హనుమచ్చాస్త్రి గారు,వసంత కిశోర్ గారు తిరుపతిని శంకరాభరణము లోనికి తీసుకొని వచ్చారు.శ్రీ పీతాంబరుల వారు సునామి కష్టాల ప్రస్తావన తెచ్చారు. మందాకిని గారూ మీరు అనుస్వరము పెట్టినపుడు సరళాదేశ సంధి వచ్చి ఆ పైన ఉండే పరుషములు సరళము లవుతాయి.( క చ ట త ప లు - గ జ డ ద బ లవుతాయి.) మీ పద్యాలు మధురంగా ఉంటున్నాయి.
కవి మిత్రులకు వందనాలు. మా అత్తమ్మ దివంగతురాలయింది. రాత్రి ఫోన్ వచ్చింది. నేను వరంగల్ వెళ్తున్నాను. అందువల్ల అందరి పూరణలను విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. అందరి పూరణలు బాగున్నాయి. వెళ్ళేది వరంగల్‌కు దూరంగా పల్లెటూరు కనుక ఈ రోజు కూడ నేను బ్లాగుకు అందుబాటులో ఉండను. కావున మీరే పరస్పరం మిత్రుల పూరణల గుణదోషాలను సమీక్షించండి.
గురువుగారూ,శాంతమ్మ గారూ చాలా విచారకరమైన వార్త. మీకు మీ కుటుంబ సభ్యులకు మా సానుభూతి. శాంతమ్మ గారూ మీ మాతృమూర్తులకు ఉత్తమ లోక సంప్రాప్తి కలుగాలని భగవంతునకు మా ప్రార్ధనలు.
తల్లి స్వస్థత గోరుచు తనయ లపుడు
రిప్లయితొలగించండినిలువు దోపిడి మ్రొక్కును నిర్ణయించి
తీర్చ మ్రొక్కులు వెళ్ళిరి తిరుపతిపుడు
పువ్వు బోడుల తలలెల్ల బోడు లయ్యె!
శాస్త్రి గారు మీ పూరణ చక్కగా ఉంది అభినందనలు .
రిప్లయితొలగించండికడలి పొంగెను, భూకంప కంపములకు,
ముంచెను జపానును ,సునామి; మునిగి నారు
సతుల పతులు, సుత సుతులు ,సహచరులును,
పువ్వు బోడుల తలలెల్ల బోడు లయ్యె!!
పీతాంబర్ గారూ! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
__________________________________
వెలది యందము ద్విగుణించు - వేణి వలన
పొడుగు జడయొక్క జాడలే - పోయె నేడు !
పొలుపు గాంచగ నేడిల - పొట్టి జుట్టు
పువ్వు బోడుల తలలెల్ల - బోడు లయ్యె !
___________________________________
కవులు బోల్తురు కాంతలఁ కవన మందు
రిప్లయితొలగించండిపువ్వు తోడను , తెలిసిన పోల్చి చెపుమ?
పువ్వు బోడుల ! తలలెల్ల బోడులయ్యె
ననఁగఁ తిరుపతి కొండపై; నవ్వ రాదు.
ఇమ్ముగ నటి యొకతి చాల నమ్మబలక
రిప్లయితొలగించండిప్రకటనల మోజులో కొని వాడినంత
కేశ వర్ధినీ తైలము కీడు జేయ
పువ్వుఁబోడుల తల లెల్ల బోడు లయ్యె!!
02)
రిప్లయితొలగించండి____________________________________
వెంక టేశుని కొలువగ - వెలది వీడు
ఒక్క వాహన మందొచ్చె - ఒరిస నుండి !
మొక్కు లన్నియు దీర్చిరి - ముచ్చటగను !
పువ్వు బోడుల తలలెల్ల - బోడు లయ్యె !
____________________________________
వీడు = గుంపు
ఒరిస = ఒరిస్సా
03)
రిప్లయితొలగించండి____________________________________
దూర దర్శను ప్రకటన - తొందరింప
తరుణు లందరు వాడిన - తైల మొకటి
పెంపు జేయుట మానె ! పో - పెంపొ నర్చ !
పువ్వు బోడుల తలలెల్ల - బోడు లయ్యె !
____________________________________
పెంపు = హెచ్చగు
పెంపు నాశనము
ప్రేమాభిమానాలతో కష్టసుఖాలు పాలు పంచుకోవడము సహజమే కదా !
రిప్లయితొలగించండిఅక్క కొక్కతె నెరులన్ని యలసి యూడె
హీనమైనటి కాన్సరు హితముఁ జేయ
చెలియ లందఱు క్షురి కీయ తలరి కురులు
పువ్వుబోడుల తలలెల్ల బోడులయ్యె !
తలరు = వగచు ;
హనుమచ్చాస్త్రి గారు,వసంత కిశోర్ గారు తిరుపతిని శంకరాభరణము లోనికి తీసుకొని వచ్చారు.శ్రీ పీతాంబరుల వారు సునామి కష్టాల ప్రస్తావన తెచ్చారు. మందాకిని గారూ మీరు అనుస్వరము పెట్టినపుడు సరళాదేశ సంధి వచ్చి ఆ పైన ఉండే పరుషములు సరళము లవుతాయి.( క చ ట త ప లు - గ జ డ ద బ లవుతాయి.) మీ పద్యాలు మధురంగా ఉంటున్నాయి.
రిప్లయితొలగించండిఅయ్యా, జిగురు సత్యన్నారాయణ గారూ ఫొటోలో మీ జుట్టు చూసి కేశ వర్ధిని వాడాలనుకొంటున్నానే ! వద్దంటారు,మీరు, కిశోర్ గారూ కలిసి! భలే చిక్కు (జుట్టుకి కాదు,నాకు ) వచ్చిందే !
కవి మిత్రులకు వందనాలు.
రిప్లయితొలగించండిమా అత్తమ్మ దివంగతురాలయింది. రాత్రి ఫోన్ వచ్చింది. నేను వరంగల్ వెళ్తున్నాను.
అందువల్ల అందరి పూరణలను విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. అందరి పూరణలు బాగున్నాయి.
వెళ్ళేది వరంగల్‌కు దూరంగా పల్లెటూరు కనుక ఈ రోజు కూడ నేను బ్లాగుకు అందుబాటులో ఉండను.
కావున మీరే పరస్పరం మిత్రుల పూరణల గుణదోషాలను సమీక్షించండి.
గురువుగారూ,శాంతమ్మ గారూ చాలా విచారకరమైన వార్త. మీకు మీ కుటుంబ సభ్యులకు మా సానుభూతి. శాంతమ్మ గారూ మీ మాతృమూర్తులకు ఉత్తమ లోక సంప్రాప్తి కలుగాలని భగవంతునకు మా ప్రార్ధనలు.
రిప్లయితొలగించండిమూర్తిగారు,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
గురువుగారు,
ఈ సమయంలో మీ కుటుంబసభ్యులకు భగవంతుడు దుఃఖాన్ని తట్టుకునే మనస్థైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను
శంకరార్యా!మీ కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను. మీ అత్తమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
రిప్లయితొలగించండిశంకరార్యా!
రిప్లయితొలగించండిమీ కుటుంబానికి నా సానుభూతి!
మీ అత్తమ్మ గారి ఆత్మకు శాంతి
కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను !
గురువుగారూ మీ అత్తమ్మ గార్కి సద్గతులను కల్గించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము.
రిప్లయితొలగించండి