పీతాంబర్ గారూ!పూరణ చాలా చక్కగా ఉన్నది.అభినందనలు.నాటకంలో పాత్రలు వేసే భార్యాభర్తల ఆధారంగా సమస్య పూరించుదామనుకున్నాను.మీదే ముందడుగు ఐనది.మరొక మార్గం వెతకాలి.
ఈవేళన్! మరి ప్రేక్షకాదరణకై! ఇవ్వాలి కొంగ్రొత్తగా! ఏవో! ఓ తగు చిన్న మార్పు లిటుపై! ఈ కర్ణ చిత్రంబులో ఓ వాటంబగు పాట! యంచు కలిపెన్ ఊహించి, ఆ పాటలో బావా!రమ్మని పిల్చె మోహ మెసగన్ బాంచాలి రాధాత్మజున్!!
గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ బాగుంది. గురువు గారు, నాకో చిన్న సందేహం. శాస్త్రి గారి పూరణలో, "కలిపెన్ + ఊహించి" అన్నప్పుడు, దృతము తరువాత అచ్చు వచ్చినప్పుడు విసంధిగా వ్రాయ వచ్చా?
శంకరార్యా!ధన్యవాదములు.చిత్రం విడుదల వరకు కల కన్నదెవరో సస్పెన్స్.చంద్రశేఖర్ గారూ!సత్యనారాయణ గారూ!ధన్య వాదములు. కలిపితే కలి "పెన్నూహించి"వ్రాసినదవుతుంది. ఊహ సరియైనదా,కాదా,మాస్టరు గారు చెప్పాలి.
మందాకిని గారూ, ధన్యవాదములు. గురువు గారూ, ధన్యవాదములు. ఆలస్యమేమీ లేదండీ, ఐనా పరీక్ష రాసిన తరువాత వెంటనే ఫలితం తెలిస్తే ఎలా? కాస్త తహ తహ పెట్టాలిగా మమ్మల్ని. :)
టీవీలో సురభీ కుటుంబమగు మా ఠీవీని జూపింపగా,
రిప్లయితొలగించండిరావేలా యిటు రమ్ము రమ్ము ననియెన్ రారాజు మామామయున్ ,
నీవేలే నటనున్న ద్రౌపదివి,పో, నీవాడు కర్ణుoడనన్
బావా రమ్మని పిల్చె మోహ మెసగన్ బాంచాలి రాధాత్మజున్ !!!
పీతాంబర్ గారూ!పూరణ చాలా చక్కగా ఉన్నది.అభినందనలు.నాటకంలో పాత్రలు వేసే భార్యాభర్తల ఆధారంగా సమస్య పూరించుదామనుకున్నాను.మీదే ముందడుగు ఐనది.మరొక మార్గం వెతకాలి.
రిప్లయితొలగించండిగోలి హనుమచ్ఛాస్త్రి.
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిఈవేళన్! మరి ప్రేక్షకాదరణకై! ఇవ్వాలి కొంగ్రొత్తగా!
ఏవో! ఓ తగు చిన్న మార్పు లిటుపై! ఈ కర్ణ చిత్రంబులో
ఓ వాటంబగు పాట! యంచు కలిపెన్ ఊహించి, ఆ పాటలో
బావా!రమ్మని పిల్చె మోహ మెసగన్ బాంచాలి రాధాత్మజున్!!
మంద పీతాంబర్ గారూ,
రిప్లయితొలగించండిపూరణ కొంచెం గజిబిజిగా ఉన్నా మీ వృత్తలేఖనం ప్రశంసార్హం. అభినందనలు.
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ద్రపదీ కర్ణులకు "డ్రీం సాంగ్" పెట్టి లాగించేశారు. బాగుంది మీ పూరణ అభినందనలు.
ఇంతకీ కలగన్న దెవరో?
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిబ్రహ్మాండంగా వుంది. చక్కటి నడక,నాలుగైదు సార్లు పాడుకొన్నాను. మీరు కలియుగం ప్రథమ పాదంలోనే క్రొత్త భారతం సృష్టించారుగా(నవ్వుతూ).
గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ బాగుంది.
రిప్లయితొలగించండిగురువు గారు,
నాకో చిన్న సందేహం. శాస్త్రి గారి పూరణలో, "కలిపెన్ + ఊహించి" అన్నప్పుడు, దృతము తరువాత అచ్చు వచ్చినప్పుడు విసంధిగా వ్రాయ వచ్చా?
శంకరార్యా!ధన్యవాదములు.చిత్రం విడుదల వరకు కల కన్నదెవరో సస్పెన్స్.చంద్రశేఖర్ గారూ!సత్యనారాయణ గారూ!ధన్య వాదములు.
రిప్లయితొలగించండికలిపితే కలి "పెన్నూహించి"వ్రాసినదవుతుంది.
ఊహ సరియైనదా,కాదా,మాస్టరు గారు చెప్పాలి.
గోలి హనుమచ్ఛాస్త్రి.
అరణ్యవాసం లో ఒకరేయి:
రిప్లయితొలగించండిదావాగ్నుల్ మదిఁ క్రీడికిన్ బగకునై; దావాగ్నులర్ధాంగికిన్
ఏవేవో మరుభావనల్ కలుగఁగన్నేకాంతమిన్నాళ్లకున్ (1)
"బావా రమ్మని" పిల్చె మోహ మెసఁగన్ బాంచాలి; రాధాత్మజున్
భావమ్మందున జంపి చేర కదలెన్ భ్రాయంపుటాలిన్ వెసన్ (2)
(1)కలుగఁగన్ + ఏకాంత
(2)(లేక) భార్యానురక్తుండుతాన్
చక్కటి పూరణ vookadampudu గారూ!
రిప్లయితొలగించండిఅభినందనలు.
"నే వహ్నిన్ రగిలింప పుట్టితిని కదా నీకై సుశీలంబుగన్!
రిప్లయితొలగించండిలేవా నీవిట? నన్ను చేకొనగ రాలేవా? పృథా పుత్రకా!
బావా! రమ్మని" పిల్చె మోహ మెసఁగన్ బాంచాలి! "రాధాత్మజున్
నే వీక్షించగనొల్ల! నీకు సమమే నీచుండు సూతుండికన్?"
ఊకదంపుడు గారూ,
రిప్లయితొలగించండిఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
జిగురు సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
"పుట్టితిని కదా" అన్నప్పుడు గణదోషం ఉంది. "పుట్టితిఁ గదా" అంటే సరి.
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
గురువు గారూ,
ధన్యవాదములు. ఆలస్యమేమీ లేదండీ, ఐనా పరీక్ష రాసిన తరువాత వెంటనే ఫలితం తెలిస్తే ఎలా? కాస్త తహ తహ పెట్టాలిగా మమ్మల్ని. :)
ఈ సమస్య కి మీ పూరణ ప్రకటించరూ
భవదీయుడు
ఊకదంపుడు
కలియుగ పాంచాలి మోక్షము:
రిప్లయితొలగించండిలావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెబ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్ఛవచ్ఛెఁదనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప నితఃపరంబెఱెఁగ మన్నింపందగున్ గావవా?
బావా రమ్మని పిల్చె మోహ మెసఁగన్ బాంచాలి రాధాత్మజున్