అందరి పూరణలూ బాగున్నాయి. శ్రమము కన్నా ఆశ్రమమే ఎక్కువ ఆకర్షిస్తోంది లా ఉంది. నిజమే, బంధవిముక్తి ఎప్పుడూ ఆనందదాయకమే కదా! కానీ ఏది బంధం? ఏది విముక్తి అనేది తెలుసుకోలేక అయోమయంలోప్రాణులకు జన్మలు దాటిపోతాయి.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మంచి పూరణ. అభినందనలు. నేనూ అలాంటి ఆశ్రమంలో చేరితే బాగుంటుందని ఆలోచిస్తున్నా. "దేహభ్రాంతి" అన్నప్పుడు సమాసగతమైన "హ" గురు వవుతుంది. "దేహవాంఛ" అందాం. రెండవ పూరణనూ చూసాను. ఇది ఇంకా బాగుంది.
మంద పీతాంబర్ గారూ, ఎంతటి ఆర్ద్రమైన భావంతో పూరణ చెప్పారు! అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
వసంత్ కిశోర్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. రెండవ పూరణ గురజాడ వారి "కండ గలవాడేను మనిషోయ్!"ని గుర్తుకు తెచ్చింది. అన్నట్టు... మనలో మాట! మీ శాంతి అలక తీరిందా?
మిస్సన్న గారూ, "శ్రమశక్తి" గొప్పదనాన్ని చక్కగా తెలిపారు. మంచి పూరణ. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ, మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
డి. నిరంజన్ కుమార్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. "జీవితం" అని ముప్రత్యయానికి అనుస్వారం పెట్టడం వ్యావహారికం. "బ్రతుకున" అందాం.
బాసు తిట్టెనేని, భార్యయలుగనేని, సంతు తప్పె నేమి, వంతలేల? బారు నందు దొరకు బ్రాంది షోడాల మి శ్రమము నందు మనకు శాంతి దొరకు! [ఎదో వేరే "శ్రమము"ను బట్టుకురావాలనే శ్రమే కానీ ఉచిత సలహా కాదు. కవిమిత్రులు కత్తులు దూయకుందురు గాక!]
నేదునూరి అక్కయ్య గారి పూరణ మనసు అంచులను తాకింది. ధన్యవాదాలని చెప్పి ఆపేయలేను. ప్రముఖ బెంగాలీ నవలా రచయిత చెప్పినట్లు, ఏదైనా ఒక నవల గానీ, కథగానీ చదివితే ఆనందంతోగానీ విషాదంతో గానీ కళ్ళు చెమర్చాలి. అప్పుడే ఆనవలకి గానీ, కథకి గానీ సార్థకత చేకూరదు. ఇక ఆపైన భావన కవిమిత్రుల ఊహాకి వదిలేస్తున్నాను.
వసంత కిశోర్ గారూ, మన ఊహాశ్రమంలో మూర్తి గారు డాక్టరు, శ్రీ గోలి గారు మనోరంజన విభాగం, మిస్సన్న గారు వేదాంత ప్రవచనాలు, శంకరయ్య గారు సంచాలకులు, అక్కయ్య గారు మహిళావిభాగ అధి"పతి" (సరైన మాట దొరకలేదు), డా.విష్ణునందన్, ఆచార్య ఫణీంద్ర, చింతా రామకృష్ణ గార్లు విశేష అతిధి దేవుళ్ళు, శ్రీ జిగురు గారు యువ విభాగ సంచాలకులు. మరి నేనో...మీరే నిర్ణయించాలి (నవ్వుతూ).
చంద్రశేఖర్ గారూ, నిజమే! ఎందుకో నా దృష్టిలో పడలేదు మీ పూరణ. ఇచ్చిన ఆటవెలది పాదాన్ని తేటగీతిలో అమర్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. ఇకనేం? ఛందస్సుతో ఆటలాడుకొనే స్థాయికి చేరుకున్నారు. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ, ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు. సరె! మీకు సులభంగానే అనుమతి దొరికింది. నాకంత సీన్ లేదు. ఇంట్లో చెప్పకుండా "పారిపోవడమే".
ఊకదంపుడు గారూ, "బ్రాంది షోడాల మిశ్రమము" .... మంచి భావన. చమత్కారజనకమై మీ పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
చంద్రశేఖర్ గారూ, మన ఆశ్రమానికి కోశాధికారి మీరే. అవసరమైన ఆర్థిక వనరులను సేకరించే బాధ్యత మీది. సరేనా?
అందుకే అన్నారు, "నోరు మూసుకొని కూర్చోరా" అని (జోకుతూ!). మాస్టారు కోశాధికారి పదవి ఇచ్చి ఇరికించారు. మిత్రులు మిస్సన్న గారు డబల్ డూటి వేసి కుమ్మారు. పుష్కలంగా పద్య ధార కురిపించే వసంత మహోదయులే కోశాధికారి పదవికి సరి. నేను సేవా విభాగంలో (volunteering dept.) సాధారణ సేవకుడిని మాత్రమే! మనది హనుమంతుడి బాచ్.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిదేహ భ్రాంతి వదలి, దేవుని ధ్యానంబు
సతత మచట సలిపి, సాధకులకు
ఉచిత రీతిని, తగు ఉద్బోధ జేయునా
శ్రమము నందు మనకు శాంతి దొరకు.
తనయు డుండు చోటు తమకు తగని దాయె !
రిప్లయితొలగించండికోడ లమ్మ కేమొ కొలువు లాయె!
రమ్మనంగ చావు రాదాయె!పెద్దలా
శ్రమమునందు మనకు శాంతి దొరుకు!
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిశాస్త్రిగారూ !
బావుంది !
నేనూ అక్కడికే వస్తున్నాను !
పూల తోడ విచ్చి - పొదలన్ని నిండుగా
పరిమ ళములు జిమ్మ - పరవ శంబు
గలుగ , నూరి చివర - గలిగిన; యట్టి యా
శ్రమము నందు మనకు - శాంతి దొరకు !
అలుపు సొలుపులెరు౦గము ఆడుచు మరి
రిప్లయితొలగించండిపాడుచున్ పని జేయ౦గ, పడిన శ్రమము
నందు మనకు శాంతి దొరకు, ముందు ఫలము
చింత విడచి మనసునిల్పు శివుని యందు!
02)
రిప్లయితొలగించండి______________________________________
అష్ట విధము లైన - ఐశ్వర్యముల కన్న
కండ పుష్టి దెచ్చు - అండ మేలు !
కండ ,గుండె ,రెండు - కలుగు; నిత్యము
శ్రమము నందు ! మనకు - శాంతి దొరకు !
_______________________________________
శ్రమము = (దేహదార్ఢ్యమునకై చేసెడు) సాము
_______________________________________
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిఆడ పిల్ల శాంతి నారు యేండ్ల క్రితము
వదలి వెళ్ళినాము వలదు అనుచు
మనసు మారె నిపుడు,మాత సులక్షణా
శ్రమము నందు; మనకు "శాంతి" దొరకు.
నరుల సేవ జేసి నారాయణుని జేర
రిప్లయితొలగించండిశ్రమము దాన మొసగ రండి యనెడి
సత్య సాయి సూక్తి సత్యమ్ము ధరలోన
శ్రమమునందు మనకు శాంతి దొరకు.
లాటరీలు మాని పాటుపడు బ్రదరు !
రిప్లయితొలగించండిఅప్పులేని చోట మెప్పు గలదు
ఇంటి పట్టు వదలి ఇనుప చక్రము కమ్ము
శ్రమము నందు మనకు శాంతి దొరకు !
వయసుమీద పడిన వార్ధక్యములోన
రిప్లయితొలగించండిసుతులు ధార మరియు చుట్టములును
శాంతి నీయలేరు "శంకరా"భరణయా
శ్రమము లోన మనకు శాంతి దొరకు
పనులు పాట్లు లేని పసలేని జీవితం
రిప్లయితొలగించండిరోత బుట్టు మరియు రోగమిచ్చు
పనియె దైవమనుచు పాటుపడిన ఆ
శ్రమము నందు మనకు శాంతి దొరకు
అందరి పూరణలూ బాగున్నాయి.
రిప్లయితొలగించండిశ్రమము కన్నా ఆశ్రమమే ఎక్కువ ఆకర్షిస్తోంది లా ఉంది.
నిజమే, బంధవిముక్తి ఎప్పుడూ ఆనందదాయకమే కదా!
కానీ ఏది బంధం? ఏది విముక్తి అనేది తెలుసుకోలేక అయోమయంలోప్రాణులకు జన్మలు దాటిపోతాయి.
దార బదులు ధార అని పడినట్టుంది.
కొడుకు లున్న గాని కోడలికి బానిసలు
రిప్లయితొలగించండిమనుమ లున్న నేమి మమత లేదు.
ప్రేమ పంచు వరము పిడికెడైన లేదు యా
శ్రమము నందు మనకు శాంతి దొరకు !
అందరి పూరణలు ఎంతో బాగున్నాయి .ముఖ్యం గా పీతాం బర్ గారి పూరణ వాస్తవానికి దగ్గర గా ఇంకా బాగుంది
pedhalandariki namaskaramulu,andaripuranalu bagunnai,ee shankarabharanamlo mi mi snehamto miku
రిప్లయితొలగించండిshaanti kalagalani korukuntunnanu.
pedhalaku namaskaramulu,andari puranalu bagunnai.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమంచి పూరణ. అభినందనలు. నేనూ అలాంటి ఆశ్రమంలో చేరితే బాగుంటుందని ఆలోచిస్తున్నా.
"దేహభ్రాంతి" అన్నప్పుడు సమాసగతమైన "హ" గురు వవుతుంది. "దేహవాంఛ" అందాం.
రెండవ పూరణనూ చూసాను. ఇది ఇంకా బాగుంది.
మంద పీతాంబర్ గారూ,
ఎంతటి ఆర్ద్రమైన భావంతో పూరణ చెప్పారు! అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
వసంత్ కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. రెండవ పూరణ గురజాడ వారి "కండ గలవాడేను మనిషోయ్!"ని గుర్తుకు తెచ్చింది.
అన్నట్టు... మనలో మాట! మీ శాంతి అలక తీరిందా?
మిస్సన్న గారూ,
"శ్రమశక్తి" గొప్పదనాన్ని చక్కగా తెలిపారు. మంచి పూరణ. అభినందనలు.
నాగరాజు రవీందర్ గారూ,
మంచి పద్యం చెప్పారు. అభినందనలు.
డి. నిరంజన్ కుమార్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
"జీవితం" అని ముప్రత్యయానికి అనుస్వారం పెట్టడం వ్యావహారికం. "బ్రతుకున" అందాం.
మందాకిని గారూ,
ధన్యవాదాలు.
రాజేశ్వరి నేదునూరి గారూ,
మంచి భావంతో పూరించారు. అభినందనలు.
1,3 పాదాలలో గణదోషం దొర్లింది.
"కోడలి దాస్యము", "పిడికె డైనను గన మా" అందాం. "లేదు + ఆశ్రమ"మన్నప్పుడు యడాగమం రాదు.
అజ్ఞాత గారూ,
ధన్యవాదాలు.
పల్లె విడిచి చేర పట్టణ ప్రాంతమున్
రిప్లయితొలగించండిబైకు,కారు,జనుల,మైకు హోరు
బాధ లోప గలమె ? పల్లె నుండ యుటజా
శ్రమము నందు మనకు శాంతి దొరుకు !
మా యింట్లో సమాధానము : సరే మీరు వెళ్ళండి !
రిప్లయితొలగించండిబాసు తిట్టెనేని, భార్యయలుగనేని,
రిప్లయితొలగించండిసంతు తప్పె నేమి, వంతలేల?
బారు నందు దొరకు బ్రాంది షోడాల మి
శ్రమము నందు మనకు శాంతి దొరకు!
[ఎదో వేరే "శ్రమము"ను బట్టుకురావాలనే శ్రమే కానీ ఉచిత సలహా కాదు. కవిమిత్రులు కత్తులు దూయకుందురు గాక!]
అందరి పూరణలూ అలరించు చున్నవి !
రిప్లయితొలగించండిపీతాంబరధరుల పూరణ వాస్తవ ప్రతిబింబం !
శంకరార్యా! ఇంకా లేదు !
అందరి ఆలోచనలూ ఒకే దారిలో నున్నవి !
అందరం "శంకరాభరణాశ్రమం " లో సేద దీరుతున్న వాళ్ళమే !
మూర్తీజీ !
మనందరం కలసి ఒక
ఆశ్రమం పెట్టుకుంటే బాగుంటుందేమో?
డా.మూర్తి గారు సరైన పాళ్ళలో కలపగల దిట్ట అని "యెవరో ఎక్కడో, ఎప్పుడో" చెబుతుండగా విన్నట్లు గుర్తు. "మిశ్రమము" బాగుంది, మిత్రవర్యా!
రిప్లయితొలగించండినేదునూరి అక్కయ్య గారి పూరణ మనసు అంచులను తాకింది. ధన్యవాదాలని చెప్పి ఆపేయలేను. ప్రముఖ బెంగాలీ నవలా రచయిత చెప్పినట్లు, ఏదైనా ఒక నవల గానీ, కథగానీ చదివితే ఆనందంతోగానీ విషాదంతో గానీ కళ్ళు చెమర్చాలి. అప్పుడే ఆనవలకి గానీ, కథకి గానీ సార్థకత చేకూరదు. ఇక ఆపైన భావన కవిమిత్రుల ఊహాకి వదిలేస్తున్నాను.
రిప్లయితొలగించండిశంకరయ్య మాస్టారూ, నేను ఆ.వె. పాదాన్ని తే.గీ.లో అమర్చాను. నా పద్యం పరిశీలించి నట్లు లేదు.
రిప్లయితొలగించండివసంత కిశోర్ గారూ, మన ఊహాశ్రమంలో మూర్తి గారు డాక్టరు, శ్రీ గోలి గారు మనోరంజన విభాగం, మిస్సన్న గారు వేదాంత ప్రవచనాలు, శంకరయ్య గారు సంచాలకులు, అక్కయ్య గారు మహిళావిభాగ అధి"పతి" (సరైన మాట దొరకలేదు), డా.విష్ణునందన్, ఆచార్య ఫణీంద్ర, చింతా రామకృష్ణ గార్లు విశేష అతిధి దేవుళ్ళు, శ్రీ జిగురు గారు యువ విభాగ సంచాలకులు. మరి నేనో...మీరే నిర్ణయించాలి (నవ్వుతూ).
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండినిజమే! ఎందుకో నా దృష్టిలో పడలేదు మీ పూరణ.
ఇచ్చిన ఆటవెలది పాదాన్ని తేటగీతిలో అమర్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. ఇకనేం? ఛందస్సుతో ఆటలాడుకొనే స్థాయికి చేరుకున్నారు. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
సరె! మీకు సులభంగానే అనుమతి దొరికింది. నాకంత సీన్ లేదు. ఇంట్లో చెప్పకుండా "పారిపోవడమే".
ఊకదంపుడు గారూ,
"బ్రాంది షోడాల మిశ్రమము" .... మంచి భావన. చమత్కారజనకమై మీ పూరణ ఉత్తమంగా ఉంది. ధన్యవాదాలు.
చంద్రశేఖర్ గారూ,
మన ఆశ్రమానికి కోశాధికారి మీరే. అవసరమైన ఆర్థిక వనరులను సేకరించే బాధ్యత మీది. సరేనా?
చంద్రశేఖర్ గారూ ఊకదంపుఁడు గారు మీకు బాగా ఎక్కించినట్లున్నారు. ఆ మిశ్రమము కలిపి దంచింది ఊకదంపుడు గారు !
రిప్లయితొలగించండివసంత కిశొరా,మిత్రవర్యా, గురువుగారూ మీ ఆలోచన ప్రశస్తనీయముగా ఉంది. ఏ పూర్వ పుణ్యఫలమో,లేక మా పూర్వుల పుణ్య ఫలమో మీ అందఱి సాంగత్యము లభించింది. ధన్యుడిని.
రిప్లయితొలగించండిచంద్ర శేఖర్ గారూ మీరు గురువుగారు చెప్పినట్లు కోశాధి కారిత్వం నేరుపుతూ విశేష పౌరాణికుల పాత్ర కూడా పోషిస్తే అద్భుతంగా ఉంటుంది.
రిప్లయితొలగించండిఅందుకే అన్నారు, "నోరు మూసుకొని కూర్చోరా" అని (జోకుతూ!). మాస్టారు కోశాధికారి పదవి ఇచ్చి ఇరికించారు. మిత్రులు మిస్సన్న గారు డబల్ డూటి వేసి కుమ్మారు. పుష్కలంగా పద్య ధార కురిపించే వసంత మహోదయులే కోశాధికారి పదవికి సరి. నేను సేవా విభాగంలో (volunteering dept.) సాధారణ సేవకుడిని మాత్రమే! మనది హనుమంతుడి బాచ్.
రిప్లయితొలగించండిచంద్రశేఖరా !
రిప్లయితొలగించండినేను సాంస్కృతిక వ్యవహారాలు
మాత్రమే చూడ గలను !
మూర్తిగారిని కోశాధికారి చేస్తే బావుంటుంది !
ఆ : శ్రమము లేక నేడు శరీరము జేదిపోవు
రిప్లయితొలగించండిపాడు వాస నొచ్చు పరగడుపున
మంచి మార్గ మేది ? మనుజుండు తలచిన
శ్రమమునందు మనకు శాంతి దొరకు.!