4, మార్చి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 244 (మడిగట్టిన శ్రోత్రియుండు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.

39 కామెంట్‌లు:

 1. గోలి హనుమచ్ఛాస్త్రి.

  'గుడిగంట ' నాటకంబున
  గుడిలో పూజారి పాత్ర 'గోపడు 'వేసెన్
  సడి లేక మధ్య మధ్యన
  మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.

  రిప్లయితొలగించండి
 2. గోలి హనుమచ్ఛాస్త్రి.

  మూర్తి గారూ ధన్యవాదములు.
  -------------------------------------
  చెడు తిరుగుడు తిరిగెడు ఒక
  గుడి అర్చకు చిన్న కొడుకు కూడలి నడువన్
  పడి పడి నవ్వుచు జనులనె
  మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.

  రిప్లయితొలగించండి
 3. కడునిష్ఠఁబ్రతికినద్విజుఁడు
  కడపటిదినముల కలుగగ కఫమే, వైద్యుం
  డిడినట్టి"మందు"గొని, యనె:
  మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  రెండవ పూరణలో "నవ్వుచు జను లనె" అనడంకంటె "నవ్వి జనులనిరి" అంటే బాగుంటుందేమో?

  ఊకదంపుడు గారూ,
  మంచి పూరణ. నిజమే! ఆ మందుల్లో ఆల్కహాల్ ఇంత శాతం అని ఉంటుందికదా. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు.
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి.

  01)
  _______________________________________

  కడు నిడుగడ పడి హండులు
  కడవ గలుప , కచుని బిడుక; - కశ్యము తోడన్
  గడగడ నా గుడ్డి గురుడు
  మడిగట్టిన శ్రోత్రియుండు , - మద్యము ద్రాగెన్.
  _______________________________________

  హండులు = రాక్షసులు
  పిడుక = బూడిద
  కశ్యము = మద్యము
  గుడ్డి గురుడు = శుక్రుడు
  ________________________________________

  రిప్లయితొలగించండి
 6. గుడిలో ఫూజారి బాపడు
  పెడ బుద్ధులు పుట్టె గాన పరువును విడచెన్ !
  చెడు మైత్రివెంట దిరుగుచు
  మడి గట్టిన శ్రోత్రియుండు మధ్యము త్రాగెన్ !

  రిప్లయితొలగించండి
 7. తపస్సునొదలి
  తరుణి వెంట బడిన వాడు
  తాగకుండా ఉంటాడా అని;
  తాగిందేంటో నాకు తెలియదు !
  తెలిసిన వాళ్ళెవరైనా చెప్పవచ్చు !

  02)

  ______________________________________

  వెడలెను గాధేయుడు , తడ
  బడు నడకల , నాట్యమాడు - పడతుక వెంటన్
  వడివడిగా , తపము నొదలి !
  మడిగట్టిన శ్రోత్రియుండు - మద్యము ద్రాగెన్.
  ______________________________________

  రిప్లయితొలగించండి
 8. 03)
  ______________________________________

  పిడికెడు హృదయము నందున
  కడలిని మించిన తగులము - కలిగిన దాసే
  ఎడబాటును మరచుటకై
  మడిగట్టిన శ్రోత్రియుండు - మద్యము ద్రాగెన్
  ______________________________________

  తగులము = ప్రేమ
  దాసు = దేవదాసు
  ______________________________________

  రిప్లయితొలగించండి
 9. వసంత్ కీశోర్ గారూ,
  మీ మూడు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలోని ఆ "పద గుంఫనం" ప్రశంసనీయం. నాకూ, మిత్రులకూ కొత్త పదాలను "నేర్పుతున్నారు. ధన్యవాదాలు.
  మీరు "ఒదిలి"ని వదలి పెట్టరా? రెండవ పూరణలో "తపము వదలి" అంటే సరి.
  ఇక మూడవ పూరణ "గుండమ్మ కథ" చిత్రంలోని "వేషము మార్చెను" పాటను గుర్తుకు తెచ్చించి.

  రాజేశ్వరి నేదునూరి గారూ,
  మంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
  అయితే మొదతి పాదంలో గణదోషం, రెండవ పాదంలో యతిదోషం ఉన్నాయి. నా సవరణలు బ్రాకెట్లలో .....
  గుడిలో ఫూ(జ)రి బాపడు
  పెడ బుద్ధులు పుట్టె గాన (విడచెను పరువున్)
  చెడు (నేస్తులతో) దిరుగుచు
  మడి గట్టిన శ్రోత్రియుండు మద్యము త్రాగెన్!

  రిప్లయితొలగించండి
 10. శంకరార్యా !
  ధన్యవాదములు !
  అయ్యో ! ఇది శాస్త్రిగారిని వదలి
  నన్ను పట్టుకున్నట్టుంది.
  దీనికి ఆయనే హక్కుదారుడు !
  _______________________________________

  ప్రేమనగర్ సినిమా
  అందరికీ తెలిసిందే గదా !
  కల్యాణ్(ఎ ఎన్ ఆర్) వాణిశ్రీ కోసం
  నిర్మించిన ప్రేమ నగరు వదలి పోతుంది అలిగి !
  మనవాడు మామూలేగా మద్యం పుచ్చుకోడం !
  అదీ కథ ! సమజయ్యిందా !

  04)
  _______________________________________

  విడి పోయెను ప్రేమ నగరు
  చిడిముడి పడి చిన్నదంచు - చెలి చెంగలికై
  చిడియను మరువని కల్యాణ్
  మడిగట్టిన శ్రోత్రియుండు - మద్యము ద్రాగెన్
  _______________________________________

  విడి = వదలి
  చిడిముడి = తొందరపాటు
  చెంగలి = సమీపము
  చిడియ = వనిత
  _______________________________________

  రిప్లయితొలగించండి
 11. గడగడ వేదముఁ జదువును
  మడి గట్టిన శ్రోత్రియుండు; మద్యము ద్రాగెన్
  ఇడుమలకు దూర మవ్వగ
  బడు గొక్కఁడు బుడ్డి యందు బ్రహ్మము గనియెన్ !

  మరి ఆంగ్ల భాషలో ' స్పిరిట్ ' అంటారు కదాండీ !

  రిప్లయితొలగించండి
 12. వసంత మహోదయుల మొదటి పూరణ, నరసింహ మూర్తి గారి పూరణ చాల బాగునాయి.

  రిప్లయితొలగించండి
 13. శంకరార్యా! ధన్యవాదములు.కిశోర్ జీ!నేను ఒదలిని వదలి పెట్టానండీ.ఎటు పోయిందా అనుకుంటున్నాను.మీవద్దకు వచ్చిందా....త్వరగా వదిలెయ్యండి.ఇటు మాత్రం పంపకండేం!

  గోలి హనుమచ్ఛాస్త్రి.

  రిప్లయితొలగించండి
 14. విలక్షణంగా పూరించే ప్రయత్నంలో - వృత్తి ప్రవృత్తులను అన్వయిస్తూ
  వేడెను కాయలకై గు
  మ్మడి గట్టిన శ్రోత్రియుండు, మద్యము ద్రాగెన్
  దడి గట్టిన కూలి మనిషి
  బడలిక దీరన్,ప్రవృత్తి పర భేద మిదే (మో)!
  మనవి: ప్రవృత్తి లో "ప్ర " లఘువనే నిర్ణయించాను. మాష్టారు వివరించగలరు.

  రిప్లయితొలగించండి
 15. శంకరయ్య గారూ, ధన్యవాదములు.
  ఇది కూడా పరిశీలించండి
  తాటిచెట్టు కింద కూర్చొని ఏమిదాగినా కల్లేఅంటారని ఒక సామెత -
  అలా అన్వయిస్తూ

  గుడివీధిలోన మరిమొద
  లిడిరిలె సారాయికొట్టు లేకను నీతే;
  నడువన్,పూజారనరే-
  మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.

  రిప్లయితొలగించండి
 16. గుడి ఫ్రక్కన బారు వెలసె
  విడువక పూజారినంత వేద ద్రోహుల్
  మెడబట్టి త్రాపె మద్యము
  మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.

  రిప్లయితొలగించండి
 17. అందరి పూరణలూ
  అలరించు చున్నవి.

  05)
  ________________________________________

  చెడు కాలము , వచ్చెను పో
  కుడి ఎడ మగు , ఎడమ మారు - కుడిగా, కనరే
  చెడు మాటలు, పెడ బుద్దులు !
  మడిగట్టిన శ్రోత్రియుండు - మద్యము ద్రాగెన్ !
  ________________________________________

  రిప్లయితొలగించండి
 18. 06)

  ________________________________________

  జడివానలొ గొడుగుండిన
  నడవచ్చును తడవకుండ ! - నరులకు తరమే
  గడి లేదిల; చెడు రేగగ
  మడిగట్టిన శ్రోత్రియుండు - మద్యము ద్రాగెన్ !
  ________________________________________

  గడి = ఎల్ల
  ________________________________________

  రిప్లయితొలగించండి
 19. 07)
  ________________________________________

  కుడుపరు తల్లికి ,దండ్రికి
  వెడల నడుపు నింటి నుండి - వెంగలు లౌరా !
  కొడి గట్టెను ఘన సంస్కృతి !
  మడిగట్టిన శ్రోత్రియుండు - మద్యము ద్రాగెన్ !
  ________________________________________

  వెంగలి = మూఢుఁడు
  ________________________________________

  రిప్లయితొలగించండి
 20. 08)
  ________________________________________

  ఎడ ,ఎడ ,ఎడవగు; నిజమిది!
  విడి పోవుటె మేలటన్న - వినతులు వినగా !
  మడుగాయెడు , హృదయము గని
  మడిగట్టిన శ్రోత్రియుండు - మద్యము ద్రాగెన్ !
  ________________________________________

  ఎడ = హృదయము.
  ఎడవు = దూరము
  ________________________________________

  రిప్లయితొలగించండి
 21. చిన్న సవరణతో :

  09)
  ________________________________________

  కడుపాకలి తీర్చుటకై
  పడుచులు చేపట్టి రయ్యొ - పడుపు పనులనే !
  గొడవెందుకు చిరు తప్పుకు ?
  మడిగట్టిన శ్రోత్రియుండు - మద్యము ద్రాగన్ !
  _________________________________________

  రిప్లయితొలగించండి
 22. వసంత్ కిశోర్ గారూ,
  మీ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆరు పూరణలూ చూసాను. బాగున్నాయి. అభినందనలు.
  నాల్గవ పూరణ బాగుంది. అయితే కళ్యాణ్ మడిగట్టిన శ్రోత్రియుడు కాదు కదా! మొదటినుండీ తిరుగుబోతూ, త్రాగుబోతే ............. :-)
  ఐదవ పూరణ బాగుంది.
  ఆరవ పూరణలో "నడవచ్చును" అనడం గ్రామ్యం. "నడవ దగును" అందాం.
  మిగిలిన మూడు పూరణలూ నిర్దోషంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. మిస్సన్న గారూ ధన్యవాదములు. మిత్రుల పూరణలన్నీ బ్రహ్మాండముగా ఉన్నాయి. కిశోర్ జీ మీ పద్యాల ప్రవాహానికి గొడు గక్కఱ లేదు,తడవడము మా కిష్టమే. క్రొత్త మాటలు చదివిస్తున్నారు,ఎంతవరకు అంటుకొంటాయో తెలియదు. మా నోట్లో తవళి ఆడే లోపల కశ్యము త్రావిస్తున్నారు, చూద్దాము.

  రిప్లయితొలగించండి
 24. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  బుడ్డిలో బ్రహ్మాన్ని చూపించారు. స్వానుభవమా? :-)
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  చంద్రశేఖర్ గారూ,
  ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  "ప్ర" లఘువే. సందేహం లేదు.

  ఊకదంపుడు గారూ,
  నిజమే. ఆ వీధిలో నడిస్తే జనం అనుమానించడం సహజమే. చక్కని పూరణ. అభినందనలు.
  "మొదలిడి రిలె" అనేది "మొదలిడి రిదె"కు టైపాటా?

  జిగురు సత్యనారాయణ గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  దాదాపు ఇలాంటి భావంతోనే నేను పూరిద్దామనుకున్నాను. ఈలోగా ఆ పని మీరే కానిచ్చారు.

  రిప్లయితొలగించండి
 25. నా పూరణ ........

  కడుఁ బ్రీతి శ్రుతులఁ జదువుచు
  గుడి కేఁగె నెవండు? మత్తుఁ గోరిన పతితుం
  డెడ మీక యేమి చేసెను?
  మడి గట్టిన శ్రోత్రియుండు; మద్యము ద్రాగెన్.

  రిప్లయితొలగించండి
 26. గురువు గారూ మీ పూరణ చాలా బాగుంది.
  మరి నా స్వానుభవము సంగతి ; రెండు వారముల క్రితము చంద్రశేఖరుల వారి గృహములో ఏదో తాగించారు. చంద్ర భాసురమని నా అనుమానము. పద్యాల వ్రాతలలో యేమైనా తేడా ఉంటే అది వారి మహిమే !

  రిప్లయితొలగించండి
 27. మహాప్రభో! గంగ తప్ప ఇంకేమి తప్ప తాగించ గలడీ చంద్రశేఖరుండు. మీ జూలు నా మీద ఝళిపి౦చకండి, నరసింహ స్వామీ! నమోవాక్కాలు.

  రిప్లయితొలగించండి
 28. మిస్సన్న గారూ, ఎక్కడ మీ పూరణ? విలక్షణమైన విరుపు ఎక్కడనుండో తేవటం మీ ముద్ర గదా!

  రిప్లయితొలగించండి
 29. శంకరార్యా !
  ధన్యవాదములు !
  కల్యాణ్ మొదట్లో మీరన్నట్టే !
  వాణిశ్రీ సాహచర్యం లభించాక
  కొన్నాళ్ళు మడిగడతాడు గదా !
  ఆ సమయంలోనే ప్రేమ నగర్ నిర్మిస్తాడు !

  ప్రశ్నార్థ పూరితమైన మీ పూరణ బావుంది !

  మూర్తిగారూ !
  బుడ్డిలో బ్రహ్మానందాన్ని మాకెప్పుడు చూపిస్తారు ?
  అభినందనలు !

  ఔను ! మిస్సన్న మహాశయుల విరుపు లేమైనవి ?

  రిప్లయితొలగించండి
 30. చంద్ర శేఖరా కిశోర్ మహోదయా ఏ విరుపులూ కనబడక పెదవి విరుపులే మిగిలాయి.

  రిప్లయితొలగించండి
 31. మిస్సన్న గారు ఏదో ఒక పదప్రయోగం (ఇప్పుడు,పెదవి విరుపులు)చేసి చతుర సంభాషణ చేయందే వూరుకోరు గదా! బాబూ, మళ్ళా నేను మొదలపెట్టానంటే మాష్టారు మనిద్దరికీ కలిపి మార్కులు తీసేసి క్లాసులోంచి బయటికి పంపుతారు (నవ్వుతూ). నా చిన్నప్పుడు రాజు అనే ఫ్రెండ్ తో అదే జరిగేది. తెగనవ్వే వాళ్ళం, క్లాసులోంచి గెంటబడే వాళ్ళం. వుంటా.

  రిప్లయితొలగించండి
 32. చంద్ర శేఖరా నేను వాడిన పదం "పెదవి విరుపు".కాదు"మూతి విరుపు".
  నాకేదో అనుమానంగా ఉంది మీరు హిమవన్నగాలకు వెళుతూన్నారేమోనని.

  రిప్లయితొలగించండి
 33. హమ్మ! ఏదో చెప్పేసి తప్పించుకొందామనే! ఇప్పుడే నిఘంటువు చూశా, పెదవి కి పర్యాయపదాలు - మోవి, వాతెర అని. మీరు "మూతి" దాకా వెళితే వెళ్ళండి బాబు. నాకు అలాంటి తెలుగు రాదు బూబూ, రాదు గాక రాదు.

  రిప్లయితొలగించండి
 34. గుడిలో ముగించి యాగము
  వడిగా నా సోమయాజి వహ్వా యనుచున్
  కడవడు సుర గుటగుటగుట...
  మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్

  రిప్లయితొలగించండి
 35. వడలను నైవేద్య మిడెను
  మడిగట్టిన శ్రోత్రియుండు;...మద్యము ద్రాగెన్
  కొడుకిట తండ్రిని కాల్చుచు
  భడవడు తెలగాణమందు భక్తిని జూపన్

  రిప్లయితొలగించండి