29, మార్చి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 270 (కవి నాశముఁ గోరె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కవి నాశముఁ గోరెఁ దన సుకావ్యములోనన్.

13 కామెంట్‌లు:

  1. రవి కుల తిలకుని చరితము
    నవలీలగ వ్రా సె తాను ఆదిక వందున్!
    కవిరాజు ఇంద్రజిత్ జన
    క, వినాశము గోరె దన సుకావ్యములోనన్!

    రిప్లయితొలగించండి
  2. కవి వ్రాసెను భారతమును,
    భువిలో ధర్మము నిలుపగ, పోరాడిన కౌ
    రవులు బరమ దురితులు,గను
    క, వినాశము గోరె దన సుకావ్యములోనన్!

    రిప్లయితొలగించండి
  3. రవి తేజము ప్రసరించెడు
    ప్రవిమల సత్కవిత భువిని భాసిల్లగ, దు
    ష్కవితా జగతి నొక మహా
    కవి నాశముఁ గోరెఁ దన సుకావ్యములోనన్.

    రిప్లయితొలగించండి
  4. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంమంగళవారం, మార్చి 29, 2011 11:16:00 AM

    గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ చాలా బాగుంది.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ
    అలరించు చున్నవి !
    01)
    ___________________________________

    కవనంబన మంచి చెడులు!
    కవితా మంచిగ మెరయును - కావ్యము నందున్!
    అవసర వేళల నొకచో
    కవి నాశము గోరు దన సు - కావ్యము లోనన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  6. కవి రాజశేఖరంబను
    నవ కావ్యారంభ మునను నతులిడి యెను స-
    త్కవి లోకమునకు, కర్త, కు-
    కవి నాశముఁ గోరెఁ దన సుకావ్యములోనన్.

    రిప్లయితొలగించండి
  7. కవు లెందరొ విరచించిరి
    భావి తరానికి తెలుపగ కావ్యములెన్నో !
    కవి నంచు కుకవి యాతడు
    కవి నాశముఁ గోరెఁ దన సుకావ్యము లోనన్ !

    రిప్లయితొలగించండి
  8. రవి బింబము తూరుపు దెశ
    భువి నంతట తేజమలర దివిజులు మెచ్చన్ !
    కవినంచు కవిత లలరగ
    కవి నాశముఁ గోరెఁ దన సు కావ్యము లోనన్ !

    రిప్లయితొలగించండి
  9. అవినీతి రాచరికమును
    భువిలో నన్యాయమున్ను భూరిగ నొప్పన్,
    నవయుగ చైతన్య ప్రజా
    కవి, నాశముఁ గోరెఁ దన సుకావ్యములోనన్

    రిప్లయితొలగించండి

  10. చెవులకు నింపగు రీతిని
    నవరసముల నొల్కుచుండు నాణ్యత తోడన్
    కువలయమందు దురితముల
    కవి నాశముఁ గోరెఁ దన సుకావ్యములోనన్

    రిప్లయితొలగించండి