తిరిగి - రాత్రి వచ్చే లోపు !
ప్రొద్దు పొడిచె నింక - నిద్దు రింతు !
___________________________________
వసంత కిషోర్ గారూ.. బాగుంది మీ పూరణ..
రిప్లయితొలగించండిఅలాంటి భావం లో రాయలని అనిపించింది ఎందుకో...
కొత్త పెండ్లి కొడుకు కోరిక లెన్నెన్నొ
నిదుర బోద మన్న నిలువ నీడు
అలసి పోతి నేను; ఆపుము! యోబావ!
ప్రొద్దు పొడిచె నింక నిద్దు రింతు
సాప్టువేరు కొలువు, క్షణము తీరిక లేదు
రిప్లయితొలగించండితమి సమయమున పని దనుజుల వలె
అమెరికా సమయమె యాంధ్రాన మాకును
ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు!!
తమి = రాత్రి
రాత్రి షిఫ్టు లంచు రాడాయె నింటికి
రిప్లయితొలగించండిప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు
ననెడు సాఫ్టువేరు తనయుని గనితల్లి
యేల తిప్ప లనుచు జాలి వడియె!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచలువ రేడు సరస సల్లాపముల నాడి
రిప్లయితొలగించండివెన్నెల కురిపించె వేడ్క తోడ ;
తార వైపు జూచ( తడనె, "నే నలసితి
పొద్దు పొడిచె నింక నిద్దు రింతు"
అంతా సాఫ్టువేర్ వాళ్ళ మీద పడ్డారు. మరి చందమామ తనలోతాను ఎమనుకొంటున్నడో తేటగీతి లో చూద్దాము:
రిప్లయితొలగించండిరేతిరంత కలువరేడు రెప్ప వాల్చ
కుండ,పండురేయండను నిండ గాసి
నెంచె "ప్రొద్దు పొడిచె నింక నిద్దురింతు,
పద్మబాంధవు రాకడఁ బలకరించి"!
మిత్రులందరి పూరణలు ముచ్చట గొలుపుతున్నవి. నేనకొన్న భావానికి వసంత కిశోర్ మరియు టేకుమళ్ళ గారు అక్షర రూపమిచ్చారు . బాగున్నవి .ఉండ బట్టలేక ఏదో పురించానని అనిపించాను .
రిప్లయితొలగించండిరేయి గడిచి పోయె రేరాజు ముద్దాడ
కలువ మురిసి విరిసె కొలను సాక్షి !
కమల ముద్దు మోము కమలేశు ముద్దాడ
ప్రొద్దు పొడిచె, నింక నిద్దురింతు !
రాత్రి వేళ రక్కె రాకాసి దోమలు
నైటు గార్డు డ్యూ టి నరక మయ్యె
పొట్ట కూటి కొఱకు పుట్టెడు బాధలు
ప్రొద్దు పొడిచె, నింక నిద్దురింతు !
చంద్ర కాంతు లందు సరదాలు దీఱంగ
రిప్లయితొలగించండికులికి తన్ను మఱచె కుముద నెలత
ఉష్ణరశ్మి యందు నోపదు హృదయమ్ము
ప్రొద్దు పొడిచె నింక నిద్దురించె
రేయి మించె గాని రేరాజు రాడేల
రిప్లయితొలగించండిచుక్క లన్ని చెదరి చిక్కి పోయె
వెన్నె లమ్మ చూడ వెలవెల బోయెనే
ప్రొద్దు పొడిచే నింక నిద్దురింతు !
మిత్రు లందరికీ వందనాలు. ఉదయం ఒక్కొక్కరి పూరణలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు టైపు చేస్తుండగా పవర్ కట్. సేవ్ చేయని వ్యాఖ్యలన్నీ పోయాయి. అర్జంటుగా ఒక పని మీద వెళ్ళవలసి ఉన్నందున విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. మన్నించండి.
రిప్లయితొలగించండిపూరణలు పంపిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారు,
టేకుమాళ్ళ వెంకటప్పయ్య గారు,
మందాకిని గారు,
వసంత్ కిశోర్ గారు,
జిగురు సత్యనారాయణ గారు,
మిస్సన్న గారు,
నాగరాజు రవీందర్ గారు,
చంద్రశేఖర్ గారు,
మంద పీతాంబర్ గారు,
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
నేదునూరు రాజేశ్వరి గారు.
అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.