హనుమచ్ఛాస్త్రి గారూ, అద్భుతమైన పూరణ. అభినందనలు. అదేమిటో ..... ? నిన్ననే మా ఆవిడ నాతో చెప్పిన మాట "మొన్న మీరు తెచ్చిన చీర ఒక్క ఉతుకుకే వెలిసిపోయింది." (మీకు చీరల ఎంపిక చేతకాదు అని వ్యంగ్యార్థం!)
మాస్టారూ, నా బాధ యే౦ చెప్పమంటారు. "మీరు చీరలు అంత నాణ్యం అయినవి తేవాలా? దుప్పట్ల లాగా చిరగవు, వెలవవు. ఎన్నేళ్ళు కట్టుకుంటాం" అని మూతి విరుపులు". కాళిదాసు అన్నట్లు "తవ బాధతి బాధతే"...ప్రస్తుతానికి బాధ పంచుకొందాము (నవ్వుతూ).
చందశేఖర్ చెప్పారు... శంకరయ్య మాస్టారూ, తేట గీతి అనుకొంటే సమస్య పాదంలో యతి ప్రాసలు కలవలేదని పిస్తోంది. "వన్నె" - "వింత" యెట్లా? లేక నేను సరిగ్గా అర్థం చేసుకోలేదా?
నా ఊహ: వన్నెలే బదులు "వెన్నెలే" వుంటే సరిపోతుందనుకొంటా.
మాస్టారూ, ధన్యవాదాలు. మనకు తెలియని రహస్యం సార్, మిస్సన్న గారో "దేనికో" గ్రామంతర వాసం వెళ్లారుట. అది ఎందుకనేది ఆయన పద్యం చెబుతోంది (నవ్వుతూ). ఏమయినా చెప్పండి మిస్సన్నగారి దృష్టి వరూధిని మీదనుంచి తొలగట౦ లేదు. ఆ గ్రామం, విలాసం (అడ్రసు అనే అర్థంలోనే బాబూ)మాకు వద్దు స్వామీ, మేము ఆహితాగ్నులము. మా గురు మిత్రులు మూర్తి గారి "మిశ్రమమే" బాగుంది:-)
చంద్ర శేఖరా! మీరన్నది నిజం. సావాస దోషం నన్ను పాడు చేస్తోంది. వరూధినిని నేను మరచి పోదామన్నా నా మిత్రులు వదలడం లేదు. అన్యాప దేశంగా వారి మనో భావాలు బయట పడుతున్నాయి. అక్కడకీ ఒక సారి చెప్పాను. అందని ద్రాక్షలకు ఆశ పడవద్దు అని. వినిపించుకోరు బాబూ.
బాగుంది, మిస్సన్న గారూ. అందని ద్రాక్ష పుల్లనో తీయనో తెలియటం లేదు. తెలుగు సామెత ఒక రకంగా వుంది, ఆంగ్ల సామెత ఇంకో రకంగా వుంది. ఏదోవకటి లెండి, ప్రస్తుతానికి ద్రాక్ష తీగకే వదిలేద్దాం.
వసంత్ కిశోర్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు. "పారి జాతమ్ము రుక్మిణీ - వారి జేరె" దీనిని ""పారి జాతమ్ము రుక్మిణిఁ జేరె ననుచు" అంటే ఎలా ఉంటుంది?
పీతాంబర్ గారూ, మొదటిది అద్భుతమైన పూరణ. అభినందనలు. రెండవ పూరణకూడ బాగుంది. కాకుంటే "రామున్ని", "శూర్పణ" పదప్రయోగాలే పానకంలో పుడక లయ్యాయి. వన్నె చిన్నెల కన్నె శూర్పణఖ రాము వలిచి మోహించి వచ్చెను వగల నొలికి, అంటే ఎలా ఉంటుంది?
సత్యనారాయణ గారూ, ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
రాజేశ్వరి గారూ, మంచి భావంతో పూరించారు. అభినందనలు. అయితే మూడు పాదాల్లోను గణదోషం ఉంది. మొదటి పాదంలో యతి తప్పింది. నా సవరణలు (బ్రాకెట్‌లో) `వయసు మీ(రగనె) తనువు (పరిహసించె) ముకుర మందున ముఖ(మది) ముడత(లు పడె) కరిగి పోయిన సొగ(సేమొ) గేలి చేయ వన్నెలే తెల్ల బోయిన భంగి గనుడు !
గోలి హనుమచ్ఛాస్త్రి.
రిప్లయితొలగించండిపంచ వన్నెల చీరెను పట్టుకొచ్చి
భార్య కిచ్చితి, పండుగ బహుమతిగను!
కాల మేమందు? ఒకసారి కట్టి ఉతుక
వన్నెలే తెల్లబోయిన, వింత గనుడు!
హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
అదేమిటో ..... ? నిన్ననే మా ఆవిడ నాతో చెప్పిన మాట "మొన్న మీరు తెచ్చిన చీర ఒక్క ఉతుకుకే వెలిసిపోయింది." (మీకు చీరల ఎంపిక చేతకాదు అని వ్యంగ్యార్థం!)
శంకరయ్య మాస్టారూ, తేట గీతి అనుకొంటే సమస్య పాదంలో యతి ప్రాసలు కలవలేదని పిస్తోంది. "వన్నె" - "వింత" యెట్లా? లేక నేను సరిగ్గా అర్థం చేసుకోలేదా?
రిప్లయితొలగించండిమాస్టారూ, నా బాధ యే౦ చెప్పమంటారు. "మీరు చీరలు అంత నాణ్యం అయినవి తేవాలా? దుప్పట్ల లాగా చిరగవు, వెలవవు. ఎన్నేళ్ళు కట్టుకుంటాం" అని మూతి విరుపులు". కాళిదాసు అన్నట్లు "తవ బాధతి బాధతే"...ప్రస్తుతానికి బాధ పంచుకొందాము (నవ్వుతూ).
రిప్లయితొలగించండిచందశేఖర్ చెప్పారు...
రిప్లయితొలగించండిశంకరయ్య మాస్టారూ, తేట గీతి అనుకొంటే సమస్య పాదంలో యతి ప్రాసలు కలవలేదని పిస్తోంది. "వన్నె" - "వింత" యెట్లా? లేక నేను సరిగ్గా అర్థం చేసుకోలేదా?
నా ఊహ: వన్నెలే బదులు "వెన్నెలే" వుంటే సరిపోతుందనుకొంటా.
చంద్రశేఖర్ గారు,
రిప్లయితొలగించండిభావన (concept) రంగులు తెల్లబోవటమే కాబట్టి
దయచేసి ఇంకో ప్రత్యామ్నాయం ఏదైనా సూచించగలరు (యతి కుదరదంటే)
చంద మామయె దిగివచ్చె అందముగను
రిప్లయితొలగించండిమొగిలు వెనుకను దోబూచు మూయబడుచు
ఆట లాడగ ననురాగ మతిశయించి
వెన్నెలే తెల్లబోయిన వింతఁ గనుడు
శంకరార్యా! ధన్యవాదములు.
రిప్లయితొలగించండిచంద్ర శేఖర్ గారూ! చీరె కొనే హడావిడి లో యతిని గమనించలేదు.
మందాకిని గారూ!
"వన్నెలే తెల్లబోయిన వపుడు గనుడు " అంటే సరిపోతుందనుకుంటాను.
గోలి హనుమచ్ఛాస్త్రి.
పూర్ణ చంద్రుఁడు కల్గించె పుల్కలీ వేళ
రిప్లయితొలగించండిచుట్టు వెన్నెల్లు కురిసేను జూడు మోయి!
వనము లోనున్న విరులకు వన్నె లేవి?
వన్నెలే తెల్లఁబోయిన వపుడు /వింతఁ గనుడు!
శాస్త్రి గారు, మీ సవరణ చక్కగా ఉంది. ఇక గురువర్యులు నిర్ణయించాలి.
పూర్ణ చంద్రుఁడు కల్గించె పుల్క లేవొ!
రిప్లయితొలగించండిచుట్టు వెన్నెల్లు కురిసేను జూడు మోయి!
వనము లోనున్న విరులకు వన్నె లేవి?
వన్నెలే తెల్లఁబోయిన వపుడు /వింతఁ గనుడు!
చిన్ని సవరణతో...
వీచిక: ఈరోజు ఫాల్గుణ పూర్ణిమ (హోళికా పున్నమి). నా స్వప్న సుందరి కి ప్రేమాంకితము:
రిప్లయితొలగించండినిండు పున్నమి జాబిలి నిగిడి మెరయ
నరవిరసిన మొగలిపూలు హాయి గొల్ప
నాదు కలలరాణి వలపు నాట్య మందు
వెన్నెలే తెల్లఁబోయిన వింతఁ గనుఁడు!
అందరూ నన్ను మన్నించాలి. ఉదయమే నిద్ర లేచి ఆ మత్తు వదలని స్థితిలో యతిని గమనిందకుండా పోస్ట్ చేసాను.
రిప్లయితొలగించండి"వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుఁడు." అని మార్చాను.
గురువర్యులకు కలిగించిన అసౌకర్యానికి క్షంతవ్యురాలిని.
రిప్లయితొలగించండిపూర్ణ చంద్రుఁడు కల్గించె పుల్క లేవొ!
చుట్టు వెన్నెల్లు కురిసేను జూడు మోయి!
వనము లోనున్న విరులకు వన్నె లేవి?
వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుడు!
వనిత తానై వలచినను వలద నియెను
రిప్లయితొలగించండిప్రవర నాముండు బన్నమై వన్నె లాడి
వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుఁడు
సతుల మాయ మార్చంగ సుమతుల నగునె?
చన్ద్ర శేఖరా మీ కోరిక తీరిందా?
నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిబాగుంది మీ పూరణ. అభినందనలు.
"మొగిలు వెనుకను దోబూచు మూయబడుచు" అనేకంటె
"మొగిలు వెనుకను దాగుడుమూత లాడు" అంటే ఎలా ఉంటుంది?
మందాకిని గారూ,
రిప్లయితొలగించండిపద్యం బాగుంది. అభినందనలు.
తప్పులు కాదు కాని కొద్దిగా సవరిస్తే బాగుంటుందని నా ఆలోచన....
పూర్ణ చంద్రుఁడు కల్గించె పు(లకరింత)
చుట్టు వెన్నె(ల) కురి(సె)ను జూడు మోయి!
వనము లోనున్న విరు(లు వివర్ణ మయ్యె)
వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుడు!
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
మిస్సన్న గారూ,
చంద్రశేఖర్ గారి విషయమేమో గాని మంచి పూరణను ఆశించిన నా కోరిక తీర్చారు. ధన్యవాదాలు.
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారి భావానికి నా పద్యరూపం .......
రిప్లయితొలగించండిసప్తవర్ణముల్ గలిగిన చక్ర మొకటి
దెచ్చి గిఱ్ఱునఁ ద్రిప్పఁగా నచ్చెరువుగఁ
గనుల ముందఱ నొక రంగె కనఁబడుఁ గద
వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుఁడు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ
అలరించు చున్నవి !
01)
_______________________________________
"పారి జాతమ్ము రుక్మిణీ - వారి జేరె"
చెప్పి నంతనె చెలికత్తె ! - చిన్న బోయె
సత్య భామకు వదనపు - చక్క దనము !
వన్నెలే తెల్ల బోయిన - భంగి గనుడు !
________________________________________
02)
రిప్లయితొలగించండి________________________________________
వింత కాంతులు మోమున - వెలయు చుండ
వెంట బడ సింహ బలు డంత - వేదన బడి
సుదతి ,సౌశీల్య ,మాలిని - సోకు లందు
వన్నెలే తెల్ల బోయిన - భంగి గనుడు !
________________________________________
నిన్న ,గగనాన వెలసిన వెన్నలయ్య
రిప్లయితొలగించండివెలుగు దోసిళ్ళతో నింపె విశ్వమంత!
వర్ణ శోభిత మైనభూ పర్ణ శాల
వన్నెలే తెల్ల బోయిన భంగి గనిరి !
రాజకీయమయ్యెను నేడు రంగులన్ని
రిప్లయితొలగించండిరంగు రంగుల జండాలు సంగమించి
నీచ కార్యములు సలుప చూచి నట్టి
వన్నెలే తెల్లఁబోయిన భంగిఁ గనుఁడు!!
సంతోషం గురువుగారు! ఇపుడింకా చక్కగా ఉంది.
రిప్లయితొలగించండివన్నె చిన్నెల కన్నె ,రామున్ని జూసి,
రిప్లయితొలగించండివలిచి మోహించె శూర్ఫణ వగల నొలికి,
సీత పతియైన శ్రీరాము నీతి ముందు
వన్నెలే తెల్ల బోయిన భంగిఁ గనుఁడు!!
మాస్టారూ, ధన్యవాదాలు. మనకు తెలియని రహస్యం సార్, మిస్సన్న గారో "దేనికో" గ్రామంతర వాసం వెళ్లారుట. అది ఎందుకనేది ఆయన పద్యం చెబుతోంది (నవ్వుతూ). ఏమయినా చెప్పండి మిస్సన్నగారి దృష్టి వరూధిని మీదనుంచి తొలగట౦ లేదు. ఆ గ్రామం, విలాసం (అడ్రసు అనే అర్థంలోనే బాబూ)మాకు వద్దు స్వామీ, మేము ఆహితాగ్నులము. మా గురు మిత్రులు మూర్తి గారి "మిశ్రమమే" బాగుంది:-)
రిప్లయితొలగించండిగురువుగారూ ధన్యుణ్ణి.
రిప్లయితొలగించండిచంద్ర శేఖరా! మీరన్నది నిజం. సావాస దోషం నన్ను పాడు చేస్తోంది.
వరూధినిని నేను మరచి పోదామన్నా నా మిత్రులు వదలడం లేదు.
అన్యాప దేశంగా వారి మనో భావాలు బయట పడుతున్నాయి.
అక్కడకీ ఒక సారి చెప్పాను. అందని ద్రాక్షలకు ఆశ పడవద్దు అని.
వినిపించుకోరు బాబూ.
బాగుంది, మిస్సన్న గారూ. అందని ద్రాక్ష పుల్లనో తీయనో తెలియటం లేదు. తెలుగు సామెత ఒక రకంగా వుంది, ఆంగ్ల సామెత ఇంకో రకంగా వుంది. ఏదోవకటి లెండి, ప్రస్తుతానికి ద్రాక్ష తీగకే వదిలేద్దాం.
రిప్లయితొలగించండి`వయసు మీరిన తనువు వెక్కి రించె
రిప్లయితొలగించండిముకుర మందున ముఖము ముడత పడగ
కరిగి పోయిన సొగసు గేలి చేయ
వన్నెలే తెల్ల బోయిన భంగి గనుడు !
గురువు గారూ,
రిప్లయితొలగించండినా భావానికి పద్య రూపమిచ్చినందుకు కృతజ్ఞతలు
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
వసంత్ కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
"పారి జాతమ్ము రుక్మిణీ - వారి జేరె" దీనిని ""పారి జాతమ్ము రుక్మిణిఁ జేరె ననుచు" అంటే ఎలా ఉంటుంది?
పీతాంబర్ గారూ,
మొదటిది అద్భుతమైన పూరణ. అభినందనలు.
రెండవ పూరణకూడ బాగుంది. కాకుంటే "రామున్ని", "శూర్పణ" పదప్రయోగాలే పానకంలో పుడక లయ్యాయి.
వన్నె చిన్నెల కన్నె శూర్పణఖ రాము
వలిచి మోహించి వచ్చెను వగల నొలికి,
అంటే ఎలా ఉంటుంది?
సత్యనారాయణ గారూ,
ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
రాజేశ్వరి గారూ,
మంచి భావంతో పూరించారు. అభినందనలు.
అయితే మూడు పాదాల్లోను గణదోషం ఉంది. మొదటి పాదంలో యతి తప్పింది. నా సవరణలు (బ్రాకెట్‌లో)
`వయసు మీ(రగనె) తనువు (పరిహసించె)
ముకుర మందున ముఖ(మది) ముడత(లు పడె)
కరిగి పోయిన సొగ(సేమొ) గేలి చేయ
వన్నెలే తెల్ల బోయిన భంగి గనుడు !