మిస్సన్న గారూ, అబ్బ! మా పల్లెటూరు పట్టికెళ్ళిపోయారు. "దాలి" పద ప్రయోగం చాలా బాగుంది. కానీ నా ఐడియా కొట్టేశారు :-) సమస్య చదవగానే "దున్న>" దగ్గర విరుపు ఇద్దామనుకొన్నాను. హుఁ. ఇంకో ఐడియా వేయాలి.
హనుమఛ్ఛాస్త్రి గారూ, మిస్సన్న గారూ,కిశోర్ గారూ,పీతాంబర్ గారూ బహు చక్కని పూరణలు చేసారు.అభినందనలు. పాలిచ్చే దున్న రేపటిలోపల దొరికితే సరి, లేకపోతే మీ దగ్గరే పాలు కొనుక్కోవాలి.
కొసమెరుపు: ఇప్పుడే మా మిత్రులు డా.మూర్తి గారు గుర్తు కొచ్చారు. "అయితే ఇంతసేపు అమెరికా కోడలు దున్నపోతు దగ్గరకెళ్ళి ఏమి పితికినట్టు" అని అడగకండి. నాకు తెలియదు ప్రభో!
కామధేను బొమ్మ కాఫీలనా కళా ధామమందు పంచె దక్షిణాన నిలచి యున్న దాని నింపార గమనించి దున్న పాలు పితికె సన్నుతాంగి.
కుందా సత్యనారాయణ కళాధామంలో కామధేను బొమ్మ కాఫీ, టీ, పాలను ఇస్తుంది. అది జూచిన ఒక పర్యాటకురాలు యమధర్మ రాజు వాహనం కూడా ఏదో ఇస్తుంది అని భావించింది అని ఊహ.
చంద్ర శేఖర్ గారూ మీ పూరణ చదివేక సరిగ్గా మీరు మూర్తి గారికి ఏ అనుమానమైతే వస్తుందని ఊహించారో అదే అనుమానం నాకూ వచ్చింది. వ్యాఖ్య పెడదామనుకొంటే క్రింద మళ్ళా మీ వ్యాఖ్య. నా కనుమానం ఏమిటంటే అమెరికా కోడలు అంతవరకూ ఏం పితికిందో మీకు తెలిసే ఉంటుంది, చెప్పడానికి మీరు సంకోచ పడుతున్నారని.
నరసింహ మూర్తి గారూ రైతు పొలములో పోతును దున్న అంటాడు. ఇంటి దగ్గర ఏం అంటాడో చెప్పరా.
గోవు శుభ్రపరచి , కొమ్ముల పైనింత పసుపు కుంకుమలది , భక్తి తోడ పృష్ఠమునకు మ్రొక్కి , ప్రీతితో పొదుగు నం దున్న పాలు పితికె సన్నుతాంగి !!!
ఎప్పుడో పొద్దుననగా ఆలోచించిన పూరణ. ఇప్పటికి కుదిరింది. ఈలోగా ఇంత కన్నా రమణీయంగా ' ఊకదంపుడు ' గారు ఇదే విరుపు తో పూర్తి చేసేశారు .
శంకరయ్య గారప్పుడు చెప్పిన కష్టం గుర్తొచ్చింది . వారికొక విన్నపం. మీరు వాచ్యం గా కవిమిత్రులకిచ్చే సూచనలకు సరిసమానం గా మీ పద్యాలు చెప్పకనే చెప్పే ఎన్నో విశేషాలు , పద్యపు నడకలోని ఒడుపులు , పదాల పోహళింపు తెలుగు జాతీయాల నుడికారాల ప్రయోగాలు - మిత్రులందరికీ ఎంతగానో సహకరిస్తాయి అని నాకొక గట్టి నమ్మకం. ఎవరైనా అప్పటికే అదే భావం తోనో , ఇంచుమించు అవే పదాలతోనో పూరణ చేసినా , మీ పూరణ కూడా మీరు అందివ్వగలరని ఆశిస్తూన్నాము . ఎంతైనా " మీదైన పూరణ మీది గాన " , ఈ విషయమై వారి దృష్టి సారించగలరు . ధన్యవాదాలు శంకరయ్య గారూ !!!
ఎందుకో కొంచెము సవరించాను. గురువు గారూ విష్ణు నందనులు చెప్పినది నిజమే. మీ పద విన్యాసము మీదే. మీ దగ్గఱ మేము నేర్చు కోవడమే కాక మరో పద్యము చదివి ఆనదిస్తాము.
దున్న పాలు పితుకు సన్నుతాంగి,చెలగి వేడి పాల లోని వెన్న దినుచు పచ్చి పాల మీఁదు బట్టు మీఁగడలది వంధ్య పుత్రుఁ జూడ బయలు దేరె !
మనవి: ఇవి అన్నీ అసంబద్ధములే. వీటికి అర్దాలంకారములలో ఒక పేరుతో పిలుస్తారని చిన్నప్పుడు చదివిన గుర్తు. విషమాలంకారమా? వ్యతిరేకాలంకారమా? అలాగే వంధ్యాపుత్రుడు అనేది ఏ సమాసం?మరిచిపోయాను. దయచేసి పెద్దలు వివరించగలరు.
కవి మిత్రు లందరికీ వందనాలు. మా మామయ్య కొడుకు పెళ్ళికి వరంగల్ వచ్చాను. నిన్నంతా ప్రయాణంలో ఉండి బ్లాగు చూసే అవకాశం దొరకలేదు. అందువల్ల మీ మీ పూరణలకు వెంటవెంట స్పందించలేదు. ఇప్పుడే మా బావగారింట్లో బ్లాగు చూస్తున్నాను.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ రండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. మొదటి పూరణలో "నేను + అనగ" అన్నప్పుడు యడాగమం రాదు. "నేననంగ" అందాం. రెండవ పూఅణలో "గేదె దున్న" మధ్యలో కామా పెడితే సరి "గేదె, దున్న్". అలాగే "ఇప్పుడు + ఎటుల" అన్నప్పుడూ యడాగమం రాదు. "ఈపూట కెటుల" అందాం.
మిస్సన్న గారూ, ఎప్పటిలాగే మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. "కోరెను భార్యను" అని రెండు భగణాలను (ఇంద్ర గణాలను) వేసారు. అక్కడ రెండు సూర్య గణాలు ఉండాలి కదా. "కోరె సతిని" అంటే సరి.
మంద పీతాంబర్ గారూ, అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
నిరంజన్ కుమార్ గారూ, మీ రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు. "పశుశాల కుంబోయి, దున్న" అని కాకుండా "పశుశాల కేగి యం, దున్న" అంటే బాగుంటుంది కదా. "కాల జ్ఞాన" మన్నప్పుడు "ల" గురు వవుతుంది కదా. "కాల మహిమ గాగ" అందాం.
చంద్రశేఖర్ గారూ, మీ రెండవ పూరణ కూడ బాగుంది. అభినందనలు.
కవిమిత్రులకు మనవి: మనవి: క్రింది పద్యంలో అన్నీ అసంబద్ధములే. వీటిని అర్దాలంకారములలో ఒక పేరుతో పిలుస్తారని చిన్నప్పుడు చదివిన గుర్తు. విషమాలంకారమా? వ్యతిరేకాలంకారమా? అలాగే వంధ్యాపుత్రుడు అనే దానికి కూడా ఒక మాట వుంది. మరిచిపోయాను. తెలిసిన వారు దయచేసి వివరించగలరు. దున్న పాలు పితుకు సన్నుతాంగి,చెలగి వేడి పాల లోని వెన్న దినుచు పచ్చి పాల మీఁదు బట్టు మీఁగడలది వంధ్య పుత్రుఁ జూడ బయలు దేరె !
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిపట్న వాసి యొకతె పల్లెటూరుకు వచ్చి
ఆచట పితుకు చుండ అత్త పాలు,
నేను! యనగ,అత్త నిలుచుని గేదెముం
దున్న,పాలు పితికె సన్నుతాంగి.
కర్రి యావు రాట< గట్టి, దాణా పెట్టి,
రిప్లయితొలగించండిఅరక కట్టి, మామ మెరక చేను
దున్న, పాలు పితికె సన్నుతాంగి, పిడక
దాలి మీద పెట్టె పాల ముంత.
మిస్సన్న గారూ, అబ్బ! మా పల్లెటూరు పట్టికెళ్ళిపోయారు. "దాలి" పద ప్రయోగం చాలా బాగుంది. కానీ నా ఐడియా కొట్టేశారు :-) సమస్య చదవగానే "దున్న>" దగ్గర విరుపు ఇద్దామనుకొన్నాను. హుఁ. ఇంకో ఐడియా వేయాలి.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిపాలు లేవు యింట! పాపాయి కిప్పుడు
యెటుల? అనుచు అమ్మ యెదురు చూచె
ప్రొద్దు పోయి వచ్చె పొలము జనిన గేదె
దున్న,పాలు పితికె సుందరాంగి.
అందరికీ వందనములు
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి.
01)
________________________________________
సంత కెళ్ళి మగడు - జంట బఱ్ఱెల దెచ్చి
కొట్ట మందు గట్టి - కోరెను భార్యను
పాలు పితుకు మనుచు ! - వంటచేయు పనియం
దున్న; పాలు పితికె - సన్నుతాంగి !
________________________________________
మామ గుడికి వెళ్లె, మనుమన్ని నానమ్మ
రిప్లయితొలగించండిముద్దు జేసి ముడ్డి ,మూతి కడిగె,
మరిది బడికి నడిచె,మగడు వెడలె మడి
దున్న, పాలు పితికె సన్నుతాంగి!
హనుమఛ్ఛాస్త్రి గారూ, మిస్సన్న గారూ,కిశోర్ గారూ,పీతాంబర్ గారూ బహు చక్కని పూరణలు చేసారు.అభినందనలు. పాలిచ్చే దున్న రేపటిలోపల దొరికితే సరి, లేకపోతే మీ దగ్గరే పాలు కొనుక్కోవాలి.
రిప్లయితొలగించండివసంత కిశొర్ జీ మీరు 'ఒదలి ' వదిలిపెట్టారు సంతకు వెళ్ళి. కాని 'ఎళ్ళితే ' గురువు గారు 'వెళ్ళ మంటారు,మళ్ళీ !
రిప్లయితొలగించండిఆంధ్ర యత్త చెప్పె అమెరికా కోడలిఁ
రిప్లయితొలగించండిబిలిచి,"కుండ నిండ పితికు పాలు!"
ఖాళి కుండ తెచ్చె కడకు,యేలన నట
దున్నపాలు పితికె సన్నుతాంగి.
కొసమెరుపు: ఏమి చేస్తుంది పాపం నంగనాచి అమెరికా కోడలికి పాలకోసం గేదె దగ్గర కెళ్ళాలని తెలియలేదు.
కొసమెరుపు: ఇప్పుడే మా మిత్రులు డా.మూర్తి గారు గుర్తు కొచ్చారు. "అయితే ఇంతసేపు అమెరికా కోడలు దున్నపోతు దగ్గరకెళ్ళి ఏమి పితికినట్టు" అని అడగకండి. నాకు తెలియదు ప్రభో!
రిప్లయితొలగించండికామధేను బొమ్మ కాఫీలనా కళా
రిప్లయితొలగించండిధామమందు పంచె దక్షిణాన
నిలచి యున్న దాని నింపార గమనించి
దున్న పాలు పితికె సన్నుతాంగి.
కుందా సత్యనారాయణ కళాధామంలో కామధేను బొమ్మ కాఫీ, టీ, పాలను ఇస్తుంది. అది జూచిన ఒక పర్యాటకురాలు యమధర్మ రాజు వాహనం కూడా ఏదో ఇస్తుంది అని భావించింది అని ఊహ.
పోతు నేమి యనును రైతన్న పొలములో
రిప్లయితొలగించండిగోవుఁ జేరి చేసె గొల్ల యేమి
జనులు పొగడ ధీర! జవ్వని నేమండ్రు
దున్న, పాలు పితికె, సన్నుతాంగి.
పొదుగు గుడుచుచుండ పోపొమ్మనియదిల్చి
రిప్లయితొలగించండిదూడనావలకునుదోయకుండ
పొట్ట నిండి వదుల బుజ్జాయి, పొదుగునం
దున్న పాలు పితికె సన్నుతాంగి.
చంద్ర శేఖర్ గారూ మీ పూరణ చదివేక సరిగ్గా మీరు మూర్తి గారికి ఏ అనుమానమైతే
రిప్లయితొలగించండివస్తుందని ఊహించారో అదే అనుమానం నాకూ వచ్చింది. వ్యాఖ్య పెడదామనుకొంటే క్రింద
మళ్ళా మీ వ్యాఖ్య. నా కనుమానం ఏమిటంటే అమెరికా కోడలు అంతవరకూ ఏం
పితికిందో మీకు తెలిసే ఉంటుంది, చెప్పడానికి మీరు సంకోచ పడుతున్నారని.
నరసింహ మూర్తి గారూ రైతు పొలములో పోతును దున్న అంటాడు.
ఇంటి దగ్గర ఏం అంటాడో చెప్పరా.
గోవు శుభ్రపరచి , కొమ్ముల పైనింత
రిప్లయితొలగించండిపసుపు కుంకుమలది , భక్తి తోడ
పృష్ఠమునకు మ్రొక్కి , ప్రీతితో పొదుగు నం
దున్న పాలు పితికె సన్నుతాంగి !!!
ఎప్పుడో పొద్దుననగా ఆలోచించిన పూరణ. ఇప్పటికి కుదిరింది. ఈలోగా ఇంత కన్నా రమణీయంగా ' ఊకదంపుడు ' గారు ఇదే విరుపు తో పూర్తి చేసేశారు .
శంకరయ్య గారప్పుడు చెప్పిన కష్టం గుర్తొచ్చింది . వారికొక విన్నపం. మీరు వాచ్యం గా కవిమిత్రులకిచ్చే సూచనలకు సరిసమానం గా మీ పద్యాలు చెప్పకనే చెప్పే ఎన్నో విశేషాలు , పద్యపు నడకలోని ఒడుపులు , పదాల పోహళింపు తెలుగు జాతీయాల నుడికారాల ప్రయోగాలు - మిత్రులందరికీ ఎంతగానో సహకరిస్తాయి అని నాకొక గట్టి నమ్మకం. ఎవరైనా అప్పటికే అదే భావం తోనో , ఇంచుమించు అవే పదాలతోనో పూరణ చేసినా , మీ పూరణ కూడా మీరు అందివ్వగలరని ఆశిస్తూన్నాము . ఎంతైనా " మీదైన పూరణ మీది గాన " , ఈ విషయమై వారి దృష్టి సారించగలరు . ధన్యవాదాలు శంకరయ్య గారూ !!!
మిస్సన్న గారూ సరిగ్గా అడిగారు. పొలములో దున్న మంటాడు. ఇంటి దగ్గఱ తిండి పెట్టి నప్పుడు 'తిమ్మ ' అంటాడు.యే పనీ చెయ్య నప్పుడు అది పోతురాజే !
రిప్లయితొలగించండిఎందుకో కొంచెము సవరించాను. గురువు గారూ విష్ణు నందనులు చెప్పినది నిజమే. మీ పద విన్యాసము మీదే. మీ దగ్గఱ మేము నేర్చు కోవడమే కాక మరో పద్యము చదివి ఆనదిస్తాము.
రిప్లయితొలగించండిపోతు నేమి యనును రైతన్న పొలములో
గొల్ల యేమి చేసె గోవుఁ జేరి
జనులు పొగడ ధీర! జవ్వని నేమండ్రు
దున్న, పాలు పితికె, సన్నుతాంగి.
నరసింహ మూర్తి గారూ బ్యూటిఫుల్. అద్భుతంగా చెప్పారు. అభినందనలు.
రిప్లయితొలగించండివిష్ణు నందను గారూ పల్లెటూళ్ళో రైతు భార్య కళ్ళకు కడుతోంది.
రిప్లయితొలగించండిలేదండీ మిస్సన్న గారూ, నేను అమాయకుడిని. దానికి మూర్తి గారే సరి. చూశారా, పోతుకి ఇంటా బయటా వుండే వాడుక పదాలు ఎన్ని చెప్పారో వారు. చూద్దాం వారి స్పందన.
రిప్లయితొలగించండివావ్. మస్తు పద్యాలు రాస్తున్నారు అందరూ. హేట్సాఫ్ సర్. ఇక్కన్ణే ఒక కవి సమ్మేళనం పెట్టొచ్చు.
రిప్లయితొలగించండిపాలు పితుక నేడు పాలేరు లేడని
రిప్లయితొలగించండిముంత జేత బట్టి ముదిత తాను
పసులు కట్టి యున్న పశుశాల కుంబోయి
దున్న పాలు పితికె సన్నుతాంగి
కాల జ్ఞాన మహిమ కలికాల వింతగా
రిప్లయితొలగించండికుక్క కడుపు నందు నక్క బుట్టె
ఆవు బదులు దున్న పాలనిచ్చుటజూచి
దున్న పాలు పితికె సన్నుతాంగి
మిత్రులందరి పూరణలు
రిప్లయితొలగించండిముచ్చటగా నున్నవి !
మూర్తిగారూ ! నిజంగానే మేకయ్యారు !
ఇదిగో సవరణ !
1అ)
______________________________________
సంత కేగి మగడు - జంట బఱ్ఱెల దెచ్చి
కొట్ట మందు గట్టి - కోరెను భార్యను
పాలు పితుకు మనుచు ! - వంటచేయు పనియం
దున్న; పాలు పితికె - సన్నుతాంగి !
______________________________________
దున్న పాలు పితుకు సన్నుతాంగి,చెలగి
రిప్లయితొలగించండివేడి పాల లోని వెన్న దినుచు
పచ్చి పాల మీఁదు బట్టు మీఁగడలది
వంధ్య పుత్రుఁ జూడ బయలు దేరె !
మనవి: ఇవి అన్నీ అసంబద్ధములే. వీటికి అర్దాలంకారములలో ఒక పేరుతో పిలుస్తారని చిన్నప్పుడు చదివిన గుర్తు. విషమాలంకారమా? వ్యతిరేకాలంకారమా? అలాగే వంధ్యాపుత్రుడు అనేది ఏ సమాసం?మరిచిపోయాను. దయచేసి పెద్దలు వివరించగలరు.
కవి మిత్రు లందరికీ వందనాలు. మా మామయ్య కొడుకు పెళ్ళికి వరంగల్ వచ్చాను. నిన్నంతా ప్రయాణంలో ఉండి బ్లాగు చూసే అవకాశం దొరకలేదు. అందువల్ల మీ మీ పూరణలకు వెంటవెంట స్పందించలేదు. ఇప్పుడే మా బావగారింట్లో బ్లాగు చూస్తున్నాను.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ రండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
మొదటి పూరణలో "నేను + అనగ" అన్నప్పుడు యడాగమం రాదు. "నేననంగ" అందాం.
రెండవ పూఅణలో "గేదె దున్న" మధ్యలో కామా పెడితే సరి "గేదె, దున్న్". అలాగే "ఇప్పుడు + ఎటుల" అన్నప్పుడూ యడాగమం రాదు. "ఈపూట కెటుల" అందాం.
మిస్సన్న గారూ,
ఎప్పటిలాగే మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
"కోరెను భార్యను" అని రెండు భగణాలను (ఇంద్ర గణాలను) వేసారు. అక్కడ రెండు సూర్య గణాలు ఉండాలి కదా. "కోరె సతిని" అంటే సరి.
మంద పీతాంబర్ గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిగన్నవరపు వారి వ్యాఖ్య చూసే దాక నా దృష్టికి రాలేదు. హన్నన్నా! "సంతకెళ్ళి" తప్పు చేస్తారా? "సంత కేగి" రండి.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిచమత్కారంగా పూరించారు. చాలా బాగుంది. అభినందనలు.
సనత్ శ్రీపతి గారూ,
మీ పూరణ ప్రశతంగా ఉంది. అభినందనలు.
ఊకదంపుడు గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
డా. విష్ణు నందన్ గారూ,
రిప్లయితొలగించండిమనోహరమైన పూరణ. ధన్యవాదాలు.
మీరు చెప్పింది నిజమే. ఇకనుండి నా పూరణలనూ ఇస్తూ ఉంటాను.
మిరియప్పొడి గారూ,
శంకరాభరణం బ్లాగుకు స్వాగతం. కవిమిత్రుల పద్యాలు నచ్చుతున్నందుకు సంతోషం, ధన్యవాదాలు.
నిరంజన్ కుమార్ గారూ,
మీ రెండు పద్యాలూ బాగున్నాయి. అభినందనలు.
"పశుశాల కుంబోయి, దున్న" అని కాకుండా "పశుశాల కేగి యం, దున్న" అంటే బాగుంటుంది కదా.
"కాల జ్ఞాన" మన్నప్పుడు "ల" గురు వవుతుంది కదా. "కాల మహిమ గాగ" అందాం.
చంద్రశేఖర్ గారూ,
మీ రెండవ పూరణ కూడ బాగుంది. అభినందనలు.
కవిమిత్రులకు మనవి:
రిప్లయితొలగించండిమనవి: క్రింది పద్యంలో అన్నీ అసంబద్ధములే. వీటిని అర్దాలంకారములలో ఒక పేరుతో పిలుస్తారని చిన్నప్పుడు చదివిన గుర్తు. విషమాలంకారమా? వ్యతిరేకాలంకారమా? అలాగే వంధ్యాపుత్రుడు అనే దానికి కూడా ఒక మాట వుంది. మరిచిపోయాను. తెలిసిన వారు దయచేసి వివరించగలరు.
దున్న పాలు పితుకు సన్నుతాంగి,చెలగి
వేడి పాల లోని వెన్న దినుచు
పచ్చి పాల మీఁదు బట్టు మీఁగడలది
వంధ్య పుత్రుఁ జూడ బయలు దేరె !
డా. విష్ణు నందన్ గారూ,కంది శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిధన్యోస్మి.