30, మార్చి 2011, బుధవారం

సమస్యా పూరణం - 271 (చదువు కొండెక్కినది)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చదువు కొండెక్కినది కళాశాలలందు.

14 కామెంట్‌లు:

 1. రాష్త్ర విభజన గోరియరాచకంబు
  ముఖ్య మంత్రంచు కొందరు మూర్ఖ పట్టు
  దేశమేగతి బోవునో దేవుడెరుగు
  చదువు కొండెక్కినది కళాశాలలందు

  రిప్లయితొలగించండి
 2. శంకరయ్య గారూ...వారంతపు సమస్య కు పనికి వస్తుందేమొ చూడండి:
  గడ్డము చేసికొమ్మనుచు కాంతుడు కాంతకు చెప్పె నవ్వుచున్.

  రిప్లయితొలగించండి
 3. శక్తి లేదు ఆసక్తితో చదువు 'కొనగ '
  వంద వందలా?లక్షల పరిధి దాటె!
  చేతికందునె?పేదలు చేరు కొనగ (చేరి కొనగ)
  చదువు, 'కొండె 'క్కినది కళాశాలలందు.

  రిప్లయితొలగించండి
 4. రక్కసుల ధనదాహ సురకరువలికి
  చదువు కొండెక్కి నది, కళా శాలలందు
  నిలువ నీడలేదు పలుకు కలికికినిక
  కలిపు రుషుఁని చాయలు క్రమ్ము కొనగ!

  సురకరువలి=సుడిగాలి (గాలికి దీపం కొండెక్కింది అనే పోలిక);
  పలుకు కలికి=చదువులతల్లి శారదాంబ

  రిప్లయితొలగించండి
 5. కట్ అండ్ పేస్ట్ వల్ల జరిగిన తప్పిదం సరిచేస్తూ, మరల పోస్టు చేస్తున్నాను.
  రక్కసుల ధనదాహ సురకరువలికి
  చదువు కొండెక్కి నది, కళా శాలలందు
  నిలువ నీడలేదు పలుకు కలికికినిక
  కలిపురుషుఁని ఛాయలవెల్ల క్రమ్ము కొనగ!

  రిప్లయితొలగించండి
 6. మరీ నిరాశ అవసరము లేదు కాని విద్యాలయాలు విద్యకు ఎక్కువ ప్రాముఖ్యత యిస్తే బాగుంటొంది.

  చదువుకొనుటను మానిరి చదువుఁ గొనిరి
  కుల కుతత్వము మీఱెను గురు కులముల
  రాజకీయము లేలగ బూజు పట్టి
  చదువు కొండెక్కినది కళాశాల లందు.

  రిప్లయితొలగించండి
 7. మంత్రి వర్యుల హామీలు మట్టి గరువ,
  తోటి మిత్రుల ప్రాణాలు నీట గలువ,
  బ్రతుకు పోరులో కలలన్ని బండలవగ,
  చదువు కొండక్కినది కళా శాలలందు!

  రిప్లయితొలగించండి
 8. కవిమిత్రులకు మనవి.
  నేనింకా మా అత్తవారి గ్రామంలోనే ఉన్నాను. అందువల్ల మీ పూరణలకు వెంటవెంట స్పందించలేక పోతున్నాను. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి.
  వెంకటప్పయ్య గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  "ముఖ్య మంత్రంచు కొందరు మూర్ఖ పట్టు" అనే పాదాన్ని "ప్రబలజేసిరి కొందరు స్వార్థపరులు" అంటే బాగుంటుందేమో?
  మీరు సూచించిన వారాంతపు సమస్య బాగుంది. ఈ ఆదివారం అదే ఇస్తాను. ధన్యవాదాలు.

  హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  నరసింహ మూర్తి గారూ,
  ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.

  పీతాంబర్ గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ
  అలరించు చున్నవి !
  01)
  _______________________________________

  రాష్ట్ర సాధన యంచు - రగిలెడి కాష్టమ్ము
  నిత్యాగ్నిహోత్రమై - నెగయు చుండ !

  విద్యార్థులకు నేడు - అధ్యాపకు లయిన
  రాజకీయులు నేడు - రగులు పరుప !

  బస్సుల దహనాలు - బందులె , విందులై
  మూర్ఖ చేతన లెన్నొ - మోజు గొలుప !

  క్రమ శిక్షణను మాట - గాంచలే మీనాడు
  దేవతా వస్త్రమై - దనరు చుండ !


  మురళి గానము రీతిగా - ముద్దు గొలుపు
  కప్పు పోటీలు వీక్షింప - గొప్ప నేడు !
  దిక్కు దరియును లేనిన్ని - తిరుల నడుమ
  చదువు కొండెక్కినది కళా - శాల లందు !
  _______________________________________

  కప్పు = ప్రపంచ క్రికెట్ కప్పు

  రిప్లయితొలగించండి
 10. రాజకీయము ,మతములు రహినిజొచ్చె
  విద్యలయమయ్యె ,పరికింప వేడ్కలేదు
  చదువుగొనుటకు చింతించు ,చదువబోరు
  చదువుకొండెక్కినదికళాశాలయందు

  రిప్లయితొలగించండి
 11. ప్రేమ వ్యవహారములు నెల్ల పెచ్చుమీరె !
  శ్రద్ధ లేదయ్యె యువతకు చదువులందు!
  పబ్బులును, పార్కులంటును పరుగుదీయ !
  చదువు కొండెక్కినది కళాశాలలందు!!

  రిప్లయితొలగించండి
 12. దూరవాణి యందున విద్య దోచుకొనగ
  విత్తు పెట్టికొనగ నేడు వింత చదువు
  శాస్త్రపరిశోధనకు యువత సాగలేక
  చదువుకొండెక్కినది కళాశాలలందు

  రిప్లయితొలగించండి