పద్య రచన
కొంత కాలంగా ఎందరో నన్నొక విషయం అడుగుతున్నారు. "మాకు పద్యాలు రాయాలనే ఆసక్తి ఉంది. మీ బ్లాగులో కేవలం `సమస్యా పూరణ`లే ఇస్తున్నారు. అసలు పద్యం రాయడమే కష్ట మనుకుంటుంటే క్లిష్టమైన సమస్యకు ఉచితమైన పరిష్కారం ఆలోచించి దానిని ఛందోబద్ధం చేయడం మాకు చాలా కష్టం. కాబట్టి మాలాంటి ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ స్వేచ్ఛగా పద్యాలను వ్రాసే అవకాశం కల్పించండి. ఒక అంశాన్ని ఇచ్చి నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనడం కాని, సమస్యగా కాకుండ ఏదైనా అంశంపై ఒక పద్యపాదాన్ని ఇచ్చి పద్యం పూర్తి చేయ మనడం కాని చేయవచ్చు" ఇదీ వాళ్ళు కోరుతున్నది.
నాకూ ఈ ఆలోచన ఎంతోకాలంగా ఉంది. "ఛందస్సు" పాఠాలు ప్రారంభించిన తరువాత "పద్య రచన" శీర్షికను ప్రకటించా లనుకున్నాను. కాని కొన్ని కారణాల వల్ల ఛందోపాఠాలు ప్రారంభించ లేదు. ఎప్పుడు మొదలు పెడతానో కచ్చితంగా చెప్పలేను.
అందువల్ల ఆసక్తి ఉన్నవారి ఉత్సాహాన్ని నీరుగార్చకుండా "పద్య రచన" శీర్షికను ప్రారంభిస్తున్నాను.
"పద్య రచన" శీర్షికలో ఏదైనా అంశం ఇచ్చి స్వేచ్ఛాఛందంలో కాని, నేను నిర్దేశించిన ఛందంలో కాని పద్యం వ్రాయమంటాను. లేదా ఏదైనా అంశంపై ఒక పాదాన్ని ఇచ్చి పద్యం పూర్తిచేయ మంటాను.
ఈ శీర్షికపై కవిమిత్రుల సలహాలను, సూచనలను కోరుతున్నాను. మీ అందరి అభిప్రాయాలను అనుసరించి ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఈ శీర్షికను ప్రారంభిస్తాను.
నేను కవిని కాను కానీ ఉత్సాహము ఉంది. ఇది మాకందరికీ ఒక మంచి అవకాశము కల్పించటమే. మాస్టారూ మీరు మొదలెట్టండి మీ వెంట ఉంటాము.
రిప్లయితొలగించండిఏ ఉపకరణము ఉపయోగిస్తే తెలుగు వత్తులూ గుడింతాలూ సరీగ్గా వస్తయ్యో మీరేమి వాడుతారో కొంచెము చెప్పండి.
రావు గారూ,
రిప్లయితొలగించండిసంతోషం. "శంకరాభరణం" మీకు స్వాగతం పలుకుతున్నది.
నేను "లేఖిని" ని వాడుతున్నాను. ఇది నాకు అన్నివిధాలా సహకరిస్తున్నది.
తెలుగు భాషయందు మక్కువ కలిగి, పద్యముల వ్రాయాలనే ఔత్సాహికులకు మీరు సంకల్పించిన "పద్య రచన' శీర్షిక ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నాను .ఈ ప్రయత్నంలో మీరు విజయం సాధించాలని చదువుల తల్లిని వేడుకొంటున్నాను.
రిప్లయితొలగించండిపద్యముల వ్రాయు పండిత విద్య మీరు
హృద్యముగ జెప్ప విమతులు హృదయ మందు
పదిల పరతురు మిమ్ముల, "పద్య రచన"
వెలుగు చినుకౌను ,పద్యాల వేదికౌను!
పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. ఈ శీర్షిక నిర్వహణలో మీరంతా గుణదోషాలను విశ్లేషిస్తూ ప్రోత్సహించాలి.
అన్నట్టు ... మీ పద్యంలో "విమతులు" అన్నారు. నాకు శత్రువులు ఎవరూ లేరు మరి!
శంకరార్యా !
రిప్లయితొలగించండిమంచి ఆలోచనే కాని
మీకు కొంచెం ఎక్కువ సమయం
కేటాయించాలి మరి ! !
మాధవుమాధవున్ వినతి మీఱెను;బంతముఁవీడరా దె; యే
రిప్లయితొలగించండిమో,ధరియింపఁగోరెదవు మోహిని రూపము, యాసుధనదే
పాతక రాక్షసాధముల బాలిటఁజేరక యుండుటం గదా
నాదు మనోరథంబదియునుం నెరవేరెను;పాడియా శివా
గురువుగారు,
సమస్యలో నేనివ్వాలనుకున్న సందర్భాన్ని ఇక్కడ ఉత్పలమాలలో రాయాలని ప్రయత్నించాను.
సరిదిద్దగలరు.
మా మీ; మో మో; పాబా, నా నె యతి కుదురుతుందో లేదో తెలీదు.
ద ధ త ప్రాస కుదురుతుందా?
శంకరార్యా!మంచి ఆలొచన!పాత చింతకాయ పచ్చడి అని కొందరు అనుకునే పద్య రచన నేర్చుకోవాలనే తపన వున్న ఔత్సాహిక మిత్రులను ముందుగా అభినందిస్తున్నాను. విశ్రాంతి తీసుకోవలసిన వయసులో ఎంతో ఉత్సాహంగా సిద్ధమైన శంకరం మాస్టారు గారికి వందనశతములు.ఏవరేమన్నా పాత చింతకాయపచ్చడి అరోగ్యకరమైనదే. అడిగె వారు,అందించే వారూ తక్కువైన ఈ రొజుల్లో కోరుకునే వారూ,కోరి గోరు ముద్దలు అందించేవారూ దొరికినప్పుడు ఇంకెందుకు ఆలస్యం...శుభం.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
శాస్త్రిగారు,
రిప్లయితొలగించండివచ్చి పద్యం మీద అభిప్రాయం చెప్పరా?
శంకరయ్య గారూ బహు చక్కని ఆలోచన ! అందరికీ ఉపయుక్తమైన సంకల్పం ! ధన్యవాదాలు....పద్య కవితాభిమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశంస !
రిప్లయితొలగించండిపద్య రచన లోతుపాతుల శోధించి
ఒప్పుతప్పులెల్ల విప్పి చెప్పి
తెలుగు వైభవమ్ము వెలిగింపబూను నీ
'శంకరాభరణము' సతము దలుతు !!!
సంకల్పమ్మిది వంక లేనిది కదా ! ఛందః పయస్సాగర
మింకన్ ద్రచ్చుడు ' బుద్ధి ' కవ్వముగ ! ' సాహిత్యామృతాపేక్షతో ' !!!
జంకేలా ? ఇది ' శంకరాభరణమే ' ! సాయమ్ముగా నిల్చు ; ని
శ్శంకన్ పాలు గొనుండు మీరలిక భాషా ప్రీతి నౌత్సాహికుల్ !!!!
( ఛందశ్శాస్త్రమనే క్షీర సాగర మథనంలో లభించే ' సాహిత్యమనే ' అమృతాస్వాదనకోసం , మీ మీ బుద్ధికుశలతే కవ్వం గా , ' శంకరాభరణం ' ( అధే ఆనాడు శంకరుని ఆభరణమైన ఆ వాసుకీ సర్పం , ఈనాడీ శంకరాభరణం !) మీ కవ్వానికి తాడులా నిలబడి సాయం చేయగా , జంకూ గొంకులన్నీ మాని , నిస్సందేహం గా, భాషా ప్రేమ కలిగిన ఔత్సాహికులందరూ ఈ ' పద్య రచన ' కార్యక్రమంలో పాలుపంచుకొన రండి !!! )
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రయత్నం మెచ్చుకోదగింది.
"ఆ సుధ నదే" అన్నచోట గణదోషం ఉంది. "వేల్పుబోనము" అంటే అమృతం. అక్కడ "వేల్పుబోనమున్" అని వ్రాస్తే గణదోషం ఉండదు.
రెండవ పాదంలో తప్ప మిగిలినవాటిలో యతి తప్పింది. 3,4 వ పాదాలలో ప్రాస తప్పింది.
ఇక భావం సంశయాత్మకంగా ఉంది. ఎవరు ఎవరితో చెప్తున్నారో తెలియడం లేదు.
సవరించడానికి ప్రయత్నం చేస్తాను.
నిరుత్సాహ పడకుండా పద్య రచన కొనసాగించండి.
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిఎంత వరకు సఫల మౌతుందో చూడాలి. దేనికైనా మీ అందరి సహకారం అవసరం.
హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
మందాకిని గారి పద్యాన్ని వారి కోరికపై సవరించే ప్రయత్నం ఏమైనా చేస్తారా?
గురువు గారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
తనకోసం మళ్ళీ మోహిని రూపం చూపించమని ఉమాధవుడు అడిగినపుడు వలదని వారిస్తూ మాధవుడు పంతము బూనకు, అమృతాన్ని రాక్షసులకు అందకుండా చెయ్యాలనే నా మనోరథం నెరవేరింది కదా ! ఇక ఆ రూపం వద్దని చెపుతాడు.
అదీ సందర్భం.
త, ద, ధ లకు ప్రాస కుదరదా ? సరే.
యతి లో సరిగా అదే అక్షరం ఉండాలా ?
ఇక ఇంకో సందేహం. సాహిత్య సాగరంలో ఛందో సుధ కోసం వెతకటం సరి అనుకుంటాను. ఛందో సాగరంలో సాహిత్యామృతం కాకుండా ఇంకేముంటుంది. బహుశా నాలా తప్పులు వ్రాసి హాలాహలం తయారవుతుంటే శంకరుల వారు పుచ్చుకొని మమ్మల్ని రక్షిస్తున్నారనే అర్థమేమో కదండీ.
డా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిశతసహస్ర వందనాలు.
నన్ను మునగ చె ట్టెక్కిస్తున్నారు.
సంకల్పమైతే చేసాను. మీ వంటి కవిపండితుల సహకారం ఉన్నప్పుడే ఈ ప్రయత్నం సఫలమై కొంతలో కొంతైనా తెలుగు తల్లి ఋణం తీర్చుకున్నవాణ్ణి అవుతాను. మీ సలహాలను ఆహ్వానిస్తున్నాను.
ధన్యవాదాలు.
కవిని గాను నేను కాని ఉత్సాహంబు
రిప్లయితొలగించండికవన మనిన మెండు కలదు నాకు
జేర్చుకొనుడు నన్ను శిష్యబృందమునందు
శరణు శంకరార్య శరణు శరణు
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిమీ పద్యానికి నా సవరణ .....
మాధవు జూచి కోరెనట యుమాధవుఁడే మఱియొక్కసారి యే
మో ధరియింపఁగా భువనమోహన మోహిని రూపమన్న న
య్యో ధరియించినాఁడ మును యుక్తిగ నే నమృతమ్ము పంచగా
సాధన మయ్యె నప్పు డది సారెకుఁ గోరుట పాడియే శివా!
నిరంజన్ కుమార్ గారూ,
రిప్లయితొలగించండికవులు గారు పుట్టుకను నెవ్వ రైనను
సాధనమున నన్ని సాధ్యపడును
వ్రాయు మయ్య యిక నిరంజన్ కుమార! కా
వలెను శీఘ్రముగను పద్యకవిగ.
గురువుగారు, కృతజ్ఞురాలిని.
రిప్లయితొలగించండిమందాకిని గారూ!మీ పద్య సవరణ గురించి అడిగారు.సకాలములో చూడలేకపోయాను.ఇప్పుడే చూస్తున్నాను.మాస్టారు గారు సొగసైన సవరణ తో మీ పద్యానికి వన్నెలద్దారు.అభినందనలు.
రిప్లయితొలగించండిగోలి హనుమఛ్ఛాస్త్రి
గురువుగారూ భేషైన సంకల్పం.
రిప్లయితొలగించండిమీరు సంకల్ప సిద్ధులు, సిద్ధ సంకల్పులు.
మీ సంకల్పానికి తిరుగు లేదు.
కవివర్యులు ఇందరు ఇంత మనోహరమైన పద్య రచన చేస్తూ ఉండగా నాబోటి
రిప్లయితొలగించండిఔత్సాహికులు రాయబూనటం "ఉట్టికి ఎగరలేని ..." సామెత నిరూపణ అయినట్టుంది.
ఉట్టికి ఎక్కలేకమరి ఊరకనే పడి పోవుచున్నయా
చిట్టిది చీమయుం, తనొక చీమననోమరి చిన్నదానఁ,నే
నెట్టి విధంబునన్ ఎగర నేరుతు నన్నవిచారమున్ మదిన్
గట్టిగ సేయక, నెగురు గాధట; నాదిట మూర్ఖతే కదా!
నాది+ఇట , నాది ఇచ్చట మూర్ఖతే కదా
రిప్లయితొలగించండిమందాకిని గారూ,
రిప్లయితొలగించండినా సవరణ పద్యంలో ఒక సవరణ.
"కోరెనట యుమాధవుఁడే" అన్నప్పుడు "రెనట యు" అని ఒక లఘువు ఎక్కువయింది. అక్కడ నగణ ఉండాలి కదా. "కోరెనె యుమాధవుఁడే" అంటే సరి!
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. దారిలో పడుతున్నారు. ఉట్టికి ఎక్కినట్లే. సందేహం లేదు.
"గట్టిగ సేయక, నెగురు గాధట" అన్నప్పుడు "క" గురువు కావాలి. "గట్టిగఁ జేయకే యెగురు గాథట" అందాం.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిమీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. అయితే ఇది కేవలం నా ఒక్కడి వల్ల పూర్తిగా సఫలం కాదు. మీ వంటి "సీనియర్ల" సహకారం రాబోయే "జూనియర్లకు" కావాలి.
గురువు గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మీ ప్రోత్సాహం తో పద్య రచన ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నాను
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
గురువుగారు, నెనరులు.
రిప్లయితొలగించండికే రాశాననే అనుకున్నాను. టైపాటు.
గురువు గారూ
రిప్లయితొలగించండిఏమని చెప్పను. ఇప్పటికే మీరు చాలా శ్రమ తీసుకొంటున్నారు. మీకు నమస్కృతులు చెప్పడము తక్క ఏమి చేయ గలను ? ఉత్సాహము ఉన్న వారికి ఒకటే సందేశము. నా దగ్గఱ మొండితనము నేర్చుకొండి .
గురువు గారూ,
రిప్లయితొలగించండిమీ మూలాన నాలుగు ముక్కలు (తప్పులైనా కూడా) వంటబట్టిన వాళ్లలో నేనొకణ్ణి. మీరేదైనా ప్లాను ఆలోచించి, మాకు ఆదేశాలందిస్తే నెఱవేరుస్తాము.అయితే తగినంతమంది పద్యరచనౌత్సాహికులున్న విధంగానో, లేకపోతే ఒకరిద్దరైనా మొండిపట్టుదల కలవాళ్ళైనా ఉండే విధంగానో చూసుకొనండి. లేకపోతే ఫలితం వ్యర్థం.
రవి గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
దిగితేనే లోతు తెలుస్తుంది కదా. శీర్షిక ప్రారంభ మైతేనే "హిట్ల" సంగతి తెలుస్తుంది. అయితే ఒక వినతి. "హిట్లు" పెరిగే దాక మీ వంటి సీనియర్లు, లబ్ధప్రతిష్ఠులు అజ్ఞాతంగానో, కలం పేరుతోనో పద్యాలు వ్రాస్తూ ఔత్సాహికులకు ప్రేరణ నిచ్చి ప్రోత్సహించండి.
శ్రీలలితా!మహాగరిత!శంకరి!ఈశ్వరి!సర్వమంగళా!
రిప్లయితొలగించండిశ్రీలహరీ!మనోహరిణి!శాంభవి!కోమలి!జ్ఞానశోభితా!
శ్రీ!లయకారిణీ!జనని!శ్రీగిరిజా!హిమనందినీ!శివా!
శ్రీలలనామణీ!దయనుఁజూపిననున్ దరిఁజేర్చుమంబికా!
గురువుగారు !
పరిశీలించ ప్రార్థన.
మహాగరిత = దొడ్డ ఇల్లాలు, శ్రీ లహరీ = విద్వత్తు వంటి ఐశ్వర్యాలు (శ్రీ లు) బహుళంగా ప్రవాహంలా కలిగిన తల్లీ, శ్రీ = లక్ష్మీస్వరూపురాలా, శ్రీలలనామణీ = గొప్ప వనితల్లో మణి వంటి దానా అనే అర్థాల్లో ప్రయోగించానని భావించాను. తప్పు వ్రాసి ఉంటే తెలియఁజేయవలసినది.
రిప్లయితొలగించండిమాధవుమాధవున్ గని సమాదర వాక్కుల నిట్లనెన్! "శివా!
రిప్లయితొలగించండిమున్ ధరియించితిన్ భువనమోహిని రూపము,!సజ్జనాదులన్
బాధలువెట్టు రక్కసులమాయను గెల్వఁగఁ! పాడిగాదయా!
నేధరియింపనయ్య!మదనాంతక!శంకర! పంతమేలరా!
గురువుగారు,
తప్పులను పరిశీలించవలసినది.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిగురువుగారిని ఛందోపాఠాలు మొదలుపెట్టటానికి పురిగొల్పుతున్నారు కానివ్వండి:)
రెండో పాదం లో ప్రాస కుదరలేదండీ - ఆ ఒక్క పాదం లో ప్రాస 'న్ ధ" అయ్యింది
3 వ పాదం లో భా కు మా కు యతి చెల్లదు - భ కు ప,ఫ, భ భ లతోనే యతి.
4వ పాదం లో నే లో ఏత్వానికి - ఇ,ఋ లతో యతి చెల్లుతుంది - అ, అం లతో యతి చెల్లదు - కాబట్టి - మదనాంతక = బదులు - నీ,నృ ణి వచ్చే గురువు ఉండేటట్టు మార్చాలి - లేదు మదనాంతక అలానే ఉంచి - 4వ పాదం మొదలు తిరిగి వ్రాయాలి.
[శ్రీలలితా పద్యం లో కూడా శ్రీ - శం, శ్రీ- జూ ల యతి ఒప్పదు]
పద్యం హాయిగా సాగిపోతోంది, విడువక ప్రయత్నించండి - యతి ప్రాసలతోసహా - వృత్తం త్వరలోనే వ్రాయగలుగుతారు
బహుధా కృతజ్ఞురాలిని వూకదంపుడు గారు,
రిప్లయితొలగించండిసరిచేయ ప్రయత్నించాను.దయచేసి ఇంకొక్కసారి సరిచూడగలరా!
శ్రీ ని శ గా తీసుకుంటే శం, జ సరిపోతుందని భావించాను . నేను చూసిన పుస్తకంలో శ్రీ అని ప్రత్యేకంగా లేదు మరి :)
మీరే చెప్పాలి మరి యతి మైత్రి గురించి.
మాధవుమాధవున్ గని సమాదర వాక్కుల నిట్లుపల్కె, సో
మా,ధరియించితిన్ భువనమోహిని రూపము,సజ్జనాదులన్
బాధలువెట్టు రక్కసులఁబాలిట మాయఁగఁ! పాడిగాదయా!
నేధరియింపనయ్య!ఋషినీవనినమ్మితి!పంతమేలరా!
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిహల్లు మైత్రి తోపాటు అచ్చు మైత్రిని కూడా పాటించాలి. మీరు అన్నట్టు "శ్రీ ని శ గా తీసుకుంటే శం, జ సరిపోతుంది". కాని అది హల్లు వరకె.. ఆపై అచ్చు మైత్రి కూడా చూడాలి. ఇక్కడా అచ్చు "ఈ" (శ్ + ర్ + ఈ = శ్రీ), "ఈ" కి యతి మైతి ఉన్న అచ్చులు " ఇ , ఈ, ఋ, ౠ, ఎ, ఏ" లు. కాబట్టీ "శ, జ" లను హల్లులుగా తీసుకుంతే "శి, శీ, శృ, శౄ, శె, శే, జి, జీ, జృ, జౄ, జె, జే" లతోటి యతి చెల్లించ వచ్చు.
సత్యనారాయణగారు,
రిప్లయితొలగించండిసంతోషమండి. కృతజ్ఞురాలిని. మీరివురూ నామీదఁజూపిన కృపకు ధన్యురాలిని.
సరిఁజేసి వ్రాసిఉంచాను. చూడగలరని ప్రార్థన.
శ్రీలలితా! మహాగరిత!శ్రీకరి! ఈశ్వరి!సర్వమంగళా!
శ్రీలహరీ!మనోహరిణి!శ్రీసతి!కోమలి!జ్ఞానశోభితా!
శ్రీ!లయకారిణీ!జనని!శ్రీగిరిజా!హిమనందినీ!శివా!
శ్రీలలనామణీ!దరినిఁజేర్చిననున్ దయఁజూడుమంబికా
పద్యమె వ్రాయగ కోరితి
రిప్లయితొలగించండినుద్యమముగ సాగెడి మీ శీర్షికయందున్
హృద్యముగ కొనసాగెడి
విద్యల నేర్పింపమనుచు వేడితి గురువున్
ద్వారకానాథ్ యజ్ఞమూర్తి గారూ,
తొలగించండిమీ పద్యం బాగుంది.
రెండవ పాదంలో మూడవ గణం నలం కాని జగణం కాని ఉండాలి. మీరు భగణం వేసారు. ఆ పాదంలో యతి తప్పింది. మూడవ పాదంలో గణదోషం. "హృద్యముగా కొనసాగెడి" ఆనండి.
మీ పద్యరచనాభ్యాసాన్ని కొనసాగించండి. స్వస్తి!