11, మార్చి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 251 (విస్కీయే మేలు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
విస్కీయే మేలు విషము విఱుగుట కొఱకున్.

24 కామెంట్‌లు:

 1. మస్కా కొట్టకు నాకిక
  తీస్కో మని చెప్ప నీవు తేల్కుట్టంగాన్
  రిస్కున్ భరింప జాలను
  విస్కీ యే మేలు విషము విఱుగుట కొఱకున్?

  రిప్లయితొలగించండి
 2. గోలి హనుమచ్ఛాస్త్రి.

  చూస్కో! ముల్లును ముల్లుతొ
  తీస్కో వచ్చును;విషమది తెలియగ విస్కీ!
  రాస్కో! అదియే విధముగ
  విస్కీయే మేలు, విషము విఱుగుట కొఱకున్.

  రిప్లయితొలగించండి
 3. హనుమచ్చాస్త్రి గారూ!

  'ముల్లుతొ' లో తొ సరికాదండీ. తో మాత్రమే కరక్టు. వ్యావహారికం లో 'తొ ' అంటున్నాం కానీ వ్యాకరణంగా 'తొ ' లేదు.

  రిప్లయితొలగించండి
 4. మస్కా కొట్టిరె భ్రస్టులు
  మాస్కోలో సరుకు ననిరి మరి యొక విషమున్
  కాస్కో ఐ.వీ.నిచ్చెద
  విస్కీయే మేలు విషము విఱుగుట కొఱకున్ !

  మిథైల్ ఆల్కహాలు ( కల్తీ సారాలో ఉంటొంది ),లేక యాంటిఫ్రీజు త్రాగిన వాఱికి నిజంగానే ఇథైల్ ఆల్కహాలు ఐ.వీ ( సిర లోనికి ) యిస్తాము విఱుగుడుగా . ఐ.వీ కాకపోయినా త్రాగించ వచ్చు

  రిప్లయితొలగించండి
 5. 'ఉస్కో' నేర్పుట నేరము !!
  కాస్కో ఫలితమ్ము, బుధ్ధి గరపుట మేరీ
  బస్కీ బాత్ కాదటె? భౌ
  వ్విస్కీ యే మేలు విషము విఱుగుట కొఱకున్ (భౌవ్వ్+ఇస్కీ = భౌవ్విస్కీ)

  మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంతే ఇస్కో అందిట అన్న సామెత నుండీ...
  (శునకం మనోగతం గా పూరణ)

  రిప్లయితొలగించండి
 6. సనత్ గారు శునకరాజాన్నెన్నుకున్నారని, నేను ఆ పక్కనే ఉండే దేవదాసునెన్నుకున్నాను :)

  ఐస్కాంతమువలె లాగియె
  తస్కరమొనరించిహృదిని తరుణిరొ, పతిగాన్
  ఆస్కారమిడెమరొకనికి-
  విస్కీయే మేలు, విషము విఱుగుట కొఱకున్.

  రిప్లయితొలగించండి
 7. మస్కా గొట్టగ వచ్చు,పు
  రస్కారము కేలనుండు , రాణింపులు,బో
  కు, స్కాముల దారిన , "నో (no)
  విస్కీ" యే మేలు , విషము విఱుగుట కొఱకున్ !

  రిప్లయితొలగించండి
 8. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !

  01)

  _____________________________________

  అస్కలితులు సంసారులు !
  సంస్కారము లేనివాడు - సంకర్షణుడే !
  సంస్కృతము భాష గాదులె !
  విస్కీయే మేలు విషము - విఱుగుట కొఱకున్ !
  _____________________________________

  రిప్లయితొలగించండి
 9. హస్కప్పుడు ఏ డ్రింకును
  తీస్కొనదగు? నేదిఉండు తేలుకు కొండిన్?
  ఈ స్కోరెందుకు గాజున?
  విస్కీయే మేలు - విషము - విఱుగుట కొఱకున్!!

  1. హస్కు (కొట్టడం) - ఊకదంపుడు :-)
  2. గాజు అద్దాన్ని విఱవడానికి ముందు దానిపై వజ్రంతో ఒక గీత గీస్తారు. దానిని 'స్కోర్' అంటారు.

  రిప్లయితొలగించండి
 10. 02)
  _______________________________________

  మస్కరి మందుల కన్నను
  భాస్కరు నౌషధము కన్న - బహువిధముల శ్రే
  యస్కరమౌ,కొండొకచో
  విస్కీ యే మేలు విషము - విఱుగుట కొఱకున్ !
  _______________________________________

  (ఎవరో సన్యాసి ఇచ్చే మందుల కన్నా
  పక్కింటి తెలిసీ తెలియని భాస్కర్రావు ఇచ్చే మందుకన్నా
  ఒక్కొకసారి విస్కీయే శ్రేయస్కరమని భావము)
  _______________________________________

  మస్కరి = సన్యాసి , భిక్షుకుడు
  _______________________________________

  రిప్లయితొలగించండి
 11. కిశోర్ గారూ,

  ప్రాసాక్షరము ఒక పాదంలో బిందుపూర్వకమతే, అన్నిపాదాలలో బిందుపూర్వకముగా ఉండాలి.

  ప్రాసకు ముందున బిందువు
  వ్రాసిన ఒకపాదమందు వదలక బిందున్
  వేసుకొనవలెను మీరిక
  చూసుకు ప్రతిపాదమందు, సుకవి కిశోరా

  రిప్లయితొలగించండి
 12. పుష్యం గారూ !
  ధన్యవాదములు !
  నిజమే నేను గమనించలేదు !

  రిప్లయితొలగించండి
 13. పద్యము,కావ్యము రాయుచు
  హృద్యమమైనట్టి దేవరలు, ఆ కవులీ
  యుద్యమకాఱులఁజూడఁగ
  చోద్యమిదెగనుమని సుంత జాలినిగొనరో!

  సాత్వికులైన ఆ కవి హృదయాలు , తామసులైన ఉద్యమ కారుల చేష్టలనుఁ జూచి జాలిని పడి ఉంటారని నా భావము.
  ఇలాంటి చేతలు పూజ్యులైన వారి పూజనీయతను ఏమాత్రం కించపరచలేవు.

  రిప్లయితొలగించండి
 14. మందాకిని గారూ,
  నిన్నటి దుష్టచర్య తెలుగువారందరి గుండెకోతకు కారణమయింది. ఆ మహనీయులంతా భేదభావాలకు అతీతులు. ఇది అందరం సిగ్గుపడవలసిన సంఘటన. నేను విషణ్ణహృదయంతో నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను.
  వాస్తవానికి ఉదయాన్నే స్పందించేవాణ్ణి. నిన్న ఒక పెళ్ళికి వెళ్ళి రాత్రి 12 గంటలకు ఇల్లుచేరాను. ఆలస్యంగా లేచి బ్లాగు చూసి క్రొత్త సమస్య పోస్ట్ చేసాను. స్నానాదుల అనంతరం టి. వి. పెడితే నిన్నటి విధ్వంసాన్ని చూసి దిగ్భ్రాంతికి గురి అయ్యాను.
  ఈ సంఘటనపై "శంకరాభరణం" బ్లాగు నిరసనను తెలియజేస్తున్నది.

  రిప్లయితొలగించండి
 15. అందరికీ వందనాలు. నిన్నటి దౌష్ట్యం మనస్సును కలచి వేసింది. ఏదో మొక్కుబడిగా మీ పూరణలను చూసాను. వివరంగ పరిశీలించి వ్యాఖ్యానిందలేక పోతున్నాను. మన్నించండి.

  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  "తేల్కుట్టంగాన్" అనక "తేల్గుట్టంగాన్" అనవలసించి.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  "ముల్లుతొ" కాకుండా "ముల్లున" అందాం. ద్వితీయార్థంలో తృతీయను ప్రయోగించినట్లవుతుంది.

  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  సనత్ శ్రీపతి గారూ,
  ఊకదంపుడు గారూ,
  మంద పీతాంబర్ గారూ,
  వసంత్ కిశోర్ గారూ, (పుష్యం గారి వ్యాఖ్య చూసారు కదా!)
  పష్యం గారూ,
  అందరి పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. మందాకిని గారూ !
  మీ స్పందన చాలా చక్కగా తెలిపారు !

  నిన్నటి దురదృష్ట మైన సంఘటన
  టాంక్‌బండ్ వద్ద
  విఙ్ఞాన మూర్తుల విగ్రహ ధ్వంసం పై
  నా తీవ్ర నిరసనము :

  01)

  ఉద్యమ మనగా నేమది ?
  విద్యార్థులు , ప్రజలు గూడి - విధ్వంసమ్మే ?
  మద్యము త్రావిన చందము
  నధ్యాత్ముల విగ్రహముల - నాశమ్మేనా ?

  శంకరార్యా !దీనికొక ప్రత్యేక పేజీ కేటాయించి
  సభ్యులందరికీ స్వేచ్చగా నిరసన
  తెలుపుట కవకాశము కలిగింపుడు !

  రిప్లయితొలగించండి
 17. చూస్కొని త్రాగక పోతివి
  మస్కా గొట్టి నీకిటుల మంచి నీరని యిచ్చేన్ !
  రిస్కెం దుకు తెలిసి తెలిసి
  విస్కీయే మేలు విషము విఱుగుట కొఱకున్ !

  రిప్లయితొలగించండి
 18. క :విస్కీ గురించి జెప్పగ
  విస్కీయేయగు ; తెలియక విప్పిన బిరడా
  విస్కీ ఉప్పొంగి వచ్చు
  విస్కీయే మేలు విషము విఱుగుట కొఱకున్.!

  రిప్లయితొలగించండి
 19. రాజేశ్వరి నేదునూరి గారూ,
  రెండవ పాదంలో గణం, యతి రెండూ తప్పాయి.
  "మస్కా గొట్టి యిడె నీరు మంచి దటంచున్." అని నా సవరణ.

  వరప్రసాద్ గారూ,
  కంద పద్యాన్ని బాగా రాసారు. అభినందనలు.
  మూడవ పాదం చివర "గి వచ్చు" అని జగణం వేసారు. 1, 3 పాదాల్లో బేసి గణంగా జగణాన్ని వేయరాదు కదా.
  "విస్కీ యుప్పొంగి వెడలు" అంటే సరి.

  రిప్లయితొలగించండి
 20. బాస్కు సమర్పించుటకున్
  విస్కీయే మేలు; విషము విఱుగుట కొఱకున్
  తీస్కో పోవలె భర్తన్,
  రిస్కెందుకు, హాస్పిటలుకు రేపో మాపో!

  రిప్లయితొలగించండి
 21. మస్కా కొట్టగ బాసుకు
  విస్కీయే మేలు;...విషము విఱుగుట కొఱకున్
  తీస్కో స్టమక్కు పంపును
  వేస్కో నోటిని గబగబ వెంగళ రాయా!

  రిప్లయితొలగించండి